మూII శ్రీనారాయణ ఉవాచ:
అను ॥ శ్రీ నారాయణుడిట్లన్నాడు !
అక్రూరుడు, తన శరణు పొంది, కంసునితో పంపబడ్డాక, ఉత్తమమైన మధురమైన భోజనమును భుజించి పడకయందు పడుకున్నాడు (1) వాసనగలనీటిని తాగి కర్పూరము గలిగిన తాంబూలము భుజించాడు. సుఖభోగం కలగగానే సుఖంగా నిద్రపోయాడు. (2) పురాణములు శ్రుతులలో చెప్పినట్టు ఆపిదప మంచికలగన్నాడు. వాద్యాదులన్ని లేనప్పుడు నిశియొక్క చివరిసమయంలో కలగన్నాడు (3) రోగం లేని వాడు వెంట్రుకలు ముడుచుకొన్నవాడు, రెండు వస్త్ర ములుగలవాడు, మంచిపడక పై పడుకొన్నవాడు, నిగనిగలాడుతున్నవాడు, చింతశోకములు లేనివాడు (4) కిశోర (చిన్న) వయస్సు వాడు, శ్యామలశరీరంవాడు, రెండుచేతులవాడు, మురళి ధరించినవాడు, పీతవస్త్రమును కట్టుకున్నవాడు, వనమాలతో అలంకరింపబడ్డవాడు (5) ఒంటినిండా చందనం పూసుకున్నవాడు, మాలతి మాలతో శోభిస్తున్నవాడు, ధరించతగిన మంచిరత్నములతో మణుల భూషణములతో అలంకరింపబడ్డవాడు, (6) తలలో నెమలి ఫింఛమువాడు, చిరునవ్వుగలవాడు, పద్మలోచనుడు, ఇలాంటి విధంగా ఉన్న బ్రాహ్మణ శిశువును మొదట కలలో చూచాడు, ఓముని! (7) ఆపిదప అందమైన, పతిపుత్రులుగల సతిని చూచాడు. ఆమె పీతవస్త్రాన్ని కట్టుకుంది. రత్నభూషణములు అలంకరించుకొంది. (8) వెలుగుతున్న దీపం ఆమెచేతిలో ఉంది. చేతిలో తెల్లని ధాన్యముంది, శ్రేష్ఠురాలు. శరత్కాలమందలి చంద్రునిలాంటి ముఖం గలది, నవ్వుతోంది, వరమిచ్చేది శుభమైనది. (9) ఆ పిదప, శుభ ఆశీస్సులనిస్తున్న విప్రుని చూచాడు. శ్వేతపద్మమును, రాజహంసమును, గుర్రమును, సరోవరమును (10) చిత్రించిన, బాగాపండిన, పుష్పించిన, శుభమైన మామిడి, వేప, కొబ్బరి పెద్ద జిల్లేడు, అరటి, ఈచెట్లను చూచాడు. (11) పర్వతమందున్న వృక్షమందున్న ఏనుగు పై ఉన్న గుర్రము పై ఉన్న తడియందున్న (ఓడ, లేదా మబ్బు) తనను కరుస్తున్న తెల్లని సర్పాన్ని చూచాడు. (12) తాను వీణవాయిస్తున్నట్టుగా, పాయసం తిన్నట్టుగా, తామరాకులో ఉన్న తన కిష్టమైన పెరుగు, పాలతో కూడిన అన్నం తిన్నట్టుగా కలగన్నాడు. (13) అప్పుడే శరీరం నిండా పురుగులు, మలము ఉన్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, మోహంపొందినట్టుగా, మళ్ళీ తెల్లని ధాన్యము, పుష్పము చేత ధరించినట్టు, క్షణకాలము చందనం అంతటా పూసుకున్నట్టు (14) మేడలో ఉన్నట్లు సముద్రంలో ఉన్నట్లు, తాను ఎర్రగా ఉన్నట్లుగా, తాను ఛిన్నము, భిన్నముఐనట్లు, శరీరం నిండా గాయాలైనట్లుగా, మేద (శరీరంలో ఉండేది) పూయములు కలిగి ఉన్నట్టుగా కలగన్నాడు. (15) పిదప వెండిని, మణిని చక్కని బంగారాన్ని ముత్యములు, మాణిక్యములు రత్నములు, శుభమైన పూర్ణకుంభ జలమును చూచాడు.
