నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలికెను-
మత్స్యరాజే నిపతితే రాజా యుద్ధ విశారదః ।
రాజేంద్రాన్ ప్రెషయామాస యుద్ధే శస్త్ర విశారదాన్ ॥
బృహద్బలం సోమదత్తం విదర్భం మిథిలేశ్వరం ।
నిషధాధిపతీం చైవ మగధాధీపతీం తథా ॥
ఆయయుః సమరే యోద్దుం జామదగ్న్యం మహారథాః ।
శ్రీతయాక్షౌహిణీభిశ్చ సేనాభిః సహ నారద ॥
రామస్య భ్రాతరః సర్వే వీరాస్తీక్షాస్త్రపాణయః ।
వారయామాసుర స్రైశ్చ తానేవ రణమూర్థని ॥
తే వీరాః శరజాలేన దివ్యాస్త్రేణ ప్రయత్నతః ।
మారయామాసురేకైకం భ్రాతృవర్గాన్ భృగోస్తథా ॥
అయయౌ సమరే శీఘ్రం దృష్ట్యా తాంశ్చ పరాజితాన్ ।
పినాకహస్త: సభుగు: జ్వలదగ్నిశిఖోపమః ॥
రణరంగమున మత్స్యదేశాధీశ్వరుడు చనిపోయిన పిమ్మట యుద్దమునందు ఆరితేరిన కార్తవీర్యుడు శస్త్రాస్త్ర విశారదులైన రాజశ్రేష్టులను రణరంగమునకు పంపెను. వారిలో మిక్కిలి బలము కల సోమదత్తుడు, విదర్భ దేశాధీశుడు, మిధిలా నగరాధిపతి, నీషధాధిపతి, మగధరాజు మొదలగు వారు కలరు. మహారథులైన ఆ రాజన్యులు తమ తమ సేనలతో పరశురామనెదుర్కొనుటకు వచ్చిరి, వాడియగు శస్త్రాస్త్రసంపద కలిగిన పరశురాముని సోదరులు ఆ రాజులనందరను యుద్ధమున అడ్డగించిరి. అప్పుడా రాజులు తమ తమ బాణ పరంపరచే అస్త్రములచే భార్గవరాముని సోదరులను వేరువేరుగా ఎదరుర్కొనిరి.
చిక్షేప నాగపాశం చ జామదగ్న్యో మహాబలః ।
చిచ్ఛేద తం గారుడే సోమదత్తో మహాబలః ॥
భృగు: శంకర శూలేన సోమదత్తం జఘాన హా: ।
బృహద్బలం చ గదయా విదర్భం ముష్టిభిస్తథా ॥
మైథిలం ముధ్గరేణైవ శక్త్యావై నైషధం తథా ।
మగధం చరణోద్ఘాతైరస్త్రజాలేన సైనికాన్ ॥
నీహాత్య నిఖిలాన్భూపాన్ సంహారాగ్ని సమో రణే ।
దుద్రావ కార్తవీర్యం చ జామదగ్న్యో మహాబలః ॥
మహా బల పరాక్రమవంతుడగు భార్గవ రాముడు ప్రయోగించిన నాగపాశమును సోమదత్తుడు గారుడాస్త్రముచేత ఖండించెను, ఆప్పుడు పరశురాముడు శంకరుని త్రిశూలమును ప్రయోగించి ఆ మహారాజును సంహరించెను. అట్లే బృహద్బలుని గదచే, ముష్టిఘాతములచే విదర్భ దేశాధిపతిని, ముద్గరముచే మిథిలాధిపతిని, శక్త్యాయుధముచే నిషధాధిపతిని, పాదఘాతములచే మగధరాజును, ఇంకను తన అస్త్రములచే ఆయా రాజుల సైన్యమునంతయు సంహరించెను.
ఈవిధముగా రాజులనందరను సంహరించి మహా బల పరాక్రమవంతుడగు భార్గవ రాముడు కార్తవీర్యార్జుని పైకి పరుగెత్తెను.
