స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
7వ అధ్యాయము
లోమశుడనెనుః అపుడా దేవతలు, ఋషులంతా భయముతో జ్ఞానవిహ్వలురై బ్రహ్మ మొదలగువారు కూడా ఈశ్వరుని లింగమును స్తుతించిరి. బ్రహ్మ పలికెను - 'గొప్పకాంతిగల నీవు లింగరూపముగలవాడవు, వేదాంతముచేత తెలియదగినవాడవు, పదా ఆనందరూపుడైన (సత్, ఆనందరూపుడైన) నీచేతనే ఈ జగత్తు ఆత్మమూలముగా నిత్యము చేయబడినది. నీవే అన్నిలోకములకు సాక్షివి. మేధావియైన నీవే హరించువాడవు, మహదేవా, జగత్పతి, నీవే రక్షకుడవు, భైరవుడవు. లింగస్వరూపియైన వీచేత ఈ మూడులోకములు వ్యాపించినవి మేము అల్పులము, మాయచే మోహించుబుద్ధిగలవారము. వేమ, సురులు, అసురులు, యక్ష, గంధర్వ, రాక్షసులు, సర్పములు, పిశాచాలు, విద్యాధరులందరూ (ఇట్టివారమే) వీవు విశ్వమును సృజించువారినే పృజించెదవు - నీవే హరించు పరమపురుషుడవు. ఓ మహాదేవా, దేవ దేవా! మమ్ముల రక్షింపుము - దేవా నీకు నమస్కారము. ఇట్లు బ్రహ్మచేత లింగరూపియగు శివుడు స్తుతింపబడెను. ఋషులు కూడా స్తుతింపగోరి స్వచ్ఛుడైన మహేశ్వరుని శ్రుతి. గీతలచేత, గొప్పవాక్కుచేత స్తుతించిరి.
ఋషులు పలికిరిః అజ్ఞామలమైన మేము లింగముయొక్క నిజమైన స్థితిని కోరికచేత తెలుసుకొనలేకున్నాము. విదే తల్లి, తండ్రివి, నీవే బంధువు, సఖుడవు నీవే, వీవీశ్వరుడవు, వేదము తెలిసినవాడవు, ఒకే రూపము గలవాడవు, మహామభావులచే ధ్యానింపబడువాడవు. వేరు వేరు కట్టెలలో నొక్కటిగా మండు జ్యోతి వలె ఒక్కడివి - నీవు అన్ని భూతముల ఆత్మను - నీ నుండే అంతా కలుగుచున్నందున నీవు నిత్యము సర్వుడవి (పిలబడబడుచున్నావు) ఇదంతా (నీమండే) ఏర్పడుచున్నందున శంభుడవు నీవే. దేవతలు మొదలుగా మేమంతా పాదకమలమును చేరితిమి. ఋషులు, దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప సర్పములు (మేమంతా నిన్ను చేరితిమి) జగత్తుయొక్క పాలకుడా! కనుక మమ్ములను కరుణచే రక్షింపుము.
మహాదేవుడనుః తపోధనులారా! ఈనాడు నామాటవినుడు - త్వరగాఇట్లు చేయుడు. అందరూ విష్ణువుమ ప్రార్థించండి. మహాత్ముడైన శంకరుని మాటను విని దేవతలంతా అపుడు విష్ణువును నమస్కరించి ప్రతించిరి.
దేవతలు పలికిరిః లోకములకు బంధువగువాడా! విద్యాధరులు, దేవతాగణములు, ఋషులు వీరంతా నీచేత ఈనాడు రక్షింపబడిరి. ఆదేవిధముగా ఓ కృపాపముద్ర! ముల్లోకములకు ప్రభువా! జగదీశా! జగన్ని కాపా! జనులను పాలించుము. అపుడు భగవంతుడగు విష్ణువు నవ్వి ఇట్లనెను. పూర్వము రాక్షసులచేత పీడింపబడిన మిమ్ము నేను రక్షించితిని. ఈ నాడీ లింగమువలన చిరంతవమైన భయముకలిగినది. ఓ దేవతలారా! ఈ లింగము నుండి రక్షించుట నావల్ల కాదు. విష్ణువిట్లు పలికినపుడు దేవతలు చింతలో మునిగిరి. అపుడు ఆకాశవాణి దేవతలమ ఊరడించి ఇట్లు పలికెను.
