శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ఓ నారదా! శృంగార చేష్టలలో మిక్కిలి ప్రౌడ (ఉన్నతస్థితి గలవారు) లును పతినింతగా వశపరచుకొంటీమన్న గర్వము గలవారును అగు గోపాంగనలు మన్మధుని చేత మత్త మదము) దశపొందినవారైనందున ఆ కృష్ణుని తమకు వశమైన భర్త అనుకొన్నారే తప్ప పరమేశ్వరుడని భావించకుండిరి. ఆశ్చర్యము. కొందరు గోపికలు చిరునవ్వుతో ప్రక్క చూపుతో “ఓయీ మాలతీ పుష్పములు కోసి (ఉంది) మాల అల్లి నాకిమ్ము” అనిరి. మరికొందరు “ఓయీ కృష్ణా! మమ్ము నీ ఒడిలో కూర్చుండ బెట్టుకొమ్ము” అనిరి. ఒకటే శ్రీకృష్ణుని పట్టుకొని భుజము పైకెక్కి కూర్చుండెను. ఇంకొకతె మిక్కిలి మత్తురాలై గర్వముతో “నీ పీతాంబరము నాకు ధరింపజేయుము” అని ప్రాణవల్లభునీలో అనెను. మరియొకతే “నాకు సిందూర తిలకము దిద్దుమనెను. ఒక గోపిక ప్రాణేశునితో ఓయీ! త్వరగా వచ్చి నా వెంట్రుకలకు తైల సంస్కారము చేసి దువ్వి కొప్పు ముడువుము” అనెను. తమనలంకరించుకొనుచున్న కొందరు శ్రీగంధపు చిగురు గుత్తులను తమ చెవి
సందున అలంకరించుమని ప్రేరేపించిరి. ఒకటే చిరునవ్వుతో కామముతో ఆ మాధవుని ముఖ పద్మమును చూచుచు ఒక సంకేతము (సూచన) తో ఏకాంతకేళికీ లిలిచెను. ఒక కామిని మాధవుని తన వైపు లాగుకోని మురళిని పట్టుకొని అతని పీతాంబరము లాగివేసి నగ్నుని జేసెను. కొందరు కామినులు మధుసూదనునితో నా పాదములకు గోళకు పారాణి రంగు వేయుమనిరి. ఒక గోపిక ప్రేమగా పిలిచి నా చెక్కిళ్ల మీద స్తనముల మీద నానావిధ చిత్రములతో పత్రావళిని రచించుమని (కుంకుమ పువ్వు ద్రవముతో రేఖలు వ్రాయుట) కోరెను.
మాధవుడా గోపికల యొక్క బడలెరుగని కామదశను ఊహించి ఆ గర్వచేష్టలను చూచి (వారికి గుణపాఠముగా) రాధాదేవితో బాటు అంతర్థానమయ్యెను. స్వేచ్ఛామయుడైన ఆవిభుడు నిర్జన (ఏకాంత) స్థానములలో శృంగార కళాశాస్త్ర పద్ధతిలో రాధాదేవితో విహరించెను.
ప్రతి పర్వతమందును, ప్రతి ద్వీపమందును, ఏకాంత స్థలములలో, జంతు రహితమైన నదుల యొడుసను, శ్రీగోష్ఠమున, రత్నశైలమున, సముద్ర తీరములలో, గంగాతటమున, యమునానది యొక్క ఇసుకతిన్నెలలో గంధమాదన పర్వత గుహయందు, కావేరీ తీరమందలి మనోహరమైన కుందవనములో (మొల్లల అడవి) పుష్పభద్రానదీ సైకతము (ఇసుకతిన్నె) లో పుష్పించిన ఉద్యానవనములో స్వామి రాధాదేవితో అంతట విహరించి ఆమెను చక్కగా అలంకరించీ చందన వాయువుతో మనోహరముగా నున్న మలయ పర్వతపు లోయను చేరి పుష్పశయ్యను సిద్ధము చేసి శ్రీహరి రాధతో విహరించెను.
రాధాదేవి మిక్కిలి సుఖము కల్గించిన ఆ కలయిక వలన శరీరమంత పులకలెత్తగా గోవిందుని తన వక్షమున చేర్చుకొని మూర్ఛపొందెను. కామార్హురాలై వేష మంతయు చెదరీ ఉన్న రాధను - కొప్పు ఊడి నగ్నముగా నున్న దానిని - శ్రీకృష్ణుడు చూచి కంపించుచున్న ఆమెను పక్షమున చేర్చుకొని మేల్కొల్పెను. వస్త్రమును ధరింపజేసి మొలనూలు బిగించెను. కొద్దిగా ఎడమవైపు ఓరగా ఉండునట్లు కొప్పు మడిచి మాలతీ కుంద పుష్పమాలలను చుట్టేను. నుదుట సుందరముగా సిందూర తిలకములంకరించేను. చెంపలపై స్తనముల పై మకరికా పత్రరేఖలను గోళ్లతో పద్మాకార రేఖలను శ్రేణి దేశమందును నిర్మించేను. పాదములకు గోళ్లకు పారాణి లత్తుకలను అలంకరించెను.
