నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లనెను-
సప్రాతరాహ్నికం కృత్వా సమాలోచ్య చ తైస్సహ ।
దూతం ప్రస్థాపయామాస కార్తవీర్యాశమ్రం భీగుః॥
సదూతః శీఘ్రమాగత్య వసంతం రాజసంసది ।
వేష్టితం సచివైస్సార్థమువాచ నృపతీశ్వరం॥
భార్గవరాముడు ప్రాతఃకాలమున నిర్వర్తింపవలసిన కాలకృత్యములను నిర్వర్తించి కార్తవీర్యుని ఆశ్రమమువకు (సౌధమునకు) దూతను పంపెను. ఆ దూత శీఘ్రముగా రాజభవనమునకు వచ్చి సభలో మంత్రులతో కొలువు దీరిన రాజుతో నిట్లనము.
రామదూత ఉవాచ- పరశురాముని దూత ఇట్లనెను-
నర్మదాతీరసాన్నిధ్య న్యగ్రోధాక్షయమూలకే ।
సభుగుర్ర్భోత్సబిస్పార్థం తత్ర త్వం గంతు మర్హసి॥
యుద్ధం కురు మహారాజ జాతిబీర్బ్జాతీభిస్సహ ।
త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యతీ మహిమితి॥
ఇత్యుక్త్వా రామదూతశ్చాష్యగచ్ఛద్రామ సన్నిధిం।
రాజా విధాయ ప్రవాహం సమరం గంతుముద్యతః॥
ఓ కార్తవీర్య మహారాజ! నర్మదా నదీతారమున నున్న అక్షయ వట వృక్షము యొక్క క్రింద తన సోదరులతో నున్న భార్గవరాముని దగ్గరకు నీవు వెళ్ళుము. నీవు నీపరివారముతో, సోదరులతో కలసి యుద్ధము చేయుము, ఆతడు ఈ భూమిపై ఇరువదియొక్క మార్లు తిరిగి రాజులు లేకుండ చేయునని రాజుతో పలికి ఆదూత పరశురాముని సన్నిధికి తిరిగి పోయెను.
కార్తవీర్య మహారాజు కూడ యుద్ధ సన్నాహములు చేయుచు యుద్ధము చేయుటకు నిశ్చయించుకొనెను.
గచ్చంతం సమరం దృష్ట్యా ప్రాణేశం సా మనోరమా ।
తమేవ వారయామాస వాసయామాస సన్నిధౌ ॥
రాజా మనోరమాం దృష్ట్యా ప్రసన్న వదనేక్షణః ।
తామువాచ సభా మధ్యే వాక్యం మానసికం మునే॥
యుద్ధమునకై వెళ్ళుచున్న తన భర్తను చూచి మనోరమ అతనిని తన దగ్గర కూర్చుండబెట్టుకొని అతని యుద్ధ ప్రయత్నములను వారింపసాగెను. కార్తవీర్యుడు తనభార్య మనోరమను చూచి సంతోషములో తన మనస్సులో మన్న భావము నిట్లు వివరింపసాగెను.
కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లు పలికెను-
మామేవాహ్వయతే కాంతే జమదగ్నిసుతో మహాన్ ।
స తిష్ఠన్నర్మదాతీరే రణాయ భాతృభీః సహ ॥
సంప్రాప్య శంకరాచ్ఛస్త్రం మంత్రం చ కవచం హరేః ।
త్రిస్సప్తకృత్వో నిరూపాం కర్తుమిచ్ఛతి మేదినీం॥
ఆందోళయంతి మే ప్రాణా. మనస్సంక్షుభితం ముహుః।
శశత్ శ్పురతి పొమాంగం దృష్టం స్వప్నం శ్రుణు ప్రియే ॥
తైలాభ్యంగీత మాత్మానమపశ్యం గర్దభోపరి ।
ఔరపుష్పస్య మాల్యం చ బిభ్రతం రక్త చందనం ॥
రక్తవస్త్ర పరీధానం లోహాలంకార భూషితం ।
క్రీడంతం చ హాసంతం చ వీర్వాణాంగార రళ్మీనా ॥
భస్మాచ్ఛన్నాం చ పృథివీం జపాపుష్పాన్వితాం సతి ।
రహితం చంద్ర సూర్యాభ్యాం రక్త సంధ్యాన్వితం నభః॥
ముక్తకేశాం చ నృత్యంతీం విధవా చిన్న నాసికాం।
రక్త వస్త్ర పరీధానామపశ్యం చాట్టహాసినీo ॥
సశరామగ్ని రహితాం తాం భస్మసమన్వితాం ।
భస్మవృష్టిమస్వగృష్టి మగ్నివృష్టి మదీశ్వరి ॥
పక్వతాళఫలాకీర్ణాం పృథివీ మస్థీసంయుతాం ।
అవశ్యం కర్పరౌఘం చ ఛిన్నకేశవఖాన్వితం॥
పర్వతం లవణావాంచ రాశీభూతం కపర్దకం ।
చూర్ణానాం చైవ తైలానామదృశం కందరం నిశి ॥
ఆదృశం పుష్పితం వృక్ష మక కరవీరయోః ।
తాళవృక్షం చ ఫలితం తత్ర చైవ పతత్ఫలం ॥
స్వకరాత్పూర్ణ కలశః పపాత చ బభంజ చ ।
ఇత్యపశ్యం చ గగవాత్సంపతచ్చంద్రమండలం ॥
అపశ్యనంబరాత్పూర్యమండలం సంపతద్భువి ।
ఉల్కాపాతం ధూమకేతుం గ్రహణం సూర్య చంద్రయోః ॥
వికృతాకార పురుషం వికటాస్యం దిగంబరం ।
ఆగచ్ఛంతం చాగ్రతస్తమపశ్యం చ భయావకం ॥
ఓ ప్రియురాలా! జమదగ్ని మహర్షి పుత్రుడు. నర్మదానదీ తీరమున తన సోదరులతో నుండి యుద్ధమునకు రమ్మని నన్నే ఆహ్వానించుచున్నాడు. అతడు శంకరుని అనుగ్రహమువలన శస్త్రములను, శ్రీహరి మంత్రమును కవచమును పొంది ఈ భూమిపై నున్న రాజులనందరను ఇరువది యొక్క మార్లు చంపవలెనని అనుకొనుచున్నాడు.
ఇప్పుడు నాప్రాణములన్నియు ఆందోళనము చెందుచున్నట్లు మనస్సు కలవరపడుచున్నట్లు తోచుచున్నది. అట్లే ఎడమభాగము ఆదరుచున్నది. నిన్న రాత్రి ఒక దుస్వప్నము కలిగినది దానిని వినుము.
నేను నూనె శరీరమందంతట పులుముకొని పుష్పముల మాలను ధరించి రక్తవస్త్రమును ఇనుముతో చేసిన ఆలంకారములను ధరించి గాడిదనెక్కి పోవుచున్నట్లు, ఆరిపోవుచున్న నిప్పులతో నవ్వుచు ఆడుకొనుచున్నట్లు, ఈభూమి యందంతట దిరిసెన పువ్వులు, దుమ్ము నిండియున్నట్లు, చంద్రసూర్యులు లేని ఆకోశము ఎఱ్ఱగా నున్నట్లు, విధవ, ముక్కు కోయబడినది ఆగు స్త్రీ ఎర్రని వస్త్రములు ధరించి నృత్యము చేయుచున్నట్లు కల గాంచితిని. ఆదేవిధముగా ఒకచితి నిప్పులులేక బూడిదలో మండి బాణములతో కప్పబడియున్నట్లు, బూడిద వర్షమును, రక్తవర్షమును, ఆగ్నేవర్షమును కూడ కలలో చూచితిని. ఆశోకము, కరవీరము పుష్పములతో నున్నట్లు, తాటిచెట్టు ఫలములలో నుండగా ఆ ఫలములు పడిపోవుచున్నట్లు, నా చేతినుండి పూర్ణకలశము చేజారి క్రిందపడి పగిలిపోయినట్లు, ఆకాశమునుండి చంద్రసూర్యమండలములు భూమిపై పడిపోవుచున్నట్లు, పిడుగులు రాలుట, తోకచుక్క. సూర్యచంద్రుల గ్రహణమును కలలో చూచితిని. ఒక వికృతాకారముగల పరుషుడు భయంకరమైన ముఖముతో దీగంబరుడై నాముందు వచ్చుచున్నట్లు కలగంటిని.
