స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
8వ అధ్యాయము
లోమశుడు పలికెనుః ఓ బ్రాహ్మణా! పూర్వము అన్ని ధర్మముల చేత బహిష్కృతుడైన ఒక తస్కరుడుండిన) అతను బ్రాహ్మణ హత్య చేసినవాడు, సురము త్రాగువాడు, బంగారమును దొంగిలించువాడు ఉత్తమ స్త్రీలయందిల్లప్పుడూ లంపటుడైన మహాపాపి, జూదము (ద్యూతము) నాడువాడు, మూర్ఖుడై మూర్తులతో ఎల్లప్పుడూ కలిసివుండువాడు ఒకనాడు, అద్భుతమైన ద్యూతమును ఆడుచూ ఓడినాడు. అపుడు ద్యూతకారులచేత కొట్టబడినవాడై ఏమి పలకలేదు. కొట్టినప్పటికీ మౌనముగా వున్నందుచే పాపము చేయువారిలో మొదటివాడైన వానిని ఆడిగిరి. ద్యూతములో ఓడిపోయిన ధనమును ఇచ్చెదవా? లేదా? అవి తొందరగా నిజాన్ని చెప్పుమనిన ఆ తస్కరుడు జూదములో ఓడిన ధనాన్ని రాత్రి ఇచ్చెదను అనెను.
ఆ వాక్యముచేత వారు వానిని వదలి వెళ్ళిపోయిరి. అపుడు రాత్రి సమయాన దొంగ శివాలయమునకు వెళ్ళిన శివుని తలపై ఎక్కి ఘంటను తీసుకొనబోవుచుండగా కైలాస శిఖరము పైనున్న శివుడు తన కింకరులతో ననేను ఈ నాడితను చేసినది భూలోకములో అందరికంటే ఆధికము. ఇతన భక్తులందరిలో శ్రేష్ఠుడు, వాకత్యంత ఇష్టుడు. అని పలికి వీరభద్రాది గణములను (తస్కరుని) తీసుకొని రావడానికి పంపెను. వారంతా శివుడికిష్టమైన కైలాసమునుండి త్వరగా బయల్దేరిరి వారందరి డమరు వాదము చేత ముల్లోకములూ నినదించినవి. వారిని చూచి దురాత్ముడైన ఆ తస్కరుడు ఒక్క మారుగా లేచి, లింగము యొక్క శిరస్సునుండి దిగి పలాయనమును చిత్తగించేమ.
పారిపోవుచున్న అతనిని చూచి వీరభద్రుడు పిలిచెను. ఓ మూర్ఖుడా! భయపడెదవేమి? ఉదారచరితుడైన దేవదేవుడు, మహేశ్వరుడు నేడు నీకు ప్రసన్నడయివాడు. అని పలికి అతనిని విమానమందుంచి కైలాసమునకు వచ్చెమ. ఆ మహాత్ముని చేత దొంగ శివుని పరిచరుడాయెను. కనుక, జీవులందరికీ శివభక్తి వుండవలసినది. పశువులే పూజ్యులు కాగా భూమిపై మానవులవిషయమున చెప్పనేమి? ఎవరైతే, తర్కమును గోరు తార్కికులు, మీమాంసకులు మరియు అయ్యవాదులు ఆత్మవిషయంలో వితర్కము చేయువారో, వారు శివార్చన నుండి దూరమై ఒక్కమాటమ విలువరు ఎవరిచే తర్కము చేయబడునో వారందరూ శివుడులేనిదే ఏవరు? (ఏమి పొందెదరు)
మిగులపలికి ప్రయోజనమేమి? స్థావరజంగమములన్నీ (స్థిర-చర) ప్రాణులు కూడా కేవలం లింగధారులుగా జన్మింతురు. లింగము పిండయుక్తముగా (లోహముతో) ఎట్లు స్థాపించబడుచున్నదో అట్లే నరులు లింగయుక్తులుగా, స్త్రీలు లోహయుక్తులుగా (అగుచున్నారు) చరాచరమైన జగత్తంతా శివుడు మరియు శక్తి వీనిచే కూడినది. మూఢులు అట్టి శివుని వదిలి మూర్ఖత్వము చేత వేరొకరిని సేవింతురు. శివుని వదిలి మూఢత్వము చేత ఆత్యస్తాకము, తుచ్ఛము, నశించునది, క్షణభంగురమైన ధర్మమును సేవించువారు మూర్ఖులు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు పీఠము విష్ణువు యొక్క రూపము, లింగము మహేశ్వరుని రూపము, కనుక ఓ ద్విజులారా! అందరికీ లింగముయొక్క అర్చనమే శ్రేష్ఠము.
