స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
10వ అధ్యాయము
మునయ ఊచుః
మునులనిరి - 'ఓ బ్రహ్మదేవా! (లోమశా) రుద్రుని కోపమునుండి జనించిన కాలకూటము యొక్క అగ్నిచేత చరాచరమైన బ్రహ్మాండమంతా భస్మముగా మారినదని నీవు చెబితివి కాని మనము రుద్రుని బ్రహ్మాండము మధ్యనుండే భావించుచుంటిమి. అపుడు బ్రహ్మ, విష్ణు మొదలుగా చరాచరమంతా నష్టమైనది భస్మముగా రుద్రుని కోపమువల్ల మారినది, మరల సృష్టి ఎట్లేర్పడెను? బ్రహ్మ, విష్ణు, చంద్రుడు మొదలైన వారెక్కడినుండి ఏర్పడిరి? మిగతా దేవదానవులు భస్మమై దేనియందు లయించిరి? ఆటుపై ఏమైనదో పూర్తిగా మాకు చెప్పటకు నీవే తగినవాడివి. వ్యాసుని అనుగ్రహం చేత నీవుదానినంతా ఎలుగుదవు, వేరొకరుకాదు. కనుక, నీవే జ్ఞానమయమగు శాస్త్రమును తెలిసినవాడవు. వేరొకరుకారు.
పూజ్యులగు మునులచేత ఆ విధముగా ప్రశ్నించబడిన సూతుడు వ్యాసునికి నమస్కరించి ఇట్లుపలికెమ లోమశుడు చెప్పెను విషాన్ని బ్రహ్మాండము మధ్యనున్న దేవతలను, ఇంద్రుడు మొదలగు లోకపాలకులును హరి, బ్రహ్మదులనంతా వ్యాపించినపుడు వినాయకుడు శివునికి ఇట్లు విజ్ఞాపనము చేసెను హేరంబుడనెను 'ఓ రుద్రా! ఓ మహాదేవా! ఓ ఫొణూ' జగత్పతి! వినోదముకొఱకు నేనే జయింపవీలులేని విఘ్నమును కలిగించితివి. భయముచేత, బుద్ధిమోహము నొందుటచేత ఎవరు నిమ్న, నన్నుగూడ పూజింపక ప్రయత్నము చేస్తారో వారికి అధిక క్లేశము కలుగును. ఇట్లు విఘ్నమనే చీకటికి సూర్యునివంటివాడగు గణాధిపతిచేత జీవుడు అభ్యర్థించబడెను.
మహేశ్వర ఉవాచః
ఆకారములేనివాడు, దోషములు లేనివాడు, నిర్లిపుడు, ఆకాశమే కేశముగా గలవాడు, జటలుగలవాడు, నీలలో హితుడవగు శివుడు లింగరూపుడై ఇట్లనెను. వినాయకా! అమిత శ్రద్దతో నా మాటను వినుము, చరాచరజగత్తంతా అహంకార స్వరూపముగలది - అహంకారము సృష్టి, స్థితి, లయలకు కారణము, ఓ గణపతి! జగదాదిన ఆది వీణ్ణమాత్రమున పృష్యాదుల జేయును.మాయలేనిది, శాంతము, ద్వైతము, అద్వైతముల కంటే పరము, కేవల బ్లప్రియే నిజ్వరూపముగా గలది, ఆది సత్, అనందములే లక్షణముగా గలది.గణపతీయనెను - పరమానందమే లక్షణముగా గల నీవు కేవలుడవు, ఆత్మవూ, కనుక నీకంటే వేరేదేదీలేనిచో, ఓ రుద్రా! సురాసుర విలక్షణమైనది, విచిత్రమైనది. మోహమును కలిగించునది, ముగ్గురుదేవతలచే లక్షింపబడినదిదంతా ఎట్లు?
