స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

22వ అధ్యాయము

సూతుడు చెప్పెన- ‘ఇట్లు పరమేష్ఠియగు విష్ణువనగా దేవతలు అపుడు శివుని చూచుటకు వెళ్ళిరి. (1) వారు సముద్రముయొక్క ఆవలి తీరములో పరమసమాధిలో యోగ పీఠముపై కూర్చున్న వానిని, గణములతో కూడియున్న వావిని (2) వాసుకిని, కంబళాశ్వతరములను యజ్ఞోపవీతముగా కర్ణాభరణాలుగా ధరించు చున్నవావివి (3) కర్కోట, పులహులను కంకణములుగా ధరించుచున్నవానిని (4) శంఖక, పద్మకులమ నూపురములుగా ధరించి ప్రకాశించుచున్నవానిని కర్పూరము వలె తెల్లనైనవానిని, వీలకంఠుని, వృషభముతో నున్న వానిని, దేవతా శ్రేష్టుడగు పరమశివుని చూచిరి.(5) అపుడు బ్రహ్మ విష్ణువు, ఋషులు, దేవదానవులు వేదోపనిషదన్వితమైన వివిధ సూక్తములతో స్తుతించిరి.(6)

బ్రహ్మ పలికెను. ‘రుద్రునకు, దేవునకు, మదనాంతకునకు, భర్డునకు, భూరిభాగ్యునకు, త్రినేత్రునకు, తివిష్టపునకు (7) శిపివిష్టునకు, భీమునకు, శేషశాయికి నమస్కారము - త్ర్యంబకునకు, జగద్ధాతకు, విశ్వరూపునకు నమస్కారము (8) మహేశ్వరా! వీవు అన్ని లోకములను ధరించువాడవు, తల్లి, తండ్రి, ఈశ్వరుడవు నీవే- గొప్ప కృపతో మమ్ము రక్షించుము’ (9) అని దేవతలు స్తుతించగా, నంది వారితో ఇట్లనెను. ‘మీరే ప్రయోజనం కోపమిచ్చటికి వచ్చితిరి? మీ మనసులో ఏమున్నది?’ (10) అనగా దేవతలు దేవతల పనిని గూర్చి శివుని ప్రార్థించుటకు వచ్చితిమని తెలిపిరి. అపుడు మహాత్ముడగు నంది వారి పనిని గూర్చి ధ్యానమువనున్న శివునకు విన్నవించెను.(11) దేవేశా! బ్రహ్మ మొదలైన దేవతాగణాలు, సురసిద్ధ సంఘాలు నిన్న చూచుటకు త్వరపడుచున్నవి. అసురులచేత పీడింపబడి, బెదిరింపబడి ఈ దేవతలు పనిమీద నీ వద్దకు వచ్చిరి.(12) కమక నీవు దేవతలను రక్షింపవలెను.’ అని నంది శివుని ప్రార్థించెను.(13) పరమ కోపనుడైన శివుడు నెమ్మది నెమ్మదిగా సమాధిస్థితినుండి బయటకు వచ్చి ఇట్లనెను.(14)