బ్రహ్మ ఎల్లప్పుడూ మణిమయమైనది, శుభమైనది అగు లింగమును పూజించును. ఇంద్రుడు రత్నమయలింగమును, చంద్రుడు ముత్యాలతో గూడిన దానిని పూజింతురు. సూర్యుడు రాగితో కూడిన దానిని ప్రతిదినము పూజించును. కుబేరుడు బంగారముతో చేసిన లింగమును, వరుణుడు ఎరుపులింగమును, యముడునీలముతో కూడినదానిని, నిర్ఋతి వెండితో చేసినదానిని, వాయువు కాశ్మీర లింగమును ప్రతిదినమూ అర్చింతురు. ఇట్లు ఇంద్రుడు మొదలైన లోకపాలురందరూ, లింగపూజాపరులే. అట్లే పాతాళమున గంధర్వులు, కిన్నరులతో సహా మరియు ప్రహ్లాదుడు మొదలైన విష్ణుభక్తులగు దైత్యులు, అట్లే విభీషణుడు మొదలైన రాక్షసులు (లింగము నర్చింతురు).
బలి, నముచి, హిరణ్య కశిపు, వృషపర్వుడు, వృషుడు, సంప్రదుడు, బాణుడు, మరియు బుద్ధిమంతుడైన శుక్రుని ఇతర శిష్యులనేక మంది దైత్యదానవులు శివార్చన యందాసక్తిగలవారు రాక్షసులందరూ ఎల్లప్పుడూ శివునే పూజించువారు. హేతి, ప్రహేతి, సంయాతి, విఘసుడు, ప్రఘసుడు, విద్యుజ్జిహ్వుడు, తీక్షదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు (భీకర పరాక్రమముగలవాడు) మాలి, సుమాలి, అతిభయంకరమైన మాల్యవంతుడు విద్యుత్కేశుడు, తడిజ్జిహ్వుడు, మహాబలుడైన రావణుడు, ఎదిరింపశక్యము గాని కుంభకర్ణుడు, వేగ దరుడు (ప్రతాపముగలవాడైన) ఈ రాక్షసశ్రేష్ఠులంతా ఎల్లప్పుడూ శివార్చనయందుండి లింగమును పూజించి పూర్వము సిద్ధిని పొందిరి.
అందరికీ సహింపనలవిగాని ఘోరమైన తపస్సును రావణుడు చేసెను. తపస్పునకధిపతియైన మహాదేవుడపుడు మిగుల సంతోషించి, ఇతరులందరికీ పొందనలవిగాని వరములనిచ్చెను. అతను సదాశివుని నుండి విజ్ఞాన సహితముగా జ్ఞానమును పొందెను. యుద్ధములో జయింపబడకుండుట, (శివుని) తలలకు రెట్టింపు తలలు పొందెను. శివుడు ఐదుతలలు గలవాడు. రావణుడు పదితలలు గలవాడాయెను. అపుడు శివునిచేత త్రికూటమునకు ప్రభువుగా చేయబడెను. అందరు రాక్షసులకంటే గొప్పవాడైనందున వారి ప్రభువయి గొప్ప ఆసనము నధిష్ఠించెను.
