రాధికోవాచ - రాధాదేవి పలికెను :
చాలకాలము క్రింద మరణించి మరల శివుని చేత బ్రతికించబడిన తన ప్రియుడగు మన్మధుని - మరల పొంది మోదము కలదైన రతీ ఏమి చేసెను? స్త్రీలకు తమ భర్త యొక్క మరణము తమ మరణము కంటే మిక్కిలి సహింపరానిది. భర్తయొక్క పునస్సమాగమము ఇతరత్ర దుర్లభమైన సుఖము, శివుడు తన భార్యను వివాహ కార్యము ద్వారా కూడినవాడై చిరకాల వియోగము నశించిపోయి ముదముతో ఏమి చేసెను! భార్యా వియోగము పురుషులకు అన్ని శోకముల. కన్న భరింపరానిది. పునస్సమాగమము. ప్రాణమిచ్చుటకంటె సుఖమైనది. అందువలన ఆ విషయములను వినగోరుచున్నాను. నాకు మిక్కిలి ఆసక్తియున్నది. ఓ విద్వాంసులలో శ్రేష్ఠుడా! దయతో నాకీ విషయమును విస్తరించి చెప్పుము ప్రభూ! శివపార్వతుల యొక్కయు రతీమన్మథుల యొక్కయు మేళనము (కలయిక) వినువారికి శోకములను తొలగించి నర్వమంగళములను కలిగించును కదా!
నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
ఇట్లు రాధాదేవి పలికి చిరునవ్వు నవ్వుచు మాట చాలించెను. కృష్ణుడామె మాట విని చిరునవ్వుతో ఆమెను గూర్చి పలికెను
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
కామార్తురాలైన ఆ రతి మరణించిన భర్తయగు మన్మథుని మరల పొంది శంకరుని వివాహ గృహాము నుండి భర్తను తమ యింటికి కొనిపోయి తనకును భర్తకును చెలులతో చక్కని అలంకారమును ప్రయత్నపడి చేయించెను. ఆమె భర్త యందు ఆసక్తి కలిగియుండెను. కామశాస్త్ర విధము తెలిసిన కాముడు ఆమె భావము గ్రహించి రత్న విమానమెక్కి భార్యతో బాటు తమ ఇంటినుండి వనమునకేగెను. రమ్యమైన ప్రతి పర్వతమందు ప్రతి నదీతటమున ప్రతి నదముందు ప్రతిద్వీపమందు సముద్ర తీరములందు మనోహరమైన పుష్పోద్యానములందు కాంచన పర్వత సమీపమున ఏకాంతముగా నున్న వటవృక్షమూలమందు నదులయొక్క ఇసుక తిన్నెలయందు పుష్పించిన ఆరణ్యములలో తుమ్మెదల రోదగల, గండుకోయిలల కూతలు వినవచ్చు ప్రదేశములో, కమ్మని వాయువు చల్లని నీటితుంపరలతో వీచు ప్రదేశములందు స్త్రీల హృదయములందు చైతన్యమును హరింపజేయు విధముగా - కాలముననుసరించి వివిధములగు శృంగారమును ఆ రతి మన్మధునితో నిర్వహించెను.
