స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

12వ అధ్యాయము

లోమశుడు చెప్పెనుః లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని నమస్కరించి సురాసురగణములు అమృతముకొరకు సముద్రమును మరల మథించిరి. మథింపబడిన సముద్రమునుండి గొప్పకీర్తిగల యువకుడు, మృత్యుంజయుడు, ధన్వంతరి యను పేరు గలవాడు బయటకు వచ్చెను. సురాసురులందరూ చూస్తుండగా సుందరమైన కలశములో అమృతము నింపి చేతులతో పట్టుకొని వచ్చెను. అపుడు రైత్యులు ఒక్కమారుగా వెళ్ళి ధన్వంతరి చేతిలో నున్న అమృతముతోనిండిన కలశమును బలంగా అపహరించబోయారు అలల మాలలచేత కప్పబడి ధన్వంతరి యుండగా, మెల్లగా వచ్చుచున్న అతనిని వృషపర్వుడుచూచెను.

ధన్వంతరి చేతిలోని కలశమును అతడు బలముగా అపహరించెను. వెంటనే అసురులంతా భీషణంగా గర్జించిరి దైత్యులు పాతాళమునకు వచ్చిరి. అపుడు భ్రమపడిన దేవతలు సన్నద్దులై దైత్యులతో యుద్ధము చేయగోరి వారి ననుసరించిరి. అపుడు దేవతలను జూచి బలి ఇట్లనెను దేవతలారా! మేము కేవలము అమృతముతో తృప్తిచెందిన వారము. (మీరు కేవలము అమృతముతో మమ్ము సంతోషపరిచితిరి) సురశ్రేష్టులైన మీరంతో వెంటనే మరలిపొండి. త్వరగా స్వర్గానికి వెళ్ళండి. మాతో వేమి ప్రయోజనం? పూర్వము మీరు స్వార్థ పూరితులై మాతో మైత్రిని చేసితిరి. ఇప్పుడది తెలిసింది. ఇక ఇందులో ఆలోచించవలసినది లేదు.

ఈవిధంగా దేవతలు బలిచేత బెదిరింపబడినవారై వచ్చిన బాటనే మహావిష్ణువు వద్దకు వెళ్ళిం. భంగపడిన మనోరథముతో తమ చేరిన దేవతలను విష్ణువు అనునయముతో కూడిన మాటలతో ఓదార్చిమ.  ఈవిషయములో మీరు భయపడకండి. నేను అమృతాన్ని తీసుకొనివచ్చెదను అని పలికి అనాథలకు ఆశ్రయమిచ్చు విష్ణువు ఆక్కడే దేవతలనందరినీ వుంచి మోహము కలిగించు రూపము దాల్చి దైత్యుల ఎదుట నిలిచెను. అప్పటికే దైత్యులు సంరంభాన్ని చేయుచూ పరస్పరము అనుకొనుటచే అమృతం విషయంలో రైత్యులకందరికీ వివాదమేర్పడెను.

ఇట్లు జరుగగా, దైవము వలనవచ్చిన మోహింపజేయురూపము గలిగిన అన్ని ప్రాణుల మనస్సు నూ ఆనదింపజేయు ఒక స్త్రీని జూచి దైత్యులందరూ సంతోషమునొందిన నేత్రములు గలవారై విస్మయము నొందిరి. దైత్యులరాజగు బలి అపుడామెన గౌరవించి ఇట్లు పలికెను ఓ మహాభాగా! అందరి గతి కొఱకు త్వరగా నీవు అమృతమును విభజింపుము. నామాటను ఆచరింపుము. ఇట్లు దైత్యరాజనగా విస్మయము నొందిన ఆ స్త్రీ ఇట్లనెను. 'బుద్ధిమంతుడు స్త్రీలయందు విశ్వాసమునుంచడు. అబద్దము, సాహసము (ఆలోచించక ఒక్కమారుగా పనిచేయుట) మాయ (కపటము) మూర్ఖత్వము, ఆతిలోభము, శుచిలేకపోవుట, దయలేకపోవుట. ఇవన్నీ స్త్రీలకు స్వభావముతో వచ్చిన దోషములు అదే విధముగా స్నేహము లేకుండుట, ధూర్తత అనునవి కూడా వాస్తవానికి తన స్త్రీలలో కూడా వుండు దోషాలుగా తెలియవలెను. ఇందు సంశయము లేదు. ఏవిధముగానైతే, క్రూరమృగాలలో తోడేళ్ళు హింసించు స్వభావము గలవో, పక్షులలో కాకి, జంతువులలో నక్క ఎలా ధూర్తులో మనుష్యులలో స్త్రీ ధూర్తురాలని విజ్ఞాలు తెలుసుకొనవలెను.

