స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

17వ అధ్యాయము

లోమశుడనెమ- అటు తరువాత దేవగణములన్నీ దధీచి ప్రాణములను విడుచుటను చూచి, ఏమి చేయవలెనని ఆలోచించసాగినవి.(1) అపుడు ఇంద్రుడు సురభిని పిలిచి తన మాటపై దధీచి కళేబరమును నాకమని చెప్పెను.(2) సురభి అట్లే అని నాకి, దధీచి కళేబరమును మాంసము లేకుండా చేసెను.(3) అపుడు దేవతలు దధీచి ఎముకలను తీసుకొని శస్త్రములను చేసిరి. వెన్నెముకనుండి వజ్రాయుధము, శిరస్సు నుండి బ్రహ్మశిరస్సు అను ఆయుధములు తయారయినవి.(4) అట్లే మిగతా ఎముకలను తీసుకొని దేవతలు సిరలతో కూడా ఆయుధములను చేసిరి.(5) దైత్యుల పట్ల శత్రుత్వము గల దేవతలు అస్థికలు, పిరలతో శస్త్రముల చేసి గొప్ప బల పరాక్రమము గలవారై వృత్రుని వధింపగోరి త్వరగా బయలుదేరిరి.(6)

తరువాత దధీచి పతియగు సువర్చ, దేవతల పని సిద్ధించుటకు భర్త పంపబడినదై, తిరిగి వచ్చి జరిగినదంతా చూచెను. ప్రాణాలులేవి భర్త దేహమున ఆమె చూచేను (7) (దేవతల పని సిద్ధించుటకు పంపబడిన దధీచి పత్ని తరువాత వచ్చి పతి మృత దేహమును చూచెను)(7) ఇదంతా దేవతల పని అని తెలుసుకొని ఆ సాధ్వి కోపగించినదై, దేవతలకు శాపమిచ్చెను(8) ‘అహో దేవతలంతా ఆతి దుష్టులు, శక్తిలేనివారు, లోభులు కనుక నేటి నుండి దేవతలంతా ప్రజలేవి వారు అగుదురుగాక!’ అని ఆమె అవేమ(9) ఇట్లు దేవతలను శపించి, ఆ తపస్వినీ అశ్వత్థవృక్షము మూలము వద్దతన ఉదరమును చీల్చెను.(10) అపుడా జఠరమునుండి దధీచి గర్భమగువాడు, సాక్షాత్తు రుద్రుని అవతారమగు పిప్పలాదుడమ గొప్పకాంతి గలవాడు బయటకు వచ్చెను.(11) అపుడు తల్లి గర్భమున చూసి నవ్వుతూ, కంటినిండా కోపముండగా పిప్పలాదునితో-‘ఈ రావిచెట్టు వద్దనుండి అందరికి ఫలములనిమ్ము’ అని కుమారునితో మాట్లాడుతూనే పరమసమాధి ద్వారా పతనమసరించెను.(12 13) ఇట్లు సాద్వియగు దధీచపత్ని సువర్చ పతితో స్వర్గమునకు వెళ్ళెను.(14)

గొప్ప బలపరాక్రమములు గల ఇంద్రుడు మొదలగు దేవతలు శస్త్రములను, ఆస్త్రములను తయారుచేసికొని ఉత్సుకతతో దైత్యులను ఎదుర్కొనిరి.(15) దేవతాగణములనేకములుగా దేవగురువు యొక్క ఆజ్ఞచే, అతనికి ముందడుకొని మధ్యదేశమైన భూలోకమునకు ఆస్త్రములు ధరించవచ్చిరి.(16) ఇంద్రుడు మొదలైన దేవతలు రాగా వారిని మహాదైత్యుడైన వృత్రుడు తన దైత్య సమూహములతో వచ్చిచేరెను.(17) మేరు పర్వత శిఖరమెట్లు పరిపూర్ణముగా కనబడునో అట్లే గొప్ప తేజస్సు గలవాడు, విశ్వకర్మ పుత్రుడు వృత్రుడు కనబడెను.(18) వృత్రుడు మహేంద్రువి, మహేంద్రుడు వృత్రుని చూచెను. దేవదానవులు మహాద్భుతముగా నుండెను.(19) అపుడు, శత్రుభావముగల దేవదైత్యులు ఒకరినొకరు దెబ్బతీయుటకు అత్యద్భుతముగా గర్జించిరి.(20).

దేవదానవుల యుద్ధ సమయమున భయంకరమైన వాద్యాలు మోగింపబడినవి.(21) అపుడు అందరూ త్వరగా శస్త్రముల గ్రహించి ఒకరినొకరు శాస్త్రములచే బాధింపసాగిరి.(22) ఆ యుద్ధములో అపుడట్లు ప్రవర్తింపగా, చరాచరములతో గూడిన ముల్లోకములు గొప్ప భయముతో చైతన్యమును గోల్పోయినవి.(23) కొందరు నరకబడిరి, మరికొందరు దెబ్బతీయబడిరి. కొందరు రెండు ముక్కలుగా నరకబడిరి. లోహపు మొగల బాణముల చేత మరియు ఇతర ఆయుధముల చేత ఒకరినొకరు బాధించుకొనిరి.(24) దేవతలు కొందరు అంగములమ కోల్పోయి భల్లులతో చరించుచూ, ఆకాశమున మేఘములతో కూడి ప్రకాశించు కిరణముల వలెనుండిరి.(25) ఆకాశ తలమునండి అనేకముగా తలలు మహా ప్రళయసమయాన వక్షత్రాలవలె వేలరాలివి.(26) అట్లు భూలోకమున అన్ని ప్రాణులకు వాళముమ కలిగించు యుద్ధము ఇంద్రునికి, వముచికి మధ్య జరిగిమ.(27)

            ఇంద్రుడు స్వయముగా వజ్రాయుధముతో వముచివి దెబ్బతీసిననూ, ఏమీ చేయలేకపోయేమ.(28) అది చూచి పురాసురులంతా గొప్ప ఆశ్చర్యాన్ని పొందిరి. ఇంద్రుడు సిగ్గుపడినాడు.(29) ఇంద్రుడు గదతో వముచిని కొట్టగా, నముచి శరీరానికి తాకి అది చూర్ణమై వేలరాలెను.(30) అపుడు గొప్ప రూలముతో వముచిని కొట్టెను కాని అదికూడా నముచి శరీరానికి తాకి వంద ముక్కలయినది.(31) ఇట్లు పలురకాల శస్త్రములలో ఇంద్రుడు వముచిని కొట్టెను. వముచి మాత్రము నవ్వుచూ, ఇంద్రుని కొట్టలేదు. ఇంద్రుడు మిన్నకుండి, చింతింపసాగెను - ఏమి చేయాలో అతని కపుడు తెలియలేదు(33)

ఇంతలో, మహాభయంకరమైన ఆ గొప్పయుద్ధములో ఆకాశవాణి ఇంద్రుని ఉద్దేశించి ఇట్లనెను.(34) ‘మహీంద్రా! దేవతలకు గొప్ప భయమును కలిగించు ఈ దైత్యుని సమీపించశక్యము గాని సముద్రము వద్ద వీటి మరుగుతో నేడు త్వరగా వధింపుము.(35) వేరే శస్త్రముతో ఇలవిని వధించవీలు లేనందున, మహేంద్రా ఇతని వధకై యత్నము చేయుము.(36) అని పలుకగా, ఆనందమును, శుభమును కలిగించు ఆ దేవతా సంబంధి వాక్కును, గొప్ప అర్థము కలదావివి విని ఇంద్రుడు నముచిని వధించు ప్రయత్నములో సముద్ర తీరమును చేరెను.(37) అక్కడికి వచ్చిన ఇంద్రుని చూచి నముచి క్రోధముతో ఒళ్ళు మరిచెను. దేవేంద్రుని శూలములో బాధించి, నవ్వుతూ ఇట్లనెను.(38)

