పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను –
సర్వే జానంతి జగతి దుర్గాం శంకర కింకరీం ।
ఆపేక్షా రహితా దాసీ తస్యా వై జీవనం వృథా ॥
ఈశ్వరస్య సమాః సర్వాస్త్రణ పర్వతజాతయః ।
దాసీపుత్రస్య శిష్యస్య దోష కస్యేతి చ ప్రభో ॥
విచారం కర్తుముచితం త్వం చ ధర్మవిదాం వరః ।
వీరభద్రః కార్తికేయః పార్షదాః సంతి సాక్షిణః ॥
సాక్ష్యే మిథ్యాం కోవద్ద్వా ద్వావేషాం భ్రాతరౌసమౌ ।
సాక్ష్యసమే శత్రుమిత్రే సతాం ధర్మనిరూపణే ॥
సాక్షీసభాయాం యత్సాక్ష్యం జానన్నప్యన్యథా వదేత్ ।
కామతః క్రోధతోవాఽపి లోభేన చ భయేన చ ॥
స యాతి కుంభీపాకం చ నీపాళ్య శతపూరుషం ।
తైశ్చసార్ధం వసేత్తాత్ర యావచ్చంద్ర దివాకరౌ ॥
అహం వీబోధితుం శక్తా యన్నిర్ణేత్రీ ద్వయోరపి ।
తథాఽపి తవసాక్షాత్తు మమాజ్ఞా నిందితా శ్రుతౌ ॥
కింకరాణాం ప్రభా తత్ర నృపే వసతి సంసది ।
ఉదితే భాస్కరే పృథ్య్వాం ఖద్యోతోహి యథాప్రభో ॥
సుచీరం తపసా ప్రాప్తం త్వదీయం చరణాంబుజం ।
పరిత్యాగభయేనైవ సంతతం భీతయా మయా ॥
యత్కించిత్కోపశోకాభ్యాముక్తం మోహేన తత్పరం ।
తత్క్షమస్వ జగన్నాథ పుత్రస్నేహాచ్చ దారుణాత్ ॥
ఈ దుర్గాదేవి శంకరుని దాసియను విషయమందరకును తెలియును. ఇంకను నేను ఎట్టి కోరికలు లేని దాసిని. అట్టి దాసి బ్రతికియున్నను ఆమె జన్మ వ్యర్థమేయగును. అటువంటి దాసీపుత్రుడగు గణపతి మరియు నీ శిష్యుని నీవు విచారించుట సమంజసము. ఈ విషయమున నీకు వీరభద్రుడు, కుమారస్వామి, నీ ఆనుచరులందరు సాక్ష్యముగానున్నారు. వీరందరకు గణపతి భార్గవ రాములు సమానమైన వారే. ధర్మ నిరూపణస మయమున సాక్ష్యమిచ్చునప్పుడు సత్పురుషులకు శత్రువైనను, మిత్రుడైనను ఒకే విధముగానుందురు. అట్లే ఒకరిపై ద్వేష భావముకాని, మరియొకరిపై ప్రేమగానియుండదు. అందు వలన సాక్ష్యముచ్చునప్పుడు అబద్దములను ఎవరుకూడ చెప్పరు. సభలో తెలిసిన విషయమును సంకల్పములోనైన, కోపములోనైన, లోభము, భయమువంటి కారణములవలన కాని వక్రీకరించి చెప్పినచో అతడు తన వంద తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును. అట్లే అతడు సూర్య చంద్రులున్నంత వరకు తనవారితో కలిసి కుంభీపాక నరకముననుండును.
నేను గణపతి, భార్గవరాముల దోషములను నిర్ణయించి చెప్పగలిగినప్పటికిని నా భర్తయగు మీ ముందు చెప్పుట వేద విరుద్ధము కాగలదు. రాజున్న సభలో కింకరునివలె సూర్యుని ముందు మిణుగురు పురుగువలె మీముందు నాజ్ఞానము వెలవెలబోవును. చాలాకాలము తపస్సుచేసి నిన్ను భర్తగా పొందితిని. అందువలన మీ భయము వలన నేను న్యాయ నిర్ణయము చేయలేకున్నాను, భార్గవరాముడు నా పుత్రునకు గాయము కలిగించేనను కోపముతో, దుఃఖముతో, నా పుత్రునిపైగల వాత్సల్యముచే నేను చెప్పిన మాటలను మీరు క్షమింపుడని తన భర్తయగు శివుని పార్వతి కోరినది.
త్వయా యది పరిత్యక్తా తదా పుత్రేణ తేన కిం ।
సాధ్వ్యా సద్వంశజాయాశ్చ శతపుత్రాధికః పతిః ॥
అసద్వంశప్రసూతా యా దుశ్శీలా చ జ్ఞానవర్జితా ।
స్వామినర మవ్యతే నాసౌ పిత్రోర్దోషేణ కుత్సితా ॥
కుత్సితం పత్తం మూడం దరిద్రం రోగిణం జడం ।
కులజా విష్ణుతుల్యం చ కాంతం పశ్యతి సంతతం ॥
హుతాశ నో వాసూర్యో వా సర్వతేజస్వినాం వరః ।
పతివ్రతాతేజసశ్చ కళం నార్హంతి షోడశీం ॥
మహాదానాని పుణ్యాని వ్రతాన్యనశనాని చ ।
తపాంసి పతిసేవాయాః కళంనార్హంతి షోడశీం ॥
పుత్రోవాఽపి పితావాఽపి బాంధవోఽథ సహోదరః ।
యోషితాం కులజాతానాం న కశ్చిత్ స్వామినః సమః ॥
మీరు కోపముచే నన్ను వదలిపెట్టిన నాకు పుత్రుడున్నను లాభములేదు. మంచి కులమునందు పుట్టిన పతివ్రతా స్త్రీ కి నూరుగురు పుత్రులకంటె భర్త గొప్పవాడుగా కనిపించును. తెలివిలేనిది, చెడుకులమున పుట్టినది, చెడు నడక గల స్త్రీ తన భర్తను గౌరవించదు.