ఆ శయ్య మీదినుండి లేచి ఆమెతో బాటు స్వామి ఒక సరోవరమునకేగెను. ఆ కొలను నానా విధ పద్మములతో, స్పటికము వలె ప్రకాశీంచెడి నిర్మలమైన జలముతో, అంతటా వ్యాపించిన హంస కారండవ పక్షులతో, నీటికోళ్ల కూతలతో, తేనె నాశీంచి వచ్చి సుందర పద్మముల మీది వ్రాలి తేనె త్రాగి మత్తలీన గండు తుమ్మెదల మధుర ధ్వనీతో, మనోహరముగా నుండెను.
ఆ సరస్సులో రాధతో బాటు అతడు స్నానమాడుచు రాధా మాధవులొకరిపై ఒకరు నీళ్ళ జల్లుకొని జలక్రీడలాడిరి. మాధవుడు సహస్రదళములు గల రెండు పద్మములను తెంపి ఒకటి రాధకిచ్చి తానొకటి ఉంచుకొనెను ఆ తరువాత రాధానాధుడు ఆమెను దగ్గరకు చేరదీసుకొని చందనము అగురు కస్తూరీ కుంకుమ ద్రవములను ఆమె కోరినట్లుగా లేపనము చేసెను.
వారు అక్కడి నుండి బయలు దేరి పోవుచు కేతకీ వన సమీపములో మిక్కిలి ఎత్తైన కొమ్మలు గలదియి అన్ని వైపుల మిక్కిలి విస్తరించినదియునగు ఒక వట వృక్షమును చూచిరి దాని నీడ ఒక యోజనము (ఆమడ) వరకు వ్యాపించి ఉండెను. మీక్కిలి చల్లని గాలితో పూల వాసనతో పరీమళవంతముగా చేయబడిన ఆ ప్రదేశమును చూచీ గోవిందుడు మిక్కిలి సంతసించి కూర్చుండి రాధాదేవికి, ఆశ్యర్యకరముగా ప్రాచీన పురాణ రహస్యములను చాల సేపు చెప్పుచుండెను.
ఇంతలో ఆ ప్రదేశమునకు వచ్చుచున్న ఒక ముని పుంగవుని రాధాకృష్ణులు చూచిరి. ఆ ముని తన హృదయములో అంతవరకు చూచిన పరమాత్మ యొక్క రూపమును చూడక ధ్యానమును విరమించి ప్రసన్న వదనేక్షణుడైన పరమాత్మను తన ఎదుటనే చూచుచుండెను. ఆ ముని నల్లని వాడు అన్ని అవయవములు వంకరగా నున్న దిగంబరుడు (వస్త్రములు లేనివాడు). జడలు ధరించి బ్రహ్మతేజస్సుతో వెలిగి పోవుచుండెను. అతని ముఖము నుండి అగ్ని పైకి వచ్చుచు ఉదయించిన తపోరాశివలె ఉండెను. అతని పేరు అష్టావక్రుడు.
అబ్బా! ఏమి ఈ బ్రహ్మ తేజస్సు రూపము దాల్చినట్లున్న శాంతమూర్తీ! గోళ్లు గడ్డము మీసములు మిక్కిలి పొడవుగా నున్న గొప్ప తేజస్వి! భయభక్తులతో శిరస్సు వంచి చేతులు జోడించి యున్న అతనిని చూచి రాధాదేవి ఏకవిక నవ్వుచుండగా మాధవుడు వారించెను.
తరువాత ఆ మహాముని ప్రభావమును రాధాదేవికి వివరించెను. ఆ మునీ గోవిందునకు నమస్కరించి తనకు పూర్వము శంకరుడుపదేశించిన స్తోత్రముతో ఇట్లు స్తుతించెను.