దేవశ్రేష్ఠా! రణభూమిని విడిచి, ఆయుధాలను వదలి ఈ సముద్ర తటమునెందుకు చేరితివి.(39) దుర్మతి! ఏ వజ్రము వచ్పేమి చేసినది?(40) ఇంతకు ముందు అనేక రకాల ఆయుధాలను వప్న వధించుటకు గ్రహించితివి(41) ఇపుడు యుద్ధము చేయవచ్చివః ఏపు, వమ్న వధించుటకు ఏ శస్త్రముమ తీసికొనదలిచావు? యుద్ధమున ఏ అప్రములో వమ్న దెబ్బతిపెదను (42) యుద్ధమున ఇంకమ వీపు నిలిచిన వేడి నిన్ను వధించెదము. లేనిచో నేమ వదిలివేసిన, వెళ్ళి సుఖంగా చాలాకాలం జీవించు, (43) ఇట్లు గర్వించిన వముచి పలుకగా యుద్ధమున ఉచితమైన దానివి ఏవి మహేంద్రుడు కూడా రోషముతో మరుగున అందుకొనెమ.(44) ఇంద్రుని చేతిలోని మరుగున చూచి అసురులంతా వవ్విరి (45)

ఆస్త్రాలన్నీ నశించినవి. ఇక ఇంద్రుడు నురుగును తీసుకొని నన్నీనాడు వధింప దలిచినాడు.’(46) అని నవ్వి నముచి ఇంద్రువి అవమానపరిచినాడు. అవమానము చేయుచూ ఇంద్రుని ఎదుట నిలిచాడు (47) అపుడు ఇంద్రుడు నురుగుతో ముచిని కొట్టెను.(48) నముచి మరణించగా, దేవతలంతా సంతోషించిరి. ఋషులు ‘బాగు’ ‘బాగు’ అని ఇంద్రుని కొనియాడిరి.(49) వముచిని చంపి దేవతలంతా సంతోషముగా నుండగా, దైత్యులు కోపించి, యుద్ధము చేయవచ్చిరి.(50) అపుడు దేవదానవులకు మరల యుద్ధము జరిగెను. ఒకరినొకరు వధించు కోరికతో ఈప్రాప్తములమ విడిచిరి.(51) దేవతల చేతిలో అసురులు మరల మరల నేలకూలగా, గొప్ప తేజస్సుగల వృత్రుడు ఇంద్రుని సమీపించెను.(52) అపుడు దేవతలు, దానవులు, మావులు వృత్రుని జూచి భయపడి, భూమిపై పడిరి.(53) ఇట్లు అందరూ భయపడగా, ఇంద్రుడు వజ్రమును చేత ధరించి ఐరావతమునెక్కి (54) ఛత్రచామరములు కలిగి, లోకపాలురందరితో కలిసి వచ్చేను.(55) శక్తి కలిగిన లోకపాలురంతా వృత్రుని జూచి భయమునొంది శివుని శరణుజొచ్చిరి.(56)

అందరూ లోకములకు శుభమును కలిగించు శంకరుని మనస్సులో ధ్యానించిరి. జయమును కోరుచున్న మహేంద్రుడు విధిపూర్వకముగా లింగమును పూజించెను.(57) ఉదారబుద్ధి గల బృహస్పతి వెంటనే ఇంద్రుమద్దేశించి ఇట్లనెను.(58) - ‘కార్తీక శుక్ల పక్షమున నివారము పూర్తిగా త్రయోదశియుండి లభించిన కార్యసిద్ధి జరుగును. సంశయము లేదు (59) ఆరోజు ప్రదోష సమయావ లింగరూపమునమన్న సదాశివుని పూజించిన అన్ని కోరికలు తీరును.(60) మధ్యాహ్న సమయాన స్నానము చేసి, నువ్వులు, ఉసిరికలతో, గంధము, పుష్పములు ఫలములు మొదలగు వానిలో శివుని అర్చించవలెను.(61) తరువాత, సాయంకాలమున, స్థిరముగా నున్న లింగమును, తనకు తానే వెలిసినది గానీ, స్థాపించిన దానిని గాని, ఎవరో ఒకరిచే వుంచబడినదానివి లేదా స్వయముగా మన్న దానిని అర్చించవలెను.(62) జనమధ్యమున గాని, ఏకాంతమున గానీ, అరణ్యమునందైనా, తపోవనమునందైన శివలింగమున విశేషముగా ప్రదోషసమయాన అర్చించవలెను.(63)

గ్రామముననున్న శివలింగమును పూజించిన దానికంటే నూరు రెట్లు అధికఫలము గ్రామము వెలుపల నున్న లింగార్చనచే కలుగును. అంతకంటే నూరురెట్లు ఫలము అరణ్యముననున్న లింగమునర్చించుటచే కలుగును.(64) దానికంటే నూరురెట్లు పర్వతముపైనున్న లింగమును పూజించుటచే, అంతకంటే పదివేలరెట్లు తపోవనముననున్న లింగమునర్చించుటచే కలుగును.(65) కనుక, ఈ విభాగములో విజ్ఞాలు శివపూజను చేయవలెను. అట్లే తీర్థస్నాము మొదలైన వానిని నిపుణముగా చేయవలెను.(66) అచట పంచపిండములను సమర్పించి స్నానము చేయుట ఉత్తమమైనది. కూపమునుండి నీటిని గ్రహించి స్నానము చేయవలెను. చెరువు వద్ద దశపిండములను సమర్పించి స్నానము చేయవలెను.(67) నదీస్నానము విశేష గుణము కలది. అందులోనూ మహా నదిలో స్నానము చేయుట అధికఫలమునిచ్చును.(68) అన్ని తీర్థములలోనూ గంగయందు స్నానమాడుట విశేషము, అందునూ. సహజముగా ఏర్పడిన జలాశయమునందు స్నానము శ్రేష్ఠము.(69)

వేయి లేదా నూరు లేదా ముప్పది రెండు దీపముల మాలతో శివుని అర్చించవలెను.(70) శివుని తృప్తి కలిగించుటకై నేతితో దీపముల వెలిగించవలెను. అట్లే, పళ్ళు, దీపములు, నైవేద్యములు, గంధము, ధూపము మొదలగునవి సమర్పింపవలెను.(71) షోడశోపచారములతో ప్రదోషవేళయందు శివుని లింగరూపమున పూజించిన నరులకు కోరికలన్నీ తీరును.(72) నూట ఎనిమిది మార్లు ప్రదక్షిణము చేసి, అన్నిమార్లు నమస్కారము చేయవలెను.(73) ప్రదక్షిణ నమస్కారములతో సదాశివుని పూజింపవలెను - శివుని నూరు పేర్లతో యథావిధిగా స్తుతింపవలెను.(74)

