స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

9వ అధ్యాయము

 లోమశ ఉవాచః

లోమశుడు చెప్పినః ఒకమారు దేవరాభైవ ఇంద్రుడు లోకపాలురతో, దేవతలతో, ఋషులతో, అప్పరపల గణములతో, గంధర్వులతో కూడి సభామధ్యమున ఉండెను. గంధర్వులు ముందండి, అప్సరసలు వీచుచుండ, సిద్ధులు, విద్యాధరులు విజయమును గానము చేయుచుండగా (ఉండెమ) అపుడు దేవతల. రాజుకి గురువు విజ్ఞుడు, ఉదారమగు బుద్ధిగల మహామభావుడైన బృహస్పతి శిష్యులతో అక్కడికి వచ్చెను (3) అతనిని చూచి దేవతలంతా ఒక్కమారుగా అతనిని చేరి ప్రణామము పిరి. అపుడు ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చిన బృహస్పతివి చూచెమ్య కాని, చెడుబుద్దిగలగి, గౌరవపూర్వకంగా ఏమీ పలుకలేదు. ఆహ్వనము లేదు, ఆపనము లేదు, విసర్జవమూ లేదు. రాజ్యము యొక్క మదములో ఇంద్రుడు చెడుబుద్ధిగలది ప్రమాదము నాచరించుచున్నట్లు గా తెలిపి బృహప్పతి కోపముతో వెనుదిరిగిన (ఆంతర్షితుడాయెను).

ఆ దేవగురువట్లు వెళ్ళిపోగా దేవతలు, యక్షులు, నాగులు, గంధర్వులు, ఋషులు కూడా కలతపడిన మనసుగలవారైరి. గంధర్వుల ఆ ప్రదర్శనము ముగియగానే ఇంద్రుడు స్పృహలోకి వచ్చి త్వరగా నడిగెను. ఆ గొప్పతపస్సుగల (దేవగురువు) ఎక్కడకు వెళ్ళెను? అపుడు నారదుడు ఇంద్రునితో అనెను. నిస్సంశయముగా నీవుగురువునవమానించితివి. గురువుయొక్క అవమానముచేత వీరాజ్యముపోయినది. బల అను రాక్షసుని చంపిన ఇంద్రా! కనుక నీవే అన్ని విధాలుగా (బృహస్పతిని) మన్నించునట్లు జేయవలె మహాత్ముడైన నారదుని మాటలను విని ఇంద్రుడు ఒక్కమారుగా ఆసనమునుండి లేచి, వారందరితో కలిసి ఆలస్యములేకుండా త్వరగా గురువు యొక్క ఇంటికేతెంచెను.

ముందు నమస్కరించి తారను ప్రశ్నించేను. ఆ గొప్ప తపస్సుగల (దేవగురువు) ఎక్కడ? అనగా ఇంద్రుని చూచి తార. 'నాకు తెలియదని' చెప్పెను అపుడు ఇంద్రుడు చింతతో తన ఇంటికి వచ్చెను- ఈ మధ్యలో స్వర్గములో అరిష్టములు, అద్భుతములు జరిగినవి  ఇంద్రుడికి, అందరికీ దుఃఖమును కలిగించుచూ జరిగినవి. పాతాళమున నున్న బలి ఇంద్రుడు చేసిన దానినెఱిగెను. దైత్యులతో గూడి పాతాళమునుండి అమరావతికి వెళ్ళగా, దేవతలకు, దానవులతో గొప్ప యుద్ధమపుడు జరిగెను.

