స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
28వ అధ్యాయము
లోముడిట్లు చేప్పెమ- కుమారుని ఒడిలో మంచుకొని జగదీశ్వరుడు, ప్రతాపవంతుడగు శివుడు ఇంద్రాది దేవతలనడిగెను. (1) దేవతలారా! నా కుమారునితో మీకేమి పవి? అని అడుగగా దేవతలందరూ పశుపతితో నిట్లనిరి. (2) ప్రభూ! తారకుని నుండి మా అందరకు భయముత్పన్నమైనది. జగత్తులన్నిటి రక్షకుడవు నీవే రక్షణ కల్పించవలెను. (3) ఈ తారకుడు కుమారుని చేతనే నేడు చావగలడు. కనుక నేడు తారకుని వధించగోరి వెళ్ళెదము. (4) అని తలిచి దేవతలందరూ ఒక్కమారుగా శంకరుని పుత్రుడగు కుమారుని ముందుంచుకొని బయలుదేరిరి. (5) బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరూ ఆట్లు కలిసి బయలుదేరగా, వారి ప్రయత్నమును గూర్చి వివిన మహాబలుడగు తారకుడు దేవతలతో యుద్దము చేయుటకు గొప్ప సైన్యముతో బయలుదేరేమదేవతలందరూ ఆ గొప్ప బలమును చూచిరి- (6) అపుడు వారందరినీ ఓదార్చుతూ ఆకాశవాణి ఇట్లనెమ- ‘మీరందరూ శక్తిని ముందడుకొని ప్రతిష్ఠింపబడివారు- కనక దైత్యులమ యుద్ధములో మీరు జయించగలరు.(9)
ఆకాశవాణిని విని దేవతలందరూ ఉత్సాహంతో కుమారస్వామిని ముందుంచుకొని భయములేకుండా యుద్ధము చేయగోరి బయలుదేరిరి - (10) వారట్లుండగా కుమారస్వామిని ఎన్నుకొనుటకు మృత్యుదేవత సుతులు, గొప్పవీరులక్కడకు వచ్చిరి. (11) బ్రహ్మ ప్రేరేపణచే పూర్వము తపస్సునాశ్రయించిన సేన అను పేరుగల సుందరి, మృత్యుదేవతపుత్రిక,కుమారస్వామి వద్దకు వచ్చెను. (12) ఆమెను చూచి ఆందరూ శివునితో కుమారస్వామి కై ఈ సుందరి వచ్చినదని చెప్పిరి. (13) బ్రహ్మ మాటలపై అపుడు కుమారస్వామి ఆమెను వివాహమాడెను. తరువాత సేవాపతి ఆయెను. (14) అపుడు శంఖములను పూరించిరి, భేరీ వాద్యాలను, తప్పెటలమ, ఇతరవాద్యాలను మోగించిరి- గొప్ప ధ్వవిగల మృదంగములను మోగించిరి. (15) ఆ గొప్ప ద్వనీతో ఆకాశవలము అంతా నిండిపోయినది. అపుడు గౌరి, గంగ, కృత్తికాది తల్లులు ఇతమ మా పుత్రుడు, మాపుత్రుడవి పరస్పరము అనుకొనిరి.(16) ఇట్లు వివాదముమ వారుపొందగా నారదుడు ‘మూర్ఖంగా వ్యవహరించవద్దని వారిని వారించెను - (17) ఇతమ పార్వతికి శంకరుని వలన దేవతలపవికై పుట్టినవాడ’ ని నారదుడు తెలుపగా వారందరూ మిన్నకుండిరి. (18)
