స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
15వ అధ్యాయము
ఋషులు పలికిరిః గురువులేకనే దేవేంద్రుడు రాజ్యమునొందునని చెప్పితివి. గురువు నవమానించుటచేత అతనికి రాజ్యభ్రంశము కలిగినది (1) ఎవరిచేత ప్రేరితుడైన ఇంద్రుడు ఆసనమున ఎక్కువ కాలముండెను? మాకు మిక్కిలి కుతూహలమున్నందున దానిని గూర్చి త్వరగా చెప్పుము. (2) అనగా రోమశుడు పలికెను - ‘గురువు లేకనే ఇంద్రుడు రాజ్యము చేసెను. అతను విశ్వరూపుడు చెప్పిన విధిని అనుసరించి రాజ్యమున నుండెను (3) ఓ విప్రులారా! ఈ విశ్వరూపుడను గొప్పరాజు విశ్వకర్మకుపుత్రుడు. ఇంద్రునికి పురోహితుడు, యాజకుడుకూడా అయినాడు.(4)
ఒకమారు విశ్వరూపుడు గురువునందనాదరమును గలిగియుండగా ఇంద్రుడు సూచించిననూ అతడట్లే లక్ష్యపెట్టక యుండగా ఇంద్రుడతను చేయగోరినదానిని తెలుసుకొనెను.(7) దైత్యుల పని నెరవేరుటకై అవకాశమునిచ్చుచున్న ఈ పురోహితుడు మాకు, ఇతరులకు కూడా ఫలమును కలిగించువాడు.(8) అని తలచిన దేవేంద్రుడు వజ్రాయుధముతో ఆతని తలలను నరికివేసెను. క్షణములోనే వధ జరిగెను.(9) సోమపానము చేసిన ముఖము నుండి చాతక పక్షులు, సురాపానముచేసిన ముఖమునుండి పిచ్చుకలు పుట్టెను.(10) వేరొక ముఖమునుండి తిత్తిరి పక్షులు పుట్టెను. ఇట్లు మందభాగ్యుడైన ఇంద్రుని చేత విశ్వరూపుడు మరణించేమ.(11) అపుడు ఆపశక్యం గానిది, భయము గొలుపునది యగు బ్రహ్మ హత్య ఉద్భవించెను. ఆది ఆపశక్యం గానిది, చెడు ముఖము. గలది, దోషము కలది, చణాల (స్త్రీ) రజస్సుతో కూడినది (12) బ్రహ్మహత్య, సురను త్రాగుట, దొంగతనము, గురువు భార్యతో చూడుట అను పాపము చేసిన వారందరికీ విష్ణువుయొక్క నామస్మరణము, విష్ణువును గూర్చిన చింతన- ఇదే నిష్కృతి.(13)
అపుడా బ్రహ్మహత్య మూడు తలలు, ధూమ్రవర్ణపు చేయి గలిగి ఇంద్రుని మింగుటకు వచ్చినది.(14) అపుడు మిక్కిలి భయముతో ఇంద్రుడు పారిపోవుచుండగా, భయముగొలుపుచూ అది వెంటపడినది. (15) ఎటు పరిగిడిన ఆటు ఆ బ్రహ్మహత్య పరుగిడును. కూర్చున్నపుడు తానూ కూర్చొనును - శరీరముచే నేర్పడిన నీడవలే ఇంద్రుని చుట్టుముట్టుటకు వచ్చుచుండగా ఇంద్రుడు ఒక్కమారుగా నీటిలో మునిగెను.(16) శీఘ్రముగా జలచరము వలె వీట మునిగెను.(17) ఓ విప్రులారా! ఇట్లు ఇంద్రుడు దివ్యమగు సంవత్సరముల నూటివి గడిపెను. ఇట్లు దుఃఖములో రెండుమార్ల దివ్య సంవత్సరములను ఇంద్రుడు గడుపగా స్వర్గమున భయంకరమగు అరాజకము పుట్టెను.(18) అపుడు చింతతో దేవతలు మరియు తపస్వులగు ఋషులు వుండిరి. ఓ బ్రాహ్మణులారా! మూడులోకాలు ఆపదపాలై వుండెను.(19)