దేవతలు ఓడింపబడిరి. మూడుడైన ఇంద్రుని రాజ్యమును తక్షణమే దైత్యులు పొందిరి సర్వప్రయత్నముచే పాతాళమునకు తీసుకొని వెళ్ళిరి. శుక్రుని అనుగ్రహముచేత వారందరూ విజయము నొందిరి. ఇంద్రుడు కూడా వైభవమును కోల్పోయి దేవతల చేత వీడవబడిన వాడాయెను- దేవి (శచీదేవి) అంతర్షితురాలాయెనుగొప్పఏనుగైన ఐరావతము, ఉచ్చైశ్రవమను అశ్వము ఇలాంటి పెక్కు ఇతర రత్నములను దైత్యులు చెడుప్రవృత్తి గలిగి లోభమువలన ఒక్కమారుగా తీసుకొనివెళ్ళిరి. పుణ్యములైన అవన్నీ సముద్రములో పడిపోగా, విస్మయమునొంది బలి గురువుతో ననేను

దేవతలను జయించి మేము తెచ్చిన పెక్కు రత్నములు సముద్రములో పడిపోయినవి. ఇది అద్భుతము బలియొక్క మాటలను విని శుక్రాచార్యుడు బదులు పలికెను. 'దీక్షితుడికి అశ్వమేధములు నూటిచే (నూరుఅశ్వమేధములచే) దేవతల రాజ్యమేర్పడును. కాన అతనే భోక్త (అనుభవించువాడు) అశ్వమేధము దక్క స్వర్గమును పొందుటకు ఏదీ సమర్థము కాజాలదు గురువుయొక్క మాటను తెలిసి బలి మౌనము వహించెను. దేవతలతో కలిసి ఉచితమైనది చేపెను. ఇంద్రుడు కూడా దీనుడై బ్రహ్మను చేరెను. రాజ్యము యొక్క భయము మొదలైనవానినంతా తెలియజేసెను. ఇంద్రుని మాటను విని బ్రహ్మ ఇట్లు పలికెను.

మనమంతా (నీతో సహా) దేవతలందరితో కలిసి సర్వేశ్వరులకీశ్వరుడైన విష్ణువుయొక్క ఆరాధన కొఱకు వెళ్ళెదము. అట్లే అని ఇంద్రుడు మొదలైన లోకపాలకులంతా బ్రహ్మను ముందుంచుకొని పాలకడలి తీరమును చేరి, కూర్చుని విష్ణువును స్తుతించుటకు మొదలిడిరి.

 బ్రహ్మోవాచః

బ్రహ్మ పలికెనుః దేవదేవా! జగన్నాథా! సురులచే, అసురలచే నమస్కరింపబడినవాడా! పుణ్యచరిత్రగలవాడా! వ్యయము లేనివాడా! అంతము లేనివాడా! పరమాత్మా నీకు నమస్కారము (29) నీవు యజ్ఞము, యజ్ఞరూపము, యజ్ఞాంగముకూడా. ఓ లక్ష్మీనాథా! కనుక కృపచేత దేవతలకు వరమునిచ్చువాడవు కమ్ము (30) గురువు నవమానించినందున ఇంద్రుడీనాడు రాజ్యమును కోల్పోయినాడు. కనుక దేవర్షులతో సహ ఇతనిని నీవు ఉద్ధరింపుము.

శ్రీ భగవానువాచః

 

ఆవర్త శ్రీవారకసి గోరువునుమానికి ఊతానందుననుటలో అద్భుతమేమున్నది? ఎవరు పాపులో, అధర్మమాచరించువారో, కేవలం విషయముల గ్రహించువారో, తల్లిదండ్రుల నిందించువారో, వారు నిస్సందేహముగా దైవమునకు దూరమగుదురు. ఓ బ్రయోఫైటరథఓడివిడిటిక్వి జులభభినండేంద్రుని పని వలన అందరికీ కష్టమొచ్చినది. ఇరుషంగిడి రీజనలగడచ్చిపుర్తుడన్ని పనులు సిద్ధించడానికి భూతమైత్రిని అవలంబించును. ఓ ఇంద్రా! ఆ జరణముచేత నేను చెప్పినట్లుఃరిజరత్రచడి ఈ టైల్యులర్యటకులియటపిండిఇప్పుడు చేయదగిన పని. ఇట్లు

గవంతుడాదేశింపగా పరమ పెద్దిడురిడ@ kడుసూతతపరకు వదిలి వెళ్లాడసహా అమరావతికి వెళ్ళేను.