'నానా భేధములతో కూడిన భూతముల నాలుగు సమూహములు గల ఈ నిత్య. అనిత్య రెంటికంటే విలక్షణమైన సంసార చక్రమెట్లు ఏర్పడినది? పరస్పర విరోధముచే జ్ఞానవాదముచే మోహమునొందినవారు, కర్మవాదము నందాసక్తిగలవారు కొందరు, కొందరు తమగుణమునాశ్రయించినవారు కొందరు జ్ఞాన నిష్ణులై పరస్పర విరోధమునొందినవారు - ఇట్లు సంశయమొందిన నన్ను కాపాడుము శివా! నేను, ఈ గణము, వృషభము, ఇతరమైనదంతా ఎక్కడివారము? సాత్త్యికులు, రాబిసులుగా చేయబడినాము.' (అనగావిని) శివుడు నవ్వి గణేశునితో నిట్లనెను.
మహేశ్వరుడవేమ - 'రజస్సు సత్యము, తమస్సు కాలమను శక్తిచే జనించినవి. దేవతలు, అసురులు, మానవులుగల జగత్తంతా వానిచే ఆవరింపబడినది.(22) విజానికి కనబడుచున్నదంతా నశించునది, పూర్తిగా కృతకము (కృత్రిమము) అగుటచే ఇది నశించునది అవి తెలుసుకొనుము. లోమశుడు పలికెను- లింగరూపియగు సదాశివుడు గణేశునితో మాట్లాడుతుండగా, సదాశివుని నుండి జగత్తుకు కారణమైన కార్యకారణరూపముగల, లింగరూపియగు పరాశక్తి ఉద్భవించెను. లింగరూపియగు శివుడు తక్షణమే విమగ్నమవగా, బ్రహ్మవిద్య' మాత్రమే తన లక్షణమగు ఆ పరాశక్తి ఒకతే నిలిచెను. గణేశుడు విస్మయముతో చూచుటయందే మునిగెను' అని చెప్పెను.
అపుడు ఋషులు ప్రకృతిలో అంతర్గతమైనదీ చరాచరజగత్తంతో అని అడిగిరి. మరి గణేశుడు విడిగా వుండుటెట్లు జరిగినదో తెలుపుము అని అడిగిరి.'లోమశుడనెను- గణేశుడు సాక్షాత్తు ప్రకృతి నుంచి సంభవించిన భగవంతుడు, శివుడి రూపముగలవాడో గణేశుడు ఆదే రూపము గలవాడు అజ్ఞానముచేత ప్రకృతికిలోబడిన గణేశునికి శివునితో చాలాకాలము ఎడతెగకుండా యుద్ధము జరిగినది. గజముపై కూర్చున్న గణేశుడపుడు జయింపబడలేకుండుటను జూచి శివుడు త్రిశూలముతో కొట్టి గజముతో సహా గణేశుని పడవేసెను.అపుడు పరాశక్తి అతని స్తుతింపగా, మహాదేవుడు, 'ఓ సుందరీ! వరమును కోరుము' ఆనేను
అపుడు (ఆ శక్తి మహాదేవుని గొప్పవరము కోరినది - 'నీచేత చంపబడిన ఇతను నా పుత్రుడే. ప్రకృతియొక్క అంశనుండి జనించిన మూడుడు నిన్నెరుగడు. కనుక వా సంతోషమునకై పుత్రుని బ్రతికించుము.'శివుడపుడు నవ్వి మాయయొక్క పుత్రుని బ్రతికించెను - ఏనుగుముఖమును ఆతను కలిపెమ అపుడు శివుని ప్రసాదముచేత గజాననుడు జన్మించెను. అతను మాయకు పుత్రుడై కూడా మాయలేనివాడు, జ్ఞానముకలిగిన వాడై వుండెను.
