మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
గర్గ ఉవాచ :
వసుదేవ ఉవాచ :
గర్గ ఉవాచ :
అను!! శ్రీనారాయణుడిట్లన్నాడు :
ఇంతలో వసుదేవుని ఆశ్రమానికి గరుడొచ్చాడు. చేతిలో దండం, ఛత్రము, జడలు కలిగి ఉన్నాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. (1) తెల్లని యజ్ఞోపవీతం ఉంది. తపస్వి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. తెల్లని పలువరుస, తెల్లని వస్త్రము ఉన్నాయి. యాదవులకు కులపురోహితుడు. (2) ఆతనిని చూచి త్వరగా లేచి దేవకి నమస్కరించింది. వసుదేవుడు భక్తితో రత్న సింహాసనాన్ని ఇచ్చాడు. (3) మధుపర్కమును కామధేనువును, వహ్నిశుద్దమైన వస్త్రాన్ని ఇచ్చాడు. గంధం, పూలమాలలు ఇచ్చి భక్తితో పూజించాడు. (4) మిష్టాన్నమును (తీపి) పరమాన్నమును, పిండి వంటలు, మధురము, తేనె ఇచ్చాడు. వీటితో ప్రయత్నపూర్వకంగా భుజింపచేశాడు. తాంబూలము, సుగంధములు ఇచ్చాడు. (5) మనస్సులో కృష్ణునికి నమస్కరించి, తన వారితో కూడిన అతనిని చూచి వసుదేవునితో, పతివ్రతయైన దేవకీతో ఇట్లన్నాడు. (6) గర్గుడిట్లా - వసుదేవ! ఇది తెలుసుకో. బలరామునితో కూడా పుత్రుని చూడు. ఉపనయనానికి తగినాడు శుదుడు. ఇప్పుడు ఈ వయస్సుతో (ఉపనయనానికి) ఉత్తముడు (7) వసుదేవుడిట్లన్నాడు - యదువంశము వారికి పూజ్యమైన దైవమా! ఓగురు! మంచికాలాన్ని చూచి చెప్పు. ఉపనయనానికి తగినాడు శుద్ధుడు సజ్జనులకు ప్రశంసించతగినవాడు.(8) గర్గుడిట్లన్నాడు -బాంధవులందరికి ఆహ్వానపత్రికలను పంపు. ఓ వసుదేవ! వసువు వంటివాడ! ప్రయత్నించి సామగ్రిని కూర్చుకో. (9) ఎల్లుండి మంచిరోజే ఉంది. ఆ రోజు ఉపనయనం చేయొచ్చు. ఆరోజు సజ్జనులకు (పెద్దలకు) ఇష్టమైందే శుద్ధమైనది. చంద్రబలం / తారాబలం బాగుంది. (10) గుర్గుని మాటను విని వసువు వంటివాడైన వసుదేవుడు బంధువులందరికి శుభపత్రికను పంపించాడు. (11) నేతి కాలువలు, పాల కాలువలు, పెరుగు కాలువలు అందంగా కూర్చారు (అతిగా అని). మధు, బెల్లము కాలువలు కూడా ప్రయత్నపూర్వకంగా ఏర్పరిచాడు. (12) అనేక ఉపహారముల రాశిని, మణులు రత్నములు బంగారము, రకరకాల అలంకార సామగ్రి వస్త్రములు, ముత్యములు మాణిక్యములు వజ్రములు ఏర్పరచారు. (13) శ్రీకృష్ణుడు దేవతల వర్గాన్ని మునీంద్రులను సిద్ధశ్రేష్టులను భక్తితో మనస్సులో స్మరించాడు. భక్తుడు భక్తవత్సలుడాయన. (14) మంచిరోజురాగా వారంతా వచ్చారు. మునీంద్రులు, బాంధవులు, దేవతలు, రాజులు చాలా మంది వచ్చారు అట్లాగే.(15)
దేవకన్యలు, నాగకన్యలు, అందరు రాజకన్యలు, విద్యాధరులు,(స్త్రీలు) గంధర్వులు, వాద్య భాండకులు వచ్చారు.(సంగీత సాధనం తబలవలె) (16) బ్రాహ్మణులు భిక్షుకులు, భట్టులు, యతులు, బ్రహ్మచారులు, సంన్యాసులు, అవధూతలు యోగులు వచ్చారు. (17) బంధువులైన స్త్రీలు, తమ బంధువర్గము, మాతామహుని వర్గం వారు, బంధువుల బంధువులు అందరు ఆ శుభకర్మకై వచ్చారు. (18) భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్విజుడైన కృపుడు, పుత్రులతో కూడా ధృతరాష్ట్రుడు భార్యతో కూడా వచ్చాడు. (19) విధవయైన కుంతి కొడుకులతో ఆనందము దుఃఖము కలగలిసిన మనస్సుతో వచ్చింది. అనేక దేశములందు