మూII శ్రీనారాయణ ఉవాచ :
శ్రీరాధిక్కోవాచ :
ఉద్ధవ ఉవాచ:
శ్రీరాధికోవాచ :
నారాయణుని వచన మిట్లా : రామ ఉద్ధవుని స్తుతిని విని రాధిక చేతనను పొందింది (మేల్కొన్నది). కృష్ణుని రూపంలో ఉన్న ఆతనిని చూచి దుఃఖంతో ఆమె అతనితో ఇట్లా అంది. (1) రాధికా వచనం- ఓవత్స! నీ పేరేమిటి. నిన్నెవరు పంపించారు. ఎక్కడి నుండి వచ్చావు. ఎందుకొచ్చావు ఇవన్నీ నాకు చెప్పు. (2) నీరూపం అన్ని అంగాలు కృష్ణుని లాగా ఉన్నాయి. నీవు కృష్ణుని సహచరునివని భావిస్తాను. కృష్ణుని క్షేమాన్ని బలరాముని క్షేమాన్ని ఇప్పుడు చెప్పు. (3) నందుడు అక్కడే ఎందుకున్నాడో ఆ సంగతి చెప్పు. గోవిందుడు అందమైన ఈ బృందావనమను వనమునకు వస్తాడా (4) శుభమైన పూర్ణచంద్రుని వంటి ముఖముగల ఆతనిని మళ్ళీ చూస్తానా ఆతనితో కూడి నేను రాసమండలంలో మళ్ళీ క్రీడిస్తానా. (5) సఖులతో కూడి మళ్ళీ జలాల్లో విహరిస్తానా. శ్రీనందనందుని శరీరమందు మళ్ళీ చందనాన్ని పూస్తానా అని. ఉద్దవుడిట్లన్నాడు: నా పేరు ఉద్దవుడు. ఓవరానన! నేను క్షత్రియుణ్ణి. పరమాత్మయైన కృష్ణుడు పంపగా శుభవార్త చెప్పడానికి వచ్చాను. (7) నేను హరికి పారదుడిని, నీ దగ్గరకొచ్చాను. ఇప్పుడు నందుడు కృష్ణుడు బలరాముడు అందరూ క్షేమమే అని (8) రాధిక ఇట్లా అన్నది - ఆ యమునా నది ఒడ్డు, ఆసువాసితమైన గాలి అట్లాగే ఉన్నాయి. ఇప్పటికి కేళికదంబముల మూలాలు అట్లాగే ఉన్నాయి. (9) ఇష్టమైన పుణ్యమైన రమ్యమైన బృందావనం అట్లాగే ఉంది. పుంస్కో కిలల ధ్వని చందన చర్చితమైన తల్పము ఉన్నాయి. (10) నాలుగు రకాల భోజన పదార్థాలు సుందరమైన మధుపానము ఉన్నాయి. అంతములేని వాడు దుః ఖము కల్గించే పాపిష్ఠి మన్మథుడు అట్లాగే ఉన్నాడు. (11) రాసమండలంలో ఆరత్న ద్వీపాలు వెలుగుతూనే ఉన్నాయి. శ్రేష్ఠరత్నములలో ఉత్తమమైన వానితో చేయబడ్డ రతి మందిరము అట్లాగే ఉంది. (12) గోపస్త్రీల గణముంది. చంద్రుడు వెలుగుతూనే ఉన్నాడు. వాసనగల పూలతో కూర్చబడ్డ చందనం పూయబడిన పడక ఉంది. (13) కర్పూరము మొదలగు వానితో చక్కగా కూర్చబడ్డ రతి భోగమునకు అర్హమైన తాంబూలముంది. వాసనగల మాలతి పూలమాల తెల్లని చామరము, అద్దము ఉన్నాయి. (14) ముత్యములు, మణులు వీటితో కూడిన మనోహరమైన హరిహారములున్నాయి. రమ్యమైన రకరకాల ఉపకాననాలు,రమ్యమైన క్రీడాసరోవరాలున్నాయి. (15) వాసనగల పూలుగల ఉద్యానము ఉంది. అందు పద్మముల గుంపులు మనోహరంగా ఉన్నాయి. ఇట్లా (ఐశ్వర్యమంతా) వైభవమంతా ఉంది. మరినా ప్రాణనాథుడెక్కడ.