సత్కులములో పుట్టిన సాధ్వీమణి తన భర్త దుష్టుడైనను, పతితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, రోగియైనను, జడస్వభావము కలిగియున్నను అతనిని విష్ణుమూర్తిని గౌరవించినట్లు గౌరవించును. ఆగ్ని, సూర్యుడు ఎంతగొప్ప తేజస్సంపన్నులైనను పతివ్రతా తేజస్సులో పదునారవవంతైన కాజాలరు, అట్లే గొప్పవైన దానములు, పుణ్య కార్యములు, సర్వ వ్రతములు, సమస్త ఉపవాసములు ఇవన్నియు భర్తృసేవలో పదునారవ వంతైనను కాజాలవు. సత్కులములో జన్మించిన పతివ్రతా శిరోమణికి పుత్రుడు గాని, తండ్రి గాని, సోదరుడు గాని, సమీప బంధువు గాని ఎవ్వరైనను తనభర్తతో సమానమైన వారు కాజాలరని పార్వతీదేవి పలికెను.
ఇత్యుక్త్వా స్వామినం దుర్గా దదర్శ పురతోభృగుం ।
శంభోః పదాబ్జం సేవంతం నిర్భయం తమువాచహ ॥
ఈవిధముగా పార్వతీదేవి భర్తతో పలికి, తనభర్తయొక్క పాదపద్మములను సేవింపుచు నిర్భయముగా నున్న భార్గవరాముని చూచి ఇట్లు పలికెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికేను.
అహోరామ మహాభాగ బ్రహ్మవంశోఽసి పండితః ।
పుత్రోఽసి జమదగ్నేశ్చ శిష్యోపై యోగినాం గురోః ॥
మాతా తే రేణుకాసాధ్వీ పద్మాంశాసత్కులోద్భవా ।
మాతామహో వైష్ణవశ్చ మాతులశ్చ తతోఽధీకః ॥
త్వంచ రేణుక భూపస్య మనువంశోద్భవస్య చ ।
దౌహిత్రోమాతులః సాధుః శూరోవిష్ణుపదాశ్రయః ॥
కస్యదోషేణ దుర్ధర్షస్త్వం నజానేఽప్యశుద్ధధీః ।
యేషాం దోషైర్జనో దుష్టస్తమతే శుద్ధమానసః ॥
అమోఘం ప్రాప్య పర్శుం చ గురుం చ కరుణానిధిం ।
పరీక్షాం క్షత్రియ కృత్వా బభూవాఽస్యసుతే పునః ॥
గురవే దక్షిణా దానముచితం చ శ్రుతౌ శ్రుతం ।
భగ్నోదంతస్తత్సుతస్య భీంది మస్తకమప్యహో ॥
గణేశ్వరం రణే జిత్వా స్థితశ్చేదావయోః పురః ।
సత్వం లబ్ధ్వాఽశిషో లోకే పూజితోఽభూర్జగత్త్రయే ॥
పర్శునామోఘ వీర్యేణ శంకరస్య వరేణ చ ।
హంతుం శక్తః సృగాలశ్చసింహం శార్దూల మాఖుభుక్ ॥
త్వద్విధం లక్షకోటిం చ పొంగుం శక్తి గణేశ్వరః ।
జితేంద్రియాణాం ప్రవరో నహి హంతీ చ మక్షికాం ॥
తేజసా కృష్ణతుల్యోఽయం కృష్ణాంశశ్చ గణేశ్వరః ।
దేవాశ్చాన్యే కృష్ణకళాః పూజాఽస్యపురతస్తతః ॥
వ్రతప్రభావతః ప్రాప్తః శంకరప్య వరేణ చ ।
శోకేనాతి కఠోరేణ జహి సంపద్వినాఽపదం ॥
ఓ భార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు. పైగా పండితుడవు. జమదగ్ని మహర్షియొక్క పుత్రుడవు. పరమ యోగియైన శంకరునకు శిష్యుడవు. ఇక నీ తల్లియగు రేణుక మహాపతివ్రత లక్ష్మీదేవి యొక్క అంశ కలది. సద్వంశములో జన్మించినది. అట్లే నీ మాతా మహుడగు రేణుకుడు విష్ణుభక్తుడు. నీ మేనమామ నీ తాత గారి కంటే ఎక్కువ విష్ణు భక్తి గల వాడు. నీవు మను వంశమునకు చెందిన రేణుక భూపతికి దౌహిత్రుడవు. నీ మేనమామ సాధు స్వభావము గలవాడు, బల పరాక్రమ వంతుడు, విష్ణుభక్తుడు కూడ. మరి నీవు ఎవరి దోషమువలన ఈ విధముగా ఐతివి. నీవు దుష్ట స్వభావము గల వాడవగుటకు కారణమేమిటో నాకు తెలియదు. నీవు దయాసముద్రుడగు గురువు వలన పరశువును పొందితివి. దానిని తొలుత క్షత్రియులపై పరీక్షించి తరువాత నీ గురుపుత్రుని పై ప్రయోగించితివి.
