నారద ఉవాచ - నారదుడిట్లు పలికేసు :
ఓ నారాయణమునీ! బలిపుత్రుడు ఏ పాపము వలన గర్దభత్వము (గాడిద రూపును) పొందెను? ఆ దానవేశ్వరుని దుర్వాసో మహర్షి ఏదోషమును బట్టి శపించెను? ఆ బలీపుత్రుడు ఏ పుణ్యము చేత హఠాత్తుగా శ్రీకృష్ణుని పాదములందైక్యమగు ముక్తీని పొందెను? సందేహమును నశింపజేయు మునివరా! వివరించి చెప్పుము, కవి ముఖమందీకావ్యము అడుగడుగున - మాటమాటకు - క్రొత్త క్రొత్తగా నున్నది. ఆశ్చర్యము
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
వత్సా! గంధమాదన పర్వతము మీద ధర్మఋషి (నరసారాయణుల జనకుడు) ముఖమున విన్నట్టి పురాతనమైన ఇతిహాసమును నీకు చెప్పుచున్నాను. వినుము. పాద్మకల్చములోని విచిత్రమైన మనోహరమైన వృత్తాంతమిది. నారాయణుని కథతో కూడి చెవులకమృతము వలె ఉత్తమమైన కథ ఇది.
ఈ చెప్పబోవు కథ ఏ కల్పమున జరిగినదో అప్పుడు నీవు ఉపబర్హణుడన్నవాడవుగా నుండివి. కల్పాంతము వరకు ఆయుష్యము కలవాడవు మంచి సంపన్నుడవు సుందరుడవు బ్రహ్మ వరము వలన స్థిర యావనుడవు మంచి కంఠస్వరము గల గాన రాజువుగా నుంటివి. ఏబది మంది కామీనులకు భర్తవై శృంగారమందు మిక్కిలీ ఆసక్తితో నురటీవి. నీ సుందరమైన ముఖపద్మమును వారందరు కనురెప్పపాటు లేకుండ ప్రతిక్షణమును చూచుచు కాముని బాణముల చేత మిక్కిలి పీడింపబడుచు నీ అందమును త్రాగుచుండిరి. నీవు బ్రహ్మచేత వారి ప్రాణములతో కూర్చబడితివనియు రాత్రింబగళ్లు నీవు లేకుండ నీ సహచరులైన ఆ స్త్రీలు బ్రతుక జాలకుండిరనియు వినియుంటిని.
పుష్పోద్యానములోను కన్నులకింపుగా నున్న ప్రతి రహస్య ప్రదేశమందును పర్వతముల గుహలలోను లోయలలోను నదీ తీరముల లోను సుందరమైన అరణ్యములలోను ప్రాణులు సంచరించని శ్మశాన భూములలోను నీతో కలిసి వారు మనస్సులో పుట్టిన కోరికలు తీరునట్లుగా క్రీడించిరి. అప్పుడు దైవికముగా బ్రహ్మశాపము ప్రాప్తించి నీవు దాసీ పుత్రుడవుగా జన్మించితివి. ఆ జన్మలో విష్ణుభక్తులు తిని విడిచిన భోజనము భుజించిన మహిమ వలన ఇప్పుడు బ్రహ్మమానస పుత్రుడవైతివి. లెక్క పెట్టరాన్ని కల్పములు జీవించు గొప్ప విష్ణు భక్తశ్రేషుడవైతివి. జ్ఞానదృష్టితో అన్నిటినీ దర్శించగలవాడవు ధూర్జటి (శంకరుడు)కి ప్రియశిష్యుడవైతివి. ఓ మునీ ! ఆ కల్పములోని వృత్తాంతమును నా వలన వినుము. అమృతమును పోలిన ఆ దానవుని వృత్తాంతమును విస్తరించి చెప్పుదును.
బలిచక్రవర్తి (రాక్షసుడు) పుత్రుడు సాహసికుడన్న నామధేయము గలవాడు మహా బలవంతుడు తన శక్తితో దేవతలను జయించి ఓకసారి గంధమాదన పర్వతమునకేగెను. అక్కడ శ్రీగంధము పులుముకున్న శరీరమున రత్నాభరణములలంకరించుకొని అనేక సైన్యములతో కూడి రత్నసింహాసనముపై కూర్చుండి ఉండెను.
ఇంతలో అదే మార్గమున అప్సరసలలో శ్రేష్టురాలైన తిలోత్తమ పోవుచుండెను. ఆమె బహువిధములైన అలంకార వేషములను ధరించగలది. సుందరమైన సంపంగి పువ్వు రంగు వంటి శరీరకాంతితో - రత్నాభరణముల అలంకరణముతో - చిరునవ్వుతో వెలుగుచున్న ముఖ మండలముతో - వంకరగా నున్న బోమముడితో - నవ వన సంపదతో - దివ్యమైన వస్త్రమును చక్కగా ధరించి మన్మధ బాణముల చేత పీడితురాలై గజరాజు వంటి సుందర మందగమనముతో పోవుచుండెను.
యువకుడైన సాహసికుడు గాలి వీచుట వలన వస్త్రము తొలగిపోయిన ఆ తిలోత్తమ యొక్క స్తనములను తొడలను చంద్రుని వంటి ముఖమును చూచి మోహముతో మూర్ఛిల్లెను.
శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖమండలముతో మిక్కిలి మనోహరముగా నున్న చిరునవ్వుతో, వికసించిన మాలతీ పుష్పమాల నలంకరించుకొని తన మనస్సును దోచుకోనుచున్న ఆ నవయాపనుని చూచి తిలోత్తమ ఆశ్చర్యపడి చంద్రలోకమునకు పోవుచున్న ఆ మదయువతి శృంగార క్రియ యందు తీవ్రసక్తి గలదై ఒక నెపముతో ఆగిపోయేను. ఆ సాహసికుని ముఖమును పంకర చూపులతో చూచి చూచి పక్కున నవ్వి కొంగుతో ముఖమును మాటి మాటికి కప్పుకొనుచుండెను. కామముతో మత్తురాలైన ఆమె సర్వాంగములు పులకలెత్తాను. శృంగార ధర్మమును తెలుపు కర్మలు శరీరమున కన్పించెను. మర్మాంగము చెమర్చెను. బలి పుత్రుని యందు కోరిక పెట్టుకొన్న తిలోత్తమ చంద్రుని మరచిపోయెను. తెలిసికొనుటకు శక్యము గాని జారిణి మనస్సును ఈ భువనములో ఎవడెరుగ జాలును!
ఎవడు జారిణియైన స్త్రీని విశ్వసించునో వాడు. విధివంచితుడు. వాడు కీర్తికి దూరమగును. ధర్మమునకు దూరమగును. తనవారి చేత బహిష్కరింపబడును. తన పనిని సాధించుకొను సామర్ధ్యము గల జారిణి తాను కోరుకున్న కొత్త ప్రియుడు లభించగనే పాత వానిని నాశము చేయును. ఆమెకు ప్రియుడెవ్వడో ఆప్రియుడెవ్వడో ? జారిణి చిత్తము దారుణమైనది (క్రూరము) దైవకర్మయందు గాని పితృ కర్మయందు గాని పుత్రుని మీద గాని బంధువు మీద గాని భర్తయందు గాని నిలిచియుండదు. ఎల్లప్పుడు శృంగార క్రీడయందే నిలిచియుండును. జారిణి వివిధమైన రతీమర్మము లెరిగిన వానిని ప్రాణముల కంటే అధికముగా అమృతపు దృష్టితో చూచును, అటుగాక . రత్నములు బహుమతిగా నిచ్చువానినైనను, రత్నశాస్త్ర పండితుడైనను విషపుచూపుతో చూచును. అన్ని ప్రాణులకు నిలిచియుండు స్థాన మొకటి ఉండును, జారిణులకు మాత్రమెక్కడ కూడ లేదు. నరహంతకుల కంటే పుంశ్చలీ జాతి క్రూరమైనది. అన్ని విధముల పాపములకును కర్మఫలానుభవము తరువాత దాని నుండి బయట బడు ప్రాయశ్చిత్తము నిర్ణయించ బడినది. కాని ఓ మునీంద్రా! చంద్ర సూర్యులున్నంత వరకు కూడ జారిణులకు నిష్కృతి (ఆ పోపము నుండి తరించు ఉపాయము లేదు. సాధారణముగా స్త్రీలకు పురుగును చంపుట కెంత - పాటి జాలి భూతదయ ఉండునో అటువంటిది జారిణీ స్త్రీలకు లేనే లేదు. జారిణి పాతవానిని నిర్దయగా చంపివేయును.
రతి మర్మమెరిగిన క్రొత్త ప్రియుని చూచి వానిని పొంది జారిణి ఉపాయముతో సులభముగా విషము వలె పాతవాసిని భావించి చంపి తీరును. భూమి మీది ఎన్నెన్ని పాపములున్నవో అవి అన్నియు ఈ భారత భూమీలో జారిణుల యందే నిలిచియున్నవి. వారి కన్న వేరుగా కొందరు పాపిస్తున్న వారు లేరు.
జారీణి వండిన వంట అన్ని పాతకములను కళించునని శాస్త్ర నిర్ణయము. కావున ఆమె వంటను గానీ ఆమె ముట్టిన జలమును గాని దైవకర్మలో పితృకర్మలో (దేవళా నివేదనకు శ్రాద్ధభోజనమునకు) ఈయగూడదు (ఉపయోగింపదగదు).
జారిటీ వండిన అన్నాదులు మలము, జలము మూత్రము, అటువంటి పదార్ధములను దేవతలకు పితృదేవతలకు ఉపయోగించినను భుజించినను ఇతరులకు పెట్టినవాడు తాను తిన్నవాడును నరకము పొందును. అటువంటివాడు క్రూరమైన కొలసూత్రమును నరకములో సూరేండ్లు అగ్నిచే ఉడికించబడును. వానిని భయంకరమైన అంధకారములో క్రిములు కొరుకుచుండును. దైవికముగానైనను పుంశ్చలి అన్నమును భుజించిన పకి నరులలో అధముడు. గడచిన ఏడు జన్మలలో వాడు చేసిన పుణ్యమంతయు నశించుట నిశ్చయము. భార్య జారిణి ఐన యెడల ఆ వ్యక్తి యొక్క ఆయుష్యము కీర్తి ఇహపరలోకములు నశించును కనుక వంటవండెడి మళ్లీ పాత్రలను ఎంత జాగ్రత్త పడి శుచిగా నుంచుకొనవలెనో అటే చిన్నవయస్సులో సున్న భార్యను కూడ ప్రయత్నించి రక్షించుకోవలెను.
