మూ ॥ నారాయణ ఉవాచ:
కంస ఉవాచ:
నారాయణుడిట్లన్నాడు :
ఇక కంసుడు ఆలోచించి, దుఃస్వప్నాన్ని చూచి చాలా కలతచెంది, చాలా భయపడి, నిరాహారుడై, ఉత్సుకత లేనివాడై (1) పుత్రులు, మిత్రులు, బంధుగణము, బాంధవులు, పురోహితుడు వీరందరిని పిలిచి,చాలా దుఃఖితుడై సభమధ్యలో వారితో ఇట్లన్నాడు. (2) కంసుని మాట ఇట్లా - నేను,రాత్రి చూచిన దుఃస్వప్నము చాలాభయం కల్గిస్తోంది. బుధులార! బంధవులార! పురోహితులార! అంతా వినండి (చూడండి). (3) ఆమె (ఒక స్త్రీ) రక్త పుష్పముల (ఎర్రని) మాలను ధరించి రక్త చందనము, రక్త వస్త్రము, తీక్షమైన ఖడ్గము, భయంకరమైన కర్పరము (తలపుర్రె) కలిగి ఉంది. (4) స్వభావంగా, పెద్ద పెద్దగా నవ్వుతూ, నాలిక కదిలిస్తూ, మహాభయంకరంగా ఉంది. చాలా ముసలిది, నల్లని శరీరంగలది. నానగరంలో నాట్యమాడుతోంది. (5) వెంట్రుకలు విరబోసుకొని, ముక్కుకోయబడి, నల్లని బట్టలంటే ఇష్టపడుతూ, నల్లగా ఉంది. అది విధవ, మహాశూద్ర స్త్రీ. నన్ను కౌగిలించుకోవాలని ఇష్టపడుతోందీ. (మహాశూద్ర= ఉన్నత స్థానంలో (పదవి) ఉన్న శూద్ర స్త్రీ) (6) మలినమైన వస్త్రపుతునుకను ధరించింది కరుకైన, తల వెంట్రుకలు కలిగి ఉంది. సున్నపుబొట్టు (తిలకము) ను నా చెంపలందు, వక్షమందు పెడ్తోంది. తాను ధరించింది) (7) ఓ సత్యక నల్లని, ఛిన్నభిన్నములైన పక్వ పదార్థములు (ఛిన్నజవిరగొట్టటం, భిన్న-చీలిపోవడం, తనంత) శబ్దం చేస్తూ, ఎప్పుడూ పడున్నాయి. తాటిపండ్లూ పడ్తున్నాయి. (8) కుత్సితమైన వస్త్రం (బాగాలేని) వికృత ఆకారం, కరుకైన వెంట్రుకలు కలిగి మ్లేచ్ఛుడు (గోమాంస భక్షకుడు, ఆచార వర్జితుడు, అవ్యక్తంగా భాషణ కలవాడు, పాపి) నాకు అలంకరణ కొరకు చిన్న భిన్నమైన జడలను (వెంట్రుకలను) ఇస్తున్నాడు. (9)బాగా కోపం గలిగిన దేవతాస్త్రీ, పతిపుత్రులు కలది, సతి (పతివ్రత) మాటి మాటికి శపించి, పూర్ణకుంభమును పగులగొట్టింది. (10) వాడని, విరిసిన పూలమాలను,రక్తచందనంతో పూయబడిన దానిని, మహారుష్టుడై (రోషం), అతిగా శపించి, విప్రుడు నాకిస్తున్నాడు. (11) క్షణకాలం నిప్పుల వర్షం, క్షణక్షణము బూడిదవాన, క్షణము, క్షణము రక్తపువాన, నా నగరంలో ఔతోంది. (12) కోతి, కాకి, కుక్క, ఎలుగుబంటు, పంది, గాడిద వీటిని వికృతరూపంలో చూచాను. అతిగా అరుస్తున్నవానిని చూచాను. (13) ఎండిన కట్టెల రాశిని చూచాను. వాడని (మలినంకాని) కాటుకను చూచాను. అరుణోదయ సమయమందు, కత్తిరించబడిన గోళ్ళుగల కోతులను చూచాను. (14) పీత (పచ్చని) బట్టను ధరించి, తెల్లని చందనం పూసుకొని, మాలతిమాలను ధరించి, రత్నాలంకారములతో అలంకరించుకొని, (15) చేతిలో విలాసంగా కమలంధరించి సింధూర బిందువుతో శోభిస్తూ, ఆమె (ఒకప్రీ) నన్ను శపించి, కోపంతో ఆపతివ్రత నా మందిరం నుండి వెళ్ళిపోతోంది.
