స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

24వ అధ్యాయము

లోమశుడనెను - మహాత్ముడైన గిరీంద్రుడు తన కూతురికొరకు మిక్కిలి సంతోషముతో అట్లే మాంగళ్యభూమిని గొప్ప ఐశ్వర్యములో గరునీ మొదలిడుకొని చేసెను (1) సాదరముగా విశ్వకర్మనాహ్వానించి విశాలమైన, వేదికలతో మనోహరముగా నున్న మండపమును నిర్మింపజేసెను. ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణము గలిగి అన్ని గుణములు గలిగి అనేక ఆశ్చర్యములు గలదాయెను - (3) అక్కడ స్థావరము, జంగమమూ సమానముగా మనోహరముగా నుండెను - స్థావరము, జంగమములు ఒకదానినొకటి మించినట్లుండెను. (4) స్థలభూమి నీటిచే జయింపబడి నట్లుండెను. (5) జనులు ఆది జలమా లేక స్థలమా అని తెలియకుండిరి. ఒక చోట సింహాలు, ఒకచోట హంసలు, ఒకచో సారసములను పక్షులు కాంతివంతములై యుండెను. (6) ఒకచో కృత్రిమమైన సుందర మయూరులు, ఏనుగులు, గుర్రములు, లేళ్ళు చేయబడియుండెను. (7) ఏవి సత్యమో ఏవి ఆసత్యమో తెలియనట్లుగా విశ్వకర్మ చక్కగా చేసియుండెను . అదే విధముగా అద్భుతమైన ద్వారమును చేయబడెను (8)

ధనుస్పులను ఎక్కుపెట్టియున్న పురుషులు నిలిచియున్ననూ కదులుచున్నవారి వలె యుండిరి. (చలనములేకున్నన చలనమున్నట్లుండెను) అట్లే అశ్వకాండ్రతో అశ్వములు, మావటిలతో ఏనుగులూ కనబడెను. (9) అక్కడ కొందరు పురుషులు చామరములతో వీచబడుతూ కనబడిరి. కొందరు పుష్పాంకురములు గలిగి మరికొందరు పూమాలలధరించి వెలుగుచుండిరి.(10) అట్లే పెక్కు కృత్రిమ పతాకములు నిర్మింపబడెను. క్షీరసముద్రమునుండి వెలువడిన మహాలక్ష్మి ద్వారమువద్ద విలుచుండెను. (11) కృత్రిమములైననూ సహజములుగా నున్న గజములుమావటి లతో, ఆశ్వములు ఆశ్వికులతో అలంకరింపబడియుండెమ. (12) కృత్రిమముగా నిర్మితమైననూ సహజముగా కనబడు రథములు రథికులతో అలంకరింపబడియుండేమ. అందరినీ మోహింపజేయుటకు సభలు చేయబడిమ. (13) విశ్వకర్మ మండపము నందు మహాద్వారము వద్ద నందిని తయారుచేసెమ - శుద్ధస్ఫటికమువలె ప్రకాశించు ఆ నంది నందివలె ప్రకాశించుచుండెను. (14) దానిపై రత్నములతో అలంకరించిన గొప్ప దివ్యమగు పుష్పకము పల్లవఛత్రములతో, చామరములతో అలరారుచుండెమ. (15)

ఎడమప్రక్క శుద్ధకాశ్మీరము వంటి ఏనుగులు రెండు,నాలుగు దంతములుగలవి, అరవైఏళ్ళ వయసు గలవి. గొప్పకాంతిగలవిగా ప్రకాశించుచుండెను. (16) అట్లే కుడివైపున రెండు గుర్రములు వుండెను. రత్నలంకారములతో గూడిన లోకపాలురుండెను (17) బుద్ధిమంతుడగు విశ్వకర్మ షోడశ ప్రకృతులను, దేవతలనందరినీ ఏర్పరచెను. (18) అదే విధముగా తపోధనులగు భృగు మొదలైన ఋషులనందరినీ, విశ్వేదేవతలను, సభ్యులతో కూడిన ఇంద్రుడిని యథార్థమాఅన్నట్లు విశ్వకర్మ నిర్మించెను. (19) ఈ విధమైన దివ్యరూపములుగల మండపమును విశ్వకర్మ నిర్మించేను. (25) ఆ మండపము అనేక ఆశ్చర్యములతో కూడుకొనినది, దివ్యమైనది. దేవతలనూ మోహపరచునదిగా వుండెను - అంతలో అక్కడికి దేవర్షియగు నారదుడు వచ్చెను (21) బ్రహ్మ పంపగా హిమాలయుని వద్దకు వచ్చిన నారదుడు ఎదుట వినయముతో కూడినట్లున్న తనను చూచి (22) ఆ కృత్రిమమైన దానివలన భ్రమను పొందెను - విశ్వకర్మ నిర్మించిన దానిని చూడసాగేను (23) నారదుడు హిమవంతునిదైన రత్న ఖచితమండపమును ప్రవేశించెను. అది సువర్ణకలశములతో, రంభాదులతో వేయి స్తంభములతో అలరారుచుండెను (24) అంతలో తన గణములతో నున్న హిమవంతుడు నారద మహర్షిని చూచి, పూజించి, ఏమీ పని యని ప్రశ్నించెను (25)