మహాదేవుడనెను- ‘మహామభావులారా! బ్రహ్మాదిదేవతలైన మీరు నా వద్దకెందుకు వచ్చారో చెప్పండి.(15) అనగా అపుడు బ్రహ్మ దేవతల ఈ మహత్తర కార్యమును గూర్చి చెప్పేమ- పరమశివా తారకుడు దేవతలకు ఒక గొప్ప కష్టముమ కలిగించగా దానిని వీకు విన్నవించుటకు నీ వద్దకు వచ్చాము.(16) శంకరా! ఆ తారకుడు నీ ఔరసపుత్రుడి చేతిలో మరణించుమ. ఇదీ సత్యము. (17) కనుక ఓ దేవా! నీవు పార్వతి కుడిచేతిని వివాహమున గ్రహించవలెను. మహామభావా! నీకు పాణిగ్రహణమున గిరీంద్రునిచే ఇవ్వబడునట్లుగా వీవు చేయుము.(18) అని బ్రహ్మ అనగా వినీ నవ్వుచూ శివుడిట్లనెను. సర్వాంగ సుందరియైన పార్వతిని నేమ ఎపుడు పత్నిగా గ్రహించెదనో అపుడు సురేంద్రులు, ఋషులు, మునులు అందరూకామము గలవారై మోక్షమార్గమున అసమర్థులగుదురు.(19) అందరి కార్యము సిద్ధించుటకై నేను మదనుని దహించితిని. సుందరియగు పార్వతికి అధికారమునిచ్చుచుంటినీ(21) దేవతలారా! అప్పుడే పార్వతి మదనుని జీవింపజేయగలదు. బ్రహ్మా! ఇందు విచారించవలసినది లేదు- (22) దేవతలారా! ఈ విధంగా విచారించి కార్యవిచారణను చేయవలెను. మదనుడు దహింపబడుటచేతనే దేవతల గొప్పపని నెరవేరినది.(23)

నా చేత మీరంతా నిష్కాములుగా చేయబడివారు. ఇందు సంశయములేదు. నేనెట్లు వుంటినో మీరునూ ప్రయత్నముచే ఆ విధంగా కాగలరు.(24) గ్నో తపస్సుచేత మనమందరమూ పరమానందములో సుఖమునొందెదము, కష్టమైన తపస్సును చేయగలము. మీరు యోగము చేత సుఖము నొందుడు. మదనుడు దీనిని విస్మరించెమ-(2) కామము వరకము కొరకి. ఆ కామము నుండి క్రోధము పుట్టుమ.(26) క్రోధము నుండి సమ్మోహము, సమ్మోహము నుండి మనో విభ్రమము కలుగును. దేవతాస్థులైన మీరంతా కామక్రోధములను వదలి నా మాటమ గూర్చి ఆలోచించండి. వేరొక విధముగా కాదు.'(2) అని వృషభధ్వజుడైన మహాదేవుడు తెలిపి, సురగణములను, ఋషిగవములను ప్రబోధింపజేసెమ.(28) అతనపుడు ధ్యాపమునాశ్రయించి మిన్నకుండెను. ముందు వున్నట్లుగానే గణములతో కూడి వుండెను.(29) ధ్యానములో మన్న పరమశివుని చూచి వంది-బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలనందరినీ పంపివేయుచూ, నవ్వుచూ ఇట్లనెను.(30) ‘ఆలస్యము చేయకుండా మీరు వచ్చిన మార్గమువనే వెళ్ళిపొండి. వారందరూ అట్లే తమ తమ స్థానములకు వెళ్ళిరి.(31)

వారందరూ వెళ్ళిపోగా పరమశివుడు సమాధిమగ్నుడాయెను. ఆత్మయందాత్మని నిలిపి ఆత్మచేత సమాధిస్థితుడాయెను.(32) పరాత్పరము, స్వచ్ఛము, నిర్మలము, నిరవగ్రహము, విరంజనము, నిరాభాసము అగు తత్యముగా యుండెను. ఎవరియందు పండితులు రక్తులగుదురో (33) దేనిని సూర్యచంద్రులు, అగ్ని, నక్షత్రాలు ప్రకాశింపజేయజాలనో, వాయువు వీచదో, ఏ వస్తువు ఆలోచవకంటినూ సూక్ష్మమైనదో, సూక్ష్మమైన దానికంటెనూ అతి సూక్ష్మమైనదో, (34) ఏది నిర్దేశింప వీలులేనిదో, ఆలోచింప వీలులేనిదో, వికారములు లేనిదో, నిరామయమైనదో, జ్ఞానమే స్వరూపముగా కలదో, విరక్తులు దేనిని పొందెదరో (35) ఏది శబ్దాతీతము, నిర్గుణము, నిర్వికారము, సన్మాత్రము, జ్ఞానముచే పొందదగినది అయిననూ ఇతర విధముగా పొందవీలులేవిధిగా వేదాతీతములైన మంత్రభూతములైన ఆగమములతో చెప్పబడుచున్నదో (36) అట్టి సద్వస్తువుగా పినాకపాణి, వృషభధ్వజుడగు పరమశివుడు సమాధి స్థితిలో నుండెను - మదనుని సాక్షాత్తూ దహించిన పరమశివుడు తపమునాచరించుచునుండెను.(37)

