స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
23వ అధ్యాయము
ఇంతలో మహేశుని చేత ప్రేరితులైన ఋషులు కూడా వెంటనే హిమాలయమునకు వచ్చిరి.(1) వారిని చూచి హిమవంతుడు వెంటనే లేచి ప్రీతిలో వారిని పూజించి, తలను వంచి ఇట్లు పలికెను.(2) ‘మీరే కారణముచేత ఇక్కడకు వచ్చారు? చెప్పండి’ అనగా సప్తర్షులు ఇట్లనిరి. ‘మేము మహేశుని చేత ప్రేరేపింపబడి వచ్చితిమి.(3) ఓ పర్వతరాజా! కన్యా దర్శనమునకై వచ్చినవారిగా మమ్ము తెలుసుకొని నీ కన్యను మాకు చూపించుము.’(4) అనగా పర్వతరాజు అట్లే అని పలికి పార్వతిని పిలిపించెను. పుత్రవాత్సల్యముగల హిమవంతుడు తన కుమార్తెను ఒడిలో కూర్చుండబెట్టుకొని నవ్వుతూ ఇట్లనెను.(5) ఈ కన్య నాకూతురు. ఇక నా మాటను వినుడు. తపస్వి జనమందరిలో శ్రేష్ఠుడు, విరక్తుడు, మదనుని సంహరించిన పోడు.(6) మన్మథుని అనంగునిగా చేసిన శివుడు వివాహము కోరువాడెట్లగుమ? చాలా సమీపమున నున్నవానికి, చాలా దూరమున నున్నవానికి, ధనవంతునికి, ధనహీనునికి, వృత్తి లేనివానికి, మూర్ఖునికి కన్యాదానము చేయుట ప్రశస్తము కాదు.(7) మూడునికి, విరక్తునికి, ఆత్మజ్ఞాఘను చేయువానికి, రోగికి, ప్రమత్తునికి కన్యాదానము చేయరాదు.(8)
కనక ఓ ఋషి శ్రేష్టులారా! వేమ బాగా ఆలోచించి మహేశ్వరునికి నా కూతురువివ్వవలెను- ఇది వా ఉత్తమ వ్రతము’ (9) అనగా వివి మహర్షులు వవ్వచూ ఒక్కమారుగా అతనితో ఇట్లనిరి.(10) ‘ఈ కవ్య తీవ్రమైన తపస్సు చేసి శిపునారాధించగా ఆ తపస్సు చేత సంతోషించిన శివుడిపుడు ప్రసన్నుడైనాడు(11) ఓ పర్వతరాజా! శివపార్వతుల మహిమను విదేమాత్రము ఎఱుగవు. కమక పార్వతిని శిపువకిమ్ము(12) మా మాటలను పాటించుము.’ అని మహాత్ములైన ఋషులనగా విని పర్వతేశ్వరుడగు హిమవంతుడు త్వరగా ఇట్లవమ.(13) ‘మేరు పర్వతమా! విషధా! గంధమాదవా! మందరా! మైనకా ఏమి చేయవలెనో వాస్తవముగా తెలుపుడు’(14) అనగా అపుడు మేవ వాక్యజ్ఞానము తెలిపినదై ఇట్లు పలికెను. ‘ఇపుడు తరచి చూచి ఏమి ఫలము? ఆనాడే జరగవలసినది జరిగినది.(15) ఓ మహామభాపులారా! పార్వతి శివునికొరకు దేవతల పని నెరవేరుటకు ఉద్భవించినది. శివునికి ఇవ్వబడవలసినదిగా అవతరించినది.(16)
ఈ పార్వతి రుద్రుని ఆరాధించినది. రుద్రుడీమెను అభిమానించెను. కనుక ఈ పతిని శివునికి ఇవ్వవలెను (1) శివపూబియందు పార్వతి కేవలము నిమిత్తముగా చేసినది. అని మేవ పలుకగా హిమవంతుడు సంతోషించి ఇట్లనెను. ‘ఋషులారా! నా ఈ కన్యను చూడుడు.’ (18,19) అటు పిమ్మట, అందమైన నేత్రములుగలదానిని, వడుముపై జారిన వడ్డాణము గల దానిని, వైడూర్య, ముత్యముల వలయముల ధరించుదానిని, ప్రకాశించు చంద్రుని రేఖవలెనున్న దానిని, లావణ్యమను అమృతమునకు బావివంటి దానిని, సుందరిని, చక్కని వస్త్రములధరించిన దానిని, శుభమును గూర్చు పార్వతిని చూచీ, ఋషులు కూడా మోహమునొందిరి. సంక్రాంతులైన ఋషులు ఏమీ మాట్లాడకుండా వుండిరి. విజ్ఞులైన ఋషులు గూడా ప్రమత్తులవలె మారి, కాంతిగలది అందమైనది, శివునికి ఇష్టమైనది యగు పార్వతిని చూచి స్తబ్దులైరి. (21) ఇట్లు పార్వతిని చూచిన ఋషులే మోహము వొందినపుడు దేవతలను గూర్చి చెప్పేదేమి? వారునూ అట్లే పార్వతిని చూచుచుండిరి.(22)