ఉద్ధవ ఉవాచ :
కృష్ణ! రమానాధ! నాప్రాణవల్లభ! ఎక్కడున్నావు. ఈ దాసిదాని అపరాధమేమి. అడుగడుగునా దాసి దోషమేమి. (17) అని పలికి ఆ దేవి తిరిగి మూర్ఛపోయింది. ఉద్ధవుడు తిరిగి ఆమెను మేల్కొలిపాడు. ఆమెను చూచి క్షత్రియ పుంగవుడైన ఉద్ధవుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. (18) తెల్లని చామరలతో ఉన్న ఏడుగురు సఖులు ఎప్పుడూ ఆమెను సేవిస్తున్నారు. మిక్కిలి ఇష్టమైన మూడు లక్షల గోపికలు ప్రేమగా సేవిస్తున్నారు. (19) నూరు కోట్ల గోపికలు రాత్రింబగళ్ళు ఆమె చుట్టూ ఉన్నారు. ఒకామె చేతిలో కాటుక ఉంది. ఇంకొకతె, చేతిలో మాలను ధరించింది. (20) ఒకతె సిదూరం ధరించింది, చేతిలో. ఇంకొకతె చేతిలో గోరోచనాన్ని కలిగి ఉంది. ఇంకొకతె చేతిలో చందన పాత్ర ధరించి ఉంది. (21) ఒకతె చేతిలో అద్దం ధరించింది. ఇంకొకతె కుంకుమను మోస్తోంది. అక్కడ ఒకతె ఇష్టమైన కస్తూరి పాత్రను వహించింది. (22) ఇంకొకతె చందన పాత్రను చేత ధరించి ఉంది. దుఃఖంతో (లేదా శుచిగా) తేనెలతో మధురములతో నిండిన పాత్రల ధరించి ఉంది ఒకతె. (23) ఒకతె వాసనగల నూనెను ధరించి ఉంది. ఒకతె కర్పూరము మొదలగు మంచి వాసనగల తాంబూలాన్ని చేత ధరించింది. (24) ఇష్టమైన వాసనగల జలాన్ని ఒకతె ధరించి ఉంది. చిత్రములు కల ఆడబొమ్మను ఒకతె రక్షిస్తోంది. (25) ఒకతె కందుకాన్ని పట్టుకుంది. ఒకతెరత్నా భరణాన్ని వహించింది. ఒకతే అమూల్యమైన అగ్నిశుద్దమైన వస్త్రమును రక్షిస్తోంది. (26) ఒకతె భక్ష్యముల ఉపహారాన్ని ధరించి తిరుగుతోంది. ఒకతే కేశాలంకరణ కొరకు ఇష్టమైన మాలను తయారుచేస్తోంది. (27) ఒకతె దువ్వెన చేత ధరించి ఎదురుగా ఉంది. ఒకతె మినుములకు సంబంధించిన దానిని పట్టుకొని ఉంది. ఒకతె ఉసిరిక రసాన్ని కలిగి ఉంది. (28) ఈ విధంగా, దూరంగా ఉన్నా ధరించి ఉంది. భయంతో ఉంది. ఒకతె భయంతో స్తుతిస్తోంది. ఒకతె దుఃఖంతో రోదిస్తోంది. (29) తెలివికలది ఒకతె, విరహాతురయైన ఆమెను ఓదారుస్తోంది. ఒకతె అధిక తాపంతో బాధపడుతూ మృదువైన మనోహరమైన తల్పం పై (30) విరహాగ్ని పోయే కొరకు మృదువైన శుభమైన పద్మదళమందుంచింది. ఇట్టి ఆమెను చూచి ఉద్దవుడిట్లా అన్నాడు.చాలా ప్రియంగా, కర్ణములకు అమృతధారలాగా, వినయంగా, భయపడ్డవానివలె అన్నాడు (31) ఉద్ధవుడిట్లా - నీవు దేవదేవీశవని, చాలా మృదువైన దానివని, సిద్ధయోగినివని తెలుసుకున్నాను. (32) నీవు సర్వశక్తి స్వరూపురాలవు, మూల ప్రకృతివి, ఈశ్వరివి. శ్రీరాముని శాపం వల్ల భూమికి వచ్చిన దానివని గోలోకపు స్త్రీవని తెలుసుకున్నాను. (33) కృష్ణునకు ప్రాణంకంటే అధికమైన దేవివని ఆతని వృక్షః స్థలమందు ఉండే దానివని, సర్వశక్తిస్వరూపురాలవని, మూలప్రకృతివి ఈశ్వరివి అని (34) తెలుసుకున్నాను. దేవి! నీకిష్టమైన శుభవార్తను చెబుతాను, విను. హృదయాన్ని ఆర్టపరిచే వార్తను సఖులతో కూడి సుస్థిరంగా విను. (35) దుఃఖమనే దావాగ్నితో దహించి పోయేవారికి అమృతవర్షం లాటిది. విరహమనే వ్యాధిగల వారికి రసాయనముతో సమానమైంది. శుభకరమైంది (36) నందుడు కూడ, ఆనందంగా సంతోషంగా ఉన్నాడు కృష్ణుని ఉపనయనమయ్యేవరకు వసుదేవుడు ఆతనిని ఉండమని నియంత్రించాడు.