ఏ రాష్ట్రమున ఒకడైననూ బ్రహ్మహత్య చేసినవాడుండునో అక్కడ సాధుపురుషులకు అకాలమరణము కలుగును.(20) ఏ రాష్ట్రమున రాజు పాపము చేసి నివసించునో అక్కడ దుర్భిక్షము, మరణము మరియు ఉపద్రవములని బ్రాహ్మణులారా మీరు తెలుసుకొనుడు.(21) పెక్కు అనర్థములు ప్రజల నాశనానికై కలుగును కనుక రాజు శ్రద్ధతో ధర్మమును పాటించవలెను.(22) అట్లే ప్రజలు రాజుయొక్క శుచిత్వముపై ఆధారపడియుందురు. ఇంద్రుడు పాపము చేసెను. ఓ బ్రాహ్మణులారా! ఆ పాపము చేత జగత్తు నానావిధ మహాతాపములతో ఉపద్రవము గలదాయెను.(23)
శౌనకుడనెను- ‘అశ్వమేథ యాగములు నూరు చేయుటచేత గొప్ప రాజ్యము లభించినది. ఓ సూతా! దేవతలకు, ఇంద్రునికి విఘ్నమెందుకు వాటిల్లినదో ఉన్నదున్నట్లుగా చెప్పుము.’(24) సూతుడనెను- ‘దేవతలకు, దానవులకు విశేషంగా మనుష్యులకు వారి కర్మయే సుఖదుఃఖాలకు కారణము. సంశయము లేదు.(25) ఇంద్రుడు జుగుప్పును కలిగించు పనిని చేసాడు- గురువును అవమానించాడు. విశ్వరూపుని వధించాడు.(26) గురువగు గౌతముని భార్యతో రమించాడు. దానికి ఫలితాన్ని చాలాకాలానికి మహేంద్రుడు ఈ విధంగా పొందాడు. దీనికి ప్రతిక్రియ లేదు.(27) చెడుపనులు చేసినవారు నిష్కృతిని చేయనట్లయితే తప్పనిసరిగా దేవేంద్రుని వలెనే చెడుదశను పొందుతారు.(28)
ఓ విప్రులారా! చెడుపని ద్వారా సంక్రమించిన దానికి ప్రాయశ్చిత్తమును అన్ని పాపాల శాంతికై వెంటనే చేయవలెను.(29) ఉపపాతకముల శ్రేణిలో నున్నది మహాపాతకమవచ్చును.(30) ఏ జనులు ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము తమ ధర్మమును అనుష్ఠింతురో వారి పాపము నశించును.(31) వారు ఉత్తమ లోకమును పొందెదరు. ఇందు ఆలోచించవలసినది లేదు. కనుక, దురాచారుడైన ఇంద్రుడు తన కర్మయొక్క ఫలాన్ని పొందాడు,(32) అనగా అపుడు ఆందరూ దానిని చక్కగా గ్రహించి, బృహస్పతి వద్దకు వెళ్ళి తమ మనసులో నిలిచనదగు ఇంద్రుని వృత్తాంతమును నింపాదిగా తెలియజేసిరి.(33) ఓ విప్రులారా! దేవతల మాట వినిన బృహస్పతి దేవలోకమున తలెత్తిన అరాజకమును గూర్చి ఆలోచించెను.(34) ఇపుడు ఏమి చేయవలెను? దేవతలకు, లోకములకు, మహాత్ములగు ఋషులకు మేలెట్లు కలుగును?(35)
