స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
16వ అధ్యాయము
లోమశుడు చెప్పెమ - తరువాత శచీదేవి ధర్మార్థములతో కూడిన పలుకులను వారికి చెప్పెను. బృహస్పతి మొదలగు దేవతలారా! చింత చేయవలదు. (1) దేవతలలో శ్రేష్టుడగు ఇంద్రుడు బ్రహ్మహత్యతో కప్పబడి వున్నచోటికి మీరంతా బుద్ధిమంతులై వెళ్ళండి. (2) అల్ప బుద్ధిగల విశ్వరూపుడు పెక్కుకారణముల చేత మహేంద్రునిచే చంపబడినాడు. అందరూ అతనిని నిరాకరించితిరి. (3) కావున, మీరందరూ మహేంద్రుడున్న చోటికి వెళ్ళండి. ఓ బృహస్వతీ! పూర్వం ఇంద్రుడు నిన్ను అవమానించెను.(4) ఆ అవమానముతో క్షోభను పొంది నీవు ఇంద్రుని శపించితివి. అదే విధంగా నేను నిన్ను శపించుచున్నాను.(5) మాచే వదలివేయబడినవాడివై అవసానపరుడవు గమ్ము (6)
ఇంద్రుడు జీవించియుండగా వా కొరకు వారిద్దరివీ తెచ్చినట్లే,నీవు జీవించివుండగా నీ పనివి వేరొకడు చేయగలడు.(7). నీ స్థానమున గొప్ప పేరుగల పుత్రుని ఎవడో ఒక అదృష్టవంతుడు కనగలడు.(8) త్వరగా దేవతలతో కలిసి వెళ్ళి ఇంద్రుని తీసుకొని రమ్ము. త్వరగా వెళ్ళవితోమరల నీకు శాపమిచ్చెదను,(9) శచీదేవి మాటలను విని బృహస్పతి త్వరగా దేవతలతో సహా బ్రహ్మహత్యచేత పీడింపబడిన ఇంద్రుడున్న చోటికి వెళ్ళాము. (10) పర్పును సమీపించి వారందరూ ఇంద్రునికి అభివాదము చేసిరి. నీటిలో వున్న ఇంద్రుడు వారినపుడు చూచెను. (11) దేవేంద్రుడు వారిని చూచి మీరిక్కడికెందుకు వచ్చితిరి? నేమ పాపమును పొంది బ్రహ్మహత్యతో కూడుకొని ఒంటరిగా తపస్సు చేయుచూ వీట వుండినని (12) అనగా, విహ్వలులైన దేవతలు ఇంద్రునితో ఇట్లనిరి – ‘నీవిట్లు మాట్లాడకూడదు. ఇతరులకు ఉపకారము చేయుటకై నీవు విశ్వరూపుని వధించుట మున్నగువానిని చేపితివి. (14).విశ్వకర్మయొక్క పుత్రుడు చేసిన యజము వలన దేవతలు, గొప్పకాంతిగల ఋషులు క్షయము నొందుదురు. (15) కనుక అతనిని వధించుట ఇతరులకుపకరించును అవి నీవు వధించితివి. అందుచేత విన్న అమరావతికి తీసుకొనివెళ్ళుటకు మేము వచ్చితిమి.’(16)
ఈ విధంగా దేవతలు తర్కించుకొనుచుండగా బ్రహ్మహత్య త్వరగా నేను దేవేంద్రుని వరించెద ననేమ-(17) అపుడు బృహస్పతి వెంటనే ఇట్లనెను. (18) –‘నీవుండడానికిపుడు నివాసాన్ని కల్పించెదము.’ అపుడు బ్రహ్మహత్య కార్యము యొక్క గొప్పదనము వలన దేవతల చేత అమవయింపబడెమ.(19) దేవతలు, యక్షులు, పిశాచులు పర్పములు. పిద్దులు, చారణులు బుద్దిమంతులైన ఋషులు కలిపి బ్రహ్మహత్యమ నాలుగు భాగాలుగా విభజించిరి - మొదట దేవతలంతా భూమినుద్దేశించి ఇట్లనిరి – ‘ఓ పృథివీ! మా పని సిద్ధించుటకు ఈ హత్యయొక్క ఒక అంశమ వీవు గ్రహించవలెను’.(21) దేవతలమాటలను వివి ధరిత్ర కంపించుచూ (వణకుచూ) అనెను. ‘నేను హత్యయొక్క అంశనెట్లు గ్రహించగలనో ఆలోచించండి. (22) నేను అన్ని ప్రాణులను ధరించుదానిని. విశ్వాన్నంతా ధరించుచున్నాము. ఈ పాపము కమ్ముకొనిన నేను అపవిత్రురాలను అయ్యెదను’ (23) అని భూమి అనగా విని బృహస్పతి ఇట్లనెను.