రుద్రునకు, భీమునకు, నీలకణునకు, వేధకు, కపర్టునకు, సురేశునకు, వ్యోమకేశునకు నమస్కారము.(75) వృషధ్వజునకు, సోమునకు, నీలకణ్ఠువకు, దిగంబరునకు, భర్గునకు, ఉమాకాంతునకు, కపర్దికి నమస్కారము.(76) తమోమయునకు, వ్యాప్తునకు, శిపివిష్టునకు, వ్యాప్రియునకు, వ్యాళునకు, వ్యాళపతికి నమస్కారము.(77) మహీధరునకు, వ్యాఘునకు, పశుపతికి, త్రిపురాంతకునకు, సింహునకు, శార్దూలోగ్రరవునకు నమస్కారము.(78) మీనునికి, మీననాధునికి, సిద్ధునికి, పరమేష్ఠికి, కామాంతకునికి, బుద్ధునకు, బుద్ధిపతికి నమస్కారము.(79) కపోతునకు, విశిష్ఠునకు, శిష్టునకు, పరమాత్మకు, వేదునకు, వేద బీజమునకు, దేవగుహ్యునకు నమస్కారము.(80) దీర్ఘనకు, దీర్ఘదీరునకు, దీర్ఘర్ఘనకు, మహునకు, జగత్పతిష్ణునకు, వ్యోమరూపునకు నమస్కారము.(81)

గజాసుర వినాశునకు, అంధకాసురభీదికి, నీలలోహిత శుక్లునకు, చణ్డముణ్డ ప్రియునకు నమస్కారము.(82) భక్త । ప్రియునకు, దేవునకు, జ్ఞానాజ్ఞాన అవ్యయునకు, మహేశునకు, మహాదేవహరునకు నీకు నమస్కారము.(83) త్రినేత్రునకు, త్రివేదునకు, వేదాంగునకు, ఆర్డునుకి, ఆర్ధరూపునికి, పరమార్థునికి నమస్కారము.(84) విశ్వరూపునకు, విశ్వునకు, విశ్వనాథునకు, శంకరునకు, కాలునకు, కాలావయవ రూపునకు నమస్కారము.(85) అరూపునకు, సూక్ష్మునకు, సూక్ష్మసూక్ష్మునకు, కృత్తివాసునకు నమస్కారము.(86) శశాంకశేఖరునికి, రుద్రునికి, విశ్వాశ్రయునికి, దుర్గునికి, దుర్గ సారమునగు వానికి, దుర్గావయవ సాక్షికి (87). లింగరూపునకు, లింగునికి, లింగపతికి, ప్రణవ రూపునికి, ప్రణవార్థమునకు నమస్కారము.(88) కారణమునకు కారణమగు వానికి, మృత్యుంజయునకు, ఆత్మ భవ స్వరూపికీ,త్ర్యంబకునికి, అసితికణునకు, భర్గునకు, గౌరీపతికి, సకల మంగళ హేతువునకు నమస్కారము.(89)

బృహస్పతి పలికెను- ‘అపుడు వ్రతము గ్రహించినవాడు శివుని మారు నామములమ చదవవలెను- అన్ని ప్రదక్షిణాలమ, నమస్కారాలమ ప్రయత్న పూర్వకముగా చేయవలెను. శంకరుని ప్రీతికై దీవివి పాయం సమయావ చేయవలెను.(90) ఇంద్రా! ఇట్లు వీపు వ్రతము చేయదగినది- ముందు వ్రతము చేసి తరువాత యుద్ధము చేయుము.(91) శివుని ప్రసాదముచే మీకు జయము మొదలగునవి ప్రాప్తించుమ.(92) ఈ వృత్రుడమ గొప్ప తేజస్సు గల దైత్యుడు పూర్వము గంధమాదన పర్వతము మీద తపప్పు చేసి శివుని ప్రసమ్నుని చేసికొనెను.(93) అపుడతమ చిత్రరథుడమ రాజు. ఆ వనమూ అతనిదే. ఇంద్రా! శివపురికి సమీపానమన్న వవమతనిదే.(94) ఆ వనమున ఆతీవ, అపోవు మూషిక, శలభ, శక, ఆసన్నరాజులను ఆరు ఏడలు లేవు. కమక ఆ వము అత్యంత మంగళమైనది. ఆరాజుకు శివుడే గొప్ప యావమునొకదానివిచ్చెమ.(95) అది తన స్వామి కోరిక వనవసరించి వెళ్ళునది. కింకిణీ వాద్యములు గలది. పెద్ద చారణులచేత సేవింపబడినది. గంధర్వ, యక్ష, అప్పరస, కిన్నరులచేత శోభించునది.(96) ఆ వాహనము పైననే పూర్వము పృథివివి, గిరీశముఖ్యులమ, వివిధ ద్వీపములమ పర్యటించెను.(97)

ఒకప్పుడు చిత్రరథుడమ రాజు పర్యటించుచు కైలాసమునకు వచ్చి అద్భుతము నొకదానిని చూచెను.(98) మహేశుని సభాతలము గణములతో ప్రకాశించుచున్నది. శివుడు అర్ధాంగమువకు అంటుకొనియున్న పార్వతితో యుండగా చూచేను.(99) దేవిలో మన్న శివుని చూచి ఇట్లనెను.(100) ‘ఓ శంకరా! మేమంతా విషయములతో కూడియున్న వారము. మంత్రి మొదలగు వారమంతా ప్రీకి వశులము. లోకమున మేమే ఆజ్ఞలము కాము. లజ్జతో స్త్రీ సేవనము చేయనే చేయము.’ ఆదివిని మహేశ్వరుడు నవ్వుచూ అందరూ వింటూ వుండగా వ్యాయసమ్మతమైన మాటను చెప్పెను.(102) ‘అందరికీ లోకాపవాదమునుండే భయము. వేరే రకంగా కాదు. అందరూ జీర్ణము చేసుకోలేని కాలకూటమును మింగితిని.(103) అయినప్పటికీ, రాజు సహింపలేని అవమానమున చేసెను.’ అపుడు చిత్రరథుని పిలిచి పార్వతి ఇట్లనెమ (104).

            పార్వతి అనెను- ‘ఒయీ దురాత్ముడా!, మూర్ఖుడా! శంకరువేల పరిహసించితివి? వాతో సహ కర్మఫలమున చూచెదవు?(105) సాధువులు, విర్వికారులు అగు వారిని ఉపహసించువాడు దేవుడైన మనుష్యుడైనా వాడు అధమాధముడని తెలుసుకోవలిమ.(106). ఇక్కడున్న మునీంద్రులు, వేదమువకు నెలవైన ఋషులు, పవకాదులందరూ ఉలిక శిపునర్చించుచున్నరా?(107) మూర్ఖుడా! ఇంతమందిలో ఏవొక్కడివేతలివి గలవాడవా? ఇతరులు కారా? కమక విమ్న దేవతలు మరియు బ్రాహ్మణుల చేత బహిష్కృతుడైన దైత్యునిగా చేయుచున్నామ’(108) అవి భవానీదేవి చేత దంపబడిన చిత్రరథుడు రాజు ఒక్కమారుగా స్వర్గమునండి వెంటనే పడిపోయేమ.(109) అపురయోనిని పొంది వృత్రుడని పేరు పొందిన. అపుడు త్వష్ట గొప్ప తపస్సు చేత క్రమముగా వృత్రుని సంయోజితుని చేసెను.(10) అతని తీవ్ర తపస్సువలన వృత్రుడు జయింప వీలులేవి వాడాయేమ, కమక వీపు ఇపుడు విధి ప్రకారము ప్రదోష సమయావ శివుని అర్చించుము.(111) దేవతల పని దిద్దించుటకు వృత్రుని వధించుము, అవి బృహస్పతి అనగా వివి ఇంద్రుడు (112) తనకు ప్రదోషమున చేయు విధివి ఉద్యాపన పహితముగా చెప్పుమనెను.(112)

