స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

34వ అధ్యాయము

లోమశుడు చెప్పసాగెను- దేవదేవుడు, జగత్పతియగు శివుడు వీరభద్రునితో ఇతర గణములతో కూడి కైలాసమున రాజ్యము చేసెను-(1) ఇంద్రాది దేవతలతో ఋషులతో కలిసివుండగా బ్రహ్మ అతనికి స్తుతిపరుడై యుండెను. విష్ణువు వలెనుండెను.(2) దేవగణములలో ఇంద్రుడు సేవచేయువాడైయుండెను. చంద్రుడు ఛత్రమును, వాయువు, చామరమును ధరించియుండిరి.(3) అగ్ని నిరంతరము అన్నమును, సూపమును చేయువాడై యుండెను- గంధర్వులు శివుని స్తుతించు గాయకులై యుండిరి.(4) విద్యాధరులు, అప్సరసల గణాలు శివుని ఎదుట నర్తించిరి- అట్టి శివుడు కైలాసపర్వతమున గిరిజతో, గణేశకుమారస్వాములతో ఏ శంకా లేక ప్రతాపవంతులతో రాజ్యమును చేయసాగెను.(5,6) ఎవరిచే దేవతల శత్రువగు మహాదైత్యుడు అంధకుడు త్రిశూలముచే కొట్టబడి ఆకాశమున చిరకాలముంచబడెనో(7) ఎవరిచే గజాసురుడు చంపబడి, అతని చర్మము చాలాకాలముగా వస్త్రముగా చేసుకొనబడెనో, ఏ ప్రావరణము మూడు పురములను ప్రకాశింపజేయునదో అట్టి శివుడు భూతములను పాలించు విష్ణువుతో సర్వాంగసుందరుడై విలసిల్లెను.(8)

దివ్యమగు దర్శనముగల నారదుడు శివుని దర్శించగోరి చంద్రుని వలె తెల్లనైన కైలాసమను పర్వతశ్రేష్ఠమునకు వెళ్ళాను.(9) అమృతముతో సేవింపబడుచున్న ఆ కైలాసము కర్పూరమువలె తెల్లగా అద్భుతముగా నుండుట జూచి నారదుడు విస్మయములో గంధమాదనమునకు వెళ్ళెను.(10) అది అనేకాశ్చర్యములతో, గానము చేయు విద్యాధరస్త్రీలతో నుండి గొప్ప కాంతితో నుండెను.(11) కల్పవృక్షములు పెక్కు లతలతో కూడుకొని యుండెను. వావి దట్టమైవ నీడలో విభీష్టమగు కామధేనువులుండెను.(12) పారిజాత వన సుగంధమును పొందు లాలసతో పెక్కు తుమ్మెదలు తిరుగుచుండెను - సరస్సులయందు పెక్కు కలహంపలు క్రీడించుచుండెను.(13) నెమళ్ళు ఆనందములో గొప్పదైన కేకారవమును చేయుచుండెను. మదించిన పక్షులు పంచమ స్వరమున ఆలాపించుచుండెను.(14) చక్కని కాంతిగల ఏనుగులు ఆడేనుగులతో ఆనందించుచుండెను. సింహములు గర్జించుచుండెను.(15) వంది మొదలగు వృషభములు నిరంతరము రంభారవములు చేయుచుండెమ. దేవద్రుమాలు, చందన వాటికలు అనేకములు అక్కడ వుండెను.(16) నాగ, పున్నాగ, వకుల, చంపక, నాగకేసర, నేరేడి బంగారు కేతక వృక్షములనేకములుండెను.(17)

కల్హారములు, కరవీరములు, కుముదములు, మందర, రేగి, కముక, పాటల వృక్షములు (18) మరియు అనేక వృక్షములు శివునకానందము కలిగించునవై యుండెను. అనేక వృక్షములు, లతలతో ఆరామములు ఒక్కమారుగా రెండింతలై కనబడుచూ విలసిల్లెను.(19) ఆకాశము నుండి జాలువారిన పరమాద్బుతమగు గంగాప్రవాహము శోభిల్లు పర్వత శిఖరముపై పడెను.(20) ఆ నీటి నెలవుచే జగత్తు పవిత్రము చేయబడెను. నారదుడు అదికూడా రెండుగా నుండుటను చూచెను.(21) ఆ విధముగా ప్రతిదీ రెండుగా కనబడెను. బ్రాహ్మణులారా! ఈ విధముగా నారదుడు చూచుచుండెను.(23) ద్వారము వద్ద నిలబడి చూడగా గొప్ప ఆశ్చర్యమును కలిగించు కృత్రిమ ద్వారపాలకులిద్దరు విశ్వకర్మచే చేయబడి అక్కడ కనబడిరి.(24) భ్రమనొందిన నారదుడు వారిని ఇట్లడిగెను. శివుని చూడగోరి నేను ప్రవేశించగోరుచున్నాను.(5) కనుక నాకు శివుని చూచుటకు అనుమతినివ్వవలెను. అనగా వారు వివకుండుటను చూచి నారదుడు విస్మయమును పొందెను.

