స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
20వ అధ్యాయము
ఋషులనిరి- బ్రహ్మా విష్ణురుద్రులు సగుణులని వీవు కీర్తించితివి. ఈశ్వరుడు నిర్గుణుడెట్లో మాకు చెప్పుము.(1) అల్పముగానీ, మహత్తుకానీ, చరాచరమైన ఈ జగత్తంతా మూడు గుణములచేత వ్యాపింపబడినది. మాయామయముగా ఇదంతా కనబడును. లింగము లేక దేనినుండి, దేనిచేత ఇది ఇట్లు కనబడును? (2) ‘ఓ సూతా! పెద్దది గానీ, చిన్నది గానీ కనబడునదంతా కృత్రిమమైనందున నశించు స్వభావము గలది, కనుక నీవు విమర్శించి మా సంశయమును ఛేదించవలెను. వ్యాసుని అమగ్రహము చేత నీకంలో తెలియును. ఇతరులకు తెలియదు’(4) సూతుడనెను - ఈ విషయమును వ్యాసుడు శకునికి అంతా తెలియజేసెమ - శుకుడనెను. లింగరూపియగు శివుని విరుణుడని వీపు ఎట్లనెదవు? వాయనా! నా ఈ సంశయమును పూర్తిగా తొలగింపుము(5)
వ్యాసుడు చెప్పెను- నాయనా! పూర్వము అగస్త్యుడడుగగా నంది చెప్పిన దానిని నీకు చెప్పెదను. ఏమము.(6) నిర్గుణమగు పరమాత్మ లింగరూపమున నున్నట్లు తెలియుము- అదే విధముగా పరాశక్తి గుణరహితురాలు, శాశ్వతముగా నుండువదని తెలియుము.(7) ఆ శక్తి చేతనే, పరమార్దములో నశించునదే అయిననూ చరాచరమగు విశ్వమంతా మూడు గుణములలో విశేషముగా భావింపబడుచూ చేయబడినది.(8) పరమాత్మ లింగరూపమున ఏదీ అంటనివాడు ఒకడే. మూడు గుణములూ ప్రకృతితో విలయమును పొందినవి.(9) లయించినందున లింగమని అందువలననే ఆందురు- కనుకే పరాశక్తి లింగమువందే లయము పొందినది. వేరొకదానిలో ఎందుకు? (10)
మహానుభావా! రుద్రుడు చెప్పుటచే గుణములన్నీ లీనమైవున్నవి. వానిచేత చరాచర జగత్తంతా బంధింపబడివున్నది. కనుక లింగమును చక్కగా పూజింపవలెను.(11) విప్రోత్తములారా! లింగమును సాక్షాత్తు నిర్గుణమైనదిగా తెలిసికొనుము. లయించి వున్నందున లింగముయొక్క మాహాత్మ్యము గుణములదిగా చెప్పబడుచున్నది.(12) బుద్ధిమంతులు. శంకరుని సుఖమునిచ్చువాడని యందురు. విప్రులారా! అందరికీ, అన్నిటికీ ఆశ్రయమైనందుచేత శంకరుని సర్వుడు’ అని అందురు.(13) శుభమునకు ఉత్పత్తిస్థావమైనందున శంభువని పిలువబడును.(14) ఇట్లు మహాత్ముడగు శివుని పేర్లన్నియూ అర్థముగలవియే. పరమేష్ఠియగు శివునిచేత జగత్తంతా నిండియున్నది.(15) ఋషయ ఊచుః-
మహానుభావా! సూతా! దక్షుని యజ్ఞము జరుగు సమయాన మహానుభావురాలైన దక్షుని కూతురైన సతి అగ్నిలో పడి అంతర్ధానము చెందినది కదా!(16) ఎపుడు ఆమె ప్రాదుర్భవించినదో, పరాశక్తి యగు ఆమె పరమేశుని మరల ఎపుడు కలిసినదో దానిని మాకు తెలియజేయుము.(1) మహామభావా! పూర్వము జరిగిన దీనినంతా వున్నదున్నట్లుగా మాకు తెలియజేయుము. వేరొక వ్యక్తి ఎవడూ చెప్పజాలడు.(18)