గురువువకు దక్షిణ సమర్పించుట తగినదని వేదములు చెప్పుచున్నవి. కాని నీవు గురుపుత్రుని దంతమును భగ్నము చేసితివి. ఇక అతని శిరస్సును త్రెంపివేయుము. నీవు మా పుత్రుడగు గణపతిని యుద్ధమున జయించి కూడ మా ముందు నిలిచితివి. అట్లే మా ఆశీస్సులను పొంది ఈ లోకములందు గౌరవమును పొందితివి. నీవు శంకరునియొక్క అమోఘమైన బలముచే, అతని వరముచే గండ్రగొడ్డలిచే గణపతిని జయించితివి. పరమేశ్వరుని అనుగ్రహమున్నచో నక్క సింహమును చంపును. అట్లే నీవు గణపతిని జయించితివి.
గణపతి నీ వంటి లక్ష కోట్ల జనమును అవలీలగా సంహరించును. జితేంద్రియులలో శ్రేష్ఠుడగు గణపతి ఈగను కూడ చంపడు. ఈ గణపతి తేజస్సులో శ్రీ కృష్ణునితో సమానుడు. అతని అంశ స్వరూపుడు. ఇతర దేవతలు శ్రీకృష్ణుని అంశాంశరూపులు.
శంకరునియొక్క ప్రభావము వలన అతని వరమువలన గణపతి పూజను ప్రజలు తొలుత చేయుదురు. అతడు పుణ్య వ్రతము యొక్క ప్రభావమువలన, శంకరుని వరము వలన జన్మించెను.
ఇత్యుక్త్యా పార్వతీ రోషాత్తం రామం పంతుముద్యతా ।
రామః సస్మార తం కృష్ణం ప్రణమ్య మనసా గురుం ॥
ఏతస్మిన్నంతరే దుర్గా దదర్శ పురతో ద్విజం ।
అతీవ వామనం బాలం సూర్యకోటి సమప్రభం ॥
శుక్లదంతం శుక్లవాసం శుక్లయజ్ఞోపవీతీనం ।
దండినం ఛత్రిణం చైవ సుప్రభం తిలకోజ్వలం ॥
దధతం తులసీమాలాం సస్మితం సుమనోహారం ।
రత్నకేయూరవలయం రత్నమాలావిభూషితం ॥
రతనూపురపాదం చ సద్రత్న మకుటోజ్వలం ।
రత్నకుండలయుగ్మాఢ్య గండస్థలవీరాజీతం ॥
స్థిరముద్రం దర్శయంతం భక్తవామకరేణ చ ।
దక్షిణేఽభయముద్రాం చ భక్తీశం భక్తవత్సలం ॥
బాలికాబాలకగణైర్నాగరైః సస్మితైర్యుతం ।
కైలాసవాసిభిః సర్వై రావృద్దైరీక్షితం ముదా ॥
ఈ విధముగా పార్వతీ దేవి పలికి భార్గవ రాముని చంపబోయెను. అప్పుడు భార్గవ రాముడు శ్రీకృష్ణునకు నమస్కరించి తన గురువైన శంకరుని కూడ మనస్సులో స్మరించుకొనెను.
ఆ సమయమున ఆక్కడకు ఒక బ్రాహ్మణ బాలకుడు వచ్చెను. అతడు చాల పొట్టిగా నుండెను. కోటి సూర్యులతో సమానమైన కాంతి గల ఆ బ్రాహ్మణ కుమారుని దంతములు, వస్త్రములు, యజ్ఞోపవీతము అన్నియు తెల్లగా ఉన్నవి. అతడు దండమును, ఛత్రమును, ఉజ్వలమైన తిలకమును ధరించెను. అతని మెడలో తులసి మాలలు రత్న భూషణములున్నవి. అతని చేతులకు రత్న కేయూరములు కలవు. పాదములకు రత్న నూపురములు, శిరస్సున రత్న కిరీటము, చెవులకు రత్న కుండలములు కలవు. అతడు ఎడమ చేతితో స్థిరముద్రను, కుడి చేత అభయముద్రను ధరించి బాలురు, బాలికలు నవ్వుచు తన వెంటరాగా అచ్చటకు వచ్చెను. అప్పుడతనిని కైలాసముననున్న జనులందరు సంతోషముతో చూచిరి.
తం దృష్ట్వా సంభ్రమాచ్ఛంభుః సభృత్యః సహపుత్రకః ।
మూర్ధ్నా భక్త్యాప్రాణమచ్చ దుర్గా స్రా దండవద్భువీ ॥
ఆశిషం ప్రదదౌ బాలః సర్వేభ్యో వాంఛితప్రదాం ।
తం దృష్ట్యా బాలకాస్సర్వే మహాశ్చర్యం యధోభియా ॥
దత్వా తస్మై శివోభక్త్యా తూపచారాస్తు షోడశ ।
పూజాం చకార శ్రుత్యుక్తాం పరిపూర్ణతమస్య చ ॥
తుష్టావ కాణ్వశాఖోకస్తోత్రేణ నతకంధరః ।
పులకాంకిత సర్వాంగో భగవంతం సనాతనం ॥
రత్నసింహాసనస్థం చ ప్రావోచచ్ఛంకరః స్వయం ।
అతీవ తేజసాఽత్యంతం ప్రచ్ఛన్నాకృతమేవ చ ॥
ఆ బ్రాహ్మణ కుమారుని శంకరుడు చూచి తన పుత్రులు పరివారము, దుర్గాదేవితో కలిసి అతనికి సాష్టాంగ దండ ప్రణామములొనర్చెను.
