స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
35వ అధ్యాయము
లోమశుడు చెప్పసాగెను- ‘ఇట్లు మహాదేవుడు వనమునకు వెళ్ళిపోగా, పార్వతి వీరహముచే బాధనొంది మేడలు, భవనాలలో సుఖమును పొందలేదు.(1) అన్ని భావములలో శివుని గూర్చి ఆలోచించుచూ వుండగా, మిత్రురాలగు విజయ పార్వతితో నిట్లనెను.(2)’ పార్వతీ! గొప్ప తపస్సు చేసి శివుని పొందితివి. వృథాగా ఆ తపస్వితో ద్యూతమాడితివి.(3) ద్యూతమున ఎన్నో దోషాలున్నవని వినలేదా నువ్వు? త్వరగా వెళ్ళి శివుని క్షమను కోరుము.(4) మేము కూడా వచ్చెదము, పద! పద!! (5) శివుడు దూరముగా పోయేలోపుననే అతనిని క్షమను కోరుము. లేనిచో శివుని బాధ పెట్టి, తరువాత నీవు దుఃఖించెదవు. తప్పదు.’(6) అనగా సమధీరచిత్తయగు పార్వతి నవ్వుచూ ఆశ్చర్యమును కలిగించునట్లు సత్యమునిట్లు పలికెను.(7)’ ఆ శివుడు నాచేత జయింపబడినవాడు, సిగ్గులేని వాడు. పూర్వము గొప్ప ఐశ్వర్యముతో వరించితిని. ఇప్పుడు వెంటనే నేను చేయవలసినది లేదు. నేను లేక అతను విరూపమునే పొందును.(8) నా వల్లనే మహేశుడు రూపము గలవాడాయెను. అంతే- నాతో అతనికి పంయోగ వియోగములు లేవు.(9) నా చేతనే నిరాకారుడైన శివుడు పాకారుడైనాడు.(10)
దేవవరులతో కూడిన ఈ విశ్వమును చరాచరముతో వేమ పృజించితిని. క్రీడకై నేను సృజించిన దీని ఉత్పత్తి స్థితి హేతువులచే క్రీడించబోవు దానిని చూడుము.(11)' అని సర్వమంగళయగు గిరిజ శబరగా రూపుదాల్చి మహేశ్వరుని వద్దకు వెళ్ళగోరెను.(12) ఆ శబరి ఆందముగా మండి, ఎర్రని పెదవులతో, చక్కని కంఠముతో, బరువైన స్తనములలో, పొడుగుగా దట్టముగా పెరిగిన కేశములతో, పవ్నని నడుముతో, విశాల జఘనముతో, పచ్చని ఆరటిబోదెలవంటి తొడలతో, పెమలి ఈకమ తలపై దాల్చి పల్లెపడుచుగా అందముగా నుండెను.(13) చేతిలో తామరపూవు వంటి విల్లును దాల్చి, వెనుక కృత్రిమ కేతకి బాణముల అంబులపొది విలసిల్లుచుండగా పార్వతి సఖులనేకులు సంపేవించుచుండగా గిరీశుని చూచుచుండెను.(14) ఆడుతుమ్మెదల నాదముతో ముల్లోకములను నినదింపజేయుచూ పార్వతి మన్మథుని వెంటనే జీవింపచేయుచుండెమ.(15) రాజహంసలు, తుమ్మెదలు, నెమళ్ళు అన్ని వెంటనే మన్మథభావమును పొందెను.(16) సమాధియందు ఒక్కడిగా నున్న మహేశుని వద్దకు వెళ్ళి పార్వతి తన భృంగీనాదముచే మోహితుడైన శివుని చూచెను.(17)
సమాధిస్థితినుండి మేల్కొంచిన మహేశ్వరుడు ఎదుట శబరిని చూచి మదన పీడితుడాయెను.(18) దగ్గరకు వెళ్ళి చేతిని పట్టుకొన బోగానే సతీదేవి అతని ఎదుటనుండి మాయమయ్యెను.(19) అపుడు భ్రాంతిని నశింపజేయువాడైననూ ఆ మహాదేవుడు ఆది చూచి భ్రాంతినొంది ఆటునిటు తిరుగుచూ ఆ సుందరిని కొంచలేదు.(20) విరహముతోనున్న శివుడు మదన పీడితుడై, మదనుని దహించిన జ్ఞానరూపుడు మోహములేని వాడైననూ మోహమును పొంది గిరిజను చూచెను. అపుడు ఆ పల్లీయస్త్రీని చూచి ప్రస్తావమట్లు ఈ విధముగా ననెను.