నారదుడు పలికెను – ‘ఇంద్రుడు మొదలైన దేవతలు,తమ గణములతో మహర్షులు, వృషభవాహనుడైన మహాదేవుడు వివాహమును గూర్చి వచ్చిరి’ (26) అనగా విని పర్వతరాజగు హిమవంతుడు యథావిధిగా అతని పూజించి ప్రశస్తముగా, మధురముగా నుండునట్లు నారదునితో ఇట్లనెను (27) నీవు శివుని వద్దకు వెళ్ళుము (28) అనగా ఆ మాటను విని నారదముని అట్లే అని తలచి హిమవంతునితో ఇట్లనెను. మైనాక, సహ్య మేరు పర్వతములతో కూడి నీవు ఇపుడు ప్రయత్నించి దేవతలతో గొప్ప మహర్షులతో కూడి వుండినవానిని, పురాసురులతో అర్చింపబడిన పాదపద్మము గల శివుని తీసుకొవిరమ్ము. (30) అనగా హిమవంతుడు అట్లే వని పర్వతరాజులతోకలిసి త్వరగా శివుని వద్దకు వచ్చెను (31) అపుడు మహాదేవుడు ఇతర దేవతలతో కూడియుండెను. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మిగతా దేవతలతో కలిసి (32) నారదమునిని వివాహవిషయమున ప్రశ్నించిరి. ప్రశ్నించుచున్న మాకు తెలియజేయుము’. అని వారడిగిరి (33)

సహ్య, మైనాక మేరుపర్వతములు తమ తమ పుత్రికలనిచ్చెదరా ఏమి? శంకరా! ఇపుడేమి జరుగుచున్నది? (34) అనగా మహాతేజస్కుడగు నారదుడు బ్రహ్మను ముందడుకొని విష్ణువుతో హేతుయుక్తంగా పలికెను. (35) అట్లే ఏకాంతమున దేవేంద్రునితో ఇట్లనెను – ‘త్వష్ట మహత్తరమైన భవనమునునిర్మించగా, మేమంతా దానిచే మోహితుల మైతిమి (36) శచీపతీ! పూర్వమతను నీకు చేసిన దానిని మరిచితివా? ఈ త్వష్ట గిరిరాజు ఇంట నివసించుచూ నిన్ను జయింపగోరుచున్నాడు (37) ఆహా! ప్రకాశవంతమగు ప్రతిరూపము చేత విమోహితుడనైతిని. అట్లే త్వష్ట శంఖము చక్రము గద మొదలగువానిని ధరించిన విష్ణువును నిర్మించెను. (38) అదే విధంగా అతను బ్రహ్మను కూడా నిర్మించెమ(39) త్వష్ట మాయామయమగు వృషభమును, ఏనుగును, అశ్వతరమును విర్మించెను. అదేవిధంగా ఇతరమైనవనేకము అతని చేత చిత్రింపబడినవని తెలుసుకొనుము’ (40) అని నారదుడు తెలియజేయగా విని దేవేంద్రుడు ఇట్లు పలికెను (41) ‘త్వరగా నేను విష్ణువు వద్దకు వెళ్ళి చూచివచ్చెదము - నీవిక్కడనే వుండుము. పుత్ర శోకముతో తపించుచున్న విష్ణవే వేరొక మిషతో ఇట్లు చేసియుండవచ్చుమ’ (42)

