స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
29వ అధ్యాయము
లోమశుడు చెప్పెను. దేవదానవుల ఆ పేనలప్పుడు అవకాశ్చర్యములతో కూడి యుండి చతురంగబలములతో మండెను. మేఘములవలె గర్జించుచూ వారు విలసిల్లిరి (1) ఇంతలో ఒక్కమారుగా ఒకరినొకరు బాధించుకొమచూ మహాబలులైన దేవదానవులు యుద్ధమును ప్రారంభించిరి. (2) ఆ దేవదానవుల యుద్ధము ఘోరమై ఒక్కక్షణములోనే రుండ, ముండ దానవుల కంకితమాయెను (3) వందలకొలదిగా, వేలకొలదిగా నేలకూలసాగిరి. కొందరి చేతులు దారుణమైన ఖడ్లపాతములచే తెగిపోయెను-(4) ముల్లోకములో ఆతి పరాక్రమశాలియగు ముచికుందుడు బలంగా తారకాసురుని ఎదపై తన ఖడ్గముతో దెబ్బతీసెను. దానిని కాచుకొని తారకాసురుడు నవ్వుతూ అతనితో ఇట్లనెను- (6) మూర్ఖుడా! బలముతో నీవు చేసినదిదేమి? నీవు మనుష్యుడవని సిగ్గుతో నీతో యుద్దము చేయను-‘ (7) అనగా ముచుకుందుడు దైత్యరాజా! నీవు నాచేత మరణించినట్లే. (8) నా కత్తి దెబ్బ తిని నాఎదుట నిలువలేవు. నిన్ను చంపెదను. చూడు నా శౌర్యము. నిలువుము. (9)
ఇట్లు పలికి మహాబలుడగు ముచుకుందుడు బలంగా కత్తితో దెబ్బతీయగా తారకుడు శక్తిని ప్రయోగించగా, ముచుకుందుడు యుద్దమున నేల గూలి వెంటనే మరల లేచెను. (10,11) మాంధాత పుత్రుడు, ముల్లోకముల జయించువాడగు ముచుకుందుడు తారకుని వధించగోరి ధనుస్సునెక్కు పెట్టి, కోపముతో విప్పారిన కళ్ళతో తారకుని చంపబోగా, బ్రహ్మ సుతుడగు నారదుడు అతనితో నిట్లనెను (13) ‘ఈ తారకుడు మనుష్యుని చేతిలో చావడు. కనుక మహాస్త్రమును విడువకు’ (14) అనగా ముచుకుందుడు మరి ఇతనిని చంపువాడెవడు అని ఆడిగెను. (15) అపుడు గొప్పతేజస్సుతో దివ్యమగు దర్శనముగల నారదుడు ‘కుమారుడు ఇతనిని సంహరించును శివుని పుత్రుడే ఆ కుమారుడు. (16) కనుక మీరంతా కలిసి ఒక్కమారుగా యుద్ధము చేయండి- ఓ ముచుకుందా! నీవు విడిగా నిలువుము'. (17) అని నారదుడు హితము, మనోహరము అగునట్లు పలుకగా దేవతలందరూ శాంతించిరి. ఆపుడు ముచుకుందుడు అతిప్రయత్నముపై తనను తాను నిలువరించెను - (18)
అపుడు దుందుభులు మ్రోగినవి - నిశ్చయంగా శoఖాలు పూరింపబడినవి - సురాసురుల వివిధ వాద్యములు మోగించబడినవి–(19)అపుడుఅసురులు, ప్రయత్నములో దేవతలనుచూచిగర్జించిరి.అపుడు శివకోపమునుండి పుట్టిన వీరభద్రుడు కోపముతో పెక్కు గణములతో కలిపి మహాబలుడగు తారకుని ఎదుర్కొనెను,(20) ముచుకుందుడు, దేవతలు అతని ఎంటముండిరి.(21) ప్రమధులు, వీరభద్రాది గణములు ఆయుద్దమున కుమారస్వామి వెంటనిలిచి యుద్ధము చేయసాగిరి. (22) త్రిశూలము, పాశము మున్నగు ఆయుధములతో వారు తలపడిరి. (23) వీరభద్రుడు త్రిశూలముతో దెబ్బతీయగా వేలకూలివ తారకుడు ఒక్కక్షణము మూర్చనొందెను.(24) మరుక్షణమున లేచి, సుహవొంది వీరభద్రుని కొట్టెమ.(ఓ) ఇట్లు తారకుడు శక్తితో, వీరభద్రుడు త్రిశూలముతో ఒకరి నొకరు దెబ్బతీయుచుండిరి. ఆ ద్వంద్వయుద్దమతిరముగా నుండెను. (27) ఆ యుద్ధమున దేవతలు ప్రేక్షకులైరి. వారిద్దరి భేరీమృదంగాదీవాద్యములు మోగింపబడగా వారి వాదము, డమరునాదము ముల్లోకముల వ్యాపించేమ.(28)