దృష్ట్యా తం యోధుమాయాంతం రాజానశ్చ మహారథాః ।
ఆయయు: సమరం కర్తుం కార్తవీర్యం నివార్యచ ॥
కాన్యకుబ్జశ్చ శతశః సౌరాష్ట్రాః శతశస్తథా ।
రాష్ట్రీయాః శతశశ్చైవ వీరేంద్రాః శతశస్తథా ॥
సౌమ్యా వాంగాశ్చ శతశో మహారాష్ట్రాస్తథా దశ ।
తథా గుర్జరజతీయాః కలింగాః శతశస్థథా ॥
కృత్వా తు శరజాలం చ భృగుశ్చిచ్ఛేద తక్షణం ।
తం ఛిత్వాఽభ్యుర్థితో రామో నీహార మివ భాస్కరః ॥
త్రిరాత్రం యయుధే రామస్తైః సార్థం సమరాజిరే ।
ద్వాదశాక్షౌహిణీం సేనాం తథా చిచ్ఛేద పర్శువా ॥
రంభస్తంభసమూహం చ యథా ఖడ్గేన లీలయా ।
చీత్వా సేనాo భూపవర్గం జఘాన శివశూలతః ॥
కార్తవీర్యార్జునునితో యుద్ధము చేయుటకై వచ్చుచున్న భార్గవ రాముని చూచి కార్తవీర్యుని యుద్ధము చేయకుండ నివారించి మహారథులైన రాజులు భార్గవ రామునితో యుద్ధము సేయుటకు ముందునకు వచ్చిరి.
వారిలో కన్యాకుబ్జ దేశమునకు చెందిన వారు నూరుగురు, నూరుగురు సౌరాష్ట్రదేశమునకు చెందినవారు, నూరుమంది రాష్ట్రీయులు, నూరుగురు వీరేంద్రులు, నూరుగురు సోమదేశపువారు, నూరుగురు వంగదేశీయులు, పదిమంది మహారాష్ట్రులు, అట్లే గుర్జరదేశము కళింగదేశమునకు సంబంధించిన వారు వందలమంది ఉన్నారు.
ఆ రాజన్యులు వేసిన శరవర్షమును భార్గవరాముడు క్షణకాలమున ఛిన్నాభిన్నము చేసెను. ఆ రాజుల బాణపరంపరను తుత్తునియలు చేసిన భార్గవ రాముడు మంచును చీల్చుకొని వచ్చుచున్న సూర్యుని వలె ప్రకాశించెను.
పరశురాముడు ఆ రాజులతో వారి సైన్యముతో ఒంటరిగా మూడు దినములు పోరాడి, ఆరోజులయొక్క పన్నెండు అక్షౌహిణుల సైన్యమును తన గండ్రగొడ్డలిచే, ఖడ్గముచే అరటి చెట్లను ఖండించినట్లు తేలికగా చంపెను. వారి సైన్యమునంతయు సంహరించిన పిదప శంకరుని యొక్క శూలముచే రాజులనందరను అవలీలగా సంహరించెను.
సర్వాంస్తాన్నిహతాన్ దృష్ట్యా సూర్యవంశసముద్భవః ।
ఆజగామ సుచంద్రశ్చ లక్ష రాజేంద్ర సంయుతః ॥
ద్వాదశాక్షౌహిణీభిశ్చ సేనాభిః సహ సంయుగే ।
కోపేన యుయుధే రామం సింహం సింహో యథా రణే ॥
భృగు: శంకర శూలేన నృపలక్షం నీహత్య చ ।
ద్వాదశాక్షౌహిణీం సేనామహన్యై పర్శునా బలీ ॥
నిహత్య సర్వసేనాశ్చ సుచంద్రం యుయుధో బలీ ।
నాగాస్త్రం ప్రేరయామాస నిర్హృతం తం భృగుః స్వయం ॥
కాన్య కుబ్జ మహారాజులు మొదలగు రాజులందరు యుద్ధమున చనిపోవుటను గమనించిన సూర్య వంశోద్భవుడగు సుచంద్రుడను రాజు లక్షమంది రాజేంద్రులతో, పన్నెండు అక్షౌహిణుల సైన్యముతో కలసి సింహము సింహముతో పోరాడినట్లు యుద్ధము చేసెను.
