స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
13వ అధ్యాయము
లోమశుడు చెప్పెనః దైత్యులు గర్జించుచున్నవారై రణమునందు ఇంద్రుడు మొదలైన గొప్పబలముగల దేవతలను ఆక్షేపిస్తూ (పిలిచిరి) అపుడు మహాత్ముడైన వైరోచనుడు (బలి) విమానమెక్కి పూర్తి బలముతో, గొప్ప బలముగల దైత్యులతో కలిసి మిక్కిలి భయము కలిగించునటుల దేవతలను తరిమెను దైత్యులు తమ తమ రూపములను దాల్చి వేలకొలదిగా వచ్చిపడిరి. కొందరు పులుల నెక్కి, కొందరు దున్నలనెక్కి, కొందరు గుర్రములను, కొందరు ఏనుగులను, కొందరు సింహములను, కొందరు శార్దూలములను, కొందరు శరభములను .వెమళ్ళను, రాజహంసలమ, కోళ్ళమ, ఒంటెలమ, అశ్వములను, ఇట్లు ఏనుగులను,గాడిదలను,బళ్ళను వాహనములుగా చేసుకొని వచ్చిరి. కొందరు పాదచారులై వచ్చిరి. చాలామంది దైత్యులు ఖడ్గములను, శక్తి, ఋష్టి మొదలగు ఆయుధములను ధరించిరి కొందరు పరిసలను, పాశములను, శూలములను, ముద్గరములను, కత్తులను, భుకండీ, పరిమ మొదలగు ఆయుధములను ధరించిరి.
గుర్రములమ; ఏమగులన, రథములమా ఎక్కి ఆయుధము ధరించి, బలిమొదలగు ముఖ్యమైనవారు వేలకొలదిగా విమానములవెక్కిరి. ఒకరితో నొకరు పోటిపడుచు, మాటిమాటికీ గర్జించుచూ వుండిరి. అపుడు ఇంద్రుడు దైత్యస్తుడగు బలినుద్దేశించి ఇట్లనెను గొప్పబాహువుల గలవాడా! నీవు ఇంద్రునితో కలిసితివి. చెడు బుద్దిగలవానియందు విశ్వాసముంచరాదు. అదేవిధంగా తక్కువవాడు, తుచ్చడగు శత్రువుపై విశ్వాసమొనర్చరాదు. బుద్ధిమంతునితో చేసిన స్నేహము ఆపదలలో కూడా ఉపయోగించును. పూర్వము శతృత్వమున్నవాని యందు విశ్వాసముంచరాదు. ఓ బలీ! నేడు మేము పిచేత పరాజితులమైతిమి పూర్వమే దోషములుగల వారు మరల ఆలోచనను ఛేదించుటకు ఏల ప్రయత్నించరు? ఇట్లు పలికి ఎదిరింప శక్యముకానీవారు,యుద్ధము చేయనిలిచినవారు, పతాకముల చేత, ఛత్రముల చేత ఆ రణభూమినలంకరించిరి.
చామరములచేత అన్ని దిక్కులు, రణభూమి కప్పబడెను. అదేవిధంగా దేవతలంతా దైత్యులపట్ల రథోత్సుకతను ప్రదర్శించిరి వారంతా అమృతమును ద్రావి వాహనముల నెక్కి, జోళ్ళను ధరించినవారు, వజ్రమును ధరించిన ప్రతాపవంతుడగు మహేంద్రుడు గజమునధిరోహించెను. సూర్యుడుచ్చె; శవమను గుర్రమును, చంద్రుడు మృగము (జింక వధిరోహించిరిః జయమును కోరుచున్న ఇంద్రుడు మొదలగు దేవతలు ఛత్రచామరములతో కూడుకుని విజయలక్ష్మి చేత ప్రకాశిస్తూ విష్ణువును నమస్కరించిరి. విష్ణువు మండి ఆనుజ్ఞను పొంది దేవతలు మిగుల రోషముతో అసురులనెదుర్కొనిరి. అసురులు కూడా గొప్ప శరీరముగలవారై, భయముగొలుపు కన్నులతో పరాక్రమముతో (దేవతలనెదుర్కొనిరి) దేవతలకు దైత్యులతో మిక్కిలి ఘోరమగునది, అన్ని ప్రాణులకు భయమును గొలుపు యుద్ధముజరిగెను.
