స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
21వ అధ్యాయము
లోముడు చెప్పిన- పార్వియగు పార్వతి ప్రతిదినము పెరుగుచున్నదై ప్రకాశించేమ. ఆమె హిమవంతుని ఇంట ఎనిమిది పంవత్సరాల బాలికగా పెరిగిమ.(1) పరమశివుడు హిమవత్పర్వతముపై వీరభద్రుడు మొదలైన తన గణములన్నీ కూడియుండగా గొప్పతనము జేమ.(2) ఇట్లు తపప్పున చేయుచున్న మహేశునివద్దకు అతవి పాదకమలమున చూచుటకై హిమవంతుడు పార్వతితో కలసి వచ్చెమ.(3) చూచుటకు వచ్చిన హిమవంతుని ద్వారము వద్దమన్న నంది అడ్డగించమ. ఒక క్షణము కదలకుండా విలిచెను.(4) హిమవంతుడు నందిద్వారా విజ్ఞాపనము చేసెమ. పర్వతరాజు చూడగోరి వచ్చేవని నంది శివునికి విన్నవించెను.(5) వంది మాటను వినిన పరమేశ్వరుడు ‘ఆ పర్వతమునిటు గొని రమ్మవి’ నందికి చెప్పెమ.(6) అట్లేనని పలికి నంది పర్వతరాజగు హిమవంతుని లోకములకు కల్యాణముల కలుగజేయు శివుని వద్దకు గొనివచ్చెమ.(7) అపుడు సకలేశ్వరుడు ప్రభువు, కమలు మోడ్చి తపము జేయుచున్న వాడు, జటాజూటము గలవాడు, చంద్రుని కళామ తలపై ధరించినవాడు, వేదాంతములచేత మాత్రమే తెలియబడువాడు, పరమాత్మయందు నీలిచిన వాడు, అగు పరమేశ్వరుని హిమవంతుడు చూచెను.(8) గొప్ప శక్తిగల హిమవంతుడు పరమానందము నొంది తలవంచి నమస్కరించెను.(9) వాక్యజ్ఞానము గల వారిలో శ్రేష్ఠుడగు హిమవంతుడు జగదేక శుభమునొనర్చు శంకరునితో విట్లనెను.(10)
‘శంకరా! వీ అమగ్రహము చేత నేమ భాగ్యము గలవాడనైతిని - ప్రభూ! నిన్ను చూచుటకు నేను ప్రతిదినమూ వచ్చెదను.(11) ఈ పార్వతితో వచ్చుటకు నాకు అమమతి నిమ్ము’ అని హిమవంతుడనగా దేవదేవుడగు శివుడు విని ఇట్లనెమ.(12) పర్వతరాజా! నమ్న చూచుటకు నీవు ప్రతి దినమూ రావచ్చును. కానీ వీ ఈ కుమార్తెను ఇంటిలోనుంచి మాత్రమే- వేరొక విధముగా నా దర్శవము కలుగదు. (13) అపుడు హిమవంతుడు తలవంచి శివునితో ‘ఈ కన్యతో సహా నేనెందుకు రాకూడదో తెలియజేయండి’ అనేమ. అపుడు శివుడు వప్పుచూ ఇట్లు పలికేమ(14) ‘ఈ బాలిక అందమైన శరీరము గలది, చక్కగా మాట్లాడునది. నా వద్దకు ఈమెను వీపు తీసుకొని రావలదు. మరల మరల వారించుచుంటిని’ (15) అనగా నిస్పృహలో విష్ణురముగా మన్న ఆ మాటమ విని పార్వతి నవ్వి శివునితో నిట్లనెమ.(16)
గౌరి పలికెను- ‘తపఃశక్తితో కూడుకొని యున్న వీవు గొప్పతపము నాచరించుచుంటివి. శంకరా! మహాత్ముడవగు నీకు తపమాచరించు బుద్ధి ఏర్పడినది.(17) నీవెవరు? సూక్ష్మమగు ప్రకృతి యేది? తరచి చూడుము.’ అని పార్వతి పలుకగా విని శివుడిట్లనెను.(18)
ఘోరతపస్సు చేత నేమ ప్రకృతివి లేకుండా చేసెదమ. ప్రకృతి లేకుండా వేమ వా వాస్తవ రూపములో మండెదమ- కమక సిద్ధికై, ప్రకృతిలో సంగ్రహమెన్నడూ చేయరాదు.(19)
పార్వత్యువాచః-
