బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

13 -  గణేశ పూజా స్తవ కవచ కథనము

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను-

 ఆథ విష్ణుః శుభే కాలే దేవైశ్చ మునిభిస్సహ

 పూజయామాస తం బాలముపహారైరనుత్తమై;

సర్వాగ్రే తవ పూజా చ మయా దత్తా సురోత్తమ

సర్వపూజ్యశ్చ యోగీంద్రో భవ వత్సేత్యుపాచి తం

వనమాలాం దదౌ తస్మై బ్రహ్మజ్ఞానం చ ముక్తిదం

సర్వసిద్ధిం ప్రదాయైవ చకారాత్మ సమం హరిః

 దదౌ ద్రవ్యాణి చారూణీ చోపచారాంశ్చ షోడశ

నామభిస్తవనం చక్రే మునిభిశ్చ సమయం సురైః

తరువాత శ్రీమహావిష్ణువు మంచి ముహూర్తమున దేవతలచే మునులచే గొప్పదైన ఉపహారములతో పూజ చేయించెను. ఆట్లే ఆ బాలునితో నీకు సమస్త దేవతల కంటే ముందు పూజ జరుగునట్లు నేను వరమునిచ్చితిననియు నీవు ప్రాణులందరకు పూజ్యుడవగుదువనీయు, యోగీంద్రుడవగుదువని చెప్పి ఆ శిశువు మెడలో తనమెడలోనున్న వనమాలను వేసి ముక్తిని కలిగించు బ్రహ్మజ్ఞానమును, సమస్తసిద్దులను ఇచ్చి తనతో సముడుగా చేసెను. అట్లే మునులు, దేవతలతో కలసి షోడశోపచారములతో అతనిని పూజించి ఆ శిశువుయొక్క నామస్తోత్రమును కూడ చేసేను.

విఘ్నేశశ్చ గణేశశ్చ హేరంబశ్చ గజాననః

లంబోదరశ్చైకదంతః శూర్పకర్ణో వినాయకః

 ఏతాన్యష్టా చ నామానీ సర్వసిద్ధిప్రదాని చ

 ఆశీషం దాపయామాస చానయామాస తాన్ మునీన్

విఘ్నేశుడు, గణేశుడు, హేరంబుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, వినాయకుడు అనునవి అతని పేర్లు. ఈ ఎనిమిది పేర్లు పఠించినచో సమస్తసిద్ధులు కలుగును.

 సిద్ధాసనం దదౌ ధర్మస్తస్మై బ్రహ్మా కమండలుం

శంకరో యోగపట్టం చ తత్త్వజ్ఞానం సుదుర్లభం

రత్నసింహాసనం శక్తః సూర్యశ్చ మణికుండలే

మాణిక్యమాలెం చంద్రశ్చ కుబేరశ్చ కిరీటకం

వహ్నిశుద్ధం చ వసనం దదౌ తస్మై హుతాశనః

 రత్నచ్చత్రం చ వరుణ్ వాయూ రత్నాంగుళీయకం

క్షీరోదోద్భవ సద్రత్న రచితం వలయం వరం

మంజీరం చాపీ కేయూరం దదౌ పద్మాలయామునే

కంఠభూషాం చ సావిత్రీ భారతీ హారముజ్వలం

క్రమేణ సర్వదేవాశల్ దేవ్యశ్చ భూషణం దదుః

మునయ: పర్వతాశ్చైవ రత్నానివివిధాని చ

 వసుంధరా దదౌ తస్మై వాహనాయ చ మూషకం

క్రమేణ దేవాశ్చ దేవ్యశ్చ మునయః పర్వతాదయః

గంధర్వా కిన్నరా యక్షా మనవో మానవాస్తథా

నానావిధిని ద్రవ్యాణి స్వాదూనీ మధురాణి చ

 పూజాo చక్రుశ్చ తే సర్వే క్రమాద్వై భక్తిపూర్వకం

తరువాత ఆ శ్రీహరి మునులను పిలిపించి వారిచే ఆతనికి ఆశీస్సులనిపించెను. ధర్మదేవత ఆ శిశువునకు సిద్ధాసనమునీయగా బ్రహ్మదేవుడు కమండలమును, శంకరుడు యోగపట్టమును, తత్త్వజ్ఞానమును, దేవేంద్రుడు రత్నసింహాసనమును, సూర్యుడు మణిమయ కుండలములను, చంద్రుడు మాణిక్యమాలను, కుబేరుడు కిరీటమును, అగ్ని పరిశుద్ధమైన వస్త్రములను, వరుణుడు రత్నమయఛత్రమును, వాయువు రత్నాల ఉంగరమును, లక్ష్మీదేవి పాలసముద్రమునుండి ఉద్భవించిన రత్న కంకణమును కాలి అందెను, దండకడియమును, సావిత్రీదేవి కంఠ భూషణమును (కంటెను) భారతీదేవి రత్నాల హారమును ఇచ్చెను, ఆట్లే సమస్తదేవతలు, సమస్త దేవతాస్త్రీలు నానావిధభూషణములనిచ్చిరి. అదేవిధముగా మునులు, పర్వతములు అనేకవిధములైన రత్నములనిచ్చిరి, భూదేవి గణేశునకు వాహనముగా, మూషికమును ఇచ్చెను, గంధర్వులు కిన్నరులు, యక్షులు మొదలగువారు నానావిధ ద్రవ్యములతో గణపతికి భక్తిపూర్వకముగా పూజచేసిరి.

