స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
25వ అధ్యాయము
హిమవంతుని చేత సత్కరింపబడిన దేవతలు తమ పరివారముతో, వాహనములతో ఆనందముగా అక్కడ కూర్చొనిరి (1) బ్రహ్మ నివసించుటకు విశ్వకర్మ విశాలమైన భవంతివి కాంతివంతముగా నిర్మించేను.(2) త్వష్ట విష్ణువు గురించి కాంతివంతము, విచిత్రమూనగు భవనము నొకదానిని నిర్మించెను - అందమైన వండీగృహమును కూడా స్వయముగా నిర్మించెను (3) అట్లే తెల్లనిదై అత్యంతమనోహరముగా నుండి దేవతాశ్రేష్ఠులచే పూజింపబడునది, కైలాసలక్ష్మి కాంతిచే ప్రకాశించునది యగు భవంతిని నిర్మించెను (4) హిమవంతుడు శంకరుని ఆ భవంతిలోనే గొప్ప ఐశ్వర్యముతో నుంచెను (5) ఇంతలో, మేన సఖీగణముతో, మహర్షులతో కూడుకున్నదై శివుని నీరాజనముకొరకు వచ్చెను. (6) అపుడు వాద్యములు మ్రోగగా ఆ ధ్వనిచేత ముల్లోకములూ నినదించెను. మేన తపస్వియగు శంకరునికి నీరాజనమిచ్చినది. (7) శంకరుని చూచి పరమసాధ్వీయగు మేన వరుడెవరో అపుడు తెలుసుకొనెను. పార్వతి చెప్పినట్లుగా నున్న వరుని తెలుసుకొని మేన విస్మయమునొందెను.(8)
నావద్ద పార్వతి మునుపు చెప్పిన దానికంటే మిక్కిలి సౌందర్యము పరమశివునిలో చూచుచున్నాము. ఇపుడు వేమ పరమేశుని అనిర్వచ్యునిగా చూచాను (9) అని ఈ విధంగా విస్మయమును పొందిన మేన విప్రపత్నులతో కూడినదై దివ్య వస్త్రముల రెంటిచే శోభించెను. (10) అనేక రత్నములతో శోభిల్లుచున్న దివ్యమైన కంచుకిని దేవి ధరించగా అది మిగుల శోభించెను. (11) అపుడు దేవి దివ్య రత్నములతో అలరారుచున్న హారమును, శుద్ద బంగారముతో చేయబడిన గొప్ప వలయములను ఆభరణములను ధరించమ. (12) అట్టి దేవి సఖులతో, విప్రపత్నులతో సేవించబడిన దేవి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అక్కడే కూర్చుండిమ. (13) ఇంతలో, గరుడు అక్కడికి వచ్చి ఇట్లనెను. ‘పాణి గ్రహణము కొరకు శివుని మందిరమునకు కొని రావలయును - త్వరగా ఈ సమయమున తీసుకొని రండు’ (14) అనగా విని పర్వతములన్నీ తమ తమ భార్యలతో సహా శివుని కొని వచ్చుటకు లేచి నిలిచిరి (15)
వారందరూ మంగళద్రవ్యములను చేత ధరించి గొప్ప ఐశ్వర్యములో మండిరి. వారు, వారి భార్యలు అలంకరించుకొని యుండిరి. (16) ఆ విశాల ప్రేమవేత్రలు అనేకి బహుమతులను తెచ్చిరి. అపుడు వాద్యములమౌష బ్రహ్మసూష వినబడగా దానితో వారు (17) భార్యలతో కలిసి ప్రమథులలో, చండితో పేవించబడుచున్న మహేశ్వరుని వద్దకు వచ్చిరి - (18) అపుడు లోకములకు శుభము గూర్చు శంకరుడు మహర్షులతో, దేవగణములతో కూడి యుండెమ(19) వాద్యముల ఘోషను వివి శంకరుని సేవకులు దేవతలు, ఋషులు కూడివుండగా ఒక్కమారుగా లేచిరి. (20) ఆట్లే మిగిగణము, దాని వాయకుడు, ఆట్టే కాంతివంతమునగు గణనాయకులందరూ శివుని చూచి లేచినిలిచిరి.