పార్వతి పలికెను. శంకరా! పరావొక్కుతో నీవు పలికితివి. అది ప్రకృతి కాదా! వీవు దానికంటే అతీతుడెట్లయితివి?(20) ఇపుడు మనకు వాగ్వాదముతో నేమి లాభము? నీవు వింటున్నది, తింటున్నది, చూచుచున్నది (21) ఇదంతా ప్రకృతి యొక్క కార్యము- మిథ్యావాదము ప్రయోజనములేనిది. ప్రకృతికంటే పరముగా నుండుచూ తపమెందుకాచరించు చుంటివి?(22) ఓ ప్రభూ! ఈ హిమవత్పర్వతముపై నీవు ప్రకృతితో కూడియున్నావు. నీకది తెలియదా? (23) వాగ్వాదము చేత నేమి ప్రయోజనము? ప్రకృతి కంటే పరముగా నున్నానని నీవన్నది నిజమైన యెడల నీ విపుడు నానుండి భయము పొంద పనిలేదు.(24) అనగా విని శంకరుడు నవ్వి పార్వతితో నిట్లనెను.(25)
మహాదేవుడు పలికెను- ‘మంచి మాటలను పలుకు పార్వతీ! నీవు ప్రతిదినమూ నా సేవను జేయుము’ (26) అని పలికి శివుడు హిమవంతునిలో ననెను. ‘ఈ భూమీయందు నేను తపము నాచరించుచూ వుండెదను (27) పర్వతరాజా! తపము చేయుటకు నాకనుమతి నిమ్ము- అనుమతి లేకుండా తపస్సు చేయుట సాధ్యము కాదు.’(28) అవగా శూలము ధరించు దేవదేవుని మాటవిని హిమవంతుడు నవ్వి ఇట్లనెను.(29) ‘మహాదేవా! దేవతలు, అసురులు, మానవులు గల ఈ జగత్తంతా నీదే. వామాటేమున్నది? తుచ్చుడ నీకిచ్చెదను’ (30) అని పలుకగా వవ్వి శంకరుడు హిమవంతునికి సాదరముగా ‘వెళ్ళుమ’ని పలికెను.(31) శంకరుని అనుమతిని పొంది హిమవంతుడు తన ఇంటికి వెళ్ళి ప్రతిదినమూ శివుని దర్శనానికై పార్వతితో సహా వచ్చుచుచుండెను.(32) ఇట్లు శివుని ఉపాసవయందు వారిరువురికీ కొంతకాలము గడిచెను.(33) అక్కడే తండ్రి, కూతురు ఇరువురూ కాలము గడుపుటమా, శివుని పొంద శక్యముగాక పోవుటయూ చూచి దేవతలు చింతను పొందిరి.(34) మహేశ్వరుడెట్లు పార్వతిని కలియగలడు? అని దేవతలు చింతించుచూ బృహస్పతిని కలిసి ఏమి చేయవలెనో తెలుపుమని అడిగిరి (35) అపుడు బృహస్పతి మహేంద్రునితో ‘ఈ విధముగా చేయవలెను. వినుమనెను (36) ‘రాజా ఈ పనిని మన్మథుడే చేయగలడుముల్లోకములలో వేరెవరూ సమర్థులు కారు. అతను తాపసుల తపస్సును భంగపరుచును - కనుక త్వరగా అతనిని ప్రార్థించుడు.(37)
బృహస్పతి మాటను విని ఇంద్రుడు మన్మథుని పిలిపించెను. ఆ పిలుపునందుకొని కార్యమును సాధించు మన్మథుడు వచ్చేను.(38) రతితో కలిసి, మాధవునితో సహ, పుష్పధనువును చేత ధరించి మన్మథుడు ఇంద్రుని వద్దకు వచ్చి సభయందు గర్వముతో, లోకముల మనస్సును హరించునట్లు పలికెను.(39) ‘ఓ ఇంద్రా! నన్నీనాడు పిలిపించిన కారణమేమి? నేనేమి చేయవలెను? ఆలస్యము చేయక తెలుపుము (40) నన్ను స్మరించినంత మాత్రాన తాపసులు భ్రష్టులైరి. నా వీర్య పరాక్రమములు నీకే తెలియును. (41) నా శక్తిని శక్తి పుత్రుడగు పరాశరుడు ఎరుగును- ఇట్లే భృగువు మొదలైన ఋషులెందరో నా శక్తినెరుగుదురు.(42) గురువుకు తెలియుమ. ఉతథ్యుని భార్యకు తెలియును. ఆమె యందు పుట్టిన భరద్వాజుడు గురువుతో సంకరమే కదా!(43) భరద్వాజుడు మహానుభావుడని గురువనెను- ప్రజాపతి కూడా నా శక్తిని, శౌర్యమునూ ఎరుగును.(44) గొప్ప బల పరాక్రము గల క్రోధము వా బంధువు. ఈ కామక్రోధముల చేతనే చరాచర జగత్తంతా కరిగి పోవును- బ్రహ్మ మొదలు స్తంబము వరకు చరాచరమంతా తేలిపోవును-(45)