అను! లేగదూడతో కూడినకామధేనువును, వృషభేంద్రమును, నెమలిపిల్లను,చిలుకను, బెగ్గురు పక్షిని, హంసను, చీపరపిట్టను, కాటుకపిట్టను, (17) తాంబూలమును, పుష్పమాలలను, మండుతున్న అగ్నిని, దేవపూజను, పార్వతిప్రతిమ, కృష్ణప్రతిమ, శివలింగము, (18) విప్రబాలిక, బాలికను, బాగా పండిన ఫలించిన పంటను, దేవస్థలమును, రాజశ్రేష్ఠుణ్ణి, సింహాన్ని, వ్యాఘాన్ని గురువును, సురను, (19) వీటన్నిటిని కలలో చూచి, వెంటనే లేచాడు. ఇష్టమైన దివసంలో చేసే (విధి) కార్యాలను (ఆహ్నికం) నిర్వర్తించాడు. ఈ విషయమంతా ఉద్ధవునకు చెప్పాడు. (20) ఉద్దవుని ఆజ్ఞను తీసుకొని, గురువుల దేవతల పూజచేసి, నస్సులో శ్రీకృష్ణుని ధ్యానించి, యాత్ర చేశాడు, ఓ నారద! (21) మార్గంలో మంగళమునకు తగిన, శుభప్రదమైన కోరిన ఫలితాన్ని ఇచ్చే, రమ్యమైన ముందు శుభసూచకమైన వానిని ఇట్లా చూచాడు. (22) ఎడమ భాగంలో ఆడ,మగ నక్కలను, పూర్ణకుంభమును, ముంగిసను, పాలపిట్టను (చాషకం), పతిపుత్రులుగల సాధ్విని దివ్య ఆభరణములు అలంకరించుకున్నదాన్ని , (23) తెల్లని పూవును, మాలను, ధాన్యమును, కాటుకపిట్టను శుభ్రమైన వానిని (ఎడమలో) కుడి ప్రక్కన మండుతున్న అగ్నిని, బ్రాహ్మణుని, ఎద్దును, ఏనుగును, (240 దూడతో కూడిన ఆవును, తెల్ల గుర్రాన్ని, రాజహంసను, వేశ్యను, పుష్పమాలను దండాను, పెరుగు, పాయసమును (25) మణి, బంగారము, వెండి, ముత్యములు, ఇష్టమైన మాణిక్యములు, మద్యము, మాంసము, చందనము, ఇప్పసారాయి, మంచినేయిని (26) నల్లజింక, పండు, పేలాలు, వండిన అన్నము. అట్లాగే అద్దము, చిత్రించిన విమానము, బాగా వెలుగుతున్న ప్రతిమను (27) తెల్లకలువను, పద్మవనము, శంఖము, చీపరపిట్ట, మొగ్గ, పిల్లి, పర్వతము, మేఘము, నెమలి, చిలుక, బెగ్గురుపక్షి వీటిని చూచాడు. (28) శంఖము, కోకిల వాద్యముల ధ్వనిని మంగళ ప్రదమైన వానిని విన్నాడు. విచిత్రమైన కృష్ణుని (కోకిల) సంగీతమును, హరి (చిలుక) శబ్దమును జయధ్వనిని విన్నాడు. (29) ఈరకమైన శుభములను చూచి, శబ్దములు విని ఆనందించిన మనస్సుగలవాడై, హరిని స్మరిస్తూ, పుణ్యప్రదమైన వృందావనమను వనమును ప్రవేశించాడు. (30) ఎదుట రమ్యమైన, ఇష్టమైన రాసమండలాన్ని చూచాడు. చందనము, అగరు, కస్తూరి, పుష్పములు, చందనము వీటితో కూడిన గాలితో (31) ఆ స్థలమంతా వాసనతో నిండిపోయింది. మంగళఘటములతో, అరటిస్తంభములతో ఆప్రదేశం వెలుగుతోంది. మామిడి చిగుళ్ళ సమూహములతో, పట్టుదారములతో చిత్రించబడింది (గుచ్చబడింది). (32) వాటితో వెలిగిపోతోంది అంతటా... ఎల్లప్పుడూ పద్మారాగమణులతో నిర్మింపబడింది. శోభనార్హమైన త్రికోటిరత్న మందిరములతో శోభిస్తోంది. (33) అందమైన శతకోటి కుంజ కుటీరములతో వెలుగుతోంది. రాస (క్రీడ) ముగల వృందావనమును చూచి, ఆతడు కొంత దూరం వెళ్ళాడు. (34)