తరువాత జ్ఞానదృష్టితో చూచి మిన్నకుండిను- వారు కృత్రిమ విగ్రహములని తెలిపి లోనికి వెళ్ళమ- (27) అక్కడ విజ్ఞుడగు వారదునికి అలాంటి రూపము గల వారు కనబడిరి. వారు ఋషికి వమస్కరించిరి.(28) ఇట్టి అనేక ఆశ్చర్యములను చూచి, చివరకు. సువ్యక్తముగా గిరిజతో కూడిన శివుని చూచెను.(29) శంకరుని అర్ధాపనమువ, ముల్లోకముల వ్యాపించిన పార్వతి యుండెను.(30) పార్వతి చల్లని చూపులతో, చక్కని శరీరములో మండెను. అట్టి గౌరినే కదా శివుడు రూపవంతుడిగా గ్రహింపయోగ్యునిగ చేయబడివాడు.(31) విర్వికారుడైననూ పెక్కు వికారములతో వికలముగా చేయబడిమ. శివుడా పార్వతి ఆర్ధాంగమున మండుటమ చూచేమ.(32). అపుడు నారదుడు ముల్లోకములకు ప్రభువగు శివుని చూచెను. అపుడు శివుడు స్వచ్చమగు బంగారు వర్ణములో నుండి దేవదానవులచే పూజింపబడుచుండెను.(33) పర్పష్టుడగు శంఖుడమ వాడు శివుని పాదకమలములనర్చించుచుండెను. ధృతరాష్ట్రుడు, తక్షకుడు, పద్ముడు, శేషుడు (34) మరియు ఇతర పర్పరాజులతవి ఎల్లప్పుడూ సేవించుచుండెను. వాసుకి కంఠమునకు చుట్టుకొని సదాశివునికి హారమాయెను.(35)

కంబళ అశ్వతరములు ఎల్లప్పుడూ చెవికి అలంకరణములాయేమ. ఇతర శ్రేష్ఠసర్పములు జటామూలమున నుండెను.(36) అనేక జాతులకు, వర్ణములకు చెందిన తక్షక, కులిక, శంఖ, ధృతరాష్ట్ర పద్మ, దంభ, సుదంభ, కరాళ, మరియు ఇతర విష సర్పములు (37, 38) ముల్లోకములయందు పూజ్యుడగు శివునికి అంగములాయెను. మరికొన్ని ఒక పడగచే శోభిల్లుచుండెను.(39) . కొన్ని రెండు పడగలతో, మరికొన్ని మూడింటితో, కొన్ని నాలుగు, కొన్ని ఐదు, మరికొన్ని ఆరు, కొన్ని ఏడు, కొన్ని ఎనిమిదీ పడగలను కలిగియుండెను.(40) కొన్ని తొమ్మిది, కొన్ని పది, కొన్ని పదకొండు, మరికొన్ని పన్నెండు, కొన్ని పద్దెనిమిది, కొన్ని పంతొమ్మిది పడగలతో నుండెను.(41) వలభై పడగలతో కొన్ని, యాభై పడగలతో కొన్ని, ఆరవై పడగలతో కొన్ని వుండగా, కొన్ని డెబై, కొన్ని ఎవభై, కొన్ని తొంభై పడగలమ కలిగివుండెను.(42) అట్లే వంద, వెయ్యి. పదివేలు, లక్ష, అర్బుద, రత్న, శంఖ, అనంత సంఖ్యలలో పడగలతో పర్పములు శివుని కాభరణములై యుండుటను మహాత్ముడగు నారదుడు చూచెను.(43,44)