దేవతలనిరీ- మన్మథా! మమ్ములను జయించుటకు నీవెప్పుడూ సమర్థుడవే - దేవతల పనినెరవేరుటకు శివుని వద్దకు వెళ్ళుము. పార్వతితో కూడునట్లు శివుని చేయుము.(46)
ఇట్లు దేవతలు అభ్యర్థించగా మన్మథుడు అప్పరసలతో కలిసి త్వరగా వెళ్ళాను. (47) గొప్ప ధనస్సు గల మన్మథుడు పూలవిల్లును ఝళిపించి, మనోహరమైన బాణాలను చేత ధరించి, భువనములను జయించు యోధాగ్రేసరుడగు మదమడు హిమవత్పర్వతముపై కావవచ్చెను.(48) అపుడక్కడికి రంభ, ఊర్వశి, పుంజికస్థలి, సుమ్లోచ, మిశ్రకేశి, సభగ, తిలోత్తమ (49) మరియు ఇతర అప్సరసలు మదనునికి సహాయము చేయుటకై వచ్చిరి. వారిని మదనుడు చూచెను.(50) గణములన్నీ మదమనిచే మోహమునొందినవి. భృంగితో రంభ, చండునీతో ఊర్వశి(51) వీరభద్రునితో మేనక, చండునితో పుంజికస్థలి, తిలోత్తమ మొదలగు వారీట్లు గణములతో కూడిరి. (52) పెక్కుమంది ఆట్లు ఉన్మత్తులై సిగ్గును విడిచిరి. కాలము కాకున్ననూ మహీతలమంతా కోకిలలతో నిండెను.(53) అశోకములు, చంపకములు, చూత (మామిడి) కదంబములు, నీపవృక్షములు, ప్రియాలములు, పనస, రాజవృక్షములు, చరాయణములు (54) ద్రాక్షతీగెలు, నాగకేసరములు మిక్కుటముగా కనబడెను - అట్లే అరటి వృక్షములు, కేతకీ పుష్పములు తుమ్మెదలతో ప్రకాశించెను.(55) మదనుని కలయికతో - కలహంసలు, ఆడుహంసలతో, ఏనుగులు ఆడ ఏనుగులతో, నెమళ్ళు ఆడనెమళ్ళతో కూడియుండెను.(56)
కామనలు లేని వారు శివుని సంపర్కముమండి పుట్టిన గుణములచేత ఆందోళన నొంది, అకస్మాత్తుగా ఇదేట్లు ఏర్పడిన అని విచారించిరి.(57) శైలాదుడగు వందీ, అమిత శౌర్యముగల వాడు, ఇది రాక్షసుల లేదా దేవతల పనీయవి అనుకొనేమ.(58) ఇంతలో, ధమస్సును ధరించిన మదమడు తన విల్లుకు ఐదు బాణాలు ఎక్కుబెట్టి దేవదారువృక్షము యొక్క వీడమ చేరిన.(59) అక్కడ పరమ ఆసనమున మన్న వాడివి, తపము వాచరించుచున్నవాడివి, గంగను ధరించియున్నవానిని, నీలకంఠుని, కపర్దిని. చంద్రశేఖరుని.(60) శరీరముపై ఎల్లెడలో పరపణముల వలంకరించిన వానిని, ఐదు శిరస్సులుగలవానిని, సింహము వంటి పరాక్రమవంతుని, తేజోవంతుడగు శివుని, మాధవునితో కూడిన మదనుడు బాణముతో గొట్టబోవు సంతలో, విశ్వమాతయగు పార్వతి చెలికత్తెలతో శివుని పూజించుటకు వచ్చెను.(62) తెల్లని కిరణముల వలె అందముగా నున్న పార్వతి అపుడు బంగారు పూమాలను నీలకంఠుని మెడలో ప్రచెను-జనల తల్లియగు పార్వతి చిరునవ్వుతో, వికసించిన కనులతో శివుని అందమైన ముఖమును చూడసాగెను.(63) ఆపుడు మదనుడు మోహనమను బాణముతో శివుని కొట్టగా, శివుడు నెమ్మదిగా కనులు తెరిచి, చంద్రుని కళను సముద్రము చూచినట్లు, పార్వతి ముఖమును చూచెను.(64)
