స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
31వ అధ్యాయము
శౌనకుడు ఆడిగెను- విప్రా! మహాత్ముడగు కుమారుడు యుద్ధమున తారకుని వధించి ఏమి చేసెనో చెప్పుము (1) కుమారస్వామి, ఈ విశ్వమునంతా వ్యాపించిన శివుడే తపస్సుచే సంతోషించి పరమపదమునిచ్చును- (2) దర్శనమాత్రమున కుమారస్వామి ఫలమునిచ్చును. పాపులు, అధర్మవర్తులు, శ్వపచులైననూ (చండాలురైననూ) దర్శన మాత్రమున పవిత్రులగుదురు. సంశయము లేదు. (3) అని శౌనకుడనగా విని, వ్యాసశిష్యుడు, మహాప్రాణ్ణడగులోమశుడు మహాత్ముడగు కుమారుని చరితమునపుడు చెప్పసాగెను. (4) లోమశుడిట్లు చెప్పెను. దేవతలు జయింపలేని, వధింపలేని ఆ తారకుని యుద్ధమున వధించి కుమారుడు జయమునొందెమ. (5) కుమారస్వామీమహిమ శాస్త్రములన్నింటిలో చెప్పబడుచున్నది. వేదములు, ఆగమములు, పురాణములు, ఉపనిషత్తులు, పూర్వ ఉత్తరమీమాంసలు కూడా కుమారుడిట్టివాడని వర్ణించలేవు. (7) దర్శనము చేతనే లోకముల పవిత్రము చేయునితడు- లోకముల రక్షకుడని విని యముడు స్వయముగా. (8) బ్రహ్మ, విష్ణు, ఇంద్రులతో లోకములకు కల్యాణకారకుడగు శంకరుని త్వరగా సమీపించి వినయముగా స్తుతించెను. (9)
భర్గువికి, దేవునికి, దేవపతికి, మృత్యుంజయునికి, రుద్రునికి, ఈశామవికి, కపర్దునికి నమస్కారములు, (10) నీలకంఠునికి, శర్వునికి, ఆకాశమే అవయములుగా, రూపముగా గలవానికి, కాలునికి, కాలనాథునికి,కాలరూపికి నమస్సులు. (1) అని యముడు స్తుతించగా ఈశ్వరుడు ‘దేనికై నీవు వచ్చితివో చెప్పుమని అడిగిమ. (12) అంత యముడు ఇట్లు చెప్పెను’వాక్యవేత్తవగు ఈశ్వరా! విమము- పరమతపస్సుతో తుష్టిపొందువాడవు- (13) లోకపితామహుడగు బ్రహ్మా కూడా అట్లే తుష్టిని పొంది ఎల్లప్పుడూ వరములనిచ్చును. (14) ఆదే విధంగా వేదవేద్యుడు, పవాతమడగు విష్ణువు అనేక యజ్ఞములతో, ఉపవాసవ్రతములతో పంతోషించును. (15) ఆతవమగ్రహించి ఆద్వైతభావననిచ్చిన వరులందరూ కైవల్యమునొందెదరని నా అభిప్రాయము. వేరొక విధముగా కాదు. (16) అతను సంతోషించి భోగమున, స్వర్గాది సంపదలను ప్రసాదించును- సూర్యుడు, ఎమస్కరించిన అమగ్రహించి ఆరోగ్యము నిచ్చును- వేరొకవిధముగా కాదు- (17).గణేశుడు అర్ఘ్యపాద్యాదులచే, మంత్రావృత్తిచే నిర్విఘ్నముగా చేయును. (18) అట్లే ఇతర లోకపాలకులు యథాశక్తి ఫలములనిత్తురు. యజ్ఞాధ్యయన దానాదులతో సంతోషించిన వీరు ఫలములనీత్తురు. (19)
అన్ని ప్రాణులకు మహదాశ్చర్యము కలిగించునట్లు వీ పుత్రుడొనరించెను - దీవిచే స్వర్గద్వారము తెరువబడినది - (20) కుమారస్వామి దర్శవముచే వరులందరూ స్వర్గవాసులైరి. మహాదేవా! పాపులైనమా స్వర్గమున వివసింతురు. సందేహములేదు. (21) దేవా కార్యము, అకార్యమూ ఇట్లుండ, మరి నేనేమి చేయవలెను? పత్యలురు, శాంతులు, పూజ్యులు, అవగ్రహము లేనివారు (22) జితేంద్రియులు, లోభము