ఓ సుందరీ! భయపడవలదు. పాపము లేనిదానివే వేరే విధంగా కాదు. (24) వాసుదేవుడు యదుకులమున జన్మించినపుడతను నీపై పాదముంచుట చేత వీవు పాపము లేవిదానివి కాగలవు (25) నీవు మా మాటలను పాటించుము. ఆలోచించపనిలేదు (26) అట్లు వారు పలుకగా ధరిత్రి పాపము లేనిదై ఆట్లేచేసెను. అపుడు దేవతలంతా వృక్షములను పిలిచి ఇట్లనిరి. (27) ‘మీరు పని సిద్దించుటకై హత్యయొక్క అంశమున తీసుకొనవలేమ’ అనగా వచ్చిన చెట్లన్నీ దేవతలతో ఇట్లనినవి(28) మేమంతా తాపసులకు ఫలములనిచ్చువారము. అపుడు తాపసులుకూడా హత్యతో కూడుకొవీన వారయ్యేదరు. (29) పాపము పొందినవారవుదురు. కావున మీరాలోచించండి’ - అపుడా వృక్షములలో బృహస్పతి ఇట్లనెను (30)
‘మీరంతా చింతించపనిలేదు. ఇంద్రుని ప్రసాదమువలన మీరంతా ఛేదింపబడి అనేకాంశలను పొందితిరి. (31) మీరు అందరూ నిత్యమూ విటపములు గాగలరు.’ అని అవగా వృక్షములన్నీ హత్యయొక్క ఆంశను విభజించి తీసుకొనినవి (32) అటు తరువాత దేవతందరూ వీటిని పిలిచి అడిగిరి. పని సిద్ధించడానికి ఈ హత్య యొక్క ఆంశను తీసుకొండి అని.(33) అపుడు నీళ్ళన్నీ కలిసి అన్నవి. ఏయే పాపములు, చెడుపమలు వున్నాయో (34) వావిని అన్ని ప్రాణులూ స్నానము,శాచము మొదలైన వానిచేత మా పంపర్కము వలననే దూరము చేసుకొనుము.(35) వాని మాటలు విని బృహస్పతి ఇట్లనెను - ఈ గొప్పదైన దాటశక్యము గాని పాపమును చూచి భయపడవలదు(36) చరము, అచరములగుప్రాణులనన్నింటినీ నీరు పవిత్రము చేయుగాక! అపుడు బృహస్పతి - స్త్రీలను పిలిచి ఇట్లనెను(37)
అందరి పని సిద్ధించుటకై ఈనాడే హత్యయొక్క అంశను తీసికొనవలెను. అనగా విని స్త్రీలంతా ఆనిరి - (38) ‘స్త్రీ పాపమాచరించుమ. ఆ పాపము చేత అనేక పక్షములు తాకబడినవి. వేరే విధంగా కాదని కదా వేదవాక్యము.(39) ఓ బృహస్పతి! ఇది నీవు వినవిదా! ఆలోచించవలెమ. ‘అని స్త్రీలంటూ వుండగానే బృహస్పతి అనెను (40) ‘ఓ అందమైన కన్నులు గల స్త్రీ జనులారా! మీరీ పాపము నుండి భయపడవద్దు. రాబోవు కాలమున ఈ హత్యయొక్క ఆంశము అందరికీ వారి వారి కోరికనమసరించి ఫలమునిచ్చునదే కాగలదు - (41) ఇట్లు దేవతలు ఆ హత్యను నాలుగు అంశములుగా విభజించిరి. ఓ బ్రాహ్మణులారా! అపుడా బ్రహ్మహత్య ఆయావానియందు నివసించెను.(42) అపుడు పాపము లేని వాడైన మహేంద్రుడు సురగణములతో, దేవర్షులతో కలిసి దేవపురియగు అమరావతి యందు అబిషేకింపబడెను.(43)
