స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
32వ అధ్యాయము
లోమశుడు చెప్పసాగెను - బ్రాహ్మణులారా! ఇట్లతను శివధర్మములను చెప్పెను. విశేషములతో విస్తరముగనూ (1) అనేకాగమములతో కూడిన ఈ పాశుపత ధర్మములను వాస్తవముగా తెలియజేసెను - అట్లే విస్తారముగానూ క్లుప్తంగానూ కాపాలిక భేదముల కూడా చెప్పెను. (2) ఇట్లు నానావిధ ధర్మములు నందికి చెప్పబడినవి (3) అపుడు ఋషులిట్లడిగిరి – ‘మహానుభావా! మంగళకరమగు కుమారస్వామి చరితమును పూర్తిగా వింటిమి - కొంత ప్రశ్నించదలిచితిమి. (4) రాజసింహుడగు శ్వేతుని చరిత్ర మహాద్భుతముగా నున్నది. ఆ శ్వేతుడు అమిత భక్తితో శివుని సంతోషింపజేసెను. (5) భక్తితో సదాశివుని అర్చించువారు మహాత్ములు, భక్తులు, జ్ఞానులు, కర్మఠులు (6) కనుక శంకరుని చరితను గూర్చి అందరమూ అడుగుచుంటిమి. వ్యాసుని అనుగ్రహము వలన నీకు అంతా తెలియును - వేరొకరికి కాదు -’ (7) అనగా విని లోమశుడిట్లనెను (8)
‘మహాసుభావులారా! పరమాద్బుతచరిత్రమును వినుడు - ఆ శ్వేతుడను మహాత్ముడు రాజుగా అనేక రాజభోగములననుభవించుచుండగా, ధర్మమున బుద్ధి ఏర్పడెను - (9) ఆతను ధర్మముగా ప్రజలను, భూమిని పాలించుచుండెను. అతను బ్రహ్మణ్యుడు, సత్యవాక్, శూరుడు, ఎల్లప్పుడూ శివభక్తుడు (10) ఆ రాజు యథాశక్తి రాజ్యమును శాసించెను. అట్లే భక్తిలో పరాత్పరుడు,శాంతుడు, నిత్యుడు,పరమాత్మయూనగు శివుని అర్చించెను. (11) పరమేశ్వరుని అర్చించుచున్న అతని ఆయువు క్షీణించిపోయెను. మరీ అతని చరితమును వినుడు. (12) పరమాశ్చర్యమును కలిగించు శివకథతో కూడిన మాటలివి - ఆ రాజు పాలించుచుండగా జనులను ఆధివ్యాధులు బాధించలేదు. (13) అట్లే ఉపద్రవములేవీ భాధించనందున, జనులు ఈతి బాధలు, కష్టములులేని వారై జీవింపసాగిరి. (14) ఆ రాజు పాలించు చోట ఓషధులు కృషి లేకనే పండునవాయెను -బ్రాహ్మణులు తపస్సు చేయువారైరి - జనులు వర్ణాశ్రమమును పాటించిరి. (15) పుత్రుని మరణమున దుఃఖముగానీ, అవమానముగానీ, మారకముగానీ, దరిద్రముకానీ వారు పొందలేదు. (16) ఇట్లు ఆ మహాత్ముడు, శివభక్తుడగు శ్వేతుడు రాజ్యమును పాలించుచుండగా కాలము సఫలముగా గడిచెను. (17)
ఒకనాడు పరమార్థమునొసగు శివుని ప్రార్థించుచున్న ఆరాజుని గొని తెమ్మని యముడు తన దూతలను పంపెను- (18) చిత్రగుప్తుని మాట పై ఆ శ్వేతుని తెచ్చుటకు దూతలు శివమందిరమునకు వచ్చిరి. (19) రాజును తీసికొనివచ్చుటకు వారు పాశములను పట్టుకొని భయంకరముగా వచ్చి శ్వేతుని త్వరగా చూచిరి. (20) కానీ, ధర్మరాజు ఆజ్ఞను పాలించలేకపోయిరి. అది తెలిసి యముడే స్వయముగా వచ్చెను. (21) తన దండము నొక్కమారుగా పైకెత్తి శ్వేతుని కొనిపోవలెనని చూడగా శ్వేతుడు శివధ్యానమున, భక్తితో, శాంతుడై, కేవలునిగా నుండెను (22) అట్టి రాజునుచూచి యముడు కూడా చాలా క్షోభపడెను. (23) విహ్వలుడై చిత్తరువువలె కాసేపు ఆ కాలరూపుడు, ప్రజలకునిత్యము క్షయకారకుడగు యముడుండెను (24) వెంటనే కోపముతో రాజు వద్దకు పదునైన ఖడ్గమును, చర్మమును దాల్చి వచ్చెను. (25) అంతలో రాజు ద్వారము వద్ద నిలుచున్న భయంకరుడైన యముని చూచెను. అపుడు కాలుడిట్లనెను (26)
