స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

33వ అధ్యాయము

ఋషులడిగిరిః ‘ఆ కిరాతుని పేరేమి? అతడి వ్రతమాచరించెను? మాకు అధికముగా కుతూహలమున్నందున దానివి చెప్పుము (1) దానివంలో మేము వివగోరుచున్నాము. వాస్తవముగా తెలియజేయుము. నీవు తప్ప ఈ లోకమున శ్రేష్ఠుడైన వక్తలేడు కనుక వినగోరుచున్న దానిని తెలియజేయుము’ (2) అని శౌనకుడు అడుగగా లోమశుడు. పుష్కసుడు చేసిన దానినంతా తెలియజెప్పసాగెను. (3) పూర్వము మహారౌద్రుడగు చండుడను దురాత్ముడు, క్రూరులతో కలిసి ప్రాణులకు భయమును కలిగించువాడుగా నుండెను. (4) ఎప్పుడూ జాలముతో చేపలను పట్టి చంపుచూ దుష్టాత్ముడై వుండెను - భల్లూకములను, లేళ్ళను, ఖడ్గమృగములను ఇతర మృగములను పక్షులను విశేషముగా బ్రాహ్మణులను చంపుచుండెడివాడు (5,6) ఆ వేటగాడు మహాపాపి, దుష్టుడు, దుష్టజనులకే ఇస్టమైనవాడు. అట్లాంటిదే అతని భార్య. (7) ఇట్లు అతను విహరించుచుండగా చాలాకాలము గడిచెను. ఒక్కనాడతను బాగా దప్పిగొని తిత్తిలో నీటిని తీసుకొని రాత్రి సమయాన బిల్వవృక్షముపై కూర్చుని, అడవిపందిని చంపుటకై, చేత విల్లునుపట్టి మెలకువతో నుండెను (9)

మాఘకృష్ణ చతుర్దశినాడు మృగమార్గమును చూచుకోరికతో బిల్వపత్రములను నేలరాల్చెను. (10) కోపముతో బిల్వ పత్రములనతడు తెంపి పడవేయసాగెను. ఆ చెట్టు కిందనున్న లింగముపై దుష్ప్రభావములనతడు తెంపి పడవేయసాగెను. (11). అనుకోకుండా ఆ బిల్వపత్రములు, పుక్కిటి నీరు క్రిందనున్న లింగాకార శివునిపై పడగా దైవయోగముచే ఆదంతా శివపూబి ఆయెను. (12) పుక్కిటి నీరుతో స్నానముచేయించి, అనేక బిల్వపత్రాలతో ఆ కిరాతుడు తెలియకుండానే మాఘకృష్ణ చతుర్ధశీ చంద్రోదయమునాడు శివునర్చించేను. (13) అటు తరువాత పుష్కసుడు చెట్టుపై నుండి దిగి, మడుగు వద్దకు వచ్చి చేపలను చంపసాగెను (15) ఇక ఆ వేటగాని భార్య ఘనోదరి యను పేరుగలది, దుష్ట పాపనిరత, పరద్రవ్యమునపహరించునది. (16) సాయంకాలమున ఇంటినుండి బయటకు వచ్చి ఇంటి బయట నిలుచుండి భర్తరాకకై ఎదురుచూచుచూ వనమార్గమును చూచుచుండెను. (17) ఎంతకూ భర్తరానందుచే ఆమె ఇట్లాలోచింపసాగెను. ఈనాడు సాయంకాలముననే వేటగాళ్ళందరూ వచ్చేసిరి (18) దిక్కులన్నీ చీకటితో కప్పబడినవి - రాత్రి రెండుజాములు గడిచిననూ నాభర్తరాదేమీ? (19)