(21) అతి ప్రచండమైవ యోగివీ చక్రము టంకారాభేరి వివాదముతో వెంటనే గొప్ప ఐశ్వర్యము గలది భయంకరమైనదియగు చండిని ముందుంచుకొని వచ్చినది. (22) ఆ చండి కంఠమున కర్కటకమమ సర్పముమ హారముగా ధరించినది. అట్లే తేళ్ళమ,కీటకములమ ధరించమ. (23) కాళ్ళకు, చేతులకు, చెవులకు ఆభరణాలను ధరించెను. రణమున మరణించిన వీరుల తలలమ ఎదపై ధరించెను (24)
ఏనుగుచర్మమును ధరించినదై యోగినీ చక్రముతో కూడియున్న చండి చుట్టూ క్షేత్రపాలురు, భైరవులు యుండిరి. (22) అదే విధంగా, భూత, ప్రేత, కపటులు, వీరభద్రాది గణములు మొదలగునవి దక్షయజ్ఞమును నాశనము చేయుటకు శివుని చేత మునుపు ఆజ్ఞాపింపబడినవారు చండి చుట్టూ వుండిరి. (26) అదే విధంగా, కాళీ, భైరవి, భయముగొలు మాయ, త్రిపుర, జయ, క్షేమకరియగు శుభ (27) ఇతర దేవతలందరూ సదాశివుని గూర్చి వెళ్ళగోరి భూతప్రేతములతో కూడి అక్కడికి వచ్చిరి.(28) వీరందరినీ శివభక్తుడగు జనార్ధనుడు చూచెను - దేవతలను మహరులను, అనసూయను, ఆరుంధతిని ఉద్దేశించి (29) విష్ణు విట్లనెను - 'ప్రభూ! లోకపాలురచే పూజింపబడిన చండిని సమీపముననుంచుకొనుము - (30)
విష్ణువు అట్లనగా విని జగదీశ్వరుడు శంకరుడు నవ్వుచూ చండితో ఇట్లనెను (31) ‘చండీ! వివాహమైనంతవరకు వీవిక్కడే వుండుము. నా భావములను, కార్యాకార్యములను నీవెరుగుదువు.’(32) అమితతేజస్సుగల శివుని మాటను విని చండి మరియు ఇతర ప్రమథులు మిగుల కోపించి విష్ణువునుద్దేశించి ఇట్లనిరి. (33) ‘ఎక్కడెక్కడ శివుడు వెలయునో అక్కడక్కడ మేముండెదము - (34) పరమాభ్యుదయమున నీవు మమ్ములనెందుకు వారించుచున్నావు? అని వారనగా కేశవుడు వారితో నిట్లనెను - (35) మిమ్ములనందరినీ ఉద్దేశించి నేనన్నాను. కోపగించవలదు - (36) అనగా చండీ మొదలగు గణములన్నీ విష్ణువు మాటలతో మండుచున్న గుండెలు కలిగి ఏకాంతము నాశ్రయించిరి. (37) అంతలో పర్వతేంద్రుడైన హిమవంతుని మత్రులందరూ తమ తమ భార్యలతో మహేశ్వరుని గూర్చి త్వరగా వచ్చిరి.(38)
ఐదువాద్యముల ఘోష బ్రహ్మసూష గీతశబ్దము నీవిచే, మరియు స్త్రీలతో కలిసి (39) శంకరుడు అందరితో కూడివున్న చోటికి ఆ మంత్రులు వచ్చిరి - సదాశివునికి కలశములతో స్నానము చేయించి స్త్రీలు మంగళగీతముతో సర్వాభరణభూషితుని చేసిరి. (40) ఋషులు, దేవగంధర్వులు, అట్లే ఇతర పర్వతశ్రేష్ఠులు, స్త్రీలు శివునికి ఎదుట నడిచిరి. (41) తలపై నిలిపిన గొప్ప ఛత్రముతో, వీచుచున్న చామరములతో, ముకుటముతో పరమశివుడు అధికముగా వెలుగుచుండెను - బ్రహ్మ, విష్ణువు, చంద్రుడు, లోకపాలురు. (42) ఎదుట వడచుచూ గొప్ప కాంతితో ప్రకాశించుచుండిరి. అట్లే శంఖములు, భేరీ వాద్యములు, పటహములు (తప్పెటలు) ఆనక, గోముఖమొదలగు వాద్యములు మోగు చుండెమ.