మోహినీవృత్తానమ్నాతో మీకు స్నేహమెట్లు పొసగును? ఏవిధంగా నైనా మీరెవరో నాకు తెలియనవసరంలేదు. అలాగే నేనెవరో మీకు తెలియనవసరం లేదు కనుక, ఆసురశ్రేష్టులారా! చేయదగనిది, చేయదగినది. శ్రేష్ఠమైన బుద్ధితో ఆలోచించి మీరు పనిచేయండి.

బలి పలికెమః నీవుచెప్పిన స్త్రీలు గ్రామానికి చెందిన వారు. గ్రామీణ జనులకు ఇష్టులు, ఓ సుందరీ! నీవువారి మధ్యలో వుండే స్త్రీవి కాదుకదా!  అయినా, మిగుల మాటలాడుట ఎందులకు? మేము చెప్పినట్లు చేయుము.” బలి ఆట్లు అనిన పిమ్మట మోహిని పలికెను. ప్రభూ! మంచి మాటలలోకెల్ల ఉత్తమమైన నీమాట ప్రకారమే చేసెదను. బలిపలికెను ఈనాడు, వున్నడున్నట్లుగా అమృతము నందరికీ పంచుము. మేముతప్పకుండా వీపుపంచినట్లే తీసుకొనెదమని చెప్పుచున్నాము. ఆట్లనిన, అందరికీ శుభములు చేకూర్చు మోహినీదేవి అసురులందరికీ లౌకికస్థితి రుచించునట్లట్లనెను.

భగవంతుడనెనుః ఒకానొక దైవముచేత మీరంతా కృతార్థులైతిరి. ఈ నాడు ఉపవాసముతో అమృతమును సేవించుడు అసురశ్రేష్ఠులారా! మీకు శుభము పొందకోరిక వున్నచో, వ్రతము, ఆర్చనమని ప్రీతియున్న రేపు ఉపవాసమును ముగింపుడు. న్యాయముగా సంపాదించిన ధనములోని పదవవంతు ధనముచేత ఈశ్వరునికి ప్రీతి కలిగించుటకై వినియోగం చేయవలెను. దేవమాయచేత అందరూ ఆట్లే అని పలికి, అట్లే ఆచరించిరి. దైత్యులందరూ మోహితులు. మిక్కిలి ప్రజ్ఞావంతులుకారు. అపుడు, మయుడను అసురుడు సుందరమైన గొప్పనైన, కాంతివంతము. నైన, గొప్ప భవనముల విర్మించెను.