ఓవిప్రులారా! తపస్విజనుల పరీక్షకై ఋషులను హింసించుట తపస్వి రావణుడు చేసెను. లోకములకు భీకరుడు రావణుడు జయింపశక్యముగాని గొప్పవాడాయెను- శంకరుని ప్రసాదముచే అతను వేరొకసృష్టిని కూడా చేసెను. తపస్వియగు అతని ప్రతాపముచేత లోకపాలురు జయింపబడిరి. గొప్పతపస్సుచేత బ్రహ్మకూడా జయింపబడెమ. ఓ విప్రులారా! అమృతమగు కిరణములు గలవాడగుటచే (అల్జీ) చంద్రుని జయించెను- కైలాసమును తూచుటచే ఈశ్వరుడు, దహింపజేయుటచే అగ్ని ఐశ్వర్యము చేత చన్హుడు, సర్వత్ర వుండుటచేత విష్ణువు జయింపబడిరి- లింగార్చన ప్రభావముచేత ముల్లోకలములూ వశములోకి వచ్చినవి అపుడు, దేవతాగణములన్నీ బ్రహ్మ విష్ణు మొదలుగా మేరు పర్వతముపై కలిసి, బాగుగా ఆలోచనను జేసిరి.
రావణునిచేత దుష్కరమైన తపస్సుచేత పీడింపబడితిమి. ఓ దేవతలారా! గోకర్ణమను పర్వతము పైని పరమాద్భుతమును వినుడు- మహాత్ముడైన (రావణునిచేత) సాక్షాత్ లింగముయొక్క ఆర్చనము చేయబడినది. జ్ఞానమాత్రముచే తెలియదగునది, పొందబడునది ఆగు పరమాద్భుతము ఇతరులు దాటలేనిది రావణుని చేత చేయబడినది మహాత్ముడైన రావణునిచేత గొప్పవైరాగ్యము పొంది, అంతకంటే మిక్కిలి ఔదార్యముచేత మమకారము వదలివేయబడినది వేయిసంవత్సరములు ఆ మహాభుజూడు తన శిరస్సును ఖండించి తన చేతితో లింగముయొక్క పూజకై సమర్పించెను. దానికెదురుగా రావణుని మొండెము సమీపముననే యోగధారణతో గొప్ప సమాధిలోనుండెను.
శివలింగమునందు యమును నిలిపి ఒకానొక కళతో మండెను. వేరొక శిరస్సున దుంచి దానిచే గూడా శివపూజనము చేసెను. ఇది వేరొక మునిచేతగాని, ఇతరులెవరిచేత గానీ చేయబడినది. ఇట్లు రావణుడు శివుని పూజకై పెక్కుతలలమ సమర్పించెను. మరల మరల మొండెముగా మిగిలెను, అప్పుడు శివుడు (ప్రపన్నడై వరములనిచ్చు వాడాయెను. ఓ రావణా! వీకిష్టమైనది కోరుము. ఆ వరములనేవిచ్చెదమ. అపుడు పరమ మంగళుడైన రుద్రుని జూచి రావణుడనెమ- 'భగవంతుడా! వీవు ప్రసన్నుడవైనచో నాకు ఉత్తమమైన వరమువిమ్ము' అనెను.