భార్గవరాముడు శంకరుని యొక్క శూలముచే రాజుల నందరను సంహరించి తన గండ్రగొడ్డలిచే పన్నెండు అక్షౌహిణుల సైన్యమును చంపెను.
ఈవిధముగా సుచంద్రుని సైన్యమును, ఆతని తోడి రాజన్యులను పరశురాముడు సంహరించి సుచంద్రునితో యుద్ధము సేయదలచి ఆ మహారాజు పై నాగాస్త్రమును వేసెను.
నాగపాశంచ చచ్చేద గారుడేన నృపేశ్వరః ।
జహాస చ భృగుం రాజా సమరే చ పునః పునః ॥
భృగుర్నారాయణాస్త్రం చ చిక్షేప రణమూర్ధని ।
అస్త్రం యయౌ తన్నిహంతుం శతసూర్యసమప్రభం ॥
దృష్టాస్త్రం నృపశార్దూలశ్ఛావరుహ్య రథాత్ క్షణాత్ ।
న్యస్తశస్త్ర: ప్రాణమచ్చ స్తుత్వా నారాయణం శివం ॥
తమేవం ప్రణతం త్యక్త్యా యయౌ నారాయణాంతికం ।
అస్త్రరాజో భగవతో రామః సంప్రావ విస్మయం ॥
భృగుః శక్తిం చ ముసలం తోమరం పట్టిశం తథా ।
గదాం పర్నుం చ కోపేన చిక్షిపే తజ్జిఘంసయా ॥
జగ్రాహ కాళీ తాన్సర్వాన్సుచంద్ర స్యందనస్థితా ।
చిక్షేప శివశూలం స నృపమాల్యం బభూవ తత్ ॥
దదర్శ పురతో రామో భద్రకాళీం జగత్ర్పసూo ।
వహంతీం ముండమాలాం చ వికటాస్యాం భయంకరీం ॥
విహాయ శస్త్రమస్త్రంచ పినాకం చ భృగుస్తథా ।
తుష్టావ తాం మహామాయాం భక్తినమ్రాత్మకంధరః ॥
మహారాజగు సుచంద్రుడు గారుడాస్త్రముచే నాగాస్త్రమును పడగొట్టి భార్గవరాముని చూచి నవ్వెను. అప్పుడు భార్గవరాముడు నారాయణాస్త్రమును ప్రయోగించ గోరి శత సూర్యులతో సమానమైన కాంతిగల యా నారాయణాస్త్రము సుచంద్రుని చంపుటకు పోయెను. అప్పుడా మహారాజు వెంటనే తన రథమునుండి క్రిందకు దిగి తన అస్త్రశస్త్రములనన్నిటిని వదలి నారాయణాస్త్రమునకు నమస్కరించెను.
ఈవిధముగా తనకు నమస్కరించుచున్న మహారాజును వదలి పెట్టి నారాయణాస్త్రము నారాయణుని చేరుకొనగా భార్గవరాముడు చాలా ఆశ్చర్యపడెను. వెంటనే భార్గవ రాముడు సుచంద్రుని చంపుటకై శక్తిని, ముసలమును, తోమరమును, పట్టిశమును, గదను, గొడ్డలిని ప్రయోగించగా ఆ మహారాజుయొక్క రథములో ఉన్న కాళికాదేవి భార్గవరాముడు ప్రయోగించిన శస్త్రములనన్నిటిని గ్రహించి పారవేసెను. అప్పుడు పరశురాముడు శివ శూలమును విసిరివేయగా నది యా మహా రాజు మెడలో మాలయైనది. ఆప్పుడు కూడ భార్గవరాముడు ఆశ్చర్యపడి చూడగా నా మహారాజు యొక్క రథముపై జగన్మాతయు, పుఱ్ఱెల పేరును మెడలో ధరించినదియు, మహాభయంకరమైన నోరుగలదియగు భద్రకాళి కనిపించినది. అప్పుడా భార్గవరాముడు తన శస్త్రాస్త్రములను, ధనుస్సును వదిలి పెట్టి ఆ మహామాయను భక్తితో తలవంచుకొని నమస్కరించెను.