ఎదురుగా రమ్యమైన పరమైన, వైకుంఠముతో సమానమైన, శుభమైన వైకుంఠునకు నిలయమైన, ఉత్తమమైన నందవ్రజమును చూశాడు. (35) రత్నపు మెట్లు గలది, రత్నస్తంభములతో వెలుగుతోంది, రకరకాలైన విచిత్రములైన చిత్రములు కలది, మంచిరత్నవలయములు కలది, (36) సారమైన మణులు పొదగబడింది, విశ్వకర్మ రచించింది, ఐన ద్వారమందు కన్పించిన మార్గం గుండా ఆతడు రాజద్వారాన్ని ప్రవేశించాడు. (37) పతాకముల రత్నజాలములు కలది, ముత్యములు మాణిక్యములతో అలంకరించబడింది, రత్నదర్పణముల శోభగలది, రత్న చిత్రములతో చిత్రించబడింది. (38) రత్నములతో వీధులు చేయబడింది, మంగళకరమైన ఘటములతో కూడింది, మంగళమైనది ఆ ప్రదేశము. అక్రూరుడు వచ్చాడని తెలిసి, నందుడు ఆనందపడి, రామకృష్ణులతో కలిసి ఆతనిని అనుసరించటానికై వెళ్ళాడు. (39) వృషభములను, విద్యావంతులను వెంట తీసుకొని, వేశ్యలను ముందుంచుకొని, పూర్ణకుంభము, గజశ్రేష్ఠము తెల్లని ధాన్యము ముందుంచుకొని (40) నల్లని ఆవును, మధుపర్కము, పాద్యము రత్న ఆసనాదులు వెంట తీసుకొని, ఆదరంతో, శాంతుడై, చిరునవ్వుతో అట్లాగే వినతుడై వెళ్ళాడు (41) ఆనందంతో నందుడు, తనవాళ్ళ సమూహంతో, పిల్లతోకూడి, వెళ్ళి, మహాభాగుడైన అక్రూరుని చూచి, త్వరగా కౌగిలించుకున్నాడు. (42) గోపకులందరు శిరస్సువంచి నమస్కరించారు. ఆశీస్సులు స్వీకరించారు. ఓముని! గుణవంతుడ ! వారికి పరస్పరము సంయోగమైంది. (43) కృష్ణుని, రాముని వరుసగా అక్రూరుడు తన వక్షం పై ఉంచుకున్నాడు. పులకంతో శరీరం నిండిపోగా వారి రెండు చెక్కిళ్ళను ముద్దాడాడు. (44) కళ్ళలో ఆనందబాష్పాలు నిండగా, మిక్కిలి ఆనందించినవాడై, కృతార్థుడై సిద్ధించిన కోరికగలవాడై, రెండు చేతులు గల, శ్యామలవర్ణంలో సుందరుడైన కృష్ణుని క్షణకాలము చూచాడు. (45) పీతవస్త్రాన్ని ధరించాడు, మాలతీమాలతో అలంకరింపబడ్డాడు. ఒంటి నిండా చందనం పూసుకున్నాడు, పరుడు, వంశీధరుడు, వరుడు. (46) బ్రహ్మ ఈశశేషాదులు ఆతనిని స్తుతిస్తారు. సనకాదిమునులతో స్తుతించబడేవాడు. గోపకన్యలతో చూడబడుతున్నాడు. పరిపూర్ణతముడు విభువు. (47) ఆలాటివానిని, తన