స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

26 అధ్యాయము

అటు తరువాత మేరువు మొదలగు పర్వతశ్రేష్ఠులు సంభ్రమముతో ఒక్కమారుగా హిమవంతునితో విట్లనిరి. (1) పర్వతరాజా! నీ భాగ్యముచే మహాత్ముడగు శివుడు నీకు లభించినాడు మనసులో విమర్శను సేయక ఈశ్వరునికి వీ కన్యను దావమిమ్ము (2) అని తన మిత్రులు పలుకగా, బ్రహ్మ ప్రేరేపించగా హిమాలయుడు సంకల్పముచేసెను (3) ‘ఓ పరమేశ్వరా! వీకీ కన్యను నేను దానమిచ్చుచుంటిని భార్యగా గ్రహించుము.’ అని ఈ మంత్రముచే నొసంగెను. ‘దేవదేవుడు మహాత్ముడగు శివునకు గిరీంద్రుడు కన్యాదానము చేసెను. (4) అటుపిమ్మట, అందమైన కన్నులుగల పార్వతీపరమేశ్వరులను వేదిక బయటకు తీసికొనివచ్చి, బయట వేదికపై ఆసీనుల జేసిరి. (5) మహాత్ముడగు కశ్యపుడు ఆచార్యుడై, హవనములకు అగ్నినాహ్వానించెను. (6) అపుడు బ్రహ్మ కమలాసనముపై కూర్చొని శివుని వద్దనుండెను - హవనము కొనసాగుచుండగా విజ్ఞులగు ఋషులు,అనేక దర్శవముల జ్ఞానముగలవారు, వేదవాదమున ఆసక్తిగలవారు సమ్మతముతో పరస్పరము ఇట్లు మాట్లాడుకొనిరి - (8)

‘ఇది ఈ విధంగానేనా, మరోక విధంగా జరుగవలెనా? ఇట్లే చేయవలెనా? చేయ కూడదా? (9) అని కార్యాకార్య మీమాంసను చేయుచుండగా శివుని సన్నిధిన కోలాహలము వినబడినది. తత్వజ్ఞానము లేక కేవలం వేదముల శబ్దవముగల వారంతా తమ తమ మతముల ననుసరించి మాట్లాడసాగిరి. (10) ఒకరినొకరు జయింపగోరుచూ వారట్లు మాట్లాడుకుంటున్నంతలో శివుని వద్దనున్న వారదుడు వప్పుచూ వారితోవిట్లనెమ (11) ‘మీరంతా వాదశీలురు, వేదవాదమందాసక్తిగలవారు. ఓ బ్రాహ్మణులారా! మౌనము నాశ్రయించుడు - హృదయమున సదాశివుని నిలుపుకొనుడు - (12) విశ్వము ఎవరిచే పృజింపబడి, ఎవరిచే ప్రవరిస్తూ, ఎవరియందు లయించుచున్నదో అట్టి పరమాత్మ పర్వాతయగు పదాశివునకు నమస్కారము. (13) అట్టి పరమశివుడిపుడు పర్వతేంద్రుని ఇంటవున్నాడు - ఓ బ్రాహ్మణులారా! విజ్ఞులైన మీరందరూ పరమశివుని ముఖమునండే జన్మించినారు.’ (14) అని నారదుడు ఉపదేశమునిచ్చు వాక్యములతో ఆ ద్విజోత్తములకు కమవిప్పు కలిగించేమ - (15)

యజ్ఞమట్లు కొనసాగుచుండగా లోకపితామహుడగు బ్రహ్మ దేవి చరణములను, మనోహరమైన కాలిగోటి కాంతిని చూచెను. (16) చూచినంతనే, మనసు చెదురుటచే మన్మథుడు ఆదేశింపగా వీర్యము స్థలించి భూమిపై బడెను - (17) రేతసట్లు ప్రవించుచుండగా పితామహుడు సిగ్గిలెను - అతిరహస్యముగా దానిని కాళ్ళచే మర్దించెను - (18) అపుడు వాలఖిల్యులగు ఋషులు వేలకొలదిగా జన్మించి, ఎదుట నిలిచి పితామహుని తండ్రియని సంబోధించిరి - (19) ఆవుడు నారదుడు మిగుల కోపించి వారితో ఇట్లనెను – ‘వటులారా! మీరంతా గంధమాదన పర్వతమునకు వెళ్ళండి (20) ఇక్కడ మీరు నిలువరాదు - మీకు ప్రయోజనమేమీ లేదు’. అని నారదుడాదేశించగా వాలఖిల్యులగు ఋషులందరు త్వరగా గంధమాదనమునకు వెళ్ళిపోయిరి. (21) ఆటుపిమ్మట నారదుడు బ్రహ్మను శుభవాక్కుచే ఓదార్చిను. ఇంతలో హవనముకూడా పూర్తినొందెను (22) విప్రులందరూ మహేశ్వరునికి శాంతిపాఠముల చెప్పుచుండగా, వేదఘోష దిగంతరాలు వ్యాపించెను- (23)