బాలా ద్వాదశ వర్షీయా వస్త్రభూషణ భూషితా ।
సమ్రుష్టా యాతి మధేహాదిత్యపశ్యమహం నిశి ॥
ఆజ్ఞాం త్వం దేహి రాజేంద్ర త్వద్గేహాద్యామి కాననం।
వదసి త్వం మామితి చ నిశ్యవశ్యమహం శుచా ॥
ఋష్ఠో విప్రో మాం శపతే పన్యాసీ చ తథా గురుః ।
భిత్తౌ పుత్రాలికాశ్చిత్రా నృత్యంతీశ్చ దదర్శహా ॥
చంచలానాం చ గృధ్రాణాం కాకానాం నికరైః సదా ।
పీడితం మహిషాణాం చ స్పమపశ్యమహం ని॥
పీడితం శైలయంత్రణ భౌమితం శైలకారిణా ।
దిగంబ రాశహస్తానపశ్య మహమీశ్వరి ॥
నృత్యంతి గాయకాః సర్వే గానం గాయంతిమే గృహే ।
వివాహం పరమానంద మీత్యపశ్యమహం నిశి ॥
రమణం కుర్వతో లోకాన్ కేళాకేశి చ కుర్వతః ।
ఆదృశం సమరం రాత్రౌ కాకానాం చ శునామపి ॥
మోటకాని చ పిండాని శ్మశానం శవసంయుతం ।
రక్తవస్త్రం శుక్ల వస్త్రముశ్యం ని కామీని ॥
కృష్ణవర్ణా కృష్ణాంబరా నగ్నా వై ముక్తకేశినీ ।
విధవాఃఽక్లిష్యతి చ మామపశ్యం నిశి శోభనే॥
నాపిలో ముండ ముండం శ్మశ్రుశ్రేణీం చ మేప్రియే ।
వక్షఃస్థలం చ నఖరమితపశ్యమహం నిశి ॥
పాదుకా చర్మ రజనామపశ్యం రాశి ముల్బణం।
చక్రం భ్రమంతం భూమౌచ కులాల స్యేతి సుందరి ॥
వాత్యయా ఘూర్ణమానం చ శుష్కువృక్షం పముత్తితం ।
మూర్ణమానం కబంధం పై చొపశ్యం నిశి సుప్రతే ॥
గ్రథితాం ముండమాలాం చ చూర్ణమానాం చ వాత్యయా ।
అతీత మౌరదర్శనాం చాప్యపశ్య మహం పరే ॥
భూతప్రేతా ముక్తకేశా వసంతశ్చ హుతాశనం ।
మాం భీషయంతి సతతమీత్యపత్యమహం నిశి॥
దగ్ధజీవం దగ్ధవృక్షం వ్యాధిగ్రస్తం నరం పరం।
అంగహీనం చ వృషల మప్యపశ్యమహం నిః ॥
గేహ పర్వత వృక్షాణాం సహసా పతనం పరం ।
ముహుర్ముహు ర్వజ పాత మప్యపశ్యమహం నిశి ॥
కుక్కురాణాం శృగాలానాం రోదనం చ ముహుర్ముహుః ।
గృహే గృహే చ నియత మప్యవశ్యం సర్వతో నిశి ॥
ఆధశ్శిర స్తూర్ధ్వపాదం ముక్త కేశం దిగంబరం ।
భూమౌ భ్రమంతం గచ్ఛంతం చాప్యపశ్యమహం నరం॥
వికృతాకారశబ్దం చ గ్రామాదౌ దేవరోదసం ।
ప్రాతఃశ్రుత్యైచావబుద్ధః క ఉపాయో వద్ధునా ॥