అప్పుడా బ్రాహ్మణ కుమారుడు అందరకు వారివారి కోరికలు తీరునట్లు ఆశీర్వదించెను. ఆ కైలాస నగరముననున్న బాలకులు సైతము అతనిని చూచి చాలా ఆశ్చర్యమును పొందిరి.
శివుడా బ్రాహ్మణ బాలకుని షోడశోపచారములతో వేదోక్త ప్రకారముగా పూజించెను. అట్లే తన తలను వంచుకొని శుక్ల యజుర్వేదమునకు సంబంధించిన కాణ్వ శాఖయందు చెప్పబడిన స్తోత్రముచే ఆ బాలకుని స్తుతించెను. ఇంకను అధికమైన తేజస్సుతో నిండిన ఆ బాలుని రత్న సింహాసనమున కూర్చుండబెట్టి వినయ విధేయతలతో నిట్లు పలికెను.
శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను –
ఆత్మారామేషు కుశల ప్రశ్నోఽతీవ విడంబనం ।
తే శశ్వత్కుశలాధారాః కుశలాః కుశలప్రదాః ॥
అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం ।
ప్రాప్తస్వమతిథిర్ర్బహ్మన్ కృష్ణసేవాఫలోదయాత్ ॥
పరిపూర్ణతమః కృష్ణో లోకనీస్తారహేతవే ।
పుణ్యక్షేత్రే హి కళయా భారతే చ కృపానిధీః ॥
అతిథిః పూజితో యేన పూజితాః సర్వదేవతాః ।
అతిథర్యస్య సంతుష్ట స్తస్య తుష్టా హరిః స్వయం ॥
స్నానేన సర్వతీర్ధేషు సర్వ దానేన యత్ఫలం ।
సర్వవ్రతాపవాసేన సర్వయజ్ఞేషు దీక్షయా ॥
సర్వైస్తపోభిర్వివిధైర్నిత్యనైమిత్తికాదిభిః ।
త దేవాతిథిసేవాయాః కళాం నార్హంతి షోడశీం ॥
అతిధిర్యస్య భగ్నానో యాతీ రుష్టశ్చ మందిరాత్ ।
కోటిజన్మార్జితం పుణ్యం తస్య నశ్యతి నిశ్చితం ॥
స్త్రీగోఘ్నశ్చ కృతఘ్నశ్చ బ్రహ్మఘ్నో గురుతల్పగః ।
పితృమాతృ గురూణాం చ నిందకో నరఘాతకః ॥
సంధ్యాహీనః స్వఘాతీ చ సత్యఘ్నో హరిసిందకః ।
బ్రహ్మస్వస్థాప్య హారీ చ మిథ్యా సాక్ష్యప్రదాయకః ॥
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ వృషవాహశ్చ సూపకృత్ ।
శవదాహీ గ్రామయాజీ బ్రాహ్మణో వృషలీపతిః ॥
శూద్రశ్రాద్ధాన్నభోజీ చ శూద్రశ్రాద్ధేషు భోజకః ।
కన్యావిక్రయకారీ చ శ్రీహరేరామవిక్రయీ ॥
లాక్షో మాంసపాలనాం చ లవణస్య తిలస్య చ ।
విక్రేతా బ్రాహ్మణశ్పైవ తురగానాం గవాం తథా ॥
ఏకాదశీ కృష్ణసేవా హీనో విప్రశ్చ భారతే ।
ఏతే మహాపాతకినస్త్రిషు లోకేషు నిందితా ॥
కాలసూత్రే చ నరకే పతంతి బ్రహ్మణాం శతం ।
ఏతేభ్యోఽప్యధికః సోఽపి యశ్చాతిథి పరాజ్ముఖః ॥
ఆత్మారాములగు మీ వంటి వారిని క్షేమమడుగుట తెలివి తక్కువ అనిపించును. మీరు ఇతరులకు క్షేమమును కలిగింతురు క్షేమము మిమ్ములను ఆధారము చేసికొని యుండును.
నా ఇంటికి మీరు వచ్చినందువలన నా జీవితము సఫలమైనది. నేను చేసిన శ్రీకృష్ణసేవకు ఫలితముగా మీరు నాకు అతిథగా వచ్చితిరి, సమస్త పూర్ణుడగు శ్రీకృష్ణుడు దయా సముద్రుడు గావున ప్రపంచమును ఉద్దరించుటకై ఈ భారత క్షేత్రమున తనయొక్క అంశతో పుట్టుచున్నాడు. అందువలన మీరు శ్రీకృష్ణుని అంశ కలిగినవారు.
