శౌనక ఉవాచ - శానకమహర్షి ఇట్లు పలికెను-
నారాయణవచః శ్రుత్వా పారదో హృష్టమానసః ।
కిం పప్రచ్ఛ పునః సాధో తన్మేబ్రూహి తపోధన॥
ఓ సౌతి మహర్షి నారాయణుని మాటలు విన్న నారదముని సంతోషముతో ఏమడిగినో వివరింపుమని అడిగేను.
సూత ఉవాచ - సూతమహర్షి ఇట్లు పలికెను-
నారాయణ వచః శ్రుత్వా నారదో హృష్టమానసః ।
ప్రతారంభ విధానం చ సంప్రష్టుముపచక్రమే ॥
నారాయణముని చెప్పిన మాటలు విని నారదుడు సంతోషపడి పుణ్యకవ్రతమును ఎట్లు ఆరంభము చేయవలెనో తెలుపుమనీ నారాయణుని ఆడిగెను.
నారద ఉవాచ - నారదు డిట్లు పలికెను-
కృతం కేన ప్రకారేణ వ్రతమేతచ్ఛుభావహం।
తన్మే బ్రూహి మునిశ్రేష్ఠ పార్వత్యా భర్తురాజ్ఞయా ॥
లలాభ జన్మ భూతేశః కృతే సువ్రతయా ప్రతే ।
బ్రహ్మన్ కేన ప్రకారేణ తన్నః శంసితుమర్హసి ॥
ఓమహర్షీ! పార్వతీదేవి తనభర్తయొక్క ఆజ్ఞననుసరించి శుభములనిచ్చు నీ పుణ్యకవ్రతము నెట్లు చేసినో నాకు వివరింపుము. పార్వతీదేవి ఆవ్రతము నొనరించినందువలన పరమేశ్వరుడేవిధముగా ఆమెకు తన అంశచే పుత్రుడుగా జన్మనెత్తానో దానినికూడ వివరింపుడని ఆడిగెను.
నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారదునితోననెను-
కథయిత్వా కథాం దివ్యాం విధానం చే వ్రతస్య చ।
స్వయం విధాతా తపసాం జగామ తపసీ శివః॥
హరేరారాధనే వ్యగ్రీ మూర్తిభేదధరో హరః ।
హరిభావన శీలశ్చ హరిద్యాన పరాయణః ॥
పరమానందపూర్ణశ్చ జ్ఞానానందః సనాతనః ।
దివానీశం న జానాతి హరిమంత్రం బహిఃస్మరన్ ॥
శంకరుడు పార్వతీదేవికి పుణ్యకవ్రతవిధానము నంతయు ఎరిగించి, తాను స్వయముగా తపఃఫలితము నిచ్చువాడైనను తపస్సు చేయుటకై పోయెను. శ్రీహరి యొక్క రూపభేదమే ఐన శివుడు శ్రీహరిని మనసున ధ్యానించుచు హరిని ఆరాధించుటకు పూనుకొనెను. జ్ఞానానందుడు, సనాతనుడు, పరమానందపూర్ణుడగు శంకరుడు శ్రీహరిమంత్రమును జపించుచు రాత్రి పగలు అనువాటినన్నిటిని మరచిపోయెను.
ప్రహృష్టమనసా దేవీ పార్వతి భర్తురాజ్ఞయా ।
కింకరాన్ ప్రేరయామాస విప్రాంశ్చ వ్రత హేతవే ॥
ఆనీయ సర్వద్రవ్యాణి వ్రతే యోగ్యాని యాని చ ।
వ్రతం కర్తుం సమారభే శుభదా సా శుభేక్షణా॥
సనత్కుమారో భగవానాజగామ విధేః సుతః ।
మూర్తిమాంస్తేజసాం రాశిః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా ॥
బ్రహ్మా జగామ హృష్ణశ్చ బ్రహ్మలోకాత్సభార్యకః ।
అతీత్రస్తో హి భగవానాజగామ మహేశ్వరః ॥
విష్ణుః క్షీరోదశాయీ చ సలక్ష్మీకశ్చతుర్భుజః ।
భగవాన్ జగతాం పాలో శాస్త్రి భర్త సపార్షదః॥
వనమాలాధరః శ్యామో భూషితో రత్నభూషణైః ।
తథా సంభృతసంబారో రత్నయానేన నారద ॥
పార్వతీదేవి తన భర్తయొక్క ఆజ్ఞననుసరించి వ్రతముకొరకు దాసజనమును, బ్రాహ్మణులను నియోగించెను, ఆ దేవి ఆ వ్రతమునకు కావలసిన సమస్త పదార్థములను తెప్పించి పుణ్యకవ్రతము చేయుటకు మొదలిడెను.
అచ్చటికి బ్రహ్మతేజో విరాజితుడు, తేజఃపుంజము మూర్తీభవించినట్లున్న బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుడు వచ్చెను. బ్రహ్మదేవు డచ్చటికి తన భార్యయగు సావిత్రీదేవితో వచ్చెను. మహేశ్వరుడుకూడ అచ్చటకు తొందరపడుచు వచ్చెను. ఆట్లే చతుర్భుజములు కలవాడు, ముల్లోకములను శాసించువాడు, రక్షించువాడు, వనమాలను ధరించినవాడు, రత్నాలంకార శోభితుడగు శ్రీమహావిష్ణువు తన భార్యయగు లక్ష్మీదేవితో, తన అనుచరవర్గముతో కలిసి రత్నములు పొదిగిన రథముపై ఆచ్చటకు వచ్చెను.