మన్మథుడు నిండుగా నూరు దేవతాసంవత్సరములు తన భార్యతో రమించెను. వేడుకతో ఆమె యందు సంసక్తుడై రాత్రి పగలేరుగకుండెను. చారటు భోగాసకులై ఆ క్రీడయందే స్థిరముగా నుండిరి. రతీశాస్త్రమందు నేర్పుగల ఆ దంపతులు సురతక్రియనాపకుండిరి. అప్పుడా రతి సంతసించి భర్త యొక్క ఎడబాటుకు చెందిన సంతాపమును త్యజించెను. దొంగలింపబడిన రత్నమును మరల పొందినప్పుడెపడు క్షణమైనను వీడచుట కిష్టపడును? ఇట్లు రతియొక్క సంతాపకారణమైన వృత్తాంతమంతయు చెప్పబడినది. రాధా!శివశక్తులయొక్క సాటిలేనీ శృంగార విహారమును వినుము
వినువారికి కర్ణామృతమైనది పరమాశ్చర్యకరము సర్వసంతాపములను హరించునది శుభమును సుఖములను పుణ్యములను ప్రసాదించునది ఆ దంపతుల దీప్యలీల, శంకరుడు పార్వతితో కూడీ మామగారింట ఉండీ అతని అనుజ్ఞ పొంది క్రీడా విహారమునకై భార్యతో కలిసి వనమునకు పోయెను. శ్రేష్ఠ రత్నములతో అలంకృతముగా రత్నములు పొదుగబడినదిగా విశ్వకర్మ చేత నిర్మించబడిన రత్నాల రథమెక్కి విహరించుచు - మంచి వాసస్థానము గల శతశృంగ పర్వతమందు - మలయ పర్వతమందు - గంధమాదనమందు - నందనవనమందు - పుష్పభద్రము పారిభద్రము భద్రకము పుళిందము కళిందము పుండ్రము పిండారకము అంధకము అను స్థలములందు - అతి సుందరమైన ప్రతి వనమందు - సముద్ర తటములందు - అస్తగిరి యొక్క సమీపమందున్న మనోహరమైన మర్రిచెట్టు క్రింద - సతీదేవి శవమును గ్రహించి ఎక్కడెక్కడ దుఃఖించుచు తిరిగెనో ఆయా స్థలములలోను, పశుపక్షులు కూడ విహరించనీ అనేకములైన ఏకాంత ప్రదేశములందు కోరికలెట్లుకట్టునో అట్లు తిరుగువాడై భార్యతో పరమేశ్వరుడు రమించెను. ఎక్కడెక్కడ శవము గ్రహించి తిరిగెనో భూమండలమందలి ఆయాస్థానములను శంకరుడు పార్వతికి చూపి సంతోషముగా విహరించెను.
ఇట్లు చిరకాలము విహారము చేసినను ఆ దంపతుల మనసు నిండలేదు (తృప్తి కలుగలేదు). అప్పుడా జగత్పిత వేయి సంవత్సరముల మహాశృంగారమారంభించెను. మాయాతీతుడు అతిశయించిన మాయకు ప్రభువు ఐన శివుడు మాయకు తగుల్గొని మాయతో (పార్వతి) కూడి సుఖించుచు కాలకర్తయైన ఆ యోగియే కాలము నెరుగకుండెను. శక్తి శక్తిమతులకు (పార్వతీ పరమేశ్వరులకు ఆ విషయములో అలసట ఏర్పడలేదు. పరస్పరము వీడిపోయిన విరహ బాధ వలన ఏర్పడిన సర్వవిధ సంతాపమును ఆ క్రీడ ద్వారా పోగొట్టుకొనుచుండిరి. సుఖమందు లగ్నమైన మనస్పులు గలవారై - శరీరమందు పులకాంకురములతో కూడినవారై - కాముని బాణఘాతములకు మూర్ఛిల్లినవారై - పుష్పశయ్యలయందు శయనించిన వారై - రతిశాస్త్ర విధి తెలిసిన సుఖసంభోగములో మగ్నులై - నఖక్షత దంత క్షతముల చేత గాయపడిన శరీరములు గలవారై చందనము అగురు కస్తూరి సిందూరము బిందువుల యొక్క లేపనము గలవారై బిగించిన వెండ్రుకల కొప్పులూడిపోయి పూలదండలు తెగిపోయి, వస్త్రముల యొక్కయు, కాలి అందెల యొక్కయు, చేతి కంకణములు గాజుల యొక్కయు, చెవి కుండలముల యొక్కయు ధ్వనులతో క్రీడించుచున్నవారై - పుష్పతల్పమును చీల్చుచు తీవ్రమైన బాష్ప (ఆనంద బాష్పములను) మును (చెమట బిందువులను) భరించుచు తీవ్రసక్తి వేడుకల బల తేజస్సులో సమానులై మరల మరల క్రీడించుచుండిరి.
విశ్వమునంతటిని తామే భరించెడి ఆ దంపతుల యొక్క భారము చేత (బరువుచేత) భారము మోసెడి భూదేవి నడిమికి పగిలి పర్వతారణ్య సముద్రములతో బాటు కంపించెను. ఆ దంపతుల. భారము చేత నలిగిపోయిన ఈ భూమి యొ మరియు భూమి యొక్క) భారము చేత భారాక్రాంతుడు (బరువు సంక్రమించినవాడు) ఐన శేషుడును (నాగరాజు) ఆ యందరి బరువుచేత కచ్ఛపము (తాబేలు)ను శ్రేషుబడగా, ఇన్ని భారములతో బాటు తాబేలు యొక్క భారముతో సర్వసృష్టికి ఆధారముగా నున్న ప్రవపానీపపోది సప్తవాయువులు మిక్కిలి క్షోభపొంది స్తంభించిపోయెను. ఇట్లు వాయువులు స్తంభించగా మూడు లోకములందలి జీవులు భయముచేత కలతచెందిరి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరు విష్ణువును శరణుపొంది నారాయణుని పాదపద్మముల వద్ద మొత్తము పరిస్థితిని నివేదించిరి. అప్పుడు భగవంతుడైన నారాయణుడు కమలమందు జన్మించిన బ్రహ్మతో ఇట్లనెను.