ఒక ప్రదేశమునకు బయలుదేరి పోవుచున్నప్పుడు జారిణి త్రోవలో కనిపించని ఆ ప్రయాణ కార్యము సిద్ధించునన్న మాట వాస్తవమే. ఆమెను స్పృశించినచో మహాపాపము. వాడు పుణ్యనదీజల స్నానము చేత పంచద్దుడగును. జారిణి స్త్రీలు చేసిడి పుణ్య తీర్థ స్నానములు గానీ, ఇచ్చడి దోనములు గానీ, ఆచరించిన ప్రతములు గాని మంత్రజపము గాని దేవతాపూజలు గానీ అన్నియు నీష్ఫలమే. పుణ్య కార్యములు చేసి జన్మను ధన్యము చేసికోవలసిన ఈ భారత భూమిలో వారి జీవనము వ్యర్థము. నారదా! తెలిసికొనరాని కులటల చరిత్రను గూర్చి శాస్త్రముననుసరించి చెప్పితిని. ఇక ఆ తిలోత్తమా సాహసికుల సంవాదమును ఏసుము.
ఆ బలిపుత్రుడు మరల మూర్ఛనుండి తేరుకొని ఆమెను చూచి కామముచేత త్వరపడుచు యావన మదముతో ఆ స్వైరిణి (స్వేచ్చగా తిరుగు జారిణి) వద్ద కేగెను. కుటిలమైన క్రీగంటి చూపులు, బలిసిన పిరుదులు స్త్రసములు గల - సిగ్గుపడుచు వస్త్రముతో ముఖమును కప్పుకొనుచున్న ఆమెతో సంతోషముగా ఇట్లనెసు.
సాహసిక ఉవాచ - సాహసికుంటనెను :
ఓ కామీనీ! నీవెవ్వతెవు? ఎవని బిడ్డవు . ఎవని భార్యవు? సుందరమైన కనుబొమలు గలదానా! నీ మనస్సు. హరించిన ఏ పుణ్యాత్ముని గూర్చి ఎక్కడకు స్వయముగా నీవు బోవుచున్నావు. ఓ సుందరీ! నిన్ననుభవించుటకు ఒక కల్పాంతము వరకు తపస్సు చేసి పవిత్రుడైన ఏ వ్యక్తిని గూర్చి పోవుచున్నావో పొమ్ము. అటువంటి నీవు నన్ను నీ భృత్యునిగా చేసికోదగును. . ఓ కాముకురాలా! రతి యందాసక్తి గల నన్ను నీ రతియన్న వెలసిచ్చి దాసునిగా కొనవలసినది. నీవును శృంగారాసక్తి గలదానవే కనుక శృంగార సుఖము నిమ్ము. ఓ ప్రియురాలా! నీతో నా ఆలింగనము విధినిర్మితము. అది ఆ దైవము చేతనే ఇట్లు నిరూపించబడినది. ఇక ఎవడు వారించును?! ఓ సుందరీ! చిరునవ్వుతో అమృతము వంటి మాట ఒకటి పలుకుము. శీఘ్రముగా నిర్జన ప్రదేశములో తీగవంటి నీ బాహపాశములతో ( కౌగిలింత అను త్రాళ్లు నన్ను బంధించుము.
ఓ కల్యాణీ! కనకము వలె ప్రకాశించు నీ తొడను నాకు ఆసనముగా నిమ్ము. పూర్ణకుంభముల వలే యోగ్యముగా నున్న నీ సన మండలమును నాకు చూపించుము. వాడియైన అస్త్రముల వంటి నీ కటాక్షములతో నన్ను గాయపరిచి, రంధ్రములు చేయుము భామినీ! కాముడను పాము కరచిన నన్ను నీ పొదస్పర్శతో ఆరోగ్యవంతుని చేయుము. ఆకలిగొన్న నాకు రుచిగల నీ అధరామృతము నందిమ్ము, పండిన దానిమ్మ విత్తుల వలె అందమైన నీ పలువరుసను చూపించుము. ఓ సుందరీ! నీ గంభీర నాభిని ఆ పై పొట్టమీది మూడు మడతలను చూడగోరుచున్నాను. కోకముడి విప్పవలెనన్న కోరిక నాకెల్లప్పుడున్నది. మునుల మనస్సులను గూడ మోహింపజేయు నీ నెన్నడుమును - శరత్కాలమున పట్టపగలు వెల సెడి పద్మముల కాంతిని దొంగిలించెడి కన్నులు గల - శరదృతువులోని పూర్ణిమ నాటి చంద్రుని వలె నున్న ముఖమును నాకు చూపించుము”.
ఆ తిలోత్తమ అతని మాటవిని మన్మధ బాణము చేత బాధపడుచున్న సాహసికుని చూచి ఎదుటి వారి గర్వమును నశింపజేయు సుందరియైనను మన్మధ జ్వరముతో ఇట్లు పలికెను.
