బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

7 - పార్వతీదేవి యొనర్చిన శ్రీకృష్ణ స్తోత్రము

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునిలోనిట్లనెను-

 హరేరాజ్ఞాం సమాదాయ హరః సంపృష్టమానసః

ఉవాచ పార్వతీం ప్రీత్యా హరిసల్లాప మంగళం

 శంకరుడు శ్రీహరియొక్క ఆజ్ఞను గైకొనీ సంతోషముతో పార్వతిని పుణ్యకవ్రతము చేయమని చెప్పెను.

శివాజ్ఞాం చ సమాదాయ శీవా సంహఘమాససా

వాద్యం చ వాదయామాస మంగళం మంగళప్రతే

సుస్నాతా సుదతీ శుద్దా బిభ్రతీ ధాతవాససీ

సంస్థాప్య రత్నకలశం శుక్లధన్యోపరి స్థిరం

 ఆమ్రపల్లవసంయుక్తం ఫలాక్షతసుశోభితం

చందనాగురు కస్తూరి కంకుమేన వీరాజితం

రత్నాసనస్థా రత్న్యాఢ్యా రత్నద్భవములో సతీ

రత్నసింహాసనస్థాంశ్చ సంపూజ్య మునిపుంగవాన్

రత్నసింహాసనస్థం చ సంపూజ్య ఘపురోహితం

 చందనాగురు కస్తూరీ రత్నభూషణభూషితం

సంస్ధాప్య పురతో భక్త్యా దిక్పాలాగ్రత్నభూషితాన్

 దేవాన్నరాంశ్చరాగాంశ్చ సమర్చ్య విధిబోధితం

సమర్చ్య పరయా భక్త్యా బ్రహ్మవిష్ణు మహేశ్వరాన్

చందనాగురు కస్తూరీ కుంకుమేన విరాజితాన్

 వహ్నిశుద్దె స్సువస్త్రైశ్చ సద్రత్నైర్భూషణెస్తథా

 పూజాద్రవ్యైశ్చ వివిధైః పూజితాన్ పుణ్యకే మునే

సమారేభే ప్రతం దేవి స్వస్తివాచనపూర్వకం

పార్వతీదేవి తనభర్తయగు పరమేశ్వరుని ఆజ్ఞను గైకొని మంగళకరమైన పుణ్యకవ్రతమును మంగళవాద్యములతో ప్రారంభించెను. ఆ దేవి చక్కగా స్నానముచేసి ఉతికిన వస్త్రములు ధరించి బియ్యముపైన రత్నకలశమును స్థాపించెను. ఆ రత్నకలశమున మామిడియాకులు, ఫలములు, అక్షతలు, చందనము, ఆగురు, కస్తూరీ, కుంకుమలను వేసి అలంకరించెను.

అటుపిమ్మట ఆ దేవి రత్నాసింహాసనముపై కూర్చుండి మునులను రత్నసింహాసనములపై కూర్చుండబెట్టి గౌరవించెను. అట్లే పురోహితుని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టి వారికి చందనము, అగరు, కస్తూరి, కుంకుమలనిచ్చినది. రత్నభూషణభూషితులైన దిక్పాలకులను తనముందు అష్టదిక్కులలో కూర్చుండబెట్టి వారితోపాటు ఇతరదేవతలను, నరులను, నాగులను విధిపూర్వకముగా ఆర్చించినది. అటుపిమ్మట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను చందనము, ఆగరు, కస్తూరి, కుంకుమలతో, పరిశుద్ధమైన నూతనవస్త్రములతో, రత్నభూషణములతో అనేకవిధములైన పూజాద్రవ్యములచే భక్తిపూర్వకముగా అర్చనచేసి పుణ్యకవ్రతమును స్వస్తివాచనపూర్వకముగా ఆ దేవి ప్రారంభించినది.

ఆవాహ్యాభీష్టదేవం తం శ్రీకృష్ణం మంగళే ఘటే

భక్త్యా దదౌ క్రమేణైవ చోపచారాస్తు షోడశ

యాని ప్రతే విధేయానీ దేయాని వివిధాని చ

 ప్రదదా తానీ సర్వాణి ప్రత్యేకం ఫలదానీ చ

ప్రతోక్తముపహారం చ దుర్లభం భువనత్రయే

తచ్చ సర్వం దదౌ భక్త్యా సువ్రతే సువ్రతా పతి

పార్వతీదేవి తనముందు తండులముల సైనున్న మంగళకలశమున తనకు ఆభీష్టదేవతయగు శ్రీకృష్ణ పరమాత్మను ఆవాహనచేసి క్రమముగా షోడశోపచారములనన్నిటిని భక్తితో నొసగినది. అట్లే ఆ పుణ్యకవ్రతమున చేయదగు కార్యములను దానములను అన్నిటిని విడివిడిగా చేసినది. నియమపూర్వకముగా పుణ్యకవ్రతము చేయుచున్న ఆ. సతి పుణ్యకవ్రతమున చెప్పబడిన ఉపహారమునంతయు భక్తితో నొసగినది.

దత్వా ద్రవ్యాణి సర్వాణి వేదమంత్రేణ సా సతీ

హోమం చ కారయామాస శ్రీలక్షం తిలసర్పిషా

బ్రాహ్మణాన్ భోజయామాస పూజయిత్వాతిథీంస్తథా

భోజయామాస సా దేవీ సువ్రతే సువ్రతా సతీ

ప్రత్యహం సవిధానం చ చక్రీ సా పూర్ణవత్సరం

సమాప్తిదివసే విప్రస్తామువాచ పురోహితః

సువ్రతే సువ్రతే మహ్యం దేహి త్వం పతీదక్షిణాం

ఆ పుణ్యకవ్రతమున దానముచేయదగిన వాటినన్నిటిని వేదమంత్రపూర్వకముగా దానముచేసి లీలలు, నేయితో మూడులక్షల పర్యాయములు హోమము చేసినది. అటుపిమ్మట అతిథులనందరను గౌరవించి బ్రాహ్మణులకందరకు, భోజనము పెట్టెను.

ఇట్లు ప్రతిదినము విధిపూర్వకముగా భోజనము పెట్టుచు సంవత్సరము "గడిపినది. సంవత్సరకాలము పూర్ణమైన పిదప వ్రతసమాప్తిదినమున పురోహితుడా పార్వతితో నాకు పతీదక్షిణమిమ్మని కోరెను.

ఇతి తద్వచనం శ్రుత్వా విలప్య సురసంపది

మూర్చాం ప్రాప మహామాయా మాయామోహితచేతసా

తాం చ తే మూర్ఛితాం దృష్టి ప్రహస్య మునిపుంగవా

శంకరం ప్రెషయామాస బ్రహ్మావిష్ణుశ్చ నారద

 సంప్రార్థితః సభాసద్భిః శి వాం బోధయితుం తదా

శివః సముద్యమం చక్రే ప్రవక్తుం వదతాం వరః

మహామాయయగు పార్వతి పురోహితుని మాటలు విని మాయవలన మోహముచెందిన మనస్సుగలదై ఎక్కువగా ఏడ్చి మూర్చపడిపోయెను. మూర్ఛవడియున్న పార్వతిని జూచి మునిపుంగవులు నవ్వుచుండగా అచ్చటమన్న సభాసదులు ప్రార్థింపగా బ్రహ్మవిష్ణువులు. పార్వతిని ఓదార్చుటకు శివుని పంపిరి. అప్పుడు మాటకారియగు శివుడు పార్వతిని ఓదార్చుటకై ఇట్లు మాట్లాడసాగెను.

శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లు పార్వతితోననెను-

ఉత్తిష్ఠ భద్ర భద్రం తే భవిష్యతి న సంశయః

సాంప్రతం చేతనం కృత్వా మదీయం వచనం శృణు

శివః శివాం తామిత్యుక్త్యా శుష్కకంఠోష్ఠతాలుకాం

వక్షసి స్థాపయామాస కారయామాస చేతనాం

 హీతం సత్యం మీతం సర్వం పరిణామ సుఖావహం

యశస్కరం చ ఫలదం ప్రవక్త ముపచక్రమే

 శ్రుణు దేవి ప్రవక్ష్యామి యద్వేదేన నిరూపితం

సర్వసమ్మతమిష్టం చ ధర్మార్థం ధర్మసంసది

సర్వేషాం కర్మణాం దేవి సారభూతా చ దక్షిణా

యశోదా ఫలదా నిత్యం ధర్మి ధర్మకర్మణి  దైవం వా పైతృకం వాపి నిత్యం నైమిత్తికం ప్రియే

యత్కర్మ దక్షిణాప్తిసం తత్పర్వం నిష్పలం భవేత్

దాతా చ కర్మణా తెన కాలసూత్రం వ్రజేద్ద్రువం

ఆథాంతే దైన్యమాప్నోతి శత్రుణా పరిపీడితః

 దక్షిణా వీప్రముద్దిశ్య తత్కాలం తు న దీయతే

తన్ముహూర్తే వ్యతితే తు దక్షిణా ద్విగుణా భవేత్

చతుర్గుణా దీనాతితే వక్షే శతగుణా భవేత్

ఓపర్వమంగళా! నీకు తప్పకశుభము చేకూరును. ఇప్పుడు, అవధానములో నామాట వినుమని ఎండిపోయిన వాలుకు గొంతుకల పార్వతిని తన ఎదపై నుంచుకొని హితమైనవి, సత్యమైనవి కీర్తిని కలిగించునవి సత్సలీతమునొసగునవీ ఆగు మాటలను ఇట్లు చెప్పసాగెను.

ఓదేవి! వేదమునందు పేర్కొనబడినది, అందరకు సమ్మతము, ఇష్టమైనది. ఆగు. నామాటను ధర్మపరిపాలకులు కల ఈసభలో వినుము.

దేవసంబంధము, పితృసంబంధమైనను, నిత్యమైనను, నైమిత్తకమైనను ధర్మకార్యములన్నిటిలో "దక్షిణ" తప్పక ఈయవలెను. దక్షిణ ఈయనిచో ఆ కర్మయంతయు నిష్ఫలమగును. పైగా దక్షిణ లేక ధర్మకార్యములు చేయువాడు చివరకు కాలసూత్రమను నరకమునకు పోవును.

ధర్మకార్యములనాచరింపుచున్న సమయమున దక్షిణ ఈయవలసిన సమయమున దానినీయనిచో శత్రుబాధలనంది దీను డగును. దక్షిణ ఈయవలసిన సమయము తప్పి ముహూర్తకాలము గడచినచో రెట్టింపు దక్షిణనీయవలెను. ఒక దినము దాటినచో ఈయవలసిన దక్షిణకంటే నాల్గురెట్లెక్కువ దక్షిణనీయవలెను. పక్షము గడచినచో నూరురెట్లెక్కువగా దక్షిణనొసగవలెను.

మాసే పంచశతఘ్నా స్యాత్ షణ్మాసే తచ్చతుర్గుణా

సంవత్సరే వ్యతితే తు కర్మ తనిష్ఫలం భవేత్

దాతా చ నరకం యాతి యావద్వర్షసహస్రకం

 పుత్రపౌత్రధనైశ్వర్యం క్షయమాప్నోతి పాతకాత్

ధర్మో నష్టో భవేత్తస్య ధర్మహీనే చ కర్మణి

దక్షిణ ఈయవలసిన సమయము నెలదాటినచో ఐదువందల రెట్లెక్కువ దక్షిణనీయవలెను, ఆరుమాసములు దాటినచో ఇంకను నాలుగురెట్లెక్కువ దక్షిణనీయవలెను. సంవత్సరము దాటినచో చేసిన ధర్మకార్యమంతయు నిష్పలమై పోవును. ఆతడు చేసిన ధర్మమంతయు నశించిపోవును. చివరకళడు వేలసంవత్సరములు నరకముననుండి బాధలననుభవించును అని పలికెను.

శ్రీ విష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను.

రక్షిస్వ ధర్మం ధర్మిణే ధర్మణే ధర్మకర్మణి

సర్వేషాం చ భవేద్రక్షా స్వధర్మపరిపాలనే

ధర్మములన్ని తెలిసి ధర్మకార్యములవాచరించు ఓ పార్వతీ! నీవు ఈ ధర్మకార్యమున నీధర్మమును పరిపాలింపుము, స్వధర్మపరిపాలన చేసినచో ఇతరులకు కూడ రక్షణ జరుగును.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు పలికెను-

 యశ్చ కేన నిమిత్తేన న ధర్మం పరిరక్షతి

ధర్మే నష్టే చ ధర్మజ్ఞే తస్య కర్తా వినశ్యతి

మానవుడు ఏదేని ఒక కారణమువలన తాననుష్ఠింపవలసిన ధర్మమును రక్షింపనీచో ధర్మనాశనము జరిగినందువలన ఆ ధర్మకర్మను అనుష్ఠించువాడుకూడ చెడిపోవును.

ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను-

 మాం రక్ష యత్నతః సాద్వీప్రదాయ పతిదక్షిణాం

మయిస్థితే మహాసాద్వి సర్వం భద్రం భవిష్యతి

ఓ సాధ్వీమణి! ఈవ్రతమున ఈయవలసిన పతీ దక్షణనిచ్చి ధర్మరూపుడనగు నన్ను రక్షింపుము. నేను చక్కగానున్నప్పుడు మాత్రమే సమస్తశుభములు జరుగును.

దేవా ఊచుః – దేవతలీట్లనిరి-

ధర్మం రక్ష మహాసాధ్వి కురు పూర్ణం వ్రతం సతి  వయం తవ వ్రతే పూర్ణే కుర్మస్యాం పూర్ణమానసాం

ఓ మహాసాధ్వి ధర్మమును చక్కగా పరిపాలించి నీవు చేయుచున్న పుణ్యకవ్రతమును పూర్తిచేయుము, నీవు వ్రతమును సక్రమముగా పూర్తిచేసినచో మేమందరము నీ కోరికను తీర్చెదము.

మునయ ఊచుః – మునులిట్లనిరి-

 కృత్వా సాధ్వి పూర్ణహోమం దేహి విప్రాయ దక్షిణాం

 స్థితేష్వస్మాసు ధర్మజ్ఞే కిమభద్రం భవిష్యతి

ఓపతివ్రతాశిరోమణి! ఈపుణ్యకవ్రతమున నీవు పూర్ణహోమమును చేసి బ్రాహ్మణునకు పతిదక్షిణనీమ్ము. మేమందరముండగా నీకెట్టి చెడు జరుగదు.

సనత్కుమార ఉవాచ-సనత్కుమారు డిట్లనెను-

శివే శివం దేహి మహ్యం న చేత్కర్మఫలం త్యజ

సుచిరం సంచితస్యాది స్వాత్మనస్తపసః ఫలం

కర్మణ్యదక్షిణీ సాధ్వి యాగప్యాహం తు తత్ఫలం

ప్రాప్స్యామి యజమానస్య సంపూర్ణం కర్మణః ఫలం

ఓ పార్వతీదేవి! పాకు వుని పతిదక్షిణగానిమ్ము లేనిచో నీవుచేసిన కర్మయొక్క ఫలితమునైవము వదలి పెట్టుము. అట్లే నీవు చాలాకాలమునుండి తపస్సు చేసి పంపాదించిన ఫలితమును కూడ వదిలిపెట్టుము.

