స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
30వ అధ్యాయము
పరమమతీమంతుడగు ఇంద్రుడు తనపైకి దూకి వచ్చిపడుచున్న తారకాసురుని తన వజ్రముతో బలముగా కొట్టెను(1) ఆ దెబ్బతో తారకుడు చేష్టలుడిగి క్రిందపడిననూ, మరలలేచి శక్తితో ఐరావతమునుకొట్టెను (2) అపుడా ఏనుగుపైనుండి ఇంద్రుడు క్రిందపడగా దేవతలు పెద్దగా హాహాకారములు చేసిరి- (3) ఇక లారకుడు కూడా ఏమి చేసేవో చెప్పిదమ, విమము. క్రిందపడిన ఇంద్రుని చేరి వజ్రాన్ని లాగికొని ముందే దెబ్బతినిన అతనిని మరల కోటపాగెను. (45) అపుడు మహాబలుడగు వీరభద్రుడు ఇంద్రుని రక్షింపదలచి కోపముతో త్రిశూలమునెత్తి తారకుని కొట్టెను- (6) ఆ శూలము తగిలి తారకుడు క్రిందపడి, మరల లేచెను- (7) పరమశక్తితో వీరభద్రుని వక్షస్థలముపై కొట్టగా వీరభద్రుడు కిందపడెను. (8) అపుడు దేవగణములు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మరల మరల పెద్దగా హాహాకారములు చేసిరి. (9)
అపుడు పైకిలేచిన వీరభద్రుడు, శత్రునాశకుడు మెరుపుతీగవలె మెరియుచున్న త్రిశూలమునెత్తివచ్చెను. ఆది నిరంతర కాంతితో వెలుగుచుండెను. ఆ కాంతితో దిక్కులు ప్రకాశించునట్లు చేసెను సూర్యచంద్రుల, అగ్ని, నక్షత్రాల కాంతీ దానిది. (10) ఆ త్రిశూలముతో తారకుని దెబ్బతీయబోగా కుమారుడు కొట్టవద్దని వారించెను- (11) అపుడు మహాబలుడగు కార్తికేయుడు గర్జించెను. (12) అపుడు ఆకాశమున నున్న భూతములు జయమునొందుమవినవి- పరమశక్తిని దాల్చి తారకుని వధించుటకు సిద్దపడెను- (13) వారిద్దరి మధ్య యుద్ధము అందరికీ భయము గొల్పుచూ నోరముగా మండెను- (14) ఇద్దరూ శక్తిని దాల్చి యుద్దము చేయుచూ, ఆయుధములచే చేతులు గాయపడినవారైరి. (15) సింహములవలె ఒకరినొకరు దెబ్బతీయుచుండిరి-ఖేచరమైన నెలాళికగతి వాశ్రయించి, పర్వతగతివాశ్రయించి ఆయుధములతో కొట్టుకొమచుండిరి. (16)వారి యుద్దము ఉత్తమముగా నుండెను (17) మహాబలపరాక్రమములతో ఒకరినోకరుపాధించువారైయుద్దమువయుద్ధమెళకువలు తెలిసి ఆయుధములతో కొట్టుకొనుచుండిరి(18) ఒకరినొకరు అపుడు తలపై, కంఠముపై, చేతులపై, మోకాళ్ళపై, వడుముపై, ఎదపై, వీపుపై అనేకచోట్ల గాయముచేసుకొనిరి.(19)
ఆ విధంగా వారు ఒకరినొకరు వధించదలిచి యుద్ధము చేయుచుండగా దేవతలు, గంధర్వులు, గుహ్యకులు ప్రేక్షకులైరి. (20) ఎవరుజయించునో యని వారమకుంటూవుండగా వారిని ఓదార్చుచూఆకాశవాణి ఇట్లనెమ. (21) దేవతలారా! నేడు తారకుని కుమారుడు వధించుమ- శోకమునొందక, సుఖముగా స్వర్గమున మండుడు-‘ (22) అవగా విని ప్రమధులలో మన్న కుమారుడు ఉగ్రరూపుడైన తారకుని వధించగోరేమ- (23) మహాబాహువగు కుమారుడు అసురశ్రేష్ఠుడైన తారకుని ఎదశక్తిలో గట్టిగా కొట్టిన. (24) కావి, తారకుడు దానిని లెక్కించక కుమారుని కోపముతో కొట్టెమ. (ఐ) ఆ దెబ్బతో కుమారుడు మూర్చనొంది, క్షణములో పుహనొందెమ. అపుడు మహార్పులు అతనిని స్తుతించిరి. (26) మదించిన పింహము వధించునట్లే కుమారుడు లొరకుని దెబ్బతిపెమ(27) ఈ విధముగా కుమారుడు, తారకుడు శక్తియుద్ధపరాయణులై భయంకరముగా యుద్ధము చేయసాగిరి(28)