తిలోత్తమోవాచ - తిలోత్తమ పలికెను :
ఓ నాథా! నీవంటి పతికామినులకు కోరదగినవాడు. నీవు బలిపుత్రుడవు. ధర్మమందు నిలిచినవాడవు. రూపము, గుణములు గల యువకుడవు, శృంగార కర్మలందు నేర్సు గలవాడవు కామశాస్త్ర విశారదుడు. ప్రియమైనవాడవు. స్త్రీలకెల్లవేళల ఇంపైన వాడవు. సహజముగానే మంచి అలంకారము కూర్చుకున్నవాడవు.
మంచి వేషము సౌందర్యము శాంతగుణము గలవాడవును మనస్సుకు ఇం పైన వాడవును ఇంద్రియ నిగ్రహమును ఆరోగ్యము గలవాడవును శృంగారము ఎదుటివారిలోని గుణమును ఎరిగిన వాడవును శుచిత్వము రసికత యావనము గలవాడవును స్త్రీల మనస్సున కిం ఫైన వాడవును దయావంతుడవును మంచి బలము గలవాడవును సంపన్నుడవును కోరినదిచ్చుదాతవును ప్రేమికుడవును కొంతుడవునగు నిన్ను కొమిని కోరుకొనును. ప్రియుడా! ఈ గుణములన్నియు నీలో చలించకుండ ఉన్నవి. నిన్ను వాంఛించని స్త్రీలు జ్ఞానశూన్యలు విధించితలు సుమా.
చంద్రుని కొరకు అలంకరించుకొని ఈ దినమతనిని కోరుకొని పోవుచున్నాను. చంద్రగృహము నుండి తిరిగి వచ్చి నిన్ను సంతోష పెట్టుదును. ఒకరికొరకు పోవుచు మరియొకరిని కౌగిలించుకొన్నచో ధర్మము నుల్లంఘించుట అగును. తమ ధర్మములను కాపాడనీ . స్త్రీల జీవితము వ్యర్థము. చంద్రుని కౌగిలి వల్ల కలుగు సుఖమెరుగని స్త్రీలు వట్టి మూఢలు. పురుషుల రాసిక్యమెరుగని వారు తల్లి కడుపులో శిశువులే. దేవతల వైద్యులైన అశ్వినీ దేవతలిద్దరు మన్మథుడు చంద్రుడు దేవేంద్రుడు నలకూబరుడు అను వీరి ఆలింగనము - లభించని స్త్రీలెవరో వారు రతికర్మల చేత మోసగింపబడిన వారు సుమా. నా మనస్సు రాత్రింబగళ్లు వారియొక్క క్రీడను తలచుచుండును. వీరిలో మన్మథుడు విశేషముగా రతి కర్మలో నేర్పుగలవాడు. ఇక చంద్రుని విషయమా ! అతని శృంగార క్రియ కౌగిలింత ముచ్చటలు చెప్పుట అమృతము కంటే అధికమైనవి. ఈ రోజు ఆ చంద్రుని రతిదినము. అందువలన నామనస్సతనినే తలంచును.
తిలోత్తమ మాటలు విని బలిపుత్రుడు పెద్దగా నవ్వి శరీరము పులకలెత్తగా కోరిక గలవాడై ఏకాంత ప్రదేశములో ఆమెతో ఇట్లు పలికెను.
సాహసిక ఉవాచ - సాహసికుడనెను :
ఓ తిలోత్తమా! సుందోపసుందుల నాశము కొరకు ప్రయత్నించి అత్యాసక్తిలో బ్రహ్మ నిన్ను అన్ని విధముల రూపగుణముల కాధారముగా సృష్టించెను. అందువలన నీపప్పరసలలో శ్రేష్టురాలవు. నేర్పుగల రసికేశ్వరివి. సర్వజ్ఞురాలవు కనుక అన్ని ఎరుగుదువు, శృంగార క్రియలో పండితురాలు. నా ప్రశ్నలకు నీ మనసులోని మాట చెప్పుము. హర్షముగా వినగోరుచున్నాను. ఓ సుందరీ! నీకు మిక్కిలి ప్రియుడిపడు ! వాడెటువంటి స్వభావము గలవాడు ? రహస్యమైనను అవశ్యముగా వీచేగోరుచుంటిని. గంధర్వులకు దేవతలకు పుణ్యవంతులైన రాజులకు అందరికి ప్రాణము వంటి దానవు. వీరందరిలో నిప్వడు మిక్కిలి ప్రియుడు? అని అడిగిన అసురుని మాట విని ఆ తిలోత్తమ నవ్వి ముఖమును కప్పుకొనెను. క్రీగంటితో చూచెను. తరువాత ఇంతవరకివరికి వ్యక్తము కాకుండి ఉన్న మిక్కిలి దాచుకొనబడిన - సత్యమైన - సారము వంటి తన మనసులోని మాటను విద్వాంసులకును తెలియని దానిని ఇట్లు చెప్పెను.
