స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

27వ అధ్యాయము

లోమశుడు చెప్పను - అట్లే విష్ణువు, సహ్యాద్రి, వింధ్యాద్రి, మైనాకపర్వతము, గంధమాదనము, మాల్యవంతుడు, మలయపర్వతము, మహేంద్ర పర్వతము, మందరపర్వతము, మేరుపర్వతము అను పర్వతములనన్నింటినీ పూజించెను. (1,2) అట్లే పరమేష్ఠి కేతగిరి, నీలాద్రి, ఉదయాద్రి, అస్తాద్రి, మానసాద్రి, కైలాపాద్రి, లోకాలోకపర్వతములను పూజించెను. (3,4) ఈ విథముగా పర్వతశ్రేష్టములనన్నంటినీ, పర్వతవాసులందరినీ అతను పూజించెను. (5) ఉచితమైన దానివి, బ్రహ్మలో గూడి విష్ణువు ఆచరించెను. మరునాడు, వరయాత్రను చేసిరి. (6) అనేక సురగణములు మరియు ఇతరగణములు హిమవత్పర్వతములో, తక్కిన బంధువులతో కలిసి గంధమాదన పర్వతము వద్దకు బయలుదేరిరి. (7) ప్రమథ గణములు, చండీ గణములు మొదలగునవి హిమాలయువి వచ్చి చేరిరి. (8) శివుని వివాహమును గూర్చి విప్రులు శివునిచే చక్కగా గౌరవింపబడి, మిగుల ఆనందముతో వారిద్దరినీ చూచిరి. (9)

పార్వతితో శివుడు, శివునితో పార్వతి పుష్పము దాని సుగంధమువలె, వాక్కు దాని అర్థము వలెనుండిరి. (10) అట్లే ప్రకృతి, పురుషులవలె నుండిరి. వేరొక విధంగా కాదు. ఏనుగునెక్కిన ఆ దంపతులు గొప్ప తేజస్సుతో ప్రకాశించిరి. (11) బ్రహ్మ విమానమువెక్కి, విష్ణువు గరుడుని అధిరోహించి, ఇంద్రుడు ఐరావతము నెక్కి, కుబేరుడు పుష్పకమునెక్కి, (12) వరుణుడు మొసలినెక్కి, యముడు మహిషమునెక్కి, నైరృతుడు ప్రేతమునెక్కి, అగ్ని ఆజమునెక్కి,వాయువు జింకనెక్కి, ఈశానుడు వృషభమునెక్కి యుండిరి. ఇట్లు ఆయా లోకపాలురు గ్రహాలతో గూడి తమ తమ బలములతో కూడుకొనిన వారైయుండిరి. ఇట్లే ప్రమధాదీగణములు కూడావుండెను - హిమాచలము, ఋషభుడు, గంధమాదనము, సహ్యాద్రి, నీలాద్రి, మందరగిరి, మలయాద్రి, కైలాసము, మైనాకము (16) మరియు ఇతర కాంతివంతములైన పర్వతములు తమ తమ భార్యలతో, పుత్రులతో యుండిరి. (17) మేరువు మొదలగుపర్వతములు అందరూ బలము గలవారు. సుందరరూపవంతులై వరయాత్రా ప్రసంగమున శివుని అర్చించుటలో మునిగిరి. (18)

నంది వారినందరినీ ఆసీనులను చేయగా, హిమవంతుడు యథోక్తముగా వరయాత్రను చేసి, బంధువులందరితో మరలివచ్చెను. (19) తన నివాసమున హిమవంతుడు మిక్కిలి శోభాయుతుడాయెను - పరమశివుని పంపర్కముతో కలిగిన గొప్పదనముతో అతను ‘మహాశైలుడని’ ముల్లోకముల వాసికెక్కెను - (20) హిమవంతుని కన్యాదానముచే శివుడు సంతోషించెను. రెండక్షరాల పేరు వాలుక చివర ఎల్లప్పుడూ వుండువారు నిజముగా ధన్యులు, మహాత్ములు, కృతార్థులు - ‘శివ’ అనరెండక్షరాల పేరును హృదయమున పలుకువారు మనుష్యరూపమున మన్న రుద్రులమటలో సంశయములేదు. (21,22) ఏ కొంచెము దానమిచ్చివమా, పత్రము, వీరు ఇచ్చిననూ శివుడు ఎల్లప్పుడూ సంతోషించును. (23) పత్ర, పుష్ప ఫల, జలాదులతో సదాశివుడెల్లప్పుడూ తృప్తిజెందును గావున మహాభాగ్యమునిచ్చు శివుని అందరూ పూజించవలెను. (24) శివుడు ఒక గొప్ప ప్రకారము, జన్మలేనివాడు, ప్రభువు, పరోపరముల దాటియున్న మహాత్ముడు, అద్వితీయుడు, కూటస్థుడు, నిరీశుడు, నిరాబాధుడు, నిర్వికల్పుడు, ఆస్త్రకాముడు. (25) ఆతను నిరంజనుడు, నిత్యరూపుడు, నిరోధుడు, నిత్యానన్దుడు, నిత్యముక్తుడు కూడా. ఇట్టి విశ్వవేద్యుడు, భవుడగు శివుని దేవాదులు అర్చించిరి. స్తుతించిరి, ధ్యానించిరి, పూజించిరి. చింతించిరి. శివుడు ఎల్లప్పుడూ అన్నింటినీ ఇచ్చువాడు.(26)