నారాయణ ఉవాచ - నారాయణుడనెను :
ఓ బ్రహ్మా! ఇప్పుడాదంపతుల యొక్క శృంగార కేళి భంగమొనర్చవలసిన కాలము కాదు. అట్టిది సమయోచితముగా కాలము కూడి వచ్చినప్పుడొనర్చినచో ఆ కార్యము సిద్ధించును. వేయి సంవత్సరములు నిండిన తరువాత తన యిచ్చననుసరించి శివుడు ఆ కార్యమును విరమించగలడు. అతనికిష్టమైన ఆ సంయోగమును (దంపతుల కలయికను) భేదము చేయుటకు (భంగపరచుటకు) ఎవడు సమర్థుడు? ఏ వ్యక్తి స్త్రీపురుషుల యొక్క రతీని ఉపాయములతో విచ్ఛేదము చేయునో వానికి జన్మజన్మలకు స్త్రీపురుష వియోగము సంభవించును. చివరికపాపి జ్ఞాన భ్రష్టుడై కాలసూత్ర నరకదుఃఖములను లక్ష సంవత్సరములనుభవించి మరల భూలోకమున కీర్తి నశించి దరిద్రుడుగా జన్మించును. మహామునీంద్రుడైన దుర్వాసుడు రంభతో కూడియున్న ఇంద్రుని రతి సుఖమును మానుకొనునట్లు చేసెను. ఆ కారణముగా ఆ మునికి భార్యావియోగము సంభవించెను. అతడు వేయి దేవతా సంవత్సరములు శివుని సేవించి (తపస్సు చేసి) మరియెవంక భార్యను పొంది స్త్రీ విరహ మన్న జ్వరమును త్యజించగలెను. మహర్షియైన గౌతముడు రోహిణీ సహితుడై యున్న చంద్రుని రతి కార్యమును మానునట్లు చేసెను. అట్టి గౌతమునికి భార్యా వియోగము సంభవించెను. ఆ ముని వేయి దివ్య సంవత్సరములు శిపునారాధించి పుష్కర క్షేత్రములో సేవించి తిరిగి అహల్యను పొంది విరహ తాపమును విడిచెను. ఏకాంత ప్రదేశములో పగటివేళ తన భార్యతో కూడియున్న బ్రహ్మాండక పుత్రుని చూచి మునీ (తండ్రి) భార్యను కూడవలసిన కాలము కాదనీ కోపముతో రతినుండి మాన్పించేను. అతనికీ పుత్ర వియోగము సంభవించెను. ఆ ముని శ్రీవునారాధించి ఇంకొక కల్పములో కుమారుని పొంది ఆ దుఃఖమును విడిచెను. హరిశ్చంద్రుడు, ఏకాంత ప్రదేశములో శూద్రస్త్రీతో కూడియున్న ఒక కర్షకుడు రైతు) ఇతనిని చూచి భయపడి చేష్టలుడిగియుండగా ఆ శూద్రునిని స్త్రీ సంయోగము నుండి వారించెను. ఆ పాప ఫలముగా హరిశ్చంద్రుడు సంపదల నుండి రాజ్యము నుండి ధనము నుండి భ్రష్టుడయ్యెను. అతనిని తేలికగా విశ్వామిత్రుడు బాధించెను సుమా.
ఆ హరిశ్చంద్రుడు సర్వసంపదలీయ గల శివుని ఆరాధించి వెంటనే తన గణములతో కూడ నా మందిరమగు వైకుంఠమును పొందెను, ఆజామిలుడన్న బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో కూడుట చూచి కూడ దేవతలు కొందరు భయముతో ఆతని నా కర్మ నుండి వారించకుండిరి.
అతడు. కర్మ భోగము తీరగనే నా నామస్మరణమాత్రము చేత ప్రకృతి బంధముల నుండి విడుదల పొంది నా లోకమునకు వచ్చెను.