తిలోత్తమోవాచ - తీలోత్తము పలికెను :
ఓ సాహసికా! జారిణీ, స్త్రీల మనస్సులోని మాట కదా నీకిప్పుడు చెప్పవలసినది. అది స్త్రీజాతి కంతటికిని మిక్కిలి వెక్కిరింపు నవ్వులకు మూలము సుపూ, స్త్రీల నడవడియో ఎవ్వరికిని తెలిసికొనుట కష్టము. విశేషించి స్వైరిణి స్త్రీల మనస్సులోని మాట తెలిసికొనుట శక్యము కాదు. పండితుడు వేదములను వేదాంగములను శాస్త్రముల చివరలను కూడ ఎరుగును. కాని ప్రియుడా! దిక్కుల అంతమును ఆకాశపు చివరను స్త్రీలమనస్సును ఎరుగజాలడు, స్త్రీలకు వృద్ధుడు విషము కంటే అప్రియుడు. తన సర్వస్వము దోచుకొనెడి యువకుడైనచో రత్నముల కంటే ప్రాణముల కంటే మిక్కిలి ప్రియమైనవాడు.
జారిణి స్త్రీ యువకుడు, సుందరుడు ఐన పురుషుని చూచి కామ బాధ పొందును. విశేషించి వాడే మంచీ ఆలంకారముతో కన్పించినా ఆమె తెలివియే పోగొట్టుకోనును. అతని ముఖమును కనురెప్పలు వాల్చకుండి చూచుచు ఆ సౌందర్యమును కన్నులతో త్రాగును. మర్మస్థానము ద్రవించి కోరిక తీవ్రమగును. మనస్సు మిక్కిలి చలించును. నిలకడ ఉండదు. సర్వాంగములు కంపించుచుండును. అవయవములు చైతన్యము లేనివగును. శరీరమంతయు మదనాగ్ని మండుచుండును. ఆ పురుమడేకాంతముగా లభించినచో మెల్లగా సృష్టముగా ముచ్చటాడును, మాటి మాటికి ప్రక్క చూపులను ప్రసరింపజేయును, చిరునవ్వులు ముఖమున చిందించును. అటు ప్రయత్నించి నను ఆ జితేంద్రియుని వశపరచుకొనలేనిచో అప్పుడు తన మోహనాంగమును చూపి తన మనోవాంఛను స్పష్టముగా తెలియజెప్పును.
ఆమె కోరుకున్న పురుషుడు దుస్సాధ్యుడినప్పుడు స్వాధీనముకానప్పుడు) జన్మజన్మలకు దుఃఖము పొందును. అచ్చముగా అటువంటి వాడింకొకడు లభించినప్పుడామె వానిని మరచిపోవును, జారిణులకు ఈ భూమి మీద ప్రియుడెవ్వడు? ఆప్రియుడెవ్వడు? ఎవడు మిక్కిలి శృంగార నిపుణుడ్ వాడే ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైన వాడు. ముందటి కన్న విశేష లక్షణములు గల క్రొత్త పురుషుడు లభించగనే మునుపటి జారపురుషుని - భర్తను - పుత్రుని - అన్నదమ్ములను - తల్లిదండ్రులను - అందరినీ అసాయాసముగా త్యజించును. విలువైన వస్తువును దానమిచ్చినను - గొప్పగా గౌరవించినను - సత్యము చెప్పినను - స్తుతించినను - ఉపకారములు - చేసినను - ప్రేమ ప్రకటించినను జారస్త్రీ సాధ్యము కాదు. ఆమె ఒక మైధునమసకే వశమగును. కులటలు పండుకొన్నపుడు - భుజించుచున్నప్పుడు - కలగన్నప్పుడు - మెలకువతో సున్నప్పుడు రాత్రింబగళ్లు ఎల్లప్పుడు ' నచ్చిన పురుషుని ఆలింగనమునే స్మరించుచుందురు. శృంగారములో నేర్పు గల పురుమలకు కూడ అట్టి స్త్రీ తదేక ధ్యానము వలననే సాధ్యురాలగును. పుంశ్చలి స్త్రీలు చాల క్రూరులు. ఎప్పుడు క్రొత్త క్రొత్త పురుషులనే ప్రార్థింతురు. మొత్తము కులటా స్త్రీల నడవడిని నీకు చెప్పితిని. చెప్పగూడనిది. దాచుకోదగినది ఐన నా మనస్సులోని మాట వినుము.
మహారాజా! నాకు మిక్కిలి ప్రియమైన వారు గంధర్వులలో దేవతలలో యువకులు రతిమారులు కామశాస్త్రములో ఆరితేరిన వారు కొందరున్నారు. విశేషించి చంద్రుని యందు నాకు మిక్కిలి అనురాగము. అతని కంటే మిగిలిన అందరు దేవతల కంటే నాకు మన్మథుడు ప్రియుడు. కాముని పంటివాడింకొక ప్రయుడు నాకింతకు ముందు లేడు, ఇక ముందుండిబోడు, ఆ మన్మథుని తలచుకొన్న వెంటనే నా మనస్సు మిక్కిలి ప్రేమ పూర్ణమగును. ఈ తీరుగా నా మనస్సును స్త్రీల మనస్సును మొత్తము నీకు చెప్పితిని. ఇక నాకాజ్ఞ యిమ్మ. చంద్రుని సన్నిధికి పోదును. చంద్రుని వద్దనుండి తిరిగి నీవద్దకు వత్తుననీ నేను నిశ్చయుంచుకొంటిని. దైత్యరాజా! తిరిగి వచ్చి నీకు సంతోషము కలిగించును. సందేహము లేదు.