అందముగా, ప్రసన్నముగా నున్న ముఖముగలది, బింబము వంటి అధరము గలది, నవ్వుచున్న కన్నులు గలది, అగ్ని సముద్భవ, అందమైన శరీరము గలది, విశాల వదనముతో ఆందముగా నున్నది (65) ప్రసన్నముద్ర గలది. విశ్వమోహనునికి మోహము గలుగజేయునది. బ్రహ్మాదులతో కలిసి, ముల్లోకముల రచించినది యగు పార్వతిని చూచెను. (65, 66) సత్య, రజస్సు, తమస్సులను గుణాలను ముందుంచుకొని లోకముల ఉత్పత్తిని, పాలనను, వినాశాన్ని కలుగజేయు ఆ సంమోహిని యగు మంగళస్వరూపిణిని పార్వతిని చేతనుడగు శివుడు చూచెను.(67) ఇట్లు జగత్పతియగు ఆ దేవదేవుడు చూచి, బాధపడుచున్న మనసుతో ఇట్లనుకొనెను.(69) తపమునందు ఏ బాధలూ లేకుండిన నేను ఈమెచేత మోహము నెట్లు పొందితివి? నాకు ఆప్రియమగు దీవివి ఎక్కడనుండి, దేనికై, ఎవరు చేసిరి? (70) అపుడు శివుడు సాదరముగా దిక్కులనన్నింటిని చూడగా, దక్షిణ దిక్కుయందు ధనుస్సును చేతబట్టి యున్న మన్మధుడు కనబడెను. (71) ధనుస్సును చక్రము వలె చేసి సిద్దపరచి మరల శంకరుని బాణముతో మదనుడు కొట్టబోవు చుండెను. అపుడు ఓ బ్రాహ్మణులారా! శివుడు కోపమును పొందెను.(72) దర్పముతో మన్న మన్మథుని మూడవ కంటితో చూచెను- మరుక్షణమున మన్మథుని జ్వాలమాల ఆవరించెను. దానిని చూచుచుండిన దేవతలందరు పెద్దగా
హా హా అని ఆరవదొడగిరి.(73)
దేవతలు పలికిరి- దేవదేవా! మహాదేవా! దేవతలకు వరములనిచ్చువాడవు గమ్ము, పార్వతికి సహాయము చేయుటకై మదనుడు పంపబడెను.(74) గొప్ప కాంతీ గల మదనుడు నీ చేత వృథాగా దహింపబడినాడు.(75) జగదేకబంధువగు శంకరా! దేవతల పనిని నీవే నేరవేర్చవలెను. పార్వతి యందు గొప్ప తేజస్సుతో నీవు పుట్టగలవు. దానిచేతనే పని పూర్తికాగలదు.(76) మహాదేవా! తారకుని చేత దేవతలు మిగుల పీడింపబడినారు. కనుక, వారికై మదనునికి జీవితమునిచ్చి, గిరిజను వరించుము.(77) దేవా! దేవతల పనియందు సమర్థుడవు గమ్ము, గజాసురుని నుండి నీవే దేవతలమగు మమ్ములనందరినీ రక్షించితివి.(78) కాలకూటమునుండి కూడా నీవే మమ్ములను రక్షించితివి. వేరొక విధముగా కాదు. భస్మాసురుని నుండి కూడా నీవే మమ్ము రక్షించితివి.(79) దేవతల పని నెరవేరుటకై వచ్చినాడు ఈ మదనుడు. కనుక నీవితనిని రక్షించవలెను. ఆది మాకు గొప్ప ఉపకారము కాగలదు.(80) శంకరా! అతను లేకపోయినచో జగత్తు నాశనమొందును- నీవూ కామము లేనివాడవెట్లో నీ బుద్ధిచేత ఆలోచింపుము’ (81) అనగా విని మహేశ్వరుడు కోపగించి దేవతలారా! కామము లేకనే వుండవలెను. వేరొక విధముగా కాదు - (82) ఇంద్రాది దేవతలంతా కామమును ముందుంచుకొని కదా పదభ్రష్టులైనారు. దుఃఖాన్ని పొంది దైన్యాన్ని ఆశ్రయించినారు.(83)
ప్రాణులన్నింటికి కామము నరకమునే కలిగించును. ఈ మన్మథుడు దుఃఖమే తవ రూపముగా గలవాడు. నా మాటను తెలుసుకొనుడు.(84) దురాచారుడైన తారకుడు కూడా ఈనాడు కామము లేని వాడగును. కామము లేవితో నరుడు పాపమెట్లాచరించును? (85) కనుకనే, అందరి శాంతికొరకు నేవీ మదనుని దహించితిని- దేవతలు, అసురులు, మహర్పులు మీరంతా ఇతర ప్రాణులతో కలిసి ఇక్కడ తపస్సు చేయుటకు చింతించండి. నేనీ జగత్తునంతా కామక్రోధములు లేనిదానిగా చేసితిని.