ఆ భవనములందు అందరూ చక్కగా స్నానం చేసి బాగుగా అలంకరించుకొని, ఎదుట పూర్ణ కలశమునుంచుకొని కూర్చొనిరి. రాత్రి అందరూ మిక్కిలి సంతోషముతో మేల్కొని వుండిరి. ఇక ఉషఃకాలముననే ప్రొద్దున స్నానముచేసిరి. బలి మొదలుగా అసురులు ముఖ్యమైన పనులన్నీ ముగించి, (అమృతమును) తాగు కోరికతో క్రమము ననుసరించి పంక్తిలో కూర్చొనిది. బలి, వృషపర్వుడు, నముచి, శంఖుడు, సుదంష్ట్రుడు, పంప్లది, కాలనేమి, విభీషణుడు వాతాపి, ఇల్వలుడు, కుంభుడు, నికుంభుడు, పచ్చదుడు, సుందుడు, ఉపసందుడు, నిశుంభుడు, శుంభుడు, మహిషుడు, మహిషాక్షుడు, బిడాలాక్షుడు, ప్రతాపవంతుడైన చక్షురుడు, మహాబాహువైన జృంభణుడు, వృషాసురుడు, విబాహువు, బాహుకుడు, ఘోరమైన - దర్శనము గల రుడనువాడు. మరియు ఇతర దైత్య దానవ రాక్షసులు, రాహువు, కేతువు కూడా క్రమము ననుసరించి కూర్చొని.

కోటి సంఖ్యలో వున్న రైత్యుల పంక్తి కూర్చబడినది. ఓ ద్విజులారా! అపుడు ఆ దేవి అమృతముకొరకై ఏమిచేసినదో, అక్కడ ఏమిజరిగివదో వినుడు అపుడు విజ్ఞాపనము చేయగానే అందరూ తమ తమ కలశములమ పట్టుకొనిరి. ఆమిత కాంతిగల ఆ విష్ణమోహిని జగత్తుయొక్క పరమమంగళ దేవి చేతిలోనున్న కలశముచేత మిగుల ప్రకాశించినది. అపుడు దేవతలు క్షణంలో వడ్డించువారి వేషములు ధరించి అసురులున్న దగ్గరికి వచ్చిరి స్త్రీలలో శ్రేష్టురాలైన ఆ మోహిని వారిని చూచి ఇట్లనెమ

మోహిని పలికెనుః నామాట నిజమైతే వీరంతా ధర్మ సర్వస్వమున సాదించువారు, మన అతిథులు అని తెలుసుకొనుడు. వీరికి కూడా శక్తిమేరకు ఇవ్వవలిసినదే. ఈనాడు మీరు ప్రమాణమును గ్రహింపుడు. ఆలస్యమున చేయకండి ఇతరులకు తమశక్తి మేరకు ఎవరు ఉపకారమును చేస్తారో వారు ధన్యులు, పవిత్రులు, లోకముల పాలించువారని తెలియవలయును. కేవలము తన కడుపుకోసమెవరు ప్రయత్నింతురో, వారు విప్పందేహముగా క్లేశమును పొందెదరు. కనుక, ఓ మంచినడవడిగలదైత్యులారా! నేవీ అమృతమును పంచవలెను. మీ ఇష్టమైన ఎడల ఎంతో కొంత దేవతలకూ ఇవ్వండి.

ఇట్లు మోహిని పలుకగా వెంటనే అసురులు ఆలస్యము లేకుండా ఆట్లే చేసిరి. ఇంద్రుడు మొదలైన దేవతలనందరినీ ఆహ్వానించిరి. ఓ బ్రాహ్మణులారా! అపుడుఅందరూ అమృతము కొఱకు కూర్చొనిరి.వారంతా కూర్చొవగా, అన్ని ధర్మములను తెలిపిన మోహిని అసురులను విస్మయపరుస్తూ ఇట్లనెను. ముందువచ్చినవారు పూజకు అరలవి కదా వైదిక వాక్యము కనక, వేదపరులు, దేవపరాయణులైన మీరు ముందు ఎవరికివ్వవలెనో త్వరగా చెప్పుడు. బలిమొదలైన మహానుభావులారా! అమృతమున ఎవరికివ్వవలెనో చెప్పుడు'(55) అపుడు బలిఅవెను నీ మనస్సు కిట్లు ఇష్టమగునో అట్లు చేయుము. ఓ సుందరమైన ముఖముగల ప్రి వీవు విప్పిందేహముగా మాకు అధికారిణివి?.