మంచి వస్త్రములను ఆభరణములను ధరించిన పన్నెండు సంవత్సరముల కన్య కోపముతో నా ఇంటి నుండి పోవుచు ఓ రాజా నీఇంటినుండి అడవికి పోదలచుకున్నాను. నీవందులకు ఆజ్ఞనిమ్మని కోరుతున్నట్లు రాత్రిపూట కలగంటిని. అట్లే కోపముతో బ్రాహ్మణుడు, సన్యాసి, గురువు వీరందరు నన్ను శపించుచున్నట్లు, గోడ పైనున్న బొమ్మలు చిత్రములు నృత్యము చేయుచున్నట్లు, కాకులు, గద్దలు తిరుగుచున్నట్లు, దున్నపోతులు నన్ను కిందపడవేసి హింసించుచున్నట్లు కలబడినది. దిగంబరులు, పాశహస్తులు అగుపురుషులను గానుగ వాడు తన గానుగలో వేసి త్రిప్పుచు నన్ను బాధించుచున్నట్లు, నా ఇంటిలో పెండ్లి జరుగుచుండగా కొందరు పాడుచున్నట్లు, మరికొందరు ఆడుచున్నట్లు కనిపించినది. ఇంకను కొందరు రమించుచున్నట్లు, మరికొందరు వెంట్రుకలు పట్టుకొని కొట్టుకొనుచున్నట్లు, కాకులు, కుక్కలు కొట్లాడుచున్నట్లు కలలో చూచితివి. అదేవిధముగా నాకలలో శవమున్న స్మశానము, ఎర్రని వస్త్రము, తెల్లని వస్త్రము కనిపించినది. నల్లని వస్త్రములను ధరించి వెంట్రుకలను విరియబోసికొన్న ఒక విధవ నగ్నముగా నన్ను కౌగిలించుకొన్నట్లు, మంగలి వాతలను, గడ్డము, రొమ్మును క్షీరముచేసి గోళ్ళు తీయుచున్నట్లు కలగంటిని. మరికొంత సమయమునకు పాదుకలు, చర్మముచే చేయబడిన త్రాళ్ళు కుప్పగా నున్నట్లు, కుమ్మరిచక్రమును తిప్పుచున్నట్లు, ఎండిపోయిన చెట్టు పెద్దగాలికి కొట్టుకొనిపోయినట్లు, ఆది తిరిగి నిలబడినట్లు, తలలేని మొండెము ఇటునటు తిరుగుచున్నట్లు చూచితిని, మరికొంతసేపటికి భయంకరమైన స్త్రీ తలల పుఱ్ఱెలను, మెడలో వేసికొనగా గాలికి అవి పగిలిపోవుచున్నట్లు, భూత ప్రేతములు తలనిరియబోసికొని, నిప్పులు గ్రక్కుచు, నన్ను బయ పెట్టుచున్నట్లు, కాలిపోవుచున్న ప్రాణినీ, కాలిపోవుచున్న చెట్టును, ఆంగహీనుడు. పురుషుని, కలలోచూచితిని. మరికొంత సమయమునకు ఇండ్లు, గుట్టలు, చెట్లు వెంటనే పడిపోవుచున్నట్లు, పిడుగులు మాటిమాటికి పడుచున్నట్లు కుక్కలు, నక్కలు ఏడ్చుచున్నట్లు కలలో చూచితిని. అట్లే తలక్రిందికి పాదముల పైకి పెట్టి తలవిరియబోసికొన్న దిగంబరుడొకడు తీరుగుచున్నట్లు కనిపించినది. గ్రామములముందు దేవతలు ఏడ్చుచున్నట్లు, మరియొక వికృతమైన శబ్దమును విని మేల్కోంటిని. కావున ఇప్పుడేమీ చేయవలెనో చెప్పుమని కార్తవీర్యుడు తన భార్యయగు మనోరమతోననెను.
నృపతేర్వచనం శ్రుత్వా హృదయేన విదూయతా ।
సగద్గధం చ రుదతీ తమువాచ నృపేశ్వరం ॥
రాజు చెప్పిన స్వప్నవృత్తాంతమును విన్నమనోరమ మనస్సు బాధపడుచుండగా ఏడ్చుచునిట్లు తన భర్తతో పలికెను.
