శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను:
ఓ ఈశ్వరీ! (రాధా) పూర్వము సముద్రమును (అమృతము కొరకు దేవరాక్షసులు) మధించినప్పుడు ఆ మహాసముద్రము నుండి ఏగిసినవాడు (ఉద్భవించినవాడు) ధన్వంతరియన్న మహానుభావుడు.అతడు స్వయముగా నారాయణుని అంశయైనవాడు. ఇతడు గరుత్మంతుని శిష్యుడు. శంకరునియొక్క ఉపశిష్యుడు (శిష్యుని శిష్యుడు) కనుక సర్వవేదములందారి తేరిన పండితుడు. మంత్ర తంత్రములందు నేర్పు గలవాడయ్యెను. అతడొకసారి తన వేయి మంది శిష్యులతో కలిసి కైలాసమున కేగుచుండెను.
ఆ ధన్వంతరి మార్గమధ్యములో లక్షమంది నాగులతో కూడి ముండ్లపంది (ఏదు అని తెలుగులో వ్యవహరించు జంతువు) ని పోలియుండి తీవ్రమైన విషము కలిగియున్న తక్షకుడను నాగమును చూచెను. ఇంతలో నాతక్షకుడితనిని చూడగనే మ్రింగివేయుటకీతని వైపు వేగముగా వచ్చుచుండగా ధన్వంతరి వానిని చూచీ నవ్వెను. మోసగించు విద్యలో నేర్పు గల ఒక (ధన్వంతరి యొక్క) శిష్యుడు తీవ్రముగానున్న తక్షకుని పట్టుకొని తన మంత్రశక్తిలో స్తంభింపజేసి విషమును పిండి వేసెను. శిరస్సు నందున్న అమూల్య మణిరత్నమును పెకలించి తీసుకొని - చేతితో వానిని గుండ్రముగా త్రిప్పి దూరమునకు విసిరి వేసెను.
తక్షకుడు మరణించినవానివలె చేష్టలు (కదలిక) లేనివాడై ఆ మార్గములో పడియుండెను. అతని వెంటనున్న సర్పగణములు వాసుకీ వద్దకు పోయి ఆ వార్తను విన్నవించిరి. వాసుకి ఆ వార్తను విని మిక్కిలి కోపము గలవాడై. మండిపోవుచు తీవ్ర విషము గల లెక్కలేనన్ని సర్పములను ధన్వంతరి మీదికి దండెత్తించెను. ద్రోణుడు, కాళీయుడు, కర్కోటకుడు, పుండరీకుడు, ధనంజయుడు అన్న యుద్ధ విశారదులగు ఐదుగురు ముఖ్య సేనాపతులను నడిపించెను. ధన్వంతరి ఉన్న చోటికి మొత్తము నాగరాజులు చేరవచ్చిరి. అప్పుడ సంఖ్యాకులైన నాగులను చూచి ధన్వంతరి శిష్యులు భయము పొందిరి. నాగరాజుల నిశ్వాసవాయువు (విడిచిన ముఖమందలి గాడ్పులు) లు సోకి ధన్వంతరి శిష్యులందరు మరణించిన వారి వలె జ్ఞాన రహితులై చేష్టలు తక్కి భూతలమందు పండుకొని యుండిరి.
భగవంతుడైన (విష్ణ్వంశ గల) ధన్వంతరి తన గురువును స్మరించి తన మంత్రశక్తీచేతను అమృతవర్షముచేతను శిష్యులను బ్రదికించెను. ఇట్లు శిష్యులకు చైతన్యము కల్గించి - విషము చేత భయంకరముగా నున్న సర్న సంఘమును తన మంత్రములతో స్తంభించునట్లు చేసెను. ఆ నాగులందరు మరణించిన వారివలె నిశ్చేష్టులైరి - ఆ సర్పగణములలో ఒక్కడు కూడ తమ ప్రభువగు వాసుకికీ వార్తనందించుటకు సమర్థుడు కాకపోయెను.