అంతలో బాణముల ప్రవాహాముండెను. పరమాద్భుతముగా పది దిక్కులా టఛటచా శబ్దములు ఏర్పడెను అంతట, ఒక్క నిమిషములోనే కొందరు బాణము దెబ్బ తగిలినవారాయెను. తోమర, లోహపు అంచుగల బాణములతో కొట్టబడి నేలపై బడిరి. కొందరు బాణములచే కొట్టబడుచూ ఇతరులను రణమున బాణములతో బాధించుచుండిరి. ఛురికల చేత కొందరు దైత్యులు దానవులు రాలు దేళ్బతీయబడి, కొందితుబాళములచేత కొట్టబడి దెబ్బతినిరి. ఇట్లు దానవుల, సైన్యము చెదిరిపోగా చూచి దేవతలు ఒక్కవేరుగా గర్జించుచూ, యుద్ధమున జయముపొందితిమని సంతోషించి అందరూ కలిసి ఒకరినొకరు ముల్లోకములూ శంఖము, వారిత్రము ఆను' వాద్యముల ఘోషచేత నిండేమ. మహాబలురైన దానవులపుడు దేవతలపట్ల అసహనమును కలిగియుండిరి.
బలి మొదలైన వారంతా సంభ్రమముగాలేచి సూర్యకాంతితో సమానమగు కాంతిగల అనేక విమానముల నధిరోహించిరి. దేవతలకు దానవులలో పరమగుయుద్ధము మరల ఒకరినొకరు జయించవలెనమ కోరికతో జరిగెను. అపుడు దానవరాజయిన బలితో మహేంద్రుడు యుద్ధము చేసెను. అదేవిధముగా మహాబాహువైన యముడు వముచితో తలపడను నైర్ఋతుడు ప్రఘసునిలో, వరుణుడు కుంభునితో, వాయువు నికుంభునితో పోరాడిరి రాహువు చంద్రునితో దారుణమైన యుద్ధమును చేపెను. అప్పుడు చంద్రుని దేహమునుండి వెడలిన అమృతమును రాహువు భక్షించెను. అమృతము యొక్క పంపర్కము వలన రాహువు అట్లే వుండెను. పరమేష్ఠియగు శివుడిదంతా చూచెను. అన్ని ప్రాణులకూ నిస్సంశయముగా నేవే ఆశ్రయమును. ఆసురులకు సురులకు అందరికీ వేష్టుడమ.
అట్లనగా రాహువుతలవంచి శివునకు నమస్కరించేమ. అపుడు తలపైనున్న చంద్రుడు భయముతో అమృతమును విడిచెను. దావీచే అతనికి పెక్కుతలలు కలిగిమ. శివుడు ఒక్కమారుగా వావిచే మనోహరముగా మండు మాలను చేసి శిరోభూషణముగా తలపై కట్టెను. కాలకూటమును భక్షించుటచేత శివుడు నీలకంఠుడాయెను. దేవతల పని సిద్ధించుటకై అపుడు 'ముండమాల' చేయబడిమ మహేశ్వరుడా ముండమాలనపుడు తలపై ధరించేమ. ఎవరు గజాసురుని సంహరించెనో, అంధకాసురుని దునుమాడెనో, త్రిపురములమనశింపచేసెనో'ఆట్టి దేవాదిదేవుడగు శివుడా మాలలో ప్రకాశించేమ, (35) ఆ శివుడు తన తలపై గంగమధరించేమ. జటలపై చంద్రుని ధరించేమ. ఆతమ భయముమ దూరముచేయును. వేదములు, పురాణములు, ఆగమములు, అట్లే వావావేదములు, శాస్త్రములు, శివుని గూర్చి చెప్పును.
