స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

6వ అధ్యాయము

ఋషులు పలికిరిః శివుని వదలి శివలింగమునందు ప్రతిష్టయేట్లు! ఓ మహానుభావా! వినగోరుమాకు అదేట్లు ప్రవర్తించేనో తెలియజేయుము.  లోమశుడు చెప్పెనుః ఎప్పుడైతే ప్రభువైన శివుడు దారువనమున భిక్షకోజకు చరించెనో (అపుడీ సంఘటన జరిగెను) దిగంబరుడు, విడివడిన జటలు గలవాడు. వేదాంతము చేత తెలియదగినవాడు, భువనములకు ఒకే ప్రభువు అగు ఈశ్వరుడు బ్రహ్మ కపాలమును ధరించువాడు, యోగీశ్వరులలో శ్రేష్ఠుడు, పరమైనవాడు ఆణువు కంటే ఆణువైనవాడు, మహత్తు కంటెనూ గొప్పనైనవాడు, భువనములకు ప్రభువగు మహానుభావుడు భిక్షుకుని రూపములో దారువనములో భిక్షాటనముచేసెను. మధ్యాహ్నమున ఋషులు తమ ఆశ్రమమునుండి తీర్థమునకు వెళ్ళిరి. అపుడే ఋషిభార్యలంతా ఏతెంచిరి. 

 ఆ శివుని చూచుచూ వారు ఒకరితో ఒకరిట్లు అనిరి. 'అపూర్వమైన దర్శనము గల భిక్షుకుని రూపములో వచ్చిన ఇతనెవరు? సఖులతో గూడి ఈతనికి భిక్షను ఇచ్చెదము.' అని ఆ ప్రకారము వారంతా తమ గృహములనుండి సంతోషముగా భిక్షను తీసుకొని వచ్చిరి. దేవదేవుడైన శివుడు కోరినట్లు మృదువైన వివిధ భిక్షాన్నమును, - ఉపచారముతో గూడి యథాశక్తి తెచ్చి ఇచ్చిరి. ఒకానొక స్త్రీ విస్మయమునొంది ఇష్టుడైన శివునిట్లు అడిగినది - 'ఓభిక్షుకా! భిక్షుకుడవై ఇట విచ్చేసిన నీవెవరు? ఋషుల ఆశ్రమమిది శుద్ధమైనది. నీవెందుకు కూర్చోవడం లేదు? ఆ స్త్రీ అట్లు ఆడగగా నవ్వి శివుడిట్లు పలికెను.

'చక్కని కేశాంతము గలదానా! నేనీశ్వరుడను. ఈ పావనస్థలమున కేతెంచితిని. 'ఈశ్వరుని మాట విని ఋషి భార్య ఇట్లు పలికినది.  ఓ మహానుభావా! నీవు ఈశ్వరుడవు, కైలాసపతివే. ఏకాకివై (ఒక్కడి) భిక్షకొకు నీవెట్లు తిరుగుచుంటివి? ఇట్లు ఆ స్త్రీ అనిన శివుడు తిరిగి ఇట్లు పలికెను. 'దాక్షాయణి లేనందున నేమ దిగంబరుడనై ఇట్లు తిరుగుచుంటిని.  సంకల్పములేకుండా భిక్షకై (తిరుగుచుంటిని), ఆ సతి తప్ప ఏ స్త్రీ మాత్రమైనా నాకు ఇష్టముకాదు. ఓ భామినీ! నీకు సత్యమును చెప్పుచుంటిని.' కమలములవంటి కన్నులు గల ఆ స్త్రీ శివుని మాటలు విని పలికినది. దీనిప్పందేహముగా పురుషుడికి స్త్రీలు సుఖమగు స్పర్శగలవారు.  ఆట్టి స్త్రీలు నీవంటి బుద్ధిమంతునిచే వదలి వేయబడిరి.

అని ఆ స్త్రీలంతా కలిసి శివుడున్న స్థలానికి (వచ్చిరి) శివుని భిక్షాపాత్ర కూడా గొప్ప గుణాలుగల నాలుగు రకాల అన్నాలతో, ఆరురసాలతో నిండినది. ఎప్పుడైతే శివుడు కైలాసపర్వతానికి వెళ్ళగోరెనో అపుడు విప్ర స్త్రీలంతా ఆనందము నొందుచూ అతనిని అనుసరించిరి. ఇంటిపనిని విడిచి శివునియందే మనసునిలిపి చరించిరి, భార్యలందరూ ఆలా వెళ్ళగా, ఋషి శ్రేష్టులు  ఎప్పుడైతే ఇంటికి వచ్చారో అపుడు శూన్యమును చూచిరి. భార్యలంతా ఎక్కడకు వెళ్ళారని వారొకరితో నొకరనుకున్నారు. ఏ అధమునిచే అపహరింపబడినారో మనకు తెలియదు - అని ఆలోచించుచూ అక్కడక్కడవెతుకుచూ శివుని అనుసరించుచున్న వారిని విపులంతా చూచిరి. శివుని చూచి కోపించిన ఋషులు అతనిని చేరిరి.