అపుడు ఇంద్రుడు శచీదేవితో, దేవతలతో గొప్పవారగు మునీశ్వరులతో, సిద్ధగణములతో కలిసి యుండెను.(44) అపుడు అగ్నులు, వాయువులు హృద్యముగా మండినవి. గ్రహములన్నీ కాంతివంతములై శాంతితో యుండినవి. ఒక్కమారుగా భూమి ప్రకాశవంతమైనది - పర్వతములన్నీ మణికాంతులుగలవైనవి అభిమానవంతుల మనస్పులు ప్రసన్నములైనవి.(46) నదులన్నీ నీటిని గలిగివున్నవి - వృక్షములు ఎప్పటికీ ఫలముల నిచ్చునవిగా అయినవి. ఓపదులు అమృతము వలెనుంటూ పండించకనే పండునవిగా యుండినవి.(47) ఇంద్రుని లోకమున నివసించువారందరికీ ఒక్కమారుగా గొప్పతనందమును గలిగించు ఉత్సవము ఏర్పడినది.(48)
ఇంతలో, త్వష్ట ఇంద్రమహోత్సవమును చూసి, పుత్రశోకముతో పీడింపబడుచూ మిక్కిలి కోపమును పొందెను.(49) దావీచే దారుణమైన తపస్సును చేయుటకు వెళ్లాను. ఆతపస్సుచేత లోకపితామహుడగు బ్రహ్మ సంతోషించి (50) పరమునుకోరుకొమ్మని త్వష్టను అడిగెను. అప్పుడు త్వష్ట లోకములకు భయమును కలిగించు వరమును గోరెను. దేవతలకు భయము కలిగించు పుత్రునివ్వుము. (51) (అనగా) పరమేష్ఠియగు బ్రహ్మ వరము నిచ్చెను. వరము నిచ్చుటచే వెంటనే ఒక పురుషుడేర్పడెను.(52) వృత్రుడను పేరుగలిగి ఆ పురుషుడు పరమాద్భుతముగా ప్రతిదినము నూరువిల్లుల పరిమాణముతో పెరుగసాగెను.(53) పూర్వము అమృతమథన సమయమున పాతాళమునుండి బయల్వెడలి సురసంఘముల చేత ప్రాణములవిడిచిన దైత్యులను భృగువు త్వరగా బ్రతికించెను.(54)
ఆ ఒక్క వృత్రునిచే మహీతలమంతా వ్యాపించగా (55) తపస్వులగు ఋషులంతా హింసింపబడుచున్నవారై త్వరగా బ్రహ్మను చేరుకొని వచ్చి పడిన కష్టమును గూర్చి చెప్పిరి.(56) అట్లు ఇంద్రుడు మొదలగు దేవతలు గంధర్వులు, మరుద్గణములతో కలిసి చెప్పగా బ్రహ్మ త్వష్ట చేయదలిచిన దానిని వారికి చెప్పెను. (57) మిమ్ములను వధించుటకు గోప్పతపస్సుచేసి త్వష్ట ఈ గొప్ప తేజస్సుగల వృత్రుడగు దైత్యాధిపతిని జనింపజేసెను.(58) అయిననూ, మీరు ఇతనిని వధించు యత్నమును చేయండి. అని బ్రహ్మ అనగా విని ఇంద్రుడు మొదలగు దేవతలిట్లనిరి.(59)