లోమశుడనెను - పార్వతి అపుడు ఘోరమైన తపస్సును చేయగా రుద్రుడు కూడా మిగుల భయపడెను.(38) పార్వతి గొప్ప తపస్సు చేసి అన్నింటిని ఇచ్చువాడు, కేవలుడు, స్థాణువు, సత్స్వరూపమున నున్న వాడగు శివుని జయించెను.(39) అపుడు శివుడు ఆ తపస్సు చేత జయింపబడి, సమాధిస్థితినుండి చలించినవాడై (40) త్వరగా పార్వతి వున్న చోటికి వెళ్ళి, సఖులతోనున్న పార్వతిని చూచెను.(41)

చంద్రకళవలె వేదికపై నున్న ఆ సుందరిని చూచి పరమశివుడు వటురూపమును వెంటనే ధరించెను.(42) బ్రహ్మచారి స్వరూపములో మహేశుడు సఖుల మధ్యకు వెళ్ళి ‘ఈ సుందరి ఎందులకిట్లు, పఖులమధ్యమన్నది?(41) ఈ సుందరి ఎవరు? ఎవరి కవ్య? ఎక్కడిమండి వచ్చినది? తపస్పువెందుకు చేయుచున్నది? సఖులారా! ఇదంతా నాకిపుడు వాస్తవముగా చెప్పండి.’ (44) అనగా అపుడు పార్వతి పఖి అగు జయ అను స్త్రీ పార్వతి తపస్సు చేయుటకు కారణము రుద్రుడని చెప్పినది. (45) ‘ఈ పార్వతి హిమవంతుని పుత్రిక. తపస్సు చేత రుద్రుని పతిగా పొందగోరిన పార్వతి ఇక్కడ కూర్చొని (46) ఇతరులు దాట వీలులేని ఘోరమైన తపస్సు వాచరించినది. ఓ వటూ! వా వాక్యమును తెలుసుకోమము. ఇది సత్యము. అవి ఇయ చెప్పెను. (47) అదివిని వటురూపముననున్న మహేశుడు నవ్వి సఖులందరూ వినుచుండగా ఇట్లనెను. (48) పఖులారా! ఈ పార్వతి మూఢురాలు. హితమును ఆహితమును తెలుసుకొనలేకున్నది. రుద్రుని పొందుట కొరకుతమునాచరించుట ఎందులకు? (49) ఆ పరమశివుడు అమంగళమైన వాడు, కపాలమున ధరించువాడు, శ్మశానమే వివాపముగాగలవాడు. అందరూలమంగళుడైన అతనిని అనవసరముగా శివుడని అందురు. (50)

