శంకర ఉవాచ - శంకరుడిట్లు పరశురామునితో పలికెను –
కస్త్వం బటో కస్య పుత్రః క్వ వాసః స్తవనం కథం ।
కిం వా తేఽహం కరిష్యామి వాంఛితం వద సాంప్రతం ॥
ఓ బ్రహ్మచారీ నీవెవరు? నీ తండ్రి పేరేమి? నీవెక్కడ ఉంటున్నావు. ఎందుకు నన్ను స్తుతింపుచున్నావు. నీకు నేను చేయగలిగినదేమి? నీ కోరిక ఏమున్నదో నాకు తెలుపుము అని పలికెను.
పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను –
శోకాకులం త్వాం పశ్యామి ఏమనస్కం సువిస్మీతం ।
వయసాఽతి శిశుం శాంతం గుణేన గుణినాం వరం ॥
ఓ బ్రహ్మచారీ! నీవు శోకముతోనున్నట్లు కలతచెందిన మనస్సుతో నున్నట్లు కనిపించుచున్నావు. నీవు వయస్సులో చాల చిన్నవాడవు. కాని శాంతుడవు. నీవు గుణములచే గుణవంతులలో కెల్లను గొప్పవాడవనిపించుచ్నుది.
భృగురువాచ- భార్గవ రాముడిట్లు పలికెను –
జమదగ్ని సుతోఽహం చ భృగువంశసముద్భవః ।
రేణుకాంబా మే పరశురామోఽహం నామతః ప్రభో ॥
క్రీణిహి మాం దయా సింధో విద్యాపణ్యేన కింకరం ।
త్వామీశ శరణాపన్నం రక్ష మాం దీనవత్సల ॥
మృగయామాగతం భూపం పితా మే చోపవాసీనం ।
చకారాతిథ్యమానీయ కపిలా దత్త వస్తునా ॥
రాజా తం కపిలాలోభాత్ఘౌతయామాస మందధీః ।
కపిలా తం మృతం దృష్ట్యా గోలోకం చ జగామ సా ॥
మాతానుగమనం చక్రేహ్యనాథోహం చ సాంప్రతం ।
త్వం మేపితా శివా మాతా రక్షమాం పుత్రవత్ర్పభో ॥
మయాకృతాప్రతిజ్ఞా చ శోకేనైవాశీదుష్కరా ।
త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యామి మహిమితి ॥
కార్తవీర్యం హనిష్యామి సమరే తాతఘాతకం ।
ఇత్యేతత్పరిపూర్ణం మే భగవాన్ కర్తుమర్హతి ॥
ఓ ప్రభూ! నేను జమదగ్ని మహర్షి పుత్రుడను. నాతల్లి పేరు రేణుక. నేను భృగు వంశమున జన్మించితిని. నా పేరు పరశురాముడు. ఓదయానిధీ! నన్ను విద్యయను మూల్యముచే కొని దాసునిగా చేసికొమ్ము. దీనవత్సలడవగు నీవు శరణుగోరిన నన్ను రక్షింపుము.
నాతండ్రియగు జమదగ్నిముని వేటకై వచ్చి తిండిలేక పడియున్న కార్తవీర్యార్జునునకు కామధేనువిచ్చిన వస్తువులచే ఆతిథ్యమునిచ్చెను. అపుడా రాజూ కామధేనువు కొరకు మాతండ్రిని చంపెను. నాతల్లియగు రేణుక సహితము నాతండ్రితో అనుగమనము చేసినందువలన నేనిప్పుడు అనాథుడనైతిని. ఇప్పుడు నాకు తండ్రివి నీవే. ఈ పార్వతీ దేవియే నాతల్లి. అందువలన మీరు మీపుత్రుని కాపాడునట్లు నన్ను కాపాడుడు. నేను తండ్రి చంపబడెనను శోకము వలన ఈ భూ మినంతయు ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులను వారు లేకుండునట్లు చేయుదునని ప్రతిజ్ఞ చేసితిని. అట్లే నా తండ్రిని సంహరించిన కార్తవీర్యుని యుద్ధమున చంపెదనని అంటిని.