గొప్ప కీర్తి గల బృహస్పతి ఏది చేయవలెనో మనసులోనే ఆలోచించుకొని, దేవతలతో కలిసి త్వరగా ఇంద్రుడున్న చోటికి వెళ్ళేను.(36) ఇంద్రుడున్న నీటి మడుగు వద్దకు వెళ్ళగా, దాని ఒడ్డున బ్రహ్మహత్య ఛండాల స్త్రీ వలె భయము గొల్పుచూ నుండెను.(37) దేవతలు, ఋషిగణములు అక్కడ కూర్చొనిరి. బృహస్పతి స్వయముగా ఇంద్రుని పిలిచెను.(38) పైకి వచ్చిన ఇంద్రుడపుడు తన గురువును చూచి కళ్ళనిండా నీటితో (39) ప్రణామముచేసి దీనమగు ముఖము గలిగి, మనసులో ఆలోచిస్తూ బృహస్పతిని, అక్కడి వారిని ఉద్దేశిస్తూ పలికేను.(40)
ఇంతకుముందు నేను స్వయముగా ఆజ్ఞానమే లక్షణముగా గల గొప్ప పాపమునాచరించితిని. ఓ గురుదేవా! నేనిపుడు ఏమి చేయవలెనో తెలుపుడు.(41) అపుడు, ఉదారబుద్ధి గల బృహస్పతి నవ్వుతూ అనెను. ‘ఇంతకు ముందు నీవు చేసిన దాని ఫలితమే ఇది. నా పట్ల నీవాచరించిన దాని అనుభవమే ఈ నాశనము. ఇక, హత్యకు ప్రాయశ్చిత్తమును స్మృతికారులు పేర్కొనలేదు.(43) అజ్ఞానము వల్ల పాపము చేసినచో ప్రాయశ్చిత్తముండును. అని ధర్మశాస్త్రములు తెలిసినవారందురు. తెలిసి కోరికతో చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు.(44) కోరికతో చేసిన పాపం కోరిక లేనిదిగా కాదు. కేవలం విషయ భేదముచే వాని వాని ప్రాయశ్చిత్తము విధింపబడుతుంది.(45) కోరికతో పాపమొనరించిన, మరణమే విధింపబడాలి.(మరణము వరకు విధి) అజ్ఞానము వల్ల పాపము నాచరించిన దాని ప్రాయశ్చిత్తము విధింపబడుచున్నది.(46)
కనుక నీ వల్ల స్వయముగా పురోహితుడు, విద్వాంసుడగు బ్రాహ్మణుడు చనిపోవుట చేత దానికి ప్రతిక్రియ లేదు.(47) మరణము వచ్చువరకు నీట మునిగి స్థిరముగా నుండుము.(48) ఓ చెడుబుద్ధి గలవాడా! ఏ క్షణాన నీవు బ్రాహ్మణుని చంపితివో అదే క్షణాన మారు అశ్వమేధముల ఫలము నశించినది.(49) చిల్లులతో కూడిన కుండలో చుక్క కూడా నీరు వుండునట్లు పాపము వుండగా కొంచెమైననూ పుణ్యము వుండజాలదు.(50) కనుక, దేవతల సంయోగముచేత స్వర్గము మొదలైనవి ఎవరు పొందారో ధర్మిష్ణులగు వారికది అట్లే వుండనిమ్ము.(51)
అతనట్లనగా విని ఇంద్రుడనెను- చెడుపని చేసిన నేను ఈ ఫలమును పొందితిని, సంశయము లేదు. (52) బృహస్పతి! దేవర్షులతో కలిపి త్వరగా అమరావతికి వెళ్ళి, లోకముల మరియు దేవతల కార్యసిద్ధికై ఎవడు నీకు నచ్చుతో అతనిని ఇంద్రుని చేయుము.(53) గొప్ప బ్రహ్మహత్యతో కూడుకున్న నేను మరణించిన వానితో సమానము. రాగ, ద్వేషముల వల్ల కలిగిన పాపము నమ్న కమ్ముకున్నది .(54) కనక, త్వరగా మీరంతా దేవరాజును ఏర్పరచుకొనండి. మీకు నేను అనుమతి నిస్తున్నాము. ఇది నిజము,(55) ఆట్లనగా బృహస్పతి మొదలైన ఋషులు అందరూ త్వరగా అమరావతికి వచ్చి వున్నదున్నట్లుగా శచీదేవికి చెప్పిరి (56) రాజ్యముకొఱకు ఏమిచేయవలెనని పరస్పరము చర్చించుకొనిరి.(57) ఇట్లు వారు చర్చించు కొనుచుండగా, గొప్పకాంతిగల దేవర్షి నారదుడు అనుకోకుండా అక్కడికి వచ్చెమ.(58)