సఖులారా! ఈమెచేత వరింపబడి రుద్రుడు ఈమెతో కలిపి వచ్చునపుడు ఈ సుందరి నిప్పంశయముగా అశుభురాలగును.(51) ఏ రుద్రుడు దక్షుని శాపముచేత వికృతుడై, యఙబాహ్యుడు, విటుడైనాడో, ఎవరికి గొప్ప విషముగల సర్పములు ఆంగాభరణాలైనాయే (52) ఏ రుద్రుడు శవముల భస్మమును ఒంటికి అలుముకొనునో, పిశాచములతో, ప్రమథులతో నిరంతరమూ కూడివుండువాడు, చర్మమున్ ధరించువాడు (53) అగునట్టి రుద్రునితో ఈ సుకుమారికేమి పని? మరణించగోరుచున్న పార్వతినీ పిశాచము వలె సఖులు నివారించవలెమ.(54) మనోహరుడైన ఇంద్రుని గొప్ప తేజస్వియగు యముని, విశాలాక్షుడగు నైఋతుని, జలాధిపతియగు వరుణుని (55) కుబేరుని, వాయుదేవుని, విభావసుని వదలి రుద్రుని కోరి మరణించగోరుచున్న పార్వతిని ఆపండి’ అని ఈ విధముగా, పఖులు వినుచుండగా వటురూపమున మన్న పరమేశ్వరుడు మాట్లాడుట విని తపప్పుచేయుచున్న (56) పార్వతి వటువుపట్ల కోపగించెను.(57) ‘జయా! విజయా! పార్వీ! ప్రఘోచనాకి సులోచనా! నేను చేసినది సరియైనదే.(58) మీకీ వటువుతో నేమి పని? ఇపుడు దేవతలనందించువాడు వటుస్వరూపమును ధరించి వచ్చినాడు.(59)

ఇతనిని పంపించివేయండి. ‘ఇతనితో నేమిపనీ?’ అని పార్వతి, వటు రూపమువమన్న రుద్రుని కూడా ఉద్దేశించి తరువాత ఇట్లనెను.(60) ‘పటువా త్వరగా ఇక్కడినుండి వెళ్ళుము. ఇక ఇప్పుడు నీవు వుండరాదు. ఎందులకీ ప్రలాపము? వీకే ప్రయోజనమూ కలుగదు’ (61) ఆవి పార్వతి బెదిరించగా, అపుడా వటువు మరల నవ్వి, స్థిరముగా నిలిచి ఇట్లనెను.(62) ఎమ్మది నెమ్మదిగా, పార్వతి చెలికత్తెయగు విజయలో శివుడు ఇట్లనెను. సుందరీ! ఎందుకీ తవ్వి కోపమునొందుచున్నది? కారణమేమి? (63) అందరూ అవవలసిన దానివి వేమ చక్కగా అవినపుడు, సత్యమును చెప్పినపుడు సుందరి ఎందులకు మిగుల కోపించినది? (64) శంభుడవి లోకమున పిలువబడువాడు భిక్షుకుడు, భిక్షుకులకు ప్రియుడు. వేవన్న దానిలో అసత్యమున్న ఎడల కోపమునొందుట ఉచితము. (65) ఈ పార్వతి సుందరి, సదాశివుడేమో విరూపి. పార్వతీదేవి చక్కని విశాలనేత్రములు గలది. మరి శివుడు విరూపాక్షుడు.(66) ఇటాల్లంటి రుద్రుని పట్ల పార్వతి మోహమునొందుట ఎట్లు? భాగ్యము గలవాడు, రతీప్రియుడగు పతిని కదా స్త్రీలు భావించవలిసినది! (67) గుణాత్మకయగు పార్వతి విర్గుణుడగు శివునిచేత ఎట్లు మోహితురాలాయెను? ఏ ఒక్కడూ శివుని గూర్చి వినలేదు. అతనిని చూడలేదు. అతనిని తెలుసుకోలేదు. (68)