సర్వజ్ఞుడైన వాసుకి సర్పగణములకు వచ్చిన మొత్తము సంకటమును (ప్రాణాపాయస్థితిని) తెలిసికొని జ్ఞానరూపిణియైన తన చెల్లెలిని జగద్గారిని ఆహ్వానించెను (పిలిచెను).
వాసుకిరువాచ - వాసుకి ఆమెను :
“ఓ మనసా! మహాభాగురాలా! నీవిక్కడకు రమ్ము. గొప్ప సంకటము నుండి నాగులను రక్షించుము. ఈ కార్యము వలన నీకు ముల్లోకములయందు పూజ జరుగగలదు”. వాసుకి మాట విని ఆ మానస కన్యక నవ్వి వినయము చేత వంగి నిలిచి అమృత తుల్యమైన నూట పలికెను.
మానసోవాచ - మానసాదేవి పలికెను :
నాగరాజా! నా మాట వినుము. యుద్ధభూమికి పోవుచున్నాను. క్షేమమో మరింకేదో దైవము చేత సాధింపబడదగినది. తగిన ప్రయత్నమైతే నేను చేయగలను. నేను చంపదలచిన వ్యక్తిని రక్షించుటకెవడు సమర్థుడు? నీ శత్రువును లీలగా యుద్ధరంగమున చంపగలను. ఒకవేళ యుద్ధభూమికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పటికిని నీ శత్రువును నేను జయించగలను. సంశయము లేదు. నా గురువైన శేష భగవానుడు నాకు సిద్ధమంత్రము నిచ్చినాడు. అది జగన్నాథుడైన సొరాయణుని యొక్క పరమాద్భుతమైన కవచము. ఆ కవచమును ముల్లోకములకు మిక్కిలి మంగళము చేకూర్చు దానిని వాకండమందు ధరించియున్నాను. ఆ శక్తి వలన సంసారమును భస్మమొనర్చి మరల దానిని సృష్టించుటకు నేను సమర్ధురాలనగుచున్నోను.
“నేను మొదట భగవంతుడైన శంకరుని యొక్క శిష్యురాలని మంత్ర శాస్త్రములను పొందితిని. కృషతో నా విభుడు నాకు మహాజ్ఞానమిచ్చియుండెను. గరుడుడు శంభుని యొక్క శిష్యుడే. సనతవీని లెక్క చేయను. ఇది నిశ్చయము, ధన్వంతరి ఆ గరుడుని శిష్యులలో నొకడు. అతనిని లెక్క చేయుదునా?” ఇట్లు పలికి ఆమె ఒక్కతె వాసుకిని వదిలి - శ్రీహరికి శంకరునికి శేషునికి నమస్కరించి హర్షము గల మనస్సుతో - కోపముతో నెర్రబారిన కన్నులు గలదై ఎక్కడ ధన్వంతరి శత్రుజయము వలన ప్రసన్నమైన వదనము నేత్రములు కలవాడైయుండెనో ఆ స్థలమునకు చేదబోయెను. ఆ మానసకన్యక తన చూపులోనే పొగగణములనందరిని జీవింపజేసి - విష దృష్టిని ప్రసరింపజేసి శత్రు శిష్యులను (ధన్వంతరి శిష్యులను) నిశ్చేష్టులను చేసెను.
భగవంతుడైన ధన్వంతరి మంత్ర శాస్త్రమందు ఆరితేరిన వాడు కనుక తన శిష్యులను మంత్రశక్తితో ప్రయత్నించి కూడ లేపుటకు సమర్థుడు కాకుండెను. అప్పుడాదేవి సురేశ్వరి (మానస) ధన్వంతరిని చూచి నవ్వి - అహంకారముతో విశేషార్థములతో కూడిన అనేక వాక్యములను పలికెను.
