శ్రీనారాయణ ఉవాచ :
మణిభద్ర ఉవాచ :
నారాయణుడిట్లా :
గణేశునకు బోధించి శంభువు అభ్యంతరానికి పోయాడు. అక్కడ అందమైన సింహాసనమందు దుర్గతిని నశింపచేసే దుర్గ ఉంది. (1) భైరవీ, భద్రకాళి, ఉగ్రచండ, కోటరి, వారు త్వరగా లేచి జగదీశ్వరునకు నమస్కరించారు. (2) అక్కడికి గణేశుడు, పరాక్రమశాలి కార్తికేయుడు వచ్చారు. బాణుడు, వీరభద్రుడు, స్వయంగా నంది, సునందకులు వచ్చారు. (3) మహాకాలుడు మహామంత్రి, ఎనిమిదిమంది భైరవులు, సిద్ధేంద్రులు, యోగీంద్రులు, పదకొండు మంది రుద్రులు (4) వచ్చారు. ఇంతలో అక్కడికి మణిభద్రుడు వచ్చాడు. సింహద్వారంలో స్వయంగా ద్వారపాలకుడు ఆ ఈశ్వరునితో చెప్పాడు. (5) మణిభద్రుడిట్లా - ఓమహేశ్వర! యాదవుల లెక్కలేనంత సైన్యం బలదేవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, సాత్యకి (6) ఉగ్రసేన మహారాజు, భీముడు, అర్జునుడు, అక్రూరుడు, ఉద్ధవుడు, జయంతుడు ఇంద్రుని కొడుకు, (7) శ్రేష్ఠరత్నములలో సారముతో నిర్మితమైన రథశ్రేష్ఠమందు మనోహరమైనదానియందు, విధికి విధాతయైన, పరమేశ్వరుడు, భగవాన్ శ్రీకృష్ణుడు (8) ప్రక్కలందుండే ఏడుగురు గోపాలురతో సేవింపబడుతూ, వారు శ్వేతచామరములతో వీస్తుండగా, కోటి మన్మథుల లీలవంటికాంతిగల, వనమాలతో అలంకరింపబడిన, (9) కృష్ణుడు సాటిలేని, కోటిసూర్యులతో సమానమైన కాంతిగల చక్రమును ధరించాడు. గద, కౌమోదకి, వ్యర్థముకాని శూలము దగ్గరుంచుకొని (10) రథమధ్యంలో విశ్వసంహారమునకు కారణమైన మహాశంఖమును ఉంచుకొని, లక్షమంది మహారథులతో, మూడు కోట్లు రథములతో, (11) మూడుకోట్ల గజేంద్రములతో, మూడుకోట్ల మల్లురతో, నూరుకోట్ల గుర్రములతో వానికి నాల్గింతలడాలు కలవారితో(12) వానికి ఏడింతలు ఖడ్గములు కలవారితో, రెండింతలు దానికి ధనుస్సు గలవారితో వీరితో కూడా త్వరగా శోణితపురానికి వచ్చాడు. (13) లంకను దాశరథివలె చుట్టూ చుట్టుముట్టాడు. వేయి తాటిచెట్ల కొలతగల, మండుతున్న అగ్నిజ్వాలవలె ఉజ్జ్వలమైనది. (14) పైన పరిఖతో కూడినది సురలు అసురులు ఎవరితోనూ దాటరానిది, స్వర్గ గంగ నీటి సమూహముల సమూహముతో వర్షముతో కూడినది. (15)
శ్రీమహాదేవ ఉవాచ :
గరుడుడు పక్షీంద్రుడు సాక్షాత్తుగా నాశనము చేశాడు. మణిశ్రేష్ఠముల (వజ్రములు) సారముతో నిర్మింపబడిన ఆకాశాన్నంటే ప్రాకారములు గల పురమును (16) పగులగొట్టాడు. మల్లులు లక్షమంది, బలదేవుడు తన నాగలితో పగులగొట్టారు. మూడులక్షల ఉద్యానములను, ప్రభువు యొక్క ప్రాకారాన్ని పీకేశారు. (17) ద్వారపాలులను చంపి మహాద్వారంలో ప్రవేశించారు. ఇదంతా విని మహాదేవుడు సురల సభలో ఇట్లా చెప్పాడు. (18) పార్వతి, భద్రకాళి, స్కందుడు, గణపతి, ఎనిమిది మంది భైరవులు, రుద్రులు, వీరభద్రుడు, మహాకాలుడు, నంది, తొమ్మిదిమంది సేనాపతులందరు వీరికి చెప్పాడు. (19) శ్రీమహాదేవుడిట్లా - గోలోకనాథుడైన చక్రపాణి, భగవంతుడు వచ్చాడు. (20) ఆతడు విశ్వముల సమూహాన్ని క్షణకాలంలో నశింప, చేయుటకు సమర్థుడు. ఆతనికి ఈ నగరమెంత. అన్ని విధాలైన ఉపాయాలతో వారంతా ప్రయత్నించి బాణుని రక్షించండి (21) బాణుడు యుద్దానికి పోనీ. పరుడు ఐన లంబోదరుని స్మరించి పోనీ. బాణునికి కుడిపక్క స్కందుడు, ముందు గణేశ్వరుడు (22) ఎడమ భైరవులు రుద్రులు, స్వయంగా మహారథుడైన నంది ఉండని. మహాకాలుడు, వీరభద్రుడు, ఇతర