మంగళకర్మ ముగిశాక బలరామకృష్ణులను తీసుకొని నందుడు ఆనందంతో గోకులానికి వస్తాడు. (38) కృష్ణుడు ఆనందంగా వచ్చి తల్లికి నమస్కరించి, రాత్రికి పుణ్యప్రదమైన బృందావనానికి వస్తాడు. (39) ఓ సతి! శ్రీకృష్ణుని పద్మముఖాన్ని త్వరలోనే చూస్తావు. అప్పుడు విరహదుఃఖాన్నంతా పోగొట్టుకుంటావు. (40) ఓ తల్లి! నీవు స్థిరురాలివి, కమ్ము. దారుణమైన శోకాన్ని విడిచి పెట్టు. ఆనందంతో అందమైన వహ్నిశుద్ధమైన వస్త్రాన్ని ధరించు. (41) అమూల్య రత్నములతో చేయబడ్డ సొమ్ములను స్వీకరించు (పెట్టుకో). కస్తూరి కుంకుమలతో కూడిన మృదువైన చందనాన్ని తీసుకో. (42) కేశములను సంస్కరించుకో. వాటిని మాలతీ మాలలతో అలంకరించుకో. ఓ కల్యాణి! చక్కని వేషం ధరించు. చెక్కిళ్ళపై చిత్రపత్రకముల కూర్చుకో. (43) పాపిటలో సిందూర బిందువును కస్తూరి చందనాన్ని పెట్టుకో. పాదములందు లత్తుకను, యావక భూషణములను పెట్టుకో. (44) శ్రేష్ఠమైన రత్న సింహాసనమందు కూర్చో. లే. బురదతో కూడిన పడకను విడిచి పెట్టు. ఓసతి! దుఃఖాన్నీ విడిచి పెట్టు. (45) మనస్సుతో విశుద్ధమైన మధురమును, మధువును కృష్ణునితో కలిసి భుజించు. స్వచ్ఛమైన మంచినీటిని, వాసనగలిగిన తాంబూలమును గ్రహించు. (46) మనోహరమైన శ్రేష్ఠరత్నములలోని ఉత్తమ రత్నములతో నిర్మించిన పడకయందు, వహ్నిశుద్ధమైన వస్త్రములు గలిగిన మాలతీ మాలలతో అలంకరింపబడ్డ (47) మంచి వాసనగల, కస్తూరి జాతి, చంపక, చందనములు గల, చుట్టూ మాలతీ మాలలు వజ్రహారములు వీటితో అలంకరింపబడ్డ (48) శ్రేష్ఠమైన మణులు, ముత్యములు, మాణిక్యములు వీనితో సుందరముగా అలంకరింపబడ్డ, పూలమాలలుగల దిండుగల, మంగళారమైన పడక పై ఆనందంతో (49) గోపికలతో సేవింపబడుతూ నిద్రించు, ఓదేవేశి! నీ ప్రియమైన చెలికత్తెలు తెల్లని చామరలతో ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటారు. (50) ఓ మనోహరి! గోపీభక్తురాండ్రు నీ పాదారవింద సేవను చేస్తారు. మనోహరమైన ఉత్తమ రత్నములతో నిర్మింపబడ్డ పడకయందు వసించు. (51) ఓ ముని! ఆతడు ఇట్లా పలికి తిరిగి