పనులు చేతపాశములను (తాళ్ళు) ధరించి, వెంట్రుకలు విరయబోసుకుని, భయంకరంగా, మిక్కిలికఠినంగా ఉన్నపురుషులను, నానగరంలోకి ప్రవేశిస్తుండగా చూచాను. (17) ఒక స్త్రీని నగ్నంగా, వెంట్రుకలు విరియబోసుకుని, ప్రతి ఇంట్లో నాట్యం చేస్తూ, మహా వికృతాకారంగా ఉన్నదానిని ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతున్న దానిని చూచాను. (18) ఒక స్త్రీ ముక్కు కోయబడినది, విధవ, మహాశూద్రి, దిగంబర, అతి భయంకరంగా ఉన్న ఆమె నాకు తైలాభ్యంగనం చేయబోతోంది. (19) శ్మశానం నిప్పులను కలిగిన, భస్మం ఒంటినిండా కలిగిన, దిగంబరులను, నవ్వుతున్న వాళ్ళను, రకరకాలుగా , మిక్కిలి ప్రభాతసమయంలో (దగ్గర) చూచాను. (20) నృత్యగీతములతో మనోహరమైన వివాహాన్ని చూచాను. రక్త వస్త్రములు ధరించారు, తలవెంట్రుకలు కూడా ఎర్రగా ఉన్న పురుషులను చూచాను. (21) రక్తమును కక్కుతున్న పురుషుని, నగ్నంగా, అతిగా నృత్యం చేస్తున్న పురుషుని, పరుగెత్తుతున్న, నిద్రిస్తున్న వారిని, ఐనా ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతున్న వారిని చూచాను. (22) ఆకాశంలో సూర్యచంద్రుల మండలములు రాహుగ్రస్తమైనట్టుచూచాను. ఓ బంధువులార! ఒకే కాలంలో మొత్తం మింగబడ్డట్టుగాచూచాను. (23) తోకచుక్క ఉల్కాపాతము కొరివి (మంట లేని కట్టె నిప్పు) భూకంపము, రాష్ట్ర విప్లవము, సుడిగాలి, మహోత్పాతము (అపశకునములు) వీటిని చూచాను. ఓ పురోహిత! (24) స్కంధములు ఛిన్నమై (బోదెలు) , గాలిలో (తో) తిరుగుతున్న చెట్లను, ఈభూమిపై పడిపోతున్న పర్వతాలను చూచాను (25) తలలేకుండా నగ్నంగా, పొడవుగా ఉండి, నాట్యం చేస్తున్న పురుషుని, చేతిలో ముండమాలకలవానిని ఘోరమైన వానిని, ప్రతిఇంట్లో (నాట్యంచేస్తూ) ఉన్నవానిని చూచాను. (ముండమాల= బోడి తలలమాలచేతిలో). (26) అన్నిఆశ్రమములు దగ్దమైనాయి. భస్మంతో నిండి ఉన్నాయి. నిప్పులతో కూడి ఉన్నాయి. అందరిని అంతా హాహాకారలు చేస్తున్న వారిని చూచాను.(27) అని ఈ విధంగా పలికి ఆ రాజసభాతలంలో విరమించాడు (చెప్పటం ఆపాడు). ఆ స్వప్నమును విని, బాంధవులు కూడా అతనితో ఏమీ మాట్లాడకుండా, నిశ్వాసము విడిచారు. (28) పురోహితుడైన సత్యకుడు, యజమానుడైన కంసుని వినాశము (తప్పదని) తలచి, వెంటనే చైతన్యం కోల్పోయాడు, ఓ నారద! (29) తండ్రి, తల్లి స్త్రీ సమూహము దుఃఖముతో ఏడ్చారు. వినాశకాలము స్వయంగా వెంటనే వచ్చినట్టుగా అనుకున్నారు. (30) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణనారద సంవాదమందు కంసుని దుఃస్వప్న కథన మనునది అరువది మూడవ అధ్యాయము.
Summary of chapter 63 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Decades after the Mahābhārata war, ominous portents appeared in Dvārakā, signaling the imminent conclusion of the Lord's earthly pastimes in accordance with the sages' curse. Seeking to avert mutual bloodshed, Lord Kṛshṇa led the Yādava clan on a pilgrimage to the holy coastal shores of Prabhāsa Kshetra. There, the Yādavas drank intoxicating liquor, fell into drunken brawls, and began fighting each other with the iron maces that had been forged from Samba's iron pestle, destroying almost the entire Yādava clan in a night of tragic fratricidal warfare.