విద్యావంతులై ఆ సర్పములు శోభిల్లుచుండి గొప్ప కాంతిగల మణులతో హారములు, భూషణములైనవి.(45) తలపై అర్ధచంద్రునితో నుదురుపై మూడవ కంటిలో పరమశివుడు మిగుల సుందరముగా నుండెను.(47) వక్షస్థలము, జఘనము విశాలముగామండి, పాదములు గొప్ప కాంతితో రాజిల్లుచుండెను.(48), ఆ చరణముల రెంటిని చూచెను. ఆది పాటిలేనిది. తేజస్సు కలిగి సంధ్యారాగ కాంతిలో మంగళమై తాపమును తొలగించు పదద్వయము తేజస్పును కలిగించునది, పరాత్పరము, లావణ్యలీలకు నెలవు, అందరికీ సుఖమును వర్థిల్ల చేయునది. పరమ పవిత్రమగు శివుని పదద్వయమది.(49) అట్లు చూచే సుందరి, సతియగు పార్వతి సౌభాగ్యలావణ్యములచే, మహా ఐశ్యర్యముచే విరాజిల్లు చున్నది.(50) భగవంతునికి ప్రియుడగు నారదుడు భేదము లేకున్ననూ భిన్నమై, గుణములు లేకున్ననూ గుణముల పొందిన వారిని, ఆకారములు లేకున్ననూ ఆకారముల ధరించు పార్వతీ పరమేశ్వరులను ముల్లోకముల విరాజిల్లుచుండగా చూచెను.(51) వారు ఆతంకములు లేక, సుఖమమునిచ్చువారు అట్టి వారికి సంతోషముతో నమస్కరించి, నారదుడు మరల మరల లేచి స్తుతించెను.(52)

నారదుడనెను- ‘దేవతలారా! పరాత్పరులైన మీకు నమస్కరించుచున్నాను - చరాచరమునకు బీజమైన దంపతులను విరాజిల్లుచుండగా చూచితిని.(53) నేడే మిమ్ము సర్వలోకమునకు తల్లిదండ్రులుగా తెలిసితిని. సందేహములేదు. మీకృప యట్టిది.’ (54) అని నారదుడు స్తుతించగా పార్వతితో సహా శివుడు సంతోషించెను.(55) అపుడు మహాదేవుడగు శివుడిట్లనెను. బ్రహ్మర్టీకి సుఖముగా నుంటిరా? మీకు కార్యము చేయగలన నేను?' అనగా నారదుడిట్లనెను. నేడు మీ దర్శనము కలుగగా సంతోషించితిని. దర్శనమాత్రాన సర్వము నాకు చెందినదే అగును దేవా! సందేహము లేదు.(57) కేవలము క్రీడకై ఈ కైలాసమునకు వచ్చితిని. భగవాన్! నీవే మానవులందరి హృదయమున నుండువాడవు.(58) అయిననూ ప్రాణులకెల్లప్పుడూ దర్శనము భావించతగినదే కదా! (59) అనగా పార్వతి అనెను. ఏక్రీడనాలోచించితివి. త్వరగా నా ఎదుట చెప్పుము.’ అనగా విని నవ్వుచూ నారదుడిట్లనెను.(60) ‘మహాదేవి! ఇక్కడ జూదము అనేక రీతుల కనబడుచున్నది. ఇద్దరు జూదమాడుచుండగా ఆనందించిన గొప్ప సుఖము కలుగును, అవి మిన్నకుండిన వారదుని చూచి కోపించి పార్వతి అతనితో నిట్లనెను.(61)

అభిమానవంతులు గర్షించు ద్యూతమును నీవెటైజిగెదవు?(62) నీవు బ్రహ్మపుత్రుడవు, మునివి, జ్ఞానుల శాసకుడివి, వివిధ ప్రసిద్ధ వాక్యములతో ముల్లోకముల చరించు నీకంటే గొప్ప మనస్వి లేడు.’(63) అనగా దివ్యదర్శనుడైన నారదుడు నవ్వుతూ శివుని వద్ద పార్వతితో నిట్లనెను.(64) నాకు ద్యూతము తెలియదు. ఆశ్రయించను కూడా. నేను తపస్సు చేసుకొను వాడిని, శివుని అనుచరుడిని. రాజకవ్యా! పరమయోగీశ్వరుని నన్ను అడిగేదవెందులకు?’(65) అనగా విని నవ్వి పార్వతి ‘నీకంతా తెలుసు. నీ ఎదుట ఈశ్వరునితో నేనాడెదను చూడుము? (66) అని పాచికలను తీసికొనెను. నారదమహర్షిని సాక్షిగా చేసి శివునితో పార్వతి ద్యూతక్రీడ నాడసాగేను.(67) మనస్వియగు నారదుడు పార్వతీపరమేశ్వరులట్లు క్రీడలో ముమగుట చూచి విస్మయముతో కళ్ళు విప్పారగా చూచి బాగా సంతోషించెను.(68) . అపుడు ద్యూతపరురాలై పార్వతి చెలులతో కలిపి మోపములో ద్యూతమునాడెను.(69) శివుడు పందెమును కూడా ఒడ్డాను. కాని మోసమున బడి పార్వతియే ఓడిపోయెను.(70)