పార్వతీ జగతాం మాతా స్మేరానన సరోరుహా

రత్నసింహాసనే పుత్రం వాసయామాస నారద

 సర్వతీర్థోదకై రత్నకలశావర్జితైః స్తుతైః

 స్నాపయామాస వేదోక్తమంత్రేణ మునిభిస్తదా

ఆగ్నేశుద్దే చ వసనే దదౌతస్మై సతీముదా

 గోదావర్యుదకైః పాద్యమర్ఘ్యం గంగోదకేన చ

దూర్వాభీరక్షకైః పుష్పైశ్చందనేన సమన్వితం

పుష్కరోదకమనీయ పునరాచమనీయకం

 మధుపర్కం రత్నపాత్రైలాసవం శర్కరాన్వితం

స్నానీయం విష్ణుతైలం చ స్వర్యైద్యాభ్యాం వినిర్మితం

అమూల్యరత్నరచితం చారుభూషాకదంబకం

పారిజాతప్రసూనానామన్యేషాం శతకాని చ

మాలతీచంపకాదీనాం పుష్పాణి వివిధాని చ

పూజార్హాణి చ పత్రాణి తులసీవహితాని చ

 చందనాగురు కస్తూరీ కుంకుమాని చ సాదరం

 రత్నప్రదీపనీకరం ధూపం చ పరితో దదౌ

 నైవేద్యం తత్ప్రియం చైవ తిలలడ్డుకపర్వతాన్

యమగోధూమచూర్ణాహార లడ్డుకానాం చ పర్వతాన్

 పక్వాన్నానాం పర్వతాశ్చ సుస్వాదుసుమనోహరాన్

 పర్వతాన్ స్వస్తికానాం చ సుస్వాదు శర్కరాన్వితాన్

గుడాక్తానాం చ లాజానాం పృథునాం చ పర్వతాన్

శాల్యన్నానాం పిష్ఠకానాం పర్వతావ్ వ్యంజనైస్పహ

 పయోభృత్కలవాం చ లక్షణి ప్రదదౌ ముదా

లక్షాణి దధిపూర్ణానాం కలశానాం చ పూజనే

మధుభృత్కలశానాం చ త్రిలక్షణి చ సుందరీ

 సర్వః సువర్ణకుంభావం పంచలక్షాణి సాదరం

దాడిమానాం శ్రీఫలానామసంఖ్యాని ఫలాని చ

ఖర్జూరాణాం కపిత్థానాం జంబూనాం వివిధాని చ

 ఆమ్రాణాం పనసానాం చ కదళీనాం చ నారద

 ఫలానీ నారికేళానామపంఖానీ దదౌముదా

 అవ్యాని పరిపక్వాని కాలదేశోద్భవాని చ

దదౌ తాని మహాభాగ స్వాదూనీ మధురాణి చ

 స్వచ్చం సునిర్మలం చైవ కర్పూరాది సువాసితం

గంగాబలం చ పానార్థం, పునరాచమనీయకం

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదీసువాసితం

 సువర్ణపాత్రశతకం భక్ష్యపూర్ణం చ నారద

శైలరాజప్రియామాత్యా పూపుజు శైలజాత్మకం

జగన్మాతయగు పార్వతీదేవి చిరునవ్వుతో తనపుత్రుడగు గణేశుని రత్నసింహాసనముపై కూర్చుండపెట్టి రత్నకలశములతో తెచ్చిన సమస్తతీర్థములందలి నీటిచే మునులు స్తోత్రములు, వేదమంత్రములు చదువుచుండగా స్నానము చేయించెను. తరువాత ఆ గణపతికి మిక్కిలి పరిశుద్ధమైన రెండు వస్త్రములనిచ్చెను. ఆటుపిమ్మట దూర్వ, అక్షతలు, పూవులు, చందనము కలిగిన గోదావరీ నది యొక్క నీటిచే పాద్యమును, గంగానదియొక్క తీర్థముచే ఆర్ఘ్యమును, పుష్కరమందలి నీటిచే ఆచమనీయమును ఇచ్చెను. దేవతా వైద్యులగు ఆశ్వినీ కుమారులు సిద్ధము చేసిన విష్ణు తైలమును పూసి అమూల్యరత్నములు కల అందమైన ఆభరణములను వేసినది. అటుపిమ్మట పారిజాత కుసుమములు, మాలతి, చంపకము మొదలగు పుష్పములను, ఇంకను పూజించుటకు తగిన ఇతరమైన పత్రపుష్పములమ, తులసీదళములమ చందనము. ఆగరు, కరివంటి సుగంధద్రవ్యములను, కుంకుమను, ధూపమును, రత్నదీపములను సమర్పించినది.