పెక్కు ఆగమ భేదములచేత మీమాంస చేయువారు మూగవారవుదురు. అనేక ఆగమ, ఆచార్య, మత భేదములచేత తెలియబడు జగదేకబంధువు శివుడు నిత్యుడు, పరమాత్మ దైవము, వేదములచే మాత్రమే తెలియబడువాడు ఆగు శివుని విడిచి ప్రమత్తులగు జనులు పరమాత్మరూపునిగా శివుని తెలియలేకున్నారు. ఎవరిచేత జగత్తు సృజింపబడినదో, ధరింపబడినదో మరియు ఆశ్రయింపబడినదో, చేయబడినదో, ఎవరి ఆంతగా ఈ జగత్తంతా ఏర్పడినదో అట్టి పరమాత్మయగు శివుడు వేదాంతముచేత తెలియదగువాడు. ధనికుడుగానీ, దరిద్రుడు గాని, ఉత్తముడుగానీ ఆధముడు గానీ శివభక్తియందు ఆనందించువాడు నిస్సంశయముగా శివుడే ఎవరు ఇతరులుచేసిన పూజను శివునిపై ప్రకాశించుచుండగా చూచి ఆనందించునో, అతను దానికి సమానముగా దాయమును (వాటా) పొందును
కార్తీక మాసమున శ్రద్దతో దీపమాలతో శివునర్చించువారు, శివలింగముఎదుట ఎంతకాలము అవి వెలుగునో అన్ని యుగ సహస్రముల వరకు స్వర్గమునందు వెలుగొందును. కౌసుంభలముతో దీపములు శివాలయమున నుంచబడిన, అట్లు వుంచినవారు కైలాసమున శివుని వద్ద ఆనందింతురు. ఆతసీతైలములో (నల్లయవిసె నూనెతో దీపములనుంచినవారు కూడా ఆర్టిఫలమును పొందుదురు. దీపదానముయొక్క ఫలముగా వారు జ్ఞానులగుదురు నువ్వులనూనెతో దీపముల వెలిగించిన వారు నూరుకులములతో శివుని చేరుదురు నెయ్యితో దీపములనుంచినవారు లక్ష కులములతో పరమస్థానము నొందెదరు కర్పూర, అగరు ధూపములచే సదాశివుని ఆర్చించువారు, కర్పూరముతో ప్రతిదినము ఆరార్తికమును (హారతి) చేయువారు నిస్సంశయముగా శివసాయుజ్యము నొందెదరు.
ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడు సార్లు ఆలస్యముచేయక లింగార్చనము చేయువారు నిస్సంశయముగా రుద్రులే. శివపూబియందు ఆలస్యముచేయక దానమున, తపస్సున, తీర్థమున, పర్వకాలమున రుద్రాక్షలను ధరించువారీ పుణ్యమంతా అనన్తమగును ఓ బ్రాహ్మణోత్తములారా! శివుడు చెప్పిన రుద్రాక్షలను గూర్చి వినుడు. ఒక ముఖము మొదలు పదహారుముఖముల
వరకూ వున్న వానిలో తరింపజేయు శ్రేష్ఠమైన రుద్రాక్షలు రెండు.(51) పంచముఖ రుద్రాక్షలు, ఏకముఖరుద్రాక్షలు. ఏకముఖ రుద్రాక్షలు ధరించువారు శివలోకమున శివుని సన్నిధిన ఆనందింతురు.(52) జపము, తపము, క్రియ, యోగము, స్నానము, దానము, ఆర్చనము మొదలైన పుణ్యకర్మ లంతా రుద్రాక్షధారణచేత అనంతమగును.(53)
