మూ॥ శ్రీనంద ఉవాచ –
శ్రీభగవానువాచ –
నందుడిట్లన్నాడు - ఎవరిని చూస్తే (వేటిని) పుణ్యం, దేన్ని చూస్తే పాపము అదంతా చెప్పండి. ఓ సర్వేశ, నాకు వినటానికి కుతూహలముగా ఉంది, అని (1) భగవంతుడిట్లన్నాడు - మంచి బ్రాహ్మణులు, తీర్థప్రదేశములు, వైష్ణవులు వీరి దర్శనము, దేవతా ప్రతిమల దర్శనము, తీర్థములందు స్నానము నరుడు చేయాలి. (2) భక్తితో సూర్యుని దర్శిస్తే, సతుల (పుణ్యస్త్రీ) దర్శనము చేస్తే, సంన్యాసుల, యతుల, బ్రహ్మచారుల దర్శనము (3) భక్తితో గోవును దర్శిస్తే, వహ్ని, గురువుల దర్శనము, గజేంద్రముల, సింహముల, తెల్లని గుఱ్ఱముల దర్శనము (4) చిలకల, పికముల, కాటుక పిట్టల దర్శనము, హంసల నెమిళుల దర్శనము, చాషముల (పాలపిట్ట), శంఖపక్షుల దర్శనము,(5) పాలిచ్చే (దూడగల) ఆవుల దర్శనము, రావిచెట్టు దర్శనము, భర్త సంతానము గల స్త్రీల దర్శనము తీర్దమునకు వెళ్ళే నరుల దర్శనము (6) దీపములు, బంగారము, మణులు వీని దర్శనము, ముత్యముల, వజ్రముల, మాణిక్యముల దర్శనము, ఓమహాశయ! (7) తులసి, తెల్లని పుష్పములు, వీని దర్శనము పాపనాశకము. పండ్లు, తెల్లని ధాన్యములు, నెయ్యి, పెరుగు, తేనెలు (8) పూర్ణకుంభము, పేలాలు, అద్దము నీరు వీని దర్శనము, ఓ రాజేంద్ర! తెల్లని పూల మాల వీని దర్శనము వల్ల పుణ్యం వస్తుంది, నరునకు (9) గోరోచనము, కర్పూరము, వెండి, సరస్సు, పూచిన పూల ఉద్యానము వీనిని చూచి నరుడు పుణ్యం పొందుతాడు. (10) శుక్లపక్ష చంద్రుని, అమృతాన్ని, చందనమును, కస్తూరిని, కుంకుమను చూచినరుడు పుణ్యమును పొందుతాడు, ఓ నందుడ! (11) పతాకమును అక్షయవట తరువును, లేచిన దేవుని, దేవాలయమును, కోనేరును చూచిన నరుడు పుణ్యమును పొందుతాడు. (12) దేవుని ఆశ్రయించిన వానిని, దేవఘటమును, మంచి వాసనగల గాలిని, శంఖమును, దుందుభిని చూచిన నరుడు వెంటనే పుణ్యమును పొందుతాడు (13). ముత్యపుచిప్ప, పగడము, వెండి, స్పటికము, కుశముల మూలము, గంగమట్టి, కుశలు, రాగి వీనిని చూచి నరుడు పుణ్యమునందుతాడు. (14) శుద్దమైన పురాణ పుస్తకమును, బీజాక్షరములతో కూడిన విష్ణు యంత్రాన్ని నిగనిగలాడే గరిక, అక్షతలు, రత్నము వీనిని చూచి (15) తపస్వుల సిద్ధమంత్రమును, సముద్రమును, నల్లని జింకను, యజ్ఞమును మహోత్సవమును చూచిన (16) గోమూత్రము, గోమయము, పాలు, గోధూళి, కొట్టములోని ఆవు పాదమును, పండిన ధాన్యముగల పొలమును చూచిన (17) అందమైన నల్లని పద్మాన్ని, మర్రి వృక్షసమూహాన్ని మంచి వేషము, మంచి వస్త్రము, దివ్యభూషణములతో అలంకరింపబడిన (18) క్షేమమును కూర్చే వేశ్యను, గంధమును, మంచి దూర్వ, అక్షతలు తండులములను, సిద్ధమైన అన్నమును, పరమాన్నమును, చూచిన నరుడు పుణ్యము పొందును. (19) కార్తిక పూర్ణిమ యందును శుభమైన రాధికా ప్రతిమను, పూజించిన, చూచిన, నమస్కరించిన వాని జన్మపరంపర ఖండనమగును.