శివుని చేతిలో పార్వతి ఓడిపోవుటను చూచి నారదుడు పరిహసించుచుండగా, విని (71) అతని పరుషమైన పరిహాసవాక్కులకు మిక్కిలి కోపించిన పార్వతి అతనికి బదులిచ్చి ఆర్థచంద్రకముమ ఇచ్చింది.(72) అట్లే సుందరమైన రెండు శిరోమణులమ ఇచ్చివేసింది. అపుడామె ముఖము కోపముతో మరింత మందరమైనది. అది చూచి శివుడు మరల ద్యూతక్రీడనారంభించెను.(73) అంతట పార్వతి లోకపవిత్రుడగు శంకరునితో ఓడిపోయినందుచేతనే నేమ పందెము నిచ్చివేసితిని. శంకరా! ఇక నీవు దేనిని పందెమున ఒడ్డదవో చెప్పుము’ అనెను.(74) అపుడు త్రిలోచనడు నవ్వుచూ పార్వతితో ఇట్లనెను.(75) ‘పార్వతీ! ఇదిగో, వీకోసం నేను ఈ ఆభరణాన్ని , చంద్రలేఖను, హారమును, కర్ణభూషణముల రెంటిని పణముగా పెట్టుచుంటిని.(76) నన్ను జయించి సుఖముగా దీనిని తీసుకొమము.’ అనెను. అంతట ద్యూతము పార్వతీపరమేశ్వరుల మధ్య కొనసాగెను.(77) ఈ విధంగా పాచికలాటలో నేర్పరులైన వారిద్దరూ ఆడసాగిరి. కొంతసేపటికి శివుని పార్వతి జయించెను.(78) అపుడు పార్వతి నవ్వుచూ ‘ఓడిపోతివి కదా! ఒడ్డిన పణమును నాకు ఇచ్చివేయుము’ అనెను.(79) అపుడు శంకరుడు నవ్వుతూ. సత్యమువిట్లు పలికెను.

‘వాస్తవముగా గమనించినచో నేమ ఓడిపోలేదు.(80) సాధ్వీ! నేను ప్రాణులచే జయింపబడని వానిని కాన అట్లు మాట్లాడరాదు. ఇపుడు నీకు ఇష్టమైన రీతిలో ఆడుము. నేనే గెలిచెదను చూడుము.’(81) అనగా భర్తతో పార్వతి ఇట్లనెమ. ‘నా చేతిలో వేడు నీవు ఓడిపోయావు. ఆశ్చర్యమేమి?’ అని శివుని చేతిని పట్టుకొని సందేహం లేదు ఓడిపోయావు. నీకు తెలియదు’ (82) అని గిరిజ నర్మగర్భమగు మాటలతో నవ్వతూ శివుని దెప్పిపొడిచెను- ‘మదనాంతకా! నీవు మాటిచ్చిన పణమును నాకు ఇచ్చివేయువు.’ (83) అనగా శివుడు ఇట్లనెను. ‘విశాలాక్షీ! నేను అజేయుడను. సంశయము లేదు. అహంకారముతో వీవనిన దానిని యథార్థముగా తరచిచూడుము’ - (84) అనగా నవ్వి గౌరి శివునితో నిట్లనెను. ప్రభూ! నీవు అందరికీ అజేయుడవగు మహాదేవుడినే. నేడు నా చేతమాత్రమే ఓడితివి. ఇది స్వచ్ఛమగు కపటము లేని ద్యూతక్రీడ- ఇపుడిక కార్యాకార్యములను ఏమాత్రమూ తెలియలేకపోవుచున్నావు.(85,86) అని ఆ దంపతులగు పార్వతీపరమేశ్వరులిద్దరూ వాదించుకొనుచుండగా ఋషిపత్తముడగు వారదుడు నవ్వుచూ ఇట్లనెమ.(87)