అపుడు కుమారస్వామి వారిమద్దేశించి మీరు నక్షత్రాలను ఆశ్రయించి చిరకాలము వుండండి’ అవేమ. (19) ఆ విధంగా ఆకాశమున కృత్తికాది మాతృగణము కుమారస్వామిచే నుంచబడెను. ఇక కుమారస్వామి మృత్యుదేవత కన్యయగు సేవను తీసుకొని త్వరగా ఇంద్రునిలో విట్లనెను (20) వీపు దేవతలతో స్వర్గమునకు వెళ్ళి నిరంతరము రాజ్యము చేయుము. (21) అవగా ఇంద్రుడు అతనితో ‘తారకుడు పీడించగా మేమంతా స్వర్గమునుండి పారిపోయి వలుదిక్కులమ చేరితిమి (22) పదమునండి చ్యుతులమైన మమ్ము ఏమడిగిడవు?’ అనగా కుమారస్వామి నవ్వి భయపడవలదని వారి కభయమువిచ్చెను. (23) ఆతవట్లు పలుకుచుండగనే, రుద్రుడు పార్వతితో, ప్రమధులతో కైలాసమునకు వెళ్ళిపోగా, దైత్యసేవలు చుట్టూరాగా దైత్యరాజు తారకుడక్కడికి వచ్చాము - అపుడు ప్రళయ కాలమువలె భయంకరమగు యుద్ధవాద్యాలు మోగించబడెను. (25) రణమునందు కరమగు తూర్యములు, అద్భుతమగు డిండిమములు, గోముఖములు, ఖడ్గమృగము కొమ్ములో చేయబడిన కాహళమమ వాద్యాలు మ్రోగినవి - (26) ఇట్టి అనేక వాద్యభేదములు ఆ దైత్యుల రాకతో మోగించబడినవి. తారకునితో కలిపి ఆ వీరులట్లు గర్జించుచుండగా నారదుడు దేవతలకు కంటకమగు తారకునితో ఇట్లనెను. (28)
‘పూర్వము నిన్ను వధించుటకై దేవతలు ప్రయత్నించిరి. ఇందు సంశయములేదు ఓ ఆసురశ్రేష్ఠా! నేను చెప్పినది నిజమగును(29) ఈ శివుని కుమారుడు వీకొరకే జన్మింపబడినాడు. ఇది తెలిసి తగిన ప్రయత్నమును జాగ్రత్తగా చేయుము.’(30) అని నారదుడనగా విని తారకాసురుడు నవ్వుచూ, ‘మహర్షి! నీవు ఇంద్రుని వద్దకు వెళ్ళి నా మాటలను ఉన్నదున్నట్లుగా చెప్పుము. (31) కుమారస్వామిని ముందుంచుకొని నాతో యుద్ధము చేయగొరిన నీవు మూర్చుని వలే చేయుచుంటివి (32) వేరొక విధముగా కాదు ముచుకుందుడనుమనుష్యుని ఒకడిని ఆశ్రయించి, వాని ప్రభావముచే అమరావతి యందున్నావు. వేరొక విధముగా కాదు - ఇపుడు కుమారుని బలమునాశ్రయించి నా ఎదుట నిలబడుచున్నాము (34) మూర్ఖుడా! నిన్ను నీలోకపాలకులతో సహా వధించెదను. ‘అని దేవేంద్రునికి చెప్పుము. (35) అని తారకుడనగా సరే నని నారదుడు ఇంద్రాది దేవతల వద్దకు వెళ్ళి అసురోత్తముడవిన మాటలను ఉపహాసపూర్వకము వున్నదున్నట్లుగా చెప్పెను. (36)
దేవతలారా! వేమ చెప్పుచున్న మాటలను వినండి- తారకుడు తన అమచరులతో కలిపి పలికిన మాటలమ శ్రద్దగా ఆలకించండి- (37) తారకుడు ఇట్లు చెప్పిన - ‘మూర్ఖుడా! నిమ్న వధించెదమ- ఇది నిజమగును- ముచుకుందుని ఆశ్రయించి లోకపాలురలో పూజలందుకుంటున్న వీవంటి భీరువులో యుద్ధముచేయబోమ. దేవుడు కూడా నరుడివాశ్రయించావు’ (39) అనేవి నారదుడుచెప్పగా ఇంద్రాది దేవతలు కుమారస్వామి ముందువిలవగా నారదునితో ఇట్లనిరి. (40) ‘ఓ దేవర్షి కుమారస్వామి బలమువీకు తెలియుమ గదా! ఆజ్ఞానివలె నా ముందు అతని మాటలవెట్లు పలికితివి?’ (41) అవగా నారదుడు నవ్వి, నేను కూడా అతనిని పరిహసిస్తూ పలికితిని. కుమారస్వామి జయించునవి మీరందరు తెలియుడు, వా వాక్యము తప్పక విజమగును. (43) ఆదినారదుడనగా వినిదేవతలందరూ సంతోషించిరి.(44) కుమారస్వామిని ఏమగుసైనిలిపి,దేవేంద్రుడు ముందునడుచుచుండెను. అతని వెంట గొప్ప దేవసైన్యము లోకపాలురు నడిచిరి. (45) అపుడు దుందుభులు, భేరి వాద్యాలు, తూర్యములు అనేక మార్లు మ్రోగినవి- వీణలు, వేణువులు, మృదంగములు గంధర్వర్వనులు వినిపించినవి. (46)
అపుడు కుమారస్వామి ఏనుగును దేవేంద్రునికే ఇచ్చి వేరొక వాహనమునెక్కెను- అది అనేక రత్నములతో కూడినదిఆనేక ఆశ్చర్యములు గలది (47) అట్టి చిత్రవిచిత్రమైన వాహనమునెక్కి గొప్పకీర్తిగల కార్తికేయుడు. అన్నిగుణములుకలవాడు,కాంతివంతమైన చామరములతో వీచబడుచూ గొప్ప కాంతిలో విలసిల్లెను-(48) అనేక రత్నముల కాంతిగలది, చంద్ర కిరణములతో అలరారునది యగు ఛత్రమును చంద్రుడు కుమారుని తలపై పట్టెమ (49) అపుడు ఇంద్రుడు మొదలగు దేవతలందరూ తమ తమ బలాలతో యుద్ధముచేయగోరి బయలుదేరిరి. (50) యముడు తన గణములతో, వాయువు, మరుత్తులతో, వరుణుడు జలములతో (జలజంతువులతో) కుబేరుడు గుహ్యకులతో, ఈశ్వరుడు ప్రమధులతో, నైర్ఋతుడు వ్యాధులతో వచ్చిరి.(51) ఇట్లు ఆ ఎనిమిది మంది లోకపాలకులు కలిపి యుద్ధము చేసి తారకుని వధించదలిచిరి. విశ్వవంద్యుడగు కుమారుని, సేనాపతివీ,ఆత్మవేత్తను ముందు నిలిపిరి. (52) ఇట్లు వారందరూయుద్ధము చేయగోరిభూతలమున దిగి, గంగాయమున మధ్య అంతర్వేది వద్ద నిలిచిరి. (53) తారకుని సేవకులందరూ పాతాళమునుండి వచ్చి తమ బలములలో దేవతలను రణమున దెబ్బతీయుటకు చరించసాగిరి. (54)
విమానముతో విరాజిల్లుతున్న తారకుడు, తలపై ఛత్రమును సేవకులు పట్టగా వచ్చెను- (55) చామరములతో వీచుచుండగా మిగుల శోభించెను-(56) ఇట్లు దేవదానవులు అంతర్వేది యందు వచ్చి నిలిచి, తమ తమ సైన్యముతో విడివిడిగా వ్యూహముల రచించిరి.(57) ఏనుగులను ఒకవైపు, వివిధమగు అశ్వబలమును మరొకవైపు, అనేక రత్నములతో నున్న విచిత్రమైన రథములనొకవైపు నిలిపిరి. (58) శక్తి, శూల, పరశు మొదలగు ఆయుధములను చేత ధరించిన పదాతులు, ఖడ్గ, తోమర, నారాచములతో, పాశములతో, ముద్గరములతో విలసిల్లిరి. (59) ఆట్లు దేవదానవుల సేనలు శోభిల్లుచుండగా, బంధువులతో స్తుతింపబడుచున్న వారు వధింపగోరి నిలిచిరి- (60)
ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మహేశ్వరఖండమున శ్రీకేదారఖండమున దేవతలతో తారకాసురుని యుద్దమున దేవదానవుల సేనలు యుద్దమునకు సిద్దమగుట యను. ఇరవైఎనిమిదవ అధ్యాయము.