ఈ పుణ్యకవ్రతమున దక్షిణనీయవీచో ఈయాగఫలితమును యజమానియొక్క పమస్తమైన సుకృతమున నేను కొందును.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

కిం కర్మణా మే దేవేశాః కిం మే దక్షిణయా మునే

కిం పుత్రేణ చ ధర్మేణ యత్ర భర్తా చ దక్షిణా

వృక్షార్చనే ఫలం కిం వా యది భూమిర్నచార్చ్యతే

 గతే చ కారణే కార్యం కుతః సస్యం కుతః ఫలం

 ప్రాణాస్త్యక్త్యా స్వేచ్ఛయా చేద్ది హై స్యాత్కిం ప్రయోజనం

దృష్టికివిహీసేన చక్షుషా కిం ప్రయోజనం

శతపుత్రపమః స్వామి సాధ్వివాం చ సురేశ్వరాః

యది భర్తా వ్రతే దేయః కిం ప్రతేన సుతేన వా

 భర్తుర్వంశ్చ తయః కేవలం భర్తృమూలక

యత్ర మూలం భవేదృష్టం తద్వాణిజ్యం చ నిష్పలం

ఓ దేవతలారా! ఈపుణ్యవతమున భర్తన దక్షిణగా ఈయవలసిపి ఈవ్రతమెందులకు? ఈపుత్రుడెందుకు? అధర్మమెందుకు వీటివలన వారు ప్రయోజనమేమి లేదు. ఆ భూమిని పూజింపక, వృత్తమును పూజించినచో ఫలితమేమి కారణములేనిచో కార్యముండదుగదా.

భర్త పతివ్రతలకు అనేక పుత్రులతో సమానమైనవాడు, ఆ భర్తన ఈవ్రతమువ దానము చేసినచో ఈవ్రతము ఈ వ్రతఫలమైన పుత్రులుపును ప్రయోజనముండదుకదా. పుత్రుడు. భర్తకు చెందినవాడు. భర్శమూలమైనవాడు. వర్తకములో అసలుకే మోసము కలిగిన ఆ వాణిజ్య వ్యర్థమైపోవునుకదా. అందువలన నాభర్తలేని ఈవ్రతము వ్యర్థమైనదని పార్వతి పలికెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువు ఇట్లనెను-

పుత్రాదపి పరః స్వామీ ధర్మశ్చ స్వామివః పరః

నష్ఠే ధర్మే చ ధర్మిష్ఠే స్వామివా కిం సులేవ చ

ఓపార్వతీదేవికి భర్త పుత్రునికంటే గొప్పవాడే అట్లే ధర్మము భర్తకంటే ప్రమైనది. అట్టి ధర్మము నశించినచో భర్త పుత్రులున్నమ ప్రయోజనమేముండుపనేను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లనెను-

స్వామివశ్చ పరో ధర్మోధర్మాత్పత్యం చ సువ్రతే

పత్యం సంకల్పితం కర్మ స తు భ్రష్టం కురు వ్రతం

ఓ దేవీ! భర్తకంటే ధర్మము గొప్పది. ధర్మమువకంటే సత్యము పరమమైనది. సత్యపంకల్పితమైన కర్మ ఇంకను భ్రష్టము కాలేదు. కావున వ్రతమున నీవు ఆచరింపుము . ఆనీ పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

విరూపితశ్చ వేదేషు స్వశబ్ధో ధనవాచకః

తద్యస్యాస్తితి స స్వామి వేదజ్ఞ శ్రుణు మద్వచః

తస్య దాతా సదా స్వామీ వ చ స్వం స్వామితాం లభేత్

అహోవ్యవస్థాభవం వేదజ్ఞానామభోధతః

సమస్తవేదములు తెలిపిన బ్రహ్మదేవుడా! వేదములందు "స్వ" శబ్దమునకు ధనమను అర్థముకలదు. ఆ ధనము ఎవరివద్ద నుండునో అతనిని ప్వామియని పిలుతురు. ఆధవముమ దానము చేయువానిని స్వామీయని యందురు. కాని ధవ మెప్పుడు స్వామి: కాజాలదు. అట్లే పరమశివుని ధనమగు నేను అతనిని ఎట్లు దానమిత్తును? ఇది చాలా విపరీతమైనదని పలికమ.

ధర్మఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను-

 పత్నీవినాఽన్యం స్వం సాద్వి స్వామివం దాతుమక్షమా

దంపతీ ధ్రువమేకాంగౌ ద్వయోర్దానే ద్వకౌ సమౌ

భార్యతప్ప ఇతరులెవ్వరు భర్తదానము చేయలేరు. ఎందుకంటే దంపతులిద్దరు ఏకాంగరూపులు, ఒకరినొకరు దానము చేయుటలో ఇద్దరకు సమానమైన ఆధికారము కలదనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికమ-

పితా దదాతి జామత్రే స చ గృహ్ణతీ తత్పుతాం

వశ్రుతం విపరీతం చ శ్రుతౌ శ్రుతిపరాయణాం

వేదవేదాంగములన్నియు తెలిపిన ధర్మాదిదేవతలారా! వేదములందు తండ్రి తన కూతురుమ అల్లుపకు దానము  చేయునట్లు, అల్లుడు ఆమెను స్వీకరించునట్లు కలదు కాని మీరన్నట్లు భర్త భార్యను, భార్య భర్తను దానము చేయుచున్నట్లు ఎక్కడ కనిపించదు. మీమాట. వేదవిరుద్ధముగా నున్నదనెమ.

దేవా ఊచుః – దేవతలిట్లనిరి-

 బుద్ధిస్వరూపాత్వం దుర్గే బుద్ధిమంతో వయం త్వయా

వేదజ్ఞే వేదవాదేషు కి వా త్వాం కేతుమీశ్వరాః

విరూపితా పుణ్యక్తుప్రతి స్వామీ చ దక్షిణా

శ్రుతా శ్రుతోయః ప ధర్మో విపరీలో హ్యదర్మకః

వేదమర్మములన్ని తెలిపిన ఓ దుర్గాదేవి నీవు బుద్ధిపరూపురాలను అనుగ్రహము వలన మేమందరము బుద్ధిమంతులమైతిమి. అందువలన వీతో వేదవిషయముల గురించి చర్చించుటకు పూకు పామరము లేదు. కాని వేదములందు పుణ్యకవ్రతమున భర్తమ దక్షిణగా ఈయవలెననీ చెప్పబడినది. పేదదితమైపదే ధర్మము. తద్విరుద్ధమైనది అధర్మమే యగునవి అనిరి.

పార్వత్యువాచ -పార్వతీదేవీ ఇట్లు పలికెను-

కేవలం వేదమాత కః కరోతి వీవీర్ణయం

బలవాన్ లౌకికో వేదాత్ లోకాచారం చ కస్త్యజేత్

వేదే ప్రకృతి పుంపోశ్చ గరియామ్పరుషా ధ్రువం

విబోధత సరాః ప్రాజ్ఞా బాలాహం కథయామి కిం

ఓ దేవతలారా! వేదమున మాత్రమమపరించి ధర్మనిర్ణయము చేయుట సరియైన పద్ధతకాదు. లౌకికమైన ఆచారము వేదముకంటే బలమైనది కావున రావిపవ్వరు కొదవలేరు. వేదములలో సైతము ప్రకృతికంటే పురుషుడు చాలా గొప్పవాడని చెప్పబడినది. అందువలన ప్రకృతిరూపిణియగు శ్రీ తవ పురుషుని ఎట్లు దానముచేయగలదు? మీరందరు మిక్కిలి జ్ఞానవంతులు. నేనో బాలను. మీకు నేనేమి చెప్పగలననెను.