ఆత్మజ్ఞానమను అమృతముచేత ఎల్లప్పుడూ తృప్తినొందినవాడు, దోషరహితుడు, సమాధి యందుండువాడు, రౌద్రుడు, కాలకాలాంతకుడూ ఆయెను (36) యోగదండము కొఱకు తన దంతమును పెకిలించి (పెరికి) చేతిలో నుంచుకొనిన గణాధ్యక్షుడు, శబ్ద బ్రహ్మ నతిశయించును. బుద్ది, సిద్ది రెంటిచే ఒకటిగా ప్రకాశించును భూమిపై నున్న గణాలు, విఘ్నాలు మొదలగువానికి శివునిచేత ఇతను ప్రభువుగా జేయబడెను. కనుక, అతను విశ్వరూపముననున్న ప్రకృతిని చూచెను. విడిగా నిలిచి, ఎదురుగా ప్రకృతిని, లింగమును తెలుసుకొనుచూ నిర్మలమైన లింగము ప్రకృతియందు స్వభావముచే మండుట గాంచెను. గణములతో సహ తాను, ముల్లోకములూ కూడా లింగమునందు అంతా లయించెను - జ్ఞానియగు హేరంబుడుకూడా (మోహమునొందెను)
మోహము నొంది మరల ప్రయత్నములో సృహను పొంది ఆ గణేశ్వరుడు శివునికి - శక్తికి శిరస్సు వంచి నమస్కరించెను అపుడుఅక్కడి లోకముల సంహారమునకు కారణముమ, బ్రహ్మను, రుద్రుని, విష్ణువును, సదాశివుని చూచెను పేతములవంటి వానిని, లింగము మరియు శక్తి స్వరూపముగా గలవానిని, పరమాణువు వంటి బ్రహ్మాణ గోళములను కోట్లకొద్దీ చూచెను. అవి లింగరూపమువనున్న మహేశుని యందుకలిసిపోవుచూ మరల విడిపోవుచున్నవి. లింగము ప్రకృతి యందున్నది - ప్రకృతి లింగముయందున్నది. ఆవుడు లింగమంతా శక్తి చేతనే కప్పబడినట్లు కనబడినది - లింగముచేత శక్తి కప్పబడినది. ఇట్లు పరస్పరము వుండినవి. చరా చరముగా కనబడు జగత్తంతా 'శివుడు మరియు శక్తి' వీనిచే సంశ్రయింపబడివున్నది - ఆ జ్ఞానమును గణేశుడు కాని ఇతరులుకానీ తెలియలేదు. అపుడుగొప్పశక్తిచే 'శక్తితో కూడివున్న శివుని' తన గణములతో కలిసి స్తుతించుచూ వివాయకుడిట్లనెను
గణేశుడనెను - 'శక్తితో కూడిన దేవుని, జ్ఞానమేరూపముగా గలవానిని, ప్రసన్నని,జ్ఞానముకంటే పరముగా జ్యోతి రూపము దాల్చిన వానిని, ఆ రూపముకంటే పరముగా సత్ రూపమును, సత్రూపముకంటే పరముగా మంగళమును, ఆనందమను పేరు గలవానిని, కళలను దాటిన వానిని, దుఃఖభీజము లేని వానిని నమస్కరించుచున్నాను. ధూమము చేత కప్పబడిన అగ్ని ధూమము వలెనే గోచరించును. జ్ఞానమునకు కారణమైన ప్రకృతిలో ఆంతర్గతునివలె కనబడుచున్నావు. ప్రకృతియందున్నందువలన నీవు 'మాయాపూర్వక వ్యక్తత గలవాడివిగా చెప్పబడుచున్నావు ఇట్లుండిన నీవు ఓ భగవాన్! ఈ విశ్వమును సృజించుచున్నావు, పోషించుచున్నావు మరల నశింపజేయుచున్నావు, బ్రహ్మా, బ్రాహ్మణ శ్రేష్ఠులు వీరందరితో సహా ఈ చరాచరవిశ్వమంతా ఈ విషముచేత నశించినది - ఓ మహేశా! నీవింతకు మునుపు ముల్లోకములకు నాథుడుగా, చరాచరమే స్వరూపముగా గలవాడుగా, వుంటివి. దహింపబడిన చరాచరమునంతా వెంటనే జీవకోశముతో సహ మరల చేయుము (సృజించుము)'
లోమశ ఉవాచః
లోమశుడు చెప్పెను - అన్ని ప్రాణుల ఉనికికి కారకుడగు శివుడట్లు గణేశునిచే స్తుతింపబడెమ - లోకముల సంహారమునకుకారణమైన కాలకూటము బయల్వెడలగా లింగరూపమున దానిని మింగి మరల నిర్మలముగా చేయగా దేవతలు, అసురులు, మానవులు, మూడులోకములు శివుని గొప్ప కృపచేత ఆక్షణమే రక్షింపబడిన వాయెను బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలురు, ఋషులు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, అప్సరసల గణములు నిద్రనుండి బయటపడినట్లు లేచిరి భయమును (పొందిన వారై వారంతా విస్మయము నొందిరి. ఆశ్చర్యముగా వారంతా ఇట్లనిరి. 'మనలనందరినీ తరిమిన ఆ గొప్పకాలకూటమెక్కడ? (దేనిచే) మనమంతా లోకపాలకులమై మృతులవలె చేయబడితిమో (ఆకాలకూటమెక్కడ?)'