మానసోవాచ - మానసాదేవి పలికెను:
“ఓయీ ధన్వంతరీ! నీవు గరుడుని శిష్యుడవు కదా! మంత్రార్ధమును మంత్రశిల్పమును మంత్రభేదమును మహాషధమును నీవెరుగుదువా? చెప్పుము. నేనును వైనతేయుడును (గరుడుడు) శంకరుని యొక్క శిష్యులుగా ప్రసిద్ధికెక్కితిమి. నేను కల్పప్రమాణ కాలము - సుదీర్ఘ కాలము శివుని శిష్యురాలిగా నుంటిని. అని పలికి ఆ జగన్మాత సరస్సునందలి ఒక పద్మమును తీసుకొని మంత్రము యొక్క శక్తినీ దోనీ చుట్టు రక్షగా కూర్చి కోపముతో విసిరెను.
తన వైపు మండుచున్న అగ్నిజ్వాలను పోలి వచ్చిన పద్మపుష్పమును చూచి ధన్వంతరి - ఆమెను గూర్చి తిరస్కారపు నవ్వు నవ్వి - తన నిశ్వాసవాయువుతోనే భస్మముగా చేసెను. తిరిగి ఆ పద్మ భస్మమును మంత్రించిన పిడికెడు మట్టితో అవలీలగా వ్యర్ధము చేసెను (దానిని కూడ నశింపజేసెను).
అప్పుడు దేవి సూర్యతేజస్సుతో సమానమైన తేజస్సు గల శక్త్యాయుధమును గ్రహించి మంత్రశక్తితో రక్షచేసి శత్రువైన ధన్వంతరి పైకి విసిరెను. మండిపోవుచున్న శక్త్యాయుధమును చూచి ధన్వంతరి విష్ణువు తనకు ప్రసాదించిన శూలముతో లీలగా ఖండించెను. తన శక్త్యాయుధము వ్యర్థమగుట చూచి ఈశ్వరి కోపముతో మండిపోయెను. తరువాత ఘోరమును తీవ్ర శక్తి కలదియు, వ్యర్థముగానిదియు కాలాంతకునితో సమానమైన తేజస్సు గలదియు, లక్ష సంఖ్యగల సర్పములతో కూడినదియు సిద్ధిపొందిన మంత్రముతో అభిమంత్రించే బడినదియు ఐన నాగపాశమును స్వీకరించి ధన్వంతరి మీదికి ప్రయోగించెను. నాగపాశాస్త్రమును చూచి ధస్వంతరి చిరునవ్వు గలవాడై సంతోషముతో (తన గురువగు) గరుడుని స్మరించెను. వెంటనే గరుడుడు (పక్షిరాజు) అక్కడికి వచ్చేను.
విషువాహనమైన గరుడుడు సర్పాస్రము దగ్గరకు రాగానే చూచి చాల కాలమునుండి ఆకలిగొనియున్న వాడు కనుక వెంటనే ముక్కుతో పట్టుకొని భుజించెను. (సర్పములను తీసివేసి అస్త్రమును శక్తిహీనము చేసెను).
నాగాస్త్రము వ్యర్థమగుట చూచి కోపముతో కన్నులెర్రబోరిన దేవి. పూర్వము తనకు శివుడు ప్రసాదించిన భస్మమును పిడికెడు తీసుకొని దానిని మంత్రము చేత అభిమంత్రించి శత్రువు పైకి విసిరిను. దానిని చూచి గరుడుడు శిష్యుని తన వెనుకనుంచి రెక్కల గాడ్పుతో భస్మమును చెల్లాచెదరు చేసెను. తన భస్మముష్టి ఇటు త్రోసివేయబడగా చూచీ దేవి కోపించీ - ధన్వంతరిని చంపుటకు గాను - వ్యర్థము కానట్టిదియు, శివుడు తనకు ప్రసాదించినదియు, శతసూర్యులంత తేజస్సుగలదియు, ప్రళయాగ్నితో సమానమైన ప్రభ కలదియునైన లోకములందు ఎక్కడ మొక్కవోని శూలమును చేత బట్టెను.