పరశురామ ఉవాచ- పరశురాముడు భద్రకాళితో నిట్లనెను-
నమః శంకరకాంతాయై సారాయై తే నమో నమః ।
నమో దుర్గతి నాశిన్యై మాయాయై తే నమో నమః ॥
నమో నమో జగద్ధాత్ర్యై జగత్కర్యై నమో నమః ।
నమోస్తు తే జగన్మాత్రే కారణాయై నమో నమః ॥
ప్రసీద జగతాం మాతః సృష్టి సంహారకారిణి ।
త్వత్పాదౌ శరణం యామీ ప్రతిజాం సార్థికాం కురు ॥
త్వయి మే విముఖాయాంచ కో మాం రక్షితుమీశ్వరః ।
త్వం ప్రసన్నా భవ శుభే మాం భక్తం భక్తవత్సలే ॥
యుష్మాభి: శివలోకే చ మహ్యాం దతో వరః పురా ।
తం వరం సఫలం కర్రుత్వమర్హసి వరాననే॥
శంకరుని భార్యవు, సారరూపిణి యగు నీకు నమస్కారము. అట్లే దుఃఖములను దూరము చేయు మాయా స్వరూపిణి యగు నీకు నమస్సులు. జగములన్నిటికి ఆధారభూతవు. జగములకన్నిటికి సృష్టికర్తవు, జగన్మాతవు, కారణరూపిణివి అగు నీకు నమస్కారము. లోకములనన్నిటిని, సృష్టించుచు సంహరింపుచున్న ఓ జగన్మాతా! నీవు శాంతింపుము. నేను నీ పాదములను శరణు వేడుచున్నాను. నీవు నా ప్రతిజ్ఞను సఫలము చేయుము.
జగన్మాతవగు నీవే కోపించినచో నమ్న రక్షించువారెవ్వరు? భక్తవత్సలవగు నీవు భక్తుడనగు నాపై ప్రసన్నురాలవుకమ్ము, శివలోకమున మీరు నాకిచ్చిన వరమును సఫలము చేయుమని భార్గవ రాముడు భద్రకాళిని ప్రార్థించెను.
రేణుకేయస్తవం శ్రుత్వా ప్రసన్నాఽభవదంబికా ।
మా భైరిత్యేవ ముక్త్యా తు తత్రైవాంతరధీయత ॥
ఏతత్ భృగుకృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ ।
మహాభయాత్పముతీర్ణః స భవేదేవ లీలయా ॥
స పూజితశ్చ త్రైలోక్య తత్రైవ విజయీ భవేత్ ।
జ్ఞాని శ్రేష్ఠో భవేచ్చైవ వైరి పక్షవిమర్ధకః ।
ఏతస్మిన్నంతరే బ్రహ్మా భృగుం ధర్మభృతాం వరం ।
ఆగత్య కథయామాస రహస్యం రామమేవ చ ।
భార్గవరాముడు చేసిన స్తుతిని విని భద్రకాళి చాలా సంతోషించి నీవు భయపడకుమని చెప్పి అక్కడనే అంతర్ధానమయ్యెను.
భార్గవరాముడు చేసిన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు అవలీలగా మహాభయములనన్నిటిని తప్పించుకొనును. అతడు త్రైలోక్య పూజితుడగను. విజయములనన్నిటిని పొందును. అతడు మిక్కిలి జ్ఞానము కలవాడై శత్రువులనందరను నాశనము చేయగలుగును.