దూపదీపములు సమర్పించిన పిదపి పార్వతీదేవి గణపతికి ఇష్టమైన నైవేద్యమును పెట్టినది. ఆ నైవేద్యములో మాపులలడ్డూలు, యవలు, గోధుమలరవ్వలో చేసిన లడ్డూలు చాలా రుచికల పక్వాన్నెములు, మంచి రుచిగల తియ్యని స్వస్తికమను వంటకములు, బెల్లపు పానకమున వేసి కట్టబడిన పేలాలు, అటుకుల లడ్డులు, సమస్తమైన కూరగాయలతోకూడిన అన్నము, పిండివంటలు కలవు. అదేవిధముగా పాలు, పెరుగు, తేనె, సాయివంటి వపపులనపారముగా అతనికి నివేదించెను. మరియు దానిమ్మ మారేడు పండు, ఖర్జూరములు, వెలగ, మామిడి, పనస, నారికేళము మొదలగు ఫలములనన్నిటినీ పార్వతీదేవి గణపతికి సమర్పించినది. అటుపిమ్మట కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములచే పరిమళింపబడిన నిర్మలమైన గంగాజలమును త్రాగుటకై ఇచ్చెను. తరువాత. కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములు గల తాంబూలమును భక్ష్యములతోనున్న బంగారుపాత్రలను అతనికి ఇచ్చినది.

అదేవిధముగా హిమవంతుని పరిచారకులందరు ఆ గణపతిని భక్తితో పూజచేసిరి.

ఓం శ్రీం హ్రం క్లీం శ్రీ గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే

 సర్వసిద్ధిప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః

 ఇత్యనేనైవమంత్రేణ దత్వా ద్రవ్యాణి భక్తితః

సర్వేప్రముదితాస్తత్ర బ్రహ్మవిష్ణు శివాదయః

“ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధిప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః" అనునది గణపతి మంత్రము. ఈ మంత్రమున చదువుచు బ్రహ్మాది దేవతలందరు షోడశోపచారములకు అవసరమైన పూజాద్రవ్యములను గణపతికి నివేదించి సంతోషపడిరి.

ద్వాత్రింశదక్షరో మాలామంత్ర్మోఽయం సర్వకామదః

ధర్మార్థకామమోక్షాణాం ఫలదః సర్వసిద్ధిదః

పంచలక్ష జపేనైవ మంత్ర సిద్దిస్తు మంత్రిణః

మంత్ర సిద్ధిర్భవేద్యస్య స చ విష్ణుశ్చ భారతే

విఘ్నాని చ పలాయంతే తన్నామస్మరణేవ చ

 మహావాగ్మీ మహాసిద్ధిః సర్వసిద్ధి సమన్వితః

 వాక్పతిర్గురుతాం యాతి తస్య సాక్షాత్సునిశ్చితం

మహాకవీంద్రో గుణవాన్ వీదుషాం చ గురోర్గురుః

సంపూజ్యానేన మంత్రేణ దేవా ఆనందసంప్లుతాః

నానావిధానీ వాద్యాని వాదయామాసురుత్పవే

బ్రాహ్మణాన్భోజయామాసు: కారయామాసురుత్సవం

దదుర్దానాని తేభ్యశ్చ వందిభ్యశ్చ విశేషతః

పై గణపతి మంత్రమున ముప్పై రెండు అక్షరములున్నవి. ఆ మంత్రము సమస్తమైన కోరికలను తీర్చును. ధర్మార్థ కామ మోక్షములయొక్క ఫలితములనిచ్చును. పైగా అన్ని విధములైన సిద్దులనామంత్రము కలిగించును. ఈ మంత్రరాజమును ఐదులక్షల పర్యాయములు ఏకాగ్రబుద్ధితో జపించినవానికి మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్ర సిద్దినందిన వాడు శ్రీమహావిష్ణువుతో సమానుడగును. గణాధిపతియొక్క నామములను పరించుటవలన సమస్తవిఘ్నములు భయముతో పరుగెత్తి పోవును. అవి నామస్మరణము చేసినవాడు సర్వసిద్ధి సమన్వితుడై గొప్ప వక్తయగుమ, గణపతి మంత్రస్మరణ గణపతి సంతుష్టుడై ప్రత్యక్షమైనచో ఆ భక్తుడు బృహస్పతితో సమాను డగును. మహాకవులలో మిన్నయగును. విద్వాంసులలో గురువులలో అతడు మిక్కిలి శ్రేష్టుడుగా పేరుపొందును.

ఈ గణపతి మంత్రమును స్మరించుచు గణపతిని పూజించిన దేవతలు ఆనందసాగరములో ఓలలాడి గొప్ప ఉత్సవమును జరుపుకొని అనేకవిధములైన వాద్యములను మ్రోగించుచుండిరి. వారు ఆ సమయమున బ్రాహ్మణులకందరకు భోజనములు పెట్టి వారికి మరియు భట్రాజులకు విశేషముగా దానములు చేసిరి.