కామముతోనున్నవారికి సదాశివుడు దుర్లభుడు. గొప్ప తపస్సుచేత పార్వతి గర్వించినది. (69) శివుడు ఎల్లప్పుడూ స్థాణువు, అట్టి పతిని ఎట్లు పొందును? విశాలాక్షీ! నేనన్నదేమి? ఈ పార్వతి ఇపుడు కోపగించిన దెందులకు?(70) వరులకు అందువా విశేషముగా స్త్రీలకు కోపమున్నంత వరకు ఆ కోపముచే ఆర్జించిన పుణ్యము అంతా భస్మీభూతమగుమ. (71) నేను సత్యమును చెప్పుచుంటివి. కామము, క్రోథము, లోభము, దంభము, మాత్సర్యము.(72) హింసా, ఈర్ష్య, దీని వలన ప్రపంచమంతావశించును. కనుక తపస్వులు కామక్రోథములను విడిచివేయుట యుక్తమే!(73) జ్ఞానమాత్రమే నైన ఈశ్వరుని జ్ఞానులు ఎల్లప్పుడూ హృదయమున విశేషముగా భావనచేయవలెననిన, అందరూ మౌనులై, తపస్సు నాశ్రయించి మాత్రమే అట్లు చేయవలెను- వేరొక విధముగా శివుని చింతించుట సాధ్యము కాదు’ (74) అని వటువు పలుకగా విని విజయ త్వరగా అతనితో నిట్లనేమ. ‘మూరుడా! వెళ్ళిపొమ్ము! నీకేమీ పనిలేదు- మరొక మాట మాట్లాడరాదు.’ (75) అని వాక్యజ్ఞానముగల విజయ తనతో వాదించుచున్న పరమశివుని విడచివేపెను.(76) వెంటనే సఖులందరికీ కనబడకుండగా, పరమేశ్వరుడు పార్వతిని గూర్చి అంతర్షితుడాయెను.(77)

వెంటనే పరమశివుడు అపుడు నిజరూపమును ధరించి సాక్షాత్కరించెను. పార్వతి ధ్యానమువ, ఆత్మధ్యానము చేయుచుండగా (78) హృదయమునమన్న దేవేశుడు అపుడు బాహ్యదృష్టికి కూడా గోచరమాయెను. విశాలనేత్రములు గల పార్వతి కళ్ళు తెరచి దేవదేవుని, సర్వలోక మహేశుని చూచెను. (79) అపుడు శివుడు రెండు భుజములు, ఒక ముఖము గలిగి, కృత్తివాసుడుగా నుండెను. జటాజూటమును, చంద్రరేఖను, గజచర్మను ధరించేను.(80) కంబల, అశ్వతరములను గొప్ప పర్పములు కర్ణాభరణములాయెనుసర్పరాజగు వాసుకి హారముగా చేయబడెను.(81) శోభను కలిగించు, గొప్ప పర్పముల వలయములమ రుద్రుడపుడు ధరించియుండెను.(82) ఇట్లున్న పరమశివుడు అపుడు పార్వతి ఎదుట నిలిచి త్వరగా వరము కోరుకొమ్మని అమ(83) ఆపుడు మిగుల సిగ్గును పొందిన పార్వతి శంకరునితో ఇట్లనెమ- దేవేశా! నీవు నా నాథుడవు. పూర్వము చేసిన దక్షయజ్ఞ వినాశమును మరిచితివా?’ (84) ఎవరి కొరకు ఆ యజ్ఞము నాశనము చేయబడెనో అట్టివాడవు నీవు. ఇక నేను కార్యసిద్ధికై మనయందు జన్మించితిని (85) దేవదేవేశా! దేవతలకొరకు తారకుని వధను గూర్చి నీనుండి నాకు కుమారుడు కలగగలడు.(86)