ఎపుడైతేదక్షుని కూతురైన దాక్షాయణి పూర్తిగా దహింపబడిన ఆవయవములు గలదిగా ఆయివదో అపుడుశక్తిలేని మహేశుడు కూడా గొప్ప తపస్సుమ చేసెను.(19) హిమవత్పర్వతముపై లీలచే గ్రహించిన శరీరము గలవాడై శివుడు భంగి, విశ్వుడు, నంది మొదలగు వారిచే కూడియుండెను.(20) అట్లే చండుడు, ముండుడు, మరియు ఇతర గణములు పదికోట్లతో కూడియుండెను.(21) కోటి గణములతో మరియు అరవై వేల గణములతో వృషభ ధ్వజుడగు శివుడుండెను (22) హిమాలయ పర్వతము పై భాగమున శ్రీవుడు వీరభద్రుడు మొదలైన గణములతో కేవలుడిగా, మూలావిద్య లేనివాడుగా మండెను.(23) ఇంతలో అవిద్యచేత దైత్యులావిర్భవించారు- విష్ణువు బలిని బంధించగా, మహాబలులైన దైత్యులు (24) ఇంద్రునికి ఉపద్రవము కలిగించువారైనారు. కాలభంజలు, మహారౌద్రులు, కాలకాయులు మరియు ఇతరులు (25) నివాత కవచులని పేరును పొంది రవరావక సంజ్ఞలో ప్రజలను సంహరింపసాగిరి.(26) నముచి పుత్రుడగు తారకుడమవాడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను సంతోషింప బేసెను. ఆ తపస్సు చేత బ్రహ్మ అతని పట్ల ప్రసన్నుడాయెను.(27)
సంతుష్టుడైన బ్రహ్మ దురాత్ముడగు తారకాసురునికి కోరిన వరములనిచ్చెను- వరమును కోరుము. నీకు శుభమగును. నీవు కోరినవానినిచ్చెదమ.(28) ఆట్లు బ్రహ్మ పలుకగా ఆ అసురుడు లోకములకు భయముమ కలిగించు వరముమ కోరెను.(29) 'ఓ ప్రభూ! నీవు వాపట్ల ప్రసన్నుడవైతివేని నాకు ముసలితనము, మరణము, పరాజయము లేకుండా వరము నిమ్ము(30) అనీ దురాత్ముడగు తారకుడనగా నవ్వుతూ బ్రహ్మ ఇట్లనెను. నీకు మరణము లేకుండా వుండుట ఎట్లు? (31) జన్మించిన ప్రతిదానికీ విశ్చయముగా మరణమున్నదను వాస్తవమును తెలుసుకొనుము. అనగా నవ్వి తారకుడనెను- ‘అయినచో అజేయుడవగునట్లు వరమువిమ్ము’ (32) అపుడు బ్రహ్మ తారకునితో ‘ఓ పాపరహితుడైన తారకాకి చిన్న పిల్లవాని చేతిలో తప్ప నీకెక్కడా పరాజయము సంభవించదు. పిల్లవాడు నిమ్న జయించగలడు.’ (33) అనగా అపుడు తారకుడు బ్రహ్మకు నమస్కరించి ఇట్లనెను. ‘ప్రభూ! దేవేశ! నేనీనాడు మీ ప్రసాదము వలన కృతార్థుడనైతిని’(34) ఈ విధంగా మహాబలుడైన తారకుడు వరములను పొంది దేవతలను యుద్ధానికై ఆహ్వానించి వారితో యుద్ధము చేసెను.(35)