ఓ భగవంతుడా! ఈ నా ప్రతిజ్ఞ తీరునట్లు మీరు చేయుడని పలికేను.
బ్రాహ్మణస్య వచః శ్రుత్వా దృష్ట్యా దుర్గాముఖం హరః ।
బభూవాసమ్ర వక్త్రశ్చ సా చ శుష్యౌష్ఠ తాలుకా ॥
బ్రాహ్మణుడగు భార్గవ రాముని మాటలు విన్న పరమశివుడు పార్వతీదేవి ముఖమును తలవంచుకొని చూడగా, ఆదేవి ఎండిన గొంతు కలదయ్యెను.
పార్వత్యువాచ- పార్వతి దేవి ఇట్లు పలికెను –
తపస్విన్ వీవ్ర పుత్రస్త్యం నిర్భూపాం కర్తుమీచ్ఛపి ।
త్రిః సప్తకృత్వః కోపేన సాహసస్తే మహాన్వటో ॥
హంతుమిచ్ఛసి నిఃశస్త్రః సహస్రార్జునమీశ్వరం ।
భ్రూభంగలీలయా యస్య రావణస్తు పరాజితః ॥
తస్మై ప్రదత్తం దత్తైన శ్రీహరేః కవచం వటో ।
శక్తిరవ్యర్థరూపా చ యయా లే హింసితః పితా ॥
హరేర్మంత్రం సంస్తవనం యః పఠేచ్చ దివానిశం ।
కోవా శక్నోతి తం హంతుం న పశ్యామీహ భూతలే ॥
ఓ తపస్వీ! నీవు బ్రాహ్మణపుత్రుడవు. శమ దమ గుణములు ఉండవలసిన వాడవు. కాని నీవు నీతండ్రిని చంపెనను కోపముతో ఈభూమిపై నున్న క్షత్రియులనందనరను ఇరువది యొక్క మార్లు తిరిగి చంపదలచితివి. ఇది. గొప్ప సాహసకార్యము. అట్లే రాజగు కార్తవీర్యార్జునుని ఆయుధము లేక చంపవలెనని అనుకొనుచున్నావు. ఆ కార్తవీర్యుడు కనుబొమను ముడిచినంతమాత్రమున లోక కంటకుడగు రావణుడు జయింపబడిను. అతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును వ్యర్థము కాని శక్తియను ఆయుధమునిచ్చెను. అమోఘమైన ఆ శక్త్యాయుధము వలననే నీతండ్రి చనిపోయెను.
శ్రీహరి మంత్రమును, స్తోత్రమును రాత్రింబగళ్ళు పఠించువావిని ఈ ప్రపంచమున ఎవ్వరుచంపలేరు కావున నీకోరికను వదలు కొమ్మని పలికెను.
అయే విప్రగృహం గచ్చ కిం కరిష్యతి శంకరః ।
అన్యే భూపాశ్చ మద్భృత్యాః కా భీస్తేషాం మయి స్థితే ॥
ఓ బ్రాహ్మణకుమారా! నీఇంటికి తిరిగిపొమ్ము. ఈవిషయమున శంకరుడేమి చేయజాలడు. భూలోకమున నున్న ఇతర భూపతులందరు నా సేవకులు. నేనుండగా వారికి భయము కూడ కలుగదని పలికెమ.