ఆ మాటలు విని బలీపుత్రుడు పెద్దగా పడి పడి నవ్వెను. తిలోత్తమ క్రీగంటితో అతనిని చూచి పక్కున నవ్వెను. మదన జ్వరము గలదై అందమైన సంపంగి పూల వన్నె వంటి కాంతిగల గుండ్రముగా నున్న - పుష్టిగా ఎత్తుగా నున్న కఠిన స్తనములను ఒక వంకతో చూ పెను. అరటి బోదెను తిరస్కరించునటువంటి కఠిన సుందర శ్రేణిని (పిరుదులపై భాగమును) {వస్త్రము జారిన మీషలో) దర్శింపజేసెను. చిరునవ్వు గల ముఖమును పులకలెత్తిన చెంపలను కడగంటి చూపులను చూచునట్లు చరించెను. కామముతో వివేకము కోల్పోయి ఏకాంత ప్రదేశమున కతనిని చేర్చి సర్వాంగములు పులకలెత్తగా కన్నులతో అతని ముఖ సౌందర్యమును త్రాగెను. అతని అలంకారమును రూపమును మరల మరల దర్శించి దర్శించి శృంగార భావముతో తన ముఖమును సన్నని వస్త్రముతో కప్పుకొనెను, వివేకవంతుడైన బలిపుత్రుడు మిక్కిలి కామాతురురాలైన తిలోత్తమను చూచి తాను కూడ కామియై ఆమె భావము తెలుసుకోవలెనన్న ఆసక్తితో ఇట్లు ప్రశ్నించెను.
సాహసిక ఉవాచ - సాహాసికుడనెను :
“ఓ పద్మనేత్రా! సత్యముగా నన్నేమి జేయుదువు? ఇంతకంటే వేరొక కార్యము చేయగలను. చాల సేపు నిలిచి యుండజాలను. ధర్మబుద్ధులకు విశేషించి మిక్కిలి విద్వాంసులమైన మాకు కామినులను బలాత్కరించుట ధర్మము కాదు. మా వంశమునకుచితమును కాదు. నాకు శృంగార సౌఖ్యము నిమ్ము లేదా నీవు సుఖించుటకు చంద్రుని వద్దకిన పొమ్ము. అనేకుల పొందు గోరు స్వైరిణిని తన వశము చేసికొనుటకెవడు సమర్థుడు”, తిలోత్తమ ఆ దానవుని మాటలను వినీ ఒక్కసారి కంఠము పెదవులు దవడలు ఎండిపోయి తనను అధమురాలిగా తలంచెను. మన్మధాస్త్రముల చేత ఛేదింపబడెను.
తిలోత్తమోవాచ - తిలోత్తమ పలికెను :
ఈ విధముగా ఎట్లు పల్కుదువు? నీవు సోకు కొంతుడవు. ప్రాణాధికముగా ప్రియుడవు, కోపించితివా ఏమి? అదెట్లు? నీకిష్టమైన కార్యమొనర్చుము. నిన్ను కాదని నేను చంద్రుని వద్దకేగినను నీ శాపము వలన నాకక్కడ వెంటనే విఘ్నమేర్పడును. నాతో విహరింపుము. శ్రీహరి స్వయముగా నీకు మంగళము కల్గించును. ఏ పురుషుడు స్త్రీ గౌరవమును కాపాడునో వానికి అడుగడుగున శుభములగును. ఏ మూఢుడు స్త్రీని అవమానించి వెళ్లిపోవునో ఆ నీచునికి పార్వతీదేవి అడుగడుగున అశుభము కలిగించును.
తిలోత్తమ మాటలు విని బలిపుత్రుడు నవ్వెను, కామశాస్త్రమునందారితేరిన ఆ విద్వాంసుడు ఆమె భావమును తెలిసికొనెను.
పరుల భావము గుర్తింపగలవాడు కామశాస్త్ర విశారదుడైన సాహసికుడు ఆమె భావము తెలిసికొని ఆమెను చేత బట్టుకొని కౌగిలించుకొని ఆమె ముఖపద్మమును ముద్దు పెట్టుకొనెను. ఆమెతో బాటు గంధన మాదన పర్వత గుహను చేరి అది ఏ ప్రాణి చరించని ఏకాంత ప్రదేశముగా గుర్తించి రత్న దీపములను చుట్టు ఏర్పాటు చేసి ఇంపైన ధూపపు పొగలు వ్యాపింపజేసెను, సుఖము కల్గించు శయ్యనేర్పరచి దానిపై ఆమెతో శయనించెను. కామమోహితుడై సోసో వీధములుగా శృంగార క్రీడ సలిపెను. అపుడు తిలోత్తమ అతనిని దేవతల కన్న మిక్కిలి నేర్పుగలవానిగా తెలుసుకొనెను. అప్పుడా రసికసాయిక విపరీత రతియొనర్చి తృప్తిపొందెను. క్రొత్త కూటమిలోని సుఖముతో మూర్ఛితురాలై రాత్రి పగలు తెలియకుండెను. తిలోత్తమ తన ప్రాణేశుడైన బలిపుత్రుని కామ భావముతో తన స్తనమండలముపై చేర్చుకొని ఆనందముతో ఇట్లు పలికెను.