ఆటుపిమ్మట శివప్రియులైన ఋషులు మరల శివుని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి. (23) ఋషులు చెప్పిరి - దేవా గిరీంద్రుడు తన కూతురిని అలంకరించమ. ఇందు సంశయములేదు. వీవు దేవతలతో గూడి ఆమెను వివాహమాడుటకువెళ్ళుము (24) మహాదేవా! ఆత్మజునికై పార్వతిని త్వరగా చేరుము.’ అని ఋషులవగా విని శివుడునవ్వి ఇట్లనేమ (25) ‘మహానుభావులారా! నేమ మునుపు వివాహమున చూచిగానీ, వీవిగానీ యుండలేదు. కమక ఋషులారా! దానిని గూర్చినాకు విశేషముగా తెలియజేయుడు.’ (26) అనగా అపుడు ఋషులందరూ నవ్వుచూ శివునితో నవిరి. ‘దేవా! విష్ణువుమ, బ్రహ్మమ, ఇంద్రుని పిలుపుము (2) అట్లే ఋషిగణములమ, యక్షగంధర్వసర్పములను, సిద్ధులమ, విద్యాధరులను, కిన్నరులను, అప్పరసలను ఆహ్వానించుము (28) వీరేకాక పెక్కు ఇతర గణములను త్వరగా ఆహ్వానించుము. ఆవి వాక్యభలగు ఋషులు పలుకగా విని వాక్యవిశారదుడగు శివుడు విష్ణువున,బ్రహ్మమ, ఇంద్రుడివి, ఇతరులనందరినీ పిలుచుకొని రమ్మని నారదునితో వనేమ. (29,30)
లోకముల పవిత్రము జేయు విష్ణుపిత్రుడగు నారదుడామాటను శిరసావహించి త్వరగా వైకుంఠమునకు వెళ్ళెను. (31) అక్కడ పరమాసనమున కూర్చుండి లక్ష్మీదేవిచేత సేవింపబడుచున్న చతుర్భుజుడగు విష్ణువును చూచెను - విష్ణుమూర్తి గొప్పకాంతితో, నీలోత్పలము వంటి ఛాయతో ప్రకాశించుచుండెను (32) గొప్పరత్నములగల అందమైన కుండలములు ధరించి, గొప్పకిరీటమునందలి రత్నములతో ప్రకాశించుచూ, వనమాలయగు వైజయంతితో భువనైక సుందరుడిగా నుండెను. (33) అట్టి విష్ణువును సమీపించి నారదుడు బ్రహ్మవీణను మీటుచూ శివుని వాక్యమును ఆదరముతో తెలియజేసెను. (34) ‘మహావిష్ణు! నీవు త్వరగా శివుని వివాహమునకై రమ్ము, నీవొక్కడివే కార్యసాధకుడవు’ (35) అనగా విని విష్ణుమూర్తి నవ్వి నారదునితో ననేను – ‘శూలమును ధరించు శివునికి వివాహము నందెట్లు మనసేర్పడెను?’ అని అన్ని విషయములు తెలిసిన వాడైననూ విష్ణుమూర్తి నారదుని అడిగేను
నారదుడు చెప్పెను – ‘పార్వతి గొప్ప తపస్సు చేయగా శివుడు సంతోషించి గిరిజ వద్దకు తానే వచ్చెను (37) అంతేకాక తనకు ‘దాసోహమని కూడా పలికి తనను వరించుమని వేడుకొనెను - (38) ఇప్పుడట్టి శివుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు అవి త్వరగా చెప్పిన - నారదుని మాట విని; నారదునితో ఇతర సభ్యులతో కలిసి (39) యోగీశ్వరుల ప్రభువు, అచ్యుతుడు అగు హరి గరుడుని అధిరోహించి ఆకాశమార్గాన వెళ్ళాను. (40) అతనిని చూచి యోగులచేత ధ్యానింపబడదగు పాదపంకజములు గల శివుడు లేచి ఎదురువెళ్ళి సంతోషముతో అతనిని కౌగలించుకొనెను. (41) అపుడు హరిహరులిద్దరూ ఒకదగ్గర కూర్చొని పరప్పర