మౌనం వహించాడు. బ్రహ్మాది సురలు నమస్కరించే పాదపద్మములకు నమస్కరించాడు. (52) ఉద్ధవుని మాటలను విని నవ్వుతూ ఆసతి రాధిక, రత్నములతో చేసిన ఉంగరాన్ని ఆనందం కలుగునట్లు ఆతనికి ఇచ్చింది. (53) అమూల్యమైన, సుందరమైన, విశ్వకర్మ నిర్మించిన, ముఖమునకు కాంతినిచ్చే పచ్చని రంగుగల, దీపం వలె వెలిగే, (54) ఇదివరలో అగ్ని రాసమండలంలో కృష్ణునకిచ్చిన, అపూర్వమైన అమూల్య రత్నములతో నిర్మింపబడ్డ మణుల కుండలములను రెండిని ఇచ్చింది. (55) ఇష్టమైన, అమూల్య రత్నములతో నిర్మింపబడ్డ అన్ని ఆభరణములను, వహ్ని శుద్ధమైన రెండు వస్త్రములను, రత్నములతో చేసిన వానిలో ఉత్తమమైన (56) హీరముల హారముతో నిర్మింపబడ్డ అందమైన హారమును వరుణుడు, కృష్ణునకు ఇచ్చిన దానిని ఆనందంతో ఇచ్చింది. (57) సూర్యుడు శ్రీకృష్ణునకిచ్చిన స్యమంతకమణిని, ఇదివరలో హరి తనకిచ్చిన దానిని, ఆనందంగా ఆతనికిచ్చింది. (58) ఉత్తమమైన ఇంద్రుడిచ్చిన రత్నసింహాసనాన్ని ఆనందంతో ఆరాధాదేవి ఆతనికిచ్చింది.
శ్రీరాధికోవాచ :
ఉద్ధవ ఉవాచ :
ఉత్తమరత్నములతో నిర్మింపబడ్డ మనోహరమైన, ముక్తములు మాణిక్యములు, వజ్రహారములుగల, (60) విచిత్రమైన రత్నములతో పద్మములతో చిత్రింపబడ్డ, ఎప్పుడూ పచ్చగా (ఆకు) ఉండే, ఇతరమైన రత్నములతో నిర్మింపబడ్డ అద్దములతో అంతటా శోభిస్తున్న (61) రాసమండలంలో బ్రహ్మప్రీతితో హరికి ఇచ్చిన ఉత్తమమైన గొడుగును రాధ ప్రీతితో ఉద్ధవునకు ఇచ్చింది. (62) మణులతో నిర్మింపబడ్డ, మణులతో వెలిగిపోతున్న, సంస్కరింపబడిన జపమాలను, ఇదివరలో శివుడు ఇచ్చిన దానిని (63) అమూల్యమైన, పుణ్యకరమైన, శుభప్రదమైన దానిని ఆతనికి ఇచ్చింది. అది జన్మమృత్యుజర, వ్యాధి వీటిని తొలగించేది, మిక్కిలి మనోహరమైనది (64) ఇదివరలో చంద్రుడిచ్చిన, పరిష్కరింపబడ్డ, రమ్యమైన, పూర్ణచంద్రునివలె వెలుగుతున్న చంద్రకాంతమణిని, ఆచంద్రావళి (రాధ) ఆతనికి ఇచ్చింది. (65) విశుద్దమైన మధుపర్కమును అక్షయ మధుపాత్రను, ధర్ముడు హరికి ప్రేమతో ఇచ్చిన దానిని ఆతనికి ఇచ్చింది. (66) బంగారుతో