కాళ్యువాచ- కాళికాదేవి ఇట్లు పలికెను –
అయ్ విప్ర వటో జల్మ నిర్భూపాoకర్తు మిచ్చసి ।
యథా హి వామవశ్చంద్రం కరేణాహర్తుమిచ్ఛతి ॥
కృతయజ్ఞాన్ మహాపుణ్యాన్ మహాబల పరాక్రమాన్ ।
దిగంబర సహాయేన మద్భృర్యాన్ హoతుమిచ్ఛసి ॥
స తయోర్వచనం శ్రుత్వా రురోదోశ్చైశ్చ శోకతః ।
సహసా పురతస్తేషాం ప్రాణాంస్త్యక్తుం సముద్యతః ॥
విప్రస్య రోదనం శ్రుత్వా శంకరః కరుణానిధిః ।
పశ్యన్ దుర్గాంచ కాళీం చ జ్ఞాత్వాఽశయమధో విభుః ॥
తయోరనుమతిం ప్రాప్య సర్వేశో భక్తవత్సలః ।
జమదగ్ని సుతం సద్యః ప్రవక్తుముపచక్రమే ॥
దుష్టుడవగు బ్రాహ్మణవటూ! పొట్టివాడు చంద్రుని చేతులతో పట్టుకొనుటకు ప్రయత్నించినట్లు నీవు ఈ భూమిపై మన్న రాజులనందరను చంపవలెనని కోరుకొనుచున్నావు. ఆ రాజులందరు అనేక యజ్ఞముల నాచరించిన మహాపుణ్యాత్ములు, గొప్ప పరాక్రమము కలవారు. పైగా నా యొక్క సేవకులు. వీరిని శంకరుని యొక్క సహాయమున చంపవలెనని అనుకొనుచున్నావు అని పలికెను.
పరశురాముడు కాళీ పార్వతుల మాటలు విని శోకముతో బిగ్గరగా నేడ్చెను. ఇంకనూ వెంటనే వారిముందు తన ప్రాణములు వదలిపెట్టుటకు సిద్ధమయ్యెను. అప్పుడా బ్రాహ్మణుని దుఃఖమును చూచిన కరుణానిధియగు శంకరుడు. కాళికాదేవి, పార్వతి దేవియొక్క భావమును గ్రహించి వారి యనుమతితో భార్గవరామునితో ఇట్లు పలికెను.
శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను –
అద్య ప్రభృతి హే వత్స త్వం మే పుత్ర సమో మహాన్ ।
దాస్యామి మంత్రం గుహ్యం తే త్రిఘ లోకేషు దుర్లభం ॥
ఏవం భూతం చ కవచం దాస్యామి పరమాద్భుతం ।
లీలయా మత్ప్రసాదేన కార్తవీర్యం హవీషది ॥
త్రిః సప్త కృత్వో విరూపాం కరిష్యసి మహీం ద్విజ ।
జగత్తె యశసా పూర్ణం భవిష్యతి వ సంశయః ॥
ఇత్యుక్త్వా శంకరస్తస్మై దదౌ మంత్రం సుదుర్లభం ।
త్రైలోక్య విజయం నామ కవచం పరమాద్భుతం ॥
స్తవం పూజావిధానం చ పురశ్చరణ పూర్వకం ।
మంత్రసిద్ధేరసుష్ఠానం యథావన్నీయము క్రమం ॥
సిద్ధిస్థానం కాలసంఖ్యం కథయామాప నారద ।
వేదవేదాంగాదికం చ పాఠయామాస తత్క్షణం ॥
నాగపాశం పాశుపతం బ్రహ్మాస్త్రం చ దుర్లభం ।
నారాయణాస్త్రమాగ్నేయం వాయవ్యం వారుణం తథా ॥
గంధర్వం గారుడం చైవ జృంభణాస్త్రం తథైవ చ ।
గదాం శక్తిం చ పరశుం శూల మవ్యర్థముత్తమం ॥
నానా ప్రకార శస్త్రాస్త్రమంత్రం చ విధిపూర్వకం ।
శస్త్రాస్త్రాణాం చ సంహారం తూణీ చాక్షయసాయకౌ ॥
అత్మరక్షణ సంధానం సంగ్రామ విజయక్రమం ।
మాయాయుద్ధం చ విధం హుంకారం మంత్రపూర్వకం ॥
రక్షణం చ స్వసైన్యానాం పరసైన్య విమర్దనం ।
నానా ప్రకారమతులముపాయం రణసంకటే ॥
స్థిత్వా చిరం గురోర్వాసే సర్వవిద్యాం విబేధ్య సః ।
తీర్థే కృత్వా మంత్రసిద్ధిం తాంశ్చ నత్వా జగామ సః ॥