బృహస్పతి చెప్పెమ-‘కార్తీక మాసము రాగా శనీవారమున త్రయోదశి పూర్తిగా వున్నపుడు పంపూర్ణవ్రతము సిద్ధించుటకు, (113) వెండిలో ఎద్దు విగ్రహమును చేయించి దాని వీపుపై పీఠమును చేయించి దానిపై ఉమాపతి యగు త్రిలోచమని.(114) ఐదు తలలు, పది భుజములు, పగభాగమున పార్వతి వుండునట్లు బంగారముతో శివుని చేయించవలెమ.(115) వృషభముతో సహా శివుని రాగిరేకువ, వస్త్రముతో కప్పి అనేక ఉపచారములతో నిలపవలెను.(116) రాత్రి సమయావ విధిపూర్వకముగా శ్రద్ధతో జాగరణ చేసి, మొదట పంచామృతముతో స్నానము చేయించవలెను.(117)

            ఓ దేవా! గోక్షీరముతో నే చేసిన ఈ గోక్షీర పానమును గ్రహింపుము.(118) ఓ పరమేశ్వరా! పెరుగులో నేను చేయు దధిప్నావమును గ్రహించి ప్రసన్నుడవు కమ్ము.(119) ఓ దేవా! వీ ప్రీతికై నేమ చేయు వేడి స్నానమును శ్రద్ధతో ఇచ్చిన దానిని గ్రహింపుము.(120) దేవదేవేశా! నీ ప్రీతికై తన విచ్చుచున్నాను. గ్రహించు వాకు శాంతివిము(121) ఓ దేవా! ఇపుడు శర్కరితో పానము చేయించుచున్నాను. శ్రద్ధతో ఇచ్చిన దానివి వీపు గ్రహించి ప్రసన్నుడవు గమ్ము(122) అవి ఈ రకంగా శివునికి పంచామృతములతో స్నానము చేయించి తరువాత రాగిపాత్రతో అర్యము విశ్వవలెను. శివుని సంతోషమునకై ఇది మంత్రము చదువవలెను.(123)

ఓ పార్వతీపతీ! నీవు పూజ్యుడవు. నేనిచ్చు ఈ అర్ఘ్యమును గైకొని ప్రసన్నుడవు కమ్ము.(124) దేవదేవేశా! నీకు నేవిచ్చు ఈ పుష్పమాల గంధముతో కూడుకొనిన పాద్యమును గ్రహించి ప్రసన్నుడవై వరముల నిమ్ము.(125) ఆసనమును నీ శాంతి కొరకై ఇచ్చుచుంటివి. ఓ దేవా! దీనిని గ్రహించి నాకు ఎల్లప్పుడూ వరముల నిమ్ము.(126) ఓ విశ్వేశ్వరా! నేనిచ్చే ఆచమనీయ జలమున గ్రహించి, సంతోషము నొందుము.(127) ఓ ప్రభూ! నీకు నేను బ్రహ్మగ్రంథితో కూడుకుని బ్రహ్మకర్మలో ప్రవర్తింపజేయు బంగారపు జంధ్యమునిచ్చు చుంటిని.(128) దేవా! పరమ భక్తితో నేను నీకు చందన సుగంధమునిచ్చుచుంటిని. గ్రహించి నన్ను సుగంధము (పుణ్యము) గల వానిగా చేయుము.(129)

  శివా! నేతితో వెలిగించిన ఈ దీపమును గ్రహించి నాకు జ్ఞానము నిమ్ము.(130) నా శాంతికై అన్ని ఔషధులతో వెలిగించిన విశిష్ట దీపమును గ్రహింపుము.(131) పరమేశ్వరా! దీపముల వరుసను ఇచ్చుచుంటిని. గ్రహించి, ఆరార్తిక ప్రదానము చేత వాకు తేజస్సు నిమ్ము.(132) ఇట్లా రాత్రియందు విశేషముగా ఫలములు, దీపములు, నైవేద్యము, తాంబూలము మొదలైన క్రమముగా విధావమును తెలిసి పూజింపవలెను.(132) తరువాత ఇంటిలో గానీ దేవాలయమున గానీ జాగరణము చేయవలెను. అనేక విశేషములతో కూడిన మండపమును నిర్మించి, గీత, వారిత్ర, నృత్యములచే సదాశివుని పూజింపవలెను.(134) ఇంద్రా! ఇదే విధానములో ప్రదోషమున ఉద్యాపనము అన్ని పనులు నెరవేరుటకై చేయవలెను.(135)

            బృహస్పతి చెప్పినదంతా ఇంద్రుడు చేసెను. అతని సహాయముతోనే యుద్ధ నిపుణుడైన ఇంద్రుడు (136) వృత్రునితో యుద్దము చేసెను. దేవతలకు దానవులతో జరిగిన యుద్దము అతీఘోరముగా నుండెను.(137) ఆ భీకర యుద్ధము దేవదానవులకు క్షయమున కలిగించునదిగా వుండెను. అందు ద్వంద్వయుద్దము అతి భయంకరముగా జరిగెను.(138) వ్యోముడను దైత్యుడు యమునితో, తీక్ష కోపనుడు అగ్నితో, మహాదంష్ట్రుడు వరుణునితో, మహాబలుడు వాయువుతో యుద్ధముచేసిరి.(139) అందరూ ద్వంద్వ యుద్ధమునందు నేర్పరులై, పరస్పర బలమును కోరుచునుండిరి.(140) అపుడు గొప్ప బాహువులు గల దేవశ్రేష్ఠులు, సంగ్రామ శూరులై జయమునొందిరి. దైత్యులలో ప్రముఖులు అందరూ అన్ని వైపులమండీ పరాజయము నొందిరి.(141) దేవతల చేతిలో ఓడి తోచిన దిక్కుకు పారిపోవుచున్న తన వారిని చూచి మహాబలుడైవ వృత్రుడు తీవ్రమగు కోపముతో ఇట్లనెను (142)

            ‘ఓ దైత్యులారా! మీరంతా భయమును, ఆర్తిని పొంది ఎందులకీ రణభూమిని వదిలి పారిపోతున్నారు?(143) యుద్ధము చేయు పట్టుదలతో మీరంతా మీమీ పరాక్రమమును చూపించండి. మహాబలులారా(144) గదలతో, బడిలలో, ఖడ్గములతో, శక్తి, తోమర, ముద్గరమున్నగు ఆయుధములతో, పాశము, తోమర, ముస్టిమున్నగు వావిలో దేవ గణములను వాసము చేయండి’ (145) అనగా అపుడు దేవతలు కూడా దధీచి మహర్షి ఎముకల నుండి ఏర్పడిన వివిధ శప్రాప్తములమ చేతబూని యుద్ధము చేసి అసురుల హతమార్చిరి.(146)మరల దైత్యులు దేవతల చేతిలో పరాజయమునొందిరి. మరణము పాలైరి. వృత్రుడు అసురులమ మరల యుద్ధమునకై ప్రేరేపించెను.(147) కొందరు దైత్యులు, దేవశ్రేష్ఠుల చేతిలో ప్రాణములొదిలి, మరికొందరు దెబ్బతివి పారిపోసాగిరి. మరికొందరు అదిచూచి మిక్కిలి భయమును పొంది నపుంసకుల వలె అయిపోయిరి.(148)