దేవతలు తనను పూజించిన తరువాత వారెందుకు విమనస్కులై యున్నారని అడగగా వారు ఇంద్రుడు చేసిన దానిని వారదునికి చెప్పిరి.(59) ఈ మిక్కుటమైన పాపము వలన ఇంద్రుని ఇంద్రత్వము పోయినది. అటుపై దేవర్షి నారదుడు దేవతలతో ఇట్లనెను.(60) ‘మీరంతా అంతా తెలిసినవారు. గొప్పతపస్సు చేత సర్వజ్ఞులు. కనుక సోమవంశమున పుట్టిన నహుషుని ఇంద్రునిగా చేయవలెను (61) ఓ దేవతలారా! అతనిని ఈ రాష్ట్రమున త్వరగా నిలుపుడు. యజ్ఞము చేసిన నహుషుడు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములను చేసిన గొప్పవాడు.’ (62) నారదుని నోటినుండి వెడలిన వాక్యమును శచీదేవి విని అంతఃపురమునకు కన్నీళ్ళలో వెళ్ళిపోయినది. (63) నారదుని మాటలను దేవతలంతా ఆమోదించిరి.(64)
వారంతా రాజ్యమున నిలుపుటకై నహుషుని అమరావతికి కొనివచ్చిరి. (65) దేవతలు, మహారులందరిచేత మహీంద్రుని - రాజ్యము నహుషునికీ, ఇవ్వబడిన, అపుడు అగస్త్యుడు మొదలైన వారంతా నహుషుని సేవించిరి (66) గంధర్వులు, అప్పరసలు, యక్షులు, విద్యాధరులు, మహాసర్పములు, సుపర్ణులు, పక్షులు అట్లే ఇతర స్వర్గనివాసులు నహుషుని సేవించిరి (67) అపుడు అమరావతియందు ఎడతెగకుండా గొప్ప ఉత్సవము జరిగినది. అందు శంఖములు, తూర్యములు, మృదంగములు, దుందుభులు సమముగా వినదించినవి.(68) గాయకులు గానము చేసిరి. వాద్యగాళ్ళు వాద్యములు గించిరి. వర్తకులు వర్తించిరి. (69) అపుడు నహుషుడు బృహస్పతి మొదలైన వారిచేత అభిషేకింపబడెను.(70) దేవహూక్తముల చేత అర్చింపబడెమ- గృహాపూజవమును యథావిధిగా గొప్పవారు, పండితులు అగు మహార్షులతో చేసేమ.(71)
అట్లు ఇంద్రునితో సమానమగు రూపము గల వాడగు నహుషుడు దేవతలరాబై అందరిచేత బాగుగా పూజింపబడినవాడై, సుగంధదీపములతో, చక్కని వస్త్రములతో, అలంకారాలతో, కూడుకున్నవాడై, మునీంద్రులచేత, వరేంద్రులచేత, స్తుతింపబడుచు ఇంద్రుని ఆసవమున మిగుల ప్రకాశించెను.(72,73) ఇట్లు గొప్పకళగలవాడు, సురముని గణాలచేత పూజించబడుచున్నవాడగు నహుషుడు అపుడు హృదయమున మన్మథభావముచేత పీడింపబడెను.(74)
