స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
14వ అధ్యాయము
అపుడు విష్ణువుతో అసురులకు గొప్ప యుద్ధము జరిగెను. రెక్కలు గల సింహములు, జోడుతొడిగిన సైనికులు (1) అసురులను వహిస్తూ గరుత్మంతుని చీల్చెను. అపుడు గరుడుడు వానిని చీల్చి ముక్కలు జేసెను. (2) అపుడు విష్ణువు దైత్యులను చక్రముతో ముక్కలుగా చేసెమ - అట్లు మరణించిన దైత్యులను చూచి ప్రతాపవంతుడగు కాలనేమి(3) రోషముతో త్రిశూలముతో విష్ణువుని పొడిచెను. అవాధులకాశ్రయమైన ముకుందుడు దానిని తన పైకి రాబోగా పట్టుకొనెను.(4) అపుడు ఎడమచేతితో లీలగా కాలనేమియమ దైత్యుని విష్ణువు కొట్టాను. అదే శూలముతో పొడవగా కాలనేమి మూర్ఛను పొంది ఒక్కమారుగా నేలకూలెను.(5)
పడిన కాలనేమి మళ్ళీలేచి, నెమ్మదిగా కళ్ళు విప్పి ఎదుట నిలిచినవాడు, అందరి హృదయాలలో నుండువాడగు విష్ణువును చూచి (6) పుహమ పొంది ఇట్లనెను - ‘యుద్ధమును నీకు విడువబొలను. లోకమునందు నాకు కోరిక లేదు (7) యుద్ధమున మరణించిన రైత్యులంతా అక్షయమైన లోకమును పొందెదరు గాక! బ్రహ్మయొక్క మాట వలన వెంటనే ఇంద్రునితో కూడి (8) వివిధ భోగముల నమభవిస్తూ దేవతలవలె చరించెదరు. ఇంద్రునితో గూడి మరల సంసారమున పడెదరు - (9) కనుక అశాశ్వతమైన ఈ రణమున మరణమున ఈ జన్మయందు కోరను. వేరొక జన్మయందు మాత్రము వైరభావము వలన పరమమైన కైవల్యముమ నీవివ్వలేము.(10)
అట్లే అని పరమపురుషుడైన వాడు, పరమార్థమునిచ్చు వాడగు విష్ణువు దైత్యుని పడగొట్టెమ. దేవతలకపుడు అభయమువిచ్చి. అమృతము నిచ్చెను. (11) శల్యము వంటి, కాలనేమి మరణించగా దేవతలు కబ్జకము లేనివారైరి. (12) కమలములవంటి నేత్రములు గల విష్ణువు వెంటనే మాయమవగా, ఇంద్రుడు పరమాద్భుతముగా దైత్యులతో యుద్ధము చేసెను. (13) పడిపోయిన, అసమర్థులైన, గాయపడిన, భయమునొందిన, విడివడిన శిరోజాలుగల వారికి యుద్ధక్రియనొనరించెను. (14) మహేంద్రుడు అర్థశాస్త్రపరుడు, దైత్యులకు యమునివంటివాడు, శచీదేవిభర్త, ఉదారబుద్ధిగలవాడు.(15) ఇట్లు అట్టి ఇంద్రుడు దైత్యులమ దుమమాడుచుండగా ఆపుటకు నారదుడపుడు వచ్చెను.(16)
రణభూమిన పడిపోయిన వారిని, భయము నొందిన అసురులనూ నివెట్లు హింసించుచుంటివి?(17) భయము నొందినవారిని, శరణుజొచ్చినవారిని, మదముచేత చంపువారు బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. గొప్ప పాపమును పొందుదురు.(18) కనుక, నీవు ఈ అసురులను మనసులో కూడా హింసించుటను తలబెట్టరాదు. అని నారదుడనిన ఇంద్రుడు (19) దేవసేనతో కలిసి వెంటనే స్వర్గమునకు వచ్చెను - అపుడు దేవతాగణములన్ని,యక్షులు, గంధర్వులు, కిన్నరులు మిత్రులతో పరస్పరము ఆనందము నొందిన వారైరి (20) అపుడు ఇంద్రుడు శచితో అమరావతి యందు అభిషేకింపబడెను (21) (అభిషిక్తుడాయెను)
శంకరుని అనుగ్రహము వలన ఇంద్రుడు దేవర్షి, బ్రహ్మ ప్రముఖులతో విజయము నొందెను.(22) అపుడు ఓ విప్రులారా! దేవలోకమున గొప్ప ఉత్సవము జరిగెను. శంఖములు, తప్పెటలు, మృదంగములు, మురజ అను వాద్యములు, ఆనకములు, భేరి, దుందుభి మొదలగునవి మ్రోగినవి. (23) గాయకులగు, గంధర్వులు, కిన్నరులు, అప్సరసగణములు నాట్యము చేసినవి. పొడినవి, అట్లే సిద్దులు, చారణులు, గుహ్యకులు స్తుతించిరి.(24) ఇట్లు ఇంద్రుడు విజయము నొందెను. దేవతల చేతిలో ప్రాణములనొదిలిన దైత్యులు భూతలముపై పడిరి.(25) బలిమొదలగు గొప్పవారు ప్రాణముల విడిచిరి. పూర్వము భార్గవుడు తపస్సుచేయుటకు మానస (సరోవరము) నకు ఉత్తరమునకు వెళ్ళెను. (26) శిష్యులతో వెళ్ళిన శుక్రునికి యుద్ధము గూర్చి తెలియలేదు- మిగిలిన దైత్యులు అతని వద్దకు వెళ్ళిరి.(27)
అసురులకు నాశనము కలిగించిన వృత్తాంతమంతా చెప్పబడగా విని శుక్రుడు కోపమునొందెను (28) శిష్యులతో గూడి ‘మృతజీవినీ’ అనువిద్య చేత, మరణించిన అసురులనందరినీ బ్రతికించెను (29) నిద్రనుండి లేచిన వారివలే అసురులందరూ అపుడు లేచిరి. బలి కూడా లేచి మిగులకాంతిగల శుక్రునితో నిట్లనెను. (30) ‘నాకిపుడు జీవితమువలనేమి ప్రయోజనము? పామరునివలె ఇంద్రుని చేతిలోదెబ్బతిని పడిపోతిని.’(31) బలి అట్లనగా విని శుక్రుడనెను - ‘యుద్ధమున ప్రాణమును వదులు అభిమానవంతులు, పండితులుఅగువారు, (32) శస్త్రము చేత దెబ్బతిని మరణించువారు నిస్సందేహముగా స్వర్గమును పొందెదరవి వేదవాక్యము’. (33) అని శుక్రుడు బలిని ఓదార్చి, దైత్యులకు సిద్దినికలిగించు వివిధ తపస్సుల నాచరించెను.(34) అట్లే, భృగువు చేత ప్రేరితులైన బలి మొదలైన దైత్యులు పాతాళమునకు వెళ్ళి సుఖముగా నివసించిరి. (35)
శ్రీస్కాందపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమున శుక్రునిచే దైత్యులు బ్రతికింపబడుటయను పధ్నాలుగవ అధ్యాయము సమాప్తము.
