స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
11వ అధ్యాయము
మహేశ్వరుడుపలికెను - ప్రతి పక్షముయొక్క చతుర్థి (చవితి) నాడు గణేశుని పూజింపవలెను. శుక్లపక్షమున నరులెల్లప్పటికీ స్వచ్ఛమైన తెల్లనువ్వులతో స్నానం చేసి అవసరమైనదంతా చేసి గణేశుని అర్చన క్రియను ప్రయత్నముచే గంధము, మాల్యము, అక్షతలు మొదలైన వానిచే చేయవలెను మొదట యథావిధిగా గణేశుని ధ్యానమును చేయవలెను. నాకున్నట్లే గణేశునికీ పెక్కు ఆగమములు గలవు. తమస్సు, రజస్సు, సత్యములతో కూడుకొన్న ఉపాసకులు అనేకరకాలుగా వున్నారు. గణముయొక్క భేదముచే ఆ పేర్లే పలురకాలుగా ఏర్పడినవి ఐదు తలలు గలవాడు, గణముల అధ్యక్షుడు, పదిచేతులు గలవాడు, మూడు కళ్ళుగలవాడు, ఆం దమైన స్పటికమువంటి కాంతి గలవాడు, నీలవర్ణమున కంఠముగలవాడు, నీలవర్ణము కంఠముగలవాడు, గజాననుడు అవి అతని పేర్లు,
అతని ఐదు తలలను గూర్చి కూడా వున్నదున్నట్లుగా చెప్పెదను.(6) మధ్యనున్న ముఖము ఎరుపు వర్ణములో నాలుగు దంతములు, మూడుకన్నులు గలది. తొండములో అందముగా నున్నది. మరియు లడ్డులు గలది వేరొక ముఖము పసుపు రంగులోను, వేరొకటి మంచి లక్షణాలు గలిగి నీలం రంగులోనూ, వేరొకటి ధూమ్రవర్ణములోనూ, వేరొకటి శుభ్రమైన వర్ణములోన వుండునది. అట్టిది గణేశుని శుభప్రదమైన ముఖము. అదేవిధంగా, పదిభుజాలయందలి ఆయుధాలను మీకు చెప్పెదమ - పాశము, పరశువు, పద్మము, అంకుశం, దంతము, అక్షమాల, నాగలి, రోకలి, వరము నిచ్చుహస్తము, లడ్డులతో నిండిన పాత్రనుచేతిలో ధరించిన గణేశుని బాగుగా భావించవలెను. లంబోదరువి, విరుపాక్షుని, యజ్ఞోపవీతమును (మెడలో వేసుకొనినవివీతం) వడ్డాణమును ధరించినవానిని, యోగాసనమున కూర్చుండిన వానిని, చంద్రుని రేఖను తలపై ధరించినవావిని, (ధ్యానింపవలెను).
మానవులకు రాజస ధ్యానమువలె, సాత్విక ధ్యానము తెలియవలెను. శుద్దబంగారు వన్నెనున్న అలౌకిక గజాననుని నాలుగు భుజములు, మూడు కన్నులు, ఒక దంతము, పెద్దపొట్ట, పాశము, అంకుశము గలిగిన వానిగా, దంతముచే చేసినమోదక పాత్రను గలవానిగా (ధ్యానించవలెను) నీలముగా ముఖమును ధ్యానించుట తామసమనబడును. ఇట్లు ధ్యానము మూడువిధాలు - తరువాత మీరు తొందరగా పూజను చేయవలెను - పదకొండు 'దూర్వా' లచే (గరిక) రెంటిని పేరుతో విడివిడిగా చేమా (పూజించవలె) అన్ని పేర్లచేత గణనాయకునకు ఒకటే ఇవ్వబడును - ఆట్లే పేర్లతో ఏకవింశతి (ఇరవైఒక్క) లడ్డూలను ఇవ్వవలెనుపూజకై మీకు విడివిడిగా పది పేర్లను చెప్పెదను
గణములకు అధిపతి, పార్వతీపుత్రుడు, పాపములనశింపజేయువాడు, వినాయకుడు, ఈశ్వర పుత్రుడు, అన్ని సిద్దుల నిచ్చువాడు, ఒక దంతము గలవాడు, ఏనుగు ముఖము గలవాడు, మూషకమును వాహనముగా గలవాడు, కుమారస్వామికి గురువు అట్టి నీకు నమస్కారము అని ప్రయత్నముచే పూజింపవలెను ఇట్లు దేవతలను పలికి వారిని, విష్ణువును, బ్రహ్మను సాదరముగా కౌగిలించుకొని సదాశివుడు వెంటనే అంతర్ధానమాయెను-వారంతా శివునికి నమస్కరించి గణాధ్యక్షుని పూలయందు ఆసక్తిగలవారైరి. తరువాత పూజావిధి ప్రకారము గణేశునికి అనేక ఉపచారములచేత, విడివిడిగా