హింగుళాక్షేత్రమందు, ఆశ్వయుజ మాస శుక్ల అష్టమి యందు శ్రీదుర్గ ప్రతిమను చూస్తే జన్మఖండనమౌతుంది. (21) శివరాత్రినాడు కాశియందు విశ్వనాథుని దర్శనము చేసి ఉపవాసముండి పూజచేస్తే (22) జన్మాష్టమి దినమందు, భక్తుడు, "బిందుమాధవుడనైన నన్ను చూచి నమస్కరించి పూజచేస్తే (23) పుష్యమాసం శుక్లపక్షం రాత్రియందు ఏఏ స్థలమందైనా నరుడు పద్మావతి ప్రతిమను చూస్తే (24) ఏడు జన్మల వరకు ఆతనికి పుత్రులు, పౌత్రులు కల్గుతారు. ఆతడు ధనేశ్వరుడౌతాడు. ఏకాదశి ఉపవాస ముండి, ద్వాదశి దినమందు ప్రభాతకాలమందు స్నానం చేసి, కాశిలో అన్నపూర్ణను చూస్తే (25) చైత్రమాసంలో, చతుర్దశినాడు పుణ్యమునిచ్చే కామరూప దేశమందు భద్రకాలిని చూచి నమస్కరిస్తే (26) శ్రీరామ నవమి దినమందు ఆయోధ్య యందు రాముని చూచి, నమస్కరించి, పూజిస్తే (27) ఉపవసించి పుష్కరతీర్థమందు స్నానంచేసి, లేదా బదరికాశ్రమంలో కాని స్నానం చేసి నన్నొక్కణ్ణి చూచి పూజించినట్లైతే (28) విష్ణుపదమందు పిండముంచి (పితరులకు) విష్ణువును పూజిస్తే, పితరులకు, తనకు జన్మఖండనమౌతుంది. (29) ప్రయాగ యందు క్షౌరం (ముండనము) చేయించుకొని, దానం చేస్తే, నైమిషారణ్యంలో ఉపవసిస్తే (30) బదరిలో సిద్ధిని పొంది (చేసి) బదరికాశ్రమంలో భుజిస్తే, నాప్రతిమను చూస్తే, ఓ నంద! (31) పుణ్యమైన బృందావనమందు, ఊయలలూగే గోవిందుడనైన నన్ను చూచి, నమస్కరించి, పూజిస్తే (32) భద్ర (తిథి, కరణము) యందు, మంచె మీదున్న మధుసూదనుడనైన నన్ను చూచి భక్తుడు నమస్కరించి పూజిస్తే (33) కలిలో నరుడు రథమందున్న జగన్నాథునిచూచి, భక్తితో నమస్కరించి పూజిస్తే (34) ఉత్తరాయణ సంక్రమణ మందు ప్రయాగలో స్నానం చేసి, నన్ను నమస్కరించి పూజిస్తే, (35) కార్తిక పౌర్ణమాసియందు శుభమైన నా ప్రతిమను చూసి ఉపవసించి, పూజిస్తే (36) చంద్రభాగ సమీపంలో మాఘమాసంలో నన్ను నమస్కరిస్తే, బుద్ధిమంతుడు రాధతో పాటు ఉన్న నన్ను చూస్తే (37) సేతుబంధమందు రామేశ్వరుని ఆషాఢ పూర్ణిమ రోజున చూచి, పూజించి, ఉపవాసముంటే, వాని జన్మఖండన మౌతుంది (పునర్జన్మలేదు) అని (38) స్వర్గంలో విద్యాధరులు రాత్రిపూట మాటిమాటికి నాట్యమాడుతారు. ఆ ఈశుని నమస్కరించుటకు విభీషణుడు వస్తాడు. (39) రాత్రియందు కిన్నరులు గానం చేస్తారు. గంధర్వులు కూడా మనోహరంగా గానం చేస్తారు. ఆ ఈశుని నమస్కరించుటకు మాధవుడు వస్తాడు.