దేవతలట్లు పలికిరి. దైత్యులు మాత్రము ఆపుడు మౌనముగా మండిరి. ఇంద్రుడు మొదలైన దేవతలు లోకపాలకుడు సర్వేశ్వరేశ్వరుడైన విష్ణువుమ, బ్రహ్మను ముందుంచుకొని, కలిసి ఇట్లనిరి. 'ఓ విష్ణుదేవా! అల్పబుద్ధిగల వారమయినందున ఎవరిట్లు చేసిరో తెలియజాలకున్నాము. అపుడు భగవంతుడు నవ్వి బ్రహ్మతో సహ దేవతలను సమాధిస్థితినంపెను. అపుడందరూ ఏకాగ్రతనొందిన మనస్సుగలవారైరి. బ్రాహ్మణులు తత్వజ్ఞానముచేత కొమము, క్రోధము మొదలగు వానిని తొలగించి ఆత్మయందున్న లింగమునుగాంచిరి. అపుడు దేవతలు మొదలగువారు తత్యముగా విష్ణువును స్తుతించిరి.
యోగులు ఆత్మచేత పరమాత్మను ఉపాసింతురు - లింగమే పరమజ్ఞానము, లింగమే శ్రేష్ఠమైన తపస్సు, లింగమే శ్రేష్టమగు ధర్మము, లింగమే శ్రేష్ఠమగు గతి, కనుక, లింగమున కంటే వేరొకటి లేదు ఇట్లు పలుకుచూ లోకపాలురు, ఋషులతో సహాదేవతలంతా తమాలవృక్షఛాయ గల విష్ణువును ముందుంచుకొని, శరణుగోరయోగ్యుని శివుని శరణుజొచ్చిరి. కృపగల మహాదేవా, పరమేశ్వరా! రక్షింపుము! పూర్వము అందరినీ ఎట్లు రక్షించితివో అట్లు రక్షించుటకు వీవే తగినవాడవు.
లింగస్వరూపమధ్యనున్నవాడు, అన్ని భూతముల వునికికి కారణమగు విష్ణువు అపుడు దేవతాగణములన్నింటితో కలిసి భాషించెను. 'ఓ భగవంతుడా! నీవు లింగరూపమును దాల్చినవాడవు. లోకములకభయమొసగువాడవు, విష్ణువు చేత లింగరూపమునమన్న మహేశ్వరుడు స్తుతింపబడెను విషమునుండి మృతులందరూ రక్షింపబడిరి కనుక ఓ ప్రభూ! మృత్యుంజయుడవు - ఓ మహాకాలా! త్రిపురాంతకా! రక్షింపుము. నీకు నమస్కారము.' అట్లు విష్ణువు స్తుతించగా లింగరూపియైన శివుడు అంబతో కలిసి ఆ దేవతలనూ మేల్కొలుపుటకా యన్నట్లవతరించెను (సాక్షాత్కరించెను) 'ఓ విష్ణువూ! దేవతలారా! ఋషులారా! ఇది వినుడు - అనిత్యమగు సంసారమున నిత్యత పూర్ణమని భావింపబడుచున్నది .