(86,87) కనుక దుఃఖమునకు మూలమైన పాపియగు ఈ మదమని నేను బ్రతికించబోను. దేవతలారా! చూడండి. నిరంతరము ఆత్మ సుఖమును, జ్ఞానమును, ఆనందమును, అగాధమూ, అనన్యమూ అగు దీవిని గమనించుడు.(88) అవి పరమేష్ఠయనగా వివి ఆనందము నొందిన దేవతలు శంకరునితో ఇట్లనిరి.(89) పరమశివా! నీవన్నది నిస్సంశయముగా మాకు గొప్ప శ్రేయస్సు కలిగించునది. కానీ, మేము చెప్పబోవునది వినుము. శ్రద్ధగా గ్రహింపుము.(90) కామక్రోధములతో కూడినదిగా వ్విము సృష్టింపబడినది. ఇదంతా కామమే. ఆట్టి కామము వధింపబడలేదు.(91) మహాదేవా! ధర్మార్థకామమోక్షముల నన్నింటినీ ఒకే రూపము గల వావివిగా చేసిన కామము వధింపబడలేదు.(92) బ్రహ్మ మొదలు స్థావరము వరకున్న విశ్వమునంతా కలిపిన దురతిక్రముడగు మదనుడు నీచేత ఎట్లు దహింపబడెను?(93)
ఈ విశ్వము కామము చేతనే నశించును. కామము చేత పాలింపబడును. కామముచేత ఉత్పన్నమగును. కనుక కామము గొప్ప బలము కలది.(94) దానినుండే ఉగ్రమైన క్రోధము కలుగును. దాని చేతనే నీవూ వశీకృతుడవైతివి. అట్టి కామమును నీవు బ్రతికించవలెను.(95) దేవా! నీ చేతనే మదనుడు మహాబలునిగా, సమర్థునిగా చేయబడినాడు. సమర్థుడు కనుక సామర్థ్యమును చూపును (96) అని ఋషులు పలికినప్పటికీ పరమశివుడు మిగుల కోపమును పొంది మూడవ కన్నుతో దహించునట్లుండెను.(97) మునులు, సిద్ధులు, చారణులు, గణములు అన్నీ వృషభవాహనుడగు పరమశివుని స్తుతించినవి. (98) పరమశివుడు మదమని ఆ విధంగా దహించి, ఆ హిమవత్పర్వతమును వీడి కోపముతో అంతర్థానమునొందెను.(99) శివుడావిధముగా తిరోధానము వొందుటను, మన్మథుడు కోకిలతో, చూతవృక్షముతో, భృంగ, చంపకములతో దహింపబడుటను పార్వతి చూచినది.(100) మదనుడు దహింపబడుటచేత విలపించుచున్న రతిని చూచి పార్వతి, కన్నీళ్ళతో శివుడు తన వశమునకెట్లు వచ్చునోనని చాలాసేపు ఆలోచించినది.(101) ఇట్లు చాలా సేపు ఆలోచించి, సమ్మోహమునొందిన పార్వతితో దుఃఖించుచున్న రతీదేవి ఇట్లనెను. ‘ఓ సఖి! దుఃఖింపవలదు, మన్మథుని నేను జీవింపజేయుదును. ఓ విశాలాక్షీ! నీ కొరకై నేను పరమశివుని తపస్సుతో ఆరాధించెదను.(103)
హరుని, రుద్రుని, విరూపాక్షుని, దేవదేవుని, జగద్గురువును తపస్సుతో సంతోష పరచెదను. చింతించవలదు. నేను మదనుని జీవింపచేపిదమ’ (104) ఈ విధంగా ఓదార్చి రతీదేవి వెంటనే తన పతిని పొందుటకు గొప్ప తపస్సు నాచరించెను.(105) శివుని చేత మదనుడు దహింపబడినచోట తపస్సు చేయుచున్న రతిని నారదుడు చూచెను. (106) వెంనే ఆమె వద్దకు వెళ్ళి ‘ఓ సుందరీ! నీవెవరవు? దేనికై ఈ తపమునాచరించు చుంటివి?’ అనెను.(107) రూపవతియగు ఆ స్త్రీ వారదుని మాటలను విని కొంత రోషముతో, మధురమైననూ కొంత నిష్ఠురముగా నున్న విధముగా పలికెను.(108)