ఇంద్రుడు వచ్చినట్లు విన్న ఇంద్రసేనుడు (బలి) కోపగించి సైన్యముతో సహా ఇంద్రుని వధించుటకు సిద్ధమాయెను. అపుడు. వారదుడు రకరకాల మాటలతో బలివి, దైత్యులను ఇంద్రుని వధమండి మరలింపచేసెను. నారదుని మాటలవలన బలికోపమును వదలి వుండగా, ఇంద్రుడు సైన్యములో పచ్చను.లోకపాలురతో కూడివున్న ఇంద్రుని చూచి త్వరగా బలి వవ్వతూ ఇట్లనెను. ఓ ఇంద్రా! పుతలమునుండి ఇక్కడికి రావడమెలాజరిగినది. చెప్పుమ విన వివి, విస్మయమునొంది అవీలో విట్లను.

            మేము కశ్యపుని పపిండులము(దాయాదులము). మీరంతా కూడా అట్లే, మేమెట్లో మీరునూ అట్లే యుద్ధము అర్థములేనిది.దైవ వశంచేత క్షణంలో పా రాజ్యం వీదైనది. అలాగే అనేకంగా వున్న ఈ రత్నాలు కూడా ప్రయత్నముచేత వినైనవి. కనుక బుద్ధిమంతుడైన పురుషుడు విమర్శించవలెను. దానిచే జ్ఞానము, జ్ఞానముచే మోక్షము కలుగుమ. కానీ, నేను ఆ చెప్పిన జ్ఞానము చేతనే శరణము కోరి దేవతలతో కలిపి వీ వద్దకు వచ్చితిని.

వాక్యజనము గల వారిలో శ్రేష్టుడగు (బలి) ఇంద్రునీ మాటలను విని నవ్వి జ్ఞానవంతుడై ఇట్లనెను. దేవేంద్రా! వివేకారణముచేత ఏతెంచివదీ నేవేజుగమ? ఇంద్రుడా మాటనవి, కళ్ళనిండా నీరు నిండగా ఏమియూ పలుకకుండేమ. అపుడు నారదుడిట్లు పలికెను. 'ఓ బలీ! చేయదగినది, చేయదగనిది నీవేజుగవా? శరణుజొచ్చిన వారిని రక్షించుటయన్నది గొప్పవారి ధర్మము. శరణుజొచ్చిన బ్రాహ్మణుని, రోగిని, వృద్ధుని ఎవరు రక్షించరో వారు బ్రహ్మహత్య చేసినట్లే. ఇంద్రుడు శరణుజొచ్చితివమచూ నీ దగ్గరకు వచ్చేమ. విప్పంశయముగా నీచే రక్షింపబడవలెను ఇట్లు నారదుడు పలుకగా దైత్యుల రాజు స్వయముగా (విమర్శించు కొనేమ) .

చేయదగినది, చేయదగనిది బాగుగా విమర్శించి బహుమానపూర్వకముగా లోకపాలురతో, దేవగణాలతో కూడిన ఇంద్రుని పూజించెను.విశ్వాసముకై ఇంద్రుడు అనేక సత్యగుణప్రధానమగు వ్రతములను బలికి విశ్వాసము కలిగించు (విశ్వాస భూతములైన) వాని నాచరించెను. స్వార్థమే పరమని తలిచే ఇంద్రుడు ఇట్లాచరించి, అర్థశాస్త్రపరుడుగాన బలితో కలిపి వసించెను. ఇట్లు నివసిస్తున్న ఇంద్రుడు పెక్కు సంవత్సరాలు గడి పెను. విష్ణువు యొక్క మాటను గుర్తు తెచ్చుకొని మరల మరల విచారించి ఇట్లు వర్తించెను.(55) ఒకనాడు సభా మధ్యలో ఆసీనుడై వున్న దేవరాజైన ఇంద్రుడు బలినుద్దేశించి నవ్వుతూ ఇట్లనెను.