దేవతలారా! మిమ్ము మీరు గమనించండి. యజ్ఞముల చేతనేమి? తపస్పుల చేతనేమి? కర్మలనారంభించుటచేనేమి? కలిసిగానీ, విడిగాగానీ కొద్ది ప్రయోజనము కూడా లేదు - మీరంతా కలిసి చేసిన దుష్కర్మ ఎందుకు చేయబడినది? అమృతము కొఱకు క్షీరసముద్రమును మధించుటను మృత్యుంజయుడైన నన్ను నిరాకరించి, అవమానించి ఎట్లు చేసితిరి? కనుకనే ఆందరూ మృత్యుముఖమున పడితిరి. ఇందు సంశయము లేదు. కార్యము సిద్ధించుటకు మాచేత గణేశుడను దేవుడు విర్మింపబడినాడు. గణేశుని, దుర్గను నమస్కరించని వారు నిర్వివాదంగా క్లేశముల ననుభవింతురు - మీరంతా అధర్మపరులు, స్త్రజ్ఞులు, పండితులమని అనుకునేవారు, చేయదగినది, చేయదగనిది తెలియక కేవలము అభిమానము చేత మోహమునొందినారు. కనకనే అందరూ కాలముఖమున పడినారు. ఇంద్రుడు మొదలైన దేవతాగణములు వీరంతా శ్రుతియే పరమమనువారు. అల్పులైన ఇంద్రుడు మొదలైన వారంతా వృథాగా ప్రేరేపించువారు. ఓ ఇంద్రా! నిన్ను నీవు సమగ్రముగా తెలియకున్టావు.
మూడుడా! నీవు అమృతముకొఱకు గొప్పప్రయత్నము చేసితివి, నూరుఅశ్వమేధయాగాలను చేయడంవల్ల ఏరాజ్యాన్ని పొందావో అది ఇప్పుడు ఇతరుల ఆధీనంలో వున్నది. దుర్మతివై అది తెలియకున్నావు ఏ తపస్వి జనులచేత నీవు వేదవాక్యముల చేత స్తుతింపబడినావో, వారు ఆయా కోరికచేత నిన్నట్లు సంతోషపెట్టెదరు. ఓ విష్ణూ! నీవు పక్షపాతము వల్ల హితాన్ని, అహితాన్ని తెలియజాలకున్నావు - వీచేత కొందరు చంపబడినారు కొందరు రక్షింపబడినారు ఇచ్ఛతో కూడుకున్న నీవు ఎప్పుడూ బాలునివలెనే ప్రవర్తించుచున్నావు - ఇక ఇతర లోకపాలకుల సంగతి ఎక్కడ? వేరొక విధము చేసిన దానిలో వేరొక విధముగా వుండుటయే వుండును. దేవిచేత కార్యముసిద్ధించునో దానిని మీరు మరిచితిరి
ఎవరిచే ఈ నాడు అందరూ కాలకూటముయొక్క గొప్ప భయమునుండి రక్షింపబడినారో, ఎవరిచే విష్ణువు నీలముగా చేయబడినాడో, ఎవరిచేత అందరూ ఓడింపబడినారో ఎవరిచేత లోకములు భస్మముగా చేయబడినవో, దానినుండి మరల రక్షింపబడినవో, అట్టి మహాత్ముడైన గణేశుని పూజావిధిని చేయవలెను. పనిని మొదలు బెట్టునపుడు ఎవరు గణేశుని అర్చింపరో వారికి మీవలెనే ఆ పనీ సిద్ధింపదు -' మహేశుని మాటను విని సురాసురులు కిన్నరులు, చారణులు తత్యతః పూజావిధానమును చెప్పుమని శివుని ఆడిగిరి.
శ్రీ స్కాంద పురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమున సముద్రమధన శివుడు విషమును భక్షించువృతాన్తమనుపదవ అధ్యాయము సమాప్తము.