ముచుకుందుని ఆశ్రయించిన దేవతలు జయమును పొందిరి. తారకుని చేతిలో మరల మరల కష్టముల పొందుచున్న దేవతలు (36) ముచుకుందుని బలముచే జయమును పొందిరి. ఇట్లు ఎడతెగక యుద్దము చేయు మనకు కర్తవ్యమేమి?(37) అని విధిని స్మరించి, బ్రహ్మపదమును చేరిరి. బ్రహ్మ ఎదుట నిలిచి ఇంద్రాది దేవతలు ఇట్లు పలికిరి (38) దేవతలరి- ‘బలితో సహా విష్ణువు పాతాలముననున్నాడు - అతను లేక ఇంద్రుడు మొదలైన దేవతలంతా అసురుల చేతిలో నేలకూలారు.(39) మమ్ము రక్షించుము ప్రభూ! ‘అనగా ఆకాశము నుండి వారిని ఓదార్చుచూ వాణి వినిపించెను. (40) ‘ఓ దేవతలారా! నేను చెప్పినట్లుగా త్వరగా మీరు చేయండి. ఎప్పుడైతే శివుని కుమారుడు, మహాబలుడు జన్మిస్తాడో (41) అపుడతను యుద్ధములో తప్పకుండా తారకుని వధించగలడు.(42) ఏ ఉపాయముచేత అందరి హృదయములలో నుండు భగవంతుడగు శివుడు (4) భార్యను గ్రహించునో అట్టి మార్గమున మీరు ఏర్పరచుటకు. యత్నమును చేయండి (43) దేవతలారా! మీరు తెలుసుకొనుడు, అవి ఆ అశరీరవాక్కు పలకగా, దేవతలు పరస్పరము విస్మయముతో మాట్లాడుకొవిరి(44)
అశరీరవాణివి వినిన దేవతలు బృహస్పతివి ముందడుకొని హిమాలయము వద్దకు వచ్చి ఇట్లనిరి (45) కార్యము నెరవేరుట యను భారము వుండుటచేత హిమాలయముతో నవిరి- 'మహానుభావా! హిమాలయా! వేడు మా మాటను వినుము.(46) లారకుడనువాడు మమ్ములను భయపెట్టుచున్నాడు. అతనిని వధించుటలో నీవు సహాయము చేయుము. తపస్వులగు మా అందరికీ నీవు శరణమునిమ్ము, శరణముకై మేమంతా ఇంద్రునితో కూడి నీ వద్దకు వచ్చితిమి.(47)
లోమశుడనెను- ఇట్లు దేవతలు గిరిశ్రేష్ఠుడైన హిమవంతుడివి అభ్యర్థించగా, వాక్య జ్ఞానము గలవారిలో శ్రేష్టుడగు హిమవంతుడు దేవతలతో నవ్వుతూ అనెను.(48) ‘మేమందరమూ మహీంద్రుని చేత అసమర్థులుగా చేయబడివాము.(49) తారకుని వధమ గూర్చి దేవతల పనిని మేమేమి చేయగలము. దేవతలారా! మాకు రెక్కలుండిన యెడల (50) బంధువులతో కలిసితారకుని వధించగలము. ఇపుడు కదలలేని వాడివి, రెక్కలు లేని వాడిని, ఏమి చేయగలవాడను’(51) అనగా వివి దేవతలందరూ ఆవిరి. అరకుని వధించుటకు మీరు, మేము అందరమూ అసమర్థులమే. కాని ఈ పనిని గూర్చి ఆలోచింపుము. (52) మహాబలుడైన తారకుడు జయింపబడు పనిని గూర్చి ఆలోచింపుము! అనగా హిమవంతుడు వారితోననేమ.(53)