 నారాయణ ఉవాచ - నారాయణ ముని నారదునితో  నిట్లనెను-

 ఆథ విష్ణుః సభామధ్యే తం సంపూజ్యగణేశ్వరం

తుష్టావ పరయా భక్త్యా సర్వవిఘ్న వినాశకం

ఈశ త్వాం స్తోతుమిచ్ఛామి బ్రహ్మజ్యోతి: సనాతనం

 నైవ వర్ణయితుం శక్త్యాఽస్మ్య నురూపమనీహకం

ప్రవరం సర్వదేవానాం సిద్ధానాం యోగినాం గురుం

 సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశిస్వరూపిణం

ఆవ్యక్తమక్షరం నిత్యం సత్యమాత్మస్వరూపిణం

 వాయుతుల్యం చ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం

సంసారార్ణవపారే చ మాయోపేతే సుదుర్లభే

కర్ణధారస్వరూపం చ భక్తానుగ్రహకారకం

వరం వరేణ్యం వరదం వరదానామపీశ్వరం

సిద్ధం సిద్ధిస్వరూపం చ సిద్ధిదం సిద్ధిసాధనం

ధ్యానాతీరిక్తం ధ్యేయం చ ధ్యానాసాధ్యం చ ధార్మికం

 ధర్మస్వరూపం ధర్మజ్ఞం ధర్మాధర్మఫలప్రదం

బీజం సంసారవృక్షోణామంకురం చ తదాశ్రయం

 స్త్రీపుం నపుంసకానాం చ రూపమేతదతీంద్రియం

సర్వాద్యమగ్రపూజ్యం చ సర్వపూజ్యం గుణార్ణవం

స్వేచ్ఛయా సగుణం బ్రహ్మ నిర్గుణం స్వేచ్ఛయా పునః

 స్వయం ప్రకృతి రూపం చ ప్రాకృతం ప్రకృతేః పరం

త్వాం స్తోతుమక్షమోఽనంతః సహస్రవదనైరపి

 న క్షమః పంచవక్త్రశ్చ న క్షమశ్చతురాననః

సరస్వతీ స శక్తి చ నశక్తోహం తవస్తుతౌ

న శక్తాశ్చా చతుర్వేదాః కే తే వేదవాదినః

ఇత్యేవం స్తవనం కృత్వా మునీశ సురసంపది

 సురేశశ్చ సురై స్పార్థం విరరామ రమాపతిః

ఆ సమయమున దేవతలు మునులున్న ఆ సభలో విష్ణుమూర్తి గణపతిని పూజించి సమస్త విఘ్నములను తొలగించు ఆ గణేశునీ అమితమైన భక్తితో ఇట్లు స్తుతించెను.

ఓ దేవా నేను నిన్ను స్తుతింపవలెనని భావించుచున్నాను. కాని, బ్రహ్మస్వరూపుడవు, జ్యోతిర్మూర్తివి, సనాతనడవగు నిన్ను యథానురూపముగా వర్ణింప జాలకున్నాను.

ఐనను నీవు సమస్తదేవతలలో, సమస్త సిద్ధగణములలో సమస్తయోగులలో మిక్కిలి శ్రేష్ఠమైనవాడవు. నీవు సర్వ భూత స్వరూపుడవు. సర్వేశ్వరుడవు, జ్ఞాన రాశి మూర్తీ భవించినట్లున్న వాడవు. నీవు ఆవ్యక్తుడవు, నాశనములేనివాడవు, నిత్యుడవు, సత్యరూపుడవు, ఆత్మరూపుడవు, వాయువువలె సర్వత్ర వ్యాపించి యున్నావు. నిర్లిప్తుడవు, అక్షయడవు, సమస్త జీవులు చేయుచున్న కర్మలకన్నిటికి నీవే సాక్షివి.

మాయతోనున్న ఈ ఆంతులేని సంసార సాగరమున నీవు నావను చక్కగా నడుపుచూ ఆవలితీరమును చేర్చ గల నావికుడవు, భక్తులను సదా అనుగ్రహించువాడవు. నీవు శ్రేష్టుడవు మిక్కిలి గొప్పవాడవు, వరములనిచ్చువాడవు, వరములనొసగు దేవతలందరిలో నీవే శ్రేష్ఠమైనవాడవు. నీవు స్వయముగా సిద్దుడవు, సిద్దిస్వరూపుడవు, సమస్త సిద్దుల నొసగువాడవు. సమస్త సిద్దులను పొందుటకు కారణమైనవాడవు. ధ్యానాతిరిక్తుడవు నీవే. ధ్యానింపదగినవాడవు నీవే. ధ్యానింపశక్యము కానివాడవు నీవే. పరమధార్మికుడవు. ధర్మరూపుడవు, ధర్మములన్నియు తెలిసినవాడవు, ధర్మా ధర్మ కర్మలయొక్క ఫలితములనిచ్చువాడవు నీవే, సంసారమనే వృక్షమునకు బీజరూపుడవు, ఆంకురరూపుడవు దానికి ఆశ్రయమైనవాడవు ఆన్నియునీవే. నీరూపము ఇంద్రియములకన్నీటికి అతీతమైనది. స్త్రీ, పుం. నపుంసక రూపములన్నియు నీకు సంబంధించినవే.