(21,22) సుందరీ! ఈ వనమున ఏకారణముచే తిరుగుచుంటివి? వాస్తవముగా తెలుపుము.(23) అనగా శబరి రూపముననున్న పార్వతి చెప్పెను. 'అన్నీ తెలిసి అన్నింటినీ ఇచ్చు స్వతంత్రుడు, నిర్వికారుడు, జగత్పతియగు పతిని వెదకుచున్నాను.(24) అనగా వృషభధ్వజుడగు శివుడు పార్వతితో అనెను. సుందరీ! నేనే నీకు తగిన భర్తను. వేరొకడు కాదు.(25) భామిని! సరిగా ఆలోచించుకొనుము.' అనగావిని పార్వతి నవ్వి ఇట్లనెను.(26)
‘మహానుభావా! నేను కోరిన పతివి నీవే. వేరే కాదుకదా! చెప్పుము. కాని నీకు శుభమగుగాక, ఒక మాట చెప్పెదను.(27) నిర్గుణుడవు కదా! గొప్ప తపస్సు చేసి నిన్ను వరించిన సుందరిని ఒక్కక్షణములో అరణ్యమున విడిచి వైచితివి.(28) విన్న ఆరాధించుట కష్టము. ప్రాణులన్నింటికి కూడా. కనుక నా ఎదుట నీవన్నది మరొకమారు నీవనరాదు,(29) అని శబరి అనగా విని శివుడిట్లు బదులిచ్చెను. ‘విశాలాక్షీ! అట్లనరాదు. ఆ అబలను నేను విడవలేదు. వదిలినట్లయితే చెప్పగలదేమున్నది.(30) అసహాయుడిని, అసహాయుల నిష్టపడువానినని తెలిసి నా మాటనాచరింపుము.(31) అని శివుడు అనేక విధాలుగా అభ్యర్థించగా గిరిజ వవ్వి ఉపహసించుచూ ఇట్లనెను.(32) ‘యోగీశా! నీవు తపోధనుడవు. విరక్తుడవు. ఏదీ అంటనివాడవు. నీయందే ఆనందము నొందు వాడవు, రెండవది లేనివాడవు, మదనునే వధించిన వాడవు.(33) అట్టి విరూపాక్షుడవైన నిన్ను నేనివాడు చూచితివి. అందరికీ పొందశక్యముగాని వానిని నేనెట్లు పొందగలను? కనుక మునుపు నేనన్నదాని నాచరింపుము.(34) అని పార్వతి అవగా విని మదనుని అంతమొనర్చిన శివుడనెను. సుందరీ! నీవు నా భార్యను కమ్ము. వేరొక విధముగా కాదు.(35)
అని పలికి ఆ పల్లె స్త్రీ చేతిని మదనాతురుడై పట్టుకొనెను - అంత ఆమె అతనిని విస్మయమొనర్చుచూ ‘వదలు, వదలు’ మని ఆదరముతో అనెను - (36) భగవాన్! తాపసుథవైన నీవిట్లు బలవంతము చేయుట తగదు -నా తండ్రివి నాకై యాచించుము - వేరొక విధముగా బలవంతపెట్టరాదు’ - (37) అనగా శివుడనెను. ‘సుందరీ! త్వరగా చెప్పుము • ఎక్కడున్నాడు నీ తండ్రి? ప్రణిపాతముతో అతనిని చూడదలిచితిని - (38) అనగా అపుడు అందమైన కళ్ళుగల పార్వతి శివుని తన తండ్రివద్దకు తీసుకొనివచ్చెమ - (39) కైలాస శిఖరమున పెక్కు సర్పములతో కూడిన గొప్ప కాంతిగల హిమవంతుని వద్దకు తెచ్చెను - (40) ద్వారము వద్ద నిలిచిన తండ్రిని చూపించి అతనిని యాచింపుము’ అని శంకరునితో అనెమ - సిగ్గువిడిచి, వా తండ్రిని నాకై యాచింపుము. నన్ను తప్పక ఇచ్చును - ఆలసిలిచకు. (41) అనగా అట్లేనని శివుడు ఒక్కమారుగా వమస్కరించి హిమాలయునితో ననెను – ‘గిరివర్యా! సుందరియగు కవ్యయైన ఈ నీ కూతురిని ఆర్తుడినైన నాకిమ్ము’ - (42) అని కృపణుడై పలుకగా విని హిమాలయుడు లేచి మహేశుని దగ్గరకు తీసుకొని ఇట్లనెను - (43)