అన్ని గుణములచే ప్రసిద్దుడగు ఉత్తముడైవ హిమవంతుని పరమశివుడు కూడా స్తుతించెను (27) అటుపిమ్మట ధర్మాత్ముడగు హిమవంతుడు తన నిలయమున, వివాహమునకు విచ్చేసిన పర్వతములందరికీ వీడ్కోలు చెప్పెను (28) వారందరూ వెళ్ళిపోగా గిరిరాజగు హిమవంతుడు పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులతో మహాదేవుని యనుగ్రహమున నుండెను (29) ఇక, పరమశివుడు గంధమాదన పర్వతముపై పార్వతితో యుండి, ఏకాంతమున రమించు కోరికను పొందెను. (30) సురతమను గొప్ప తపస్సు వంటి సమాగమమును వారట్లు కొనసాగించిరి - (31) వారిద్దరి వలన గొప్ప ఆశ్చర్యమును కలిగించువది, ప్రళయమువంటిదీయగు అనిష్టము కలిగినది -ఆ మహారతియందు ఇతర ఏ సుఖమునూ తెలియకుండిరి. (32) బ్రహ్మాది దేవతలందరూకార్యాకార్యవ్యవస్థితిని తెలియకుండిరి. రతివలన రేతస్సుకలిగి చరాచర జగత్తంతా నశించిపోయెను - (33) అపుడు బ్రహ్మ, విష్ణువు అగ్నిదేవుని స్మరించిరి. మనసులో స్మరించగనే అగ్ని త్వరగా ఎదుటనిలిచెను (34) బ్రహ్మ, విష్ణువు అతనిని పంపగా అగ్నిదేవుడు శివమందిరమును చేరెను. అచట ద్వారము వద్ద నిలిచియున్న గొప్పకాంతివంతుడగు నందిని చూచెను (35)

కాశ్మీర సమానకాంతిగల యగ్ని కురచగా మారి అనేక ఆశ్చర్యములతో కూడిన శివుని ఆంతఃపురమును ప్రవేశించెను - (36) ఆ ఆంతఃపురము అనేక రత్నములతో, ప్రాసాదములతో అలంకరింపబడియుండెను. దాని ప్రాంగణమును ప్రవేశించి అగ్ని ఇట్లనెను (36) పాత్రను చేతబూనిన (భిక్షుకుడైన) నాకు భిక్షనిమ్ము’ అనగా పార్వతి వినెను (38) విని భిక్షాదానమును స్వయముగా చేయబోగా, సురతక్రీడనుండి లేచిన శివుడు మిగులకోపించెను (39) వెంటనే త్రిశూలమునెత్తి భైరవుడిగా మారిను. అపుడు గిరిజ అగ్నిని వధించుట నుండి శివుని వారించి స్వయముగా ‘అగ్నయే జాతవేదసే’ యని భిక్షనిచ్చెను. (40) అంత, చేతిలో భిక్షాపాత్రతో అగ్ని వెంటనే ప్రత్యక్షమాయెను. అపుడు కోపించిన పార్వతి అతనిని ఇట్లు శపించెను.(41) ‘ఓ భిక్షుకా! నా శాపముచే నీవు సర్వభక్షకుడవు అవగలవు. ‘శివుని రేతస్సుచే నీవిపుడు వెంటనే పీడను పొందెదవు’ (42) అని పార్వతి శపించగా హవ్యమునువహించు అగ్ని శివుని రేతస్సును భక్షించెను - వెంటనే అతను బ్రహ్మాది దేవతలు నిలిచియున్న చోటికి వచ్చి (43) శివుని రేతస్సును భక్షించుటను గూర్చి అంతా వివరించగా ఇంద్రాది దేవగణములన్నీ గర్భముగలవాయెను - (44)