నేను వేరే వరమును కోరను. నీ పాదకమలాలనే ఆశ్రయింతును. నీకు నాయందుకృప యున్న వరమునున్నదున్నట్లుగా ఇవ్వవలెను అపుడు లోకభీకరుడైన రావణునితో సదాశివుడిట్లనెను. 'నా ప్రసాదముచేత నీవు కోరుకున్నది పొందగలవు ఓ దేవతలారా! ఇట్లు శివుడినుండి రావణుడంతా పొందెను. కనుక మీరంతా గొప్ప తపస్సుచేత రావణుని జయింపవలెనని నామనస్సున గలదు. విష్ణువు యొక్క మాటలను విని బ్రహ్మ మొదలైన దేవతాగణములు అందరూ చింతనొందిరి. వారు విషయములతో కూడియున్నవారు. బ్రహ్మ కూడా ఇంద్రియముల వశములోపడి కూతురుతో రమించుటకు నిద్దపడినాడు ఇంద్రుడు జారుడగుటవల్ల, చంద్రుడు గురువు యొక్క తల్పము చేరుట చేత, యముడు కృపణత్వముచే, వాయువు చంచలత్వము చేత అగ్ని పర్వమును భక్షించువాడగుటచేత, అట్లే ఇతర దేవగణములు కూడా, తపస్సుచేత విజృంభించిన రావణుని జయించుటకు సమర్థులుకాకపోయిరి.
గణములలో శ్రేష్ఠుడు, పురాతనుడు, బుద్ధిమంతుడు, నీతిని తెలిసినవాడు, గొప్ప బలపరాక్రమములు గలవాడు, గొప్ప తేజస్సు గల నంది శివప్రియుడు, రుద్రుని రూపము దాల్చినవాడు మహాత్ముడు. అట్టి నంది ఇంద్రుడు. మొదలుగా గల దేవతలందరితో ననెను ఏ కారణము చేత మీరు తొందరగా వచ్చితిరి. అదంతా విస్తరముగా చెప్పుడు' అనెను. అపుడు నంది చేత ప్రశ్నింపబడిన దేవతలంతా త్వరగా చెప్పిరి దేవతలు పలికిరి. 'మునులతో సహా మేమంతా రావణుని చేత జయింపబడితిమి లోకములకన్నింటికీ ప్రభువైన శివుని ప్రసన్నము చేసికొనుటకు ఇటకేతెంచితిమి.
భగవంతుడగు నంది వవ్వి బ్రహ్మతో ఇట్లుపలికెను. 'మీరెక్కడ? శివుడెక్కడ? గొప్ప తపస్పుచేత శివుడు హృదయము మధ్య మన్నట్లు గాంచవలె. ఈవాడు అతని చూడశక్యముగా గాదు. ఎంతవరకు అనేక భావము లుంటాయో (మనసులో) అట్లే ఇంద్రియ విషయములుంటాయో ఎంతవరకు 'నాది' అమభావముంటుందో, అంతవరకు ఈశ్వరుడు లభించుట కష్టము ఇంద్రియముల జయించిన వారికి, శమముగలవారికి, శివనిష్ఠగల మహాత్ములకు లింగరూపియైన శివుడు సులభుడు, మీకు మాత్రము దుర్లభుడేః ఆవగా అపుడు బ్రహ్మ మొదలగు దేవతలు, బుద్ధిమంతులగు ఋషులు నందికి నమస్కరించి అనిరి"నీవెందుకు వావరముఖమునొందితివి? దీవివి గూర్చి, అట్లే రావణుని తపస్సు యొక్క బలాన్ని గూర్చి చెప్పుము
మహాత్ముడైన శంకరునిచే కుబేరుడు ధనాధిపతిగా అధికారమును పొందగా, అతని చూడదలిచి రావణుడు ఇక్కడకు త్వరగాతన వాహనము నెక్కి వచ్చేమ. నన్ను చూచికోపముతో కుబేరుడిక్కడకు వచ్చినా అవి అడిగెను. తొందరగావీవతన్నిక్కడ చూచితివా చెప్పుము (అనెమ) ఆపుడు వేమ కుబేరునితో వీకేమిపని అడిగితిని అపుడు గొప్ప తేజస్సు గలవాడు, లోకభీకరుడైన రావణుడు వన్ను లెక్కించక విషయముల పై మనసుగలిగి, మదముతో నాకు శిక్షగరుపుటకు మొదలిడెను. 'ఇలాచేయకూడదు. నేనెట్లు ధనము, బలము గలిగి గొప్పవాడివో నీవునూ అట్లే కమ్ము! మూర్తుడా! మూర్ఖత్వమును పొందకుము.