అపుడు కోపగించిన వృత్రుడు దైత్య ముఖ్యులను చూచి ఛీత్కరించెను- ‘ఓ పులోముడా! వృషపర్వుడా!(149) ధూమ్రాక్షుడా! మహాకాలుడా! వృకాసురుడా! స్థూలాక్షుడా! స్థూలదంష్ట్రుడా! మీకు నమస్కారము.(150) అభిమానవంతులగు క్షత్రియులు స్వర్గము నొందుటకు ఉత్తమ ద్వారమగు ఈ యుద్ధమును వదిలి పారిపోయెదరేల?(151) యుద్ధమున మరణించిన వారు పరమపదమును పొందేదరు. విట్టాడు యుద్ధమున ఏదో ఒకచోట మరణము నొందగోరవలెను.(152) యుద్ధమును విడిచిన వారు విశ్చయముగా నరకమును పొందెదరు.(153) బ్రాహ్మణుల కొరకు, సేవకుల కొరకు, తమ కొరకు గానీ శస్త్రముల ధరించి యుద్ధము చేయువారు గొప్ప పాతకముల చేసిననూ(154) యుద్ధమున శస్త్రముల దెబ్బతినిన గానీ, ప్రాణములొదిలిన గానీ పరమ పదమును పొందెదరు. ఇది నిశ్చయము.(155) గోవుల కొరకు, స్వామి కొరకు శస్త్రముల చేత విచ్ఛిన్నమైన దేహము గలవారు, రణమున దెబ్బతిన్నవారు లేదా మరణించిన వారు ఉత్తమ గతని పొందెదరు.(156)

కనుక రణమున చంపబడిన శూరులు పాపులైననూ, జామలు కూడా పొందలేవి పరమష్టితిని పొందెదరు.(157) లేదా, తీర్థముల దర్శించుట, వేదముల వధ్యయనము చేయుట, దేవతలమఅర్చించుట, యజ్ఞముల చేయుట మొదలగు వివిధ శ్రేయస్సులు కూడా (158) కలిపి కూడా యుద్ధములో వేలకూలిన వారి పదహారవ కళను కూడా పొందలేవు. అన్ని శాస్త్రములయంది. విధి.(159) కమక, మీరు శంకమ విడిచి ఉత్తమమైన యుద్ధమును గ్రహించండి. దేవతల మాటమ ప్రమాణముగా చేసి వేరొక విధముగా చేయరాదు. (160) మీరంతాషౌర్యముగలవారు. కులములో, శీలముతో గొప్పవారు- శూరులు కాని వారివలె రణమండలమునుండి పారిపోవుచుండిరి.(161) పాపమొనరించినవారు, ఆధర్మము నాచరించినవారు, బ్రహ్మ హత్యము చేసినవారు, గురు తల్పమును పొందినవారు, అట్లే రణమునుండి పారిపోవువారు అందరూ పాపలోకములమ తప్పక పొందుదురని స్మృతి వచనము.(162,163) కమక, యజమాని కార్యమును భరించుటయందు సమర్థులైన మీరంతా యుద్దమును చేయవలేమ' అని వృత్రుడు అసురుల నుద్దేశించి పలికెను.(164). అపుడు అసురులు అతని మాటనమసరించి దేవతలతో అన్ని లోకములకు భయమున కలిగించు మౌర

యుద్ధమును చేసిరి.(165)

తస్మిన్ ప్రవృత్తే తములే విగాడే వృత్రో మహాదైత్యపతిః స ఏకః।

ఉవాచ రోషేణ మహాద్భుతేన శతక్రతుం దేవవరైప్పమేతమ్॥ 

వృత్ర ఉవాచః

అట్లు మొదలైన ఆ హోరయుద్ధమున దైత్యుల గొప్ప ప్రభువగు వృత్రుడొకడే రోషముతో దేవతాస్తులతో కూడివున్న ఇంద్రుని ఉద్దేశించి ఇట్లనేమ.(166) 'ధర్మార్ధములతో కూడినది, హితమును కలిగించునది యగు వా మాటమ ఏమము. వీవు దేవతల ప్రభువై కూడా మంచి, చెడులను తెలియకున్నావు- (167) ఏ బలముమ, ప్రయోజనమున ఆపేక్షించి నీవు విశ్వరూపుని వధించితివి. ఓ ఇంద్రా! ఏ కర్మయొక్క ఫలమినాడు ప్రాప్తించివది.(168) దూరదృష్టి లేనివారు, మూర్ఖులు, అల్ప బుద్దులు, ధర్మము లేనివారు, అసమర్థులై పవివి సాధించుటకు చేయునదంతా నిష్ఫలమగునని తెలుసుకొని, మనసులో నిలుపుకొనుము.(169) కనక, నీవు ధర్మపరుడ, కల్మషముమ విడిచి యుద్ధము చేయుము. నీవు నా సోదరుని వధించినందున వేమ నిమ్న వధించెదను.(10) స్థిరుడ, దేవతలు వెంటరాగా వెళ్ళిపోకుము.' అని వృత్రుడనగా ఇంద్రుడు మిగుల కోపముతో ఐరావతమునెక్కి వృత్రుని వధించు కోరికతో ముందుకేగెను.(171) తనవైపుకు వచ్చుచున్న ఇంద్రుని చూచి, మిక్కిలి బలవంతుడగు వృత్రుడు నవ్వుచూ, అందరూ వినచుండగా ఇట్లనెను.(172) 'ముందు నన్ను దెబ్బతీయుము.' అనగా విన్నే దెబ్బతీసెదవిన ఇంద్రుడు వృత్రుని గదతో మోకాలు వద్ద గట్టిగా కొట్టెను.(173,174) వచ్చి పడుచున్న గదను వృత్రుడు లీలగా ఒకచేతితో పట్టుకొని, దానితోనే మరల ఇంద్రుని కొట్టెమ.(15) ఆ గద ఇంద్రుని వజ్రాయుధముతో సహ నేలకూల్చెను. క్రింద పడిన ఇంద్రుని చూచి వృత్రుడు దేవతలతో ఇట్లనెమ.(176)

'ఓ దేవతలారా!  మీ ప్రభువును మీ నగరమైన అమరావతికి గొనిపొండు.(17) ఆవి వృత్రుడు సత్యమును 'పలుకగా । విని దేవతలు ఉత్సుకతతో రణభూమినుండి ఇంద్రుని గొని పోయిరి.(178) ఏనుగుపై నున్న ఇంద్రుని క్రిందకు దింపి, తప్పించి, దేవతలంతా భయాతురులై అతనిని చుట్టుముట్టి రణభూమిని వదిలి స్వర్గమున కేగిరి.(179) వారట్లు వెళ్ళగా మహాసురుడైన వృత్రుడు నాట్యము చేసెను - అతను నవ్వగా దానితో ఒకటములు నిండిపోయెను.(180) భూమి పర్వతములు, అరణ్యములతో సహా కంపించెను. స్థావర జంగమమంతా క్షోభనొందెను.(181) ఇంద్రుడు వెళ్ళిపోవుచున్నట్లు విని లోకపితామహుడగు బ్రహ్మ అతనిని సమీపించి తన కమణలములోని నీటిని చిలకరించగా వెంటనే ఇంద్రుడు స్పృహలోకి వచ్చెను.(182) తన ఎదుటనున్న

బ్రహ్మను చూచి ఇంద్రుడు సిగ్గునొందగా, సిగ్గుపడుచున్న దేవేంద్రునితో పితామహుడగు బ్రహ్మ ఇట్లనెను.(183)