రతిపలికెను- ‘నీవు నారదుడవని నాకు తెలియును - నీ రూపమును నాకు చూపింపుము’(109) ఆలస్యము చేయకుండా వచ్చిన మార్గముననే వెళ్ళుము. ఓ వటువా! నీకేమి తెలియదా! నీవు దౌష్ట్యము నాచరించువాడవు.(110) పరస్త్రీని కోరువారు, క్షుద్రులు, విటులు, వ్యసనపరులు అట్లే అకర్మకులు, స్తబ్దులు ఆగువారిలో నీవు మొదటివాడవు(111) అని ఈ విధముగా రతీదేవి పరుషముగా మాట్లాడగా నారదుడు వెంటనే స్వయముగా శంబరుడను దైత్యశ్రేష్ఠుని వద్దకు వెళ్ళేను.(112) మదనుడు దహనమైనట్లుగా ఆ రాజుకు తెలియజేసెను. ‘కోపగించిన రుద్రుడు మదనుని దహింపజేసెను. అతని భార్య ఆభిమానవతి.(113) నీవామెను తెచ్చి భార్యగా చేసుకొనుము. ఓ రాక్షసశ్రేష్టా! నీవింతకు ముందు తెచ్చిన ఆతీవరూపవతులందరిలో రూపవతి ఈ మదనుని భార్య రతీదేవి’(114) అని దేవర్షి చెప్పగా విని ఆ రాక్షసుడు వెంటనే రతీదేవియున్న చోటికి వెళ్ళమ.(115)
దేవతలకు కష్టములనిచ్చు శంబరుడు మదనుని భార్యయగు రతీదేవిని చూచి నవ్వుచూ ఇట్లనెమ.(116) ‘ఓ సుందరీ! నాతో కలిసి రాజ్యమునకు రమ్ము! నా ప్రసాదముతో రాజ్యమును, భోగములమ యథేస్టముగా అనుభవింపుము. తపస్సు చేసి ప్రయోజనమేమి?’ (117) అని శంబరుడనగా మదనుని భార్యయగు రతీదేవి ఇట్లనెమ.(118) ‘ఓ మహాబాహం! వేమ భర్తలేని దానను- నాతో నీవీవిధముగా పలుకరాదు. నీవు దైత్యులందరికీ రాజువు. అన్ని లక్షణములు గలవాడవు’ (119) అవగా వివి కామమోహితుడైన శంబరుడు రతీదేవి చేతిని పట్టుకొనబోగా రతి అతనిని వారించెను.(120) అతని ఆజ్యత్వాన్ని మనసులోనే తలచి రతీదేవి ‘మూర్ఖుడా! నన్ను తాకవద్దు. నా స్పర్శతో నీవు దహింపబడెదవు. ఇది తథ్యము.’ అనగా మహాతేజపియగు శంబరుడు నవ్వుచూ ఇట్లనెను.(121, 122)
‘మానినీ? ఈ బెదిరింపులతో నన్ను భయ పెట్టుచుంటివా? త్వరగా ఇంటికి రమ్ము, ఎక్కువ భాషించి ఏమి ప్రయోజనము?’ (123) అని శంబరుడు మనస్వినియగు రతిని బలవంతముగా తన పురమునకు కొనిపోయెను.(124) తన పురమున రతీదేవిని శబరుడు మాయావతియను పేరుతో వంటింటికి (పాకగృహానికి) అధ్యక్షురాలిని చేపెను.(125)
ఋషయ ఉచుః -
ఋషులు పలికిరి- మదనుని జీవింపజేయుటకు పార్వతి అంతా చేసినది- మదనుని భార్యను శంబరుడు అపహరించెను - ఓ సూతా! అటు పైన ఏమి జరిగెనో వర్ణింపుము (126)
సూతుడనెను. తన తేజస్పుతో మదనుని దహించి శివుడు వెళ్ళిపోవుట చూచి పార్వతి తపస్సు చేయుచూ అక్కడనే వుండినది.(127) ఆమె తల్లిదండ్రులు పార్వతిని గూర్చి విచారించిరి. ‘బాలా! త్వరగా ఇంటికి రమ్ము, నీవు శ్రమపడవలదు’ (128) అని వారిద్దరూ అనగా సాధ్వియగు పార్వతి ఇట్లనెను (129) పార్వతి పలికెను – ‘అమ్మా! నేను ఇంటికి రాను. నాన్నా! నా మాటలను యథార్థముగా వినుడు. ఈ ధర్మార్థములతో కూడిన వాక్యముతో నీవు సంతోషము నొందెదవు.(130) మహాబలుడగు మదనుని దహించిన పరాత్పరుడగు శివుని ఇక్కడికే నేను తెచ్చెదను.(131)