బృహస్పతిరువాచ -బృహస్పతి ఇట్లు చెప్పను-

వ పుమాంసం వినా స్పష్టిర్న సాద్వి ప్రకృతిం వినా

శ్రీకృష్ణశ్చ ద్వయోః స్రష్టా సమౌ ప్రకృతిపూరుషా

అట్లే ఓ పతివ్రతాకి, పురుషుడు లేకుండ సృష్టి ఎట్లు జరుగదో ప్రకృతిస్వరూపిణియగు ప్రీ లేకుండ. సృష్టి జరుగదు. శ్రీకృష్ణపరమాత్మ సృష్టికార్యమునకై ప్రకృతి పురుషులనిద్దరను సృష్టించెను. కావున ప్రకృతి పురుషులిద్దరు సమానులేయని యనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

పర్వప్రష్యా చ యః కు సోంప సగుణః పుమాన్

పుమాన్దరీయాన్ ప్రకృతేస్తరైవ వ తతశ్చ సా

చరాచరపృష్టికంతయు కారకుడగు శ్రీకృష్ణుని అంశస్వరూపమే పురుషుడు. అందువలన అతడు ప్రకృతికంటె శ్రెష్టుడు. ప్రకృతి అతని కంటె శ్రేష్టురాలెన్నటికి కాజాలదవి పల్కెను.

ఏతస్మిన్నంత దేవా మువయషత్ర సంసతి

రత్నేంద్రపారరచితమాకాశే దద్పశూ రథం

పారదైస్పంపరివృతం యుతం శ్యామైశ్చతుర్భుజైః

వనమాలాపరివృతై రత్నభూషణభూషితైః

ఆవరుహ్య ముదా యానాదాజగామ సభాతలం

తుష్టువుప్తం సురేంద్రాస్తే దేవం వైకుంఠవాసినం

శంఖచక్రగదాపద్మధరమీశం చతుర్భుజం

లక్ష్మీ సరస్వతి కాంతం శాంతం తం సుమనోహరం

 సుఖదృశ్య మభక్తానామదృశ్యం కోటి జన్మభిః

కోటికందర్పలావణ్యం కోటిచంద్రసమప్రభం

అమూల్యరత్నరచిత చారుభూషణ భూషితం

 సేవ్యం బ్రహ్మాది దేవైశ్చ సేవకైః సంతతం స్తుతం

తద్భాషా సంపరిచ్ఛన్నరేష్టితం చ సురర్షిభి

వాసయామాస తం తే చ రత్నసింహాపనే వరే

తం ప్రణేముశ్చ శిరసా బ్రహ్మశక్తి శివాదయః

సంపుటాంబిలయః సర్వే పులకాంగాశ్రులోచనాః

సప్మిస్తాంశ్చ పప్రచ్ఛ సర్వం మధురయా గిరా

ప్రబోధితః సుబోధలజ్ఞః  ప్రవర్తుముపచక్రమే

ఆసమయమున ఆసభలోనున్న దేవతలు మునులు ఆకాశమున రత్ననిర్మితమైన ఆద్బుత రథమును చూచిరి. ఆ రథము చుట్టు వనమాల, రత్నభూషణములచే అలంకరించబడినవారు నాలుభుజములు నల్లనివర్ణముకల అనుచరులుండిరి. ఆ రథమునుండి చతుర్భుజుడు, శంఖచక్ర గదాపద్మముల ధరించినవాడు, వైకుంఠలోకవాసి, లక్ష్మీసరస్వతులకు ప్రియుడు, శాంతుడు, అందమైనవాడు, భక్తులకు తేలికగా కన్నించువాడు భక్తులు నివారికి కోటిజన్మలకైనను దర్శనమొసగనివాడు, కోటిమన్మథుల లావణ్యము కలవాడు,అందమైన రత్నభూషణములచే అలంకృతుడు, ఆగునారాయణుడు బ్రహ్మాదిదేవతలు, మహర్పులు సేవించుచుండగా క్రిందకు దిగి ఆ సభాస్థలికి వచ్చాను, రత్నసింహాసనమున సుఖోపవిష్టుడైన ఆ నారాయణుని బ్రహ్మశక్తి శివాదిదేవతలు నమస్కరించి చేతులు జోడించుకొని పులకితగాత్రులై కన్నీరు కార్చుచు ఆశ్చర్యమున తేలియాడుచుండగా ఆ శ్రీమన్నారాయణుడు వారీ యోగక్షేమములను విచారించి ఇట్లు పలికెను.

శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-

 సహ బుధ్యా బుద్ధిమంతో న వక్తుముచితం సురాః

సర్వే శక్త్యా యయా విశ్వ శక్తిమంతో హి జీవినః

 బ్రహ్మాదితృణపర్యంతం సర్వం ప్రాకృతికం జగత్

సత్యం సత్యం వినా ధూం చ మయా శక్తి: ప్రకాశితా

ఆవిర్భూతా చ సా మత్తః సృష్టి దేవీ మదిచ్ఛయా

తిరోహితా చ సా శేషే సృష్టిసంహరణే మయి

ప్రకృతిః సృష్టికర్త్రీ చ సర్వేషాం జననీ పరా

మమతుల్యా చ మన్మాయా తేన నారాయణీ స్మృతా

సుచిరం తపసా తప్తం శంభువా ధ్యాయతా చ మాం

 తేన తస్మై మయా దత్తా తపసాం ఫలరూపిణీ

ప్రతం చ లోకశిక్షార్థమస్యా న స్వార్థమేవ చ

స్వయం ప్రతానాం తపసాం ఫలదాత్రి జగత్తయే

మాయయా మోహితాః సర్వే కిమస్యా వాస్తవం ప్రతం

సాధ్యమస్య వ్రతఫలం కల్పే కల్పే పునః పునః

సురేశ్వరా మదంతాశ్చ బ్రహ్మశక్తి మహేశ్వరాః

కలాః కలాంశరూపాశ్చ జీవినశ్చ సురాదయః

 మృదా వీనా ఘటం కర్తుం కులాలశ్చ యథాక్షమః

వినా స్వర్ణం స్వర్ణకారః కుండలం కర్తుమక్షమః

వినా శక్త్యా తథాహం చ స్వసృష్టిం కర్తుమక్షమః

శక్తి ప్రధానా సృష్టిశ్చ సర్వదర్శనసమ్మతా

ఆహామాత్మా హి నిర్లిప్తో దృశ్యః సాక్షీ చ దేహినాం

 దేహాః ప్రాకృతికాస్సర్వే నశ్వరాః పాంచభౌతికాః

ఓ దేవతలారా! మీరందరు బుద్ధిమంతులు. మీకు చెప్పుట దగనిదైనను చెప్పుచున్నాను.

ఈ ప్రపంచముననున్న జీవులందరు. దుర్గాదేవివలవనే శక్తి కలిగియున్నారు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు సమస్తము ప్రాకృతికము. నేనుమాత్రము దీనికి అతీతుడను. అట్టి నేను శక్తిస్వరూపిణియగు ఈదేవిని సృష్ట్యారంభకాలమున నాశరీరమునుండి సృష్టించితిని. ఈదేవి పృష్ట సంహారము జరిగినప్పుడు శేషునిలో ఆంతర్జానము చెందును. ఈ దేవి ప్రకృతి స్వరూపిణి. సృష్టికి ప్రధాసహేతువు కాపువ సమస్త చరాచర సృష్టికోటికి జననిగా పేరుపడసినది. ఈ మాయ నాతో సమానమైనది కావున ఈమెను . నారాయణియని కూడ పిలుతురు.