నీవు సమస్త దేవతలలో మొదటివాడవు. సమస్త దేవతల కంటే ముందు పూజనందు కొను వాడవు. సమస్త చరాచర సృష్టి కోటిచే మునీశ్వరులు దేవతాధిపతులందరిచే పూజల నందు కొనుచున్నావు, నీవు నీ ఇచ్చామాత్రమున సగుణరూపుడవు, నిర్గుణరూపుడవుగా ప్రకాశించుచున్నావు. నీవు స్వయముగా ప్రకృతిస్వరూపుడవు, ప్రకృతినుండి ఉద్భవించినవాడవు, చివరకు ప్రకృతికి అతీతుడవు

నిన్ను నీగుణములను వేయి తలలుగల ఆదిశేషుడు కాని, ఐదు తలలుగల శంకరుడుకాని, నాలుగుముఖములున్న బ్రహ్మదేవుడుగానీ, చదువులతల్లియగు సరస్వతీదేవిగాని వర్ణింపలేరు. చివరకు నేను కూడ నీస్వరూపమును చక్కగా వర్ణింపలేను. అట్లే నిన్ను వేదములన్నియు, వేద, వేదార్థ చర్చలు జరుపుకొను వేదవాదులు సహితము వర్ణింపజాలకున్నారు అని విష్ణువు గణపతిని స్తుతించెను.

ఈవిధముగా శ్రీమహావిష్ణువు దేవతలు, మునీశ్వరులందరూ ఉన్న ఆ సభలో గణపతిని స్తుతించి ఇతర దేవతలందరివలె మిన్నకుండెను.

ఇదం విష్ణుకుతం స్తోత్రం గణేశస్య చ యః పఠేత్

సాయం ప్రాతశ్చ మధ్యాహ్నే భక్తియుక్తః సమాహితః

తద్విఘ్ననాశం కురుతే విఘ్నేశః సతతం మునే

వర్ధతే సర్వకల్యాణం కల్యాణజనకః సదా

యాత్రాకాలే పఠిత్వా యో యాతి తద్భక్తిపూర్వకం

తస్యసర్వాభీష్టసిద్ధిర్భవత్యేవ న సంశయః

తేన దృష్టం చ దుఃస్వప్నం సుస్వప్నముపజాయతే

 కదాఽపిన భవేత్తస్య గ్రహపీడా సుదారుణా

 భవేద్వినాశః శత్రూణాం బంధూనాం చాపి వర్ధనం

శశ్వద్విఘ్నవినాశశ్చ శశ్వతమ్యకవర్ధనం

 స్థిరా భవేధ్గృహే లక్ష్మీః పుత్రపౌత్రవివర్ధనం

సర్వైశ్వర్యమిహ ప్రాప్య హ్యంతే విష్ణుపదం లభేత్

ఫలం చాపి చ తీర్థాసాం యఙ్ఞానాం యద్భవేత్ ధ్రువం

మహతాం సర్వదానానాం తద్గణేశ ప్రసాదతః

గణపతియొక్క ఈ స్తోత్రమును ప్రాతర్మధ్యాహ్న సాయంసంధ్యలందు నియమనిష్టలతో భక్తిపూర్వముగా చదివినచో విఘ్నాధిపతి అతని విఘ్నములనన్నిటినీ నాశనము చేయును. మంగళకారియగు గణపతి ఆతనికి సమస్త మంగళములను కలిగించును. పరదేశ గమన సమయమున ఈ స్తోత్రమును భక్తితో చదివినచో ఆతని అభీష్టములన్నియు తప్పక తీరును. ఈ స్తోత్రమును భక్తితో చదివినవారికి దుఃస్వప్నము కలిగినను సుస్వప్నమువలె సుస్వప్న ఫలితమును గణాధిపతియొసంగును. అతనికి ఎన్నడుకూడ దుష్ట గ్రహముల వలన కలుగు బాధయనునది ఉండదు. ఆతని శత్రువులందరు నశింతురు. బంధువుల సంఖ్య పెరుగుమ, ఆతని ఇంట లక్ష్మీదేవి స్థిరముగానుండి అతనికి పుత్ర పౌత్ర సంతతి కలుగును. ఆతడు నమస్వైర్యములను పొందును. మరణానంతరము ఆతడు వైకుంఠమును చేరును. శ్రీగణేశుని అనుగ్రహమువలన ఆతనికి సమస్త పుణ్యతీర్థములు సేవించిన ఫలము, సమస్త యజ్ఞములాచరించినందువలన కలుగు ఫలితము, సమస్త దానము చేసినచో లభించు ఫలమంతయు లభించును. అని నారాయణ మునీశ్వరుడు నారదునితో పలికెను.

నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లు పలికెను-

శ్రుతం స్తోత్రం గణేశస్య పూజనం చ మనోహరం

కవచం శ్రోతుమిచ్ఛామి సాంప్రతం భవతారణం

ఓ నారాయణమునీ! నీఅనుగ్రహమువలన శ్రీగణేశుని పూబను, స్తోత్రమును వింటిని. ప్రస్తుతము నాకు సంసారమనే సాగరమును తరింపజేయు గణపతి కవచమును వినవలెనని కోరిక కలదు. కావున మీరు నాకు దానిని వివరముగా తెలుపుడని కోరెను.