సాక్షాత్తుగా వసంతుని సర్వేశుని చంద్రశేఖరుని చూచిన చివర జీవన్ముక్తుడౌతాడు. హరి మందిరమునకు వెళ్తాడు. (41) దిన నాథుడైన (దీన) దిననాథుని కోణార్కమందు ఉత్తరాయణ మందు చూచి, ఉపవసించి, పూజిస్తే ఆతని జన్మనాశమౌతుంది. (42) వ్యవసాయపు గది, మంచి నివాసము (వస్త్రము) ఊర పిచ్చుక, పర్వతము, విస్పందకము (కదలిక), రాజకోష్ఠము, కత్తి (నందకము), పుష్పములు గల దేవదారు వృక్షం వీనియందు (43) పార్వతీ ప్రతిమను చూచి, కార్తికేయుని గణేశ్వరుని, నందిని, శంకరుని చూచిన జన్మసాఫల్యమౌతుంది. (44) ఉపవసించి పూజించి, చూచి, స్తుతించి, వారికి నమస్కరించి, పారణకై పెరుగును తిన్న జన్మఫలము లభిస్తుంది. (45) త్రికూటమందు, మణిభద్రమందు, పడమటి సముద్రం సమీపమందు ఉపవసించి, దధిపారణ చేసి, నన్ను దర్శిస్తే ముక్తినందుతారు. (46) నా ప్రతిమలందు, పార్వతీ ప్రతిమలందు, జీవం పోసి, పూజిస్తే జన్మల నాశనమౌతుంది. (47) శివుని, దుర్గ యొక్క ఆలయం ఏర్పరచి ప్రత్యేకముగా నా ఆలయం నిర్మించి శివస్థాపన చేసిన జన్మనాశనమౌతుంది. (48) పుష్పోద్యానము, శివుడు, సేతువు, పుష్కరిణి, సరోవరము, విప్రుని సంస్థాపనము (ఇల్లు వగైరా ఇచ్చి ఉంచటం) ఇవి చేసిన జన్మ సఫలమౌతుంది. (49) వేదములు పురాణములు గొప్పకాదు. బ్రహ్మస్థాపనమే ఫలము. సజ్జనులు, మునులు, దేవతలు ఎరుగుదురు విప్రాదులు ఓ తండ్రి! అని (50) భూమి ధూళి రేణువులు లెక్కించవచ్చు. వర్ష బిందువులు లెక్కించవచ్చుకాని బ్రాహ్మణుని నిలపటం వలన (ఉంచటం) వచ్చే ఫలితాన్ని బ్రహ్మకూడా లెక్కించలేడు. (51) బ్రాహ్మణునకు బ్రతుకు తెరువు కల్పించిన నరుడు జీవన్ముక్తుడౌతాడు. చలించని సంపదను పొందుతాడు. ఆపై ముక్తి చతుష్టయాన్ని పొందుతాడు. (52) నాదాస్య భక్తిని పొందుతాడు. వైకుంఠంలో చిరకాలం ఆనందిస్తాడు. పరమాత్మనైన నాకు పతనంలేనట్లే వానికి పాతము కలుగదు. (53) ఎనిమిది సంవత్సరాల కుమారిని బ్రాహ్మణునకిచ్చిన వాడు (వివాహంగా) సర్వాభణములతో, పూజించి ఇస్తే దుర్గాదేవి దానఫలము లభిస్తుంది. (54) స్వర్గాన్నంతా చూచి (స్వర్గంలో నిది), బ్రహ్మలోకంలో పూజింపబడి, నాదాస్యమును పొంది, వైకుంఠమందు చిరకాలము ఆనందిస్తాడు. (55) వివాహాన్ని చూస్తే కోటిస్వర్ణముల దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఇక్కడ నిశ్చలమైన శ్రీని పొందుతాడు. అంతమందు స్వర్గమునకు వెళ్ళుతాడు (56) మంచి బ్రాహ్మణుని, అనాథుణ్ణి, దరిద్రుణ్ణి, మంచి పండితుని చూచి వానికి వివాహం చేస్తేవాడు మోక్షాన్నందుతాడు, నిశ్చయము. (57) శస్త్రము, పాదుకలు, శాలగ్రామము