మహాత్ముడైన కుబేరుడు వమ్న మూర్ఖునిగా చేసెమ, వేమ విరాకరించగా అతను రోషముతో తపస్సుచే పెను. ఓ సందీ! అట్టి కుబేరుడు వీ మందిరమునక్చొవా? ఇకపై ఆలోచించక కుబేరుని నాకిమ్ము రావణుని మాటలను విని వేమ కూడా త్వరగా ఆంటివి. ఓ మహానుభావా! నీవు లింగపూజమ చేయువాడవు, వేమమాఆయై మనిద్దరి మధ్య సమావత్వముందని తెలిపీ వ్యర్థముగా దుర్మతియై ప్రేలుచుంటివి. ఇట్లనగా అతమ బలముచే గర్వితుడై వాముఖమును గూర్చి అనేమ. మీరు పన్నెట్లు ప్రశ్నించితిరో (ఆతమ ఆట్లే ప్రశ్నించిన ఇది గతంలో జరిగినది, శివార్చవ విధియొక్క ఫలము చెప్పితిని శివుడు పారుప్యముపిచ్చివమా నేమ అపుడు గ్రహించలేదు. వేవే వావరముయొక్క పదవముకొజకు శివుని యాచించితిని. శివుడు కృపచే కరుణనే వారు దానినొసగెను.
ఎవరైతే అభిమానము (అహంకారము) దంభము, కానిది గ్రహించుట అనునవి లేనివారో వారు శివునికి ఇష్టులని తెలియవలయు. ఇతరులు శివునిచే బహిష్కృతులు అపుడు రావణుడు తపోబలము చేత నాతో ఇట్లనెను. నేను కూడా తెలివిగా పదితలలనూ యాచించితిని ఓ దేవతలారా! అట్లు రావణుడు ఎగతాళి చేయుచున్నట్లు పలుకగా నేను లోకభీకరుడైన రావణుడిని అపుడు శపించితిని ఎవరికైతే ఇట్లాంటి తలలుండునో, ఎవడైతే నరశ్రేష్ఠుడు, గొప్ప తపస్సంపన్నుడు వారితో కలియునో నన్ను ముందుంచుకొని వారు చంపెదరు. ఇందు సందేహము లేదు ఇట్లు నేను లోకభీకరుడైన రావణుని శపించితిని. ఆ మహాత్ముడు కేవలం లింగము నర్చించెను పీఠికారూపంలోని విష్ణువు లేకుండా లింగరూపి శివుని పూజించినందుచేత నశించెను. ఆ దేవదేవుడగు మహాదేవుడు విష్ణురూపమున అంతా చేకూర్చగలడు- మీరంతా అందరి హృదయాలయందు నిద్రించు ఆవిష్ణువును ప్రార్ధించుడు నేను దేవతలందరికీ ముందుండెదను. వారంతా నంది వాక్యమునువిని ఆనందించి, వైకుణ్ణమునకు వచ్చి విష్ణువును వాక్కులచే స్తుతించుట కారంభించిరి.
దేవతలనిరిః ఓ నరదేవా! జగత్పతీ! నీకు నమస్కారము. చరాచరమైన జగత్తంతయూ నీవు ఆధారముగా నున్నదే. ఓ విష్ణూ! నీవే లింగమును పిండి (లోహం) రూపమున ధరించుచుంటివి. మహా విష్ణుస్వరూపమున మధుకైటభుల జంపితివి ఆట్లే కూర్మ రూపమున మందర పర్వతమును నిలిపితివి. వరాహ రూపమును ధరించి హిరణ్యాక్షుని వీవే సంహరించితివి. నరసింహ రూపములో హిరణ్యకశిపుడను దైత్యుని చంపితివి. అట్లే నీవు బలియను దైత్యుడిని వామనరూపమున బంధించితివి. భృగువంశమున జన్మించి కార్త వీర్యుని జంపితివి. ఇకముందు కూడా నీవు మమ్మట్లే పరిపాలించుము. రావణుని ఈ భయమునుండి మమ్ము త్వరగా రక్షించవలెను. ఇట్లు దేవతలందరూ ప్రార్థింపగా, సర్వ భూతముల సృజించు విష్ణువు జగన్మయుడపుడు దేవతలందరిని ఉద్దేశించి పలికెను.