ఇంటిని కోరుకొను ప్రాణులకు దుర్లభుడు శివుడు - కనుక అమ్మా! నేను ఇంటికి రాను. అంతా నీవాలోచింపుము.(132) అనగా గొప్ప తేజస్సు గల హిమవంతుడు కూతురితో ‘శివుడు ఆరాధింపశక్యముగాని వాడు. దేవతలందరిచేత నమస్కరింపబడినవాడు. వీవాతని పొందజాలవు - కనుక ఇంటికి రమ్ము’ (133) అనెను. మేన కన్నీళ్ళతో గద్గద స్వరముతో ఇట్లనెను. ‘అమ్మా! త్వరగా ఇంటికి రమ్ము’ (134) అపుడు నవ్వి, పార్వతి, మేనతో ఇట్లనెను. ‘అమ్మా! నా ప్రతిజ్ఞను వినుము. గొప్ప తపస్పును వేనాచరించెదను (135) దానితో శివుని ఈ చోటికి తెచ్చి నన్ను వరించెటట్లు చేసెదను. రుద్రుని రుద్రత్వమును వశింపజేసెదను.’(136) సుఖమగు రూపమును వదలి పార్వతి పరమసమాధిలో ఉంటూ శివుని ఆరాధింపసాగెమ. (137) జయ, విజయ, మాధవి, సులోచన, సుభ్రత, శ్రుత, శుక్. (138) ప్రహ్లిచ, సుభగ, శ్యామ, చిత్రాంగి, అరుణి, స్వధా దేవగర్భ మరియు ఇతర పఖులు చాలామంది పార్వతి చెంత వుండిరి.(139) మదనుడు శివుని చేత దహింపబడినచోటనే వేదికను ఏర్పాటుచేసుకొని, దానిపై నిలిచిన పార్వతి ఉగ్రతపముమ ఆచరింపసాగెను.(140)
వీటిని త్రాగుట విడిచి పార్వతి, ఆకులను తినుట మొదలిడెను- పచ్చి ఆకులను తినుట వదిలివేసి ఎండుటాకులను భుజింపసాగెను.(141) పార్వతి ఎప్పుడైతే ఎండుటాకులమ కూడా తిమట ఆపివేసినదో అప్పుడు ‘అపర్ల’ అను ప్రసిద్ధమైన పేరుమ పొందినది.(142) తరువాత కేవలము గాలిని భుజింపసాగినది. ఇట్లు కాలక్రమేణ తపము చేయుచున్న పార్వతి తన శరీరము యొక్క భారమున ఒంటి వేలపై నిలిచి మోయసాగెను.(143) ఇట్లు పార్వతి ఉగ్రమైన తపస్సుతో శంకరుని ఆరాధనమును పరమ ప్రీతితో చేసెను.(144) శివుని ప్రీతికై జగన్మంగళ మంగళయగు పార్వతి పరమభావముతో గొప్ప తపము వాచరించేమ.(145) ఇట్లు వేలకొలది దివ్య సంవత్సరములు పార్వతి తపము చేసెను. అపుడు హిమవంతుడు కృత నిశ్చయయగు పార్వతి వద్దకు వచ్చెను. (146) ఆపుని వలె హిమవంతుడు భార్యతో వచ్చి, పార్వతితో ఇట్లనేమ- ‘మహాదేవి! నీవు ఈ తపస్సుతో కష్టపడరాదు.(147) విరక్తుడగు శివుడెట్లు కనబడును? నీవు తరుణివి, బాలవు, తపస్సు చేత మోహము నొందినదానవు(148) సందేహము లేదు. నీకు నిజమును చెప్పుచున్నాను. కనుక త్వరగా లేచి ఇంటికి వెళ్ళుము.(149) మదనుని పూర్వము దహించిన రుద్రునితో నీకేమి? నిర్వికారుడగు శివుని నీకెట్లు ప్రార్థించ గలవు? (150)
ఆకసముననున్న చంద్రుని గ్రహించుట ఎట్లు సాధ్యము కాదో, శివుని పొందుట కూడా అట్లే సాధ్యముకాదు - తెలుసుకొనుము. (151) అని హిమవంతుని వలెనే మేవ, సహ్యాద్రి, మేరు, మందర, మైనక పర్వతములు పలికినవి-(152) వారట్లు పలుకగా, తపము నాచరించుచున్న పార్వతి నవ్వుచూ హిమవంతునితో ననెను.(153) ‘నాన్నా! అమ్మా! మునుపు నేనన్నది మీరు మరిచితీరా? బంధువులారా! ఇపుడే నా ప్రతిజ్ఞను వినుడు.(154) మదమని సంహరించినవాడు, విరక్తుడూ అగు లోకశంకరుడైన శివుని నేను తపస్సుచే సంతోషపరిచెదను.