అగ్ని ద్వారా హవిస్సు అందరినీ చేరుటచే, అగ్ని ముఖమునుండి యుద్భవించిన రేతస్సుచే దేవతోత్తములందరూ గర్భమును పొంది చింతాక్రాంతులైరి. వారందరూ జగదీశ్వరుడైన విష్ణువును శరణుజొచ్చిరి. (45,46) దేవతలనిరి- శరణాగతవత్సలా! నీవు అందరు దేవతల రక్షకుడవు. లోకములకు ప్రభువు కూడా. కనుక రక్షణను కల్పించుము. (47) ఈ రేతస్సుచే పీడింపబడి మేమంతా మరణించదలిచితిమి. అసురులు బెదిరించగా మేము శంకరుని శరణు జొచ్ఛగా వివాహమాడెను. రుద్రునికి పుత్రుడు జన్మించినపుడు మేము స్వర్గమున భయము లేక సుఖముగా ఉండెదమని అనుకుంటిమి. (49) ఈ విధంగా మేముండగా మాకందరికీ ఈ రేతస్సుచేత భయముత్పన్నమైనది. విష్ణుదేవా! ఇక జీవించుట ఎట్లు? (50) పురుషులకు త్రివర్గము సుపరిష్కృతమైనదిగా చేయబడినది. దేవతలు లేనిచో అది విపరీత మేయగును- (51) కనుక అదే అందరు జీవుల బలమని తలచి మేము కార్యాకార్యవ్యవస్థను గూర్చి ఆలోచించుచుంటిమి. (52) అని దేవతలు తమ బాధను వ్యక్తపరచగా విని, దేవతలశత్రువులను నశింపజేయు విష్ణువు నవ్వుచూ ఇట్లనెను. (53)

‘కార్య గౌరవముచే మీరు మహాదేవుడైన మహేశుని స్తుతించండి’ (54) అనగా వారందరూ ఆట్లే అని తలచి విష్ణువుతో సహా శివుని స్తుతించిరి. (55) ఓం నమో భర్గాయ! దేవాయ! నీలకంఠాయ! మీరుషే! త్రినేత్రాయ! త్రివేదాయ! లోకత్రితధారిణే! (56) త్రిస్వరాయ! త్రిధామాయ! త్రిపదాయ! శూలినే!’ (57) అని స్తుతించి ఈ రేతస్సు నుండి రక్షించమని ప్రార్థించిరి. (58) బ్రహ్మస్తుతించిన వెంటనే వృషభధ్వజుడైన శివుడు దేవతల పని సిద్ధించుటకై ప్రత్యక్షమాయెను - (59) డేవతోత్తములందరూ ఆ జగదేకబంధువుని చూచి, ప్రత్యగ్రూపములు, శ్రుతి సమ్మతములైన వివిధవాక్కులచే స్తుతించుచూ పూజించిరి (60) వారందరూ అట్లు స్తుతిచేయగా పరమేశ్వరుడు ‘ఈ రేతస్సు నుండి భయపడరాదు. (61) దేవతలారా! మీరందరూ వెంటనే దానిని కక్కివేయండి’ అనగా వారట్లే తలిచి, శంకరుని రేతస్సును బయటకు కక్కివేసిరి. (62) మహాపర్వతాకారముమన్న ఆ రేతస్సు మేలిమిబంగారు కాంతితో పరమాద్భుతముగా నుండెను. (63)