స్త్రీ వీరిని మంచి రోజున భక్తితో దానం చేస్తే భూదాన ఫలము కల్గుతుంది. (58) గజదానం చేస్తే దాని వెంట్రుకల పరిమితం కల సంవత్సరాలు ఆనందిస్తాడు అని శ్రుతిలో చెప్పారు. గజేంద్రుని దానం (శ్రేష్ఠగజం) చేస్తే, నాల్గింతలుగా నామందిరమందు ఆనందిస్తాడు. (59) గజదానంలో సగం సంఖ్యగా తెల్ల గుర్రముల దానం, దానిలో సగము ఇతరమైనవి, దానం చేస్తే, ఓతండ్రి! ఏనుగులతో సమంగా నల్లని ఆవుల దానం చేస్తే ఆ ఫలితాన్ని పొందుతాడు.
అను।ధేనుదానం చేస్తే అంతేఫలము, సామాన్య గోవును దానం చేస్తే సగము ఫలము. దూడను ఈనిన గోవులను దానం చేస్తే చేస్తే (ప్రతిదానములోను) అంత ఫలమును పొందుతాడు, ఓ విభు! (61) భూదానం చేస్తే భూరేణువుల సంవత్సరముల కాలపర్యంతము నేనుండుచోట స్థానాన్ని పొందుతాడు. జ్ఞాన దానం చేస్తే చాలా పుణ్యము వైకుంఠమందు చాలా కాలము ఆనందిస్తాడు. (62) బంగారం దానం చేస్తే శ్రీనిపొందుతాడు వెండి దానం చేస్తే రాజపదవి నందుతాడు. అన్నదానం వల్ల కలిగే ఫలము, నేను వినలేదు కనుకనాకు తెలియదు. (63) బ్రాహ్మణులకు భోజనం పెడితే అన్నిదానముల ఫలితము లభిస్తుంది. అన్నదానమును మించిన దానము ఇదివరలో లేదు. భవిష్యత్తులో రాదు. (64) ఇక్కడ యోగ్యతను పరీక్షించరాదు. కాలనియమములేదు. అన్నదానంలో ఇచ్చే వాడికి శుభమౌతుంది, పుణ్యం లభిస్తుంది. తిన్నవానికి పాతకములు లేవు. (65) అన్నదానము ధన్యమైనది. భూమిలో వైకుంఠానికి కారణము విప్రునకు, దరిద్రునకు, కుటుంబీకునకు వస్త్రదానం చేస్తే (66) వస్త్రంలో దారముల సంఖ్యగల సంవత్సరాలు వైకుంఠము నందు చాలా కాలము ఆనందిస్తాడు. రమ్యమైన చంద్రలోకమందు, అట్లాగే వరుణలోకమందును ఆనందిస్తాడు. (67) బంగారువత్తి గలిగిన లోహదీపమునుచేసి, ఘృతదీపమును పరమాత్మకు హరికి దానం చేస్తే (ఇస్తే) (68) ఇంట్లో అంధకారముండదు. యమదూతను, యముణ్ణి చూడడు. దానం చేసినవాడు నామందిరానికి వస్తాడు (69) బ్రాహ్మణునకు ఇచ్చి యమయాతనను పొందడు. దేవతల వేయి సంవత్సరాల కాలము ఇంద్రమందిరమందు ఆనందిస్తాడు. (70) వస్తు ప్రమాణమునకు తగినంతగా స్వర్గమందు ఆసనమును, (స్థానమును) పొందుతాడు. ఉత్తమమైన దానికి లక్ష సంవత్సరాలు. ఇతరమైతే అందులో సగము కాలము పొందుతాడు. (71) తాంబూలదానం వల్ల భోగాన్ని పొందుతాడు. స్వర్గంలో నూరు సంవత్సరాలుంటాడు. మాల్యదానం వల్ల ప్రియమైన స్వర్గము, వస్తు పాత్రలకు తగిన విధంగా లభిస్తుంది. (72) ఫలదానం వల్ల ఫలము స్వర్గములభిస్తుంది అనుమానం లేదు. సామాన్య శయ్యాదానం వల్ల నూరు సంవత్సరాలు స్వర్గం లభిస్తుంది. (73) ప్రకృష్టులకు (శ్రేష్ఠులకు) నాల్గింతలు, విలక్షణులకు లక్షరెట్లు ఫలము. అనాథుడైన మంచివిప్రునకు గృహదానం చేస్తే (74) ఇక్కడే చెప్పుకోదగినన్ని సంవత్సరాలు, ఇంద్రలోకమందును వెలుగొందుతాడు. ఆకలి గొన్న బ్రాహ్మణునకు అన్నదానం చేస్తే పుత్రపౌత్రులగు వృద్ధి పొందించే, కదలనంత శ్రీనిపొందుతాడు. (75) ఓ ప్రజనాధ! ప్రజమునకు వెళ్ళి ప్రజభూమిలో ఉండు ఇప్పుడే వెళ్ళు విప్రులందరికి భోజనం పెట్టు, వెళ్ళు అంతా వెళ్ళండి. ప్రతివ్రజమందు (76) ప్రతిగోకులమందు ఓ వత్స! ఉండు. ఓవత్స! ఆకులం లేని చోట ఉండు. వ్యాకులమైన గోకులము యొక్క సంకులమైన ప్రతివ్రజమందు నిరాకులంగా ఉన్న చోట ఉండు. (77) ఓ నంద! దీన్ని నీకు చెప్పాను. ఆనందంగా చెప్పాను. పుణ్యమును పెంపొందించేది. నీచంగా మాట్లాడకపోతే సుస్వప్నాన్ని కల్గించేది పుణ్యమైనది. (78) మాంసమును, (అమ్మే, తినే వగైరా) ద్వేషింపతగినవానిని, నీచుని, శత్రువును, అజ్ఞానిని, స్త్రీని వీరిని రాత్రియందు, పగటిపూట (ఎప్పుడూ) వదిలి ఉండేవానిని అలాంటి విప్రుని మంచిపండితుడు అని అంటారు. (79) దేవాలయంలో దేవుని, అశ్వత్థాము (రావి), తులసి, మర్రి వీనిని నాటిన యెడల రెట్టింపు పుణ్యాన్ని పొందుతారు. నలుగురికి చెబితే ఈ పుణ్యం. ఎవ్వరికి ప్రకటించుకోకపోతే నాల్గింతలు పుణ్యము. (80) మంచి కలగంటే బుద్ధిమంతుడు గంగాస్నాన ఫలాన్ని పొందుతాడు. వాడు అర్థమును (కోరికలు) విత్తమును, భార్యను, భూమిని, పుత్రుని పొందుతాడు. (81) మోక్షమును, పరమ ఐశ్వర్యమును, అన్ని కోరికలను పొందుతాడు. ఓ తండ్రి! ఇట్లా చెప్పాను. ఇంకా ఏమి వినదలచావో చెప్పు అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు, నారాయణ నారద సంవాద మందు డెబ్బది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 76 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
To illustrate how spiritual pride destroys merit, Maharshi Nārada recounted the historical episode of Maharshi Durvāsas testing the assembly of Devas. When the celestial deities grew arrogant over their heavenly power, Durvāsas appeared in their court and demonstrated how easily their pride could be shattered by a single glance of a pure devotee. The narrative serves as a stern warning that no amount of heavenly wealth or ascetic austerity can protect a soul from spiritual downfall if pride and disrespect toward holy ascetics enter the heart.