వక్షమందున్నవానికి, చిరునవ్వు నవ్వుతున్న, నాలుగు చేతులుగల, కృష్ణుని క్షణకాలము చూచాడు. లక్ష్మీసరస్వతులు తోడున్నారు, వనమాలతో అలంకరింపబడ్డాడు. (48) ప్రక్కలో సునంద, నంద, కుముదులు సేవిస్తున్నారు. భక్తితో నమ్రులై సిద్ధుల సంఘములు, ఆపరాత్పరుని సేవిస్తున్నారు. (49) ఐదుముఖములుగల, త్రిలోచనునిగా, ఆ దేవుని క్షణకాలం చూచాడు. శుద్దస్పటికం వలె తెల్లగా ఉన్నాడు. నాగరాజు మెడలో వెలుగుతున్నాడు. (50) దిగంబరుడు, పరబ్రహ్మ భస్మాంగుడు, జడలుగలవాడుగా చూచాడు. చేతిలో జపమాల ఉంది, ధ్యాన నిష్ఠతో ఉన్నాడు. యోగులకు శ్రేష్ఠుడు ఆతడు. (51) మనీషులకు శ్రేష్ఠుడైన, ధ్యాననిష్టుడైన చతుర్ముఖునిగా ఆతనిని చూచాడు. క్షణకాలము ధర్మస్వరూపునిగా, మరుక్షణంలో శేషరూపునిగా (52) క్షణకాలము సూర్యునిలా, నటించిన ప్రపంచ తెలుగు తుది నుంచి అందిసనాతనుడైన జ్యోతిరూపునిగా చూచాడు. క్షణకాలము పరమశోభకలవానిగా కోటికందర్పులను తిరస్కరించే వానిగా చూచాడు. (53) కామినులకు కమనీయుడు, కాముకుడు, కామంగలవాడు, ఇట్లా ఉన్న (ఐన) శిశువును చూసి వక్షమందుంచుకున్నాడు.
అక్రూర ఉవాచ:
ఓ నారద! నందుడు చూపిన రమ్యమైన రత్న సింహాసనమందు కూర్చొని, భక్తితో ప్రదక్షిణం చేసి, శరీరమంతా పులకరించగా, శిరసు భూమి పై ఉంచి నమస్కరించి పురుషోత్తముని స్తుతించాడు. (55) అక్రూరుని వచనమిట్లా: కారణరూపునకు నమస్కారము, పరమాత్మస్వరూపునకు నమస్కారము. (56) విశ్వములన్నింటికి ఈశ్వరుడైన వానికి నమస్కారము. పరునకు, ప్రకృతికి ఈశుడైన పరుని కన్న పరతరుడైన వానికి నమస్కారము (57) నిర్గుణునకు, నిరీహునకు, నీరూపునకు (రూపంలేని) రూపంకలవానికి, సర్వదేవతల స్వరూపునకు, సర్వదేవులకు ఈశ్వరుడైన వానికి (58) సర్వమైన విశ్వములలో బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనవాడ(నికి) (59) స్వరూపునకు, ఆది బీజమునకు, వానికి ఈశుడైన విశ్వరూపునకు నమస్కారము. గోపాంగనలకు ఈశుడైన వానికి నమస్సులు. గణేశ ఈశ్వరరూపునకు నమః (60) సురగణేశునకు నమస్కారము. రాధేశునకు నమస్సులు. రాధారమణరూపునకు, రాధా రూపధరునకు నమస్కారము. (61) రాధతో ఆరాధింపబడేవానికి, రాధకు ప్రాణముకన్న అధికమైన వానికి నమస్కారము. రాధచే సాధింపబడేవానికి, రాధ అధిదేవునకు ప్రియతముడైన వానికిని నమస్కారము. (62) రాధా ప్రాణమునకు అధి దేవుడైన వానికి, విశ్వరూపుడవైన వానికి నీకు నమస్కారము. వేదములచే స్తుతించబడ్డ, ఆత్మ వేదమెరిగిన (వేద) స్వరూపుడవైన, తెలిసిన నీకు నమస్కారము (63) వేదములకు అధిష్ఠాతృ దేవునకు వేదబీజునకు, నీకు నమస్కారము. ఎవని రోమములందు, అసంఖ్యాకములైన విశ్వములు, ఎల్లప్పుడుంటాయో (అట్టినీకు) నమస్కారము. (64) మహద్విష్ణువునకు ఈశ్వరుడైనవానికి విశ్వేశునకు నమస్సులు. స్వయంగా ప్రకృతి రూపుడైన వానికి, ప్రాకృతునకు నమస్కారము. (65) ప్రకృతి ఈశ్వర రూపునకు ప్రధానపురుషునకు నమస్కారము. ఈవిధముగా స్తుతించి సభాస్థలమందు మార్ఛనందినాడు. (66) త్వరగా భూమిపై పడ్డాడు. తిరిగి ఈశుణ్ణి ఆతడు చూచాడు. బయట ఉన్నవానిగా హృదయమందున్న వానిగా పరమాత్మను, ఈశ్వరుని చూచాడు. (67) అంతటా ఉన్నవానిగా, శ్యామలరూపునిగా, విశ్వమందున్నవానిగా, విశ్వరూపుడైన వానిగా చూచాడు. మూర్ఛితుడైన అక్రూరుని చూచి, నందుడు ఆదరపూర్వకముగా (68) ఓ నారద! రమ్యమైన రత్నసింహాసనమందు కూర్చోబెట్టాడు. నీవు ఏమి చూచావు అని వృత్తాంతమంతా అడిగాడు. (69) మాటిమాటికి కుశలమడుగుతూ, మధుర ఆహారాన్ని భుజింపజేశాడు. ఇష్టమైన కంస వృత్తాంతమును అక్రూరుడు చెప్పసాగాడు. (70)
తన తలిదండ్రులను విడిపించటానికి రామకృష్ణులు వెళ్ళాలి అని అక్రూరుడు చేసిన స్తోత్రమును సావధానంగా చదివినవారు (71) పుత్రులేనివారు పుత్రుని పొందుతారు, భార్యలేనివాడు భార్యను పొందుతాడు, ధనహీనుడు ధనాన్ని పొందుతాడు. భూమిలేనివాడు, అన్ని పాడిపంటలతో కూడిన భూమిని పొందుతాడు (72) సంతానం చనిపోయిన వాడు సంతాన లాభమును పొందుతాడు, ప్రతిష్ఠలేనివాడు ప్రతిష్ఠను పొందుతాడు కీర్తిలేనివాడు అవలీలగా విస్తారంగా కీర్తిని పొందుతాడు. (73) మిక్కిలి ఆనందించిన మనస్సుగలవాడై, అందమైన చంపకతల్పమందు కృష్ణుని తన వక్షమందుంచుకొని, సకాలమునకు నిద్రించాడు. (74) ప్రొద్దున్నే లేచి త్వరగా ఉత్తమమైన ఆహ్నికమును నిర్వర్తించి జగత్పతిమైన రాముని కృష్ణుని తన రథమందుంచుకున్నాడు. (75) ఐదురకాలైన గోసంబంధ వస్తువులను (పాలు వగైరా), వృషభానువు గల (కాంతి) నందమును సునందమును, చంద్రభానువుగల దానిని (76) రకరకాల వాద్యములు మృదంగము, మురజ మొదలగువానిని, పటహ, పణవ ఢక్క, దుందుభి, ఆనకములను, (77) సజ్జ, సన్నహని, కంచు పట్టగల మర్దలమాండవిని, ప్రజేశ్వరుడైన నందగోపుడు, ఆనందంతో వాయించసాగాడు. (78) గోపికలు వాద్యమువిని రామకృష్ణులు వెళ్తున్నారని తెలిసి, కృష్ణుడు రథం పై కూర్చోవటం చూచి, కోపపీడితులై ఆతని దగ్గరకొచ్చారు. (79) కృష్ణుడు వారి నందరిని