ఆ ధ్వని చేత తారకుడు, వీరభద్రుడు మిగుల శోభించిరి. (29) అతి పంరంభమున ప్రహారములతో సడలుచున్న వారు బుధ, ఆంగారకుల వలె ఒండొరుల దెబ్బతీయసాగిరి. (30) నారదుడపుడు వీరభద్రునికి తారకుని వధమ గూర్చి చెప్పగా. వీరభద్రునికదిరుచించకుండెమ. (31) తారకుని వధమ గూర్చి వారదుడన్నది విని వీరభద్రుడు ఇష్టపడలేదు-రుద్రుడెట్లో వీరభద్రుడు అట్లే (32) ఈ విధంగా వారిద్దరూ ఒకరినొకరు దెబ్బతీయుచూసింహములవలె గర్జించుచుండిరి. అపుడు మహాజ్ఞానియైన వారదుడు అనేక విధాలుగా నచ్చచెప్పి వీరభద్రుని వారించెను. (34) వారదుడుపలికిన పలుకులనాలకించి వీరభద్రుడు కోపముతో నారదునితోనిట్లనెమ. (35) చూడు నా పరాక్రమము, తారకుని వధించగలమ, ఏ వీరులు తమ స్వామిని రణభూమికి కొనివత్తురో వారు, రణమునకు వచ్చి ఆలోచించువారుకూడా పాపులు, అధర్ములు,(36) వారు పిరికివారని తెలియవలయును - వారిని గౌరవించరాదెప్పుడూ. యోధుల ప్రతిక్రియను నీవెరుగవు. దేవరీ! (37) వ్యధనొందక, మృత్యువున వెనకనుంచుకొని యుద్ధమున
ప్రాస్త్రములతో గాయపడిన శరీరముగల వారే ప్రశంపారులు • సందేహము లేదు. (38)
అను పలికి మహాబలుడైన వీరభద్రుడు దేవతలతో నిట్లనెమ- ‘ఇంద్రాది దేవతలారా! నా మాట వినుడు. (39) విస్సంశయంగా వేమ భూమిని తారకుడు లేని దానిగా చేసెదను.’ (40) అని త్రిశూలముతో తారకుని ఎదుర్కొవేమ - అతనితో అనేకముగా గణములు వృషభముల నెక్కి, త్రిశూలముల ధరించి, జటాజూటములతో,ఆయుధముల ధరించి యుండెను. (43) వారు పరాక్రమమున వీరభద్రుని వంటివారే. చంద్రుని తలపైదాల్చి, వీలకంఠులు, దశభుజులు, ఐదుతలలు, మూడుకలు, గలిగి చత్ర చామరములతో వీచబడుచూ ఆత్యుగమగు బాహువులు గలిగి యుండిరి. (44) పరాక్రమమున హరుని వంటి వీరంతా వీరభద్రుని వెంటనుండిరి. తారకాసురుని అనుచరులగు దైత్యులు యుద్ధము చేయసాగిరి. (45) దేవతల చేత ఓడిన దైత్యులు ఎమదిరిగిరి. వారి మధ్య సమరము భీకరముకాగా,పరమాస్త్రముల జావముగల దేవతల చేతిలో పరాభవము పొంది దైత్యులు వ్యధనొంది తారకుని చేరి విన్నవించిరి. (47)
అపుడు తారకుడు తవ చాపమును ఎక్కుపెట్టి యుద్ధముచేయు తలంపుతో సేవను ప్రవేశించేమ - అపుడతను సముద్రమున ప్రవేశించు పెద్దచేపవలె మండిమ (48) మహాబలుడగు వీరభద్రుడు తన గణములతో కలిసి యుద్ధము చేయసాగెను. ఇక మహాబలుడైన దైత్యశ్రేష్టుడు తారకుడు మిక్కిలి కోపించి రణమున ప్రవేశించి ఇంద్రాది దేవతలను, యక్షపిశాచ గుహ్యకులను, అణచివేయసాగెను. (49) అప్పుడు అతిపరమైన యుద్ధము జరుగగా అందు వృషభములు గర్జించుచూ, ఆశ్వికులలో అశ్వములను, రథికులతో రథములను, మావటిలలో ఏమగులను కలిపి కూల్చిచి బాధించెను. (50,5152) అనేకులు వాళమునొంది నేలపై పడిరి. కొందరుప్రాణముల విడిచిరి - మరికొందరు పారిపోయి రసాతలమునుజొచ్చిరి . (53) మరికొందరు రుద్రుని అనుచరులైన కింకరులను శరణుజొచ్చిరి. ఇట్లు సైన్యము నాశమునొందుటమ చూచి తారకుడు కోపముతో దేవతగణముల హింసించుటకు కదిలిమ.(54)