అతిథిని పూజించినచో సమస్త దేవతలను పూజించినట్లగును. అతిథి ఎవరి ఇంటికి వచ్చి సంతృప్తితో పోవునో ఆ యజమానిని గురించి శ్రీహరి సంతోషపడును. సమస్త పుణ్య తీర్థములందు స్నానము చేసినచో, సమస్త దానములిచ్చినచో, సమస్త వ్రతములందు ఉపవాసమాచరించినచో సమస్త యజ్ఞములు చేసినచో, సమస్త తపస్సులు ఆచరించినచో, ఇంకను నిత్యనైమిత్తికములగు, సమస్త పుణ్యకార్యములు చేసినచో కలుగు పుణ్యఫలము అతిథి సేవలో పదునారవ వంతెననను కాజాలవు. అతిధి ఇంటికి వచ్చి భగ్నాతుడై, కోపముతో ఎవరి ఇంటినుండి తిరిగి పోవునో ఆ ఇంటి యజమాని కోటి జన్మల నుండి చేసిన పుణ్యమంతయు నశించును.
స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను చంపినవాడు, మేలును మరచినవాడు, గురు భార్యతో సంగమించువాడు, తలిదండ్రులను, గురువులను నిందించువాడు, మానవ హింస సేయువాడు, సంధ్యా వందన మాచరింపనివాడు, శ్రీహరిని నిందించువాడు, బ్రాహ్మణుని ధనమును, అగ్రహారములను అపహరించువాడు, కూట సాక్ష్యములను చెప్పువాడు, మిత్రులకు ద్రోహము చేయువాడు, వృషభముపై నెక్కి తిరుగువాడు, వంటలు చేసి బ్రతుకువాడు, శవములను దహించువాడు, పురోహితుడు, శూద్ర స్త్రీని ఉంచుకొన్న బ్రాహ్మణుడు, శూద్రుల ఇంట శ్రాద్దాన్నమును భుజించువాడు, కన్యలనమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరియొక్క పేరును చెప్పుకొని బ్రతుకువాడు, లాక్షారసమును, మాంసమును, నూవులను, గుఱ్ఱములను, ఆవులను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణుడు, ఏకాదశీ తిథినాడు శ్రీకృష్ణుని పూజింపని బ్రాహ్మణుడు వీరందరు మహా పాతకులుగా పేర్కొనబడుచున్నారు. వీరందరు కాల సూత్ర నరకమున శత బ్రహ్మలు గతించు వరకుందురు.
అతిథిని అవమానమొనర్చినవాడు వీరందరికన్నను నీచుడు అని శంకరుడు పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో ఇట్లనెను –
శంకరస్య వచః శ్రుత్వా సంతుష్ట శ్రీహరిః స్వయం ।
మేఘగంభీరయా పోచా తమువాచ జగత్పతిః ॥
శంకరుని పలుకులను విన్న బ్రాహ్మణ రూపధారి, జగత్పతి యగు శ్రీమహావిష్ణువు మేఘగర్జనవలె గంభీరముగా శంకరునితో ఇట్లు పలికెను.
శ్వేత ద్వీపాదగతోఽహం జ్ఞాత్వా కోలాహలం చ వః ।
ఆస్య రామస్య రక్షార్థం కృష్ణభక్తస్య సాంప్రతం ॥
నైతేషాం కృష్ణభక్తానామశుభం విద్యతే క్వచిత్ ।
రక్షామీ తాంశ్చక్రహస్తో గురుమన్యం వినా శివ ॥
నాహం పాతా గురౌ రుష్టే బలవద్గురుహేళనం ।
తత్పరః పాతకీ నాస్తి సేవానో గురోశ్చయః ॥
మాన్యః పూజ్యశ్చ సర్వేభ్యః సర్వేషాం జనకో భవేత్ ।
అహో యస్య ప్రసాదేన సర్వానశ్యతి మానవః ॥
జనకో జన్మదానాచ్చ పాలనాచ్చ పీతానృణాం ।
తతో విస్తార కారణాత్కళయా సప్రజాపతిః ॥
పితుః శతగుణం మాలో పోషణార్గర్బధారణాత్ ।
వంద్యాపూజ్యో చ మాన్యా చ ప్రసూస్స్యాద్వై వసుంధరా ॥
మాతుః శతగుణం వంద్య పూజ్యోమాన్యోఽన్న దాయకః ।
యద్వివా నశ్వరో దేహో విష్ణుశ్చ కళయాన్నదః ॥
అన్నదాతుః శతగుణోఽబీష్టదేవః పరః స్మతః ।
గురుస్తస్మాచ్చతగుణో విద్యామంత్రప్రదాయకః ॥
అజ్ఞాన తిమిరాచ్ఛన్నం జ్ఞాన దీపేన చక్షుషా ।
యః సర్వార్థం దర్శయతి తత్పరో నైవ బాంధవః ॥
గురుదత్తైన మంత్రేణ తప సేష్టసుఖం లభేత్ ।
పర్వజ్ఞత్వం సర్వసిద్ధిం తత్పరో నైవ బాంధవః ॥
ఇచ్చట జరుగుచున్న కోలాహలమును విని శ్రీ కృష్ణ భక్తుడగు ఈ భార్గవరాముని రక్షించుటకై శ్వేత ద్వీపము నుండి ఇచ్చటకు వచ్చితిని. కృష్ణభక్తులకు అశుభము ఎన్నడును జరుగదు. గురువు యొక్క అనుగ్రహములేని వారిని తప్ప కృష్ణ భక్తులందరిని చేతి యందు చక్రమును ధరించి నేను రక్షింతును. గురువు కోపించినచో వారిని నేనెప్పుడు రక్షించను. గురువును అవమానించుట ఎప్పుడును తగదు. గురువు యొక్క సేవను చేయని వాని కంటే పాపాత్ముడెక్కడను ఉండడు.