మనోరమోవాచ- మనోరను ఇట్లు పలికినది-
హే నాథ రమణ శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వ మహీభృతాం।
ప్రాణాతిరేక ప్రాణేశ శ్రుణు వాక్యం శుభావహం॥
నారాయణాంశో భగవాన్ జామదగ్య్నో మహాబలి।
సృష్టి సంహర్తురీశస్య శిష్యోఽయం జగతః ప్రభోః ॥
త్రిః సప్తకృత్వనిర్భూపాం కరిష్యామి మహీమతి ।
ప్రతిజ్ఞా యస్య రామస్య తేన సార్థం రణం త్యజ ॥
పాపినం రావణం జిత్వా శూరం త్వమివ మన్యసే ।
స త్వయా న జితో సాథ స్వపాసేన పరాజితః ॥
యో న రక్షతి ధర్మం చ తస్య కో రక్షిలా భువి।
స నశ్యతి స్వయం మూడో జీవన్నపి మృతోహి సః ॥
శుభాశుభస్య సతతం సాక్షి ధర్మస్య కర్మణః ।
ఆత్మారామః స్థితః స్వాంతో మూడస్త్యం నహి పశ్యసి ॥
పుత్ర దారాదికం యద్యత్సర్వైశ్వర్యం సుధర్మోణాం ।
జలబుద్బుదవత్సర్వమనిత్యం నశ్వరం నృప ॥
సంసారం స్పష్న సదృశం మత్వా సంతోఽత్రభారతే।
ధ్యాయంతి సతతం ధర్మం తపః కుర్వంతో భక్తితః॥
దత్తేన దత్తం యజ్ఞానం తత్సర్వం విస్మృతం త్వయా ।
ఆస్తి చేద్వప్రహింసాయాం కుబుద్ధే త్వన్మనః కథం॥
సుఖార్ధే మృగయాం గత్వా తత్రోపోష్య ద్విజాశ్రమే।
భుక్త్వా మిష్టమపూర్వం చ హతో విప్రో నిరర్థకం ॥
గురు విప్రసురాణాంచ యః కరోతి పరాభవం ।
ఆభీష్ట దేవస్తం రుష్టా విపత్తీస్తస్య సన్నిధౌ॥
స్మరణం కురు రాజేంద్ర దత్తాత్రేయ పదాంబుజం ।
గురౌ భక్తిశ్చ సర్వేషాం సర్వ విఘ్న వినాశినీ ॥
గురుదేవం సమభ్యర్చ్య తం భృగుం శరణం వ్రజ ।
విప్రే దేవే ప్రసన్నే చ క్షత్రియాణాం నహి క్షతిః ॥
విప్రస్య కింకరో భూపో వైశ్యో భూపస్య భూమిప ।
సర్వేషాం కింకరాః శూద్రాః బ్రాహ్మణస్య విశేషతః ॥
అయళ శరణం శశ్వత్ క్షత్రియస్య చ క్షత్రియే ।
మహద్యశస్తచ్ఛరణం గురుదేవ ద్విజేషు చ ॥
బ్రాహ్మణం భజ రాజేంద్ర గరీయాంసం సురాదపి।
బ్రాహ్మణే వంతుష్టే చ సంతుష్టాః: సర్వదేవతాః ॥
సమస్త రాజులలో ఉత్తముడవైన ఓ ప్రాణేశుడా ! నా మాటను నీవు వినుము.
జమదగ్ని పుత్రుడగు భార్గవరాముడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడు. గొప్పబలవంతుడు కూడా. ఆతడు సృష్టిసంహారము చేయు పరమశివుని యొక్క శిష్యుడు. అతడు ఈ భూమిపై నున్న రాజులనందరను ఇరువదియొక్క మార్లు హతము చేయుదుననీ ప్రతిజ్ఞ చేసెను. అట్టి భార్గవనందనునితో యుద్ధమును వదలి పెట్టుము. నీవు పాపాత్ముడగు రావణాసురునీ జయించి శూరుడవని ఆనుకొనుచున్నావు. కాని ఆ రావణుడు నీ బలము వలన ఓడిపోలేదు. ఆతని పాప కార్యములే ఆతనిని ఓడించినవి. ధర్మమును రక్షింపనివారిని ఎవరు కూడ రక్షింపలేరు. ఆమూఢాత్ముడు స్వయముగానే నశించుచున్నాడు. ఆతడు బ్రతికియున్నను చనిపోయిన వానితో సమానుడగుచున్నాడు. శుభాశుభ కర్మలకన్నిటికి. ఎల్లప్పుడు సాక్షీభూతుడు ధర్మదేవత, ఆతడు ఆత్మయందుండును. ఆ ధర్మదేవతను నీవు గమనింపక ఉన్నావు. చక్కగా ధర్మమును పరిపాలించువారలకు పుత్రులు. భార్య మొదలగు సమస్తైశ్వర్యములు నీటి బుడగల వంటివి. అవి నశించుపోవునని, ఈసంసారమంతయు కలతో సమానమైనదని తలచి ధర్మము నెల్లప్పుడు ధ్యానము చేయుచుందురు. దానికై భక్తితో తపమును ఆచరించెదరు.