బ్రహ్మ పలికెను-

వృత్రుడు స్వయముగా తపస్సు వాచరించినవాడు, బ్రహ్మచర్యవ్రతమునమన్న వాడు, ఈ గొప్పకీర్తి గల వృత్రుడు త్వష్టయొక్క తపస్సు తోడైనవాడు. కనుక జయింపశక్యము గానివాడు. ఇంద్రా! నీవు ఉగ్రమైన తపస్సుతోనే ఇతని జయింపుము.(184) ఇంద్రా! దైత్యుల ప్రభువగు వృత్రుని నీవు పరమ సమాధిచేత జయింపగలవు.' అని బ్రహ్మ పలుకగా ఇంద్రుడు శివుని స్మరించెను.(185) గురువు తనను ప్రేరేపించగా ఇంద్రుడు శివుని స్తుతింపసాగెను.(186) ఇంద్రుడు పలికెను. 'దేవుడగు భరునకు, దేవతలకు కూడా పొంద శక్యముగాని శివునకు నమస్కారము. ఓ పరమశివా! దేవతల పని నెరవేరుటకై వరములనిచ్చు వాడవు గమ్ము'(187) అని తన కార్యమునందు నేర్పరి. ప్రపంచము నందు ఆసక్తి గల ఇంద్రుడు శివుని స్తుతించెను.(188) ప్రపంచమునందాసక్తి గలవారు, మూర్ఖులు, శివభక్తి గలిగివున్ననూ ఆసక్తి వలన ఈశ్వరుని పరమస్థితిని పొందరు.(189) మాలిన్యము లేనివారు, అహంకారము లేని వారు అగు యే జనులు ఆనంద స్వరూపుని, జ్ఞానదాతమ, ఈశ్వరుని, పరమేశ్వరుని, కల్యాణకరుని చక్కగా ఉపాసింతురో (190) వారికి శంకరుడు ఇహపరముల యందు వరముల నిచ్చువాడగును. ఇంద్రుడు ఆసక్తిగలిగి మహేశ్వరుని స్తుతించెను.(191) ఆసక్తిగలవారు శివుని ఎప్పటికీ పొందలేరనుట నిస్సంశయము. కనుక వైరాగ్యము గలవారికి మాత్రమే సదాశివుడు సన్ముఖుడు (192) దేవతల రాజగు ఇంద్రుడు గొప్ప రాగి, తన పనిని నెరవేర్చుకొనుటలో నేర్పరి, కనుక తన కోరికలు ననుసరించి ఎల్లప్పుడూ క్లేశములనొందును.(193)

తనను స్తుతించుచున్న ఇంద్రునితో అన్ని జ్ఞానముల జ్ఞాతయగు మహేశుడు లింగరూపియై, పని యొక్క గౌరవము చేత నిట్లనెను.(194) 'ఓ ఇంద్రా! దేవతలతో కలిసి దానవుడైన వృత్రుని గూర్చి వెళ్ళుము- తపస్సుచే మాత్రమే ఇతనిని జయించుట సాధ్యము.'(195) ఇంద్రుడనెను- 'ఓ శంకరా! ఏ ఉపాయము చేత దైత్యశ్రేష్టుడగు వృత్రుడు నిర్జితుడగును? నాకు విజయము దేనిచే సిద్దించునో త్వరగా తెలియజేయుము.'(196) రుద్రుడనెను. దేవతా శ్రేష్టులు కూడా ఇతనీ యుద్ధమున జయింపలేరుకనుక నీవీనాడు కుత్సితమైన కర్మ చేయవలెను.(197) పూర్వము నా సన్నిధిలో పార్వతి వృత్రుని శపించెను. ఇతను మూడులోకములందునూ ప్రసిద్దుడగు చిత్రరథుడనువాడు.(198) నేనిచ్చిన కాంతివంతమైన విమానము నెక్కి పర్యటించుచూ చిత్రరథుడు నన్ను ఉపహసించుట చేత ఈ రాక్షస యోనిని పొందెను.(199) ఓ ఇంద్రా! కనుక ఇతను రణములో అజేయుడని తెలుసుకొనుము'- అని యోగియగు శివుడు మహేంద్రునితో ననెను.(200) ఇంద్రుడు అట్లేనని నియమమును గ్రహించెను.(201) వృత్రుని బలహీనమైన స్థితిని గూర్చి ఎదురు చూచుచూ ఇంద్రుడు వేయి సంవత్సరాలు అతనికి దగ్గరలోనే నివసించుచూ అతనిని వధించుటకు ఆలోచించుచుండెను.(202) అంతర్వేదియందు ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞచేత బయటనే తన పనిని నెరవేర్చుకొనెను.(203)

ఒకప్పుడు దానవశ్రేష్ఠుడైన వృత్రుడు దైత్యులతో కలిసి తలవని తలంపుగా నర్మదానదికి వచ్చెను.(204) ‘ఇంద్రుడు ఓడిపోయి దేవతల చేత స్వర్గమునకు గొనిపోబడెను- నేనే శత్రువుల వధించినవాడను. నాతో సమానమైనవాడు లేడు.'(205) అని అనుకుంటూ ఎల్లప్పుడూ పౌరుషముతో నుండెను- ఓ విప్రులారా! ఒక ప్రదోషసమయమున నర్మదానది వద్ద. ఆతడుండెను.(207)ఆప్రదోషమువ, త్రయోదశి తిథి శనివారముతో కలిసియున్నది. అపుడు బృహస్పతి ప్రేరేపించగా ఇంద్రుడు,(208) నర్మదాతీరమునలింగరూపియగు ఓంకారుడగు శివుని ప్రదక్షిణ, నమస్కారములచే యథావిధి పూజించేను.(209) ఆ ప్రదోష వ్రత మాహాత్మ్యము చేత, శంకరుని అనుగ్రహము చేత ఇంద్రుడు అదే క్షణమున ప్రతాపవంతుడాయెను.(210) తపస్సు గల వృత్రుడు కూడా ఆ ప్రదోష సమయాన శుండునిచేత మేల్కొలపబడి నిద్రయందాసక్తి గలవాడాయెను- (211) ప్రదోషవేళయందు నిద్రించుటచేత ఆతమ సంపాదించిన తపస్సు యొక్క ఫలమంతా అదేక్షణాన నశించినది. వృత్రుడు తేజస్సు కోల్పోయినవాడాయెను.(212) పార్వతీదేవి శాపముచేత వృత్రుడు భంగపడిన మనోరథము గలవాడాయెను.(213)

సంధ్య యొక్క పాదము ఒకటి గతించువరకు వృత్రుడక్కడే, వివిధ ఆయుధముల ధరించిన దైత్యులతో కలిసి కూర్చొని వుండెను.(214) లోపము కొరకై వెదకుచున్న ఇంద్రుడు, లోపము జరిగెనని తెలుసుకొని, తన శత్రువును వధించుటకు వెళ్ళాను.(215) అప్పటికి దైత్యులు సిద్దముగా నుండిరి. గొప్ప పరాక్రమము గల వారందరు, ఎదిరింప శక్యముగాని వారు ఒక్కమారుగా ఇంద్రుని ఎదుర్కొనిరి.(216) అటు తరువాత మిక్కిలి బలముగల వారితో యుద్దము జరిగెను. దేవతలంతా ఇంద్రునికి సహాయము చేయుటకై వచ్చిరి.(217) అపుడు, దైత్యులు, దేవతలు కూడా వేగము కలిగి యుద్ధము చేసిరి. సురాసురుల నశింపజేయు ఆ యుద్దము రాత్రి జరిగెను.(218) అనేక శస్త్రములతో కూడినదిగా ఆ మహారౌద్రమును కల యుద్ధము ప్రవర్తించుచుండగా, వృత్రుడు సిద్దముగా నుండి తీక్షమైన శూలమును గ్రహించెను.(219) దానితో ఇంద్రుని ఎదుట నిలిచి, భయంకరముగా గర్జించెను. ఆ వాద ప్రతిధ్వనితో ముల్లోకములు భయమునొందెను.(220) మహేంద్రుడపుడు ఐరావతమునెక్కి శోభించెను, చంద్రమండలము వలె శోభించు ఛత్రముతో శోభిల్లు ఇంద్రుడు (221) చామరములతో వీచబడుచూ నుండి దైత్యశ్రేష్ఠుడగు వృత్రునితో నిట్లు పలికేను.(222)