(43) అట్లే గాయకులందరూ పరమమంగళమును గానము చేయుచుండిరి. ఆ మహోత్సవమున వాద్యములు మరల మరల మ్రోగింపబడినవి.(4) అరుంధతి, అనసూయా, లక్ష్మి ఇతర మాతలచేత కూడియుండిరి (4) వీరందరితో కూడియుండి, చంద్ర, సూర్య, వాయు,అగ్ని, లోకపాలురు,మహర్పులు వీరందరు చుట్టూ విలిచి యుండ జగదేకబంధువగు శివుడపుడు గొప్పకాంతితో విలసిల్లిన (46)
వాయువు అతనికి వీచుచుండెను. సాక్షాత్తు చంద్రుడే అతనికి ఛత్రమై నిలిచెను - సూర్యుడు ఎదుట ప్రకాశమునిచ్చువాడాయెను - ఆతవి సన్నిధిన విష్ణువు లక్ష్మితో కూడి యుండెను. (47) మునులతో గూడి దేవతలు పుష్ప వర్హమును కురిపించిరి. దేవదానవమానవుల చేత పూజింపబడుచున్న పరమశివుడు గొప్ప ఐశ్వర్యముచే వెలుగొందుచున్న బంగారు కుట్టిమగల గృహమును ప్రవేశించెను. (48) దేవతలు స్తుతించుచుండగా శివుడు యజ్ఞమండపమును ప్రవేశించెను(49) హిమవంతుడు పరమశివుని ఏనుగు పైనుండి చేయినోసగి దింపెను. పీఠమునకూర్చొబెట్టి నీరాజనమిచ్చెను (50) పఖులతో గూడి మేన బ్రహ్మ ఇచ్చిన మధుపర్కము మొదలగువానిని శివునికిచ్చెను(51) బ్రహ్మ ప్రేరేపించుచుండగా పురోహితుడు ఆయా కృత్యముల జేసెను. ప్రస్తావమువంటి కల్యాణకరమగు మంగళమును అతడాచరించెను. (52) అన్ని అలంకారముల ధరించి సుందరముగా నున్న పార్వతి నిలుచున్న వేదికగల అంతర్వేదిని శివుడు ప్రవేశపెట్టబడెను. (53) బ్రహ్మ, విష్ణువులతో గూడి శివుడు అక్కడికి గొని రాబడెను. బృహప్పతి మొదలగు వారు లగ్నమును గూర్చి వేచిచూచుచూ యుండిరి (54)
ఆ ఘటికాలయమునందు గరుడమ ముని కూర్చొవేమ. ఘటము వీండువరకు ప్రణవోచ్చారణము జరుగుచుండిన. (55) ‘ఓ పుణ్య’ యని పలుకుచు గర్గుడు వధువగు పార్వతి అంజలిని గ్రహించమ. అక్షతలను చేతినిండుగా గ్రహించి, పార్వతి శివునిపై కురిసింపదేపెను.(56) పెరుగు, అక్షతలు, దర్భ మొదలగు వావినే పార్వతి శివుని పూజించమ. సుందరవదనయగు పార్వతి గొప్ప ఆనందమువొందెను. (57) ఎవరి కొరకు మహాదేవియగు పార్వతి ఘోరతపస్సు వాచరించవో అట్టి శివుని ఆమె చూచుచుండెను. (58) ఆ తపస్సు చేత పార్వతి జగత్తుయొక్క ప్రాణహితువగు శివుని పొందిమ. అంతట నారదుడు, గంగ మొదలగువారు, పవకాదీఋషులు ‘పార్వతిని కూడా పూజించుమని’ శివునితో వనిరి. అపుడు శివుడు ఆర్ఘ్యము, అక్షతలతో పార్వతివి పూజించెను. (60) ఇట్లు పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒకరినొకరు పూజించుచూ శోభిల్లిరి. (61) ముల్లోకములమండు శోభచే విలసిల్లుచూ ఒండొరుల జూచుచున్న వారిద్దరికీ, లక్ష్మీదేవి, సావిత్రీదేవి మరియు విశేషముగా అరుంధతి వీరాజవము పట్టిరి.