నారాయణ ఉవాచ - నారాయణముని నారదుని తో  ఈవిధముగా పలికెను-

 పూజయాo సునివృత్తాయాం సభామధ్యే శనైశ్చరః

ఉవాచ విష్ణుం సర్వేషాం తారకం జగతాం విభుం

శ్రీమహావిష్ణువు మొదలగు దేవతాగణము మునిసంఘము గణపతిపూజను చక్కగా నిర్వర్తించిన పిదప శనైశ్చరుడు, జగన్నాయకుడు అందరినీ తరింపజేయు శ్రీమహావిష్ణువుతో ఈవిధముగా పలికెను.

శనైశ్చర ఉవాచ - శని ఈవిధముగా పలికెను-

 నర్వదుఃఖవినాశాయ పాపప్రశమనాయ చ

 కవచం విఘ్ననిఘ్నస్యై వద వేదవిదాం వర

బభూవ నో నివాదశ్చ శక్త్యా వై పూయయా సహ

తద్విఘ్నప్రమార్థం చ కవచం ధారయామ్యహం

నాకు మాయాస్వరూపిణియగు శక్తితో వివాదమేర్పడినది. అందువలన ఏర్పడు విఘ్నములను తొలగించుకొనుటకు శ్రీ గణపతియొక్క కవచమును ధరింపవలెనని యున్నది. అందువలన ఓ వేద వేదార్థ తత్త్వజ్ఞా సమస్త దుఃఖములను, సమస్త పాపములను తొలగించుటకై విఘ్నరాజయొక్క కవచమును నాకు వినిపించమని అడిగెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణవిట్లు పలికెను-

వినాయకస్య కవచం త్రిషు లోకేషు దుర్లభం

సుగోప్యం చ పురాణేషు దుర్లభం చాగమేషు చ

ఉక్తం కౌథుమశాఖాయాం సామవేదే మనోహరం

 కవచం విఘ్ననాథస్య సర్వవిఘ్నహరం వరం

రాజ్యం దేయం శిరో దేయం ప్రాణా దేయాశ్చ సూర్యజ

ఏవం భూతం చ కవచం న దేయం ప్రాణసంకటే

 ఆవిర్భావస్తిరోభావః స్వేచ్ఛయా యస్య మాయయా

నిత్యోఃఽయమేకదంతశ్చ కవచం చాస్య వత్సక

 పూజాఽస్యనిత్యా స్తోత్రం చ కల్పేఽస్తిసంతతం

అస్య పై జన్మనః పూర్వం మునయశ్చ సిషేవిరే

 యథా మదవతారేషు జన్మవిగ్రహధారణం

తథా గణేశ్వరస్యాఽపి జన్మ శైలసుతోదరే

యద్ధృత్వా మునయః సర్వే జీవన్ముక్తాశ్చ భారతే

నీశ్శంకాశ్చసురాస్పర్వే శత్రుపక్ష విమర్దకా:

కవచం బిభ్రతాం మృత్యు ర్న బియా యాతి సన్నిధిం

 వాయుర్వ్యయో నాఽశుభంచే బ్రహ్మాండే న పరాజయః

దశలక్షజపేనైవ సిద్ధం తు కవచం భవేత్

యో భవేత్సిద్ధకవచో మృత్యుం కేతుం సచ క్షమః

సుసిద్ధకవచో వాగ్మీ చిరంజీవి మహీతలే

సర్వత్ర విజయీ పూజ్యో భవేధ్గ్రహణమాత్రతః

మూలమంత్రమమం పుణ్యం కవచం మంగళం శుభం

బిభ్రతాం సర్వపాపాని ప్రణశ్యంతి సునిశ్చితం

భూతప్రేత పిశాచాశ్చ కూష్మాండా బ్రహ్మరాక్షసా:

డాకినీ యోగినీ యక్ష వేతాలా భైరవాదయ:

 బాలగ్రహా గ్రహాశ్చైవ క్షేత్రపాలాదయస్తథా

వర్లః శబ్దమాత్రేణ పలాయంతే చ భీరవః

ఆధయో వ్యాధయశ్చైవ శోకాశ్చైవ భయావహా

 న యాంతి సన్నిధిం తేషాం గరుడస్య యథోరగా

ఋజవే గురుభక్తాయ స్వశిష్యాయ ప్రకాశయేత్

ఖలాయ పరిశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్

ఈ వినాయక కవచము ముల్లోకములయందెచ్చటను లభింపదు. పురాణములలోనిది అతిరహస్యముగా కనిపించును. ఆగమములయందిది అసలే కనిపింపదు.

సమస్త విఘ్నములను తొలగించునీ విఘ్నరాజ కవచము సామవేదమునకు చెందిన కొథుమ శాఖలో మాత్రము చెప్పబడినది.

ఓ శనైశ్చరా! రాజ్యమునివ్వవచ్చును. తన తలనైనా ఇవ్వవచ్చును. కాని ఈ కవచమును ప్రాణాపాయము సంభవించినపుడైనను ఇతరులకీయరాదు. ఈ కవచము యొక్క మహిమవలన భక్తుడు ప్రత్యక్షము కావచ్చును. మాయమైపోవచ్చును. అట్టి గణపతి కవచము నిత్యమైనది. దీనికి ఆధిదేవతయగు గణపతి నిత్యమైనవాడు.