కేసరములపై లోభముతో సింహముచే చంపెబడెనా ఏమి? భుజంగముల పడగలపై నుండి మణులను హరించుచూ, వాని విషముచే అసువులబాసెనా? (20) అడవిపంది కోరల పాలబడి ప్రాణములు కోల్పోయేనా? తేనె పొందు లోభముతో చెట్టెక్కి, దానిపైనుండి క్రిందబడియుండునా? (21) ఎక్కడనీ వెదకను? ఎవరిని అడగను? ఎవరివద్దకు వెళ్ళను? అని అనేక రీతుల విలపించి, తన ఇంటినుండి బయటకు వెడలెను. (22) ఆనాడు ఆమె నీరు తాగలేదు. అన్నం తినలేదు - భర్తగూర్చి ఆలోచించుచూ రాత్రిని గడిపెను. (23) ఇక పొద్దుననే ఆ స్త్రీ భర్త తినవలెనని అన్నమును తీసుకొని త్వరగా వనమునకు వచ్చెను (24) వనములో తిరుగుతూ ఒక పెద్దనదిని దాని ఒడ్డున కూర్చున్న తన భర్తను ఆమె చూచి సంతోషించినది. (25) ఆ అన్నమును ఒడ్డుననే వుంచి నదిని దాట సాగెను. ఇంతలో ఆ కిరాతుడు జాలమున బడిన చేపలను చూచి వానిని తీసుకొని వచ్చెను. (26) అపుడు ఆ స్త్రీ భర్తతో ‘త్వరగా రా! ఈ అన్నాన్ని నీ కోసం నేను పగలంతా ఉపవాసముండి తెచ్చాను. తిను. (27) నిన్న, ఈనాడు ఏం చేసావు? మూర్ఖుడా! తీనకుండానే వునొవు! (28) అనగా ఆ కిరాతుడు అతని భార్య నదియందు స్నానము చేసి శుచియైరి. ఇక ఆ వేటగాడు భోజనము చేయబోవుచుండగా కుక్క ఒకటి వచ్చెను. (29) అన్నాన్నంతా అదే స్వయంగా తిని వేయగా, ఆ కిరాతస్త్రీ కోపించి, కుక్కను కొట్టబోయెను. (30)

మన అన్నాన్ని ఈ పాపిష్ఠి కుక్క తినివేసినది మూర్ఖుడా! ఇంక నీవేమి తినెదవు? ఇక ఆకలితో వుండవలెను (31) అని అవగా చండుడు ఆమెను ఉద్దేశించి ఇట్లనెను - 'కుక్క తిన్న అన్నముతో నేను సంతోషించితిని. (32) ఆయుష్చుకోల్పోయి, వశించు స్వభావముగల ఈ శరీరముతో నేమి. లాభము? క్షణభంగురమైన ఈ దుర్లభ శరీరము పూజింపబడును (33) అన్ని విధాలుగా ఈ దేహమును పోషించుకొను మానవులు మూడులు, పాపులు అని తెలియవలయును. వారు ఇహ, పరలోకములనుండి బహిష్కరింపబడుదురు. (34) కనుక, కోపమును అభిమానమును వీడి స్వస్థురాలవు గమ్ము. విమర్శించి, వాస్తవబుద్ధితో స్థిరముగా నుండుము. (35) అని కిరాతుడు ఆ చండికి వాస్తవమును తెలియజేసెను. పుష్కసుడు చతుర్దశినాడు జాగరణం చేసి, శివరాత్రి ప్రసంగముచేత, శివరాత్రినాడు. ఏ ఫలమగు జ్ఞానము కలుగునో దానిని పొందెను (37) అమావాస్యనాడు రెండు జాములు గడిచి, అమావాస్యరాగా శివుని పనుపున పెక్కు గణములక్కడికి వచ్చినవి. (38) కిరాతుని గణములు, పెక్కు విమానములురాగా చూచి, పుష్కసుడు (వేటగాడు) పరమభక్తితో వారితో విట్లనెను - మీరందరూ ఇక్కడకేల వచ్చితిరి? మీరందరూ రుద్రాక్షముల ధరించారు. (40) కొందరు విమానములలో నుండగా కొందరు వృషభముల పై కూర్చున్నారు మీరంతా స్పటికములవలె మెరయుచూ అర్థచంద్రుని శిరముపై ధరించినారు. (41) జటాజూటములను, కృత్తివాసమును, సర్పములను ధరించి శోభించుచున్నారు - రుద్రుని తేజస్సుతో సమానమగు తేజస్సుగల మహానుభావులారా! మీరెవరో నిజముగా చెప్పండి. (42)