శంకరుడు నన్పుగురించి తీవ్రమైన తపస్సు చేయుటవలన అతని తపస్సునకు ఫతీతముగా ఈదేవినతని కొసగితిని.

ఈపార్వతీదేవి తాను స్వయముగా సమస్తవ్రతములు, తపస్సులయొక్క ఫలితములనిచ్చును. ప్రస్తుతము ఆదేవి దీనిని జనులందరు వ్రతమును చేయవలనను సంకల్పముతోనే చేయుచున్నదిగాని తనకేదో ప్రయోజనమున్నది అని ఈ వ్రతము చేయుటలేదు. మీరందరు ఆదేవియొక్క మాయవలన మోహము చెందినారుకాని ఆమె వాస్తవముగా వ్రతము చేయనవసరములేదు. ఈ వ్రతఫలము ప్రతికల్పమున ఆదేవికి లభించును.

బ్రహ్మ, శక్తి, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవటాధిపతులు నాయొక్క ఆంశవలన పుట్టినవారు. ఇతరదేవతలు, ప్రాణులు నాయొక్క అంశాంశములవలన జన్మించినారు.

కుమ్మరివాడు మట్టిలేక కుండలెట్లు చేయజాలడో, కంసాలివాడు బంగారములేక కుండలములెట్లు చేయలేడో, అట్లే నేనుకూడ శక్తిస్వరూపిణియగు ఈదేవిలేక సృష్టిని చేయజాలను. సృష్టికార్యమున ఈశక్తియే ప్రధానకారణము. నేను నిర్లిపుడనై, సమస్తజీవులకు ఆత్మరూపుడనై, సాక్షిగా ఉందును.

ప్రకృతికి సంబంధించిన ఈ పాంచభౌతికదేహములన్నియు నశించిపోవునవే అని అనెను.

అహం నిత్యః శరీరీ చ భానువిగ్రహవిగ్రహః

సర్వాధారా సా ప్రకృతిః సర్వాత్మాఽహం జగత్సుచ

ఆహమాత్మామనో బ్రహ్మా జ్ఞానరూపో మహేశ్వరః

పంచప్రాణాః స్వయం విష్ణుః బుద్ధిః ప్రకృతిరీశ్వరీ

 మేధా నిద్రాదయశైతాః సర్వాశ్చ ప్రకృతేః కళాః

సా చ శైలేంద్ర కన్యేషాత్త్వితి వేదే నీరూపితం

 అహం గోలోకనథశ్చ వైకుంకేశః సనాతనః

 గోపీగోఫైః పరివృతః తత్రైవ ద్విభుజః స్వయం

చతుర్భుజోఽత్ర దేవేశో లక్ష్మీ పార్షదైఃవృతః

 ఊర్ధంపరశ్చ వైకుంఠాత్ పంచాశత్కోటియోభనే

 మమాశ్రయశ్చ గోలోకే యత్రాహం గోపికాపతిః

ప్రతారాధ్యప్ప ద్విభుజః స చ తత్ఫలదాయకః

యద్రూపం చింతయేద్యోహితచ్చ తత్పలదాయకః

అట్లే సూర్యునివంటి శరీరకాంతిగల నేను నిల్యుడను. ఈబిగములందన్నిటిలో నేను సమస్త ప్రాణులకు ఆత్మభూతుడను, ప్రకృతిస్వరూపిణియగు ఈదే సమస్త ప్రాణులకు ఆధారభూతమైనది. సమస్తజీవులకు నేను ఆత్మను. బ్రహ్మదేవుడు మనోరూపుడు. మహేశ్వరుడు జ్ఞానరూపుడు. మేధ, నీద్ర మొదలగునవన్నీయు ప్రకృతియొక్క ఆంశలు. ఆ ప్రకృతియే ఈ పార్వతీదేవియని వేదములలో చెప్పబడిది. వైకుంఠలోకాధీపతియగు నేను గోపగోపీపరిపృతుడునైన శ్రీకృష్ణుడు. గోలోకమున నేను ద్విభుజూడ గోలోకముననుండును. వైకుంఠమున చతుర్భుజుడనై లక్ష్మీపతినై నా అనుచరగణముతో కలసియుందును.

ఈవైకుంఠలోకమునకు ఏబదికోట్ల యోజనములపైన గోలోకము కలదు. అచ్చట నేను గోపికాపతినై రెండుభుజములతో, వ్రతములచే ఆరాధింపబడుచు వాటి ఫలితములనోవగుచుందును.

జీవులు వన్నేరూపమున స్మరించిన వారికి ఆధూపములో ఫలితము నొసగుదును, అని నారాయణుడను.

వ్రతం పూర్ణం కురు శివే శివం దత్వా చ దక్షిణాం

పునః సముచితం మూల్యం దత్వా నాథం గ్రహిష్యసి

 విష్ణుదేహా యథా గావో  విష్ణుదేపాస్తథా శివః

ద్విజాయ దత్వా గోమూల్యం గృహాణ స్వామీవం శుభే

 యజ్ఞపత్నీం యథా దాతుం క్షమః స్వామీ సదైవ తు

 తథా సా స్వామినం దాతుమ్విరీతి శ్రుతేర్మతం

ఇత్యుక్త్యా ప సభామధ్యే తత్రైవాంశరధీయత

దృష్టిష్టే పా చ పంహృష్టా దక్షిణాం దాతుముద్యతా

ఓపార్వతీ! శివుని దక్షిణగావోసగి తీవ్రతము పూర్తిచేసికొనుము. తరువాత అతనికి తగిన మూల్యమును చెల్లించి వీభర్తను. తిరిగి తీసికొనుము.

గోవులు విష్ణుమూర్తికి దేహములు. ఆట్లే శిపుడుకూడ విష్ణుమూర్తి దేహమే కావున గోమూల్యమును బ్రాహ్మణునకు చెల్లించి నీభర్తను స్వీకరింపుము.

యజమాని యజ్ఞకర్మయందు యజ్ఞవల్ని నేవిధముగా దానమిచ్చునో అట్లే యజ్ఞపత్నిసైతము అతనిని దానమివ్వవచ్చునని వేదములయందు చెప్పబడినది.

ఇట్లు శ్రీమన్నారాయణుడు ఆసభాస్థలియందు దేవతలమధ్య పార్వతీదేవికి తెలిపి అంతర్ధానము చెందగా దేవతలందరు. పంతోషపడిరి. పార్వతీదేవికూడ ఆతనమాటలవలన సంతృప్తిచెంది భరదానము చేయుటకు సన్నద్దమాయెను.

కృత్వా శివా పూర్ణహోమం సా శివం దక్షిణాం దదౌ

స్వస్తిత్యుకా చ జగ్రాహ కుమారో దేవసంసది

ఉవాచ దుర్గా సంత్రస్తా శుష్కకంఠౌస్థతాలుకా

కృత్వాంజలిపుటం విప్రంహృదయేన విదూయతా

ఆప్పుడు పార్వతీదేవి తాను చేసిన వ్రతమున పూర్ణహోమము చేసి బ్రహ్మదేవుని పుత్రుడగు ననత్కుమారునకు తన భర్తయగు శివుని దక్షిణగా నొసగెను. అటుపిమ్మట దుర్గాదేవి ఎండిన గొంతుకతో, పెదపులతో హృదయము క్షోభచేందుచుండగా చేతులు జోడించుకొని సనత్కుమారునితో ఇట్లనెను.