లేనివారు. కామము, రాగము లేనివారు, యజ్ఞములు చేయువారు, ధర్మనిష్టులగు వేదవేదాంగవేత్తలు (23) ఏ గతిని పొందెదరో ఆ గతవి అధములు,చండాలురు కూడా కుమారస్వామి దర్శనముచే పొందుచున్నారు. (24) మహదాశ్యర్యమును కలిగించు కర్మవొనరించిన మహాత్ముడగు కుమారువి, కృత్తికతో కూడియుండగా కార్తికమున చూచిన వారు కోట్లకొలదిగా తమ కులములతో వా స్థానమున వీడి (వరకమున వీడి) చండాలురైనమా త్వరగా పద్ధతిని పొందెదరు. ఇట్టి తరి నేనేమి చేయవలెను?.(25,26,2) అవి యముడవగా విని శంకరుడిట్లనెమ. (28)
‘ధర్మరాజూ! ఏ పాపకర్ములగు జనులకు పాపము లోపల మాత్రముండునో వారికి విశుద్దభావన మనసులో మన్నట్లే. (29) మంచి తీర్థములను చూడ వెళ్ళుటకై, సత్పురుషులను చూచుటకై వారికి పూర్వజన్మనుండి వచ్చు తీవ్రమైన కోరిక వుండును. (30) ఎన్నో జన్మల చివర వా యందు భావము కొనసాగును. ప్రాణులకిది జన్మాభ్యాసముచే ఏర్పడునది. (31) కమక ఈ భావమేర్పడు వారందరూ పుణ్యాత్ములే. జన్మజన్మలనుండి వచ్చువానికి విస్మయం పొందరాదు. (32) స్త్రీలు, బాలురు, శూద్రులు, చండాలురు, అధములు వీరందరూ పూర్మజన్మ సంస్కారవశము చేతనే పాపయోనినొంది. పాపులతో జీవించుచున్ననూ వీరు పవిత్రులగు మావవులే - (33) స్వచ్ఛమైన మనస్సుతో వారందరూ అన్ని విషయములు తెలిపిన వారయ్యేదరు- పూర్వమాచరించిన దానిచే భాగ్యవశాత్తు వారందరూ ఇంద్రాది దేవతలు, లోకపాలురూ అయ్యేదరు- (34) ఈ భూతగణములు, ఋషులు, ఈ దేవతలు ఇట్టివారే. (35)కనుక, వీవు కుమారుని విషయమున విస్మయమును పొందరాదు - కుమారదర్శవమువమా అట్లే, ధర్మరాజా! విమము. (36)
కర్మతో కూడిన ఈ మాట అందరికీ ఫలమునిచ్చునది - అన్ని తీర్థములు యజ్ఞములు, దానములు, వివిధ కార్యములు కేవలం మనస్సు శుద్దమగుటకే - ఇందు ఆలోచించవని లేదు - (37) ఆత్మ మనస్సుచే భావింపబడుమ - అట్లు తమ తాపేభావించుకొమన - అట్టి ఆత్మగా వేవే అన్ని ప్రాణుల యందునున్న వాడను - (38) అన్ని ప్రాణుల ఆత్మయందెల్లప్పుడూ వున్న వేమ భావముతో కూడుకున్న వాడమ - వీకు నిజము చెప్పుచున్నాము. (39) ద్వంద్వములు దాటివ, సాక్షాత్తు విర్వికల్పుడివి. ఆత్మయందుండిన నిత్యుడివి, నిత్యము యోగమునందుండువాడివి, కోరికలు లేనివాడమ. ఏ మార్పులూ లేక కల్పభేదభేదములు లేక కేవల జ్ఞానముచే తెలియబడువాడివి, అంతము లేని వావివి. (40) కేవలుడిగా జ్ఞానలక్షణుడగు ఆత్మవే మరిచి ఈ సమస్త జీవరాశులు సంసారచక్రమువ భ్రమించుచూ కనిపించుచున్నవి - (41) వేమ బ్రహ్మ, విష్ణువు ముగ్గురమూ గుణములన చేయుచూ సృష్టి, పాలవ, సంహార బాధ్యతలను చేపట్టితిమి వేరొక విధముగా గాదు - (42) అహంకారముచే ఆవరింపబడిన కర్మచేతనే మేము, మీరు, దేవతలు, మనష్యులు, పక్షులు మున్నగునవి. (43) పశువులు మున్నగునవి చేయబడినవి • అట్లే వేరువేరుగా చేయబడిన మిగతా జీవులమీ. (44)