ఓ జనార్ధనా! పూజకై ఈ లింగమును ఎన్నుకొనుము. ఓమహాబాహూ! చరాచరమునంతా రక్షింపుము. భగవంతుడు వీరభద్రుడు అలాగేనని తలిచి శివ లింగమును పూజించేను. బ్రహ్మా మొదలైన దేవతాగణములతో కలిసి మహాత్ముడైన శివపూజా విధానమందాసక్తి కలిగిన వీరభద్రుడు పూజింపబడెను. మూడులోకములందునూ శివప్రియుడూ, చంద్రశేఖరుడూ అగు వీరభద్రుడు రుద్రునితో సమానము. అపుడు వీరభద్రుడు (శివ) లింగార్చన పరుడాయెను. దేనిచే ఈ జగత్తంతా సృజింపబడుచున్నదో, స్థితిని పొందుచున్నదో, విలయమును పొందుచున్నదో దానినే తత్య వేత్తలు 'లయించుటచే లింగము' అనియనెదరు. బ్రహ్మాణ గోళములచే వ్యాపించినది, ఆట్లే రుద్రాక్షములచే అలంకరింపబడినది, అందరికీ దాటశక్యము కాని అట్టి గొప్పలింగమేర్పడినది.
అపుడు దేవతలంతా, (అదేవిధంగా) గొప్పకాంతి గల ఋషులు, వేరువేరుగా వేదవాదములచే (ఆ) మహాలింగమును స్తుతించిరి. ఓ దేవా! నీవు అణువుకంటే అణువు (సూక్ష్మముకంటె సూక్ష్మము) అదే విధంగా నీవు మహత్తుకంటే మహాత్తువు. కనుక ఓ సర్వా! లింగపూజనం వీరిందరిచే (సుకరమెట్లగునో అట్లు) నీవు చేయవలెను. అపుడే సర్వునిచే లింగం బహువిధాలుగా చేయబడెను - సత్యమందు బ్రహ్మేశ్వరమనునది, వైకుణమందు సదాశివు డనునది, అమరావతిలో అమరేశ్వరుడనునది ప్రతిష్ఠింపబడినది, పడమర దిక్కున వరుణేశ్వరమని, దక్షిణమున కాళేశ్వరమనునది నైరుతిలో నైర్ఋతేశ్వరుడనునది, వాయువ్యమున పావనేశ్వరుడనునది, మృత్యులోకమున కేదారము మరియు అమరేశ్వరమనునది ప్రతిష్ఠింపబడినవి.
నర్మదయందు ఓంకారమగు (లింగమును), (అదేవిధంగా) మహాకాలమను దానివి, కాశి యందు విశ్వేశ్వరుడను దేవుని, ప్రయాగలో లలితేశ్వరుని బ్రహ్మగిరియందు త్రియంబకుని, కలియందు భద్రేశ్వరుని, గంగాసాగర సంగమమువద్ద ద్రాక్షారామేశ్వర లింగమును సౌరాష్ట్రమున సోమేశ్వరుని, శ్రీశైలమున శిఖరేశ్వరుని, వింధ్యయందు సర్శేశ్వరుని, కొంతి(చి) యందు అల్లాలనాథుని. సింగలము (సింహళము?) నందు సింహనాథుని, నిరూపాక్షుని అట్లే కోటిశంకరలింగమును. త్రిపురాంతకుని, భీమేశుని, అమరేశ్వరుని పాతాళమున భోగేశ్వరుని, హాటకేశ్వరుని, ఇట్టి అనేక లింగములు మూడు లోకములందు విశ్వము యొక్క ఉపకారమునకై దేవతల చేత స్థాపించబడినవి.
ఆట్లు మూడు లోకములు అన్ని లింగములచే నిండిపోయెను - అట్లే పూజకొఱకు దేవతలచే వీరభద్రునంశలు చేయబడిరి. ఇరవై ఎనిమిది లింగము యొక్క అర్చన సూచకములైన సంస్కారాలు శంకరుని చేత చెప్పబడినవి శివుని చేత చెప్పబడిన సనాతన శివధర్మములున్నవి. వీరభద్రుడేవిధముగా రుద్రుడో అట్లే మిగతా గురువులు. గురువునుండి కలిగిన గురువులు ముల్లోకము లందు ప్రసిద్దులు లింగముయొక్క మహిమను నంది వాస్తవముగా నేరుగును. ఆట్లు భగవంతుడగు స్కాందుడు (వాస్తవముగా నేరుగును). నా మనసును ధరించువారంతా (కూడా ఎరుగుదురు) చెప్పబడిన శివధర్మములు నందిచేత కీర్తింపబడినవి. విచిత్రములైన లింగధారకములైన (శివధర్మములు) శిలాదపుత్రుడగు నందిచే కీర్తింపబడినవి. పురాతనులచే శవముపై కూడా లింగము ధరింపబడును.