త్వరగా వారంతా శివుని ఎదుట నిలిచి ఇట్లనిరి. మహాత్ముడవు. విరక్తుడవు అయిన నీ వేమి చేసితివి? నిస్సందేహముగా నీవు పరులైన ఋషుల భార్యలనపహరించుచున్నావు  అని అధిక్షేపింపబడిననూ శివుడు మౌనియై పర్వతము వైపు వెళ్ళుచుండగా, ఋషులు మహాదేవుడు, వ్యయములేనివాడగు శివుని 'భార్యలను దొంగిలించినందువలన నీవు వెంటనే నపుంసకుడవుగమ్ము.

ఇట్లు శివుడు మునులచే శపింపబడెను. అతని లింగము భూమిపై పడి, చేరగానే అతి వేగముతో అది వర్థిల్లెను. అది ఏడు పాతాళాలను, క్షణములోనే ఊర్థ్వలోకములను,పూర్తి భూమిని, అంతరిక్షమునూ కమ్మెను. స్వర్గములన్ని దానిచే కప్పబడెను. అది స్వర్గమును దాటినదీ ఆయెను - భూమిలేదు  దిక్కులచక్రము లేదు. నీరులేదు. ఆగ్నిలేదు.  వాయువు, ఆకాశం, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, కాలము, మహాప్రకృతి ఇవేవీ లేవు రెండవది అన్న విభాగమే లేదు. ఆక్షణములోనే అంతా లీనమైపోయినది. ఆ గొప్ప లింగమున జగత్తు పూర్తిగా లయించుటచేత  బుద్ధిమతులు దానిని 'లింగము' అందురు - ఆ విధంగా పెరుగుచున్న లింగమును చూచి దేవర్షులు ఇట్లనిరి.

బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, వాయువు, అగ్ని, లోకపాలురు, నాగదేవతలు ఆశ్చర్యముగా ఒకరితో నొకరిట్లనిరి.  దీవి పొడుగు, విస్తారమేమి? దీని అంతమెక్కడ? పీఠిక ఎక్కడ? అని చింతతో గూడి దేవతలంతా విష్ణువుతో ననిరి.

దేవతలనిరి - ఓ విష్ణూ! నీవు దీని మూలమును, బ్రహ్మ దీని శిరస్సును చూడవలేను. మీరపుడే గదా లోకపాలకులు. అది విని ఆ మహానుభావులిద్దరూ విష్ణువు పాతాళమునకు, బ్రహ్మ స్వర్గమునకు వెళ్ళిరి.

చూడవలెనని స్వర్గమునకు వెళ్ళిన జ్ఞాని బ్రహ్మ శివలింగముయొక్క మస్తకమును చూడకపోయెను. వెళ్ళిన మార్గముననే ఎమదిరిగిన బ్రహ్మ మేరు పర్వతమును చేరి సురభి చేత చూడబడెను. కేతకీ వృక్షాఛాయ యందునిలిచి సురభి మధురముగా నడిగెను. అదివిని సర్వలోకములకు పితామహుడగు బ్రహ్మ నవ్వుచూ ఛలోక్తిగా సురభితో నిట్లనెను.  'మూడులోకములను వ్యాపించిన గొప్ప అద్భుతమైన లింగము కనబడినది - దాని అంతమును చూచుటకు దేవతలు నన్ను పంపిరి. గొప్పదై ఆంతటా వ్యాపించిన దాని యొక్క శిరస్సు కనబడలేదు. దేవతలముందేమి చెప్పెదనని మిక్కుటముగా చింతనాకున్నది. లింగముయొక్క శిరస్పు కనబడినదనీ దేవతలకు ఆసత్యము చెప్పుము. ఇంద్రాది దేవతాగణములు అందరూ పలికెదరు. (పలికినచో) వారు ఈ విషయమున సాక్షులయ్యేదరు - ఓ సువ్రతా! నీవు కేతకితో సహా ఈ అర్థములో సాక్షివి గమ్ము, త్వరగా చెప్పుము.

 కేతకితో కలిసి సురభి పరమేష్ఠియైన బ్రహ్మవాక్కును గౌరవిస్తూ శిరసావహించెను. ఇట్లు వచ్చిన బ్రహ్మ దేవతల ఎదుట నిట్లు పలికెను.