అపుడు మహాత్ముడు, భూతేశ్వరుడగు శివుడు పంచబాణములుగల మహాభూతమగు మన్మథుని చేతిలో మోహమునొందినపుడు ఇతరుల గూర్చి చెప్పేదేమున్నది? (52) ప్రాకృత అమలవలె పరమశోభమడగు శివుని కూడా మన్మథుడు వశమునకు తెచ్చుకొమ.(53) మన్మథుడు నిజముగా లోకమున బలవంతుడు. అతనే దేవతలు, ఋషులు, గల ఈ జగత్తునంతా తన శక్తితో జయించెను(54) అన్ని భూతములకు విశేషముగా దేవతలకు రాజు బలవంతుడగు మన్మథుడి ఆతవి ఆ బలమైనది (55) ముల్లోకములలో అతమ పార్వతి యమప్రీ రూపమున అజేయుడుగా మష్నాడు - బుద్ధిమంతులగు ఋషులుకూడా ఆమెనుచూచి మోహమునొందిరి.(56) దేవతలు, మమష్యులు, గంధర్వులు, పిశాచులు, సర్పములు, రాక్షసులు అందరూ మదనుని ఆజ్ఞను ఉల్లఘించలేరు. (57) బ్రాహ్మణులారా! గొప్ప తపోబలముతో దానబలముతో మదమని తెలియజాలరు - వివయములో మాత్రమే తెలుసుకోగలరు (58) కనుక మన్మథుని క్రోధము మిక్కిలి బలము కలది - ఈ విధంగా మదనుడు ఈశ్వరుని మోహపరచుట చూచి విష్ణువు (59) (చింతించవలదు - మండపమును గూర్చి నారదుడు చెప్పినది. (60) త్వష్ట నిర్మించిన చిత్రవిచిత్ర మండపము అంతా మన్మథుని కార్యమే.’ అనగా శివుడు విష్ణువులో విట్లనెమ. (61)

‘మహావిష్ణూ త్వష్ట అవిద్య చేత ఆవరించిన అటువంటి మండపమును నిర్మించెను. అది కేవలమండపము (62) మహాత్మా! వివాహమునకు మూలము అవిద్యయే - ఇక మనమంతా వివాహమును గూర్చి వెళ్ళెదము (63) ఆ తరువాత ఇంద్రుడు మొదలైన దేవతలు నారదుని ముందుంచుకొని హిమవంతునితో కలిసి ఆ పరమాద్భుతము, అనేక ఆశ్చర్యములతో కూడినది, విశ్వకర్మచే నిర్మించబడినది అగు మందిరమునకు వెళ్ళిరి (64) పవిత్రమై, ఉత్తమమై, అనేక ఆశ్చర్యములతో కూడినది, మనోహరమైనదగు యజ్ఞవాటికను విశ్వకర్మ నిర్మించగా (65) ఋషులతో కూడి దేవతలు ప్రవేశించబోవుచుండగా హిమవంతుడు చూచి వారికి ఎదురేగెను (66) అట్లే వారికై అందమైన భవనములు నిర్మిపబడెను. గంధర్వులు, యక్షులు, ప్రమథులు, సిద్ధులు, దేవతలు, నాగులు అప్పరసల గణములు ఎక్కడ సుఖముగా నివసించునో అటువంటి ఉపవనమును అచటచట నిర్మించెను - (67) వారికోసమే గొప్ప ధారా గృహములు, అత్యద్భుతముగా రాజిల్లునవి చేయబడెను. (68) దేవతలు మరియు మహాత్ములగు ఋషులకొరకు నివాసమునకై విశాలభవనములుల నిర్మింపబడెను. (69)

ఈ విధంగా విశ్వకర్మ అక్కడ పుండువారికి యోగ్యమగునట్లు పెక్కు భవనములను విస్తరింపజేమ.(70) భైరవులు, క్షేత్రపాలులు మరియు క్షేత్రవాసులు, స్మశానవాసులు, మర్రి, రావి మొదలగు చెట్లపై వివసించువారు.(71) ఆకాదున చరించువారు ఎక్కడెక్కడ వుందురో అక్కడక్కడ వారి కొందరు.(72) మనోహరములైన భవనములు విశ్వకర్మ విర్మింపచేసిన. ఆ భూతములన్నింటికి ఆమకూలముగా నుండునట్లు విశ్వకర్మ వానిని నిర్మించెను.(73) ఇంద్రునితో సహా దేవతలు, యక్షులు, పిశాచులు, రాక్షసులు, గంధర్వులు, అప్పరపలగణములన్నీ సురగణములతో సహా వివసించునట్లు హిమవంతుడే స్వయంగా చేసెమ.(74)

ఇది శ్రీస్కాందమహాపురాణమున మాహేశ్వరఖండమందలి కేదారఖండమున పార్వతి పరిణయమున హిమవంతుడు దేవతలకు నివాసస్థానముల నేర్పరుచుట యమ ఇరువది నాలుగవ అధ్యాయము.