ఆ సమయమున ధర్మిష్ఠులలో శ్రేష్టుడగు బ్రహ్మదేవుడు అచ్చటకు వచ్చి భార్గవరామునకు ఒక రహస్యమునిట్లు చెప్పిను,
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
శ్రుణురామ మహాభాగ రహస్యం పూర్వమేవ చ।
సుచంద్రబియ హేతుం చ ప్రతిజ్జా ఫలమేవ చ ॥
దశాక్షరీ మహావిద్యా దత్తా దుర్వాససా పురా ।
సుచంద్రాయైన కవచం భద్రకాళ్యాః సుదుర్లభం ॥
కవచం భద్రకాళ్యానీ దేవానాం చ సుదుర్లభం ।
కవచం తద్గళే యస్య సర్వ శత్రు విమర్ధకం ॥
ఆతీవ పూజ్యం శస్త్రం చ త్రైలోక్యజయకారణం ।
తస్మిన్ స్థితే చ కవచే కస్త్యం జేతుమలం భువి ॥
భృగో గచ్ఛతు భిక్షార్థం కరోతు ప్రార్థనాం వృపం।
సూర్య వంశోద్భవో రాజా దాతా పరమ ధార్మికః ॥
ప్రాణాంశ్చ కవచం మంత్రం సర్వం దాస్యం నిశ్చితం ॥
భృగు: సన్యాసి వేషేణ గత్వా రాజాంతీకం మునే ।
భిక్షాం చకార మంత్రం చ కవచం పరమాద్భుతం ॥
రాజా దదౌ చ తన్మంత్రం కవచం పరమాదరాత్ ।
తతః శంకరూలేవ తం జనన వృపం భుః ॥
ఓ భార్గవ రామా! నీవు సుచంద్రుని జయింపగ లుగునది, నీ ప్రతిజ్ఞ ఫలించు రహస్యమొకటి విమము.
దుర్వాసమహర్షి సుచంద్రునకు దశాక్షరీ మహామంత్రముమ, భద్రకాళీ కవచమును ఉపదేశించెను. భద్రకాళీ కవచము దేవతలకు కూడ లభ్యము కానిది. ఆ కవచము ఏవరియొక్క కంఠమునుండునో అతనికి విజయము తప్పక లభించును. ఆ కవచము నీ దగ్గర యుండినచో నిన్ను ఎవరును జయింపజాలరు.
ఓ భార్గవరాముడా! నీవు సుచంద్రుని దగ్గరకు వెళ్ళి ఈ కవచమును యాచింపుము. సూర్య వంశ మందు పుట్టిన ఆ రాజు పరమధార్మికుడు, దానము చేయు స్వభావము కలవాడు. ఆతని యాచించినచో కవచమును, మంత్రమునే కాక ప్రాణములను సహితము దానము చేయును అని చెప్పగా భార్గవరాముడు సన్న్యాసి వేషమున ఆ మహారాజునొద్దకు వెళ్ళి భద్రకాళియొక్క కవచమును, మంత్రమును దానము సేయుమని కోరెను.
అప్పుడు సుచంద్రుడు కూడ సంకోచ పడక మిక్కిలి యాదరముతో అతనికి భద్రకాళి యొక్క కవచమును, మంత్రమును దానము చేసెమ.
అప్పుడు పరశురాముడు శంకరుని హలమును ప్రయోగించి ఆ మహారాజును చంపెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణీ తృతియే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే భృగు కార్తవీర్య యుద్ధవర్ణనం నామ షడ్రింశత్తమోఽధ్యాయః॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమును తెలుపబడిన కార్తవీర్య పరశురాముల యుద్ధవర్ణనమను ముప్పయ్యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Hearing the thunderous crash and the fall of the tusk, Goddess Pārvatī rushed out of her inner chambers to find her beloved son Gaṇeśa standing bleeding with a broken tusk. Beholding her child injured once again, the Divine Mother fell into agonizing grief and intense cosmic anger, her eyes flashing like blazing cosmic fire. Assuming Her fierce form as Durgā, She threatened to consume the entire cosmos and destroy Parashurāma along with all the Devas who stood silently by. Trembling with fear, Parashurāma, Lord Śiva, and the Devas offered humble prayers of surrender, seeking to pacify the Mother of the Universe.