ఓ భార్గవరామా! నేడు మొదలు నీవు నాకు పుత్రుని వంటివాడవు. నీకు ముల్లోకములందును లభించని అతి రహస్యమైన మంత్రమును ఉపదేశింతును. అట్లే నేను ఉపదేశింపబోవు పరమాద్భుతమైన కవచ ప్రభావము వలన, నాయొక్క అనుగ్రహమువలన నీవు తప్పక కార్తవీర్యుని చంపెదవు. అట్లే ఈభూమిపై రాజులు లేకుండ ఇరువదియొక్కమార్లు తిరిగి వారిని చంపెదవు. ఈ ప్రపంచమున నీకీర్తి నిండిపోవునని పలికి పరమాద్భుతమైన త్రైలోక్య విజయమను కవచమును, స్తోత్రమును, పూజావిధానమును, పురశ్చరణపద్దతివి, మంత్రానుష్టాన విధానమును, దానియొక్క నియమములను, మంత్రము సిద్ధించుస్థలమును, మంత్రము జపింపవలసిన కాలమున, సంఖ్యను, భార్గవరామునకు పరమశివుడు బోధించెను.
అట్లే చతుర్విధ వేదములను, షడ్వేదాంగములు మొదలగు వానిని చదివించెను. అటుపిమ్మట నాగపాశము, పాశుపతము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, గాంధర్వాస్త్రము, గరుడాస్త్రము, జృంభణాస్త్రము, గది, శక్తి, పరశు, శూలము మొదలగు శస్త్రాస్త్రములకు సంబంధించిన మంత్రములును, శస్త్రాస్త్రముల సంహారక్రమమును, తూణీరములమ, అక్షయసాయకములను, ఆత్మరక్షణ చేసికోనుపద్దతివి, యుద్ధమున విజయమును పొందు పద్దతిని, మాయా యుద్ధమును, తన సైన్యముల రక్షించుకొనుపద్ధతిని, శత్రుసైన్యముల నాశనము చేయు రీతిని, యుద్దమున కష్టము వచ్చినప్పుడు తప్పించుకొను నానా ప్రకారములైన ఉపాయములను, మృత్యువును హరించు మోహినీ విద్య మొదలగు వాటిని పరమేశ్వరుడు భార్గవ రామునకు ఉపదేశించెను.
భార్గవరాముడు గురువుయొక్క సమీపమున చాలాకాలముండి సమస్త విద్యలు నేర్చుకొని పుణ్యతీర్థమున మంత్రసిద్ధిని పొంది గురువగు పరమేశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణ సంవాదే పరశురామప్య శివదత్తాస్త్ర శిప్రాదిప్రాప్తి వర్ణనం నామ త్రింశత్తమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమువ మూడవది యగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన పరశురామునకు శస్త్రాస్త్రప్రాప్తియనెడు ముప్పదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 30 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Fulfilling his solemn oath, Parashurāma marched across the five continents twenty-one times, engaging and destroying corrupt Kshatriya dynasties, tyrannical kings, and their massive armies wherever they existed. Earth-shaking battles raged across every kingdom, filling rivers with the blood of oppressors and purging the world of demonic elements that had burdened the earth for generations. After completing his twenty-one campaigns and restoring moral order, Parashurāma performed a grand sacrifice, donating the conquered land to holy Brāhmaṇas and retiring toward Mount Kailāsa to offer his victorious battle-axe to his spiritual preceptor Lord Śiva.