కనుక ఓ మహేశ్వరా! నీవు నా మాట ననుసరించి చేయవలెను. వెంటనే హిమవంతుని వద్దకు వెళ్ళవలెను. ఆలోచించ పనిలేదు. (87) మహాదేవా! ఋషులతో గూడి వెళ్ళి హిమవంతుని నుండి నన్ను యాచించుము. నీ మాటనే నా తండ్రి పాటించును. సందేహం లేదు. (88) నేను దక్షుని పుత్రికగా యున్నపుడు నా తండ్రి నీకు నన్ను ఇచ్చెను. కాని విధి ప్రకారము వివాహము జరగలేదు.(89) మహాత్ముడగు దక్షుడు గ్రహములను పూజించలేదు. గ్రహములకు విషయమై దక్షుడు హానిని పొందెను. (90) కనుక నీవు విధి ప్రకారము చేయవలెను. దేవతల పని నెరవేరుటకు వివాహమును యథావిథిగా చేయవలెను’(91) అని పార్వతి ఆనగా పరమశివుడు నవ్వుచూ ఇట్లనెను. ‘చరాచరమైన దంతా నీనుండి జనించును. త్రిగుణముల చేత కూడుకున్నదై ఆది నీ చేత మోహమునొందునట్లు చేయబడును (92) పార్వతీ! అహంకారమునుండి మహత్తు ఉత్పన్నమగును- మహత్తునుండి తమస్సు కలిగి ఆకాశమును ఆవరించెను.(93) ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలమునుండి పృద్వీ ఉత్పన్నమైనవి.(94) సుందరీ! భూమి మొదలుగా చరాచరముగా కనబడునదంతా వశించు స్వభావము గలదిగా తెలుసుకొమము.(95)

ఒక్కడుగా వున్ననూ అనేకముగా ఆయెను. వీరుణుడయిననూ గుణములచే ఆవరింపబడెను. నిత్యమూ స్వయంజ్యోతిగా ప్రకాశించువాడు పరంజ్యోతితో కూడిన వాడాయెను. స్వతంత్రుడైననూ పరతంత్రుడాయెను- దేవీ! నీవే మహత్తును సృజించితివి. (96) నీచే జగత్తు అంతా మాయామయముగా చేయబడినది. పరబ్దానముచేత సర్వాత్మవై దీనిని నిలుపుదువు. యధార్థ జ్ఞానముగల సాధువులతో సంగమును, ఇంద్రియ పరివేష్టనమును నీవే చేసితివి. (97) గ్రహములేవి? నక్షత్రగణములేవి? నీచే సృజింపబడినవారెవ్వరు బాధింపబడుదురు? శివుని కొరకు ఇపుడిది విడిచివేయబడినది. (98) గుణముల కార్యముల ప్రసంగములో మనము ప్రాదుర్భవించాము. నీవు సత్త్యరజస్తమోమయమగు సూక్ష్మమైన ప్రకృతివి.(99) వ్యాపారదక్షురాలవు ఎల్లప్పుడూ. సుందరీ! నేను హిమాలయుని వద్దకు వెళ్లను. ఎట్టి విధముగా నైనా యాచించను.(100) ‘దేహి’ అను మాటవలన పురుషుడు వెంటనే చులకన యగును. కనుక ఓ దేవీ! ఇది తెలిసిన నీవు మేము చేయవలసినదేమిటో చెప్పుము.(101) ‘నీ ఆజ్ఞతో మేము చేయవలసిన దేమిటో చెప్పవలెను.’ అని శివుడనగా విశాల నేత్రములు గల పార్వతి ఇట్లనెను.(102)

‘నీవు ఆత్మను. నేను ప్రకృతిని. ఇందు విచారించవలసినది లేదు. అయినప్పటికీ ఓ పరమశివా! నమ్న వివాహము చేసుకొనవలెను.(103) దేహము అవిద్యచేత కూడుకొనినది. నీవు పరమాత్మవు. అయినప్పటికీ ఓ మహాదేవా! శరీరమునొకదానిని ఆశ్రయించుము(104) నా మాటపై ప్రపంచమును రచింపుము- హిమాలయము నుండి నన్ను యాచించుము. నాకు సౌభాగ్యము నిమ్ము (105) అని పార్వతి యనగా మహేశ్వరుడు లోకముననుగ్రహించుటకై అలాగే యని తలచి నవ్వుతూ తన నివాసమునకు వెళ్ళేమ.(106) ఇంతలో హిమవంతుడు పర్వతములతో, భార్యయగు మేనతో కలిసి త్వరగా వచ్చెను.(107) పుత్రులతో కలిసి సార్వతిని చూచుటకు వచ్చిన హిమవంతుడు సఖులతో కూడి యుండిన పార్వతిని చూచెను.(108) పార్వతి కూడా పర్వతరాజును చూచి, లేచి తల్లిదండ్రులకు, పోదరులకు, బంధువులకు తలవంచి నమస్కరించెను.(109) మహామభావుడగు హిమాలయుడు పార్వతిని తన ఒడిలో కూర్చుండబెట్టి, కౌగలించుకొని, కన్నీళ్ళతో తానేమి చేసెనో యథాతథముగా చెప్పమని మధురముగా అడిగిమ.(110) తాము వినగోరుచున్నామని పర్వతరాజవగా, పార్వతి మధురముగా తండ్రితో నిట్లనెను.(111)