దత్తాత్రేయుడు ప్రసాదించిన జ్ఞానమునంతయు నీవు మరచితివి. లేనిచో బ్రాహ్మణుని హింసించుటకు నీమనస్సు అనుమతించునా? నీవు నీ సుఖమునకై వేటాడబోయి అచ్చట తీండి లభింపనందువలన ఉపవాసముండి బ్రాహ్మణుని యొక్క ఆశ్రమమున అపూర్వమైన మృష్టాహారమును భుజించి, వ్యర్థముగా. ఆ బ్రాహ్మణుని చంపితివి. గురువును, బ్రాహ్మణులను, దేవతలను అవమానించిన వానిపై ఇష్టదేవత కూడ కోపించును. అందువలన ఆపద తప్పక కలుగును. కావున నీవు నీగురువు దత్తాత్రేయుని ధ్యానింపుము. గురుభక్తి యనునది సమస్త విఘ్నములను తొలగించును. నీవు నీ గురుదేవుని ఆర్చించి ఆ భార్గవ రాముని శరణు వేడుకొమ్ము, బ్రాహ్మణుడు, ఆభీష్టదైవము ప్రసన్నమైనచో క్షత్రియుల కాపదలు కలుగవు, రాజు బ్రాహ్మణునకు దాసుడు. వైశ్యుడు రాజదాసుడు. శూద్రుడు సర్వదాసుడు. క్షత్రియుడు క్షత్రియుని శరణు వేడినచో అపకీర్తి కలుగును కాని గురువులను, దేవతలను, బ్రాహ్మణులను శరణువేడినచో ఆపకీర్తి కలుగదు. పైగా మంచి కీర్తి లభించును.
ఆందువలన నీవు భార్గవ రాముని శరణు వేడుము. బ్రాహ్మణుడు దేవతల కంటె గొప్పవాడు. బ్రాహ్మణుడు సంతోషపడినచో దేవతలందరు సంతోషపడుదురని మనోరమ పలికెను.
ఇత్యేవ ముక్త్వా రాజేంద్రం క్రోడే కృత్వా మహాపతీ ।
ముహుర్ముహుర్ముఖం దృష్ట్యా విలలాప రురోదచ ॥
క్షణం తిష్ఠ మహారాజ పునరేవమువాచ సా ।
స్నానం కురు మహారాజు భోజయిష్యామి వాంఛితం ॥
చందనాగురుకస్తూరీ కర్పూరైః కుంకుమైర్యుతం।
అనులేపం కరిష్యామి సర్వాంగే తవ సుందర ॥
క్షణం సింహాసనే తిష్ఠ క్షణం వక్షసి మే ప్రభో ।
సభాయాం పుష్పరచితే తల్నే పశ్యామి శోభనం ॥
శత పుత్రాధికః ప్రేమ్ణా పతీనాం వై పతీర్నృప ।
నిరూపితో భగవతా వేదేషు హరిణా స్వయం ॥
మనోరమావచః త్వా తాజా పరమపండితః ।
బోధయామాస తాo రాజ్ఞీం దదౌ ప్రత్యుత్తరం పునః ॥
మనోరమాదేవి ఈవిధముగా కార్తవీర్యునితో పలికి అతనిని తన ఒడిలోనికి దీసికొని ఆతని ముఖము చూచుచు మిక్కిలి శోకించెను. ఓ మహారాజ నీవు క్షణకాలముండుము. స్నానము చేసిరమ్ము. తరువాత నీకోర్కెను తీర్చెదను. చందనము అగరు, కస్తూరి, కర్పూరము, కుంకుమలతో అమలేపనము చేసి నీ శరీరమునంతటను అలుముదుమ. నీవు క్షణకాలము నాఎద పైనుండుము. పుష్పములచే చేసిన శయ్యపై పరుండుము. సతులు తన భర్తను నూరుగురు పుత్రుల కంటే ఎక్కువగా ప్రేమింతురని వేదములలో శ్రీమన్నారాయణుడు తెల్పెను అను మనోరమ పలుకులు విని గొప్పజ్ఞానియగు కార్తవీర్యుడిట్లు సమాధానమిచ్చెను.
కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లు పలికెను-
శ్రుణు కాంతే ప్రవక్ష్యామి శ్రుతం సర్వం త్వయేరితం।
శోకార్తానాం చ వచనం న ప్రశస్యం సభాసు చ ॥
సుఖం దుఃఖం భయం శోకః కలహః ప్రీతిరేవచ ।
కర్మ భోగార్హకాలేన సర్వం భవతి సుందరి ॥
కాలో దదాతి రాజత్వం కాలో మృత్యుం పునర్భవం ।
కాలః స్పజాతి సంసారం కాల; సంహరతే పునః॥
కరోతి పాలనం కాలః కాలరూపీ జనార్దనః ।
కాలస్య కాల: శ్రీకృష్ణో వీధాతుర్విధి రేవ చ ॥
సంహర్తుర్వాపి సంహర్తా పాతుః పాతా చ కర్మకృత్ ।
స కర్మణాం కర్మరూపీ దదాతి తపసాం ఫలం ॥
కః కేవ హన్యతే జంతుః కర్మణా వై వినా సతి ॥
స్రష్టా స్పజతి సృష్టిం చ సంహర్తా సంహారేత్సునః ।
పాతా పాతి చ భూతాని యస్యాజ్ఞo పరిపాలయేత్॥
యస్యాజ్ఞయా వాతి వాత: సంతతం భయ విహ్వల: ।
శశ్వత్సంచరతే మృత్యు: సూర్యస్తపతి సంతతం ॥
ఓకాంతా! నీమాటలనన్నిటిని వింటిని. ఇక నాసమాధానము వినుము. సభలయందు శోకార్దుల మాటలు మన్నింపతగినవి కావు.
సుఖము దుఃఖము, భయము, శోకము, కలహము, ప్రేమ కర్మ ఇవన్నియు ఆనుభవింపదగిన కాలమున జరుగును. కాలము రాజత్వము నిచ్చును. మృత్యువును, పునర్జన్మను కలిగించును. కాలమువలననే సంసారమేర్పడుచున్నది. ఆ సంసార నివృత్తి కూడ జరుగుచున్నది. సంసారపాలనము కూడ కాలము వలననే జరుగుచున్నది. ఇట్టి కాలరూపి జనార్దనుడు. శ్రీకృష్ణుడు కాలమునకు కాల స్వరూపుడు. ఆతడు సృష్టికర్తకు సృష్టికర్త, సంహర్తకు సంహారకారకుడు. సృష్టిపాలకునకు పాలకుడు కూడ, కర్మలకు కర్మరూపియగు ఆతడు తపః ఫలములనిచ్చును. కర్మ ప్రభావము లేక ఎవరు ఎవరినీ సంహరింపజాలరు.
ఆ కృష్ణుని వలననే బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతయు చేయుచుండగా సంహారకారకుడగు పరమశివుడు సృష్టిసంహారమును చేయుచున్నాడు. సృష్టిపాలకుడగు శ్రీమహావిష్ణువు ఈ సృష్టినంతయు పరిపాలించుచున్నాడు. ఆతని ఆజ్ఞననుసరించియే గాలివీచుచున్నది. మృత్యువు ఆతని భయముచే ఎల్లప్పుడు తిరుచున్నది. ఆదేవిధముగ సూర్యుడు ఎండనిచ్చుచున్నాడు అని పలికెను.
వర్షతీంద్రో దహత్యగ్నిః కాలోభ్రమతి భీతవత్ ।
తిష్ఠంతి స్థావరాః సర్వే చరంతి సతతం చరాః ॥
వృక్షాశ్చ పుష్పితాః కాలే ఫలితాః పల్లవాన్వితాః ।
శుష్యంతి కాలతః కాలే వర్ధంతే చ తదాజ్ఞయా ॥
ఆవిర్భూతా తిరోభూతా సృష్టిరేవ తదాజ్ఞయా ।
తస్యాజ్ఞయా భవేత్సర్వం న కించిత్ స్వేచ్ఛయా నృణాం ॥
నారాయణాంశో భగవాన్ జామదగ్స్ మహాబలః ।
త్రిః సప్తకృత్వో నిర్భూపాం కరిష్యతి మహిమితి ॥
ప్రతిజ్ఞా విఫలా తస్య న భవేత్తు కదాచన ।
నిశ్చితం తస్య వధ్యోఽహమితీ జానామి సువ్రతే ॥
జ్ఞాత్వా సర్వం భవిష్యం చ శరణం యామి తత్కథం।
ప్రతిష్ఠితానాం చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ॥
ఆ పరమాత్మయొక్క ఆజ్ఞననుసరించి ఇంద్రుడు వర్షించుచున్నాడు, అగ్ని దహించుచున్నాడు. కాలుడు భీతిచెందినట్లు తిరుగుచున్నాడు. వృక్షములు పుష్పించుచున్నవి. ఆయా కొలముననుసరించి ఫలించుచున్నవి, ఎండిపోవుచున్నవి. మరల మొలుచుచున్నవి. ఆతని ఆజ్ఞవలననే ఈ సృష్టి జరుగుచున్నది. నశించుచున్నది, సర్వకార్యములు అతని ఆజ్ఞవలననే జరుగుచున్నవి. ఏదీ కూడ స్వేచ్ఛగా జరుగుచులేదు,