దూర్వా (గరిక) చేత పూజించిరి సంతోషించిన గణేశుడపుడు దేవతలకు వరములిచ్చువాడాయెను. వారంతా గణేశునికి ప్రదక్షిణముచేసి నమస్కరించి ఆనందపరచిరి. కాని, తమో గుణముతోకూడుకొన్న అసురులు పూజింప లేదు. అసుర శ్రేష్టులంతా దేవతలను ఎగతాళి చేయసాగిరి. శక్తిని పూజించి బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలు, రైత్యులు, దేవతాశ్రేష్ఠులంతా క్షీరసాగరాన్ని మరల చేరిరి
మందరపర్వతమును కవ్వముగా, వాసుకి అనుసర్పమును త్రాడుగా చేసి విష్ణువును దగ్గర నిలుపుకొని దేవతలపుడు మథవము (క్షీరసాగరాన్ని చిలుకుట) చేయసాగిరి (25) సముద్రము అట్లు చిలకబడగా అపుడు ఎదురుగా చంద్రుడు బయల్వెడలెను. దేవతల కార్యసిద్దికొరకతను అమృతమయుడుగా నుండెను.
శౌనకుడనెను 'ఓ మంచిచరితము గలవాడా! పూర్వమెవరిచేత చంద్రుడు సముద్రమున ఉంచబడినాడు? నీవు పూర్వము గజము మొదలగు రత్నముల గూర్చీ చెప్పితివి మొదట దీనినంతా క్లుప్తముగా తెలియజేయుము, ఓ ప్రభూ! సూతా ముందు దీనిని తెలుసుకొని మేము తరువాత పరిశీలించెదము, వారి ఆ మాటలు విని సూతుడు మాట్లాడ పాగిమ. ఓ విప్రులారా! - చంద్రుడు వీటితో కూడినవాడు. బ్రహ్మయొక్క అంశనుండి అనసూయయందు జన్మించినవాడు. అత్రిమహర్షి పుత్రుడు. గుణములు గలవాడు. అనసూయకు రుద్రుని అంశనుండి దుర్వాసుడు. విష్ణువు అంశనుండి దత్తకుడు జన్మించిరి. క్షీరసాగరము మథించబడుచుండగా చూచి చంద్రుడు ఆనందము నొందెను. క్షీరసాగరము కూడా చంద్రుని చూచి ఉత్సుకతనొందెను. ఇద్దరి ప్రీతికై ప్రవేశించిన చంద్రుడు, అమృత పూర్ణుడై దేవతల సన్నిధిలో నిలిచెను. ఓ విప్రశ్రేష్ఠులారా! ఇది విమడు!
ఆ కాంతివి చూచిన దేవతాగణములపుడు చంద్రునికి త్వరగా వీరాజనములు పట్టినవి. మృదంగ, భేరీ తప్పెట వంటి . అనేక చర్మవాద్యాల ధ్వనితో నీరాజనమిచ్చినది సురాసురదానవులంతా నమస్కరించిరి. అపుడుచంద్రుని బలాన్ని గూర్చి వాస్తవముగా తెలుపుమని వారడిగిన గర్గుడు మీకందరికీ నేడు బలమున్నది. మీ ఉత్తమ గ్రహాలన్నీ కేంద్రస్థావమున మన్నవిఅని చెప్పెమ గురువు (బృహస్పతి) బుధుడు, సూర్యుడు, శని, అంగారకుడు చంద్రుని చేరివున్నందున మీ పని సిద్ధించుటకు చంద్రబలం శ్రేష్ఠముగానున్నది- ఈ ముహూర్తము 'గోమంత 'మను సంజ్ఞ కలది. జయమును కలిగించునది.
ఈ విధంగా మహాత్ముడైన గర్గునిచేత ఓదార్చబడిన దేవతలు గొప్పబలవంతులై గర్జించుచూ, త్వరగా సముద్రమును మథించిరి.(38) దృడమైన నిశ్చయముగల వారంతా శివుని, గణేశుని మరల మరల స్మరించుచు రెట్టింపు బలము పొందిరి.(39) మథింపబడుతూ గర్జించుచున్న ఆ సముద్రము నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి బయల్వెడలినది.సంతోషముతో నున్నదీ, కపిలవర్ణము గలది, పొదుగు బరువుచేత నెమ్మది, నెమ్మదిగా ఆలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన సురాసరులంతా గొప్పకాంతి గల ఆ ఆవుపై పుష్పముల గురిపించిరి. ఆపుడు అనేక విధముల వాద్యాలు, తూర్యములు మ్రోగింపబడినవి- వంద గోవులచేత కూడివున్న ఆ ధేనువును నీటిమధ్య నుండి తీసుకొనివచ్చిరి.
ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపురంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రువర్ణములోనూ శ్యామవర్ణములోనూ, ఎరుపు రంగులోనూ, నేరేడురంగు, పింగళ (చిత్ర) వర్ణములోమా వుండినవి- అపుడు ఈ గోవులతో నుండిన సురభి కనబడినది. దేవదానవుల మధ్య మన్న సురభిని కామధేనువును, దేవతలను, దానవులను కూడా ఆనందముతో వున్న ఋషులిట్లడిగిరి. 'అనేక గోత్రములకుచెందిన బ్రాహ్మణులందరికీ కామధేనువుతో సహ గోవులన్నీ దానమివ్వబడవలెను. ఇందు సంశయము లేదు' వారట్లు యాచింపగా సురాసురులు శివుని ప్రీతికై ఆ గోవులను దానమిచ్చిరి. అపుడు శుభము, పుణ్యము కలిగిన ఆ గొప్పఋషులచేత సురభి మొదలగు గోవులు స్వీకరింపబడినవి ఆపుడు మునులంతా దేవతల కార్యసిద్ధికై, అసురుల నాశనానికై దేవతలకు పుణ్యాహవాచనం చేయించిరి.
మరల అందరూ ఉత్సాహముతో క్షీరసాగరమున మథించిరి. అపుడా సాగరమునుండి కల్పవృక్షము, పారిజాతము, చూత వృక్షము (మామిడి) సంతానకవృక్షము జనించినవి - గంధర్వవగరములో సరితూగు ఆ వృక్షముల నొక్కచోట వుంచి విజ్ఞులైన వారంతా మరల ఆ ఉగ్రమైన క్షీర సాగరమును మథించిరి. అపుడు దానినండి సూర్యుని వలె ప్రకాశించునది, గొప్పకాంతిగలదియగు కౌస్తుభమను, ఉత్తమరత్నము ముల్లోకములను తన కాంతిచేత ప్రకాశింపజేయుచూ చింతమణితో బయల్వెడలుటను వారు చూచిరి.(52) దేవతలంతా ఆపుడు ఆ కౌస్తుభాన్ని విష్ణువున కిచ్చిరి. సురాసురులు చింతామణిని మధ్యనుంచుకొని మిక్కిలి బలవంతులై గర్జించుచూ మరల సముద్రమును మథించిరి.(53) అపుడా సాగరమునుండి అద్భుతమైనది, అశ్వములందు రత్నమైన 'ఉచ్చైశ్రవమ'ను అశ్వము, 'ఐరావతమ'ను గజము జన్మించినవి.
అదే విధముగా నాలుగు దంతములు గల తెల్లని మదపుటేనుగులు ఆరువది నాలుగు జనించినవి. వాటినన్నిటినీ మధ్యలోవుంచి మరల సముద్రమును మథించిరి. అపుడు సముద్రమునుండి అనేకము జన్మించినవి. విజయ అమ మద్యము, భంగు, వెల్లుల్లి, ఒక రకమైన ఉల్లి, మిక్కిలి ఉన్మాదమును కలిగించు ధత్తూరము, పుష్కరము- ఔషధములు జన్మించినవి. వానీని సముద్ర తీరమున దగ్గరగా వుంచి సురశ్రేష్ఠులంతా కలిసి క్షీరసాగరాన్ని మరల మథించిరి ఆపుడు దానిమండి భువనమునకు ఒకే ప్రభువగు దివ్యమయిన 'లక్ష్మీ' జనించినది. ఆమెను బ్రహ్మవేత్తలు 'ఆన్సిక్షికీ' అని, ఇతరులు 'మూలవిద్యా' అని స్తుతింతురు కొందరు జ్ఞామలు ఆమెను బ్రహ్మవిద్యయందురు, కొందరు సమృద్ధియందురు,కొందరు ఆజ్ఞయని, కొందరు ఆశ అని అందురు, ఆమెనే యోగులు నిత్యయోగస్థితిచేత 'విష్ణువు యొక్క మాయ' అని యందురు.