(155) మీరంతా వెళ్ళండి. ఈ విషయమున విచారించ పనిలేదు - కేవల తపస్సుతో నేను మదనుని, పర్వతవనాన్ని దహించిన శివుని ఇక్కడికి కొని తెచ్చెదను. సదాశివుడు గొప్ప తపస్సుతో సేవింపబడదగినవాడు(156, 157) మహానుభావులారా! అతనే సత్యమని తెలుసుకొనుడు. నేను నిజమునే చెప్పుచుంటిని.(158) ఇట్లు పార్వతి తల్లితో, తండ్రితో, మేరువుతో, మందరముతో పలికి, మితభాషిణియై వుండినది. అపుడు వారంతా ఆలోచించి వచ్చిన మార్గముననే వెళ్ళిపోయిరి.(159) వారంతా వెళ్ళిపోగా, పార్వతి తన సఖులుతో కూడినదై ఆక్కడే తపస్సునాచరించసాగినది.(160)
ఆ గొప్ప తపస్సుతో చరాచరమంతా తపింపసాగెను - అపుడు దేవదానవులంతా బ్రహ్మను శరణుజొచ్చిరి.(161) దేవతలనిరి-దేవా! చరాచరమగు ఈ జగత్తంతా వీచే పృజింపబడినది - కనుక దేవతలమగు మమ్ము నీవు రక్షింపుము. నీవు తప్ప (162) మమ్ములను రక్షించు సమర్థులు వేరొకరు లేరని దేవతలనగా బ్రహ్మ దానిని గూర్చి విచారించెను.(163) పార్వతి తపస్సు వలన కలిగిన గొప్ప దావాగ్నిని తెలుసుకొన్న బ్రహ్మ పాల సముద్రమును చేరెను.(164) అక్కడ శేషమను సుందరమైన పర్యంకము పైన శయించిన వానిని, నిత్యము లక్ష్మీదేవి చేత పాదపేవ నొందుచున్న వానిని (165) మెడవంచి మ్రోయు గరుడునిచేత, శ్రీచేత, కాంతి చేత, క్షాంతి చేత, వృత్తిచేత, దయ మొదలగు వానిచే సేవింపబడువానివి, (166) నవశక్తులతో కూడిన వానిని, పార్షదులతో కూడివున్న వావివి, విష్ణుమూర్తిని చూచేను. కుముద, కుముద్వాన్, సనక, సనందన, సవాతవ, ప్రపుప్త, విజయ, ఆరిజిత్, జయంత, జయతే'న, జయుడు (167, 168) సుదర్శనము, శార్ఖమను అద్భుతమైన చాపము మొదలైనవావివి బ్రహ్మ చూచెను.(170)
దేవదానవులంతా పరమాత్మయగు విష్ణువును సమీపించి, సముద్రతీరమున విష్ణువుతో ఇట్లనిరి.(171) ‘ఓ మహావిష్ణూకి పార్వతి యొక్క గొప్ప తపస్సు చేత తపించుచూ నిన్ను శరణుజొచ్చిన మమ్ము రక్షింపుము’ అనగా శేషాసనముపై నున్న విష్ణువిట్లనెను.(172) ‘మీ అందరితో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్ళెదము. మహాదేవుని పార్వతివి గూర్చి ప్రార్థించెదము. అక్కడకు కొని వెళ్ళునట్లు మనము ఇపుడు చేసెదము.(174) కనుక మనము, ఉగ్రమగు తపస్సు చేయుచూ రుద్రుడున్న చోటికి వెళ్ళేదము.’ (175) అని విష్ణువనగా దేవదానవులందరూ ‘మేమందరమూ విరూపాక్షుడగు శివుని వద్దకు రాజాలము.’ (176) దురతిక్రముడగు మదనుని మునుపు దహించినట్లే శివుడు మనలను దహించును. ఈ విషయమున ఆలోచించవలసినది లేదు.(177) అనగా విని విష్ణువు నవ్వీ ఇట్లనెను- ‘మీరంతా భయపడవలదు - సదాశివుడు మంగళ స్వరూపుడు.(178) అతనందరినీ దహించడు. దేవతలకు భయమును నశింపజేయువాడు కనుక మీరు నాతో కలిసి రండి.(179) మంగళుని, పురాణుని, శ్రేష్ఠస్వరూపుని, పరాత్పరుని, పరమార్థరూపమున తపమునాచరించు పరమశివుని శరణు జొచ్చెదను.’(180)
ఇదీ శ్రీ స్కాందమహాపురాణమునందలి మొదటి మాహేశ్వరఖండములోని కేదారఖండమున పార్వతితపస్పునాచరించుటను వర్ణించుట అను ఇరువది ఒకటవ అధ్యాయము.