‘దేవా! నీకు తగవిదానివి నీవెట్లు ఇప్పుడు పలుకుచుంటివి? ముల్లోకములలో నీవే దాతవు, స్వామివి కదా(4) చరాచర జగత్తువంతా వినే వాదించియున్నాను’ అని అనేక విధములుగా హిమాలయుడు స్తుతించెను. ఇంతలో నారదుడు ఋషులతో కలిపి అక్కడకు వచ్చెను.(45) వవ్వచూ శివునితో నిట్లనెను. ‘రూలపాణీ! నమస్కారము! వాస్తవముతో కూడిన వా మాటను విమము.(46) స్త్రీలతో కలయిక అమవది మగవారిని ఎగతాళి పాలుచేయుమ. వీపు లోకములకు నాధుడవు. పరాత్పరుడవు. దివినంతాతరచి చూచి వాస్తవముమ పలుకవలెను.(4) అవి వారదుడు ప్రబోధమున గరుపగా శివుడు స్పృహనొంది నవ్వమ(48) ‘నారదా! నీవన్నదే నిజము. స్త్రీల పాంగత్యము చేతనే పురుషులు పతనమయ్యేదరు.(49) సందేహములేదు, వీమాట పత్యము. నేనీవాడు ఈ డ్రిచే మోహమునొంది గంధమాదనమునకు గొవి రాబడితివి.(50) ఈ పరమాద్భుతచరిత్రము పిశాచము వలె చేయబడినది.(51) కమక పర్వత సమీపమున నుండమ. వేడి మరల వనమునకు వెళ్ళిదనని శివుడు యోగులు కూడా పొందలే చోటికి వెళ్ళాను.(52)
ఆతమ విరాలంబుడని తెలిపి వారదుడు పార్వతితో, హిమవంతునితో, ఇతర సభ్యులతో విట్లవేమ.(53) ‘ఈ శివుని పరమార్థముగా అభివాదముచేసి స్తుతించి, క్షమించునట్లు చేయాలి. ఈ మహేశుడు లోకములకు నాథుడు. త్రిపురముల నాశకుడు’ గొప్ప కీర్తి గలవాడు.(54) అనగా నారదుని నోటిమండి వచ్చిన పలుకులమ వివి గిరిజను ఎదుట మంచుకొని పర్వతములన్నీ(55) శంకరుని ఎదుట దండప్రణామమునాచరించి, ప్రణతులై స్తుతించిరి.(56) ఆట్లు పుతించగా శివుడు గంధమాదవమునకు అంగిరసునితో వచ్చి మహర్షులలో వభిషేకింపబడెమ.(57) అపుడుదుందుభి మొదలైన వాద్యాలు మోగిమ. ఇంద్రాది దేవతలందరూ పుష్పముల కురిపించిరి.(58) బ్రహ్మాది సురగణములతో గిరిజతో అభ్యర్థింపబడిన పరమంద్యుడగు శివుడు వారిలో కూడి దివ్యాసవముపై మండి గొప్ప ఐశ్వర్యములో రాజిల్లిమ.(59) విప్రులారా! పరమశివుని ఇట్టి అనేక చరితములు, విమవారి పాపముల హరింపజేయునవి.(60)
రుద్రుని గొప్ప చరితములేవేవి గలవో అవన్నీ వింటిమి. ఇక మీకేమి చెప్పెదమ?(61) అనగా ఋషులనీరి- ‘సూతుడా! ఈ విధముగా వీవు శంకరుని చరితమును చెప్పగా మేము నిస్సంశయముగా తృప్తి నొందితిమి.(62) అనగా సూతుడనెమ’ వ్యాసుని ప్రసాదముచే నేను అద్భుతము, విస్తృతము,. వేదగర్భము, జ్ఞానాత్మకమైన ఈ శంకరరూపమద్భుతమగుదావివి వింటిని (63) ఎవరు భక్తితో, పరమశ్రద్ధతో ప్రీతితో శివుని కిష్టమయిన శివమాహాత్మ్యమున శివశాస్త్రమును వినెదరో, వినిపించెదరో వారు పరమగతివి పొందెదరు.(64)
ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మహేశ్వర ఖండమున కేదారఖండమున శివశాస్త్రమున పార్వతి శబరిరూపమువ శివుని గంధమాదనపర్వతము వద్దకు తెచ్చుట, బృహస్పతి శివుని రాజ్యాభిషిక్తుని జేయుట అను వావి వర్ణనమను ముప్పదియైదవ అధ్యాయము
ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున మొదటి కేదారఖండము సమాప్తము.