పార్వత్యువాచ -పార్వతీదేవి ఇట్లు పలికెను-

 గోమూల్యం మత్సతీసమమితి వేదే నీరూపితం

గవాం లక్షం ప్రదాస్యామి దేహి మతస్వామివం ద్విజ

తదా దాస్యామి విప్రేభ్యో దానాని వివిధాని చ

ఆత్మహీనో హి దేహశ్చ కర్మ కింకర్తుమీశ్వరః

సాభర్త యగు శివునితో ఆపు సమానమైనధవి వేదములందు చెప్పబడినది కావున మీకు-లక్ష ఆవులనిచ్చెదను. నాభర్తను తిరిగి నాకిమ్ము. అటుపిమ్మట బ్రాహ్మణులకు వివిధములైన దానములు చేయుదును. పారెహమిప్పుడు ఆత్మలేకుండనున్నది. అందువలన నేనేమి చేయలేకపోవుచున్నాను కావున గోమూల్యమును తీసికొని నాభర్తను తిరిగి ఇమ్మని పార్వతిదేవి సనత్కుమారుని ప్రార్థించినది.

సనత్కుమార ఉవాచ - సనత్కుమారు డిట్లనెను-

గవాం లక్షేణ మే దేవి వల్గునా కిం ప్రయోజనం

దత్తస్యామూల్యరత్నస్య గవాం ప్రత్యర్పణేన చ

స్వస్య స్వస్య స్వయం దాతా లోకః సర్వే జగత్రయే

కత్రురేనేప్పితం కర్మ భవేత్కీం వా పరేచ్ఛయా

 దిగంబరం పురః కృత్వా భ్రమిష్యామి జగత్రయం

బాలకానాం బాలికానాం సమూహప్మిత కారణం

ఓ పార్వతీదేవి! నీవు అమూల్యమైన రత్నమును దానమిచ్చితివి. దానికి బదులుగా వీవు లక్షగోవులిచ్చివను ప్రయోజనమేమున్నది?

ఈలోకములన్నిటిలోను అందరు తనయొక్క ఇచ్చనమసరించి దావాదికార్యములు చేయుదురు. కర్త తన ఇచ్చసమసరించి కర్మచేయుమ కవి ఇతరుల అభీష్టమువనపరించి దానాది కార్యములు చేయడు. అందువలన స్వీకరించిన దానమును నాఇష్టము వచ్చినట్లు చేయుటకు పాకధికారమున్నది. కావున శివువీ దిగంబరునీగా. చేసి బాలురు, బాలికలు నవ్వుచుండగా ముల్లోకములు తిప్పదను అని పలికెను.

ఇత్యుక్త్యా బ్రహ్మణః పుత్రో గ్రహీత్వా శంకరం మునే

సన్ని ధౌ వాసయామాప తేజస్వీ దేవసంసది

సనత్కుమారుడిట్లు పలుకుచు శంకరుని చేతితో పట్టుకొని ఆదేవశాసభలో కూర్చొనబెట్టెను.

దృష్ట్యా శివం గృహ్యమాణం కుమారేణ చ పార్వతీ

సముద్యతా తనం త్యకుం శుష్కకంఠౌస్థలాలుకా

 విచింత్య మనసా సాద్వీత్యేమేవ దురత్యయం

న దృషోభీష్టదేవశ్చ న చ ప్రాప్తం ఫలం వ్రతే

సనత్కుమారుడు శివుని చేతబట్టుకొనిపోవుచుండగా పార్వతి చూచి ఎండిపోయిన గొంతు పెదవులుకలదై నాలుక తడియారిపోవుచుండగా తాను చచ్చిపోవుటకు సిద్ధపడెను. ఈవ్రతము చేయుటవలన తనకు అభీష్టదేవదర్శనము జరుగలేదు ఆశించిన వ్రతఫలముకూడ దక్కలేదు పైగా చెడు జరిగినదని భావించి చనిపోవుటకాదేవి ప్రయత్నించెను.

ఏతస్మిన్నంతరే దేవా పార్వతీసహితాస్తదా

సద్యో దదృశురాకాశే తేజసాం నికరం పరం

కోటిసూర్యప్రభోర్ద్వం చ ప్రజ్వలంతం దిశో దశ

కైలాసశైలపురతః సర్వదేవాదిభిర్యుతం

సర్వాశ్రయం గణాచ్ఛన్నం విస్తీర్ణం మండలాకృతిం

 తచ్చ దృష్ట్యా భగవతస్తుష్టువుస్తే క్రమేణ చ

ఆసమయమున ఆయువ ఒక గొప్పని వెలుగు కనిపించింది. ఆ తేజస్సు కోటిసూర్యులకాంతకంటే మిన్నయై అన్నీ దిక్కులలో ప్రకాశించుచుండెను. కైలాసపర్వతముముందు కనిపించిన ఆ తేజస్సు వెంట సమస్త దేవతలుండిరి. సమస్త గణములుండినవి. మండలాకారమువనున్న ఆ తేజస్సును పార్వతీదేవి మొదలుగాగల సమస్త దేవతలు చూచి క్రమముగా ఆతనినిట్లు స్తుతించిరి.

విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను.

బ్రహ్మాండాని చ సర్వాణి యల్లోమవివరేషు చ

సోఽయం తే షోడశాంశశ్చ కే వయం యో మహాన్విరాట్

ఈబ్రహ్మాండములన్నియు మహావిరాట్వరూపుని రోమకూపములందు అణగియున్నవి. అట్టి మహావిరాట్పురుషుడు పరమాత్మవగు నీయొక్క పదుపారవ అంశము కదా. అందువలన పర్వాతీతుడవై పరగుచున్నావని అనెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

 వేదోపయుక్తం దృశ్యం యత్రప్రత్యక్షం ద్రష్టుమీశ్వరః

 స్తోతుం తద్వర్ణితుమహం శక్తః కిం స్తామి తత్పరం

ఓమహానుభావl వేదములందు పేర్కొనబడినవానిని, ప్రత్యక్షముగానున్నదానిని నేను స్తుతింపగలను. అట్లే చూడగలను. కాని వేదములకంటెను పరుడైన ఆపరమాత్మను నేనెట్లు స్తుతింపగలనని బ్రహ్మదేవుడు పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవు డిట్లు పలికెను-

 జ్ఞానాధిష్ఠాతృదేవోహం స్తామిజ్ఞావపరం చ కిం

సర్వానిర్వచనీయం త్వాం చ స్వేచ్ఛామయం విభుం

ఓపరమేశ్వరా! నీవు సర్వజ్ఞానముల కతీతుడవు. నిన్ను ఎవ్వరును నిర్వచించి చెప్పలేరు. నీవు స్వేచ్చామయుడవు. అట్టి నిన్ను జ్ఞానధిష్టాన దేవతయగు నేను స్తుతింపబొలను. అందువలన ఇతరులు నిన్నే విధముగా స్తుతింపగలుగుదురు?

ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను-

 ఆదృశ్యమవతారేషు య ధ్రుశ్యం సర్వజంతుభిః

కిం స్తౌమి తేజోరూపం తద్భక్తానుగ్రహ విగ్రహం

నీవు అదృశ్యుడవైనను అవతారపమయమున నిన్ను సమస్త ప్రాణులు దర్శింపగలుగుదురు. నీవు భక్తులననుగ్రహించుటకై రూపమును ధరించి అందరకు దర్శనమొసగుచున్నావు. అట్టి తేజస్వరూపుడవైన నిన్ను ఎట్లు నేను స్తుతింపగలను.