ఓ బలీ! సముద్రములో పడిన మా ఏనుగులు మొదలైన పెక్కు రత్నాలు నీవు పొందవలెను. సముద్రములో పడిన ఆ రత్నాలు పైకి తీయడంలో మనమంతా త్వరగా ప్రయత్నించవలెను. వానిని తీయవలెనను కార్యము సిద్ధించుటకు త్వరగా సముద్రమథనము చేయవలెను. ఇట్లు దేవతల బాధించు బలి ఇంద్రునిచే ప్రేరితుడై 'ఎవరీ మథనముచేతురని ఆడిగెను. అపుడు ఆకాశమునుండి మేఘగంభీరమైన ధ్వని గల వాక్కు దేవతలను, దైత్యులను ఉద్దేశించి 'మీరు క్షీర సముద్రమును మధించుడు' అనినది. 'నిస్సంశయముగా మీ బలము కూడా పెరుగును.'

మందరపర్వతమును కవ్వముగా, వాసుకి సర్పమును త్రాడుగా చేసుకొనుడు. తరువాత దేవతలు దైత్యులు కలిసి చిలుకుడు.ఆకాశము నుండి వచ్చిన ఆ వాక్కుని విని దేవతలపుడు దైత్యులతో కలిసి సన్నద్దులై ప్రయత్నము మొదలిడిరి. సురాసురులపుడు పాతాళమునుండి బయల్వెడలి ఉత్తమము, అసమానమూ ఐనదగు మందరపర్వతమును చేరిరి. కోటి సంఖ్యలో దైత్యులు, ఆదే సంఖ్యలో దేవతలు ఉద్యుక్తులై ఒక్కమారుగా బంగారు వన్నెలీను మందరమును చేరిరి. (ఆ మందరము) రత్నములు గలది, వర్తులాకారము గలది, స్థూలమై గొప్ప కాంతి గలది. అనేక రత్నముల గలది, పెక్కు వృక్షములచేత సేవింపబడినది. చందనములు, పారిజాతములు, నాగవున్నాగ చంపకాది వృక్షములు గలది, అనేక మృగముల చేత కూడినది, సింహములు, శార్దూలములచే సేవింపబడినది (ఆయివుండెను). ఇట్టి ఆ పర్వతమును చూచి దేవతాశ్రేష్ఠులు, అసురశ్రేష్టులు చేతులు జోడించి ఇట్లనిరి.

దేవతలు పలికిరి - ఓ పర్వతమా! దేవతలము మేమంతా విజ్ఞాపన చేయుటకు ఇక్కడకు వచ్చితిమి. ఇతరులకుపకారము చేయ ఓ గొప్ప శైలమా! అది వినుము.'(70) దేవతలు, దైత్యులట్లు చెప్పగా మందరము విగ్రహరూపములో బయటకు వచ్చి ఇట్లు పలికెను. 'మీరంతా నా వద్దకేల వచ్చితిరి చెప్పండి' (అన్న) బలి అపుడు ప్రస్తావనగా చెప్పెను. ఇంద్రుడు కూడా త్వరగా సత్యమును చెప్పెను.  ఓ మందర పర్వతమా మాతో సహా ఒక పనిలో నీవూ వుండుము. అమృతమును పొందుటలో నీవు కవ్వము' గమ్ము. ఓ మంచి చరితము గలవాడా! అనిన అలాగేనని దేవతల పనిలో (మందరపర్వతము) దేవతలను, దైత్యులను ముఖ్యంగా ఇంద్రుడిని ఉద్దేశించి ఇట్లనెను.

నూరు కణుపులు గల వజ్రముచేత నీవు రెక్కలను కత్తిరించితివి. నేనెట్లు మీ పని సిద్ధించుటకై వెళ్ళగలను?ఆపుడు దేవతలు, దైత్యులు అందరూఆగొప్ప పర్వతమును స్తుతిస్తూ అసమానము, అద్భుతమూ అయిన పర్వతమును పెకిలించబోయిరి. అపుడు ఆ పర్వతమును క్షీరసాగరము వద్దకు తెచ్చుటకు వారు అశక్తులైరి. ఆ పర్వతమొక్క మారుగా దేవదానవులపై పడెను. (దానిచే)కొందరు (అవయవములు) విరిగినవారు, కొందరు ప్రాణములు కోల్పోయినవారు, కొందరు మూర్చనొందినవారు ఆయిరి. కొందరు ఆక్రోశమును పొందగా, కొందరు క్లేశమునొందిరి. ఇట్లు సురులు, అసురులు తమ ప్రయత్నము విఫలము కాగా, గొప్ప చైతన్యాన్ని పొంది జగదీశ్వరుని స్తుతించిరి.