‘ఎందుకు శచీదేవి ఈనాడే నా వద్దకు రావడంలేదు? తొందరగా ఆమెను పిలవండి. ఆలస్యం చేయరాదు’(75) అని వహుషుడనగా విని బుద్ధిమంతుడగు బృహస్పతి శచీదేవి భవనానికి వెళ్ళి సవిస్తరంగా చెప్పమ.(76) ‘శకుడు చేసిన చెడుపనుల కారణంగా నహుషుని ఇక్కడకు తెచ్చితిమి - రాజ్యముకొరకు తెచ్చిన ఆతని ఆర్థాసవముమ వీపుపొందుము.’(77) అనగా శచి నప్పి స్వచ్చమైన వాడగు బృహస్పతితో ననేమ - శక్రువి ఆసనమున కూర్చున్న ఇతమ యజములతో పరిపూర్ణుడుకాడు • కేవలం తొంభైతొమ్మిది యజ్ఞములనితన జేసివాడు. (78) ‘కమక వాస్తవానికి నమ్న పొందుటకు యోగ్యుడుకాదు. ఒకవేళ పరస్త్రీనైన నమ్న పొందగోరిన, మోయకూడని వారిచేత మోయబడు వాహనములో ఇక్కడకు వచ్చి నన్ను పొందుగాక’(79) అనగా బృహస్పతి అట్లేనని వెంటనే, కామముతో తపించుచున్న నహుషుని వద్దకు వెళ్ళి శచీదేవి చెప్పిన దానిని ఉన్నదున్నట్లుగా తెలియజేసెను. (80)
అపుడు కామము చేత మోహము నొందిన నహుషుడు అలాగేనని తలచి, ఏది మేలైన అవాహ్యము (మోయకూడనిది) అని బాగుగా ఆలోచించెను.(81) చాలా సేపు ఆలోచించి, తపస్సుగల బ్రాహ్మణులే ఆవాహ్యులనుకొని వారు తనను మోయునట్లుగా చేయుదుననుకొనెను.(82) శచీదేవిని పొందుటకు ఇద్దరు బ్రాహ్మణులచే పల్లకినీ మోయించవలెనని మనసులో వున్నది. అని వారిద్దరికీ కామమోహితుడైన నహుషుడు పల్లకినిచ్చెను (83) చక్కగా పల్లకిలో కూర్చొని, వారిద్దరినీ ‘కదులు’ మని ప్రేరేపించెను (84) అపుడు పల్లకిని మోయుచున్న అగస్త్యుడు కోపము నొంది రాజును శపించెను. ‘బ్రాహ్మణులను అవమానించే నీవు ఉన్మత్తుడవు - పొమువు (కొండచిలువ) గమ్ము’ (85) అన్న శాపము చేత రాజు కొండచిలువయై నేలబడెను - విప్రుని శాపమును దాట శక్యము కాదు కదా! (86)
ఏవిధంగా నహుషుడు పతితుడైనాదో అట్లే ఇతరజనులుకూడా విప్రుల నవమానించుటచేత అశుచియగు నరకమున బడెదరు.(87) కనుక, ఇహ పరలాభమునకై నరులు కష్టపడి పొందిన స్థానమును అప్రమత్తులై విచక్షణతో చూచుకొనవలెను .(88) ఆ విధంగా నహుషుడు గొప్ప అరణ్యమున సర్పమాయెను - అలాగే దేవలోకమునఅరాజకము నేర్పడెను.(89) దేవతలంతా విస్మయము నొంది అనిరి. ఈ రాజు గొప్పకష్టమును పొందెను. (90) దురాత్ముడగు రాజు మర్త్యలోకమును గానీ, స్వర్గమును గానీ, పొందకపోయెను (91) ఓ మహామునీ! లోకమున వేరొక యాజ్ఞికుడెవరో చెప్పుము. అనిన గొప్పతేజస్సుగల ముని పుంగవుడగు నారదుడిట్లనెను. (92)