ఇంద్రాది దేవతాగణములన్నీ సుఖము నొందగా అగ్ని మాత్రము సంతోషించలేదు (64) అగ్ని కూడా లోకమంగళుడైన శివుని తన కర్తవ్యమేమిటని ప్రార్థించెను. ‘నేను దేనిచే దేవతలకు హవ్యమును వహించు వాడినయ్యెదను ఆమార్గమును తెలుపుమని అగ్ని ప్రార్థించగా శివుడు దేవతలందరూ వినుచుండగా ‘ఆ రేతస్సును యోనియందు విడువుమని’ అగ్నితో చెప్పెను. అనగా అగ్ని నవ్వుచూ నీ తేజస్సు అతి మహత్తరమైనది . దీనిని ప్రాకృతులెట్లు ధరించగలరు? (68) అనగా మహేశ్వరుడు అగ్నితో మరల ‘ప్రతిమాసము తపించువారి దేహమున విడువుమని’ చెప్పెను. (69) జ మాటలను విని అగ్ని గొప్ప వర్చస్సుతో జ్వలిస్తూ బ్రాహ్మీముహూర్తమున ఆసీనుడాయెను. (70) ప్రొద్దుననే లేచిన ఋషిపత్నులు, సతులు యగు స్త్రీలు స్నానమాడి అగ్నిని చేరిరి. (71) బాగా జ్వలిస్తున్న అగ్నిని చూచి, చలితో బాధపడుచున్న ఆ స్త్రీలందరూ కాచుకుందామని వెళ్ళబోగా ఆరుంధతి వారినాపెను.(72)

అరుంధతి నివారించిననూ ఆస్త్రీలు స్వయముగా కాచుకొనిరి. అంత రేతస్సుయొక్క పరమాణువులు అక్కడనే వారి రోమకూపములమ ప్రవేశించెను. (73) అపుడు అగ్ని రేతస్సులేనివాడై విశ్రాంతినొందెమ. (74) అటు తరువాత ఆ ఋషిపత్నులు తమ తమ భవనములకు వెళ్ళగా, ఋషులు వారిని శపించిరి. అంత ఆ కృత్తికలు ఆకాశచారిణులయిరి. (75) అపుడే వారందరూ తమ వ్యభిచారమునకు దుఃఖించి శివుని రేతస్సును హిమవత్నపర్వతము వెనుక భాగమున విడిచిరి. (76) ఆ రేతస్సు ఒక్కమారుగా బంగారు వన్నెలో ప్రకాశించెను. గంగయందు విడవబడిన ఆ రేతస్సు వెదురుబొంగుల మధ్యనుండెను. (77) అక్కడ ఆరుముఖములు గల బాలుడున్నాడని తెలిపి దేవతలు సంతోషించిరి. కొని తెమ్మని గరుడు పలికెను. (78) శంభుని పుత్రుడైన ఇతని ప్రపాదముచే అంతా శాశ్వతమగును. గంగానది ఇసుకలో లభించిన ఈ మహాబలుడు కార్తికేయుడు (79) ఇక్కడున్న ఈ బాలుడు రాత్రింబవళ్ళు ఉపవసించెను. శాఖుడు, విశాఖుడు, అతిబలుడు ఈ షణ్ముఖుడు (80) ఎప్పుడైతే గంగానదిన శివపుత్రుడు షణ్ముఖుడై అవతరించాడో అపుడే మాతృభావనతో పార్వతి చన్నులమండి పాలుగారనారంభించెను.(81)

శివుని చూచి పార్వతి ప్రభూ నా స్తనములు స్రవించుచున్నవి. కారణమేమిటో తెలుసుకొనుము’ అనగా సర్వజ్ఞడైన శివుడు తెలియని వానివలె పలికెను (82) అపుడక్కడకు వచ్చిన వారదుడు షణ్ముఖుని జన్మను గూర్చి చెప్పిన. శివపార్వతులకు సుందరపుత్రుడు జన్మించెను. (83) అవి వారదుడనగా విప్రులు, ప్రమథులు ఆనందముతో మప్పొంగిన వారయెను. గంధర్వులు గావము చేయసాగిరి. (84) మహాత్ముడగు శంకరునికి పుత్రుడు జన్మించుటచే పర్వతుడు అనేక పలకాలలో, చిగురుటాకుల తోరణాలతో, అనేక విమానములతో ప్రకాశించేమ. (85) అపుడు దేవగణములు, ఋషులు, సిద్ధచారణులు, రక్షయక్షగంధర్వులు, అప్పరగణములు అన్నీ శంకరునితో లిపి గంగానది ఒడ్డున యున్న షణ్ముఖుని చూచుటకు వెళ్ళిరి. (86) అంతట, శివుడు పార్వతితో వృషభము వధిరోహించి, ఇంద్రాది దేవతలు వెంటరాగా బయలుదేరేమ. (88) అపుడు శoఖములను, భేరి పాద్యములను, తూర్ణములను అనేక పర్యాయములు మ్రోగించి - (89)