అందరి కంటేను జనకుడు గౌరవించ తగినవాడు. జనకునియొక్క అనుగ్రహము వలననే మానపు డీ ప్రపంచమును చూడగలుగుచున్నాడు. జన్మ నిచ్చినందు వలన అతనిని జనకుడని, పెంచి పోషించి నందువలన పితయని పిలుతురు అంత కంటెను గొప్ప కారణము వలన అతడు ప్రజాపతి యగుచున్నాడు.
గర్భమున ధరించి, కని, పెంచినందువలన తల్లి దండ్రికంటే ఎక్కువగా మాన్యురాలగును. అన్నదాత తల్లి కంటే నూరురెట్లు ఎక్కువగా గౌరవింపతగినవాడు. అన్నము పెట్టువాడు లేనిచో ఈ శరీరము నష్టమగును. అందువలన అన్న దానము చేయువాడు విష్ణ్వాంశ కల వాడగును. అన్న దాత కంటే ఇష్టదైవము నూరురెట్లు అధికముగా పూజింపతగినది. విద్య లేక మంత్రోపదేశము చేయు గురువు ఇష్ట దేవత కంటే నూరురెట్లు మిన్న అగుచున్నాడు.
అజ్ఞానమను చీకటి యావరించియున్న ఈ విశ్వమును జ్ఞానమును దీప సహాయముతో సమస్తమును చూపింప గలుగు గురువును మించిన బంధువు ఎవ్వరూ కాజాలరు. గురువు ఉపదేశించిన మంత్రము వలన తపస్సు వలన మానవుడు సమస్త సుఖములను పొందగలడు. అట్లే అతడు సమస్త సిద్ధులు పడసి సర్వజ్ఞుడు కాగలడు.
సర్వం జయతి సర్వత్ర విద్యయా గురుదత్తయా ।
తస్మాత్పూజ్యో హి జగతి కోవాబందుస్తతోఽధికః ॥
విద్యాంధో వా ధనాంధో వా యోమూడో న భజేద్గురుం ।
బ్రహ్మహత్యాదిభిః పాసై స లిప్తో నాత్ర సంశయః ॥
దరిద్రం పతీతం క్షుద్రం నరబుద్ద్యా చరేద్దురుం ।
తీర్థస్నాతోఽపి న శుచిర్నాధికారీ చ కర్మసు ॥
పితరం మాతరం భార్యాం గురుపత్నీం గురుం పరం ।
యోనపుష్ణాతి కావట్యాత్స మహాపాతకీ శివ ॥
గురుర్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః ।
గురురేవ పరంబ్రహ్మ గురుర్భాస్కర రూపకః ॥
గురుశ్చంద్రస్తథేంద్రశ్చ వాయుశ్చ వరుణోఽనలః ।
సర్వరూపో హి భగవానరమాత్మా స్వయం గురుః ॥
నాస్తి వేదాత్పరం శాస్త్రం న హి కృష్ణాత్పరః సురః ।
నాస్త్రి గంగాసమం తీర్థం న పుష్పం తులసీ దళాత్ ॥
నాస్తి క్షమావతీ భూమేః పుత్రాన్నాస్త్యపరః ప్రియః ।
న చ దైవాత్సరాశక్తిర్నైకాదశ్యాః పరం వ్రతం ॥
శాలగ్రామాత్పరో యంత్రో న క్షేత్రం భారతాత్పరం ।
పరం పుణ్యస్థలానాం చ పుణ్యం బృందావనం యథా ॥
మోక్షదానాం యథా కాశీ వైష్ణవానాం యథా శివః ।
న పార్వత్యాః పరాసాధ్వీ న గణేశాత్పరో వశీ ॥
న చ విద్యా సమోబంధుర్నాస్తి కశ్చిద్గురోః పరః ।
విద్యాదాతుః పుత్రదారౌ తత్సమౌ నాత్ర సంశయః ॥
గురుస్త్రియాం చ పుత్రే చాప్యభవద్రామ హేళనం ।
పరం సమ్మార్జనం కర్తుమాగతోఽహం తవాలయం ॥
గురువు నేర్పిన విద్యవలన మానవుడు సర్వత్ర విజయము పొందును. అందువలన గురువు అందరికంటెను గౌరవింపదగినవాడు. విద్యా మదముతోనైన ధన మదముతోనైన గురువును గౌరవింపని వానికి బ్రహ్మ హత్యాది పాపములన్నియు కలుగును. గురువు దరిద్రుడైనను, పతితుడైనను, క్షుద్రుడైనను అతనియందు సామాన్య బుద్ధి యున్నచో ఆ శిష్యుడు ఎన్నో పుణ్య తీర్థములందు స్నానమాచరించినను అతడు పవిత్రుడు కాజాలడు. అట్లే అతడు పుణ్యకర్మలు చేయుటకు అధికారి కాజాలడు. తల్లిని, తండ్రిని, భార్యను, గురుభార్యను, గురువును, కపటబుద్దిచే పోషించని మానవుడు మహా పాతకి యగును.
గురువు పరబ్రహ్మరూపుడు, అతడే విష్ణురూపుడు, మహేశ్వర స్వరూపుడు, చతుర్ముఖ బ్రహ్మరూపుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని రూపుడు, ఈ విధముగా గురువు సర్వరూపుడైన పరమాత్మయగుచున్నాడు.