‘ఓ ధర్మరాజా! ఈ మహాత్ముడగు రాజును నీవేల కొనిపోవుట లేదు? యమదూతలతోనున్ననూ, యముడా! నీవు భయపడినట్లు వాకనిపించుచున్నది (27) పా మాటనమపరించుము. కాలమును దాటనీయకుము. అవి కాలుడనగా యముడు ఇట్లనెమ (28) ని ఆబ్దమ పాటించెదను. ఇక ఆలోచించవలసినది లేదు. ఈ వ్యక్తి మాకు లొంగువాడుకాడు. నిత్య శివభక్తుడు (29) శివుని నుండి భయముచే మేము చిత్తరువులోనున్నట్లు నిలుచుంటిమి.’ అని యముడనగా కాలుడు కోపించి, రాజును వధించుటకు ఖడ్గమును గ్రహించెను. (30) ఇరువది నాలుగు సూర్యులవలె ప్రకాశించు శివాలయమున కోపముతో ప్రవేశించగనే, శివుడు తన భక్తుడగు ఉత్తమరాజనీ, కేతుని వధింపబూనిన కాలుని చూచెను - (31) అపుడు పేతుడు ధ్యానమునుండి, విశుద్ధజ్ఞానప్రకాశముచే పరిశుద్ధమనస్సు గలవాడై, ఆత్మరూపమున నిత్యుడిగా స్వయంప్రకాశుడిగా నుండెను (32) ఇట్టి శ్వేతువి, మరియు కోపించిన కాలుని స్థిరమనస్పుతో చూచెను. అపుడు శ్వేతుడు విశ్చలచిత్తముతో పరమసత్యమగునది, కైవల్య సాయుజ్యమగు శివపదమును ధ్యానించుచుండెను. (33) కాలాంతకుడగు సదాశివుడు, అడ్డులేక దుర్జనుని వలె తన సమీపమునకు వచ్చు కాలుని చూచెను (34)
అట్లు నందికేశ్వరుని మధ్యనున్న కాలుని, జగదీశుడు, భక్తవత్సల బంధువగు శివుడు తన భక్తుని రక్షించుచూ మూడవకంటితో చూడగా, కాలుడు అదే క్షణంలో భస్మమాయెను (35.36) అనేక వర్ణములుగలిగి, నోరు తెరిచి, భయంకరముగా నున్న కాలుని దహించగా, ఆభువనైకభక్షకుడు జ్వాలలతో చుట్టుముట్టబడి దహింపబడెమ. (37) అపుడు దేవాదులందరూ ఆక్కడికి వచ్చి దానిని చూచిరి. (38) ఈశ్వరుని ఎదుట నిలిచి జ్వాలమాలలలో కప్పబడియున్న కాలుని, స్పృహనొందిన రాజు చూచెను. (39) అగ్నిచే దహింపబడు ఆ కాలుని చూచి వ్యగ్రుడై శ్వేతుడు కాలాగ్నివంటి రుద్రుని ప్రార్థింపసాగెను (40)
రుద్రునికి, శాంతునికి, స్వయంప్రకాశునికి, స్వయంభువునికి, ఏకమైన వావికి, సూక్ష్మునికి, జ్యోతిస్సుల పతికి నమస్సులు. (41) జగన్నాథా! నీవే రక్షకుడవు, తండ్రివి, తల్లివి, మిత్రుడివి. బాంధవుడవు. నీవే లోకముల ప్రభువు వగు పాలకుడవు. (42) శివా! నీవేమి చేసితివి? వా ఎదుట దగ్గమైన ఇతనెవడు? ఏమయినది? ఎవరేమి చేసితిరో తెలియకున్నామ’ (43) అని ప్రార్థించగా, అతని పరిదేవనమున విని శంకరుడు అతనికి తెలియజేయుచూ నిట్లనెను. (44)
‘రాజా! నీ కొరకే నీ ఎదుట నేను దహించిన ఇతను కాలుడు • జ్వాలమాలలతో చుట్టబడగా నీవు చూచితివి? (45) అని శివుడనగా విని రాజు వినయముగా ఇట్లనెను (46) పరమశివా! ఇతనాచరించిన ఆకృత్యమేమిటో వాస్తవముగా తెలియజేయుము. దేనిటే ఇతనీ మరణావస్థను పొందెను? (47) అనగా పరమేశ్వరుడిట్లనెను – ‘మహరాజా! ప్రాణులన్నీంటి భక్షకుడితము - (48) ఈ క్రూరుడు నిన్ను భక్షించుటకై ఇపుడిక్కడకు వచ్చెను - నావద్దకు వచ్చిన ఇతనిని నేను దహించితిని - (49) అనేకుల క్షేమమును, ఆందునా నీ క్షేమమును కోరుచూ దహించితిని - (50) పాపులు, ఆధర్మవర్తనులు, లోకసంహారమును చేయువారు, పాషండవాదులు నా చేత వధింపబడెదరు.' అని రుద్రుడనగా శ్వేతుడిట్లనెను. (51) ‘ఈ కాలముచేతనే లోకము పుణ్యమాచరించును - కొందరు ధర్మనిష్టులై, కొందరు భక్తిరతులై, మరికొందరు ఉపాపనారతులై, వేరేకొందరు జ్ఞానులై, కొందరు అధ్యాత్మయుక్తులై ముక్తులగుదురు - (53)