దేవతలనిరి - ‘ఇంద్రుడు బ్రహ్మ హత్యనుండి విముక్తుడయి, స్వర్గంలో తిరిగి స్థాపింపబడినప్పుడు మేము చేయగూడని దానిని చేసాము. (60) ఆలోచన లేకుండా మేము మా అనేక శాస్త్రాలను, అస్త్రాలను దధీచి ఆశ్రమమున వుంచాము. ఓ బ్రహ్మదేవా! మేము ఏమి చేయగలము.(61) అది విని బ్రహ్మ నవ్వుతూదేవతలతో ఇట్లనెమ దేవతలారా! అవిచాలా కాలంగా వున్నవి. తెలుసుకొని రండి(62) అనగా దేవతలపుడు వెళ్ళి చూడగా తమ తమ ఆయుధాలు కనపడకుండిమ - వారు దధీచి వడుగగా ఆతమ తనకు తెలియదనెమ - (63) వారంతా బ్రహ్మ వద్దకు మరలి వచ్చి దధీచిమువి మాటలమ చెప్పిరి.(64)
అపుడు దేవతలనుద్దేశించి, అందరి కార్యసిద్ధికై ఆతని ఎముకలవే యాచించండి. తప్పక ఇవ్వగలడు అని బ్రహ్మ అవేమ (65) ఆది వివి శకుడనెను (66) ఓ దేవా! దేవతల పని నెరవేరుటకై విశ్వరూపుని వధించితివి. అపుడు దేవతలందరిచే నేనొక్కడినే పాపిష్టుడిగా చేయబడితివి. (67) అట్లే, బృహస్పతి చేత ఒక్కక్షణమువవే వైభవము కోల్పోయినవాడిగా చేయబడితివి- అదృష్టవశముచే, మరల నా మందిరాన్ని చేరితివి (68) దధీచిని వధించి అతని పెక్కుఎముకలతో చేయబడిన ఆప్తాలు అశుభములుకదా! (69) త్వష్ట జనింపజేసిన ఈ దైత్యరాజగు వృత్రుని ఎట్లు పాపభీరువగు నేమ వధింపగలను? అని ఇంద్రుడనగా వివి బ్రహ్మ ఇట్లనెను.(70)
బ్రహ్మ అర్థశాస్త్రపరమైన విధితో ఇంద్రునికి ఇట్లు తెలియజేసెను. ‘ఆకతాయి అగువాడు, హింసించుకోరికలో వచ్చుచున్న ఎడల, అతను తపస్వియగు బ్రాహ్మణుడైననూ వధించవలెను. దీనివలన బ్రహ్మహత్య కలగదు.(71) ఇంద్రుడనెను - బ్రహ్మదేవా! దధీచి వధనుండి భయమునొందితిని. బ్రాహ్మణవధనుండి గొప్పపాపము తప్పక పుట్టును.(72) కమక, బ్రాహ్మణులను హేళన చేయుట తగదు. దీనినుండే పెక్కు దోషములు పుట్టును.(73) కనుక, ఇదంతా తెలిసి వ్యక్తి దోషములు లేనిది, ధర్మ బద్ధమైనది అగు దానిని మాత్రమే గొప్ప విధితో చేయవలెను. ఆలోచించవలెను.(74) విస్పృహతో కూడిన మాటలను విని బ్రహ్మ ఇంద్రునితో అనెను – ‘ఇంద్రా! నీ బుద్దితోనే ప్రవర్తించుము. త్వరగా దధీచి వద్దకు వెళ్ళుము. (75) మహత్తరకార్యము కనుక వెళ్ళి దధీచిని అతని ఎముకలను యాచించుము’ అనగా ఇంద్రుడు తన గురువు, ఇతర దేవతలతో కూడి దధీచి వద్దకు బయలుదేరేను (76)