వేదమును మించిన శాస్త్రము, కృష్ణుని మించిన దేవుడు, గంగను మించిన తీర్థము, తులసీ దళము వంటి పుష్పము, భూమి కంటే ఓర్పు కల వ్యక్తి, పుత్రుని కంటె ప్రియమైనవాడు, దైవమును మించిన శక్తి, ఏకాదశీ వ్రతమును మించిన వ్రతము, సాలగ్రామము వంటి యంత్రము, భారతము వంటి క్షేత్రము, బృందావనము వంటి పుణ్యస్థలము, కాశీ వంటి మోక్షము నొసగు క్షేత్రము, శివుని వంటి విష్ణుభక్తుడు, పార్వతీ దేవి వంటి పతివ్రత ఈ లోకమునందు కనిపించదు. అట్లే విద్యతో సమానమైన బంధువు, గురువును మించినవాడు ఎక్కడను లేడు.
విద్యనొసగిన గురువుతో సమానముగా అతని భార్యను, పుత్రుని గౌరవింపవలెను.
కానీ పరశురాముడు గురు భార్యయగు పార్వతీని, అతని పుత్రుడగు గణపతిని అవమానించెను. అందువలన నా భక్తుని దోషమును నివారించుటకు నీ ఇంటికి వచ్చితినని బ్రాహ్మణ బాలక వేషమును ధరించిన శ్రీ మహా విష్ణువు పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో ఇట్లు పలికెను –
ఇత్యేవముక్త్యా శంభుం చ దుర్గాం సంబోధ్య నారద ।
ఉవాచ భగవాంస్తత్ర సత్యసారం పరం వచః ॥
ఈ విధముగా శ్రీమహావిష్ణువు శంకరునితో పలికి పార్వతీదేవితో సత్యసారమైన మాటలనిట్లు పలికెను.
శ్రీవిష్ణురువాచ- శ్రీమహావిష్ణువిట్లు పలికెను –
శ్రుణుదేవి ప్రవక్ష్యామి మదీయం వచనం శుభం ।
నీతీయుక్తం వేదసారం పరిణామసుఖావహం ॥
యథా తే గజవక్త్రశ్చ కార్తికేయశ్చ పార్వతి ।
తథా పరశురామశ్చ భార్గవో నాత్ర సంశయః ॥
నాస్యేషు స్నేహభేదశ్చ తవ వా శంకరస్య చ ।
విచారపర్వం సర్వజ్ఞే కురు మాతర్యథోచితం ॥
పుత్రేణ సార్థం పుత్రస్య వివాదో దైవదోషతః ।
దైవం హంతుం కోహి శక్తో దైవం చ బలవత్తరం ॥
పుత్రాభిధానం వేదేషు పశ్య వత్సే వరాననే ।
ఏకదంత ఇతిఖ్యాతం సర్వదేవ నమస్కృతం ॥
పుత్రనామాష్టకం స్తోత్రం సామవేదోక్తమీశ్వరి ।
శ్రుణుష్వావహితం మాతః సర్వవిఘ్నహరం పరం ॥
ఓ పార్వతీదేవి వేదసారము, నీతియుక్తమైన నా మాటలను శ్రద్ధగా వినుము.
ఓ పార్వతి! నీకు గణపతి కుమారస్వామి ఎటువంటివారో శంకరుని శిష్యుడైన భార్గవరాముడు కూడ అటువంటివాడే. నీకు శంకరునకు ఏ విషయమున భేదమేమియు కనిపించదు. అందువలన సర్వజ్ఞురాలవైన నీవు ఈ విషయమును యథోచితముగ విచారించి పనిచేయుము.
ఒకపుత్రునితో మరి యొక పుత్రుడు వివాదమునకు దిగుట దైవ దోషము వలన సంభవించును. దైవమును ఎవ్వరు అతిక్రమింపలేరు. అది మిక్కిలి బలీయమైనది.
ఓ పార్వతీ! వేదములందు నీ పుత్రుని నామము ఏకదంతుడని ప్రసిద్ధిచెందినది. ఈ పేరును సమస్త దేవతలు గౌరవింతురు.
ఓ తల్లి! సామవేదమున గణపతి యొక్క నామాష్టకము కలదు. అది సమస్త విఘ్నములను హరించును. కాన దానిని శ్రద్ధగా వినుము అని శ్రీ మహావిష్ణువు పలికెను.
గణేశ మేకదంతం చ హేరంబం విఘ్ననాయకం ।
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ॥
అష్టాఖ్యార్థం చ పుత్రస్య శ్రుణుమాతర్హరప్రియే ।
స్తోత్రాణాం సారభూతం చ సర్వవిఘ్నహరం పరం ॥
జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః ।
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహం ॥
ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః ।
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహం ॥
దీనార్థవాచకో హేశ్చ రంబః పాలక వాచకః ।
పాలకం దీనలోకానాం హేరంబం ప్రణమామ్యహం ॥
వీపత్తి వాచకో విఘ్నో నాయకః ఖండనార్థకః ।
విపత్ఖండనకారం తం ప్రణమే విఘ్ననాయకం ॥
విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం ।
పిత్రా దత్తైశ్చ వివిధైర్సందే లంబోదరం చ తం ॥
శూర్పకారౌ చ యత్కర్ణౌ వీఘ్నహరణకారకౌ ।
సంపద్ధౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహం ॥
విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్నిపుష్పకం ।
తద్గజేంద్రముఖం కాంతం గజవక్త్రం నమామ్యహం ॥
గుహస్యాగ్రే చ జాతోఽయమావీర్బూతో హరాలయే ।
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్ర పూజితం ॥
గణేశుడు, ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, గజవక్త్రుడు, గుహాగ్రజుడు అనునవి గణపతి యొక్క అష్ట నామములు.