అష్టావక్ర ఉవాచ - అష్టావక్రుడిట్లు పలికెను :
సత్త్వరజస్తమస్సులనెడి గుణముల కతీతమైనవాడా! ఆ గుణములకే ఆధారమైనవాడా! ఆకాశాది మహాభూతముల గుణములకు బీజభూతుడా! లోకకల్యాణ గుణములే శరీరముగా గలవాడా! అణిమాద్యష్ట సిద్ధులు గల యోగులకు ప్రభువా! వారికిని బీజభూతుడా! గుణములకు స్థానమైన స్వామీ! నీకు నమస్కారము. తపస్వీజనులకు సిద్ధి స్వరూపమైన వాడా! సిధ్ధ్యంశనామా! సర్వసిద్ధులకు బీజమైనవాడా! ఓ పరాత్పరా! నదుల సిద్ధగుణములకు అధినాధుడా! సీదులకు గురువైన నీకు నమస్కారము. ఓయీ వేదమునకు బీజమైన వేదజ్ఞుడా! వేత్తా! వేదవేత్తలలో శ్రేష్టుడా! వేదము వలనను తెలిసికొనజాలని ఆదిరూపుడా! వేదజ్ఞులకు ప్రభూ! నీకు నమస్కారము.
బ్రహ్మ అనంతుడు శంకరుడు శేషుడు ఇంద్రుడు ధర్ముడు మొదలగు దేవగణములకు అధినాయకా! సర్వరూపా! సర్వనాథా! శర్వుడు మొదలగు దేవాధీశులకు బీజమైనవాడా! నీకు నమస్కారము. ప్రకృతిరూపుడా! ప్రకృతి సృష్టియందు ప్రజ్ఞ గలవాడా! ప్రకృతీనాధా! పరాత్పరా! సంసార వృక్షరూపా! సంసార వృక్షమునకు బీజభూతుడా! సంసార వృక్షమున ఉత్తమ ఫలరూపుడా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయములకు బీజమైన ప్రభూ! వాటికి మూలమైనవాడా! ఈ విశ్వరూప వృక్షమునకు బీజమైనవాడా! రాధికానాథా! నీకు నమస్కారము.
ఏ పరమాత్మ యొక్క వృక్షరూపమునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్కంధములో (కాండములు - బోదెలు) వేదాది శాస్త్రములు పెద్ద చిన్నకొమ్మలో, తపస్సులు పుష్పములో, సంసారమందలి అనుభవములే ఫలములో, ప్రకృతియే మొలకయే. అట్టి వృక్షమున కాధారమైనవాడా! నీకితరాధారములేని స్వామీ! సర్వమునకు ఆధారభూతుడా! నీకు నమస్కారము. కన్నులకు కన్పించని, ఊహకందనీ, ఆకారము లేని తేజోరూపుడా! అందరికి మిక్కిలి ప్రత్యక్షమైన (కన్నులకు కన్పించు) వాడా నర్వము నీ ఆకారమైనవాడా! ఓ స్వేచ్ఛామయుడా! నీకు నమస్కారము అగుగాక.
ఇట్లు పలికీ ఆ ముని వరుడు స్వామి పాదపద్మముల మీద పడి ఆ రాధాకృష్ణులముందే యోగముతో ప్రాణములను విడిచెను. అతని శరీరము వారి పాదపద్మముల సమీపమున పడిపోయెను. దాని నుండి మండుచున్న అగ్ని జ్వాలవంటి తేజస్సు పైకి లేచెను. ఆ తేజస్సు ఏడు తాళవృక్షముల యెత్తుకు లేచి క్రిందబడి అంతట స్వామి చుట్టు తిరిగి తిరిగి శ్రీహరి పాదపద్మములందు లీనమయ్యెను.
ఉదయమున లేచి అష్టావక్రుడొనర్చిన ఈ స్తోత్రము నెవడు పఠించునో వాడు శ్రేష్ఠమైన మోక్షానందమును పొందును. సంశయము లేదు. ఓ నారదా! ఈ స్తోత్రము మోక్షాపేక్ష గల వారికి ప్రాణముల కన్న అధికమైనది. దీనిని పూర్వము వైకుంఠ లోకములో శ్రీహరి శంకరునకుపదేశించెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ఆష్టావక్ర ముని యొక్క మోక్ష ప్రస్తావమునెడి ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 29 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
On the sacred day of Ekādashī, Nanda Bābā went to bathe in the Yamunā river before dawn but accidentally entered the subterranean waters belonging to Varuṇa, the lord of ocean depths, who arrested him for violating the sacred hour of fasting. Discovering His father missing, Kṛshṇa dived into the deep waters and entered the magnificent jeweled palace of Varuṇa. Beholding the Supreme Lord standing before him, Varuṇa trembled with awe, offered rich worship, fell prostrate at Kṛshṇa's lotus feet, and joyfully released Nanda Bābā, who returned safely to Vṛndāvana accompanied by his divine son.