తిలోత్తమోవాచ - తిలోత్తమ ఇట్లు పలికెను :
ఓ కాంతుడా! మనోహరమైన నీ ముఖ చంద్రుని మరల ఎప్పుడు దర్శింపగలను ? ఇటువంటి శుభదినము మరల ఎప్పుడు వచ్చును ? ఓ దానవరాజా ! ఏమి నీ రూపము! ఏమి నీ గుణము! నాకాశ్చర్యముగానున్నది. నిజముగా నీవు శృంగారకేళియందు నిపుణుడవు. నిన్ను మించిన వాడెవ్వడు లేడు. కాలము గడవగా నీవు నన్ను మరచీ పోదువు. అవును. పురుషుడు పుష్పములపై విహరించు తుమ్మెద వంటివాడు. స్త్రీలకైతే సత్పురుషుని ఆలింగన సుఖము ప్రాణములున్నంత వరకు మనసులో నిలిచి ఉండును. సత్పురుషుల సంగమము పుణ్యాత్ములకు పుణ్యము వలన ఒక శుభదినము నందు సంభవించును, సత్పురుషుల వియోగము దుఃఖమునకు మూలమై మరణము కంటే మించిపోవును. సత్సంగమము సుఖమయము. అది అమృతపానముకంటే స్వర్గ నివాసము కంటే దుర్లభము, దుస్సంగము (దుష్టులతో కలియుట) విషము కంటే దుఃఖకరము.
“ఓ మహారాజా! క్షణము సేపు నిలువుము. మరల నన్ను కౌగిలించుకొనుము. నీతోబాటు నా మనన్ను ప్రాణములు ప్రయాణమై పోవుచున్నవి”, ఇట్లు పలికి ఆకులట ఆదరముతో అతనిని తన వక్షమున ఉంచుకొని అతని శరీర సంగము వలన పులకరించి ఆ సుఖములో మూర్ఛపోయెను. ఆ కులటి యొక్క ఆలింగన, ఆలాపములకు అతడు మిక్కిలి కాముకుడైనాడు. మండుచున్న అగ్ని హోమపదార్థములతో అధికముగా మండినట్లు {పెరిగినట్లు) వాని కామము పెరిగెను.
నారదా! ఆ అసురుడు మరల ఎనిమిది రకముల శృంగారమును ఏ యే స్థానమందే విధము ఉచితమో అట్లు తొమ్మిది విధముల చుంబనమును (మధు) సఖములతో దంతములతో హస్తముల ఆచరించవలసిన క్రియలను ఆచరించుచు మరల ఆమెలో క్రీడించెను.
ఆ క్రీడలో ఆమె ధరించిన మొలనూలి మువ్వలి ధ్వని చేతికంకణముల ధ్వని తీవ్రముగా వ్యాపించెను. ఆ గుహలోనే పుట్టలో కప్పబడియున్న దూర్వాసమహర్షి మీద వారి దృష్టి పడలేదు, వారతనిని చూడలేదు. యోగాసనము చేసికొని పరమాత్మయైన శ్రీకృష్ణుని పాదపద్మములను ధ్యానించుచున్న ఆ మునికి ఆ ధ్వని వలన ధ్యాన భంగమాయెను. ఆ మహర్షి తమకు సమీపముననే ఉన్నప్పటికి వారు అతనిని గమనింప లేదు. కామము వలన వివేకము పోగొట్టుకున్న ఆ కామకులిద్దరికి జాసము లేదు కదా !
శ్రీకృష్ణ పాదపద్మ ధ్యానములో నున్న ఆ మహర్షి హఠాత్తుగా {ధ్యానభంగమైనందున) తెలివికి వచ్చి కన్నులు తెరచి వెలిగి పోవుచున్న బ్రహ్మ తేజస్పులో, ఎదురుగా ఉన్న ఆ యిద్దరిని చూచెను. రాత్రీ పగలని ఎరుగకుండ కామమోహితులై ఒక్కటిగా కలిసి ఉన్న వాళ్లను చూచి తేజోవంతుడున పడుణిశ్వర్య సంపన్నుడును రుద్రుని అంశతో జన్మించినవాడునగు ఆ మునిరాజు కోపము పొందెను. తన నిశ్చల సమాధిలో భగవంతుని పొద ధ్యానము వలన పొందిన ఆనందము విచ్ఛేదమగుట వలన మనసు ఉద్వేగము పొంది కన్నులు ఎం దామరల పలి కాగా ఇట్లనెను.
దుర్వాస ఉవాచ – దూర్వాస మహర్షి పలికెను:
ఓ నీచుడా! గాడిదపల సిగ్గులేనివాడా! లెమ్మ. భక్తులలో ముఖ్యుడైన బలి చక్రవర్తి పుత్రుడవై కూడ పశువుతో సమానమైతివి. దేవతలు గాని మానవులు గాని దైత్యులు గంధర్వులు రాక్షసులు గాని తన జాతికి చెందిన వ్యక్తులు ప్రక్కన ఉండగా ఇట్లు ప్రవర్తించుటకు ఎల్లప్పుడును సిగ్గుపడుదురు. ఒక్క పశజాతికి అత్త సిగ్గుండదు, అన్ని ప్రాణులలో విశ్లేషించి ఖరజాతి సిగ్గు, జ్ఞానము లేనీ జాతి, అందువలన ఇంతవరకు దానపరాజుగా ఉన్న నీవిప్పుడే గాడిద జన్మనెత్తుము. ఓసీ తిలోత్తమా! జారిటీ! సిగ్గులేనిదానా! నీవు లెమ్ము. ఈ రాక్షసుని యందు నీకింతటి వ్యామోహమున్నది. కనుక నీవు దానవ స్త్రీగా జన్మనెత్తుము.