చరాచరముల హరించువాడు కాలము - అట్లే అద్వితీయుడగు పాలకుడు కూడా. అతనే ప్రాణుల సృజించువాడు - ప్రాణభూతమైన ఈ కాలమును నీవు జీవింపజేయుము - (54) నీవు సృష్టించువాడవైనచో వెంటనే కాలమును జీవింపజేయుము - సంహార భూతుడవైనచో ఈ మహాత్ముడగు కాలమును ఇట్లే చేయుము - (55) శంకరా! కాలము లేక ఏదీ జరుగదు కదా! (56) అని విన్నవించగా శివుడు భక్తుడుకోరినది చేయదలిచెను - (57) అపుడు శివుడు నవ్వి కాలమును పునరుజ్జీవింపచేసెను. పూర్వమున్న రూపముతో కాలుని బ్రతికించగా యమదూతలు మధ్యమంచుకొని కౌగిలించుకొనిరి - (58) అపుడు కొలుడు సిగ్గుతో . విలిచి వృషభద్వజుడగు శివుని స్తుతించెను - అగ్నిమయుని నమస్కరించి కాలుడు విస్మయములో విట్లనెను - (59)
అపుడు కాలుడిట్లనెను ‘కాలాంతకా! త్రిపురేశా! త్రిపురాంతకరా! ప్రభూ! మదనుడు నీచేతనేకదా అనంగుడిగా చేయబడెను! (60) ఓ జగత్పతీ! పరమాద్భుతముగా దక్షయజ్ఞమును నాశమొనర్చితివి. అట్లే ఎవరు సహించలేనిదీ, అందరినీ నాశనమొనర్చు కాలకూటమును నీవే మింగితివి - ఈ ముల్లోకములూ గొప్ప లింగముచేతనే వ్యాపింపబడినవి - (61,62) సురాసురులందరూ ‘లయించుటచే లింగ’ మని అందురు. బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలెవరూ దానీ ఆంతమును తెలియజాలరు - (63) ఆ పరమ మహిమగల దేవదేవుని మహిమను తెలియలేరు - పరమేశా! విశ్వమంగళా! విశ్వకంఠా! కపర్దీ! నీకు నమస్కారము. (64) కారణమునకే కారణమగు దేవా! మంగళమునకే మంగళస్వరూపా! జ్ఞానస్వరూపా! పురాణపురుషా! ఆదిదేవా! నీవే సర్వము, జగదేకబంధువు నీవే! వేదాంతముచే తెలియదగువాడవు! మహానుభావులచే కీర్తింపబడదగువాడవు, విశ్వేశ్వరుడవు, విశ్వపూజ్యుడవు!(65,66)
నీవీ ముల్లోకములను రక్షించుచుంటివి, సంహరించి మరల సృష్టించుచుంటివి. నీవే భూతపతివి వేరొకడు కాదు- (67) అని కాలుడు జగదీశ్వరుడగు శివుని స్తుతించి రాజగు శ్వేతునితో నిట్లనెను - (68) ‘ముల్లోకములలో జయింపబడని దేవుని నీవు జయించితివి - నీతో సముడు మనుష్యలోకమున వేరొకడు లేడు - (69) చరాచరజగత్తును నేను నశింపజేసితిని. దేవతలందరికీ విజేతనగు నేను అందరికీ దురతిక్రముడను - (70) అట్టి నేను నీ అనుచరుడినైతిని. దేవదేవుడు, పరమేష్ఠియగు శివుని నుండి నాకభయము నిమ్ము.’ (71) అని కాలుడనగా నవ్వుచూ శ్వేతుడు మేఘగంభీర ధ్వనితో ఇట్లనెను (72)
నిస్సంశయముగా నీవు శివుని పరమరూపానివి. ప్రాణుల స్థితి సంహారరూపము గల వానిని. (73) కనుక, పూజ్యతముడవు, అందరిని నియమించువాడవు. నీభయమువలననే పుణ్యాత్ములు ఆత్మలక్షణతత్పరులై వివిధ భావములతో పరమేశ్వరుని శరణుజొచ్చెదరు. (74)