ఓ మహామభావులారా! మీరు త్వరగా వెళ్ళి యయాతిని కొనిరండు. అనగా అపుడు దేవదూతలు త్వరగా యయాతిని గొని వచ్చిరి. (93) మహాత్ముడగు యయాతి విమానమెక్కి దేవలోకమునకు దేవదూతలతో కలిసి వెళ్ళను- దేవతలలో శ్రేష్టులు మరియు యక్షులు, గంధర్వులు, సిద్ధులు, ఉరగములు ముందు నడిచిరి.(94) దేవతలచే స్తుతింపబడుచూ యయాతి అమరావతికి వచ్చెను - ఇంద్రాసనముపై కూర్చుని త్వరగా మాట్లాడెను.(95) అపుడు నారదుడు ఇట్లనెను - నీవు రాజువు, యాజ్ఞికుడవు. ధర్మమునాచరించువారు దైవముచేత గొప్ప స్థితిని పొందిననూ శుభాశుభములను చూడలేక మూఢులై ఘోరమైన నరకమున పడెదరు. సంశయము లేదు. మంచివారిని అవమానించుట చేత నహుషుడు సర్పమాయెను - (96,97,98)
యయాతి పలికెను - ‘ఓ దేవర్షీ! అమితమైన పుణ్యము చేసిన వారికి కూడా అల్పత్వము చేత నిమ్నము కలుగును. - నీకు నాగూర్చి అంతా తెలుసు. (99) అన్నదానముతో కూడా మహాదానములివ్వబడినవి - గోదానములు, పెక్కు భూదానములిచ్చితివి. (100) అట్లే పండితులు పేర్కొనిన ఉత్తమ దానములన్నింటినీ ఆయా కాలమున విధి పూర్వకముగా ఆచరించితిని.(101) వాజపేయము, అతిరాత్రము, జ్యోతిష్ణోమము, రాజసూయము మున్నగు యజ్ఞముల వాచరించితిని. విధి పూర్వకముగా అశ్వమేధాది క్రతువుల నాచరించి భూమినంతా యజ్ఞస్తంభములతో (యూప) అలంకరించితిని.(102) అనేక రకాల యజ్ఞాలలో దేవదేవుడగు జగన్నాధుని అర్చించితిని. మాధవియను ఈ కన్యను గాలవునకు మునుపు ఇచ్చితిని.(103) ఓ మునీ! అపుడే గాలవుడగు విశ్వామిత్రుని కొరకు నలుగురికి కన్యలను భార్యలుగా ఇచ్చితిని (104) ఇట్లు పెక్కు మంచి పనులను ఆచరించితిని. వానిని జెప్పనలవిగాదు.(105)
అపుడు దేవతలంతా యయాతిని ‘మీరాచరించిన రహస్యమైన వాస్తవాన్నంతా ఉన్నదున్నట్లుగా తెలియగోరుచున్నాము, ఓ యయాతీ! మాకు వినవలెనని వున్నది’ (106) అని అడగగా యయాతి తన పుణ్యశేషమును వున్నదున్నట్లుగా చెప్పెను. (107) విపులీకరించి యయాతి తన పుణ్యము నంతా ఏదీ మిగల్చకుండా చెప్పెను - తన పుణ్యమును చెప్పుటచేత యయాతి భూమిపై బడెను.(108) ఆక్షణముననే, దేవతలంతా చూచుచుండగా ఆలస్యములేకుండా ఆరాజక మేర్పడెను.(109) ఓ బ్రాహ్మణశ్రేష్టులారా! వినండి . అక్కడ ఇంద్రాసనమున అభిషేకించుటకు ఒక్క యాజ్ఞికుడు కూడా కనబడలేదు (110) అపుడు, దేవతలు, ఋషులు, గొప్ప సర్పములు, గంధర్వులు, యక్షులు, పక్షులు, చారణులు, కింనరులు, విద్యాధరులు, సురగణములు, అప్పరో గణములు, మానవులుకూడా చింతలో మునిగిరి. (111)
శ్రీస్కాంద మహాపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండములో దేవేంద్రుని స్వారాజ్యాభిషేకవృత్తాన్తమున దేవేంద్రుని బ్రహ్మహత్యా పాతకము, నహుషునికి శాపము,యయాతి రాజు పుణ్యము క్షీణించుట అనువృత్తాన్తములు పదిహేనవ అధ్యాయము సమాప్తము.