అని కిరాతుడడుగగా దేవదేవుడగు రుద్రునికి విధేయులు, కమలలోచనులగు ఈదూతలిట్లనిరి. (43) ‘చండా! పరమేష్ఠియగు శివుడు పంపగా వచ్చినాము. నీభార్యతో సహా త్వరగా విమానము నెక్కుము. (44) రాత్రియందు శివుని లింగార్చన చేసితివి. ఆ కర్మఫలముగా శివుని సన్నిధిని పొందితివి.’ (45) అని వీరభద్రుడనగా నవ్వి ఆ కిరాతుడు తన బుద్ధితో ప్రస్తావపూర్వకముగా నిట్లనెను. (46) ‘పాపి, హింసకుడనగు నేను నేడు చేసినదేమి? వేటయందాసక్తి గలవాడను, దురాత్ముడిని నేను (47) పాపము నాచరించు నేను స్వర్గమునకెట్లు వెళ్ళేదను? లింగార్చనమును నేనెట్లు చేసితినో చెప్పండి. (48) నాకు మిక్కిలి కుతూహలముగా నున్నది. వాస్తవము తెలుపుడు. (49) అని కిరాతుడడుగగా వీరభద్రుడు సంతోషముతో యథావిధిగా శివధర్మమును చెప్పనారంభించెను.(50)

‘కిరాతుడా! దేవదేవుడు, ఉమాపతి, దేవేశుడు అగు ఈశ్వరుడు నేడు సంతోషించివాడు.(51) అనుకోకుండానే నీవు మాఘమాసమున శివపూది నొనరించితిని. ఆది శివునికి సంతోషమును కలిగించును. నేడు నీవు నిస్సంశయముగా పవిత్రుడవైతివి.(52) శివరాత్రినాడు ప్రసంగవశాత్తు శివార్చనను చేసితివి. అదెట్లనిన ఆడవిపందిని గూర్చి నిరీక్షించుచూ, బిల్వపత్రములను నీవు తెంపగా అవి అప్పుడే కిందనున్న శివలింగముపై పడినవి. "దావీచే నీవు పుణ్యాత్ముడవైతివి.(53) ఆట్లే చెట్టుపై మేల్కొని వుంటివి. దానిచే ఈశ్వరుడు సంతసించెను.(54) అడవిపందిని చూచు మిషతో శివరాత్రినాడు నీవుకానీ, నీ భార్యకానీ నిద్రించలేదు.(55) ఆ ఉపవాసముచే, జాగరణచే దేవవరుడగు మహేశ్వరుడు సంతసించెను- నీవు ప్రసన్నుడవగుటకు వరములనన్నింటినీ ఇచ్చుచున్నాడు.(56) అని ధీమంతుడగు వీరభద్రుడనగా పుష్కసుడు కూడా గణములు, దేవతలు, అన్ని ప్రాణులు చూచుచుండగా విమానమునెక్కెను-(57) అపుడు దేవదుందుభులు, భేరీ, తూర్య వాద్యములు మ్రోగెను.(58)