కోపములో మండిపోవుచు ఆ మనీ అటు పలికి అక్కడ నిలిచియుండెను. వారిద్దరు పిల్లి భయపడి వెంటనే లేచి ఆ మునీని సుతించిరి.
సాహసిక ఉవాచ – సాహసికుడనెను:
ఓ దయానిధీ! నీవు బ్రహ్మవు, నీవు విష్ణువును, నీవు సాక్షాత్తుగా “మహేశ్వరుడవు. యజ్ఞములలో ఆహుతులు స్వీకరించు అగ్ని దేవుడవు నీవు. జగత్తునకు వెలుగు నిచ్చు సూర్యుడవు నీవు. సృష్టి స్థితి లయములు చేయగల సమర్థుడవు నీవు. ఓ భగవంతుడా! నా అపరాధము క్షమింపుము. దయచూడుము. ఎప్పుడు గానీ మూడుల అపరాధమును ఎపడు క్షమించునో అతడు సత్ర్పభువు" అని పలికి ఆ దైత్యుడు ఆ ముని ముందు గొంతెత్తి ఏడ్చాను. నోటిలో గడ్డి పెట్టుకొని మునీంద్రుని పాదముల మీద పడెను.
తిలోత్తమోపోచ - తిలోత్తమ ఇట్లు పలికెను :
ఓ నాథా! కరుణా సముద్రుడా! దీనబంధూ! నా మీద దయదలంచుము. ఈ బ్రహ్మ సృష్టిలోని అన్ని ప్రాణులలో స్త్రీజాతి మిక్కిలి మూడజాతి. అంతకంటే మదమత్తురాలను ఎల్లప్పుడు కామాసక్తి గలదాసను జారిణిని, కాముకులకు లజ్జగాని భయము గాని వివేకము గాని ఉండవు స్వామీ! అని పలికి పెద్దగా ఏడ్చి మునిని శరణుజొచ్చెను. ఈ భూమి మీది ఎవరికీ కూడ ఆపద రాక ముందు జ్ఞానము కలుగదు. ఆ యిద్దరి వ్యాకులమును చూచి ఆ మునికి దయ ఏర్పడెను.
దుర్వాసా ఉవాచ - దూర్వాస ముని పలికెను:
ఓ దానవా! తీవ్రమైన శాపము గాని అనుగ్రహము గాని దైవికముగా సంభవించును. సత్కీర్త గానీ అపకీర్తి గాని పూర్వజన్మ కర్మను బట్టి ఏర్పడునన్నది సత్యము. హరి భక్తుడైన బలికుమారుడవు: సద్వంశమందు జన్మించినవాడవు, తండ్రి వలన నీవును విష్ణు భక్తుడవైతివి. అది నేనెరుగును. శ్రీకృష్ణుని పాదచిహ్నములు కాలీయుని వంశమున పుట్టిన అందరు నాగుల తలలపై ఎట్టున్నవో ఇది అట్లే, తండ్రి స్వభావము కన్న కొడుకుల యందుండునన్నది నిశ్చయము. ముందు శ్రీకృష్ణుని అర్చించిన ఫలము ఎంతకాలము గడచినను సత్పురుషులకు అందకుండ నశించదు. నాయనా! నీవు గార్దభ జన్మనెత్తి ఆ జన్మతోనే ముక్తిని పొందుదువు గాక. ప్రజము (రేపల్లె)నకు సమీపమందున్న బృందావనములోని ఊళవనమునకు త్వరగా పొమ్ము, అక్కడ శ్రీహరి చక్ర ప్రయోగము వలన ప్రాణములు విడిచి మోక్షము పొందుదువు. ఇది నిశ్చయమైన విషయమే.
ఓ తిలోత్తమా! నీవు భారత ఖండములో బాణాసురుని పుత్రికగా జన్మింతువు. శ్రీకృష్ణుని మనుమని యొక్క ఆలింగనము చేత మరల పవిత్రురాలవగుదువు. ఓ నారద మునీ ! దూర్వాసముని ఇట్లు పలికి సంభాషణ ముగించెను. ఆ యిద్దరతనికి నమస్కరించి తమ స్థానములకు వెళ్లిరి. ఆ అప్సరస బాణుని పుత్రికయై ఉషయను పేర వ్యవహరింపబడును. శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడగు అనిరుద్ధుని భార్య అగును. ఈ విధముగా ఖర జన్మనెత్తిన రాక్షసుని వృత్తాంతమంతయును నీకు చెప్పితిని.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన తిలోత్తమా బలిపుత్రుల శాపవృత్తాంతమనెడి ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
While grazing the cows in the dense palmyra tree forest known as Tālavana, which was guarded by the fierce donkey demon Dhenukāsura and his demon associates, Balarāma shook the sweet palm fruits down to feed the boys. Enraged by the intrusion, Dhenukāsura rushed forward and kicked Balarāma in the chest with his hind legs. Balarāma calmly caught the demon by his hind legs, whirled him around with terrifying speed until he died, and hurled his heavy carcass into the tree canopy, while Balarāma and Kṛshṇa cleared the forest of all remaining demon associates.