ఎండమావుల యందు పడి మాయచే బద్దులైన మనమందరమూ పండితులమనుకొనెడి అజ్ఞాలము - (45) ఒకరినొకరము దూషించుకొనుచూ, మిధ్యా వాదములందాసక్తి గలిగి దుర్జమలమగుచున్నాము. (46) మూడు గుణాలుకలిగి సంసారమును పొంది తత్యమును తెలియక బంధమును పొందినారము. కామ, క్రోధ, భయ, ద్వేష మద, మాత్సర్యములు గలవారము. (47) ఒకరినొకరము దూషించుకొనుచూ తత్యమునెఱుగక బహిర్ముఖులమైతిమి . కనుక, ఇట్లు గుణభేదముచే అసత్యమును బాగుగా తెలిసి, గుణములకతీతమైన సత్యపదార్థమందు పరమార్థమగు ఆభేదదర్శనమును, అద్వైతదర్శనమును పొందవలయును. (49) దేనియందు భేదము ఆభేదమును, రాగము విరాగమును, క్రోధము ఆక్రోధమును పొందునో అదే నా స్థానమని తెలియును. (50) ఘటము వలె కృత్రిమమైనందువలన శబ్దము కూడా దానిని ప్రకాశింపచేయజాలదు. ప్రవృత్తి పరమమైనందున శబ్దము కూడా పుట్టునదే. (51) ప్రవృత్తి నివృత్తి మొదలగు ద్వంద్వాలు విలీనమగునది శాశ్వతస్థానమనబడును. (52) భేదములు గుణములు లేక జ్ఞప్తిమాత్రమై, దేనికీ అంటక, వికారములు కోరికలు లేక సత్యమై, జ్ఞానముచే పొందదగునది యని తెలిసినవారు స్వస్థులై సమబుద్ధితో మెలిగెదరు. (54) ఓ ధర్మరాజా! మాయామయమై, అనాది మూలముగా నున్న సంసారమును దాటి, మాయను వదిలి, మమకారమును, రాగమును విడచి నిర్వికల్పస్థితిని పొందెదరు. (55) ఈ సంసారమునకు కల్పనయే మూలము. అది అమృతము వంటిది (నాశనము లేనిది) ఎవరు ఈ కల్పనను విడిచెదరో వారు పరమగతిని పొందెదరు. (56)
ముత్యపు చిప్పన వెండిగా భావించుట, సర్పమును తాడుగా భావించుట, ఎండమావిని ఏటికలమగా భావించుట యన్నది మిథ్య - (57) స్వతంత్రముగా ప్రవర్తించుట సిద్ధి, పారతంత్ర్యమన్నది అసత్యము. ఆధారపడి యున్నవాడు బంధముననుండును స్వతంత్రభావన గలవాడు ముక్తినొందును - (58) ఒకే ఆత్మను తెలిసి, మమకారము, ఆవగ్రహము లేనివారికి బంధనమెక్కడిది? ఆది గగనకుసుమమే కదా! (59) సంసారమను జ్ఞానము కుందేటి కొమ్ము మాత్రమే. నిష్పలమైనది. అధికముగా చెప్పి లాభమేమి? (60) మమకారమును విడిచి పరమపదమును పొందగోరువారు. జ్ఞానులు, విద్వాంసులు, విరాగులు, జితేంద్రియములు. (61) ఎవరు మమకారమును వీడి, లోభకోపములను, కామక్రోధములను విడనాడి వుందురో వారు పరమస్థితిని పొందుదురు. (62) శబ్ద మాత్రమున బోధన చేయు వారు, కామ క్రోధ లోభరాగద్వేషములు వున్నంతవరకు ఆ సిద్ధిని పొందలేరు. (63) అని చెప్పగా యముడిట్లడిగెను. 'శబ్దము నుండి శబ్దము ప్రవర్తించుచో నిశ్శబ్దము జ్ఞానమే కదా! మరి శబ్దము నిత్యమని నీ వెట్లంటివి ప్రభూ? (64) అక్షరమైనది పరబ్రహ్మ ఈ అక్షరరస్వరూపమే శబ్దము కనుక నీవన్న శబ్దము నిరీక్షకము (సాక్షి యనబడునని వినుచుంటిమి. (65) ఈ శబ్దము లేకుండా ఏదైననూ ఎట్లు ప్రతిపాదించబడును? ఏమి చేయవలెనో, ఏమి చేయరాదో దీనిని తెలియజేయుము పరమశివా! - (66) అని అడిగెను.