‘తండ్రీ! గొప్ప తపస్సుతో మదనాంతకుడగు శివుని ప్రార్థించితిని. నా గొప్ప కార్యము, అందరికీ దుర్లభమగునది సిద్దించినది.(112) అపుడకడ నన్ను వరించుటకు వచ్చిన శివుని చూచితిని. ‘నా పాణిగ్రహణమును నా తండ్రి లేకుండా ఎట్లు చేతువు? అని నేను ఆడుగగా శివుడు వచ్చిన బాటనే వెళ్ళిపోయెను-?(113,114) అని పార్వతి చెప్పగా, బంధువులతో సహా హిమాలయుడు చాలా సంతోషించి తన కూతురితో ఇట్లనెను. (115)

‘పర్వతములగు మనమంతా మన నివాసమునకు వెళ్ళెదము ఈ పార్వతి పినాకి, వృషభధ్వజుడగు శివుని ఆరాధించినది’ (116) అనగా అపుడు హిమాలయుడు మొదలుకొని దేవతలు మరియు పార్వతి ఆదరముతో శివుని స్తుతించిరి.(117) వారందరూ ఆదరముతో పార్వతిని కూడా పొగుడుచుండగా, హిమవంతుడు మేలువన్నె గల పార్వతిని తన ఒడిలో నీలి పెను. పర్వతములన్ని ఉత్సుకతతో, చుట్టుముట్టి తమ నివాసమునకు కొని తెచ్చిరి.(118) అపుడు దేవదుందుభులు, శంఖములు, తూర్యములు, వాదిత్రములు అనేకములు మ్రోగినవి. అవి మోగింపబడుచుండగా పుష్పవర్షముతో వారు పార్వతిని ఇంటికి తీసుకొని వచ్చిరి.(119,120)

మహావిభూతితో ప్రకాశించుచున్న తపస్వినియగు పార్వతి దేవతలు, చారణులు, మహర్షులు, సిద్ధగణములు మొదలుగువానిచే అన్ని విధములుగా పూజించబడెను.(121) ఆట్లు పూజింపబడుచున్న పార్వతి బ్రహ్మ, దేవతలు, ఋషులు, పితరులు, యక్షులు మరియు అక్కడికేతెంచిన ఇతరులతో ఇట్లనెను.(122) ‘ఇక్కడికేతెంచిన మీరంతా ఇక మీమీ నివాసాలను త్వరగా వెళ్ళి పరమేశ్వరుని సేవించండి.(123) ఈ విధంగా అపుడు తన తండ్రి ఇంటికి చేరిన పార్వతి గొప్ప వర్చస్పుతో దేవతలచే పూజింపబడుచూ మనసులో సదాశివుని గూర్చి ధ్యానించుచూ నుండెను.(124)

ఇది శ్రీ స్కాందమహాపురాణమందు మొదటి మాహేశ్వరఖండమందలి కేదారఖండమున శంకరుడు పార్వతికి తన రూపము చూపుట అను ఇరువది రెండవ అధ్యాయము.