ఒకరినొకరు జయింపగోరి చిత్రరూపమున అభ్యాపపరములై యుద్ధము చేయుచుండిరి. (29) వారు వివిధాయుధములతో కొట్టుకొమచుండగాదేవాదులు చూచువారైరి. (30) అమిత విస్మయమునొంది మిన్నకుండిరి-అపుడు వాయువు ఏచలేదు, సూర్యుడు కాంతిలేనివాడాయెను- హిమాలయము, మేరువు, కేతకూటము, మలయ, మైనాక, వింధ్యపర్వతములు (32) మరియు లోకాలోక పర్వతములు, మావపమువకుత్తరమువమన్నది, కైలాపము, మందరము, మాల్యము, గంధ మాదనము, ఉదయాస్తమయ పర్వతములు, ఇతర పర్వతములు కుమారుని చేరినవి. (35) భయమునొందియున్న వానిని చూచి కుమారుడు, జ్ఞానము గరుపుచూ ఇట్లనెను - (36) ‘మహానుభావులారా! చింతించకుడు- ఈ పాపిష్టుని నేను అందరు చూచుచుండగా వధించెదను-’ (37) అని ఊరడించి, మనసులో శివుని, తల్లిని నమస్కరించెను- (38) వెంటనే కుమారుడు శక్తితో తారకుని తలమ ఖండించెను- ఆది క్షణములో నేలపై పడెను- ఇట్లు కార్తికేయుడుజయముమపొందెను- (39)
ఋషులు, సురగణములు, గుహ్యకులు, ఆకాశచారులు, కిన్నరులు, చారణులు, సర్పములు అప్పర గణములు కుమారస్వామిని చూచినవి. (40) గొప్ప సంతోషమునుపొంది ఆతనిని స్తుతించెను - విద్యాధరులు నర్తించిరి, గాయకులు గానముచేసిరి. (41) ఇట్లు విజయాన్ని పొందిన కుమారుని చూచి అందరూ ఆనందముతో నుండగా, పార్వతి హర్హముతో అక్కడకు వచ్చి, కుమారుని ఒడిలో నుంచుకొని, (42) గాఢముగా కౌగలించుకొని సంతోషించెను. సూర్యునివలె నున్న కుమారుని ఒడిలో నుంచుకొని పార్వతి లాలించెను. (43) అపుడు ఋషులు పార్వతితో శివుని సత్కరించిరి. (44) మితభాషిణియగు పార్వతి ఆర్యాసనమునజేరి, మునులు సిద్దచారణనాగులచే స్తుతింపబడుచూ మిగుల శోభించెను- (45) దేవతలు పార్వతితోనున్న శివునికి నీరాజనమివ్వగా కుమారునితో నున్న పార్వతి మిగుల శోభిల్లెను. (46) అపుడు హిమాలయుడక్కడకు వచ్చి మేర్వాది పర్వతములచే స్తుతింపబడెను- (47) అపుడు ఇంద్రాది దేవగణములు, ఋషులతో పుష్పవర్హమును కురిపించి, కుమారస్వామిని ఎదుట నిలుపుకొని నీరాజనమిచ్చిరి (48)
గీత వాద్యముల నోషతో, వేదవేత్తల వేదఘోషతో, వివిధ సూక్తములతో స్తుతింపబడిన కుమారస్వామి మిగుల ప్రకాశించేమ(49) ఇది కుమారవిజయమను పరమాద్భుతమగు చరిత్రము, అన్ని పాపముల హరించు ఈదివ్య చరితము మానవుల కోరికలనన్నింటినీ దీర్చును. (50) శుచిలో ఏ నరుల్ అనస్తరూపుని జరామరణములు లేని కుమారుని కీర్తింతురో వారు అమితభాగ్యమును పొందెదరు. ఈ కుమారస్వామి మాహాత్మ్యము ఉదారమైనది, ఆనందమును, అర్థమును కలిగించునది- (51) ఈ కుమారమాహాత్మ్యమున, తారకచరితమనుదానివి చదివివమా, విన్నమా అన్ని పాపములు తొలిగిపోవుము -
ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమందలి కేదారఖండమున శివశాస్త్రమున తారకాసురవధ మరియు కార్తికేయస్వామి విజయోత్సవవర్ణనము అను ముప్పదియవ అధ్యాయము.
