నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను-
తౌ దంపతీ బహిర్గత్వా పుత్రమంగళపాతదే।
వివిధా చ రత్నావి ద్విజేభ్యో దదతుర్ముదా ॥
బందిభ్యో భిక్షుకేభ్యం దావావీ వివిధావి చ ।
నానావిదాని వాద్యావి పాదయామాస శంకరః ॥
హిమాలయశ్చ రత్నానాం దదౌ లక్షం ద్విజాతయే ।
సహస్రం చ గజేంద్రమదానాం చ త్రిలక్షకం॥
దశలక్షం గవాం చైవ పంచలక్షం సువర్ణకం ।
ముక్తామాణిక్యరత్నాని మణిహిని యావి చ॥
అన్యావ్యపి చ దావావి వస్త్రాణ్యాభరణావి చ।
సర్వాణ్యమూల్యరత్నాని క్షీరోదోత్పత్తికాని చ ॥
బ్రాహ్మణేభ్యో దదౌ విష్ణుః కౌస్తుభం కౌతుకావ్వితః।
బ్రహ్మా విశిష్టదావావి విప్రాణాం వాంఛితాని చ ।
సుదుర్లభావి సృష్తా చ బ్రాహ్మణేభ్యో దదౌ ముదా ॥
ధర్మః సూర్యశ్చ శక్రశ్చ దేవాశ్చ మునయస్తథా ।
గంధర్వా పర్వతా ద్యే దదుర్దావం క్రమేణ చ ॥
మాణిక్యాచార పహస్రాణి రత్నానాం చ శతాని చ ।
శతాని కౌస్తుభానాం చ హీరకాణాం శతాని చ ॥
హరిద్వర్ణమణీంద్రాణాం పహప్రాణి ముదాన్వితాః ।
గవాం రత్నాని లక్షాణి గజరత్నసహస్రకం ॥
ఆమూల్యావ్యస్యరశ్నాని శ్వేతావర్ణాని కౌతుకాత్ ।
శతలక్షం సువర్ణావారి వహ్నిశుద్ధాంశుకాని చ ॥
బ్రాహ్మణేభ్య దదౌ బ్రహ్మా తత్ర క్షీరోదధిర్ముదా।
హారం చామూల్య రత్నానాం త్రిష లోకేషు దుర్లభం॥
ఆతీవ నిర్మలం పారం సూర్యభానువిందకం।
పరిష్కృతం చ మాణికై ర్హీరకైశ్చ విరాజితం ॥
రమ్యం కౌస్తుభమధ్యస్థం దదౌ దేవీ సరస్వతి।
త్రైలోక్యపారం హారం సద్రత్నగణనీర్మితం ॥
భూషణానీ చ సర్వాణి సా సావిత్రీ దదౌ ముదా ।
లక్షం సువర్ణలోష్టానాం ధవావి వివిధాని చ॥
శతాన్యమూల్యరత్నానాం కుబేరశ్చ దదౌ ముదా ।
పార్వతీపరమేశ్వరులు తమ పుత్రుని ముఖము చూచి ఆ గది నుండి బయటకు వచ్చి బ్రాహ్మణులకు అనేక రత్నములను దానము చేసి అట్లే స్తోత్రములు చేయు భటులకు, భిక్షకులకు కూడ అనేక దానములు చేసి మంగళవాద్యములను మ్రోగించిరి.
శిశువుయొక్క తాతగారగు హిమవంతుడు బ్రాహ్మణులకు లక్షలకొలది రత్నములను, వేలకొలది గజేంద్రములను, మూడు లక్షల గుఱ్ఱములను, పదిలక్షల గోవులను, ఐదు లక్షల సువర్ణముద్రలను. ఇంకను ముత్యాలు, మాణిక్యములు, వస్త్రములు, ఆభరణములు మొదలగు వాటినన్నిటినీ దానమొసగెను.
శ్రీమహావిష్ణువు బ్రాహ్మణులకు కౌస్తుభ మణులను దానము చేయగా బ్రహ్మదేవుడు ఆయా విప్రులు కోరుకొన్న వస్తువులను దానము చేసెను. అట్లే ధర్మదేవత, సూర్యుడు, ఇంద్రుడు, దేవతలు, దేవతా స్త్రీలు, మునులు, గంధర్వులు, పర్వతములు
మొదలగువారందరు అనేక వేల మాణిక్యములను, అనేకవందల రత్నములను, వజ్రములను, పచ్చలను, లక్షలకొలది ఆవులను, వేలకొలది ఏనుగులను దానము చేసిరి, బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు కోట్లకొద్ది బంగారునాణెములను, వస్త్రములను దానము చేసెను.