శంకరుని ప్రియురాలవగు ఓ తల్లి! నీ పుత్రుని అష్టనామముల అర్థమును కూడ వినుము. ఈ నామాష్టకము స్తోత్రములన్నిటిలోను సారభూతమైనది. సమస్త విఘ్నములను పోగొట్టునది.
“గ” శబ్దము జ్ఞానార్థమును సూచించును. “ణ” అను శబ్దమునకు ముక్తియనునది అర్థము. ఈ రెండింటికి ఈశ్వరుడైన పరబ్రహ్మ కావున ఆతనికి గణేశుడను పేరు కలిగినది.
“ఏక” అను శబ్దమునకు ప్రధానము అను అర్థము కలదు. “దంత” శబ్దమునకు బలమను అర్థము కలదు. అందరి కన్నను బలము ప్రధానముగా కలవాడు కావున అతనిని ఏకదంతుడందురు.
“హే” అనునది దీనార్థమును తెలుపును, “రంబ” అను పదమునకు పాలకుడను అర్థము కలదు. దీనజనులను రక్షించువాడు కావున అతడు హేరంబుడయ్యెను.
“విఘ్న” అను శబ్దమునకు ఆపదలను అర్థము కలదు. “నాయక” శబ్దము ఖండనమను అర్థమున కలదు. ఆపదలను ఖండించువాడు గావున అతడు విఘ్ననాయకుడయ్యెను.
విష్ణుమూర్తి, మరియు తండ్రియగు శంకరుడు పెట్టిన వివిధములైన ఖాద్యములను తిని నందువలన అతని ఉదరము వేలాడుచుండెను. అందువలన ఆతనిని లంబోదరుడని పలికిరి.
గణపతి యొక్క చెవులు చేటలవ లెనున్నవి. అవి విఘ్నములనన్నిటిని పోగొట్టును, సంపదలను కలిగించును. జ్ఞానరూపమైనవి. అటువంటి కర్ణములు కలవాడు కావున అతడు శూర్పకర్ణుడయ్యెను.
విష్ణు ప్రసాద రూపమైన పారిజాత పుష్పమును దుర్వాసమహర్షి దేవేంద్రునకివ్వగా ఆ పుష్పమునతడు ఏ గజము యొక్క తలపై ఉంచెనో అట్టి గజముఖము కలవాడు కావున అతడు గజవక్త్రుడయ్యెను.
ఈ గణపతి గుహునికి ముందు జన్మించెను. అందు వలననే సమస్త దేవతలయందు అగ్ర పూజ నందుకొను గణపతిని గుహాగ్రజుడని పిలుతురు.
ఏతన్నామాష్టకం దుర్గే నానాశక్తియుతం పరం ।
ఏతనామాష్టకం స్తోత్రం నానార్ద సహితం శుభం ॥
త్రి సంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ ।
తతో విఘ్నూః పలాయంతే వైనతేయాద్యథోరగాః ॥
గణేశ్వరప్రసాదేన మహాజ్ఞానీ భవేద్ధ్రువం ।
పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థి కుశలాం స్త్రీయం ॥
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేధ్రువం ।
పుత్రస్తే పశ్య వేదే చ తథా కోపం చనో కురు ॥
ఓ పార్వతీ! గణపతియొక్క నామాష్టకము నానాశక్తి సమన్వితమైనది. అట్లే అనేకార్థములు కలది.
దీనిని మూడు పూటలు ప్రతిదినము చదివినచో అతడు ఎల్లప్పుడు సుఖము కలిగియుండును. అట్లే అంతట జయమును పొందును. అదే విధముగా గరుత్మంతుని చూచిన సర్పములు పరుగెత్తిపోయినట్లు అతనిని చూచినచో విఘ్నములన్నీయు పరుగెత్తిపోవును. గణనాథుని అనుగ్రహమువలన అతడు మహా జ్ఞాని యగును. ఈ నామాష్టకమును పుత్రులు లేనివాడు శ్రద్దగా చదివినచో పుత్రులు కలుగుదురు. వివాహమును ఆశించువానికి చక్కని భార్య లభించును. మహాజడుడుగా ఉండువాడు గొప్ప కవియగును.
ఓ పార్వతీదేవీ! భార్గవరాముడు కూడ నీకు పుత్రుని వంటి వాడే. అందువలన అతనిపై కోప పడకుముని శ్రీ మహా విష్ణువు కోరెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే గణేశస్తోత్ర కథనం నామ చతుశ్చత్వారింశత్రమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన గణేశ స్తోత్రము గల నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 44 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Illustrating the practical power of Lord Gaṇeśa's worship in human history, Śrī Sūta Gosvāmī narrated the story of King Anashva, who had fallen into extreme adversity, loss of kingdom, and severe physical suffering due to past karmic debts. Guided by a compassionate sage, the king received initiation into the secret worship and Mantra of Lord Gaṇeśa, observing strict fasting and devotion on the auspicious Chaturthī day. Through his unwavering devotion to Lord Gaṇeśa, King Anashva was completely cleansed of his past sins, regained his royal kingdom, enjoyed long prosperity, and ultimately attained spiritual liberation, demonstrating that Gaṇeśa's grace transforms tragedy into triumph.