‘కర్ణాంతమువరకూ విశాలమగు వేత్రములు గల పార్వతి విమము. ఈ మాట జగత్తుకు మంగళము చేకూర్చువదిమహాభాగ్యవంతులలో గొప్పవాడగు మహదేవుని జయించితివా? అబద్దమును పలుకుచుంటివి.(88) దేవతలకి పరమ గురువగు మహాదేవుడు బయింపబడనివాడు- రూపములేనివాడు, రూపము దాల్చువాడు - రూపములకు అతీతుడు.(89) అతనే పరమజ్యోతి జ్యోతిస్సుల ఉత్సవరూపుడు-ముల్లోకముల కధిపతి, విశ్వరూపుడీ శంకరుడు.(90) ముల్లోకములలో అజేయుడగు ఇతమ ఏ చేత ఎట్లు జయింపబడెను? స్త్రీ భావముచేత శివుని ఈ విధముగా తెలియజాలకుంటివి.’(91) అవి వారదుడవగా పార్వతి మిగుల కోపించి మాత్పర్యముతో ఆక్షేపించుచూ ఇట్లనెమ.(92) బ్రహ్మపుత్రా! చపలత్వముతో అట్లు పలుకరాదు. మీకు దండము. వీవంటేనే భయము కలుగుచున్నది. మీకు శుభమగుగాక! అయ్యా, మౌనముగా మండుము.(93) దేవర్షి! ఏదో శివుడి గూర్చి అధికముగా పలికితివి కదా! వా ప్రసాదము చేతనే శివుడనబడువాడు ఈ్వరుడైపోడు.(94) వా చేతనే అతను ప్రతిపకొందివాడుపందేహములేదు.(95) అవి అనేక విధములుగా పలుకగా వివి వారదుడు మౌనమునాశ్రయించమ. ఆ పరిస్థితిని చూచి భృంగి ఇట్లనెమ.(96)

‘మరొక్కమారు అధికముగా మాట్లాడరాదు. భామినీ! వా స్వామి అజేయుడు. నిర్వికారుడు కూడా!(9) క్రీ భావముతో కూడుకొని వీవు పరాత్పరుడగు మహాదేవుని తెలియజాలకున్నావు. పూర్వము మన్మథుని ముందుంచుకొని కదా వీవు శివుని చేరుకొనినది.(98) అప్పుడతనేమి చేసెనో గుర్తున్నదా చెప్పుము. మన్మథుని ఆవంగుని చేసి మీ తండ్రి పామవద్గిరికి చెందిన వనమును దగ్గము చేయలేదా?(99) ఆంతవరకు వీవీ పరాత్పరుడిని ఆరాధించితివి కదా!’ (100) అని భృంగి అనగా కోపించిన పార్వతి శివుడు వినుచుండగనే ఇట్లనెను.(101) ‘ఓయీ భృంగీ! పక్షపాతముతో నీవట్లంటివి. మూడుడా! శివప్రియుడి కనకనే భేదబుద్ధి నీకు.(102) నేమ శివుడిని. శివుడు నిత్యము నాయందుండును. వాగ్బలముతో నీవు శివపార్వతుల భేదముమ ఎట్లు పలికితివి?’(103) అవి శుభమగు మాటమ పార్వతియనగా విని భృంగి కోపించి శివువిచేంత ఆమెతో విట్లనెను.(104) ‘తండ్రియగు దక్షుని యజమున శివనిందను విని, అప్రియమును విమటచే వెంటనే శరీరమును విడిచితివి.(105) ఇపుడేమి చేయుచున్నావు? పంభ్రమము వలన ఇది శివనిందయని తెలియకున్నావు (106) నీవా పర్వతశ్రేష్టువికెట్లు జన్మించితివి? ఎట్లా హారలోపమువాచరించితివి?(107)