ఈ జమదగ్ని సుతుడగు భృగురాముడు మహాబలపరాక్రమవంతుడు. శ్రీమన్నారాయణుని ఆంశవలన ఉద్భవించినవాడు. అతడు ఈ భూమిపై ఇరువదియొక్క మార్లు రాజాలు లేకుండ చేయును. అతని ప్రతిజ్ఞ ఎప్పుడును విఫలము కాదు. నేను ఆతని వలన చంపబడుదునన్న విషయము నాకు తెలియును. ముందు జరుగవలసిన విషయమంతయు తెలిసి అతనినేట్లు శరణు వేడెదను? కీర్తిగల వారికి చెడ్డపేరు చావుకంటే గొప్పది అని పలికెను.
ఇత్యేవ ముక్త్వా రాజేంద్ర: సమరం గంతు ముద్యతః ।
వాద్యం చ వాదయామాస కారయామాస మంగళం॥
శతకోటిర్నృపాణాం చ రాజేంద్రానాం త్రిలక్షకం ।
అక్షౌహిణీనాo శతకం మహాబలపరాక్రమం ॥
ఆశ్వానాం చ గజానాం చ పదాతీనాం తథైవ చ ।
అసంఖ్యాకం రథానాం చ గృహీత్వా గంతు ముద్యతః ॥
కార్తవీర్యార్జునుడీ విధముగా తన భార్యతో వలికి యుద్ధమునకు పోవుటకు విశ్చయించి, యుద్ధవాద్యములను మ్రోగించుచు మంగళవచనమును చేయించెను. అతనితో నూరుకోట్ల రాజులు, మూడులక్షల రాజేంద్రులు మహాబలపరాక్రమ. పంపన్నమగు నూరు అక్షౌహిణుల సైన్యము, అసంఖ్యాకమైన ఆశ్వములు, గజములు, రథములు, పదాతివర్గముమ వెంట పెట్టుకొని యుద్ధమునకు బయలు దేరుచుండెను.
బభూవ స్తిమితా సాద్వీ దృష్ట్యా తం గమనోన్ముఖం ।
ధృతవంతం చ సన్నాహమక్షయం సశరం ధనుః ॥
క్రీడాగారే క్షణం తస్థౌ కృత్వా కాంతం స్వవక్షసి ।
పశ్యంతీ తన్ముఖాంభోజం చుచుంబ చ ముహుర్ముహుః॥
కార్తవీర్యార్జునుని భార్య అతని మాటలు విన్న తరువాత స్తిమితపడినదై యుద్ధసన్నోహములు చేయుచు ధనుర్బాణములను ధరించి యుద్దమునకు పోవుచున్న తన భర్తను క్రీడాగారమునకు తీసికొని పోయి ఆతని తన వక్షస్థలముపై నుంచుకొని ఆతని ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దు పెట్టుకొనేను అని నారాయణుడు నారదునితో పలికెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే కార్తవీర్యార్జున సన్నాహానామ చతుస్త్రింశత్తమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున పేర్కొనబడిన కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహమను ముప్పది వాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 34 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Unable to reach an agreement, a fierce battle broke out at the gates of Kailāsa between Parashurāma and Lord Gaṇeśa. Parashurāma discharged fiery celestial arrows and heavy maces at the deity, but Lord Gaṇeśa easily caught the weapons in his trunk and neutralized them with divine laughter. Displaying his immense cosmic power, Lord Gaṇeśa extended his trunk, wrapped it around Parashurāma, and whirled the great warrior across all seven planetary spheres before gently setting him down back at the gate. Humiliated and enraged by this display of effortless power, Parashurāma picked up his ultimate weapon, the battle-axe Parashu given to him by Lord Śiva.