ప్రీతితో విప్పారిన కన్నులుగల అనసూయ పార్వతీ పరమేశ్వరులను జూచి వారికి నీరాజనము పట్టెను.(63) అదే విధంగా, బ్రాహ్మణ స్త్రీలు మరల మరల ఆ దంపతులను జూచుచూ, ఆనందముతో నవ్వుతూ, వారికి నీరాజనమీడిరి. (64) రోమశుడు చెప్పసాగెను- ‘ఇంతలో గర్గాచార్యుడు చెప్పగా హిమవంతుడు మేనతోకలిసి కన్యాదానమును చేయుటకు అక్కడికి వచ్చెను - (65) ఆన్ని ఆభరణములతో నలరారు, మేన బంగారుకలశమును గ్రహించి హిమవంతుని అర్ధాంగియై నిలచెను.(66) అపుడు హిమవంతుడు వరముల నిచ్చు విశ్వనాథునికి, బ్రహ్మ, విష్ణు, పురోహితుడగు గర్గునితోకూడి కన్యాదానమును చేయుచుంటిని. (68) ఓ బ్రహ్మ! ఈ సమయమున జేయు ప్రయోగమును తెలియజేయుము. అవగా కాలమును తెలిపిన ద్విజోత్తములు ఆట్లే యనికి (69) ‘నాయనా! నీ కులగోత్రములను చెప్పుము.’ అనగా వెంటనే సుముఖుడగు శివుడు విముఖుడాయెను. శోకింపబడలేవి వాడు శోకమునొందెను. (70)
అపుడు దేవవరులు, ఋషులు, గంధర్వయక్షమువి పెద్దగణములు మహేశుని విరుత్తరముఖువిగా జూచినవి, అపుడు నారదుడు మిక్కిలి హాస్యముచేయనారంభించేమ (71) బ్రహ్మపుత్రుడగు వారదుడు వీణను బయటకు దీయగా, పర్వతుడు అతనిని ఏణమ మ్రోగించవద్దని వారించమ. అపుడు నారదుడిట్లనెమ. ‘సాక్షాత్తు భవుని గోత్రముచెప్పమని అడిగితివి కదా! (73) ఓ పర్వతా! పరమశివుని కులమూ, గోత్రమూ వాదమే. శివుడు వాదమువప్రతిష్ఠింపబడియుండగా, వాదము శివునియందు ప్రతిష్ఠింపబడియున్నది - (74) కనుక నాదమయుడగు శివుడు నాదము ద్వారా పొందబడుమ - కనక మహానుభావా! నేవీ వీణను మోగించితిని. (75) బ్రహ్మాది దేవతలే పరమశివుని కులగోత్రములను తెలియజాలరు. మిగిలిన వారి గూర్చి చెప్పునదేమి? (76) నీవు మూడుడవై శివునీ వాచ్యాహచ్యమును ఏ మాత్రమూ తెలియకుంటివి - విషయములు బహిర్ముఖములు. (77) ఆగమ సంబంధమైనవన్నీ ఇచ్చట నశించినవగును. నీఅల్లుడగు శివునికి రూపము లేదు. కులము, గోత్రము లేదు - విజ్ఞుడవగు నీవు ఈ విషయమున విమర్శన చేయరాదు. (79)
ప్రభూ! మిగుల పలికి లాభమేమి? అందరూ శివుని తెలుసుకొనజాలరు. ఈ ఋషులందరూ అతని అజ్ఞానముచేతనే మోహితులై అతనిని తెలియలేకున్నారు. (80) ఆ పరమశివుని శిరస్సును బ్రహ్మకూడా నెఱుగడు. అలాగే, పాతాళమునకు వెళ్ళిన విష్ణువు కూడా శివుని చూడలేదు. (81) అగాధమైన ఆ గొప్ప లింగముచేతనే ముల్లోకములూ వ్యాపించినవని తెలియుము. దీనంతటిచే ఫలమేమి? (82) హిమపర్వతా! నీ పుత్రిక నిజముగా శివునారాధించినది. అదెట్లో వాస్తవముగా నీకు తెలియదు. (83) వీరిద్దరినుండే విశ్వముత్పన్నమై వీరి చేతనే నిలిచి యున్నది – ‘అని మహాత్ముడగు నారదుడనగా హిమవంతుడు మొదలగువారు, ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ విస్మయమునొంది బాగు, బాగు యని పలికిరి. (85) విజ్ఞాలగు వారందరూ ఈశ్వరుని గాంభీర్యమును తెలిసినవారై విస్మయముతో పరస్పరముమాట్లాడిరి - (86) ఋషులిట్లనిరి - ఎవరిచే ఈ జగత్తు విశాలమైనదిగా సృజింపబడెనో, ఏ తత్యము పరాత్పరము, ఆత్మజ్ఞానరూపమైనదో, ఏది సర్పమై స్వతంత్ర పరమేశ్వర భావముచే తెలియునో అట్టి, ముల్లోకములే తన రూపమైన మహాత్ముడు ఈ శివుడే - (87)
ఇది శ్రీస్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు శివశాస్త్రమున శివపార్వతి వర్ణనమను ఇరువది ఐదవ అధ్యాయము.