చేయబడ్డ, శుద్దమైన నీరుతాగే పాత్రను మధురాన్నమును పరమాన్నమును, రుచికరమైన దానిని ఆతనికిచ్చింది. (67) భోజనం చేశాక ఆతనికి కర్పూరాదుల వాసనగల తాంబూలాన్ని శీఘ్రంగా ఇచ్చింది. మృదువైన చందనాన్ని, మాలను ఇచ్చింది. (68) శుభాశీస్సుల నిచ్చింది. ఉత్తమమైన, అతనికిష్టమైన వరాన్నిచ్చింది. గోలోకంలో, రాసమండలమందు కృష్ణుడిచ్చిన జ్ఞానాన్ని ఇచ్చింది. (69) నూరు పురుషాంతరముల వరకుండే నిశ్చలమైన లక్ష్మినిచ్చింది. శుద్దమైన కీర్తిని ఇచ్చే విద్యనిచ్చింది. నిర్మలమైన కీర్తిని, యశస్సును ఇచ్చింది. (70) అన్నిటిని సిద్ధింపచేసే హరిదాస్యమును, నిశ్చలమైన హరిభక్తిని ఇచ్చింది. హరికి పార్షదుడుగా (ప్రక్కనుండే భటుడుగా), పార్షదులకు నాయకుడిగాను వరమిచ్చింది. (71) వరమును, అనుగ్రహాన్ని ఇచ్చి ఆనందంగా లేచి వహ్నిశుద్ధమైన వస్త్రము ధరించి, అమూల్యరత్నా భరణములు ధరించి (72) మనోహరమైన వజ్రాలహారాన్ని, రత్నముల మాలను ధరించి, సిందూరము, కాటుక, పుష్పమాల, చందనము, ధరించి (73) పూజించతగిన ఆతనిని రత్నసింహాసనమందున్న వారిని పూజించింది ఆనందిస్తున్న ఆతని చుట్టూ శతకోటి గోపికలతో ఆమె ఉన్నారు. కాల్చిన బంగారంలా వెలుగుతోంది. నూరుగురు చంద్రుల సమానమైన కాంతి గలది ఆమె. (74) రాధికవచనమిట్లా - హరి నిజంగా వస్తాడా, కపటం లేకుండా నిజం చెప్పు. (75) భయం వదలి ఉన్నది చెప్పు ఈ సభలో నిజం చెప్పు. నూరు కూపములకన్న వాపిమేలు నూరు చెరువుల కన్న ఒక క్రతువు. (76) నూరుక్రతువుల కన్న ఒక పుత్రుడు నూరుగురు పుత్రులకన్న ఒక సత్యము ఉత్తమము. సత్యాన్ని మించిన ధర్మం లేదు. అబద్ధాన్ని మించిన పాతకం లేదు. (77) అనగా ఉద్ధవుడిట్లన్నాడు - హరినిజంగా వస్తాడు. సుందరి! నిజంగానే చూస్తావు హరిని. సంతాపం పోతుంది, హరిచంద్రముఖాన్ని చూస్తావు. (78) మధురకు వెళ్ళి హరిని ఇక్కడికి బయలుదేరదీస్తాను. అతని ప్రబోధించాకనే మరోపని చేస్తాను. (79) ఓ తల్లి! నాకు ఆజ్ఞఇవ్వు. హరి సన్నిధికి వెళ్తాను. ఆతనికి, నీ వృత్తాంతాన్ని తగిన విధంగా చెబుతాను.