అతని ఎదుటనుండి వీణావేణు మృదంగములు నడచుచుండెను- గంధర్వ రాజులు గానము చేసిరి. అప్పరగణములు నర్తించిరి.(59) సిద్ద చారణులు విద్యాధరగణములు అతనిని వివిధ చత్రముల పట్టి, చామరములతో వీచుచూ స్తుతించిరి. అట్లు అతనిని గోప్ప వేడుకతో గంధమాదనముకు తెచ్చిరి.(60) శివరాత్రినాడు ఉపవాసముండుటచే శ్వేతుడు పరమస్థానము అగు శివుని సన్నిధిని చేరెను.(61) కిరాతుడే ఆ విధంగా యాదృచ్ఛికంగా చేసిన శివపూజతో సదాశివుని చేరిన, శ్రద్దగా ఆర్చీంచు వారిని గూర్చి చెప్పునదేమి?(62) పరమాత్మయగు శివునికి పుష్పములు మున్నగునవి, ఫలములు, గంధము, తాంబూలము, భక్ష్యము మున్నగునవి సమర్పించినవారు నిస్సంశయముగా రుద్రులే.(63) అల్పబుద్దియగు కిరాతుడట్లు ప్రాసంగికముగా శివుని యర్చించి శివసాన్నిధ్యమునొందెను.(64) అని చెప్పగా ఋషులిట్లడిగిరి- ఆ వ్రతమును పూర్వమెవరు చేసిరి? దాని ఉద్దేశము, ఫలము ఏమి? దేనినుండీ వ్రతము వచ్చినది?? (65) అని ప్రశ్నించగా లోమశుడు చెప్పసాగెను- పూర్వము పరమేష్ఠియగు బ్రహ్మ జగత్తునంతా సృజించినపుడు రాశులతో కాలచక్రమేర్పడినది.(66) ఆందు పన్నెండు రాశులు అట్లే ఇరువదియేడు నక్షత్రములు ముఖ్యముగా కార్యసిద్ధికై ఏర్పడినవి.(67)

ఈ రాశులలో, నక్షత్రములతో అంతా ప్రచండము - అట్టి కాలచక్రముతో కూడి కాలము క్రీడించుచూ జగత్తును సృజించును.(68) బ్రహ్మ మొదలు స్థూలము వరకు సృజించును, పాలించును, సంహరించును. ఆ ఒక్క కాలముచేతనే అంతా కూర్చబడినది.(69) లోకమున కాలమొకటే బలమైనది. వేరొకటి లేదు. కనుక ఇదంతా నిస్సంశయముగా కాలాత్మకమైనది(70) మొదటి కాలము, ఆంతట సృష్టికర్త, తరువాత లోకములు, వివిధ సృష్టి (71) సృష్టినుండి ‘లవము’ దానినుండి క్షణము , దానిమండి ‘నిమిషం’, ప్రాణుల నిరంతర విమిషముల్ని(7) ఈ నిమిషములు ఆరవై పలమనబడును. పది హేను రాత్రింబవళ్ళు కలిపి ‘పక్ష’ మనబడును.(73) రెండు పక్షములతో ‘మాస’ మనబడును. ఇట్టి పన్నెండు మాసములైన సంవత్సరమనబడును -ఆకాలమును తెలియగోరినవారు జాగ్రత్తగా తెలుసుకొనవలెను- (74) పాడ్యమీనుండి పౌర్ణమివరకు పూర్లపక్షము కనుక ‘పూర్ణిమ’ యవబడును. (75) పూర్ణచంద్రుడున్నది పూర్ణ అని దేవతల కిష్టమైనది - చంద్రుడు కనబడనిది అమా యనబడును. (76) ఇది ఆగ్నిష్వాత్తు మొదలగు పితరులకు ప్రియము. . ఇటువంటి ముప్పది దినములు పుణ్యకాలముతో కూడినవి(77)

‘ద్విజులారా! వాని మధ్యనున్న విశేషమును వినుడు.(77) యోగములలో వ్యతీపాతము, నక్షత్రములలో శ్రవణ నక్షత్రము, తిథులలో పూర్ణిమ, అమావాస్య (78) మరియు సంక్రాంతులు దానకర్మయందు పవిత్రములు. అట్లే శివునికి అష్టమి, గణేశునికి చతుర్థి, (79) నాగరాజుకు పంచమి, కుమారస్వామికి షష్ఠి, సూర్యునికి సప్తమీ, చండికకు నవమి (80) బ్రహ్మకు దశమి, రుద్రునికి ఏకాదశి, దామోదరునికి ద్వాదశి, యమునికి త్రయోదశి (81) శివునికి చతుర్దశి తిథులు అత్యంత ప్రియములు. సంశయములేదు - కృష్ణపక్షమున రాత్రితో కూడిన చతుర్దశిన ఉపవాసమును వుండవలెను. శివసాయుజ్యమును కలిగించు శ్రేష్ఠమైన తిథి ఇది.(82) ఇదే పాపములన్నింటిని నశింపజేయు శివరాత్రి తిథియని పేరొందినది. ఈ సందర్భముగా ఈ పురాతనమగు ఇతిహాసమును ఉదాహరింతురు.(83)