శివలింగముతో సహ మరణము - శివలింగముతో సహా జీవనము. ఈ గొప్పప్రతిష్ఠగల ధర్మములు నందిచే ప్రతిష్ఠించబడినవి. స్కందునిచే ఆచరింపబడిన పాశుపతధర్మము శ్రేష్ఠము పంచాక్షరీ విద్య శుద్ధమైనది. అటు పిమ్మట ప్రాసాదీ విద్య (మన శాస్త్రములో ప్రణవమునకే ప్రాసాదమని సంజ్ఞ) అట్లే షడక్షరీ విద్య ప్రాసాదమును ప్రకాశింపజేయునది - ఇదంతా స్కందునిచే ప్రాప్తించినది. మహాత్ముడైన అగస్త్యునకు - తరువాత ఆచార్యభేదము చేత ఆగమములు కూడా అనేకములైనవి. ఇక ఎక్కువ చెప్పిన నేమి? ఎవరు 'శివ' అను రెండక్షరాలను ప్రతిదినము ఉచ్చారింతురో వారు నిస్సంశయంగా రుద్రులే - ఎవరు సత్పురుషుల మార్గము ముందుంచుకుందురో వారు పురాంతకులు, వీరులు, మాహేశ్వరులు, జనులపాపమును నాశనము జేయువారు. ప్రసంగముచేత, యథాలాపంగా, శ్రద్ధచేత, కోరికచేత గానీ ఎవరు శివభక్తిని ప్రదర్శింతురో వారు సద్గతిని పొందెదరు.
పూర్వము ఒక ఆడుపక్షి శివాలయమున మార్జనము చేసిన పురాతనేతిహాసమును ఇప్పుడు చెప్పెదను వినుడు. ఎవరో సమర్పించిన నైవేద్యమును తినుటకు వచ్చిన ఆ పక్షియొక్క రెక్కల చేత పూర్వము ధూళి తొలగించబడెను. ఆ కర్మ ఫలితంగా ఆ పక్షి స్వర్గమునకు వచ్చి, మిక్కుటమైన స్వర్గసుఖము ననుభవించి మరల సంసారమునకువచ్చెను ఆటుపై సుందరి ఆను పేరుతో కాశిరాజునకు కూతురుగా పుట్టి పేరుకెక్కెను. ఆ సుందరి పూర్వజన్మ అభ్యాసము చేత గొప్ప భక్తిగల స్త్రీ, సతి అయినది. ప్రతిదినము ఉషఃకాలమున ఆ సుందరి శివద్వారము వద్ద శ్రద్ధతో, గొప్ప భక్తిలో ఎల్లప్పుడూ శుద్ధిచేసేది. అట్లు సుందరి అను రాజకన్య స్వయముగా చేయుటమ చూచి ఉద్దాలకుడమ ఋషి ఇట్లు పలికెను.
ఓ బాలా! నీవు సుకుమారి వయ్యూ సమ్మార్జనము నెట్లు చేయుచుంటివి? ఓ అందమైన నవ్వుగల కన్యా! నీ ఎదురుగా ఎంతోమంది దాస, దాసులు గలరు నీతిజ్ఞచేత పమ్మార్జనము మొదలైన దానివంలా చేయగలరు. ఋషియొక్క ఆ మాటలను విని నవ్వి (సుందరి) ఇట్లనెను. శివసేవను బాగుగా చేయువారు. శివభక్తినే ముందుంచుకొని ప్రవర్తించువారు అగు పురుషులు, స్త్రీలు శివలోకమునకు వెళ్ళుదురు. అందుకే, నాచేత శివాలయమునకు నడిచి రావడం, చేతులచే పంమార్జనము చేయడము, ఆలస్యములేక సంమార్జవము చేయడం- (ఇవన్నీ) చేయబడుచున్నవి సమ్మార్ణవము దప్ప ఇతరము ఎరుగను. ఆ మాటవిని ఋషి మనస్సులో విమర్శించుకొనెను. 'ఈ ప్రీ పూర్వమేమి చేపెను? ఈమె ఎవరు? ఎవరి అనుగ్రహముచేత (ఇట్లు జన్మించినది)?? అపుడు జ్ఞానచక్షువుద్వారా ఋషికి అదంతా తెలిసినది. అపుడతను, విస్మయముతో మిన్నకుండిను. జ్ఞానులలో గొప్పవాడైన ఉద్దాలకుడు, అది తెలుసుకొని విస్మయము పొందిన వాడాయెను- మనస్సులో శివుని ప్రభావమును ఆలోచించి శాంతుడై జ్ఞానము ద్వారా పరమ జ్ఞానమును పొందెను.
శ్రీ స్కాంద మహాపురాణంలోని మొదటి మాహేశ్వర ఖండములో కేదార ఖండమునందు ఏడవ అధ్యాయము.