క్షేమముమ, కుశిలమును ఆడిగిరి (42) ఈశ్వరుడనెను - విష్ణూ! నిస్సందేహముగా నేమ పార్వతి తపస్సుచే జయింపబడినాను- ఇప్పుడు వివాహమునకై హిమాలయుని వద్దకు వెళ్ళగోరుచున్నాము - (43) నిజంగా నేను నీముందు చెప్పుచున్నాము. ముమపు సతిని దక్షుడు నాకిచ్చినపుడు (44) సంకల్పవిధితో నేను పాణిగ్రహణము చేయలేదు. ఇపుడే వేమ కర్మ విస్తరమున మిగులచేయవలెను (45) పాణిగ్రహాణోచితమైన కార్యమును నేనెరుగను. అని శివుడనగా నవ్వి మధుసూదనుడు మాట్లాడబోవునంతలో బ్రహ్మ ఇంద్రునితో, ఇతర లోకపాలకులతో కలిసి అచటికి వచ్చెను(46,47)
అట్లే దేవాసురయక్షదానవులు, వాగులు, పతంగగణాలు, అప్సరసలు, మహర్షులు అందరూ కలిసి వచ్చి తలవంచి నమస్కరించి ఈశ్వరునితో అనిరి (48) ప్రభూ! మహాదేవా! మాతో కలిసి నీవు బయలుదేరుము. ‘అనగా విష్ణువు ప్రస్తావము వలే ఇట్లు మాట్లాడిను. (49) ‘శంకరా! నీవు గృహ్యోక్తవిధితో నాందీముఖము మొదలైన కర్మల చేయవలెను (50) వాందీముఖము మరియు మండవ స్థాపనమును ధర్మయుక్తముగా చేయుము. వేదజ్ఞానముగలవారు మహానదీ సంగమాన్ని విడిచి ఇతర స్థలములలో దీనిని చేయుదురు.(51) ఇప్పుడు మండవ స్థానమునుచేయుము.’ అనగా శివుడు ఆత్మహితమునకై అట్లే చేసెను.(52) శంకరుడు బ్రహ్మ మొదలగు వారితో కలిసి అభ్యుదయానికి ఉచితమైనదంతా చేసెను. బ్రహ్మతో కూడి కశ్యపుడు గ్రహముల పూజించెను.(53) అట్లే అత్రి, శ్రేష్ఠుడగు గౌతముడు, గురువగు భృగువు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు (54) మార్కండేయుడు, శిలావాకుడు, అక్షతశ్రయుడగు శూన్యపాలుడు, అగస్త్యుడు,చ్యవనుడు, గరుడు, మహామునియగు శిలాదుడు (55) మరియు ఇతర ఋషులనేకులు శివుని వద్దకు వచ్చి బ్రహ్మ చేత ప్రేరితులై విధిపూర్వకముగా చేయవలసినదానివి చేసిరి.(56)
వేదవేదాంగషరాగులైన వారంతాకౌతుకమంగళమును నిర్వర్తించి మహేశ్వరునికి రక్షమ చేసిరి. (57) తత్వవేత్తలగు ఋషులు ఋగ్యజుప్పామములతో కూడిన వివిధ సూక్తములతో పెక్కు మంగళములు చేసిరి .(58) పరమాత్మయగు శివునికి అభ్యంజనము మొదలైనవన్నీ ఆచరించిరి. అతని జటాజూటము ప్రసిద్ధిమాయెను.(59) అపుడు ముండమాల అనేక ముత్యములతో కూడినదాయమ. అంగభూతములైన సర్పములన్నియూ అదేక్షణము బంగారు ఆభరణములాయెను.(60) దేవదేవుడగు మహేశుడు అన్నిభూషణములవలకరించుకొని దేవతలు వెంటరాగా హిమాలయుని వద్దకు వెళ్లెను.(61) వరుని సహోదరియగు చండిక అపుడు భయముకలిగించునట్లు వుండేమ. చండి ప్రేతమును ఆసనముగా చేసికొని పాములే ఆభరణములు ధరించి యుండెను.(62) గొప్పకాంతిగల చండి బంగారు పూర్ణకలశాన్ని తలపై మంచుకొని జ్వలించుముఖముతో, ఉగ్రమగు కళ్ళలో పరీవారముతో కలిసి యుండెమ(63) అక్కడ వున్న వేలకొలది భూతగణములు విరూపములుగలవిగా మన్నవి.. దానితో కూడిన చండి వావి ఎదుట వికృతమైవ ముఖముతో నడిచెను.(64)