కుక్కమెడలో కట్టబడియున్ననూ రుద్రాక్ష దానిని కూడా తరింపజేయును. ఇందు వేరొక ఆలోచన చేయరాదు.(54) అదేవిధంగా, రుద్రాక్ష యొక్క సంబంధముచేత పాపము కూడా నశించును. ఇట్లు తెలుసుకొని రుద్రాక్షబంధనముతో పుణ్యకర్మ చేయవలెను.(55) మన్తము చేత పవిత్రమైన వీభూతితో మూడు రేఖలకు ధరించువారు నిస్సంశయముగా శివ లోకమున శివులే యగుదురు.(56) కపిలవర్ణముగల గోవుయొక్క పేడను క్రిందపడకముందే గ్రహించి, ఎండబెట్టి, విభూతికొరకు శివప్రియులు దానిని దహించవలెను. (57) విభూతి యని పేరుగాంచినది అన్ని పాపములు నశింపజేయును. నుదురుపై బొటనవేలితో రేఖను ముందు ఏర్పరిచి (58) మధ్యమవేలునువిడిచి రెండు వేళ్ళతో ఇట్లు మూడు రేఖలను ఏర్పరచవలెను. ఎవరి నుదురుపై ఇవి కనబడునో ఆ శైవుని శివునివలె తెలియవలయును. ఇట్టివాడు తన దర్శనముచేత పాపమును నశింపజేయును.(59)
ఐదు, ఏడు లేదా తొమ్మిది బిటలను ధరించు శైవులు లేదా శైవ విధితో జటలను పెంచువారు (60) నిస్సందేహముగా శివుని జేరుదురు. విశేషముగా శివభక్తులు రుద్రాక్షలను ధరించవలెను.(61) తక్కువ గానీ, ఎక్కువగానీ సదాశివుని పూజించువాడు తన కులమునంతా ఉద్దరించి శివునితో కలిసి ఆనందించును.(62) కనుక ఓ బ్రాహ్మణులారా! శివుని కన్న ఎక్కువ ఎవరూ లేరు. శాస్త్రమున చెప్పబడిన దానికంతా శివుడే కారణము.(63) లోకములకు దాత కర్త, అనుమతించువాడు శివుడే. బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ విశ్వమంతా ‘శివుడు-శక్తి’ అని గ్రహించండి. (64) ‘శివ’ అను రెండక్షరాలు గొప్ప భయము నుండి రక్షించునుగాన బ్రాహ్మణులారా! శివనామమును ధ్యానముచేయండి, స్మరించండి.(65)
ఋషులనిరిః సోమనాథుని ప్రసాదము వలన సోమనాథుని మాహాత్మ్యము తెలిసినది. గొప్పయుద్ధమున ఇంద్రాదిదేవతలు రాహువుయొక్క శిరస్సు భయమునుండి శివునిచే రక్షింపబడినారు (66) అటు పిమ్మట దేవతలంతా ఏమి చేసినారో తెలుపుము (67) వీ వోటిమండి శివుని మహిమను వింటిమి. ఇక యుద్ధవృత్తాన్తమును పూర్తిగా తెలుపుము.(68)
లోమశుడనెను- ఎపుడైతే సురులు దైత్యులచేత పరాజయము నొందారో, అపుడు వారు శివుడిని శరణువేడారు. మరియు దేవతోత్తములంతా ఒక్కమారుగా శివునికి నమస్కరించి యుద్ధమును చేయుటకు తల పెట్టిరి (69) అట్లే, దైత్యులు కూడా యుద్ధముచేయుచూ ఉత్సాహమును, బలమునుకలిగియుండిరి - గొప్ప అస్త్రములు కలిగి వారు దేవతలతో మరల మరల, యుద్దమును చేసిరి. (70) ఇట్లు, దేవ దానవులంతా శక్తి, ఋష్టి శూల, పరీఘ, పరశు మొదలగు ఆయుధములు చేతబట్టి జయమును కోరుచున్నవారై ఒండొరులపై అసహనము కలిగి హిమవత్పర్వతముపైని సింహములెట్లు హింసించునో అట్లు హింసించిరి. అపుడు దేవతలచేత దెబ్బతిన్న అసురులు వివిధ అస్త్ర ప్రయోగముల చేత నేలబడిరి (71) వారు తమ, మాంసము, రక్తముతో చెట్లు గుట్టలతో, . సముద్రము, వనములతో కూడిన భూమిని బురదతో కూడినదిగా చేసిరి (72) తలలను, మొండెములను, కవచములను, పతాకములను, రథములను, ధ్వజములను, ఏనుగుల, గుర్రముల తలలను కూడా (నదులు వహించినవి).(73)