పూర్వము శివునియందున్న భక్తి వీకిపుడు లేదు. శివుని కిష్టురాలవని నీకిట్లు చెప్పుచున్నాను.(108) మూడు లోకములలోనూ శివుని కంటే పరమైనది లేదు. సుందరీ! నీవు శివుని యందు భక్తిని చూపుము.(109) నీవు భక్తురాలవు, భాగ్యవంతులలో శ్రేష్ఠురాలవు. తపస్సుచే పొందిన శివుని ఎలాగైనా సేవించుము.(10) అన్ని ప్రాణులకూ నియామకుడగు శివుని సేవించుట తప్ప వేరొకటి చేయరాదు నీవు.’ అని భృంగి యనగా విని గిరిజ అతనితో నిట్లనెను.(111) ‘ఓరీ భృంగీ! మౌనంగానైనా నిలువుము లేదా వెళ్ళిపొమ్ము. వాచ్యావాచ్యము తెలియక పిశాచము వలె మాటాడుచుంటివేమి?(112) ఏ తపస్సుచేత శివుడు గొనితేబడెను? ఎవరిచేత? నేనే శివుడిని. నేనెవరు? నీవెజిగిన అతనెవరు? భేదబుద్ధితో నీవు పలుకుచుంటివి.(113) నీవెవరు? దేనితో కూడితివి? అధికముగా ఎందుకు మాటాడుచుంటివి? నీకు శాపమిచ్చెదను. ఈ నాడీ శీవుడేమి చేయునో!(114) అని పార్వతి భృంగి పలుకులమ తిరస్కరించి ఇట్లు శపించెను. ‘మూర్ఖుడా! శంకరప్రియా! భృంగీ! నీవు నిర్మాంసుడివి కమ్ము’. అని ఆ సుందరప్రియగు పార్వతి కోపముతో శంకరుని చేతిని పట్టుకొని వాసుకిని మరియు ఇతర ఆభరణములను కంఠమునుండి వలుచుకొనెను.(117)

కోపించిన పార్వతిత్వరగా శివుని భూషణములను తీసుకొమ. చంద్రకళమ, ఉత్తమమైన గజాజీవముమహరించమ.(118) కంబళాశ్వతరమమ సర్పములు కూడా ఆమె ఛలోక్తిలో తీసికొవబడిన.(119) అలాగే చలోక్తులలో వవ్వుచువాదమమున కూడా లాగివేయగా గణములు, పార్వతి సఖులు సిగ్గుతో పీడింపబడినవారైరి.(120) వారు మరియు భృంగి చండ, ముండ, మమాలోమ, మహోదర మొదలగు గణములన్నీ ముఖము త్రిప్పుకొని దుఃఖముతో మండిరి. అట్టి వారిని చూచి ఈరుడు కూడా సిగ్గుపడేమ.(122) అపుడు రోషముతో శంకరుడు పార్వతీమద్దేశించి ఇట్లనెమ.(123) ‘ఋషులందరూ ఉపహాపము చేయుచున్నారు. అట్లే బ్రహ్మ, విష్ణువు, ఈ చంద్రరేఖ కూడా. (124) వీరంతా ఉపహసించుచున్నారు. విదేమి చేపితివి? ఉన్నతకులమున జన్మించిన వీఏవిధముగా ఎట్లు చేయగలవు? (125) వీవు వమ్న జయించునట్లు వాస్తవముగా తెలియుదునేవి ఇట్లు చేయుము. కౌపీనము మాత్రము ఇచ్చివేయుము. వేరొక రీతిగా చేయరాదు’(126) అవి యోగియగు శివుడవగా వని సుందరియగు పార్వతి ఇట్లనెమ.(127)

‘ఆత్మజ్ఞానివగు మునిపైవ వీకీ కొపీవముతో నేమి పని? దిగంబరుడిగవే దారువవమువట్లు చేసితివి గదా (128) భిక్షాటనము చేయు పేపముతో ఋషిపత్నులున్న చోటికి వెళ్ళి మొందువట్లు చేసితివి గదా వెళ్ళిపోవుచున్న నీకు వారు పూజమకూడా చేసిరి.(129) కౌపీనము పడిపోయినమా ముమలు వేరొక విధముగా మాటాడలేదు. కమక ద్యూతమున ఓడిన దావివి వీపు వదిలివేయుము.’(130) అనగా రుద్రుడు కోపించి మూడవ కంటితో చూచుచుండెను.(131) అబ్బి శివుని చూచి దేవగణములన్నీ గణకుమారులతోసహభయపడిరి.(132) వారంతా శంకించి మెల్లగా ఇమకొనిరి. ఏడు శివుడు గిరిజ పట్ల కోపమునొందిమ.(133) ఏ విధంగా మదమడు దహింపబడెనో, అట్లే పార్వతి కూడా దహింపబడుమ. తప్పదు. అని మీమాంసలో మండగా (తర్కించుచుండగా పార్వతి వారిని చూచేమ.(134) నవ్వుచూ ఆమె సత్పురుషుడగు శివునిలో వనమ.(135) పరమ చక్షువులో ఏల చూచెదవు? వేమ కాలమున కామ, కామముమా కాను, దక్షుని యజ్ఞముమా కామ దహించడానికి.(136) త్రిపురములమా కామ, అంధకాసురుడినీ కామ. చూచి మాత్రమే ఏమి చేయగలవు? వా ఎదుట వీవు వృథాగా మూడవ కన్నమ తెరిచి విరూపాక్షుడివి అయితివి.(137)