ఓ బ్రహ్మా! ఈ సృష్టియంతయు నిషేకము చేత సాధింపబడునదే. నిషేకము బలమైనది. నిషేక ఫలమిచ్చువాడను నేనే. అట్టి నిషేక మేవనీ చేత నివారింపబడగలదు? (నిషేకము - స్త్రీగర్భమందు పురుషుడు తనవీర్యమునుంచుట), ఆ నిషేకము వలన లభించెడి ఫల సమూహము (సంతానము) ని షేకమన్న ఫలమిచ్చినవానిదే అగును. (ఏ స్త్రీ సంతానవతియైనను ఆ సంతానము వీర్యమొసంగిన వానికే చెందును అని భావము), ప్రస్తుతము శంకరుని యొక్క సంభోకకర్మ వేయి దివ్య సంవత్సరములు సాగును. ఆ దివ్య సంవత్సరములు వేయి నిండిన పిదప ఏ కారణముగా అతని తేజస్సు భూమిపై పడునో, ఆ కాలమందు మహేశ్వరుడు సంభోగ విరమణము చేయగలడు (అతని సంకల్పమును బట్టియే. అది అగును తప్ప ఆపబడదు అని భావము), భూమియందు పడిన ఆ శివ వీర్యమందు భక్తులను కష్టముల నుండి ధాటించునట్టి స్కందుడు (కుమారస్వామి) జన్మించగలడు. ఓ దేవతలారా! ఎల్లప్పుడు భద్రస్వరూపుడను నేనుండగా మీకెందుకు భయము? బ్రహ్మా! నీవిప్పుడీంటి కేగుము. మీ.గణములును పోవుదురు గాక. భగవంతుడగు శంకరుడు ఏకాంత ప్రదేశమున పార్వతితో సంభోగము చేయుగాక. అని యిట్లు కమలాపతి పలికి తన మందిరమున కేగెను. దేవతలు తమ తమ గృహములకెగిరి. శివుడు భూకంపాద్యాలటంకములాగిపోవుట వలన స్థిరుడై రతికర్మయందు నిమగ్నుడాయెను.
నారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :
రాధకు ఇట్లు చెప్పి కృష్ణుడు చిరునవ్వు ఓరచూపులు గల ఆమెతో బాటు చందనవనము లోనికి పోయెను. అక్కడ మిక్కిలి ఏకాంతముగా - సుందరముగా - పుష్పోద్యానములు విస్తరించి వాయువుచేత పరిమళవంతముగా చేయబడిన ప్రదేశమందు పుష్ప తల్పములు అంతట విరివిగా నుండి, కోకిలల కూతలతో తుమ్మెదల ఝుంకారముతో కామినులకు మనోహరముగా నున్నచోట స్వామి రాధతో క్రీడించెను. అతని సుఖకరమైన సంభోగముతో రాధ తన్మయురాలై మూర్చిల్లినట్లుండెను. రాధా శరీర స్పర్శతో కృష్ణుడును మీక్కీలి మూర్చిల్లెను. రాధా రాసేశ్వరులక్కడ సంగమించి అట్లే నివసించిరి. రతి కారణముగా మిక్కిలి కదలిక లేనివారైరి. నారదా! ఇంకేమి వినగోరుచున్నావు? ఇట్టి ఈ మంగళకరమైన కర్మను ఎవడు వినునో వానీకి బంధువీయోగ మొన్నటికిని కలుగదు. భార్యాపుత్రుల వియోగముతో మిక్కిలి దుఃఖ సముద్రములో మునిగి యున్న వ్యక్తి ఒక మాసము దీనిని విన్నవ్ నౌ దాసులను నా బంధువులను పొందగలడు అని ధర్మపుత్రుడు (నారాయణ మహర్షి) మాట చాలించెను. సౌరాదుడాసక్తి కలవాడై మరల ప్రశ్నింఫ నారంభించెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంపాదరూపమైన మంగళ వర్ణనమన్న పేరు గల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 46 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Deeply concerned about the profound grief of mother Yashodā and the Gopīs in Vṛndāvana, Lord Kṛshṇa summoned His intimate devotee and counselor Uddhava, dispatching him to Vraja with a message of spiritual solace. Arriving in Vṛndāvana on a golden chariot, Uddhava was surrounded by the grieving Gopīs, who inquired anxiously about Kṛshṇa's well-being while shedding tears of pure separation. Uddhava attempted to impart philosophical wisdom regarding the omnipresence of the Supreme Soul, but the Gopīs gently rebuked him, explaining that their hearts knew only unalloyed love for Kṛshṇa's physical form, leaving Uddhava humbled by the depth of their devotion.