అనంతరమారణ భూమీకి ధన్వంతరిని రక్షించి, గరుడుని శాంతపరచుటకు బ్రహ్మయు శంకరుడును వచ్చిరి. జగదౌరి (మానస) శంకరుని జగత్పతియైన బ్రహ్మను చూచి శూలము ధరించియుండియు శంకలేనిదై భక్తితో ఆ ఉభయులకు నమస్కరించెను. ధన్వంతరియు గరుడుడును ఆ దేవతాశ్రేష్ఠులకు నమస్కరించి గొప్ప భక్తితో స్తుతించిరి. ఆ బ్రహ్మయు పరమేశ్వరుడును వారికాశీస్పులిచ్చిరి. అప్పుడు బ్రహ్మ లోక హితమును గోరి మనసాదేవి యొక్క గౌరవార్థము ధన్వంతరీతో హితమును మధురమును ఐన వాక్యమునిట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ వలికెను :
ధన్వంతరీ! ఓ భాగ్యవంతుడా! సర్వశాస్త్రములందరితేరినవాడా! మానసదేవితో నీ యుద్ధము సమయుద్ధము కాదని నా అభిప్రాయము. ఈ సురేశ్వరి తనకు శివుడు ప్రసాదించిన, (అందువలననే) అన్ని వైపుల నుండి ఎవరి చేతను నివారింపబడుట సాధ్యము గానీది ఐన శూలముతో ముల్లోకములను భస్మము చేయుటకు సమర్ధురాలు సుమా.
సామవేదమందలి కౌథుమశాఖలో చెప్పబడిన విధముగా శ్రద్ధాభక్తులతో నీవీ దేవిని ధ్యానించి షోడశోపచారములు సమర్పించి పూజ చేయుము. ఆస్తికుడు (ముని) చెప్పిన స్తోత్రముతో ఈమెను నీవు స్తుతింపదగును. నీ పూజా స్తోత్రము వలన పంతుష్టురాలై ఈ మనసాదేవి నీకు వరము ప్రసాదింపగలదు. ఇట్లు పలికిన బ్రహ్మ వాక్కు విని శివుడు దానికనుమతించెను. గరుడుడు కూడ మిక్కిలి ప్రీతితో పూనుకొని ధన్వంతరికీ కర్తవ్యమును బోధించెను.
వీరి మాటలు విని స్నానము చేసి పరిశుద్ధుడై వస్త్ర తిలకాదులు ధరించి బ్రహ్మదేవునే పూజను చేయించు పురోహితునిగా చేసికొని (ధన్వంతరి) మానసాదేవిని పూజ చేయుటకై పూనుకొనెను.
ధన్వంతరి రువాచ - ధన్వంతరి ఇట్లనెను (దేవిని స్తుతించెను) :
“ఓ జగదౌరీ! ఇక్కడకు రమ్ము. నా పూజను స్వీకరింపుము. ఓ కశ్యపప్రజాపతి పుత్రీ! నీవు మూడులోకములందును పూజింపదగినదానవు. ఓ దేవీ! విష్ణు స్వరూపిణివైన నీ చేత మొత్తము జగత్తు జయింపబడినది. ఆ కారణము చేతనే యుద్ధభూమిలో నీ చేత అస్త్రములు ప్రయోగింపబడలేదు.” ఇట్లు పలికీ మనో నిగ్రహము కలవాడై భక్తితో శిరస్సు వంచి తెల్లని పుష్పమును తీసుకొని ఆ దేవినీ ధ్యానించుట పూనుకొనెను.
సుందరమైన సంపెంగపువ్వు యొక్క వర్ణము వంటి శరీర వర్ణము గలదియును సర్వావయవములు మిక్కిలి మనోహరముగా నున్నదియు, కొంచెము నవ్వుతో కూడి ప్రసన్నముగానున్న ముఖము కలదియు సన్నని వస్త్రముతో శోభించుచున్నదియు, సుందరమైన వెండ్రుకల కొప్పుకలదీయు రత్నాభరణముల చేత అలంకరింపబడినదియు నర్వజీవులను రక్షింతునని అభయమిచ్చునదియు భక్తులననుగ్రహించుట యందు త్వరగలదియు, సర్వవిద్యా విశారదయు, సర్వవిద్యలనిచ్చునదియు, శాంతస్వరూపిణియు గజరాజము వాహనముగా గలదియు ఐన శ్రేష్టురాలగు నాగేశ్వరీ దేవిని భజించుచున్నాను.