అపుడు వీరభద్రాదిగణములు అనేక వాద్యములను మోగించుచూ క్రీడను సలుపుచూ శివుని అమసరించిరి. వారు రంధ్రముగలవానిని, రంధ్రములేనివానివి మోగించుచుండిరి. (90) వారిలో కొందరు నాట్యము చేయుచుండగా, కొందరు గావము చేయుచుండిరి - కొందరు గుణకీర్తనము చేయుచూ స్తుతించుచుండిరి. (91) ఈ విధంగా సురసిద్ద యక్ష గంధర్వ, విద్యాధర, సర్పగణములన్నీ మిగుల ఆనందముతో షణ్ముఖుని చూచుటకై శివునితో కలిసి వెళ్ళిరి. (92) వారు శంకరుని వలెమన్న కార్తికేయుని చూచుచుండగా ఒక గొప్ప తేజస్సు కనబడెమ. ఆది ముల్లోకముల నిండియుండెమ. (93) చక్కని ముక్కు, ముఖము, తేజస్సు, నవ్వు గల ఆ బాలుని ఆ కాంతి కప్పియుండెన - చక్కని నవ్వుతో ప్రసన్నంగా వున్న ఆ బాలుని సర్వాంగసుందరునిగా జూచి వారు ఆశ్చర్యమునొందిరి. (95) అపుడు వారు సూర్యకాంతిగల బాలునికి నమస్కరించిరి.(96) వారు ఆ బాలునికి ఇరుప్రక్కల చేరి నిలిచిరి.బ్రహ్మ, విష్ణువులు కూడా దేవతలతో కూడి యుండిరి.(97)

ఋషులు, యక్షగంధర్వులు కుమారకుని చుట్టుముట్టి దండమువలె నేలపై బడి నమస్కరించిరి. మరికొందరు తలవని నమస్కరించిరి. (98) అవ్యయుడగు ప్వామియని దలిచిన మరికొందరు తలవంచి నమస్కరించిరి. ఆ మహోత్సవమున విని వాద్యములు మ్రోగినవి- ఇట్లు ఆ బాలుని ఆభ్యుదయమున ఋషులు శాంతిమంత్రములు పఠించిరి. (99) ఇంతలో శివుడు పార్వ అక్కడకి వచ్చి వృషభముపై మండి వెంటనే క్రిందకు దిగిమ. (100) జగదేకందువగు శివుడు పార్వతితో కలిసి వచ్చిన ఆనందముతో తమ పుత్రుని కమలారా జూచెను. సర్పాలంకారములు గల రవి రగణములు చుట్టు ఆతను సంతోషించమ. (101) సంభ్రమముతో పార్వతి కార్తికేయుని దగ్గరుని

తో తన పాలని (102) అపుడు దేవతలందరూ తమ తమ భార్యలతో సంతోషముగా నీరాజనం జయసు మిన్నంటిమ - ఋషులు బ్రహ్మసూపచే, గాయకులు గావముచే, వాద్యకారులు వాద్యములచే కూచుని వచ్చి (104) అపుడు కుమారుని ఒడిలో కూర్చోబెట్టి ప్రకాశించేమ. (105) అపుడు శివపార్వతులిద్దరూ ఒక్కమారుగా అందించిరి. దేవతోత్తములు బాలుని అభిషేకించిరి. (106)

అట్టి ఆ బాలుడు శంకరుని ఒడిలో ఆడుకొనుచుండిమ. శివుని కంఠమునందున్న వాసుకియను సర్పమును తన చేతులతో బాధించుచుండిమ (నొక్కుచుండెమ). (107) ముఖముమ మెలిదిప్పి చేతులమ ఒకటి, మూడు, పది ఎనిమిది అని విపరీత క్రమములో లెక్కించుచుండిమ. (108) అపుడు పరమశివుడది చూచి నవ్వుచూ పార్వతితో మాట్లాడెను. (109) మహేశ్వరుడు సంతోషమునొంది, ప్రేమతో, నగుమోములో పార్వతిని చూచి గద్గదస్వరముతో ఏదీ చెప్పజాలడాయన. (110)

ఇది శ్రీస్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమున కార్తికేయస్వామికుమారోత్పత్తివర్ణనమను ఇరవయ్యేడవ అధ్యాయము.