సరస్వతీదేవి గణపతి పుట్టిన సందర్భమున అనేక మణులు, వజ్రములుకల హారములను బ్రాహ్మణులకు దానము చేసెను. సావిత్రీదేవి మంచి రత్నములున్న హారములూ, , తన సమస్తాభరణములను బ్రాహ్మణులకు దానము చేసెను. ధనపతియగు. కుబేరుడు ఆ సమయమున లక్షలకొలది బంగారు నాణెములను, వందలకొలది విలువైన రత్నములను ఇంకను అనేక విధములైన వస్తువులను బ్రాహ్మణులకు సంతోషముతో దానము చేసెను.
దావానీ దత్వా విప్రేభ్యస్తే సర్వే దదృశుః శిశుం।
పరమావందసంయుక్త శివపుత్రోత్సవ మునే ॥
భారం వోడు మశక్తాశ్చ బ్రాహ్మణా బందినస్తథా ।
స్థాయం స్థాయం చ గచ్ఛంతో ధనాని పథకాతురా ॥
కథయంతి కథాః సర్వే విశ్రాంతా పూర్వదాయినాం ।
బుద్దాః ప్రణ్వంత ముదిరా యువానో భిక్షుకా మువే ॥
విష్ణుః ప్రముదితషత్ర పాదయామాప దుందుభిం ।
సంగీతం పాయయామాస కారయామాస వర్తనం ॥
వేదాంశ్చ పాఠయామాప పురాణాని చ నారద ॥
మునీంద్రానానయామాస పూజయామాస తాన్ముదా ॥
ఆశిషం దాపయామాస కారయామాస మంగళ।
సార్థం దేవైశ్చ దేవీభిర్దదా తస్మై శుభాశీషః ॥
దేవతలందరు పరమ సంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసి శిశువును చూచిరి. దేవతలు మొదలగువారు సమర్పించిన దానములను బ్రాహ్మణులు మోయలేక మెల్లమెల్లగా పోవుచు అచ్చటచ్చట విశ్రాంతిగొనుచూ తమకిచ్చిన దానముల గురించి యువకులకు, భిక్షకులకు కథలు కథలుగా చెప్పుచుండిరి. వారు ఆ బ్రాహ్మణులు చెప్పిన కథలను వినుచు సంతోషపడుచుండిరి.
శివపుత్రుడైన గణపతి జన్మోత్సవ సమయమున విష్ణుమూర్తి సంతోషముతో వాద్యములను మ్రోగింపజేయుచు నాట్యమును చేయించుచు, సంగీతమును వినిపించుచుండెను. ఆట్లే అచ్చట వేద, పురాణ పారాయణమును చేయించేను. అదేవిధముగా మునీంద్రులను ఆహ్వానించి వారిని పూజలందుకొనునట్లు చేసెను. వారందరు మరియు దేవతలందరు ఆ శిశువునకు ఆశీస్సుల నొసగిరి.
విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను.
శివేవ తుల్యం జ్ఞానం తే పరమాయుశ్చ బాలక।
పరాక్రమే మయా తుల్య సర్వసిద్ధేశ్వరో భవ ॥
ఓ బాలకా నీకు శంకరునితో సమానమగు జ్ఞానము ఆయుష్షు కలుగుగాక! అట్లే నాతో సమానమైన పరాక్రమము కలుగునుగాక! నీవు సమస్తసిద్ధులకు అధిపతిగా వెలుగొందుదువని ఆశీర్వదించెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను.
యశపా తే జగత్పూర్ణం సర్వపూజ్యో భవాచిరం ।
సర్వేషాం పురతః పూజా భవత్వపాసుదుర్లభా॥
ఓ బాలకా! నీ కీర్తి ప్రపంచమంతయు వెలుగుగాక! నీవు త్వరలో అందరిచే మన్ననలనందుకొందువు. అందరు దేవతలకంటే ముందు నీపూజయే జరుగునని ఆశీర్వదించెను.
ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను.
మయా తుల్య సుధర్మిష్ఠో భవాన్భవతు దుర్లభః ।
సర్వజ్ఞశ్చ దయాయుక్తో హరిభక్తో హరేః సమః॥
ఓ శిశు! నీవు నావలె చక్కని ధర్మమార్గమున చరింపుము. నీవు సర్వజ్ఞుడవు, దయకలవాడవు, శ్రీహరిభక్తుడవు కూడ కాగలవు, నీవు శ్రీహరితో సమానుడవుగా ప్రకాశింతువని ఆశీర్వదించెను.
మహాదేవ ఉవాచ - శంకరుడిట్లు పలికెను.