ఆ చండికి వెనుక పరమదారుణమగు రుద్రగణములు పదకొండు కోట్లు నడిచినవి. (65) అపుడుముల్లోకములు డమురుధ్వనితో, భేరీ భాంకార శబ్దముతో, శంఖముల నినాదముతో నిండెను. (66) అట్లే దుంధుభి ధ్వని యొక్క శబ్దముతో కోలాహలమేర్పడెను - దేవతలందరు ఉత్సుకతగలవారై సిద్ధులు, లోకపాలురతో గూడి గణముల ననుసరించిరి.(67) మహేంద్రుడు ఐరావతమునెక్కి మధ్యలో వెళ్ళుచుండెను - అతనికి శ్రేష్ఠమగు ఛత్రమును పట్టిరి.(68) చామరములతో వీచుచుండిరి. అట్టి మహేంద్రుడు దేవతలులనేకులు వెంట రాగా వెళ్ళుచుండెను. అపుడు వెంట వెళ్ళుచున్న అనేకమంది ఋషులు. (69) భరద్వాజుడు మొదలైన విప్రులు, శాకినిలు, యాతుధానులు, బేతాళ, బ్రహ్మరాక్షసులు.(70) భూత ప్రేత పిశాచములుమరియు ఇతర ప్రమధులు మొదలగు గణములు చండిని శివుని వివాహము గూర్చి ప్రశ్నించ గోరి వెంటనడిచిరి.(71)
చండి ఎక్కడకు వెళ్ళినది? అని వారు పరుగెత్తుతూ చూచి ఆమెను సమీపించి నమస్కరించి ఇట్లడిగిరి. (72) మేము లేకుండా ఎక్కడకు వెళ్ళుచున్నాను; వున్నదున్నట్లుగా చెప్పుము.’ అని వారు భైరవునితో కూడివున్న చండిని ఆడుగగా (73) ఆమె నవ్వి భూతములన్నీ వినుచుండగా ఇట్లనెమ. ‘శివుని పెళ్ళికై నేను శవాన్నెక్కి వెళ్లుచున్నాను.’ అని, (74) ‘అపుడు చండి శిరస్సుపై స్వయముగా బంగారు కలశాన్ని మోయుచూ, కరవాలి స్వరూపముతో నుండెను.(75) అన్ని భూతగణములతో కలిపి వారి ముందు నడిచెను. గణములన్నీ చండివి అమపరించగా, దేవతలు గణముల ననుసరించిరి.(76) ఇంద్రాది లోకపాలకులు మరియు ఋషులు వారీ ముందుండిరి. పార్షదులు ఋషుల వెంటనడిచిరి (77) వారు విష్ణువు యొక్క భావమును తెలిసినవారు. ముకుందుని కంటే మనోరమముగా మన్న వారు. వారందరూ మేఘచ్చాయగలిగి, వనమాలను, పూదండను ధరించి, శ్రీవత్సమను చిహ్నమును ధరించి, పీతాంబరముల ధరించి యుండిరి. (78) చతుర్భుజులు, కుండలముల ధరించినవారు, కిరీట, కటక, ఆంగదములు, హార, నూపుర, సూత్ర, కటిసూత్ర, అంగుళీయకముల ధరించి ప్రకాశిస్తున్న వారంతా మహాపురుష లక్షణములను కలిగివుండిరి - (79)
అసురులదునుమాడు విష్ణువు లక్ష్మీదేవితో వారి మధ్యనే వుండి నడిచెను (80) అపుడు ముల్లోకములతో కూడిన విశ్వమునకు మంగళమును కూర్చువాడు, మహాత్ములచే హృదయము నందు అధిష్టింపజేయబడినవాడు. జగదేకబంధువగు హరి శివునితో కలిసి నడిచెను (81) అతను గరుడునిపై కూర్చుని, లక్ష్మీదేవితో కూడియుండెను. మునీశ్వరులందరితో మన్న విష్ణువుమ చామరములతో వీచుచుండిరి.(82) అట్లే, బ్రహ్మ తన వాహనమునెక్కి వేదవేదాంగములతో, ఇతిహాస, ఆగమ. పురాణాదులతో కూడియుండెను (83) బ్రహ్మ, విష్ణువు, దేవతలు, ఋషులు మున్నగువారు - యోగీశ్వరులు కూడా పొందలేని వృషభవాహమని శివుని వెంటనుండిరి. (84) అపుడు శుద్ధస్ఫటికమువంటి వాడు, ధర్మమును పాలించు ధర్మప్రియుడు అగు శివుడు. వీరందరితో గూడి పార్వతి పాణిగ్రహణానికై హిమాలయమను పర్వతరాజు వద్దకు వెళ్ళాను (85,86)
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు పరమశివుని వివాహవర్ణనము అను ఇరవై మూడవ అధ్యాయము.