అటుపిమ్మట దేవపత్నులు, ఋషిపత్నులు ఉత్తముడగు దేవదేవునికి నీరాజనమిచ్చి పూజించిరి. (24) అట్లే, అందమైన కల్యాణినీ స్త్రీలు నీరాజనమిచ్చిరి. చక్కని గీతజ్ఞానముగలవారు గీతములచే, మహార్పులు సుతులచే వీరాజవమిచ్చిరి - (25) గొప్ప మనస్సుగల తాను సంతోషించి వారిని కూడా సంతోషపరచుచూ, వారికి గొప్పవిలువైన రత్నములవిచ్చెమ - (26) అపుడు, సంతోషముతోనున్న జగదేక సుందరుడగు శివుడు భార్యతో, సురసిద్ధగణాలతో, తన సభ్యుల గణములతో కూడినవాడై ప్రకాశించేమ - (27) ఇంతలో బ్రహ్మ విష్ణు మొదలగువారు, ఋషులు, గంధర్వులు, యక్షులు, ఇతరులు అక్కడికి వచ్చిరి - (28) హిమవంతుడువారినందరినీ చక్కగా గౌరవించి, విలువైన రత్నాభరణాలను, వస్త్రములను, తాంబూల, సుగంధజలము (పన్నీరు) విచ్చెమ - (29) ఆపుడు దేవతోత్తములు శివుని గూర్చి, అందరూకలిసి సంతోషముతో భోజనముచేసిరి (30) లింగి, శృంగి మొదలగు వారితో కలిపి వరుసలో కూర్చొని భుజించిరి మరికొన్ని గణములు విడిగా అనేక హాప్యములతో శివుని సంతోషపరిచిన. (31) వారదాదులు అనేకంగా అపమంజర భాషణము చేయుచూ శివుని సంతోషపరచిరి - అట్లే చండీగణములన్నీ సపాత్రులై భుజించమ.(32)

వేతాళురు, క్షేత్రపాలురు, శాకినీ,డాకినీ మొదలగు యక్షిణులు, మాతృకాదులు సపాత్రులై భుజించిరి. (33) ఆరువదినాలుగు యోగినులు, పదికోట్ల యోగులు, మహాత్ములగు గణములు ఒకకోటి భుజించిరి (34) ఇట్టి ఋషులు, దేవతలు, యోగులు వీరిని గూర్చి మునుపే నేను చెప్పితిని. (35) యోగినుల గూర్చి చెప్పితిని కదా! ఇకవారు భుజించుదాని గూర్చి చెప్పెదను - వారిలో కొందరు ఖడ్గ మృగముల పవిత్ర కవ్యమునుదెచ్చి (36) ఎముకలతోకూడ తినుచుందురు. అట్లే, ఆకలిగొనినపుడు ప్రేవులను, ఎమముల పెద్దతలలను దెచ్చి తినుచుందురు. (37) ప్రమథులలో కొందరు నర్తించుచుండగా, మరికొందరు గట్టిగా అరచుచుండిరి. మరికొందరు నిశ్శబ్దముగా నుండగా, కొందరు ఇతరులను చూచుచుండిరి. (38) ఇక భైరవుడు యోగినుల గుంపు మధ్యనుండి నాట్యము జేసెను. అట్లే ఇతర భూత వేతాళములు వద్దు, వద్దు అంటూ ఆరుస్తూవుండిరి. (39) వారందరి సందడిని చూచి విష్ణువు నవ్వుచూ శంకరునితో నిట్లనెను. (40)

‘శివా మత్తిల్లిన ఈ గణములను వారించుము. ఈ సమయమున చేయవలసినది. పాండిత్యముచేతనే చేయవలెను - కనుక వీరిని వారించుము’ అనగా రుద్రుడు వీరభద్రునితోనిట్లనెను (42) ‘మదించి, మద్యపానముచేసిన వీరిని వారించుము’ అనగా వీరభద్రుడు వారిని వారించగా వారు మిన్నకుండిరి. (43,44) యోగినుల మధ్యలో భూత, ప్రమథ, గుహ్యకులు, శాకినులు, యాతుధానులు, కూష్మాండులు, కోపికర్పటులంతా కదలకుండా నిలిచిరి.(45) భూతవేతాళములు, క్షేత్రపాలురు, భైరవులు, ప్రమథాదులంతా శాంతులైరి. (46) ఇట్లు గొప్ప విస్తారముగలదైన వివాహము, హిమవంతుడిచే పరమమాంగళ్యయుక్తముగా చేయబడిమ - (47) ఇట్లు నాలుగు దినములు గడిచినవి. హిమవంతుడు పరిపూర్ణమనస్సుతో దేవదేవుడగు పరమశివుని పూజించెను. (48) వస్త్రములు, అలంకారాభరణములు, రత్నములు మొదలగు వివిధ బహుకృతులతో మహాదేవుని అర్చించి విష్ణువు చెప్పినట్లు చేపేమ. (49)

హిమవంతుడపుడు బ్రహ్మను, లక్ష్మీసమేతవిష్ణువును వస్త్రాలంకారాలతో పూజించిన (50) ఇంద్రాణితో ఇంద్రుని, బృహస్పతిని, లోకపాలురను విడివిడిగా పూజించెను, (51) అదేవిధంగా, భూత ప్రమథ గుహ్యకులతో చండిని, వివాహమున కేతెంచిన ఇతరులనందరినీ వస్త్రాలంకరణములతో, రత్నములతో పూజించెను. (52) ఈ విధంగానే హిమవంతునిచే గంధర్వవిద్యాధర సిద్దచారణులు, అప్సరసలగణములు, ఋషులందరూ చక్కగా పూజింపబడిరి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందు కేదారఖండమున

శివపార్వతీ వివాహమంగళోత్సవ వర్ణనమను ఇరువదియారవ అధ్యాయము.