'శరణుజొచ్చిన వారిని కాపాడు మహావిష్ణూ! రక్షించుము. చరాచర రూపములోని ఈ జగత్తు నీచేత విస్తరింపబడివున్నది.' అపుడు దేవతల పనిమీద విష్ణువు ప్రాదుర్భవించెను. గరుడునిపై కూర్చున్న విష్ణువు వారందరినీ చూచి ఒక్కమారుగా లీలగా ఆ ఉత్తమపర్వతరాజును తక్షణమే పైకి లేపినిలిపెను. అపుడు గరుత్మంతుని పై నుండి విష్ణువు అందరికీ ఆభయము నిచ్చెను. తరువాత దేవతలను లేపి క్షీరసాగరము యొక్క ఉత్తరతటము (ఆవతల ఒడ్డుకు) తీసుకెళ్ళి ఆ పర్వతమును నీటిలో పడవైచి వెళ్ళిపోయెను అపుడు దేవతాగణములంతా అసురులతో కలిసి వాసుకిని కూడా తీసుకొని (పూర్వము చేసినదే) ఆచరించిరి.

మందరను కవ్వముగా, వాసుకిని త్రాడుగా చేసి దేవదానవులు అందరూ క్షీరసాగరాన్ని మథించిరి. ఆలా మథించుచుండగా పర్వతము రసాతలము చేరేమ- తళణమే విష్ణువు తాబేలుగా పర్వతమును ఆద్బుతముగా పైకిలేపెను. ఆ పర్వతము దేవదానవులు తిప్పగా, గురువులేని జ్ఞానమువలె నిరాధారముగా తిరుగుచుండెను. ఆపుడు పరమాత్మయగు విష్ణవే మందరపర్వతానికాధారమై తన నాలుగు భుజములతో దానిని పట్టుకొనెను. క్షీరసాగరము సుఖముగా మథింపబడెమ అపుడు దేవదానవులంతా కలిసి మిక్కిలి బలముతో క్షీరసాగరమును మథించిరి.

            మహాత్ముడైన కూర్మము యొక్క వీపు, కంఠము, మోకాలు మధ్య, అట్లే వజ్రసారమయము, దృఢము అగు పర్వతము యొక్క అవయవముల రాపిడిచేత బడబాగ్ని జనించినది (ఎగిసినది)  హలాహలము కూడా కలుగగా చూచిన దేవర్షినారదుడు మిక్కిలి కాంతి గలవాడై దేవతలతో ఇట్లనెను. ఇప్పుడు మీరంతా సముద్రమును మథించరాదు. దేవతలారా మీరంతా శివుని ప్రార్థించుడు- (దక్షుని యజ్ఞము, వీరభద్రుడొనరించినది మీరు మరిచితిరి)  కనుక, శివుని వెంటనే స్మరించండి. అతను అందరికంటేఆవలనున్నవాడు, పరమానందరూపుడు, యోగులచేత ధ్యావింపబడయోగ్యుడు, వ్యక్తముకానివాడు, రూపములేనివాడు.