సైనికులు కూడా ఉండని (23) పైన దుర్గ, భద్రకాళి, ఉగ్రచండ, కోటరీలు. ఓ దుర్గతిని నశింపచేసే దుర్గ! మహాభాగిని! బాణుని రక్షించు. (24) నీ శక్తి కృష్ణునిది. అందుకే నిన్ను నారాయణీ అని అన్నారు. ఓ విష్ణుమాయ! జగన్మాత! సర్వమంగళములకు మంగళమైనదాన (25) వ్యర్థముకాని చక్రసారము, సుదర్శనము. దాని నుండి బాణుని రక్షించు. అందరికన్న బాణుడు నాకు ప్రియమైనవాడు, గణేశుని కన్న, కార్తికేయుని కంటే గూడా (26) బాణుని తల పై చేయుంచు, పాదపద్మముల ధూళిని కూడా ఉంచు. శివుని మాటను విని దుర్గతిని నశింపచేసే దుర్గ నవ్వి, యథార్థమైన సమయానికి తగిన మాటను తీయగా ఇట్లా చెప్పింది. (27)
మూ ॥ పార్వత్యువాచ :
పార్వతివచన మిట్లా - మణులు, రత్నాదులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, ఉన్నదంతా (28) అమ్మాయి యొక్క వస్తువులంతా, కన్యకను ఉషను, రత్నభూషణములతో అలంకరించి, రత్నభూషణముల అలంకారంతో కలదాన్నిగా చేసి పరుడైన అనిరుద్ధుడను వరుని, (29) ముందుంచుకొని, ఓబాణ! పరమాత్మయైన కృష్ణునకు ఇవ్వు. ఏ ఇబ్బందులు లేకుండా రాజ్యం చేయి. ఆత్మతో సహ (నీతో నీవు) యుద్దమేమిటి. (30) ఆతడుపోతే ప్రాణాలు పోతాయి. ఆతడు బ్రతికితే ఇంద్రియములతో సహా జీవిస్తాడు. నేను శక్తిని, బ్రహ్మమనస్సు. శివుడు జ్ఞానాత్మకుడు. (31) శివుని వదిలితే దేహము వెంటనే పడిపోతుంది. వాడుశవమౌతాడు (శివుడౌతాడు). ఓ శివ! చక్రము తేజస్సుముందు యుద్ధంలో ఎవడు నిలబడుతాడు. (32) ఆత్మనిలవదు, ఆకాశము నిలవదు బాణుని యుద్ధంలో యుద్ధము తన ఆత్మతోనా. అందరికి ఆతడు పరమాత్మ. భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినాడు. (33) ఆతడు నిత్యుడు, సత్యము, పరిపూర్ణతముడు, ప్రభువు, కృష్ణుడు. గణేశుడు, కార్తికేయుడు, నీవుకూడా వారికి పరుడవే. (34) కింకరులందరిలో ప్రియమైనవాడు బాణుడు. కృష్ణుని కన్నపరుడైన ప్రియమైన వాడులేడు. నేను వైకుంఠంలో మహాలక్ష్మిని, గోలోకంలో స్వయంగా రాధికను. (35) శివలోకంలో శివను, బ్రహ్మలోకంలో సరస్వతిని నేను దైత్యులను ఇదివరలో చంపాను. ఇదివరలో సతిని, దక్షకన్యను (36) నీనిందతో శరీరం వదిలాను, ఆశైల కన్యకను నేనే. రక్తబీజునితో యుద్ధంలో మూర్తిభేదముతో కాళిని (37) నేను సావిత్రిని, వేదమాతను, సీతను జనకుని కన్యకను. భారతదేశంలో భీష్ముని కూతురును, ద్వారవతిలో రుక్మిణిని (38) దైవం వల్ల సుదాముని శాపంతో ఇప్పుడు వృషభానుని కూతురును, కృష్ణుని ధర్మపత్నిని, పుణ్యమైన బృందావనంలో, (39) భగవంతుడవు, సర్వజ్ఞుడవు, సనాతనుడవు శివుడవైన నీకు నేనేమి చెప్పాలి, అని. సమయోచితంగా చేయాలి (40) అని అన్నది.
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమందు నూట పద్దెనిమిదవ అధ్యాయము.
Summary of chapter 118 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Revealing the ultimate protective shield of divine love, this chapter presents the Śrī Rādhā Kavacha. This secret composition grants complete spiritual immunity, removes all mental anxieties and worldly fears, purifies the subtle body, and bestows the rare jewel of unalloyed Krishna-Bhakti upon anyone who recites or wears it with pure faith.