పుట్టిన యోగ్యులైన రాజులు, రాజపుత్రులు వచ్చారు. (20) అత్రి, వశిష్టుడు, చ్యవనుడు, మహాతపస్సంపన్నుడు భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, భీముడు, గార్యుడు, మహాతపస్సంపన్నుడు గర్గుడు వచ్చారు. (21) వత్సుడు, పుత్రులతో కూడా ధర్ముడు (జయించే స్వభావం గల) సమర్థుడైన పరాశరుడు, పులహుడు, పులస్త్యుడు,ఆగస్త్యుడు, సౌభరి (22) సనక, సనందసనాతనులు, సనత్కుమారుడు, భగవంతుడైన వోడుడు, పంచ శిఖుడు (23) దుర్వాసుడు, ఆంగిరసులు, వ్యాసుడు, వ్యాసపుత్రుడైన శుకుడు, కుశికుడు, కౌశికరాముడు, ఋష్య శృంగుడు, విభాండకుడు (24) శృంగి, వామదేవుడు, గౌతముడు, గుణసముద్రుడు, క్రతువు, యతి, ఆరుణి, శుక్రాచార్యుడు, బృహస్పతి (25) అష్టావక్రుడు, వామనుడు, వాల్మీకి, పారిభద్రకుడు, పైలుడు, వైశంపాయనుడు, ప్రచేతుడు, పురుజిత్తు (26) భృగువు, మరీచి, మధుజిత్తు, కశ్యపుడు (ఐన) ప్రజాపతి, దేవమాత అదితి, దైత్యుల తల్లి దితి (27) సుమంతు, సుభానువు, ఒక కాత్యాయనుడు, మార్కండేయుడు, లోమశుడు, కపిలుడు, పరాశరుడు, (28) పాణిని, పారియాత్రుడు, పురుషశ్రేష్ఠుడు పారిభద్రుడు, సంవర్తుడు, ఉతథ్యుడు నరుడనైన నేను, ఓ నారద! అక్కడికి వచ్చాము. (29) విశ్వామిత్రుడు, శతానందుడు, జాబాలి, తైతిలుడు, బ్రహ్మాంశ యోగులకు జ్ఞానులకు గురువైన సాందీపిని, (30) ఉపమన్యువు, గౌరముఖుడు, మైత్రేయుడు, శ్రుతశ్రవుడు, కఠుడు, కచుడు, కరఖుడు, ధర్మవేత్త భరద్వాజుడు వచ్చారు.(31)
వసుదేవ ఉవాచ :
శిష్యులతో కూడినమునులందరు వసుదేవుని ఆశ్రమానికి వచ్చారు. వసుదేవుడు వారిని చూచి భూమి పై దండము వలె పరుండి నమస్కరించాడు. (32) ఇంతలో బ్రహ్మ నవ్వుతూ హంసవాహనము పైన, రత్నములతో నిర్మించిన పల్లకి పై పార్వతితో కూడి శంకరుడు, వచ్చారు. (33) నంది, మహాకాలుడు, వీరభద్రుడు, సుభద్రకుడు, మణిభద్రుడు,పారిభద్రుడు, కార్తికేయుడు, గణేశ్వరుడు, (34) గజేంద్రుము పై మ హేంద్రుడు, ధర్ముడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, వరుణుడు, వాయువు, ఆగ్ని, (35) యముడు, సంయమినీనాథుడు, జయంతుడు, నలకూబరుడు, అన్ని గ్రహములు, వస్తువులు, రుద్రులు, వారి గణములు (36) ఆదిత్యులు, శేషుడు, రకరకాల దేవతలు అంతా వచ్చారు. వసుదేవుడు భక్తితో భూమి పై తలవంచి నమస్కరించాడు. (37) అధికమైనభక్తితో దేవేంద్రులను సురలను ఆనందపరిచాడు. భక్తితో తన తలను వంచి, శరీరమంతా పులకించగా ఆనందపరిచాడు. (38) వసుదేవుడు ఇట్లన్నాడు - పరమైనబ్రహ్మ పరమైనస్థానము, పరాత్పరుడైన పరమేశుడు, జగత్పరిపాలకుడు బ్రహ్మ నా ఇంటికి స్వయంగా వచ్చాడు. (39) ఆతడు వేదములకుస్రష్ట, జనకుడు, సృష్టి హేతువు, సనాతనుడు, సురలకు,మునీంద్రులకు సిద్దేంద్రులకు గురువులకు గురువు. (40) కలలో కూడా ఆతని పాదపద్మములను క్షణకాలము చూడగల్గుట చాలా దుర్లభము. శివుని స్మరించినంతనే అన్ని అనిష్టములు తొలగిపోతాయి. (41) అన్ని సంకటములను దాటి నరుడు శుభాన్ని పొందుతాడు. అందరికన్న ముందుగా ఆతనికి పూజజరుగుతుంది. ఆతడు దేవతలకు ముందుండేవాడు, పరుడు (42) ఘటములందు భక్తితో మంత్రములతో ఆవాహనతో శుభానిచ్చేగణేశుడు, స్వయంగా సాక్షాత్తూ విఘ్న వినాశకుడు భగవానుడు వచ్చాడు. (43) భగవానుడైన, దేవతలు మొదలగువారితో పూజింపబడే కార్తికేయుడు, దేవతలకు శ్రేష్ఠమైనది,పూజ్యురాలు, పరాత్పరమైన మహాలక్ష్మి వచ్చింది. (44) జగత్తులకు తొలి రూపిణియైన పార్వతీమాత నా ఇంట్లో ఉంది. ఆమె సర్వశక్తి స్వరూపురాలు, మూలప్రకృతి, ఈశ్వరి . (45)