ఇట్లు బలిచేత గౌరవింపబడిన మోహిని వడ్డించుటకై అమృతకలశమును త్వరగా తీసుకొని గజరాజు తొండము వంటి తోడలశోభిల్లు వస్త్రముతో, జఘన భాగముయొక్క బరువుదేనెమ్మదిగా నడచుచూ, తవ్వవయములమోయుటకశకురాలివలె. బంగారు నూపురములచేత అవ్యక్త మధుర ధ్వనిని కలుగచేయుచు, కుంభము (కడవల వంటి) ప్రవములు గల ఆమోదాని చేతిలో అమృత కలశములో ప్రవేశించెను. అపుడు దేవగణముకొరకమతమును వడ్డించుచు సాక్షాత్తుగా అమ్సతరుముమ దేవతలపై కురిపించమ. మరల మరల అట్లు విశ్వమూర్తియగు మోహినిచే నివ్వబడిన సుధారసమున దేవేంద్రుడు మొదలుగా లోకపాలురు, గంధర్వులు, యక్షులు, అప్పరపలు (గ్రోలిరి)

ఓ బ్రాహ్మణులారా! ఆసనములయందున్న దైత్యులందరూ అపుడుచింతతో కూడిన వారై ఆకలిచేత పీడింపబడిరి. బలిమొదలైన దైత్యులు అభిమానము గలవారై ఆలోచనలో మునిగి మౌనముగానుండిరి. అపుడట్టిదైత్యులను, మోహమునొందిన వారిని జూచి, రాహుకేతువులను దైత్య ప్రముఖులు అమృతముకొఱకు త్వరగా దేవతల రూపమును దాల్చి దేవతల పంక్తిలో కూర్చొనిరి. ఎప్పుడైతే వారు అమృతమును త్రాగదలిచారో, అపుడు సూర్యచంద్రులు రాహువుమ గూర్చి గొప్పతేజస్సుగల విష్ణువుకుచెప్పిరి. అపుడు చెడు రూపముగల రాహువు యొక్కతల భేదింపబడిన. తల ఆకాశమును, మొండెము భూమిని చెరెను. ఆ మొండెము భ్రమిస్తూ పర్వతములతో సహా అపుడు భూమినంతా పొడిగాచేసేను. మోహినీ చేత ఆ విధంగా రాహువు కబంధముతో చరాచరమంతా పొడి చేయబడెను.

అదిచూచి మహాదేవుడు దానిపై నిలిచెను. అపుడు దేవతలందరి వివాహము అతని పాదతలమున నుండి దాని సమీపమువ పీడనమగుటచే అది నివాసమాయెను. గొప్పవారి నివాసమగుటచే యాపాదకమలము మహాలయమని ప్రసిద్ధిని పొందెను. మరియు ముల్లోకముల మోహింపజేయునదాయెను. కేతువు కూడా ధూమ (పొగ) రూపమున ఆకాశమున , లయించేమ, విష్ణువు చంద్రునికి అమృతము నర్పించి అంతర్షితుడాయెను. లోక కారకుడు, ఆది హేతువగు విష్ణువు యొక్క ప్రపాదము వలన దేవతల పని సిద్ధించెను దైవము యొక్క విపర్యయము అసురులకు వినాశనము వాటిల్లెను. దైవము లేనిది ప్రయత్నము విప్రయోజనమని తెలుసుకొనుడు దేవతలంతా కలిసి క్షీరసాగరాన్ని చిలికినప్పటికీ, దేవతలకు సిద్ది (విజయము) లభించినది. అసురులకు ఆసిద్ధి (అపజయము) లభించినది అటు తరువాత మరల మాయచే మోహము నొందిన రైత్యులు దేవతల పట్ల కోపము నొంది, అనేక శస్త్రములను, అస్త్రములను తీసుకొని, విష్ణువు వెళ్ళిపోగానే గర్జింపసాగిరి.

శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమున పన్నెండవ అధ్యాయము సమాప్తము.