గణపతిపూజ, సోత్రము ప్రతీకల్పమున కన్పించును. మునులు వీటిని గణపతి జన్మింపక ముందు నుండే సేవించుచుండిరి. అంతటి ప్రాచీనమైనవి ఈతని పూజా స్తోత్రములు. నేను ఆవతారములనెత్తి జన్మించి కర చరణాద్యవయవములు కల్గిన శరీరము ధరించినట్లే వినాయకుడు సైతము అవతారరూపియై పార్వతీదేవి గర్భమున జన్మించినాడు.

గణపతి కవచమును ధరించిన మహార్షులందరు జీవన్ముక్తులైరి. దేవతలు భయపడక శత్రువులందరను పరిహరింపగలిగిరి. ఈ కవచమును ధరించినచో మృత్యువు భయముతో వారిజోలికిపోదు. అతడు నిత్యయౌవనుడై జీవించును. ఆతనికి అశుభములు కాని పరాజయమనునది కానీ ఎన్నడు కలుగవు,

ఈ కవచమును పదిలక్షలమార్లు ఏకాగ్రచిత్తముతో జపించినచో ఆతనికి మంత్రసిద్ధికలుగును. ఈ కవచము సిద్ధించినచో అతడు మృత్యువును సహితము జయింపగలుగును. సిద్దకవచుడైనవాడు చక్కని వాడ్మియగును చిరంజీవియగును. ఈ కవచమును గురుముఖతః విన్నంతమాత్రమున ఆతడు సర్వత్ర విజయము పొందగలడు. అట్లే అంతట పూజ్యం మన్ననలనందుకొవగలడు. ఈ గణపతి కవచము చాలా మంగళప్రదమైనది. దీనిని ధరించినవారికి సమస్త పాపములు నశించును.

ఈ గణాధిపుని కవచమును చదువుతున్నప్పుడు ఆ కవచ మంత్రముల యొక్క శబ్దము వినపడినంత మాత్రమున భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, డాకినీ, యోగినీ, యక్ష, భేతాళ, భైరవాదులు బాలగ్రహాదులు భయపడి పరుగెత్తి పోవును. అట్లే ఆధివ్యాదులు, శోకాదులు గరుత్మంతుని చూచినపాములవలె ఆతనిని సమీపింపజాలవు.

ఈ కవచమును ఋజస్వభావము కలవాడును, వినయ విధేయతలు కల తన శిష్యునకు మాత్రమే ఉపదేశింపవలెమ. ఆట్లుకాక దుష్టుడైన వానికి దీనిని ఉపదేశించినచో గురువు వెంటనే మృత్యువు వాతపడును.

సంసారమోహకస్యాస్య కవచస్య ప్రజాపతిః

ఋషి ఛందశ్చబృహతీ దేవో లంబోదరః స్వయం

సర్వేషాం కవచానాం చ సారభూతమిదం మునే

 ఓం గం హుం శ్రీగణేశాయస్వాహా మే పాతుమస్తకం

ద్వాత్రింశదక్షరో మంత్రో లలాటం మే సదాఽవతు

ఓం హ్రింక్లీం శ్రీం గమితి వై సతతం పాతు లోచనం

తాలుకే పాతు విఘ్నేశః సతతం ధరణీతలే

 ఓం హ్రీం శ్రీం క్లీమితి పరం సంతతం పాతు నాసికాం

ఓం గౌం గం శూర్పకర్ణాయస్వాహా పాత్వరరం మమ

దంతాంశ్చ తాలుకాం. జిహ్వాం పాతు మే షోడశాక్షరః

ఓం లం శ్రీం లంబోదరాయేతిస్వాహా గండం సదాఽవతు

ఓం క్లీంహీం విఘ్ననాశాయస్వాహా కర్ణం సదాఽవతు

ఓం శ్రీం గం గజాననాయేతి స్వాహా స్కంధం సదాఽవతు

ఓం హ్రీం వినాయకాయేతి స్వాహా పృష్ఠం సదాఽవతు

 ఓం క్లీం హీమితి కంకాళం పాతు వక్షస్థలం పరం

కరౌ పాదౌ సదా పాతు సర్వాంగం విఘ్ననాశకృత్

ప్రాచ్యాం లంబోదరః పాతు చాగ్నేయ్యాం విఘ్ననాయకః

దక్షిణే పాతు విఘ్నేశో నైఋత్యాం తు గజాననః

పశ్చిమే పార్వతీపుత్రో వాయవ్యాం శంకరాత్మజః

కృష్ణస్యాంశశ్చోత్తరే చ పరిపూర్ణతమస్య చ

ఐశాన్యామేకదంతశ్చ హేరంబః పాతు చోర్ద్వతః

అధో గణపతిః పాతు సర్వపూజ్యశ్చ సర్వతః

 స్వప్నే జాగరణే చైవ పాతు మాం యోగినాం గురుః

ఓ శనైశ్చరా! ఈ గణపతి కవచమునకు సాక్షాత్ విఘ్నరాజే దేవత. అతడే ఋషి బృహతీ దాని చందస్సు. ఈ కవచము కవచములన్నిటికి సారభూతమైనది.