మూII శ్రీరాధికోవాచ :
అను II రాధిక ఇట్లా అంది - ఓవత్స! మనోహరమైన మధురకు వెళ్ళబోతున్నావు కదా, కొంచెం స్థిరంగా ఉండి నా దుఃఖ కథను విను.(81) విరహ జ్వరంతో భయపడే నన్ను మరవవుకదా. నా కాంతునికి చెప్పి తప్పకుండా పంపిస్తావు కదా. (82) స్త్రీల మనస్సులలోని వార్తను ఎవరెరుగుదురు. శాస్త్రాను సారంగా కొద్దిగా నిరూపించే ప్రయత్నం చేస్తారు. (83) వేదములు చెప్పటానికి సమర్థం కాలేదు. ఇక శాస్త్రాలేమి చెబుతాయి. నీకంతా చెబుతాను. కృష్ణునికి చెప్తావు కదా. (84) నాకు అడవన్నా ఇల్లన్నా భేదం కన్పించటం లేదు నరులు, పశువులు ఒకే విధంగా అన్పిస్తున్నాయి. నీరేమిటో, కలేదో, అజ్ఞానమేదో, రాత్రింబగళ్ళేవో తెలియటం లేదు. (85) నన్నునేను తెలుసుకోలేకపోతున్నా. చంద్రసూర్యుల ఉదయాన్ని గమనించటం లేదు. హరివార్త వినిక్షణ కాలము చైతన్యాన్ని పొందాను. (86) కృష్ణుని ఆకృతినిచూస్తున్నాను. మురళీ ధ్వనిని వింటున్నాను. కులాన్ని, సిగ్గును, భయాన్ని వదిలి హరిపాదాలు స్మరిస్తున్నా. (87) ప్రకృతికి పరుడైన, జగత్తున కంతా ఈశ్వరుడైన వానిని పొంది నాగోపపతిని గూర్చి తెలుసుకొన్నా ఆతని గూర్చిన జ్ఞానాన్ని మాయచే నేను పొందలేదు. (88) వేదాలు బ్రహ్మాదులు, దేవతలు ఆతని పాదాలు నిరంతరం ధ్యానిస్తారు. అట్టి వానిని కోపంతో నేను భయ పెట్టాను. ఇది నా హృదయంలో ముల్లులా కుచ్చుకుంటోంది. (89) ఆతని పాద సేవతో కాని ఆతని గుణములస్తుతించి కాని, ఆతని పై భక్తితో గడిపిన క్షణాలు, ఆతని ధ్యానంతో పూజతో గడిపిన క్షణాలు (90) అదంతా మంగళమైంది, ఆనందకరమైంది జీవించినట్టైంది. ఆనితో విచ్చేదమైతే, ఆభావన విఘ్నమైతే హృదయంలో సంతాపం కల్గుతుంది. ఎప్పుడూను, ఓ ఉద్దవ! (91) ఆట పై ప్రీతి ఉండదు. అటువంటి ఇష్టం మళ్ళీనాకు. అంతటి ప్రేమ సౌభాగ్యము. నిర్జనంలో మనస్సు లగ్నం కాదు. (92) ఆతనితో సంగముంటే వృందావనానికి వెళ్ళను. నందనందుని వక్షః స్థలంలో చందనముంచకపోతే (93) ఆతనికి మాలవేయకపోతే, ఆతని ముఖం చూడకపోతే, మాలతి మొగిలి, చంపక వనాలకు (94) సుందర రాసమండలానికి మళ్ళీ వెళ్ళను. హరి దగ్గరుంటే రమ్యమైన చందనాటవికి వెళ్ళను. (95) మలయ పర్వతమందు రత్నమందిరానికి వెళ్ళను. రమ్యమైన మాధవి వనమునకు రహస్యమైన మధుకాననమునకు వెళ్ళను. (96) శ్రీఖండ కాననమునకు, స్వచ్ఛమైన చంద్రసరోవరానికి ప్రశాంతమైన సురవనము నందనము (వనము) పుష్ప(విమానము) భద్రకము (ఏనుగ)నకు వెళ్ళను. (97) మళ్ళీ మళ్లీ హరితో కూడి భద్రకమునకు వెళ్ళను. వసంతంలోఅందంగా పూచిన ఆ మాధవీలత ఏది? (98) ఆ మాధవీరాత్రి ఏది (లేదు) ఆ మధువెక్కడ? ఆ మాధవుడెక్కడ? అని పలికి ఆ రాధ కృష్ణుని పాదములు ధ్యానిస్తూ (99) మళ్ళీ మూర్ఛపోయి పులకాంకితురాలై ఏడ్వసాగింది (100) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు నారాయణ నారద సంవాదమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు రాధ ఉద్దవుల సంవాదమందు తొంబది మూడవ అధ్యాయము.
Summary of chapter 93 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Extolling the sacred geography of Lord Śrī Kṛshṇa's earthly advent, this chapter sings the supreme glories of Mathura-Maṇḍala, including Vṛndāvana, Govardhana, Gokula, Barsānā, and Nandagaon. The text asserts that taking a single step or spending a single night in these holy lands bestows spiritual merit superior to thousands of years of penance at other pilgrimage sites, as every grain of dust in Vraja is saturated with the divine love of Śrī Kṛshṇa and Śrī Rādhā.