పూర్వము చంచల, విధవయసు ఒక బ్రాహ్మణి యుండెను. కాముకియగు ఆ స్త్రీ చండాలునితో రమించినది.(84) వారికి పేరు, స్వభావముచే దుష్టుడగు దుఃసహుడను వాడు జన్మించెను- ధర్మములన్నింటిని విడిచినవాడు.(85) అనేక మహాపాపముల నాచరించువాడు, ద్యూతము, సురాపానము, చౌర్యము, వ్యభిచారము (గురుతల్పమును పొందుట) (86) వేట మొదలగు వ్యసనములు గలవాడు, కర్మచే చండాలుడే వాడు. అధర్మవర్తనుడై చెడుపనులాచరించుచూ ఒకనాడు శివాలయమును చేరి శివరాత్రినాడు శివుని చెంతనుండెను.(87) అనుకోకుండా శివశాస్త్రమున శివుడు లింగరూపమున నుద్భవించునపుడు వీనెను.(68) శివరాత్రినాడు మేల్కొని ఒకచోటమన్న వాడు ఆ పుణ్యఫలములచే పుణ్యమైన జన్మను పొందెను.(89) పుణ్యతమలోకములలో పెక్కు సంవత్సరాలు సుఖములమ అనుభవించి రాజలక్షణములతో చిత్రాంగదుని పుత్రుడై జన్మించెను.(90) సుందరుడగు అతని పేరు విచిత్రవీర్యుడు - గొప్ప రాజ్యమున పొందెమ - శివభక్తిని కలిగి శివార్చనను శివశాస్త్రము ననుసరించి చేయువాడాయెను - రాత్రి సమయాన ప్రయత్నముతో శివుని చెంత జాగరణము చేయును.(92) శివుని కథలు వినునపుడు ఆనందబాష్పములు రాలును, రోమాంచము కలుగును.(93) అట్టి శివధ్యానపరునికి ఆయుషు తీరగా, శివలోకమును చేరెను. శివుడు జ్ఞానముగల పశువులకూ సులభుడే. సుఖము పొందుటకు సేవించదగిన వాడు శివుడొకడే - ఆ విచిత్రవీర్యుడు శివరాత్రినాడుపవసించి ఉత్తమజ్ఞానమును పొందెను.(95)

ఆ జ్ఞానముచే భూతములయందు సమదృష్టి యతనికి ఎల్లప్పుడూ ప్రాప్తించినది. అన్ని ప్రాణుల రూపమున కేవలుడగు సదాశివుడుండునని తెలిసెను. శివుడు లేనిదే ఏ వస్తువైననూ ఎప్పుడైనమా లేదు.(96) ఇట్లు సంపూర్ణమైన నిర్వికార జ్ఞానమును, దుర్లభమగు దానిని పొంది ఆ రాజు శివునికిష్టుడాయెను.(97) శివరాత్రి ఉపవాసముండుటచే శివసాయుజ్యరూపముక్తిని పొందెను. ఉపవాసముచేతనే అతను-శివుని నుండి విచిత్ర వీర్య జన్మను పొందెనని చెప్పితిని.(98) సతీదేవి వియోగముచే, జటాజూట విస్తారముచే శివుని తలనుండి జన్మించిన వీరభద్రుడను యక్షయజ్ఞవినాశకుడు (99) ఇతరులు కూడా శివరాత్రీవ్రతముచే తరించిరి. విప్రులారా! పూర్వము భరతాది మానవులు కూడా సిద్ధిని పొందిరి.(100) మాంధాత, దుంధుమారి, హరిశ్చంద్రుడు మొదలైన రాజులు ఈ వ్రతముచేతనే సిద్ధిని పొందిరి.(101) అటు తరువాత, పరమశివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వత శిఖరము పై ద్యూతక్రీడనాడసాగెను.(102)

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు శివరాత్రిమాహాత్మ్యవర్ణనమను ముప్పది మూడవ అధ్యాయము.