దేవతలారా! గొప్ప ప్రస్తావము వంటి వాక్యమును వినుడు - శైలాదుడగు నందిని ముందడి మీరంతా త్వరగా వానరదేహమున అవతారములనేర్పరుచుడు. నేను అజ్ఞానముతో కూడినవాడనై మనుష్యదేహమున అయోధ్యలో దశరథునింట సంభవించెదను. మీ పని సిద్ధించుటలో బ్రహ్మ విద్య నాతో కూడి రాగలదు. జనకునింట సాక్షాత్తు బ్రహ్మ విద్య జనించగలదు. రావణుడు శివధ్యాన పరుడు. భక్తుడు, బ్రహ్మవిద్య నెపుడు కోరునో అపుడు ధర్మ నిర్జితుడైన అతడు. (వధింప) పాధ్యుడగును, ఇట్లు పలికి భగవంతుడగు విష్ణువు పరమ మంగళుడై యుండెను.
ఇంద్రుని అంశాన వాలి, సూర్యుడి అంశాన సుగ్రీవుడు అట్లే బ్రహ్మయొక్క అంశచేత భల్లూకశ్రేష్టుడగు జాంబవంతుడు, శివుని అనుచరుడగు నంది, ఏకాదశ రుద్రుల అంశాన (పదకొండవ రుద్రుడు) గొప్ప తేజస్సుగల విష్ణువుకు సహాయము కొఱకు గొప్ప వానరమైన హనుమంతుడు అట్లే మైందుడు మొదలైన కపులు, దేవతాగణములన్నీ యథాతథంగా అవతరించిరి అట్లే విష్ణువు కౌశల్యకు ఆనందము కలిగించువాడుగా జనించెను. విశ్వమును ఆనందపరచుటచే 'రామ' అని విజ్ఞులచే పిలవబడెను విష్ణువు పట్ల భక్తిచేత ఆదిశేషుడు తపస్సు చేత భూమిపై లక్ష్మణునిగా అవతరించెను.విష్ణువుయొక్క ప్రతాపముగల భుజదండాలు కూడా అవతరించినవి- ముల్లోకములందు 'శతృఘ్న, భరత' అని పేరొందినవి.
దేవతల కార్యము సిద్ధించుటకై, బ్రహ్మ వేత్తలచేత బ్రహ్మవిద్య అనబడు మిథిలానగర రాజు కూతురు అవతరించినదినాగలిచే భూమిని దున్నునపుడు జనించినది గాన సీత అనీ ఈ ఆన్వీక్షికీ విద్య పేరుగాంచినది - అట్లే మిథిలయందు జనించుటచేత మైథిలి అనబడినది జనకుని కులమున జనించుటచేత జనకాత్మజి. (జానకి) అని పేరొందినది. పూర్వము పాపముల నశింపజేయు బ్రహ్మవిద్యయే వేదవతియని పేరుగాంచినది. ఆ సీత పరమాత్ముడైన విష్ణువునకు జనకుని చేత ఇవ్వబడినది. ఆ విద్యతో కూడి దేవదేవుడు, జగత్పతి, పరమమంగళుడైన విష్ణువు ఉగ్రమునగు తపస్సున మునిగెను.