దేవతలారా! మీరు ఏ ఉపాయము చేత తారకుని సంహరించకోరుచున్నారో త్వరగా తెలియజేయుడు.. నేనా కార్యమును తెలియుటకు మీరు చెప్పుడు (54) అనగా అపుడు దేవతలు చెప్పిరి. కార్యముకొరకు ఆకాశవాణి చెప్పిన దానిని వారు చెప్పగా వివిన హిమవత్ పర్వతము ఇట్లనెను. (55) తారకుడు శివుని పుత్రుని చేతిలోనే వధింపబడవలసినచో సురుల కార్యమంతా శుభము కాగలదు. అశరీరవాణి సత్యమవగలదు.(56) కనుక, మీరు మహేశ్వరుడు వివాహమాడునట్లు చేయండి. దేవతలంతా శివునికి యోగ్యమగు కన్యకైవెదకండి.(57) అనగా నవ్వి దేవతలనిరి. ‘ఈ పని నెరవేరుటకు నీవే శివుని కొరకు కన్యను జనింపజేయవలెను.(58) ఓ పర్వతరాజమా! మా ఈ దేవతలకు నీవే ఆధారము కనుక మా మాటను నెరవేర్చుము.(59) అనగా పర్వతరాజా తన ఇంటికి మరలి వెళ్ళి పత్నియగు మేనతో దేవతల కార్యమును గూర్చి చెప్పెను.(60) దేవతల, ఋషుల, మరియు తాపసుల కొరకు వీవు ఒక కన్యకకు జన్మనీయవలెను-(61) బాలికకు జన్మనిచ్చుట స్త్రీలకు ప్రియము కాకపోయిననూ, నీవు బాలికకు జన్మనీయవలెను.(62)
అనగా నవ్వి మేన భర్తయగు హిమవంతునితో ఇట్లనెను. మీరు చెప్పిన దానిని వింటివి. నా మాటను వినుడు.(63) మానవులను కన్యధుఃఖమును కలిగించును-స్త్రీలకు శోకమును కలిగించును. కనక బాగుగానీ బుద్ధితో విచారించి హితమగుదావివి. చెప్పుము.(64) అని మేన పలికినపుడు హిమవంతుడు పరోపకారముతో కూడిన వాక్యమును పలికెను.(65) ‘బుద్దిమంతుడైన వ్యక్తి ఇతరుల జీవనము దేని చేత కలుగునో దానినే చేయవలెను-(66) పరోపకారముతో కూడినదావీది క్రికూడా చేయలేమ-’ అని ప్రవర్తింపజేయగా మేన తన భాగ్యముచేత ఉదరమున కన్యను ధరించెను.(67) మహావిద్య, మహామాయ, మహామేధస్వరూపిణి, రుద్రకాలి, అంబ, సతి, దాక్షాయణి (68) అనబడు ఆ పరమైశ్వర్యమును విశాలాక్షియగు మేన తన కడుపులో భరించుచూ మండెను.(69) అపుడు దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నరులు, హిమవంతుని భాగ్యముమ, మేనయొక్క అమితభాగ్యమును స్తుతించిరి.(70)
ఇంతలో దేవి గిరిజయను పేరుతో ప్రాదుర్భవించి అందరికీ సుఖమును కలిగించున దాయెను.(71) దేవదుందుభులపుడు నినదించినవి, అప్పరోగణములు వర్తించిరి. గంధర్వపతులు గానము చేయగా అప్పరోగణములు నాట్యము చేసిరి.(72) దేవతలు గొప్ప పుష్పవర్షమును వర్షింపజేసిరి. అపుడు ముల్లోకములు కూడా ప్రపన్నమైనవి.(73) ఎపుడైతే మహాపతియగు గిరిజ ఆవతరించినదో అపుడు దైత్యులు భయమును పొందిరి. దేవగణములు, మహర్షులు, చారణులు, సిద్ద గణములు ఆనందముమ పొందిరి.(74)
ఇది శ్రీస్కాందమహాపురాణమున మాహేశ్వరఖండమువ కేదారఖండమందు శ్రీ భవానీదేవిఉత్పత్తివర్లవము అను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.