అపుడు పరమశివుడిట్లు బదులిచ్చెను. శ్రద్దగా నీవీ పరమార్థమగువచనమును వినుము - దీనిని వినినంత మాత్రమున ఇక తెలుసుకొనవలసినది వుండదు - (67) ఏమాత్రము కల్మషమూ లేని ఋషలందరూ జ్ఞానమును గూర్చి తెలుపువారు, జ్ఞానమునభ్యసించుచూ వుందురు - ఇదే జ్ఞానమని అది తెలిసినవారందురు. (68) జ్ఞానమే తెలియబడవలసినదిగా, జ్ఞానముచే పొందదగినదిగా, తెలియువానిగా చెప్పబడుచున్నది. ఏది, ఎవరిచే ఎట్లు తెలియబడవలెనో, చెప్పదలిచితిని - (69) దీవితంలో క్లుప్తంగా చెప్పెదను వినుము. ఒక్కటే యైననూ భేదబుద్దిచే అనేకముగా కనబడును. (70) తల తిరుగువాడికి భూమి తిరుగుచున్నట్లేలా కనబడునో, భేదబుద్ధికలవానికి ఈ ఆత్మ అనేక ప్రకారములుగా కవబడును. (71) కనుక, చక్కగా విచారించి శ్రుతి చేతనే దానిని తెలియవలయును. తరువాత విశేషముగా మననమును చక్కగా ప్రయోగించి చింతించవలెను. (72) అటు తరువాత అనుభవముచే నిర్ధారించినచో సుఖముగా బంధమునుండి ముక్తుడగుమ. చరాచరజగత్తంతా మాయతో కూడివున్నది. (73) మమకారమే లక్షణముగా గల ఈ గొప్ప సంసారము మాయతో కూడినదే. ఈ మమకారమును తనలో నుంచి తొలగించిన బంధము సుఖముగా విడిపోవుమ. (74) నేనెవరు? నీవెవరు? మహామాయవవలంబించి వుండు మిగతావారెవరు? ఈ ప్రపంచము మేక మెడవద్ద చన్నువలె విరర్ధకము (75) ఫలము లేవి ప్రపంచమిది ప్రకాశములేక పొగవలె కనబడునది. కమక ఏ విధముగానైనా ఆత్మనే స్మరించుము - అని శివుడు చెప్పెను.(76)
అని లోమశుడు చెప్పసాగిమ – ‘ఈ విధంగా శివునిచే ప్రేరితుడైన యముడు జ్ఞానముమపొంది పాక్షాత్తు ఆత్మయై మిగిలేమ. (77) కర్మలన్నిటి శాపకుడు అగు యముడు కర్మామపారము నరుల భూతములకు డంబరమాయిమ. (78) అని చెప్పగా ఋషులిట్లడిగిరి. ‘అయ్యా! కుమారుడు తారకుని యుద్ధమున వధించి మహాద్భుతమైన దేమి చేపెవో చెప్పుము’. (79) అవగా అపుడు సూతుడు ఇట్లు చెప్పిన-’ తారకాసురుడు వధింపబడగా హిమవంతుడు మొదలైన పర్వతములు కార్తికేయుని వద్దకువచ్చి రమ్యమైన వాక్కుతో ప్రతింపసాగిరి. (80) కల్యాణరూపునికి, విశ్వమంగళువికి, విశ్వబంధువుకు, విశ్వభావమనకు నమస్కారములు, (81) ఎవరి దర్శనముచే చండాలురు కూడా శ్రేష్ఠులుగా చేయబడిరో అట్టి వీకు నమప్పులు. జగద్బంధువైన విన్న మేము శరణుజొచ్చితిమి. (82) పార్వతీపుత్రా! శంకరాత్మజా! కృత్తికాసూమా! అగ్ని భూతా! నీకు నమస్కారములు. (83) దేవతాశ్రేష్ఠులచే పూజింపబడు వీకు నమస్కారము - జనులలో శ్రేష్టుడవగు దేవవరా నమస్కారము, ప్రసన్నడవు గమ్ము అందరికీ, అన్ని విధాల ఆర్తివి వశింపజేయుటలో వివే నేర్పరివి. శరణుజొచ్చుచుంటిమి. (84) అని పర్వతములు స్తుతించగా పార్వతీపుత్రుడగు కార్తికేయుడు ప్రపమ్నడై వారికి వరమునివ్వమత్పుకుడాయెన - (85)