రావణుని జయించు కోరికగల రాముడు దేవతల కార్యము సిద్ధించుటకై ఆరణ్య వాపము చేసిమ దువి యొక్క అవతారము కూడా పరమ శక్తితో దేవతల కార్యసిద్ధికై కష్టములో చేయవగు తపమనాచరించిమ. భరతశతృఘ్నులు కూడా పరమమైన తపస్సును చేసిరి. అటు పిమ్మట, ఈ రాముడు ఆయా దేవతా గణములతో కూడి ఆరు నెలలలో తన గణములతో సహా రావణుని జంపమ. విష్ణువు చేత తన శాస్త్రములచే చంపబడిన రావణుడు తన గణముతో కూడి శివుని సారూప్యమునొందెను. ఆతను మరల వెంటనే బంధువులతో సహా శివుని అనుగ్రహముచే ద్వైతాద్వైతమునొందెమ. ద్వైతాద్వైతము యొక్క జ్ఞానము కొరకు ఋషులు కూడా మోహితులై, శివార్చన యందాసక్తి గలవారు దానివిక్కడ పొందెదరు. లింగరూపమునమన్న శివుని వీత్యమూ ఆర్చించు స్త్రీలు, శూద్రులు, చండాలురు, అంత్యకులజులు కూడా సర్వ దుఃఖములమపశమింపజేయు శివుని పొందెదరు. ఇది నిశ్చయము .
పశువులు కూడా పరమును పొందెదరవివ ఇక మానవాదుల గూర్చి చెప్పేదేమి? ఏ బ్రాహ్మణులైతే బ్రహ్మచర్యముతో గొప్ప తపస్సు వాచరించారో, అనేక సంవత్సరాలు యజ్ఞముల వాచరించారో వారంతా స్వర్గమును పొందిరి జ్యోతిషామము, వాజపేయము, ఆతిరాత్రము మొదలైన యజ్ఞములన్ని యజ్ఞముచేయువారలకు స్వర్గమునిచ్చువనుటలో సంశయములేదు. స్వర్గమున స్వర్గ సుఖమును అనుభవించి పుణ్యము తరిగిపోగా యజ్ఞము చేయువారందరూ మరల మర్త్యలోకమున పడుదురు . సంసారమున పడినవారికి దైవమువలన బుద్ధి ఏర్పడును. ఆయా యోనులయందు గుణత్రయముతో గూడినదీ బుద్ది. పత్యముతో కూడినపుడు నరులు పత్యముతో కూడిన సంసారమున, అట్లే రాజసమున, తామసమును పొందుదురని తెలియవలయు. ఈ విధంగా సంపారచక్రమున ఎందరో జనులు భ్రమించారు - యదృచ్చచేత, దైవగత చేత వరుడు శివుని బాగుగా పేవించును. మాయ తొలగుట అమనది - మనస్సును అదుపులో వుంచుకొని శివధ్యానమే పరాయణముగా నమ్మువారలకు తక్షణమే కలుగును. వేరొక విధముగా కాదు.
మాయతొలగగా వెంటనే మూడుగుణములు నశించును- అవి నంచగా ఎవడు గుణముల కతీతుడో అతడు ముక్తిని పొందును. కనుక జీవులందరికీ లింగార్చనము తప్పనిసరి. శివుడు లింగరూపియై చరాచరమునంతా రక్షించుము. ముందు మీరు నమ్న శివుడు లింగ రూపమునెట్లు పొందివని అడిగితిరి. ఓ బ్రాహ్మణులారా ఆదంలో వున్నదున్నట్లుగా ఇపుడు చెప్పబడినది.(12) లోకములకు గొప్ప ప్రభువైన శివుడు విషమునెట్లు భక్షించెనో యథాతథంగా మీకు చెప్పేదేమ- విమడు.
శ్రీ స్కాందపురాణములోని - మాహేశ్వరఖండమునందలి - కేదారఖండమున శివలింగార్చవమాహాత్మ్యమువ రామావతారవర్ణన - అనుఎనిమిదవ అధ్యాయము.