దేవా ఊచుః - దేవతలు ఇట్లు పలికిరి-

 కే వయం త్వత్కలాంశాశ్చ కిం వా త్వాం స్తోతుమీశ్వరాః

 స్తోతుం న శక్తాః వేదాయం న చ శక్తా సరస్వతీ

ఓపరమాత్మా! మేమందరము నీయొక్క ఆంశాంశ స్వరూపులము. అట్టి మేము నిన్నెట్లు స్తుతింపగలము. అట్లే వేదములుకాని సరస్వతీదేవిగాని నీ సమస్తగుణములను ప్రతింపసమర్థులు కారని పల్కెను.

మునయ ఊచుః -మునులిట్లు పలికిరి-

 వేదాస్పతిత్వా విద్వాంసో వయం కిం  వేదకారణం

స్తోతుమీశాన వాణీ చ త్వాం వాజ్మనసోః పరం

మేమందరము వేదములనన్నిటిని చదివి విద్వాంసులమైతిమి కానీ వేదములకు మూలపురుషుడవు, వాక్కు మనస్సులకు ఆతీతముగనున్న నిన్ను మేముకాని చదువులతల్లియగు పరస్వతిగాని స్తుతిచేయసమర్థులముకొమని పలికిరి.

సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను-

 వాగధిష్ఠాతృదేవీం మాం వదంతే వేదవాదినః

కించిన్న శక్తి త్వాం స్తోతుమహో వాజ్మవసఃపరం

వేదవేదార్థపారంగతులైన మహర్పులు వాక్కులకు ఆధిష్టాపదేవతవని నన్ను స్తుతింతురు, కానీ వాక్కుకు మనస్సునకు అతీతుడవగు నిన్ను నేను కాని మహర్షులు కాని సుతింపజాలమని పలికెను.

సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లు పలికెను-

వేదప్రసూరహం నాథసృష్టా త్వత్కలయా పురా

కిం స్తౌమి శ్రీస్వభావేన సర్వకారణ కారణం

లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికినది-

త్వదంశవిష్ణుకాంతాహం జగత్పోషణకారిణీ

కిం సౌమి త్వత్కలాస్ఫష్టా జగతాం బీజకారణం

జగములనన్నిటిని పోషించుటకు కారణభూతురాలను ఆంశ వలన జన్మించిన శ్రీమహావిష్ణువుయొక్క భార్యనగు నేనుకూడ నీ అనంతగుణగణములను స్తుతింపలేకపోవుచున్నాను అని పలికెను.

హిమాలయ ఉవాచ -హిమాలయ మిట్లనెను-

హసంతి సంతో మాం నాభ కర్మణా స్థావరం వరం

 స్తోతుం సముద్యతం క్షుద్రః కిం స్తౌమి స్తోతుమక్షమః

ఓ పరమేశ్వరా! నీ కల్యాణగుణగణమును వర్ణించుటకు ప్రయత్నించు నన్ను చూచి సత్పురుషులు ఇతడు చలనములేని వాడనని చెప్పుచు, అవహేళన చేయుదురు. అట్టి నీచుడనగు నేను నిన్ను స్తుతింపజాలను అని అనెను.

క్రమేణ సర్వే తం స్తుత్వా దేవా విరరముర్మునే

దేవ్యశ్చ ముసయః సర్వే పార్వతి స్తోతుముద్యతా

ధౌతవస్త్రౌ జటాభారం బిభ్రతీ సువ్రతా ప్రతే

 ప్రేరితా పరమాత్మానం ప్రతారాధ్యం శివేవ చ

జ్వలదగ్ని శిభారూపా తేజోమూర్తిమతీ సతి

తపసాం ఫలదా సూతా జగతాం సర్వకర్మణాం

ఈవిధముగా దేవతలందరు ఆ పరమపురుషుని స్తోత్రము చేసిరి. అప్పుడు తెల్లని వస్త్రములను జడలను వ్రతకారణముగా ధరించిన పార్వతి పరమశివునిచే ప్రేరేపింపబడి ఆపరమాత్మను స్తుతింపమొదలిడినది. అప్పుడు పార్వతీ మండుచున్న అగ్నిశిఖవలెనుండినది. సమస్తకర్మల, తపస్సుల ఫలమునొసగు ఆ సతి సమస్త జగత్తునకు మాతృస్వరూపిణి. ఆమె ఇట్లు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

 కృష్ణ జానాసి మాం భద్రం నాహం త్వాం జ్ఞాతుమీశ్వరీ

కే వా జానంతి వేదజ్జా వేదా వా వేదకారకాః

త్వదంశాస్త్యాం న జూనంతి కథం జ్ఞాస్యంతి తే కళాః

త్వం చాపితత్వం బోనాసి కిమన్యే ఞాతుమీశ్వరాః

సూక్ష్మాత్ సూక్ష్మతమోఽవ్యక్తః స్థూలాత్స్థూలతమోమహావ్

 విశ్వస్త్యం విశ్వబీజశ్చ విశ్వరూపః సదాతనః

కార్యం త్వం కారణం త్వం చ కారణానాం చ కారణం

తేజః స్వరూపో భగవాన్ నిరాకారో నిరాశ్రయః

 నిర్లిప్తో నిర్గుణః సాక్షి స్వాత్మారామ@ పరాత్పరః

ప్రకృతీశో వీరాడ్భీజం విరాడ్రూపస్త్యమేవ హి

పగుణస్యం ప్రాకృతీకః కళయా సృష్టిహేతవే

 ప్రకృతిష్యం పుమాంస్యంచ వేదాన్యోన క్వచిద్భవేత్

జీవస్యం సాక్షిణో భోగే స్వాత్మనః ప్రతిబింబకం 

కర్మ త్వం కర్మబీజం త్వం కర్మణాం ఫలదాయకః

ధ్యాయంతి యోగినస్తేజః త్వదీయమశరీరి యత్

కేచిచ్ఛతుర్భుజం శాంతం లక్ష్మీకాంతం మనోహరం

 వైష్ణవ సాకారం కమనీయం మనోహరం

శంఖ చక్రగదాపద్మధరం పీతాంబరంపరం

ద్విభుజం కమనీయం చ కిశోరం శ్యామసుందరం

శాంతం గోపాంగనాకొంతం రత్నభూషణ భూషితం

 ఏవం తేజస్వినం భక్తా సేవంతే సంతతం ముదా

ధ్యాయంతి యోగినో యత్తల్ కుతస్తేజస్వినం వీనా

 తత్తేజో బిభ్రతాం దేవ దేవానాం తేజసా పురా

ఆవిర్భూతా సురాణాం చ వధాయ బ్రహ్మణా స్తుతా

ఓశ్రీకృష్ణా! నీకు నాగురించి తెలియును కానీ నేను నీగురించి ఏమియు నెరుగను. వేదజ్ఞాలైనను, వేదములైనను, వేదకారకులైన వారు సహితము నిన్ను ఎరుగలేరు. నీయొక్క అంశలైన బ్రహ్మాదిదేవతలకే నీ తత్త్వము తెలియనిచో ఆంశాంశరూపలైన మాబోటివారికి నీతత్త్వమెట్లు తెలియును. అట్లే ఈతత్త్వము నీకే తెలియును కాని ఇతరులకెవ్వరికిని తెలియరాదు.