వారినుద్దేశించి కార్తికేయుడిట్లనెను - ఓ పర్వతరాజులారా! నా మాటనిపుడు వినుడు - మీరు కర్మఠులు, జ్ఞానులగుజములచే పేవింపబడెదరు (86) ప్రయత్నముచే సేవింపబడు శిలలు మీ యందే మండును కదా! వామాటపై ఆ శిలలు తప్పక విముమ, పవిత్రము చేయును (87) పర్వతపంబంధి తీర్థములగుమ - దివ్యములగు శివాలయములు, ఆయతనములు, విచిత్రముగా అందమగు ఈ నేలపులన్ని పర్వతములపై వెలయును. పర్వతములారా! వా మాటపై ఇట్లగును. సందేహము లేదు (88,89) సొ తాతయగు హిమవంతుడు తపస్సు నాచరించువారికి ఫలమునిచ్చుమ. (90) పర్వతరాజగు మేరువు ఆశ్రయమగును. లోకాలోక పర్వతము, ఉదయాచలము లింగరూపమున నుండును. శ్రీ శైలము, మహేంద్రపర్వతము, సహ్యాద్రి, (92) మాల్యవాన్, మలయ, వింధ్య, గంధమాదన, శ్వేత కూట, త్రికూట, దర్దుర (93) పర్వతములు, మరియు మిగతావన్నీ లింగరూపమును దాల్చుమ. ఇవి వా వాక్యముచే పాపమును తొలగించువవే యగును, (94) అని కార్తికేయుడు ఆ పర్వతములకు వరము విచ్చెను. అటు తరువాత నంది అన్ని ఆగమములమ పురస్కరించుకొని ఇట్లడిగెను.(95)
‘నాథా! నీవు పర్వతములన్నీ లింగ రూపమునుండునట్లు చేసితివి. మరి అందరు దేవతలచే శివాలయములెట్లు పూజింపదగినవి కాగలవు? (96) అని అడుగగా కుమారస్వామి ఇట్లు చెప్పెను. ‘అందరు మానవులు, దేవతలు, బ్రహ్మాదులు ఆలపించక శివాలయము శివునికి చిహ్నమని (లింగము) తెలియవలయును -(97) నీలము, ముత్యము. ప్రవాళము, వైడూర్యము, చంద్రకాంతము, గోమేదము, పద్మరాగము, మరకతము, బంగారము (98) ఆట్లే వెండి, రాగి, వాగమయము, రత్నధాతువులతో కూడినవి లింగములని చెప్పబడినవి. (99) ఇవన్నీ పవిత్రములు, పూజింపదగినవి, అన్ని కోరికల దీర్చునవి. వీటన్నింటిలో కాశ్మీరమునకు చెందినది విశేషమైనది . (100) ఇది తనను పూజించినవానికి ఇహ, పరములకు చెందినదంతా ప్రసాదించును. (101)
అపుడు నంది ఇట్లడిగెను - అన్నిలింగములలో బాణలింగమే ఉత్తమమైనదనీ, పూజింపదగినదవీ నీవంటివి.. అదెట్లో చెప్పుము. (102) అనగా కుమారస్వామీ ఇట్లు చెప్పిన - రేవావదియందు వీటి మధ్యలో ఏ శిలలు కనబడుతో అవి శివుని అనుగ్రహముచే లింగరూపములే అగును - వేరే కాదు - (103) వాని మూలములను మునుపు చేసి, ఆధారముపై నుంచి శివదీక్షయందుండి పూజించవలెను (104) పానవట్టముతో శాప్రోక్త విధితో పూజించినచో, జగన్నాథుడగు శివుడు వరమునిచ్చువాడగును (105) ఎవరి నోటిలో ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రముండునో, చిత్తమును మరల్చి శివుని గూర్చి చింతించువాడెవరో అట్టివాడు అన్ని ప్రాణులయెడ సమబుద్ధిని కలిగి , పరివాదవిషయమున మూగవానిపలెనుండి, ఇతర స్త్రీలయందు నపుంసకునివలెమండును (106)
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున శివశాస్త్రమగు కేదారఖండమునందు కార్తికేయుడు చెప్పిన శివలింగమాహాత్మ వర్ణనమను ముప్పదియొకటవ అధ్యాయము.