ఆమెనే అందరూ కేనోపనిషత్తున ప్రతిపాదించబడిన 'ఉమా' శబ్దము చేత చెప్పబడు బ్రహ్మవిద్యయనీ జ్ఞానశక్తిగల వారై యోగమాయ యనీ అందురు. (61) వారు నెమ్మదిగా వచ్చుచున్న మహాలక్ష్మిని చూచిరి. ఆమె ఎరుపు వన్నె గల యువతి, సుకుమారమైనది. పద్మ కింజల్కములనలంకరించుకొనినదీ. చిరునగవుతో మంచిదంతములుగలది, యావన. మధ్యమున నున్నది, యౌవనమేభూషణముగాగలది, విచిత్రమగు వస్త్రములుఆభరణములు, రత్నములు మొదలగు వానిచేత ప్రకాశించుచున్నది. బింబఫలము వంటి పెదవులుగలది, చక్కని ముక్కు, దేహము, చక్కని కంఠము, కళ్ళు, నడుము. జఘనము, విశాలమైన కటిస్థలము గలది వివిధరత్నకాంతులచే మిగుల ప్రకాశించిన ముఖపద్మము గలదీ, సుందరముగా ప్రసవముగా నుండు ముఖముగలది, హారముచే నూపురములచే శోభిల్లునది తల పైనున్న ఛత్రము(గొడుగు) చేత ప్రకాశించుచున్నది గంగా తరంగముల కల్లోలముచేత ఎరుపెక్కిన చామరములచేత ఏవబడుచున్నది.
తెల్లవి ఏమగునధిరోహించిన లక్ష్మిని, మహర్షులచేత స్తుతింపబడుచున్నదానిని, దేవవృక్షముయొక్క పూలచే చేసిన మాలను ధరించి, మల్లికలతో కూడిన (మాలను) చేతియందు ధరించిన దానిని చూచి దేవతలు ఉత్సుకతతో చూచుచుండగా ఆమె వారిని చూచేమ -తల్లి ఏవిధంగా తన బిడ్డలను చూచునో అదేవిధంగా లక్ష్మీదేవి దేవదానవులను, సిద్దులమ, చారణులను, నాగులను చూచినది లక్ష్మీ దేవిచే చూడబడిన దేవతలు అదే క్షణములోనే ఐశ్వర్యమునొంది రాజ్యలక్షణములను పొందిరి. ఆమెనే చూడబడ దైత్యులు తమ వైభవమును కోల్పోయినవారైరి. అపుడు లక్ష్మీదేవి తమాలవృక్షమువలె నీలముగా నున్న, చక్కని కపోలము, నాసిక గలిగిన, దయతోనున్న చూపులు గలిగిన విష్ణువును చూచెను. వెంటనే వనమాలతో సహా గజముమండి క్రిందికిదిగి ఆందరినీ విస్మయపరుస్తూ పరమపురుషుడైన విష్ణుమూర్తి మెడలో గొప్ప శోభను కలిగి తుమ్మెదలతో నున్న వనమాలను వేసినది.
అపుడు లక్ష్మీదేవి మహాత్ముడైన విష్ణుమూర్తి ఎడమవైపున చేరి కూర్చోనెను. వారిద్దరినీ జూచి సురులు, దైత్యులు, సిద్ధులు, అప్సరసలు, కిన్నరులు, చారణులు, సంతోషమునొందిరి. లక్ష్మీనారాయణుల సమాగమము చేత లోకములన్నింటికీ ఒక్కమారుగా గొప్ప ఆనందముకలిగినది. మహావిష్ణువును లక్ష్మీదేవి, ఆమెను మహావిష్ణువు వరించిరి గాన ఒకరినొకరు ప్రేమతో చూచుకొనిరి. శంఖముల, తప్పెటల, మృదంగముల, అనకముల (పెద్దభేరి) వేణువులాంటి వాద్యముల, భేరి, ఝర్జరీ మొదలైన వాద్యముల ధ్వని పెద్దదిగా వినబడెను. గాయకుల గావము గొప్పదిగా నుండెను. తతము, (తంత్రీవాద్యము) వితతము, మనము, సుషిరము మరియు ఇతర వాద్యముల చేత గంధర్వుల, అప్సరసల గణములు గానపద్దతి తెలిసినవారై విష్ణువును అన్నివిధములుగా సంతోషపెట్టిరి. అపుడు, నారదుడు తుంబురుడు మొదలగువారు, గంధర్వులు, యక్షులు, సురులు, సిద్ధులు, పరమాత్మరూపుడైన మహావిష్ణువును, అపరిమితజ్ఞానరూపుడివి గూర్చి గానముచేసిరి.
శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండములోని కేదారఖండమున క్షీరసముద్రమథనాఖ్యానమున లక్ష్మి ప్రాదుర్భవించుటను వర్ణించు పదకొండవ అధ్యాయము సమాప్తము.