తారకుడుభుజములను అసంఖ్యాకంగా పెంచింహమునెక్కి రణమున దేవతలనొక్కమారుగా హింసించనారంభించెను.(55) ఆ సింహము కొన్నివృషభముల చీల్చిచెను. తారకుడు పెక్కు గణముల హింసించెను. (56) ఇట్లా తారకాసురుడుచేయగా దేవతలందరిలో ఏ ఒక్కడూ ఆతనిని విలువరించలేకపోయెను. (57) ముల్లోకములకు నాశనము కలిగించువాడిగా మహాబాహువు తారకుడు కాగా, అతని అనుచరులగు దైత్యులు మిగుల బలవంతులై జయింప శక్యము కాకుండిరి.(58) వారు మిగుల భయంకరులై ఆయుధములతో గణములన్నింటిని దెబ్బతీసిరి- వారి వాహనములగు పింహములు వృషభములను చంపసాగినవి. (59) ఇట్లు రణభూమియందు గణములు ప్రాణముల కోల్పోవుచుండగా, విష్ణువు నవ్వుచూ శివునికత్యంతప్రియుడగు కుమారస్వామితో ఇట్లనెను(60) ‘కార్తికేయా! ఈ పాపిని వధించుటకు వీవుదప్ప వేరొకరు లేరు గావ మాటను నిలుపుము (61) ఇతని వధకై జన్మించితివి కావున నీవే ఇతనిని వధించవలెను’ (62) అనగా కుమారస్వామి కోపించి,తగిన రీతిలో విష్ణువుకు ఇట్లు నవ్వుచు సమాధానమిచ్చెను (63) 'విష్ణుదేవా! ఈ మహాత్ముల చిత్రయుద్దమును బాగుగా గమనించుచుంటివి ఏమి చేయాలో తెలియకుంటిని (64) వీరిలో మనవారెవరు? శత్రువులెవరు? దేవికొరకు వీరు యుద్ధము చేయుచూ ఒకరినొకరు చంపుకొనుచున్నారు? (65)
అని కుమారస్వామి అనగా నారదుడు విని అతనితో నిట్లనెను. ‘మహాబాహువా! నీవు శంకరుని అంశచే జన్మించిన కుమారునివి. జగత్తుల రక్షించువాడివి, దేవతల పరమగతివి. (67) వీరుడా! పూర్వము తారకుడు దారుణమగు తపస్సు నాచరించి, దేవతలను, స్వర్గమునూ జయించెను. (68) ఆ ఉగ్రమగు తపస్సుచే ఆజేయుడాయెను. ఇంద్రుని, లోకపాలురను కూడా జయించెను (69) ఈ దురాత్ముడు ముల్లోకములను జయించినందున నీవీ పాపపురుషువీ వధించవలెను. (70) అందరికీ నీవే. శుభమును కలిగించవలెమ.’ అని పారదుడవగా విని కుమారస్వామి నవ్వుచూ విమానము నుండి దిగి, నడవసాగెను. (71) గొప్ప ఉలవలె కాంతివంతమగు శక్తియను మహాయుధమును చేతబూని శివుని కుమారుడగు ఆ కుమారస్వామి ముందుకేగెను. (72) ఉగ్రముగా . తమవైపు నడచుచూ వచ్చుచున్న ఆ మహాబలుని చూచి దైత్యుడు ‘ఇతను సురశ్రేష్ఠుల కుమారుడు, శత్రువుల దునుమాడువాడు’ - అవేమ. (73)
అంతేకాక ‘నేనే ఇతనితో యుద్ధము చేసెదను. ఈ వీరగణములను, గొప్ప లోకపాలురనందరినీ వెంటనే వధించెదను’ (74) అని ఆ మహాబలుడు కుమారస్వామితో యుద్ధము చేయుటకు బయలుదేరెను- పరమాద్బుతమగు శక్తిని గ్రహించి తారకుడు దేవతలతో నిట్లనెను. (75) ‘మీరీ కుమారుని మీ ముందెట్లు నిలుపుకొనిరి? మీరు సిగ్గులేనివారు, మీకు రాజు ఇంద్రుడు. (76) పూర్వము తానేమి చేసెనో అందరికీ తెలుసు. గర్భమున నిద్రించిన వారిని వధించి, గర్భమును పడగొట్టినవాడు. (77) కశ్యపుని పుత్రుని చేతనే బహురూపుడగు అసురుడు, వీరుడగు నముచి, వృత్రుడు వధింపబడిరి. (78) కుమారుని చంపగోరువాడీ దేవేంద్రుడు, బలవంతుని హింసించువాడు ఈ కుమారుడీనాడు వధింపబడినట్లే సంశయము లేదు. (79) వీరభద్రా! పూర్వము దక్షయజ్ఞమున అనేక మంది విప్రులను వధించితివి కదా! ఇప్పుడా కర్మఫలితమును నీకీ రణమున చూపించెదను. (80)
అని పలికి ఆ దైత్యాదిపుడగు మహావీరుడొక్కడే పరమాద్భుతమగు శక్తిని ధరించెను - (81) ఆసురరాజులు తన చుట్టూ నిలువగా దైత్యుడగు ఆ తారకుడు మిక్కిలి కోపము నొంది సురులను వధించుటకు యుద్దము చేయగోను- (82).
ఇది శ్రీస్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందలి కేదారఖండమున శివశాస్త్రమున దేవతలకు, తారకాసురునికి మధ్య యుద్ధమును వర్ణించుట యను ఇరవైతొమ్మిదవ అధ్యాయము.