ఓపరమాత్మా! నీవే ప్రపంచమవు, ప్రపంచకరణమవు. విశ్వరూపుడవు, సనాతనుడవు. సూక్ష్మములకెల్ల పరమసూక్ష్మమైన ఆవ్యక్తుడవు. అట్లే స్టూలములకెల్ల అతిస్థూలమైన మహత్స్వరూపుడవు, నీవే కార్యమవు, కారణరూపుడవు, కారణములకెల్ల కారణస్వరూపుడవు, తేజస్వరూపుడవు, భగవంతుడు, నిరాకారరూపుడవు, నిరాశ్రయుడవు, నిర్లీపుడవు, నీరుణుడపు, సాక్షీభూతుడవు. పరాత్పరుడు, స్వాత్మారాముడు, ప్రకృతీశుడు, విరాట్కరణుడు, వీరాడ్రూపుడు అన్ని నీ రూపములే, అట్లే సగుణరూపము. నీదే. సృష్టికొరకు నీ ఆంశాంశతో ప్రాకృతికుడవగుచున్నావు.. నీవే ప్రకృతిని, పురుషుడవు. వేదములు, జీవము, కర్మ, కర్మకారణము, కర్మల ఫలితమునిచ్చువాడు. అన్నియు నీవే. యోగులు నీ తేజఃస్వరూపమునెల్లప్పుడు ధ్యానింతురు. కొందరు విష్ణుభక్తులు నీరూపము సాకారమని నాలుగు భుజములలో శంఖ చక్ర గదా పద్మాయుధములు ధరించుచు పీతాంబరుడవై లక్ష్మీపతీగా ఉన్నట్లు ధ్యానింతురు. మరికొందరు ద్విభుజములతో శ్యామసుందరవిగ్రహముతో కిశోర రూపియైన నిన్ను ధ్యానింతురు. వారు నిన్ను శాంతమూర్తిగా గోపాంగనాకోంతుడుగా రత్నాలంకార సుశోభితుడవుగా భావింతురు. ఈవిధముగా భక్తులు ఎల్లప్పుడు తేజోరూపమైన నిన్ను సేవించుచుందురు. యోగులు ఎల్లప్పుడు తేజఃస్వరూపమైన నీరూపును తప్ప ఇతరమైన దానిని ధ్యానింపరు.

ఓ దేవా! నీతేజస్సును ధరించు దేవతలయొక్క తేజస్సుతో బ్రహ్మదేవుడు నుతింపగా దుర్మార్గులైన రాక్షసుల సంహరించుటకు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినది.

నిత్యా తేజః స్వరూపాహం ధృత్వా వై విగ్రహాం విభో

స్త్రీరూపం కమనీయం చ విధాయ సముపస్థితా

 మాయయా తన మాయాహం మోహయిత్వాసురాన్పురా

విహిత్య సర్వాన్ శైలేంద్రమగమం తం హిమాలయం

తతోదర సంస్తుతా దేవి స్తారకాక్షిణ పీడితైః

అభవం దక్షజాయాయాం శివస్త్రీ భవజన్మని

త్యక్యా దేహం దక్షయజ్ఞే శివాహం శివనిందయా

ఆభవం లబోయాయాం శైలాధీశస్య కర్మణా

అనేక తపసా ప్రాప్తః శివశ్చాత్తాపీ జన్మవి

 పాణిం జగ్రాహ మే యోగీ ప్రార్థితో బ్రహ్మణా విభుః

శృంగారజం చ తతేజో నాలభం దేవమాయయా

 స్తౌమి త్వామేవ లేనేళ పుత్రదుఃఖేన దుఃఖితా

వ్రతే భవద్విధం పుత్రం లబ్దుమిచ్ఛామి సాంప్రతం

 దేవేన విహితా వేదే సాంగే స్వస్వామీదక్షిణా

 శ్రుత్వా పర్వం కృపాసిందో కృపాం మే కర్తుమర్హసి

ఇత్యుక్త్యా పార్వతి తత్ర వీరరామ చ నారద

తేజోరూపమైన ఆమూర్తి నాదే. నేను అందమైన శరీరమును ధరించి వచ్చితివి. నీయొక్క మాయవలన ఆవిర్భవించిన మాయాస్వరూపియగు నేను నా మాయవలన రాక్షసులనందరను మోహింపజేసి వారలను సంహరించి హిమాలయపర్వతమును చేరీతిని, ఆతరువాత దక్షునిభార్యయందు జన్మించి శివుని భర్తగా పొంది ఆతడు దక్షయజ్ఞములో చేసిన శివనిందను సహించుకోలేక ఆచ్చటనే ప్రాణత్యాగము చేసితివి.

ఆతరువాత హిమవత్పర్వతము చేసిన తపఃఫలితముగా ఆతవికి కూతురనై జన్మించితిని. అట్లే అత్యధికమైన తపస్సు చేసి ఈజన్మలో కూడ శివువి భర్తగా పొందగలిగితివి, కొవి దేవతలయొక్క మాయవలన నా భర్భతేజోరూపమైన పుత్రునీ మాత్రము పొందలేకపోతివి. అందువలన పుత్రదుఃఖము వల్ల బోధలనందుచున్న నేను ఈవ్రతమువలన నీవంటి పుత్రుని పొందగలనని అనుకొని వేదమున పేర్కొనబడినట్లు నాభర్తను దక్షిణగా సమర్పించుకొంటివి.

ఓ దయామయుడా! దీనురాలనగు నా విషయమునంతయు వీవి నాపై దయజూపుమనీ పార్వతి శ్రీకృష్ణునితో ఆనేను.

భారతే పార్వతీస్తోత్రం యః శ్రుణోతి సుసంయుతః

సత్పుత్రం లభతే మనం విష్ణుతుల్యపరాక్రమం

సంవత్సరం హవీష్యాశీ హరీమభ్యర్చ భక్తితః

 సుపుణ్యకవ్రతఫలం లభతే నాత్రసంశయః

విష్ణుస్తోత్రమిదం బ్రహ్మన్ సర్వసంపత్తివర్ధనం

సుఖదం మోక్షదం సారం స్వామిసౌభాగ్యవర్ధనం

 సర్వసౌందర్యబిజం చ యశోరాశి వివర్ధనం

హరీభక్తిప్రదం తత్త్వజ్ఞాన బుద్ధిసుఖప్రదం

పార్వతీదేవి చేసిన ఈస్తోత్రమును నియమనిష్ఠలతో విన్నవాడు విష్ణువుతో సమాను డగు మంచిపుత్రుని పొందును. అట్లే ఈస్తోత్రమును పఠించుచు లేక వినుచు, భక్తితో శ్రీహరినర్చించుచు సంవత్సరపర్యంతము భగవన్నివేదితాన్నమును భక్షించువీకి సుపుణ్యకవ్రతము చేసిన ఫలము లభించును.

ఓనారదా! శ్రీకృష్ణస్తోత్రము సమస్తసంపత్తులను కలిగించును. సుఖమును మోక్షమును కలిగించును. భర్తసౌభాగ్యమును పెంపొందించును, కీర్తిని పెంచుము. శ్రీహరిభక్తిని కలిగించును. తత్త్వజ్ఞాపమును, బుద్ధిని పరమసౌఖ్యమును ఇచ్చునని నారాయణమహర్షి నారదునితో ననెను.

ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయ గణపతిఖండే నారద నారాయణసంవాదే పుణ్యకవ్రతే పతిదానే పార్వతీకృత శ్రీకృష్ణస్తోత్రకథనం నామసప్తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణపతిఖండములో నారద నారాయణసంవాదసమయమున చెప్పబడిన పుణ్యకవ్రతములో తన పతీని దానము చేయు సందర్భమున పార్వతీదేవి చేసిన శ్రీకృష్ణస్తోత్రమనే ఏడవ అధ్యాయము సమాప్తము.