దాతా భవ మయాతుల్యో హరిభక్తశ్చ బుద్ధిమాన్ ।
విద్యావాన్ పుణ్యవాన్ శాంతో దాంతశ్చ ప్రాణవల్లభ ॥
ఓ నాప్రాణప్రియమైన బాలకా! నీవు నాతో సమానముగా దానశీలుడవు, హరిభక్తుడవు, బుద్ధిమంతుడవు, విద్యావంతుడు, పుణ్యవంతుడవు, శాంతుడవు, నిగ్రహవంతుడవు కమ్మని శంకరుడాశీర్వదించెను.
లక్ష్మీ ఉవాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికినది.
మమస్థితిశ్చ గేహే తే దేహే భవతు శాశ్వతీ ।
పతివ్రతా మయతుల్యా శాంతా కాంతా మనోహరా॥
“ఓ బాలకా నేనే నీశరీరమందు, నీవున్నచోట శాశ్వతముగా నివసింతును” అని ఆశీర్వదించెను.
సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను.
మయా తుల్యా సుకవితా ధారణ శక్తిరేవ చ ।
స్మతిర్వివేచనా శక్తిర్భవత్వత్తరాం సుత ॥
ఓ పుత్రా! నీకు నాతో సమానముగా కవిత్వము చెప్పు శక్తి, ధారణచేయు శక్తి, స్మరించుశక్తి, ఆలోచించు శక్తి అనునవి చక్కగా కలుగునని ఆశీర్వదించెను.
సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లనెను.
వత్సాహం వేదజననీ వేదజ్ఞానీ భవాచిరం ।
మన్మంత్రజపశీలశ్చ ప్రవరో వేదవాదీనాం ॥
హే వత్స! నేను వేదములకు మాతృరూపిణిని. నీవు నా అనుగ్రహముచే త్వరగా వేదవేదాంగ జ్ఞాన వంతుడవగుదువు. నాయొక్క మంత్రమును జపించుచు వేదార్థమును గురించి చర్చించువారిలో అగ్రగణ్యుడవు కాగలవని ఆశీర్వాదమునిచ్చను.
హిమాలయ ఉవాచ - హిమవంతు డిట్లనెను.
శ్రీకృష్ణే తిమతిః శశ్వద్భక్తిర్భవతు శాశ్వతి ।
శ్రీకృష్ణతుల్యో గుణవాన్భవ కృష్ణపరాయణః॥
ఓ బాలకా! నీకు శ్రీకృష్ణునిపై శాశ్వతభక్తియుండుగాక! నీవు శ్రీకృష్ణభక్తుడవై శ్రీకృష్ణునితో సమానమగు సుగుణములతో ప్రకాశింతువని ఆశీస్సులనిచ్చెను.
మేనకోవాచ - మేనకాదేవి ఇట్లు పలికెను.
సముద్రతుల్యో గాంభీర్యే కామతుల్యశ్చ రూపవాన్ ।
శ్రీయుక్తః శ్రీపతీసమో ధర్మే ధర్మసమో భవ ॥
ఓ శిశూ! నీవు గాంభీర్యమున సముద్రముతో సమానడవుకమ్ము, అట్లే ఆందమున మన్మథునితో సమానుడుగా, ధర్మవర్తనమున ధర్మదేవతతో సమానముగా లక్ష్మీయుక్తుడవై శ్రీహరితో సమానముగా వెలుగొందెదవని ఆశీర్వదించెను.
వసుంధరోవాచ - భూదేవత ఇట్లు పలికెను.
క్షమాశీలో మయా తుల్యః శరణ్యః సర్వరత్నవాన్ ।
నిర్విఘ్న విఘ్ననీఘ్నశ్చ భవ వత్స శుభాశ్రయః ॥
ఓ బాలకా! నీవు నావలె ఓర్పు కలిగియుందువు. అందరు నిన్నే శరణు వేడెదరు. విఘ్నములకు దూరుడవై విఘ్నములనన్నిటినీ తొలగింతువు, నిన్ను సమస్త శుభలక్షణములు ఆశ్రయించి ఎల్లప్పుడుండునని ఆశీర్వదించెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.
తాత తుల్య మహాయోగే సిద్ధః సిద్ధిప్రదః శుభః ।
మృత్యుంజయశ్చ భగవాన్ భవత్వతివిశారదః॥
నాయనా! నీవు నీతండ్రివలె మహాయోగిగా, సమస్త సిద్దులకు నిలయుడవుగా, సమస్తసిద్దులనిచ్చే దేవతగా ఉండుము. అత్యంత శుభంకరుడవైన నీవు మృత్యుంజయుడవై సమస్త కార్య విశారదుడవై వర్ధిల్లుమని ఆశీర్వదించెను.