అను ॥ పరాపరులకు, పరమమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, ఆమె పాదములను ఆరాధించి నరుడు తన కోరికను పొందుతాడు. (46) శరత్కాలమందు భక్తితో పూజింపబడే ఆమె సాక్షాత్తుగా నా ఇంట్లో ఉంది. అందరు దేవతలతో కూడి గణములతో కూడి, భక్త వత్సలురాలైన ఆమె (47) దయగలది. కృపతో భారతదేశంలో అవతరించింది. నేను ధన్యుణ్ణి , కృతకృత్యు. నా బ్రతుకు సఫలము. (48) ఓదుర్గ! పరమాద్యవైన నీవు నా ఇంటి కొచ్చావుకనుక ధన్యుణ్ణి. క్రమంగా ఒకరొకరిని అందరినిసంతోషపరిచాడు వసుదేవుడు (49) మునీంద్రులందరిని వారి కంఠమందు తెల్లని వస్త్రాన్ని ఉంచి ఆనందంతో ఆనందింపచేశాడు. ఒక్కొక్కరిని శ్రేష్ఠమైన రత్న సింహాసనమందు కూర్చోబెట్టాడు. (50) క్రమంగా విడివిడిగా శాస్త్ర ప్రకారము పూజింపజేశాడు. ప్రత్యేకంగా బ్రహ్మాది సురలను వరించాడు (ఎన్నిక చేశాడు). (51) మునివర్గమును బ్రాహ్మణులను భక్తితో పురోహితుడైన గరునిరత్నములతో, పగడములు, మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, (52) భూషణములు, వస్త్రములు, మాలలు, గంధ చందనములతో పూజించాడు. అందరిమధ్య ప్రదేశంలో రమ్యమైన రత్నసింహాసనమందు (53) శుభకర్మలో పూజకొరకు గణేశుని కూర్చో పెట్టాడు (ఎన్నుకున్నాడు) . బంగారు పాత్రలలో సప్త (సముద్రముల) తీర్థముతో (54) చల్లని, వాసనగల పుష్ప చందనములుగల ఆకాశగంగ జలములతో, పుణ్యప్రదమైన పుష్కర క్షేత్ర ఉదకముతో (55) శుద్ధమైన పంచామృతము, పంచగవ్యముతో, భక్తిగా హేరంబునకు స్నానం చేయించాడు. మంత్రపూర్వకముగా సముద్రపు నీటితో స్నానం చేయించాడు. (56) ఓ నారద! పారిజాత పూలమాలతో అలంకరించాడు. శ్రేష్ఠమైన రత్నభూషణములతో, వహ్ని శుద్ధమైన వస్త్రముతో (57) గంధము,చందనము పుష్పములతో, రత్నముల హారముతో, ఉంగరముతో శుభుడైన సర్వదేవతల కధిపతియైనగణపతిని ఆనందపరిచాడు. ఆతడు విఘ్ననాశకారి, శాంతుడు, భగవంతుడు సనాతనుడు (గణపతి). (58) అని
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుని ఉపయన మనేదానియందు గణేశ అభి షేకమనునది తొంబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 99 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Defining spiritual perfection, this chapter provides a heartwarming description of the inner qualities and noble behavior of true Vaishṇavas and pure devotees. A genuine saint is described as free from pride, envy, anger, and worldly greed, treating all living beings with equal compassion, speaking gentle truth, and maintaining unshakeable faith in Lord Śrī Kṛshṇa. The text asserts that associating with such pure devotees purifies the soul faster than bathing in all sacred rivers combined.