ఇట్లు ధ్యానించి (దేవీ పాదముల వద్ద) పుష్పముంచి నానావిధ పూజాద్రవ్యములతో షోడశోపచారములను చేయుచు ధన్వంతరి పూజించెను. తరువాత ప్రయత్నించి భక్తితో వంగిన శిరస్సు గలవాడై శరీరము పులకరించగా చేతులు జోడించి స్తోత్రమొనర్చెను.
ధన్వంతరీ రువాచ - ధన్వంతరి ఇట్లనెను:
సిద్ది స్వరూపయు, సిద్ధశక్తులనిచ్చునదియు ఐన దేవికి అనేక నమస్కారములు. కశ్యప ప్రజాపతి పుత్రికయు పరములనిచ్చునదియు ఐన దేవీకి అనేక నమస్కారములు. (విద్యాభ్యాసము చేత) శంకరునికి పుత్రికవంటిదియు ఆశ్రీతులకు సుఖములను కూర్చునదియు ఐన దేవికి నమస్కారములు. గజవాహనముగా గలదియు నాగేశ్వరీయునైన దేవికనేక నమస్సులు. ఓ ఆస్తీకముని యొక్క మాతా! నాకును జగములకు తల్లి ఐనదానా! జగత్తునకు మూలమైన దేవీ! జగత్కారు మహర్షి యొక్క పత్నీ! నీకు నమస్కారములు. నాగరాజులసోదరియు యోగీనీయు చిరకాల తపస్వినియు (ఆశ్రితులకు) సుఖములొసంగనదియు ఐన దేవికి నమస్సులు నమస్సులు. తపస్యారూపమైనదియు తపస్పుల ఫలము లిచ్చునదియు ఐన దేవికి నమస్కారములు. సుశీలయు సాధ్వియు శాంతరూపిణియు ఐన జగద్గారికి అనేక నమస్కారములు.
పూనికతో ఇటు స్తుతి చేసి భక్తితో నమస్కరించెను. పూజా స్తోత్రములకు తుష్టురాలైన దేవి ధన్వంతరికి వరములిచ్చి తన స్థానమునకు పోయెను.
బ్రహ్మ శంకరుడు గరుడుడు తమ తమ ఆలయములకు పోయిరి. విష్ణ్వంశ గల ధన్వంతరి కూడ తన మందిరమున కేగెను.
నాగరాజులును ఫణములతో వెలిగిపోవుచు సంతుష్టులై వెడలిపోయిరి. ఇట్లు స్తవరాజము నాచేత నీకు చెప్పబడినది. ఆస్తీకముని ఇంటికి వచ్చిన తల్లిని శాస్త్ర ప్రకారము భక్తితో గౌరవించెను. ఆ మునిపుంగవుని సేవలను స్వీకరించి జగద్గారి పుత్రుని యెడల సంతుష్టురాలయ్యెను. మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రమునెవడు భక్తితో పఠించునో వానికినీ వాని వంశమున బుట్టిన వారికీని సర్పభయము లేదు. ఈ విషయములో సందేహము లేదు సత్యము.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండముందు నారాయణ నారదనంవాదరూపమైన ధన్వంతరీ దతభంగము మనసావిజయమను కధలు గల ఏబది యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 51 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Expanding His divine household to establish royal harmony and protect virtuous princesses across the land, Lord Kṛshṇa married several noble queens. He wed Kalīndī, the personified Yamunā river who performed severe penance on the riverbanks; Mitravindā, the righteous princess of Avanti; Satī, the daughter of the king of Kosala; Bhadrā, the princess of Kekaya; and the exquisitely accomplished Lakshmaṇā of Videha. Each queen maintained a magnificent palace in Dvārakā where Lord Kṛshṇa expanded Himself through His mystic potency to reside simultaneously with every single queen, showering them with eternal love and devotion.