బ్రహ్మ పలికెను - దేవతలారా! నేను అద్భుతమైన శివలింగము యొక్క శిరస్సును చూచితిని - కేతకీ దళముతో బాగుగా అర్చింతిని కూడా.  (ఆ లింగము) విశాలమైనది, స్వచ్ఛమైనది, సన్ననై, అతి ప్రసన్నమైనది, గొప్పకాంతితో అతి సుందరముగా నుండినది. ఈ విధమైన లింగమున చూచితిని. అది తప్ప వేరేదియూ కనబడలేదు. బ్రహ్మయొక్క పలుకులు విని దేవతలు విస్మయమునొందిరి. ఇట్లు ఇంద్రుడు మొదలైన దేవతలంతా ఆశ్చర్యముతో వుండగా, ఆధ్యాత్మమును ప్రకాశింపచేయు విష్ణువు, సర్వేశుడు పాతాళమునుండి వచ్చెను వెంటనే 'అందరినీ ఉద్దేశించి త్వరగా పలికెను. '(లింగము) దావి యొక్క ఆంతమును చూడదలిచి తత్పరుడనై (వెళ్ళిన) నేను ఆంతమును చూడలేకపోతిని.  పాతాళమును దాటి చరించుచున్న నాకు గొప్ప ఆశ్చర్యము కలిగినది. అతలము, సుతలము, వితలము, రసాతలము అలాగే తలము, పాతాళము, అతలమునకు వెళ్ళితిని. తలాతలములు శూన్యము వలె వుండెను.

శూన్యము కంటెనూ శూన్యమైనదంతా బాగుగా చూడబడెను. కాని లింగముయొక్క మూలము గాని, మధ్యమము గాని, అంతముగానీ లేదు. ఎవరిచే ఈ జగత్తంతా ధరింపబడుచున్నదో, ఎవరి ప్రసాదమువలన మీరు, ఋషులంతా జన్మించారో ఆ మహాదేవుడు లింగమే రూపముగా గలవాడు. అది విని దేవతలు, ఋషులు, అతని వాక్యమును మన్నించిరి. అపుడు విష్ణువు బ్రహ్మను పరిహసించునట్లు నవ్వి ఇట్లనెను.  'ఓ బ్రహ్మా! నీవు నిజముగా (లింగముయొక్క) శిరస్సును చూచినట్లయితే ఈ విషయములో సాక్షులెవ్వరు?' విష్ణువుయొక్క ఆ మాటను విని లోకపితామహుడైన బ్రహ్మ వెంటనే 'కేతకి-సురభి' అని త్వరగా పలికెను.

ఆ దేవతలు (కూడా) వా సాక్షులు అని నిజముగా తెలుసుకొనుము. బ్రహ్మ మాటలను విని దేవతలంతా త్వరగా కేతకిని, సురభితో సహా అహ్వానించిరి - అపుడు బ్రహ్మ యొక్క పనిపై సురభి, కేతకీలు తత్కణమే వచ్చిరి. అపుడు, ఇంద్రాది. దేవతలడుగగా సురభి కేతకితో కలిసి ఇట్లనెను. 'ఓ దేవతలారా! బ్రహ్మ కేతకీ దళము చేత పూజింపబడిన శివలింగము యొక్క శిరస్సును చూచెను. అపుడు ఆకాశమునుండి వాణి అందరూ వినుచుండగా ఉద్భవించెను. దేవతలారా! ఈ సురభి, కేతకిలు చెప్పినది అబద్ధమని తెలుసుకొనుడు - లింగముయొక్క శిరస్సు చూడబడలేదు.

 ఆపత్యమును, పలికిన సురభిని ఆపుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలందరు కోపముతో శపించిరి. 'శుభమగుదానా! ఈవాడు వీవు ముఖము చేత అసత్యమును పలికితివి. (కనుక) అన్ని ధర్మములనుండి బహిష్కృతమై వీ ముఖము. అపవిత్రమగుగాక! అసత్యమును పలికినందుచే విస్సందేహముగా శివార్చవయందు ఆయోగ్యమవగలవు. అపుడు ఆకాశవాణి బ్రహ్మమ శపించెను - 'మూడుడవై నీవు అసత్యము నేల పలికితివి?  భృగువు, ఋషులు, బ్రహ్మతో కలసి (పలికినందువ) క్లేశముమ వహిస్తూ మీరంతా పూజను కోల్పోయెదరు. ధర్మనిరతులగు ఋషులు కూడా తత్యవాక్యమునుండి బహిష్కృతులైరి. వివాదమున ఆసక్తిని గలిగి, మూర్ఖులు, తత్త్వమును తెలియనివారు. మాత్సర్యము గలవారు. యాచకులు, ఆకీర్తిగలవారు. తమ జ్ఞానమును నశింపజేయువారు, తమను తాము గౌరవించుకొనువారు. స్త్రజ్ఞులు, పరస్పరము నిందించుకొనువారు కాగలరని శివునిచేత శపింపబడిన బ్రహ్మాది దేవతలు, మునులు లింగమును శరణుజొచ్చిరి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందలి కేదార ఖండమున శివలింగమాహాత్మ్యమున బ్రహ్మాదుల శాపవృత్తమ్రవర్ణవమని ఆరవ అధ్యాయము.