“ఓం గం హుం శ్రీగణేశాయస్వాహా" అను మంత్రము నా శిరస్సును కాపాడుగాక. ముప్పైరెండు అక్షరములు కలిగిన గణేశమంత్రము నా నొసటిని ఎల్లప్పుడు రక్షించుగాక! ఓం హ్రీం క్లీం శ్రీం అను మంత్రము నా నాసికను ఎల్లప్పుడు కాపాడుగాక.

"ఓం గౌం గం శూర్పకర్ణాయస్వాహా" అను మంత్రము   పెదవుల నెల్లప్పుడు రక్షించుగాక. పదునారు అక్షరముల గణపతి మంత్రము నా దంతములను, దౌడను, నాలుకను ఎల్లప్పుడు రక్షించుగాక, ఓం లం శ్రీం లంబోదరాయ స్వాహా అను మంత్రము నా చెక్కిలిని కాపాడుగాక, “ఓం శ్రీం హ్రీం విఘ్న నాశాయ స్వాహా” అను మంత్రము నా చెవులను రక్షించుగాక. 'ఓం శ్రీం గం గజాననాయ స్వాహా అను మంత్రము నా భుజములను రక్షించుగాక, 'ఓం హ్రీం వినాయకాయ స్వాహా అను మంత్రము నా పృష్ఠభాగమును రక్షించుగాక. 'ఓం శ్రీం హ్రీం' అను మంత్రము నా ఎముకల గూడును, రొమ్మును కాపాడుగాక, విఘ్నములను హరించు గణపతి నా చేతులను, పాదములను, సర్వావయవములను రక్షించుగాక. నా తూర్పు దిశను లంబోదరుడు, ఆగ్నేయదిశను విఘ్ననాయకుడు, దక్షిణదిక్కును విఘ్నేశుడు, గజాననుడు నైఋతి దిశను, పార్వతీపుత్రుడు పశ్చిమదిశను, శంకరాత్మజుడు వాయవ్యదిశను సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణుని ఆంశయగు గణపతి నా ఉత్తరదిశను, ఏకదంతుడు ఈశాన్యదిగ్భాగమును హేరంబుడు ఊర్ధ్వభాగమును, గణపతి అధోభాగమును, సర్వపూజ్యుడు అన్ని దిక్కులను, యోగి శ్రేష్ఠుడు స్వప్నావస్థయందు జాగ్రదావస్థయందు నన్ను కాపాడుగాక.

ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘ విగ్రహం

సంసారమోహవం నామ కవచం పరమాద్భుతం

శ్రీకృష్ణేన పురా. దత్తం గోలోకీ రాసమండలే

బృందావనే వినీతాయ మహ్యం దీపకరాత్మజ

మయా దత్తం తుభ్యం చ యస్మై కస్మై న దాస్యసి

పరం వరం సర్వపూజ్యం సర్వసంకటతారణం

గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేత్తు యః

కంఠే వా దక్షిణే బాహౌ సోఽపి విష్ణుర సంశయః

అశ్వమేధ సహస్రాణి పొజపేయ శతాని చ

గ్రహేంద్ర కవచస్యాస్య కళాం నార్హంతి షోడశీం

ఇదం కవచమజ్ఞాత్వా యో భజేత్ శంకరాత్మజం

శతలక్ష ప్రజస్తోఽపినమంత్రః సిద్ధిదాయకః

ఇతి సంసారమోహనం నామ కవచం

దత్వేదం సూర్యపుత్రాయ విరరామ సురేశ్వరః

పరమానందసంయుక్తా దేవాస్తస్థు: సమీపతః

ఓ శనైశ్చరా! సమస్తమంత్రములకు సారభూతమైనది, మిక్కిలి అద్బుతమైన, సంసారమోహనమను పేరుగల గణపతి కవచమును నీకు చెప్పితిని.

ఈకవచమును నాకు గోలోకమున రాసమండలమందున్న శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశించెను. నేను నీకు ఈ కవచమునుపదేశించితిని. సమస్త బాధలను తొలగించునది, అందరిచే మన్ననలనందుకొను శ్రేష్ఠమగు ఈ గణపతి కవచమును అర్హతలేనివానికి ఎన్నడును ఉపదేశింపరాదు.

ఈకవచమును ఉపదేశించిన గురువును శాస్త్ర పద్దతిలో పూజించి 'దీనిని కంఠమందు లేక కుడిచేతికి కట్టుకొన్నచో ఆతడు విష్ణుమూర్తితో సమానుడగును. వేలకొలదీ ఆశ్వమేధయాగములు వందలకొలదీ వాజిపేయ యాగములు ఈ కవచమునకు పదునారవవంతైన కాజాలపు

ఈ కవచమును వదలి పెట్టి శ్రీమహాగణాధిపతి మంత్రమును కోటిపర్యాయములు జపించినను మంత్రము సిద్ధింపదు. ఇట్లు సంసారమోహనమను పేరుగల ఈ కవచమును శ్రీమహావిష్ణువు శనైశ్చరునకు ఉపదేశించెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణపంవాదే గణేశపూజాస్తవకవచకథనంనామ త్రయోదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణేశుని పూజ, స్తోత్రము, కవచము గల పదమూడవ అధ్యాయము సమాప్తము.