ఋషయో మునయః సిద్ధాః సర్వే యుయుజురాశిషః ।
బ్రాహ్మణా బందీనశ్చైవ యుయుజః సర్వమంగళం॥
అదేవిధముగా ఋషులు, మునీశ్వరులు, సిద్ధులు ఆందరు ఆ బాలకుని ఆశీర్వదించిరి. బ్రాహ్మణులు స్తోత్రపాఠకులైన భట్రాజులందరు సమస్తము మంగళప్రదము కావలెనని కోరిరి.
సర్వం తే కథితం వత్స, సర్వమంగళమంగళం ।
గణేశ జన్మ కథనం సర్వవిఘ్న వినాశనం ॥
ఇమం సుమంగళాధ్యక్షం యః శ్రుణోతి సుఖం యతః ।
సర్వమంగళసంయుక్తః స భవేన్మంగళాలయః ॥
అపుత్రో లభతే పుత్రమధనో లభతే ధనం ।
కృపణో లభతే సత్వం శశ్వతంపత్ర్పదాయి చ ॥
భార్యార్థి లభతే భార్యాం ప్రజార్టీ లభతే ప్రజాం ।
ఆరోగ్యం లభతే రోగి సౌభాగ్యం దుర్భగా లభేత్ ॥
భ్రష్టపుత్రం నష్టధనం ప్రోషితం చ ప్రియం లభేత్ ।
శోకావిష్టః సదానందం లభతే నాత్రసంశయః॥
యత్పుణ్యం లభతే మర్యో గణేశాభ్యాసకశ్రుతౌ ।
తత్సలం లభతే మానమర్యాయ శ్రణామ్మనే॥
ఆయం చ మంగళాధ్యాయో యస్య గేహే చ తీష్ఠతి ।
సదా మంగళసంయుక్తః స భవేనాత్ర సంశయః ॥
యాత్రాకాలే చ పుణ్యాహే యః శ్రుణోతి సమాహితః।
సర్వాభీష్టం స లభతే శ్రీగణేశప్రసాదతః ॥
వత్సా నారదా! నీకు సర్వమంగళములకు మంగళప్రదమైనదీ, సమస్త విఘ్నములను తొలగించునది యగు గణేశుని జన్మవృత్తాంతమును తెల్పితిని. సమస్తమంగళములకు శ్రేష్టమైన ఈ గణేశ జన్మ వృత్తాంతము నంతయు విన్నవారికి సమస్త మంగళములు కలుగును. అతని గృహమెప్పుడు సమస్త మంగళములకు నిలయము కాగలదు.
ఈ గణేశజన్మవృత్తాంతమును చక్కగా విన్నచో పుత్రులు లేనివారికి పుత్రసంపద కలుగును. ధనహీనునకు అంతులేని సంపద లభించును, లోభికి దాన గుణమబ్బును, భార్యలేనివానికి త్వరలో భార్య లభించును. సదారోగి చక్కని ఆరోగ్యవంతుడగును. పుత్రులు, భర్త, ధనములను పోగొట్టుకొన్నవానికి తిరిగి వారు లభింతురు. దుఃఖములో నున్నవారికి సంతోషము కలుగును.
గణేశుని వృత్తాంతమంతయు విన్నవారికి లభించు ఫలితము శ్రీగణేశుని జన్మవృత్తాంతముగల ఈ అధ్యాయమునొకదానిని మాత్రమే వినినప్పటికీ కలుగును. మంగళాధ్యాయమనదగు ఈ అధ్యాయము ఉన్న ఇంటిలో సదా మంగళములు జరుగుచునేయుండుమ. యాత్రలు చేయుచున్నప్పుడు, పుణ్యదినములయందు ఈ ఆధ్యాయమును నిశ్చలభక్తితో విన్నవారికి శ్రీ గణేశుని అనుగ్రహము వలన సమస్తమైన కోరికలు సిద్ధించునని నారాయణమహర్షి తెలిపెమ.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతియే గణేశఖండే నారద నారాయణసంవాదే గణేశోద్భవమంగళం నామదశమోఽధ్యాయః॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదైన గణేశఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణేశోద్భవమంగళమను పదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 10 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Despite the restoration of her son, Goddess Pārvatī's intense maternal anger flared against Shani for having caused the decapitation of her child, and in her wrath, she pronounced a severe curse upon him to become lame and lose his celestial status. Trembling with fear, Shani offered humble prayers of surrender to the Divine Mother, explaining that he had merely acted in obedience to her own explicit command while bound by the inevitable decree of his past destiny. Lord Brahmā and Lord Śrī Vishṇu intervened on Shani's behalf, pleading for mercy and reminding Pārvatī of Shani's innocence. Softening her heart, Goddess Pārvatī mitigated the curse, decreeing that Shani would be slow-moving rather than completely immobile and would be honored as a major planetary deity bestowing wisdom through karmic purifications.