ఇంద్ర ఉవాచః

ఇంద్రుడనెను-

'ఓ పుత్రా! గొప్ప తపస్సు చేత వీపు శూరులలో కూడా మేటివైనావు- గొప్ప బలము కలిగి నాతో యుద్దము చేయుము.'(223) అనగా వృత్రుడనెను- 'ఇంద్రా! ముందు నీవు నన్ను దెబ్బతీసిన తరువాత నేను నిన్ను వధించెదను.(224) అలాగేనని తలచి ఇంద్రుడు ఎదురులేనిది, నూరు అంచులు గలదియగు తన వజ్రాయుధమును ప్రయోగించునంతలో గొప్ప మేథావియగు బృహస్పతి అతనిని వారించెను- అపుడు ఇంద్రుడు బృహస్పతి మాటను మన్నించెను.(225) దేవేంద్రుడు గదనొకదానిని గ్రహించి వృత్రుని దెబ్బతీయగా, 'వృత్రుడు ఆ గదమ పిసినారి అతిథిని వారించినట్లు వారించెను. గదకూడా వ్యర్థమగుట చూచి ఇంద్రుడు చింతనోందేమ.(ఇ) చింతించుచున్న ఇంద్రుని చూచి వృత్రుడు బెదిరించు చున్నట్లుగా అనేమ. ఇంద్రా! నీవింతకు ముందు చేసిన మహాద్భుతమైనది, జుగుప్పము కలిగించు పనిని మరచితివా! దానివల్లనే కదా నీవు గౌతమ మహర్షి శాపమునొంది, దానిచే నూరుకన్నులు గలవాడవైతివి.(228) ఏ శూరులు ఇంద్రియ సమూహమును నిగ్రహించి ప్రవర్తింతురో, వారికే జయము. నీలాంటి వారికి కాదు.(229) పాపులకు కేవలం మహారమైన రణభూమియే, ఇందు సంశయము లేదు.(230)

ఇట్లు దైత్యపుంగవుడైనవృత్రుడు ఇంద్రుని బెదిరించెను. దేవేంద్రుడు మెరుపుతో సమానమైన శూలమునుఝుళిపించెను.(231) వృత్రుడా శూలముతో యుగాంతముల జేయు శంకరుడు తీవ్ర తపస్సుతో శోభించినట్లు ప్రకాశించెను.(232) అట్లు వృత్రుడుండగా చూచి దేవేంద్రుడు అతనిని వధించదలచి ఎదుర్కొనెమ.(233) వచ్చిపడుపడుచున్న ఇంద్రుని చూచి వృత్రుడు అతనికి భయము కలుగునట్లుగా వ్వమ.(234) వృత్రుడపుడు నోరు తెరిచి తనవైపు వస్తున్న ఇంద్రుని మింగివేయదలిచెను. వచ్చిన ఇంద్రుని ఒక్కమారుగా ఐరావతముతో(25) వజ్రాయుధముతో, కిరీటముతో సహా మింగివేసి నర్తించెను. గర్జించెను. ఒక నిమిషములోనే ఇంద్రుడు మింగివేయబడెను.(236) ఇది చూచుచున్న దేవతలు హాహాకారములు చేయదోడగిరి - అప్పుడు భూకంప మేర్పడేమ వేలకొలదిగా ఉల్కలు వేల రాలేమ(27) లోకమంతా చరాచరములతో సహా చీకటితో నిండెను. వృత్రుడపుడు నాట్యము చేయుచూ గొప్ప ప్రకాశము గలవాడాయేమ.(238) అప్పుడు దెబ్బతీయబడిన దేవతలంతా బ్రహ్మమ చేరి, అతనిని ప్రతించి, వృత్రాసురుని దారుణకృత్యమును విన్నవించిరి.(239)

ఆదివివి బ్రహ్మ మిగుల బాధనొంది, విస్మయములో మహేంద్రునికిట్టి కష్టమెట్లు కలిగెను.(240) అని దేవతలతో కలిపి గొప్ప సమాధియందు పరమేశ్వరునిట్లు స్తుతించెను.(241) లింగరూపధారికి, మహాదేవునకు నమస్కారము  విశ్వరూపునకు, విరూపాక్షువకు నమస్కారము.(242) ముల్లోకముల ప్రభువా! వృత్రుని చేత మింగివేయబడిన ఇంద్రుని రక్షింపుము. అనగా అపుడు ఆకాశవాణి అందరూ వినుచుండగా ఇట్లనెను.(243) హితమును కోరుచున్న ఆ వాక్కు లింగపూజయందలి విధినిట్లు తెలిపెను - ప్రదోష వ్రత మందున్న ఇంద్రుడు చేయరానిది చేసెను.(244) ప్రదక్షిణము చేసిన ఇంద్రుడు పీఠికాలంఘన మొనరించేమ. నిర్మాల్యముమ, పీఠికమ, ఛాయాప్రసాదమునంతా వికృతమొనర్చెను.(245) ఎవరు మూఢులై నియమమును దాటెదరో వారు " గణముఖ్యుడగు చండునిచేత దండననొందెదరు. ఇందు సంశయము లేదు. కనుక లింగార్చనతో ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను.(246) అన్ని పాపముల శాంతికై లింగార్చన పరులై దీక్షతో, శ్రేయస్సును పొందు బుద్ధితో లింగపూజను చేయవలెమ.(24) అశరీరవాణిని విని బ్రహ్మ మొదలైన దేవతలు చేతులు జోడించి శుభము నొనరించు ఆ వాక్కునడిగిరి.(248) శివలింగమును మేము ఏవిధముగా పూజించవలెను? ప్రాతః కాలమున, మధ్యాహ్నమున, అట్లే సాయంకాలమున ఏఏ పుష్పములతో పూజించవలెనో తెలియజేయుము.(249,250)

అపుడు ఆకాశవాణి విస్తరముగా చెప్పసాగెను.(251) 'గన్నేరు, జిల్లేడు, వాకుడు, ఉమ్మెత్త మరియు కమలములు (252) రేలపువ్వు, సురపొన్న, పొగడ, వాగకేసరము (253) పెక్కు శ్రేష్ఠ కుసుమములు, శ్రేష్ఠ కమలములు మూడు కాలముల యందునూ పవిత్రములని బుధులు తెలియవలెను.(254) జాతీపుష్పము, మల్లిక, మోగరకము, నీల పుష్పము, కొడిసెపువ్వు, కొండగోగుపువ్వు, కోసంభమమ ఎరుపువర్ణముగల కమలమూ పవిత్రములే.(255) ఈ పుష్పములే మధ్యాహ్న సమయమున లింగపూజ చేయుటయందు విశిష్టములని చెప్పితిని. ఇక సాయంకాలమునకు చెప్పెదను.(256) చంపకములు మూడు కాలములయందునూ పవిత్రములే సంశయములేదు. రాత్రియందు మోగరక పుష్పములు పవిత్రములు.(257) ఇట్లు ఆర్చన యందున్న భేదములను తెలిపి, విధి తెలిసినవారు శివాలయమున, ఎల్లప్పటికీ లింగపూజయందలి విధిని పాటించవలెను.(258) వృషభమునకు మధ్యవచ్చిగానీ, పీఠికకు మధ్యవచ్చిగానీ ప్రదక్షిణము చేయకూడదు. ఆ విధముగా చేసినట్లయితే పాపమును పొందుదురు.(259)