సూతుడిట్లు చెప్పెను - పరమధర్మాత్ముడగు రాజుచే శివుని ప్రసాదమాత్రమున రక్షింపబడిన కాలుడు పుహమ పొందిన వాడాయెను - (75) అపుడు యముడు తన దూతలచే శివస్తుతిని చేయించి, తానూ నమస్కరించి, శ్వేతుడమ రాజుకు నమస్కరించి తన నివాసమునకు వెళ్ళెను - విప్రులారా! మరల తనకు జన్మయనీయే చింతించెను- (76) మాయయను తన పత్నీలో శివుని చరితమును మరల మరల స్మరించుచూ పరమవిస్మయమును పొందెను - (77) తానే స్వయముగా ఈ ఉదంతమును దూతలందరికీ చెప్పెను - దూతలారా! త్వరగా నా మాట విని తప్పక ఆచరించుడు నా మాట వేరొక విధముగ కాదు - (78,79)
కాలుడు చెప్పెనుః త్రిపుండ్రములను, జటలను, రుద్రాక్షలను ధరించి, శివనామములను గలవారినీ, (80) జీవించుటకై గానీ, భయముతో గాని మానవులు ఎవరైనా, దురాచారులు పాపులైననూ. శివవేషమును ధరించినచో వారినీ, (81) మీరు నా లోకమునకు తీసికొని రాకూడదు - వారు పాపులైననూ ఎల్లప్పుడూ వారిని విడిచివేయవలెను(82)
ఇక ఎల్లప్పుడూ సదాశివుని అర్చించువారిని గూర్చి చెప్పునదేమి? పరమభక్తితో శివుని అర్చించువారు నిస్సంశయముగా రుద్రులే - (83) రుద్రాక్షను శిరస్సుపై ధరించువాడు, లలాట మధ్యభాగమున త్రిపుండ్రమును ధరించువాడు, పంచాక్షరిని జపించు సాధువులు మీకు పూజ్యులు - వేరొకవిధముగా కాదు (84) ఏ రాష్ట్రమున గానీ, దేశమున గానీ, గ్రామమున గానీ విచక్షణుడగు శివభక్తుడు కనిపించడో, ఆ రాష్ట్రము, దేశము స్మశానముకంటే విశేషమగునా? మీకు సత్యము చెప్పుచుంటిని (85) శివభక్తులు లేని గ్రామంలోని జనులను నిత్యము శాసించ వలెను - సంశయము లేదు’ (86) అని యముడు తన కింకరులను ఆజ్ఞాపించగా వారందరూ అలాగేనని విస్మయముతో మిన్నకుండిరి (87) ఇట్టి వాడు రుద్రుడు. భువనములన్నిటి పాలకుడు, సదాశివుడు, లోకగురువు, అద్వితీయుడు, దాత, శాసకుడు, ఆత్మభావయుక్తుడు, సనాతనుడు, జగద్బంధువు - (88) ఇక మహాదేవుడు కాలుని దహించి మహారాజగు శ్వేతునికి అభయము నిచ్చెను (89)
అపుడు నిర్భయమును పొందిన స్వతుడను బుద్ధిమంతుడగు రాజు నిశ్చయముతో పరమభక్తితో ముక్తిని పొందెను (90) అపుడు దేవతలు, ఋషులు, పన్నగులు, తనను పూజించుచుండగా, రాజులలో శ్రేష్ఠుడగు ్వతుడు శివసాయుజ్యమును పొందెను.(91)
ఇట్లు జగద్గురువగు మహేశుని యందు భక్తి గలవారికి సిద్ది కరతలముననే వుండును. మీకు సత్యమును చెప్పుచుంటివి - (92) శంకరుని అమగ్రహము వలన చండాలుడైననూ శ్రేష్టుడగును కనుక ప్రయత్నముచే శంకరుని పూజించవలెను. (93) పెక్కు జన్మల చివర శివభక్తి కలుగును. (94) వేను ఎక్కువ చెప్పి లాభమేమి? జ్ఞానులు నిశ్చితబుద్దిలో ప్రతిజన్మలోనూ శివుని పూజింపవలేను - (95) ఈ సందర్భముగా కిరాతుడొకడాచరించిన పరమాద్భుతవ్రతమును, దానిచే చరాచరజగత్తంతా తరింపబడుటనూ చెప్పు పురాతనమగు ఇతిహాసమును ఉదాహరింతురు. (96)
ఇది శ్రీస్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండము నందలి కేదారఖండమున వతరాజచరితయందు శివభక్తిప్రభావముచే కాలుడు దహింపబడు వృత్తాంతమును వర్ణించుటయను ముప్పది రెండవ అధ్యాయము.