అట్లే అని దేవతలందరూ పవిత్రమగు దధీచి ఆదమునకు వెళ్ళిరి. ఆ ఆయుమున అనేక మృగములు వైరభావాన్ని (శత్రుభావాన్ని) విడిచి వుండినవి (77) పిల్లులు, ఎలుకలు పింహాలు, ఆడ ఏమగులు సంతోషముగా ఒక దానితో ఒకటి ఆడుకొమచున్నవి. (78) అట్లే వివిధ జాతులకు చెందిన మృగములు ఆటలో మునిగినవి. ముంగిపలతో, పాములు కలిపి ఆడుచున్నవి.(79) ఇట్టి అనేకరకాల ఆశ్చర్యములను ఆ ఆదుములో చూచి దేవతలంతా మిక్కిలి విస్మయాన్ని పొందిరి.(80) అటుపిమ్మట, వారు ఆసనమున కూర్చుని యున్న మువీర్రేష్ఠుడగు దధీచిని చూచిరి. అతనపుడు తన తేజస్సుచే సూర్యుని వలె ప్రకాశించుచుండెమ.(81) సువర్చతో కూడిన రెండవ విభావమవలె నుండెను - సావిత్రితో కూడివున్న బ్రహ్మవలె ఆ మును వుండేను.(82)
అతనికి నమస్కరించి దేవతలిట్లనిరి. ‘ముల్లోకములలో వివే దాతవు ఆవి వీ వద్దకు మేము వచ్చితిమి’(83)ఆనగా మువి అనెను. దేవతలారా! మీరు వచ్చిన పని ఏమిటో తెలియజేయుడు.(84) విస్సందేహముగా ఇచ్చెదమ. నా మాట వేరొకవిధముగా కాదు.’ అవగా స్వార్థమును కోరుచున్న దేవతలంతా దధీచితో అనిరి.(85) ఒ విప్రా! భయభీతులమైయున్న మేము నీ దర్శనమును కోరియున్నాము. నీవే రక్షకుడవవి వివి బ్రహ్మచేత ప్రేరితులమై వాము.(86) ఇక్కడికి వచ్చితిమి. అదంతా తెలిపి మాకు దానము చేయుటకు వీవే యోగ్యుడవు’(87) వారి మాటలమ వివి ఏమివ్వవలెనో చెప్పవలెవని దధీచి అనెను.(88)
అటుపిమ్మట దేవతలు దధీచితో దైత్యులమ వధించుటకు కావలసిన ఆస్తముల కొరకు ఏ ఎముకలన ఇవ్వము’ అని ఆనిరి.(89) అది విని నవ్వి దధీచి, ఒక క్షణము ఆగుమని చెప్పి దేవతలారా! నేమ స్వయముగా వా శరీరమును వదిలెదననెను.(90) తరువాత సువర్చపయగు పత్నిని పిలిచి దధీచి ఇట్లు పలికిన. ఓ అందమైన నవ్వుకలదానా(91) దేవతలు మిక్కిలి యాచించగా వేమ వా శరీరమును వదిలి, పరమ సమాధిచేత బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నాను.(92) నేమ బ్రహ్మలోకమునకు వెళ్ళగా నీవు నీ ధర్మము చేత వెన్నక్కడ చేరగలవు. పందేహము లేదు. అనవసరముగా వీవు చింతింపవలదు.’(93) అని దధీచి తన భార్యను ఆశ్రమమునకు పంపి, దేవతల ఎదుటనే సమాధి స్థితిలోకి వెళ్ళెను.(94)
పరమ సమాధితో తన శరీరాన్ని వదిలి దధీచి తిరిగిరాని లోకమగు బ్రహ్మలోకమున వెంటనే చేరెను. (95) అట్లు మువిబృందములలో శ్రేష్టుడు, శివప్రియుడు, శివదీక్షతో కూడిన వాడు అగు దధీచి ముని పరోపకారము కొరకు తన శరీరాన్ని వెంటనే వదిలివేసెను.(96)
శ్రీ స్కాందపురాణములోని మాహేశ్వర ఖండములోని కేదారఖండములో ‘దేవతలు అస్థికలను కోరగా దధీచి యోగముతో తన శరీరాన్ని వదులుట’ అని పదహారవ అధ్యాయము సమాప్తము.