వారిస్తున్నా రాధతో ప్రేరేపింపబడి, ఓ ద్విజ! తమ పాదఘాతములతో (తన్నుట) అవలీలగా ఈశ్వరుని రథాన్ని విరగగొట్టారు. (80) అక్కడున్న గోపకులంతా హాహాకారం చేశారు. బలవంతులైన స్త్రీలు కృష్ణుని తమ వక్షమందుంచుకొని వెళ్ళిపోయారు. (81) ఒకతే కోపంతో క్రూరంగా ఆ అక్రూరుని భయ పెట్టసాగింది. కొందరు వస్త్రంతో అక్రూరుని బంధించి అక్కడినుంచి వెళ్ళిపోయారు. (82) ఒకతే కంకణముగల కరముతో అక్రూరుని కొట్టసాగింది. ఓ ముని! ఆతని వస్త్రాన్నిహరించి వివస్తు చేయసాగింది. (83) దెబ్బలతో గాయపడ్డ సర్వావయవములుగల అక్రూరుని చూచి మాధవుడు, రాధ దగ్గరకు వెళ్ళి తిరిగి ఆమెకు బోధచేయసాగాడు. (84) సాదరంగా వినయంతో ఆధ్యాత్మిక యోగంతో అక్రూరుని మేల్కొలిపాడు. విభువు ఆమెను మేల్కొలిపాడు. (85) ఆకాశమునుండి వచ్చిన, దివ్యమైన, మంత్రముతో బయలుదేరిన రథమును, విచిత్ర వస్త్ర ములుకల దానిని, హరి ఎదురుగా చూచాడు. (86) విశ్వకర్మ నిర్మించిన మణిశ్రేష్ఠములు తాపింపబడిన దానిని చూచి జగత్పతి మాతృభవనమునకు వచ్చాడు. (87) తిని, తాగి, సుఖంగా నిద్రపోయి భగవంతుడు బాంధవులతో కూడా, మునీంద్ర, దేవేంద్ర బ్రహ్మేశ, శేషులతో నమస్కరింపడి ఉన్నాడు. (88) మిక్కిలి ఆనందించిన మనస్సుగలవారై గోపికలంతా నిద్రపోయారు. ఓ నారద! పుష్పముల పడక పై అందమైన దాని పై రాధతో సహానిద్రించాడు. (89) గోకులమందున్న జనులంతా ఆనందించినవారై, కొందరు గోపులు నాట్యం చేశారు. కొందరు సంగీత తత్పరులై (పాటలు) పాడినారు. (90) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు గోపీ విషయ మనునది డెబ్బదవ అధ్యాయము (70).
Summary of chapter 70 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Initiating his spiritual discourse, Maharshi Nārada detailed the cosmic structure of Time, outlining the four Yugas—Satya, Tretā, Dvāpara, and Kali—and their respective spiritual measures and moral decline. He explained how human longevity, physical strength, and adherence to Truth diminish as time progresses toward Kali Yuga, where hypocrisy and ignorance prevail. However, Maharshi Nārada declared that despite the spiritual darkness of Kali Yuga, the simple chanting of Lord Śrī Kṛshṇa's holy names bestows the highest perfection attainable in previous ages.