ఇంద్రుడు ఆ విధముగావే రాజసభావాన్ని ఆశ్రయించి ప్రదక్షిణము చేసినందువలన ఆది నిష్పలమే అయినది.(260)

కనుక ఇంద్రుని, ఐరావతముతో సహా వృత్రుడీనాడు మింగివేసెను. ఇంద్రుడు ముక్తుడగునట్లు మీరే చేయవలెను.(261) దేవతలారా! మహారుద్రవిధానము చేత ఇంద్రుడు వెంటనే ముక్తుడవుతాడు. ఇందు విచారణ అవసరం లేదు.(262) అపుడు దేవతలామాటవనుసరించి ప్రయత్న పూర్వకముగా శివుని రుద్ర సూక్తముతో యథావిధిగా ఆర్చించిరి.(263) అట్లే ఏకాదశి రౌద్రముతో రుద్రుని అర్చించి దాని దశాంశతో ప్రతిరోజూ హవనము చేసిరి.(264) ఇంద్రుని వెంటనే విడిపింపగోరిన దేవతలు జపముమ, పూజను, హవనమును చేసిరి. అపుడు శివుని ప్రసాదముచేత దేవరాజైన ఇంద్రుడు వృత్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చెను.(265) అట్లు వచ్చిన అతనిని, ఐరావతము, వజ్రాయుధము, కిరీట కుడ్డలములు, పూర్వ శోభ కలిగినవానిని, గొప్ప శక్తి గలవానిని చూసి (266) గంధర్వులు, అప్సరసలు, యక్షులు, ఋషులు సంతోషించిరి. దేవదుందుభులు. శంఖములు అనేకముగా మ్రోగెను- (267) ఆ క్షణముననే దేవతలకు అమితానందము కలిగెను- ఇంద్రుడు ముక్తుడైన చోటికి శచీదేవి రాగా ఆమెతో ఇంద్రునికి మహర్షులు అభి షేకమున పుణ్యాహవాచనమును చేసిరి.(268, 269) ఇట్లు ఇంద్రుడు ఋషులచే మరల అభిషేకింపబడెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఆ సమయమున భూమి మంగలతమముగా అయినది.(270)

దిక్కులన్నీ ప్రసన్నముగా ఐనవి. ఆకాశము నిర్మలమాయెను. అగ్నులు, మహాత్ముల మనప్పులు కూడా శాంతించినవి.(21) అటుపిమ్మట ఇట్లాంటి శుభములు అనేకములుగా ఇంద్రుడు ముక్తుడవగా కలిగినవి-(22) ఇట్లు శ్రేష్ఠులగు వారీ మహోత్సవము ప్రవర్తించుచుండగా, వృత్రుని భయంకర శరీరము నేలకూలినది.(274) గంగా, యమునలకు మధ్య అంతర్వేది యనుచోట పాపిష్టియగు బ్రహ్మహత్య కూడా నేలపై పడినది.(274) ఇది పుణ్యభూమీ, లోకపావని యని వాసికెక్కినది. ఏ దేశమున వృత్రహత్య స్థిరపడినదో అది పాపముగల దేశము.(275) ఆధికంగా మలము చేరినందున '

మాళవ'మని కీర్తించబడిన మలభూమియందు వృత్రుని గొప్ప శిరస్సు పడెను.(276) ఆరుమాసములలో పడిన ఆతలను ఇంద్రునితో సహా దేవతలంతా నరికిరి. ఇట్లు ఇంద్రుడు వృత్రుని వధించి జయమునొందెను.(27) ఏ అడ్డంకులు, ఉపద్రవములు లేని ఇంద్రుడు ఇంద్రాసనముపై కూర్చుండెను. ఇంతలో దైత్యులందరూ పాతాలముననుండి బలిని సమీపించి ఇంద్రుని మౌరకృత్యమును గూర్చి చెప్పిరి. (278) వారి మాటలను విన్న బలి రోషముతో, ఇంద్రుడు వశములోకి ఎట్లు వచ్చునని' శుక్రుని అడిగెను.(279), అపుడతను జయరథమును పొందుటకు మహాయజ్ఞమును చేయుమని దానిలో విజయము లభించువని బలికి చెప్పెను. (280)

శుక్రుడట్లు తెలుపగా బలియజ్ఞముచేయుటకు సిద్దపడి అందుకు కావలసిన పదార్థములవవిన్నంటిని పెద్దపరిచెను. అతను ఆ పదార్థముల అవసరమువమపరించి కలిపెను.(281) భార్గవుడు మహాయజ్ఞమును ప్రవర్తింపజేయగో బలి దీక్షాయుక్తుడై అగ్నిని కొలిచేమ.(282) విధివల్ అగ్నికి హవ్యము నర్పించుచుండగా దానినుండి బలికోరకు అద్భుతమైన రథమొకటి ఉద్భవించెను.(283) వాలుగు గుర్రములు కలిగి, సింహధ్వజమును కలిగి, అప్రాప్తములన కలిగిన ఆ గొప్ప శోభ గల రథము తెల్లని గుర్రములలో అలంకరింపబడెమ.(284) శుక్రుడు ప్రబోధించగా బలి అవబృథస్నానము చేసి, రథమును పూజించ అధిరోహించేమ.(285) వెంటనే ఇంద్రునితో యుద్ధము చేయగోరి, ఇతర దైత్యులతో కలిసి, వైరోచమడగు బలి స్వర్గలోకమును చేరిన(286) సేవతో కలిసి వచ్చి అమరావతిని అధిరోహించేమ, పురమట్లు ముట్టడింపబడుటమ జూచీ దేవతాశ్రేష్ఠులు చాలా సేపటివరకు ఆలోచించి బృహస్పతితో ఇట్లనిరి.(287) 'ఓ మహానుభావా! దైత్య ప్రముఖులు వచ్చేసారు. ఈ నాడేమి చేయుదము? వారంతా యుద్ధమువ వేర్పరులు, ఎదిరింప శక్యముగాని వారు. మనతో యుద్ధముచేయగోరి వచ్చినారు-' (288) ఆవగా విని బృహస్పతి దేవతలతో అమ(289) పనోరమగు ఘృతుడు మొదలగు ఈ దౌత్యులంతా భృగువు చేత ప్రేరేపింపబడివారు- తపప్పు ద్వారా, పరాక్రమము ద్వారా కూడా వీరిని జయించుట శక్యము కాదు.'(290) గుణముతో కూడిన ఆ మాటను విని దేవతలంతా సిగ్గునొందిరి. ఇంద్రుడు కూడా బుద్ధిపరిపరి విధాలు పోగా, భయమునొందుచూ, చింతించుచూ, సిగ్గుపడి నిలుచుండెను.(291)

ఇది శ్రీస్కాందమహాపురాణము యందలి మొదటి మాహేశ్వరఖండమందలి కేదారఖండమందున్న బలియను రాక్షసుడు పంగ్రామమునకు సిద్ధపడుటను వర్ణించు పదిహేడవ అధ్యాయము సమాప్తము.