పరమేశ్వరి ఇట్లు అనేక విధములుగా మాట్లాడేమ. అది విని మహాదేవుడు వెళ్ళిపోదలిచెను.(138) జనలు లేవి వనమే వేడు వాస్తవానికి మేలైనది. ఒంటరిగా, మనప్పుమ విగ్రహించి, అన్నింటిని వదిలేసినవాడు, పరమార్ధమును తెలిసినవాడు, విద్వాంసుడు, పండితుడు అతడే సుఖపడుమ. కామమును, రాగమును విడిచినవాడే సుఖమునొందును.(139,140) అని తర్కించి గిరిజను వదలి పరమకారుణికుడైన శంకరుడు ప్రియురాలైన పార్వతిని విడిచి పిద్దాటవిన హంసలతో మన్న వనమునకు వెళ్ళమ.(141) శంకరుడు వెళ్ళిపోవుట చూచి కైలాసవాసులందరూ, వీరభద్రుడు మొదలైనవారు శంకరుని అమపరించి వెళ్ళిరి.(142) భంగి ఛత్రమును పెట్టి వెంట నడిచెను. గంగా యమునల వంటి చామరముల(143) బట్టి నంది వెంట నడిచెను. వృషభము ముందు వడిచి పుష్పకముతో విరాజిల్లు చుండెను.(144) మహోజ్వలమగు వీరందరిచే మహాదేవుడు శోభిల్లెను. ఇక ఆంతఃపురమునకు వెళ్ళిన పార్వతి మనసు చెదిరినదాయెను.(145) తన సఖీజనముతో మరియు ఇతరులతో కూడుకొని మనస్సులో పరమేశ్వరుని గూర్చి చింతించుచుండెను.(146)

తరువాత అక్కడినుండి దూరముగా వెళ్ళిన శివుడు గణములను, గణేశుని, కుమారస్వామిని, వీరభద్రుని.(147) భృంగిని, నందిని, పోమనందిని మరియు ఇతర కైలాసవాసులను విడిచి (148) తానొక్కడే మహాతపస్వియై వనము మధ్యనున్న సిద్దవటమును చేరెను.(149) అక్కడ కాశ్మీర రత్నములు, సిద్ధరత్నములు, వైడూర్యములు పొందగబడి, సుద్దలో పరిష్కరించబడిన దివ్యాసనమొకటి పిద్దపరచబడెమ. దానిపై యోగపతి మహేశుడు కూర్చొను.(150) పద్మాసనముపై కూర్చున్న యోగపతి మహేశుడు కళ్ళుమూసుకొని ఆత్మధ్యానమున మునిగెను.(151) ఆ మహాదేవుడు సమాధియందుండి శోభిల్లెను. అపుడు శేషుని యోగపట్టముగా చేసుకొని, వాసుకియమ సర్పరాజుని నడుముకి కట్టుకొనెను.(152) భువనములకు పాలకుడగు ఆతను ఏకముగా మన్నమాఆవేకుడై, వేదాంతవేద్యుడై,తర్కమునకు దూరముగా మండి, ఆత్మజ్ఞానరూపుడై,తనయందు తనను గాంచుచూసమాధిస్థితియందుండెను.(153)

ఇది శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమందు శివపార్వతుల ద్యూత ప్రసంగమున పార్వతిచే అంతాకోల్పోయిన శివుడు కైలాసమును విడిచి తపోవనమునకు వెళ్ళుటను వర్ణించు ముప్పదివాలుగవ అధ్యాయము.