వానిని వహిస్తున్న నదులు పిరికివారికి భయము గలిగించువానిగా, అగాధముగా నుండినవి. అట్టి లోతైన మరియు రక్తముతో నిండిన నీరుగల నదులను దాటుచున్న బ్రహ్మరాక్షసులు భూత, ప్రేత, ప్రమథ, రాక్షసులనితరిని కూడా దాటించుచుండిరి.(74) శాకినీ, డాకినీ, యక్షిణి మొదలగు వేలకొలది శక్తులు మిక్కిలి ఆనందముతో వివిధ ఆటలలో మునిగినవి.(75) ఇట్లు ఆ భీకరమైన దేవాసురసంగ్రామమున భూతములు, ప్రమధులు, రాక్షసులు బాగుగా ఆడుచూచుండిరి.(76) అపుడు అద్భుత పరాక్రమముగల దేవేంద్రుడు బలిని ఎదిరించెను. అపుడు సహనము లేని బలి శక్తియను ఆయుధముచే దేవేంద్రుని బాధించెను (77) గొప్ప పరాక్రమియైన ఇంద్రుడు దానిని మొక్కబోవు నట్లుచేసి, గొప్పశక్తితో బలిని కొట్టెను. (78) తీక్షమైన అంచుగల వజ్రాయుధముతో, ఇంద్రుడు బలి బాహువును ఖండించెను. అపుడు ప్రాణములు కోల్పోయి సూర్యునివలె ప్రకాశించు విమానమునుండి వేలబడెను. (79) బలి నేలపాలుట జూచి వృషపర్వుడు మిక్కిలి రోషముతో మేఘము పర్వతముపై వర్షించినట్లు బాణ ప్రవాహమున వర్షించేమ.(80)
వృషపర్వుడట్లు పదునైన బాణములను సహించు ఇంద్రుని గజముతో సహ బాధించెను. అపుడు వారిద్దరికీ గొప్ప యుద్ధము జరిగెను.(81) శత్రుబలమును నశింపజేయు ఇంద్రుడు వృషపర్వుని పడవేసి (82) గొప్పవజ్రముతో దానవులను రణమున జంపెను. కొందరు తలపై దెబ్బతిని మరణించగా, కొందరు మొండెమున దెబ్బతిని మరణించిరి.(83) కొందరు అవయవముల పట్టులేక అసమర్థులుగా, కొందరు ఇంద్రుని కోపమువలన అశక్తులైరి. ఆదే విధంగా యముని చేత, వాయువుచేత, వరుణిని చేత (84) కుబేరునిచేత, నైరుఋతిచేత, అగ్నిచేత, ఈశుని చేత అనేకుల ప్రాణములువిడిచిరి.(85) ఇట్లు బలవంతులు, పరాక్రమము గలవారునూ ఐన అసురులపుడు శివప్రసాదము కోల్పోయి లోకపాలురు మొదలగు దేవతల చేతిలో అసువుల బాసిరి.(86)
అపుడు దురాత్ముడగు కాలనేమి యనుగొప్పదైత్యుడు పరమాస్త్రముల దాల్చి ఒక్కడే దేవతలను బాధింపవెళ్ళెను.(87) పింహము నెక్కి, త్రిశూలమును దాల్చిన కాలనేమి సింహములనెక్కిన కోటిమంది దైత్యులను వెంటనిడుకొనెను.(88) ఆ సింహములు, జోడుతొడిగిన వారంతా గొప్ప బలపరాక్రమములు గలవారు. సింహములవంటి దైత్యులు సింహముల వెక్కిరి. (89) పింహములతో అలంకరింపబడిన దైత్య సేనను కాలనేమి వెంటరాగా చూచి ఇంద్రాది దేవతలు గొప్ప భయమునొంది ఆలోచనలో మునిగిరి.(90) ఇప్పుడేమి జేతుము? అద్భుతము, అసంఖ్యాకము, సింహములగల ఈ సేనను ఎట్లు జయించెదము? (91) అని ఆలోచిస్తుండగా నారదుడక్కడికి వచ్చెను. అపుడు నారదుడు కాలనేమి యొక్క తపోబలమును, వరము యొక్క బలముచే యుద్దమున జయింపబడలేకుండుటమ పూర్వము జరిగినదానిని ఇంద్రునికి చెప్పెను (92, 93)