తమ ప్రయోజనమును సాధించుకొనువారగు దేవతలు త్వరగా మధించుట మొదలిడిరి - (95) కోరిక గలవారు, జడులు అయినందున వినరు - వారికి పెక్కు ఉపదేశములనిచ్చి మార్గము చూపరాదు రాగ ద్వేషముల నెలవు, శివునికి పరాంగ్ముఖులగు వారంతా కేవల ప్రయత్నము గలిగి క్షీరసాగరమును మథించిరి. అతిగా మథించుటచేత క్షీరసాగరమునుండి హలాహలము పుట్టింది. అది ముల్లోకములను దహింప సమర్థమైనది. దేవతల హింసింప ప్రాప్తించినది. అటుపై ఆన్నిదిక్కులను, ఆకాశలతలముమ, అన్ని భూతములను మింగివేయుటకు కాలకూటము బయల్వెడలినది. శక్తిచే చాలా పెద్దనైనది తమ చేతిలో నుండుట జూచి, దేవతలు అసురులతో సహ వాసుకిని, మందరమును అక్కడే వదిలి అపుడు పారిపోసాగిరి. అట్లే భృగువు మొదలైన వందలకొద్ది ఋషులు (పారిపోయిరి) దక్షునీయజ్ఞము ఎట్లా జరిగెనో అట్లే జరిగెను.

 భృగుమహర్షి చేత ప్రేరితులైన వారంతా సత్యలోకమును చేరిరి. 'వివిధ వేదవాక్యములచేత కాలకూటము ప్రశమించును. దేవతలారా! ఇందు సందేహము లేదు. నిజముగా సత్యమును పలుకుచున్నాను.'అని భృగువుపలుకగా విని కాలకూట విషముచేత బాధింపబడి సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను శరణుజొచ్చిరి  అపుడు, మిక్కుటముగా జ్వలించు చున్నది, పైకెగయు జ్వాలలు గల కాలకూటమును చూచిన బ్రహ్మ దేవతలను జూచి కర్మతెలియనివారగు సురాసురులను శపింపబోగా నారదుడతనిని ఆ పెను . బ్రహ్మ పలికేను దేవతలారా! చేయగూడని పని ఏమి జరిగినది? దేనివలన ఈ క్షోభ తలెత్తినది? ఈశ్వరునికిదెట్లు కలిగినది? నా పలుకులు వేరుగా కావు.' అనెను. అపుడు దేవతలతో, వేదములు, ఉపనిషత్తులతో, ఆగమములతో కలిసి బ్రహ్మ కాలకూటభయముచే వెళ్ళిపోయెను తరువాత, చింతతో దేవతలు పరస్పరమిట్లనిరి. 'అవిద్య (అజ్ఞానము) కోరికలతో కూడుకున్న మనము ఎవరిని శంకరుని జేయవలెను?'

అపుడు దేవతలు బ్రహ్మను ముందుచుకొని త్వరగా కాలకూటభయముచేత పీడింపబడి వైకుణమును జేరిరి. అపుడు బ్రహ్మమొదలగు దేవతలు, ఋషిగణములు, సురాసురగణములన్ని విష్ణువుని, పురాణపురుషుని, ప్రభవించువానిని, ఈశ్వరుని, వైకుణముననుండగా అధోక్షజువి, లక్ష్మీవల్లభుని శరణుజొచ్చిరి. ఆంతలో, గొప్పకాలకూటము పెల్లుబికి బ్రహ్మయొక్క లోకమును దహించి, వైకుణ్ణమును కూడా దహించివేపేమ.(109) అందరి హృదయములయందుండు విష్ణువు అపుడు పొర్షదులతో కూడినవాడై కొలకూటముచే దహింపబడి తమాలమువంటి ఛాయను పొందెను. అన్నిలోకములతో కూడిన వైకుణ్ణము మిక్కిలి వీలముగానాయెను. జలకల్మషమైన కాలకూటముచే అన్ని లోకములు కప్పబడినవాయెను. ఆ కల్మషము, కాలకూటము ఎనిమిది ఆవరణలతో కూడిన బ్రహ్మాండమును బ్రహ్మతో సహా దహించి బూడిద చేసెను (అపుడు, భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, అహంకారము, బుద్ధి, మూలఆవిద్య, ఏవియూ లేకుండెను  శివుని కోపమువలన జగత్తంతా అపుడు భస్మమాయమ.

శ్రీ స్కాందపురాణమున మాహేశ్వర ఖండములోని కేదార ఖండమందు తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.