మూ॥శ్రీనారాయణ ఉవాచ:
శ్రీభగవానువాచ
శ్రీనారాయణుడిట్లన్నాడు :ఈకృష్ణుడు, పరమానందుడు. పరిపూర్ణతముడు, ప్రభువు, పరమాత్మ, పరముడు, భక్తుల ననుగ్రహించేవాడు. (1) భూమి బరువును తగ్గించుటలో నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి పరుడు,పరాత్పరుడు, భగవంతుడు. బ్రహ్మ, ఈశ, శేషులచే నమస్కరింపబడేవాడు. (2) నందుని స్తోత్రాన్ని విని ఆనందించి ఆతనితో జగత్పతి ఇట్లన్నాడు. గోకులం నుండి వస్తున్నవాడు, విరహజ్వరంతో చలించినవాడు నందుడు (3) భగవంతుని వచనమిట్లా - ఓనంద! నంద వ్రజమునకు వెళ్ళు. శోకాన్ని విడిచి పెట్టు. భూమి పై భ్రమను వదులుకో. సత్యమైన పరమైన, శోకబంధాన్ని తొలగించే జ్ఞానాన్ని విను (4) వాయువు భూమి ఆకాశము జలము తేజస్సు ఇవి అసలు పుట్టేవి (ఉండేవి) అని చెప్పబడ్డాయి. ఈ శృతిగణములతో పంచభూతములతో ఎల్లప్పుడు సృష్టిస్థితి. (5) ఓ తండ్రి! అందరు ప్రాణుల దేహము పాంచభౌతికము. మిథ్యాభ్రమకలది కృత్రిమమైనది. స్వప్నము వలె మాయగలది. (6) పంచభూతములు ఎల్లప్పుడు ప్రాణులన్నింటి దేహాన్ని స్వీకరిస్తాయి. ఆ పేరు మాయకు సంకేతరూపము, భ్రమాత్మకము (7) ఎవడు ఎవనికి కొడుకు, ఓ తండ్రి, ఎవతే ఎవనికి భార్య, ఎవడు భర్త. కర్మవల్ల ఎల్లప్పుడు తిరుగుతుంటారు. అన్ని ప్రాణులు అనేక జన్మలలో తిరుగుతారు. (8) ప్రాణికర్మవల్ల జన్మిస్తుంది. కర్మవల్లనే నశిస్తుంది. సుఖము, దుఃఖము, భయము, శోకము. ఇవన్నీ కర్మవల్లనే ఏర్పడతాయి. (9) కొందరికి సృష్టికాలంలో జన్మ. కొందరికి బ్రహ్మ గృహమందు జన్మ కొందరికి విప్రగృహమందు, కొందరికి క్షత్ర గృహమందు, కొందరికి వైశ్య, కొందరికి శూద్ర గృహమందు జన్మ, (10) కొందరికి అతినీచమైన ప్రాణులలో జన్మ. కొందరికి పురుగులుగా, కొందరికి మలమందు జన్మ, కొందరికి పశుపక్షులలో జన్మ, కొందరికి క్షుద్ర జంతువులందు జన్మ. (11) ఓ తండ్రి! అందరు తమ తమ కర్మతో మరల మరల పుట్టుక చావులతో తిరుగుతూనే ఉంటారు. నా భక్తుడు, నాకు ప్రియమైన వాడు, ఎల్లప్పుడు కర్మను నిర్మూలం చేస్తాడు.
నంద ఉవాచ –
అను ॥ త్రేత,ద్వాపర, కలియుగములు సత్యయుగము (కృత) అని నాలుగు యుగాలు. ఇరవై ఐదువేల యుగముల చివరమనువు మరణిస్తాడు. (13) మనువులతో సమానంగా మ హేంద్రుని యొక్క పరమాయువు ఏర్పరచబడింది. పదునాలుగురు ఇంద్రులు నశిస్తే బ్రహ్మకొకదినము. (14) ఇంతే కాలము రాత్రి సమయముఅని కాలవిదులు ఏర్పరచారు. ఇంతే సమయము మాసములు, సంవత్సరాలు అని నిశ్చయించారు. (15) బ్రహ్మకు నూరు సంవత్సరాలు పరమాయువు అని చెప్పారు. బ్రహ్మమరణిస్తే, నాకు ఈ కాలమంతా రెప్పపాటు కాలము. (16) బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అంతా విశ్వమందు ఏర్పరుపబడింది. ఇది నిజము, నేను పరమాత్మను, భక్తుల ననుగ్రహించే కొరకు రూపమెత్తాను. (17) నామంత్రము నుపాసించువాడు నిజముగా ఈభూమి పై శరీరమును వదిలి, పురాతన కర్మను వదిలి పెట్టి గోలోకానికి వెళ్తాడు. (18) అసంఖ్యాకులైన బ్రహ్మలు పడిపోయినా ఆతడు పడిపోడు (గోలోకం నుండి). జన్మమృత్యుజర వీటిని తొలగించే ,నిత్యమైన తనదేహమును స్వీకరిస్తాడు. (19) ఓ నంద! నా భక్తులకు అశుభము ఎక్కడా లేదు.ఎల్లప్పుడు వారిని అంతటా, అన్ని విధముల సుదర్శనము రక్షిస్తుంది. (20) నాకన్నా భక్తుడు బలవంతుడుగా చెపబడ్డాడు. నేను కాదు. నేను ఆతనికే స్వామిని. నాకు స్వామి, తండ్రి, కొడుకులు ఎవరూ లేరు. (21) పుత్రబుద్దిని వదిలి నన్ను, బ్రహ్మ స్వరూపునిగా సేవించు అందువలన బ్రహ్మ బేడిని (ప్రతిబంధకం) ఛేదించుకొని, స్వయంగా గోలోకానికి వెళ్ళు (22) యశోదకు, గోపికలకు, గోపగణమునకు చెప్పు, వెళ్ళు. వాళ్ళందరితో కలిసి శోకమును వదలు, మందిరమునకు వెళ్ళు (23) అని ఇట్లా పలికి భగవంతుడు సభలో విరమించాడు. నందుడు ఆనందంతో పొంగిపోయి తిరిగి ఇట్లా అ, నందనందునుని అడిగాడు (24) నందుని వచనము -సాంసారిక జ్ఞానమేదో చెప్పు, దేనివల్ల నీ స్థానాన్ని పొందుతానో చెప్పు. నేనుమూడు. ఓ పరమానంద స్వరూప! నీవు వేదములకు తండ్రి.. (25) నందుని మాటను విని సర్వజ్ఞుడు, భగవంతుడు స్వయంగా, శృతులలో చెప్పబడని (వినబడని) ఆహ్నికమును గూర్చి చెప్పసాగాడు (26) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు భగవంతుని నందుని సంవాదమందు డెబ్బది నాల్గవ అధ్యాయము. (74)
Summary of chapter 74 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Unveiling the confidential glory of the divine feminine, Maharshi Nārada revealed the transcendent stotra and holy names of Goddess Śrī Rādhā. He explained that the name Rādhā is derived from the power to bestow supreme devotion, where the syllable Rā bestows spiritual perfection and Dhā leads the soul directly to the lotus feet of Śrī Kṛshṇa. Chanting Her divine name with tears of love pleases Lord Śrī Kṛshṇa more than thousands of Vedic sacrifices, as She is the soul of His soul and the living personification of His supreme pleasure potency.