విష్ణువు లేకుండా రణమండలమున జయించుటకు మేము అశక్తులము. పరమేశ్వరుడు తమాలము వలె ఏలముగా నుండువాడు, వరముల విచ్చువాడగు విష్ణువుని జయమునుగోరు వారందరూ స్మరించండి.(94) నారదుని మాటను వివి దేవతలంతా అపుడు త్వరగా శత్రువుల బలమున నశింపజేయు పరమాత్ముడైన విష్ణువును స్మరించి, ధ్యానమున ఇట్లనిరి.(95) ఒ భగవంతుడా! విశ్వమునకు శుభమును చేకూర్చువాడా! లక్ష్మికి నివాసమైన వాడా! నీకు నమస్కారము (96) దేవతలకభయమునిచ్చు ప్రభూ! కాలనేమి భయముచేత బాధపడుచున్న మమ్ము రక్షింపసమర్థుడవు నీవు.(97) ఇట్లు వారు స్మరించి, ధ్యానించగా నీల వర్ణముగా మండి, గరుడునధిరోహించిన విష్ణువు జగత్తునకభయమునిచ్చువాడుపాక్షాత్కారించేమ.(98) దేవతల విజయానికై చక్రముమ ధరించివచ్చెను. ఆకాశమున గరుడునిపై నున్న విష్ణువును యుద్ధము చేయు గోరుచున్న పరాక్రమవంతుడిగా చూచిరి.(99) కాలనేమి కూడా చూచి మిక్కిలి రోషముతో నవ్వి ఇట్లడిగెను. శ్రేష్ఠమగు రూపమును దాల్చి నీలిరంగులోనున్న యువకుడా, మదగజ పరాక్రమము గల నీవెవరు? ఎందుకొరకు పదునైనది, గొప్పకాంతి గలదీయగు చక్రమును చేత ధరించితివి? చెప్పుము.(100)
శ్రీ భగవంతుడనెను- దేవతల పని సిద్ధించుటకు యుద్ధముకై ఇచటికి వచ్చితిమి. ఓ ముర్ఖుడా! నీవు స్థిరముగా మండుము. నిస్సంశయముగా నిన్ను నేను దహింతును (101) అనగా విని ప్రతాపవంతుడైన కాలనేమి రోషముతో అధోక్షజుడగు విష్ణువునుద్దేశించి ఇట్లనెను (102) ‘దేవతల మూలము నీవే, యుద్దమునకై మదము నొందువాడా! శూరుడవైన, నాతో యుద్దముచేయుము’(103) ఆది విని నవ్వి, గొప్పకాంతిగల విష్ణువు - నీవైన ఆకాశమున విలువుము. నేనైనా భూమిపై నిలుచును (104) సమావము కాని యుద్ధము ప్రశస్తము కాదు. అట్లు కాకుండగా నీవు గగనముకానీ భూతలముపై కానీ యుద్ధము చేయుము,(105) ఆట్లేతలచిన మహానుభావుడగు కాలనేమి, కోటి సంఖ్యలో సింహముల నెక్కిన దైత్యులతో, మహాబలులతో కూడి (106) మెలమెల్లగా ఆకాశమును చెరెను. విశ్వరూపుడైన విష్ణువును హింసింప గోరి, దంతములతో వికృతమైన ముఖము గలిగిన కాలవేమి విష్ణువుతో యుద్ధము చేయుదలిచి భీకరమైన త్రిశిఖను చేత దాల్చి ఆకాశమును ప్రవేశించెను (107)
శ్రీ స్కాందమహాపురాణమున మాహేశ్వరఖండములోని కేదారఖండమున సముద్రమంథనాఖ్యానములో దేవాసుర సంగ్రామవర్ణనమను పదమూడవ అధ్యాయము సమాప్తము.