సనకశ్చ సనందశ్చ కపిలశ్చ సనాతనః ।
అసురశ్చ క్రతుర్హంసో, వోడు ఏంచశిఖ్కోరుణిః ॥
అగస్త్యశ్చ ప్రచేతాశ్చ దుర్వాస్చ్యావనస్తథా ।
మరీచిః కశ్యపః కళ్వో జరత్కార్చు గౌతమః ॥
యతిశ్చ సుమత్సిన వసిష్ఠశ్చ సహానుగః ।
పులహశ్చ పులస్త్యవ్యట్రశ్చ భృగురాంగిరాః ॥
బృహస్పతిరుతథ్యశ్చ సంవర్త సౌభరిస్తథా ।
జాబాలిర్జమదగ్నిశ్చ టైగీషవ్యశ్చ దేవల॥
గోకాముఖో వక్రరథః పారిభద్రః పరాశరః ।
విశ్వామిత్రో వామదేవ ఋష్యశృంగో విభాండకః॥
మార్కండేయో మృకండుశ్చ పుష్కరో లోమశస్తథా।
కాత్సో వత్సలీ దక్షశ్చ బాల్నారఘుమర్షణః॥
కాత్యాయనః కణాదశ్చ పాణినిః శాకటాయనః ।
శంకురాపిశలిశ్చైవ శాకల్యః శంఖ ఏవ చ ॥
ఏతే చాన్యే బహవః సశిష్యా మునయో మునే ।
ఆవాం చ ధర్మపుత్రా చ నరనారాయణో సమౌ॥
దిక్పాలాశ్చ తథా దేవా యక్షగంధర్వ కిన్నరాః ।
ఆబగ్ముః పర్వతాః సర్వే సగణాః పార్వతీవ్రతే॥
హిమాలయః శైలరాజ సాపత్యశ్చ సభార్యకః ।
సగణః సానుగశ్చైవ రత్నభూషణభూషితః ॥
ఆవ్రతమునకు సనక, సనంద, సనాతనులు, కపిలమహర్షి అసురి, క్రతువు, హంసుడు, వోడుడు, పంచశిఖముని, అరుణిమహర్షి అగస్త్యుడు, ప్రచేతసుడు, దుర్వాసమునీ, చ్యవనమహర్షి మరీచి, కశ్యపుడు, కణ్వుడు, జరత్కారు, గౌతముడు, యతీ, సుమతీ, వసిష్ఠముని, పులహుడు, పులస్త్యుడు, అత్రి, భృగువు, ఆంగిరసుడు, బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తుడు. సౌభరి, దొబాలి, జమదగ్ని, జైగీషవ్యుడు, దేవలుడు, గోకాముఖుడు, వక్రరథుడు, పారిభద్రుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండకుడు, మార్కండేయుడు, మృకండుముని, పుష్కరుడు, లోమశుడు, కౌత్సుడు, వళ్పుడు, దక్షుడు, బాల్నా, అఘమర్షణుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, శాకటాయనుడు, శంకుముని, ఆపిశీలి. శాకల్యుడు, శంఖుడు, ధర్మునిపుత్రులమగు మేము (నరనారాయణులు) ఇంకను అనేకమునులు తమ శిష్యులతో అచ్చటికేలెంచిరి.
అట్లే అష్టదిక్పాలురు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మొదలగువారందరు తమ తమ గణములతో అచటికి వచ్చిరి. అదేవిధముగా అన్నీ పర్వతములు శైలరాజగు హిమాలయపర్వతము తన భార్యాపుత్రులలో, తన అనుచరగణముతో అచ్చటికి వచ్చెను.
తథా సంభృత సంభారో నానాద్రవ్యసమన్వితః ।
మణిమాణిక్య రత్నాని వ్రతే యోగ్యాని యాని చ ॥
నానాప్రకారవస్తని జగత్యాం దుర్లభాని చ।
లక్షం చ గజరత్నానం ఆశ్చరత్నం త్రిలక్షకం॥
దశలక్షం గవాం రత్నం శతలక్షం సువర్ణకం ।
రుచకాణాం హీరకోణాం స్పర్శనాం చ తథైవ చ ॥
ముక్తానాం చ చతుర్లక్షం కౌస్తుభానాం సహస్రకం।
సుస్వాదు నానాద్రవ్యాణాం లక్షభారాణి కౌతుకే ॥
అనంతరత్నప్రభవ ఆజగాన సుతాప్రతే ॥
హిమాలయము తన కూతురగు పార్వతి చేయుచున్న వ్రతమునకై ఆనేక ద్రవ్యములను, మణిమాణిక్యములను, ప్రపంచమున దొరకని అనేక వస్తువులను తీసికొని వచ్చెను. లక్ష ఏనుగులను, మూడులక్షల గుజములను, లక్షగోవులను, కోటి రత్నములను, బంగారు నాణెములను, వజ్రములు, ముత్యాలు, కౌస్తుభమణులు, రుచిగల అనేక ద్రవ్యములుగల లక్షమూటలు కట్టుకొని తెచ్చెను.
బ్రాహ్మణా మనవః సిద్ధ నాగా విద్యాధరాస్తథా ।
సన్యాసినో భీక్షుకాశ్చ వందిన పార్వతీవ్రతే॥
విద్యాధరీ నర్తకీ చ నర్తకా ప్ససారం గణాః ।
నానావిధా వాద్యభాండా ఆజగ్ముః శివమందిరం ॥
ఇంకను బ్రాహ్మణులు, మనువులు, సిద్ధులు, వాగులు, విద్యాధరులు; సన్యాసులు, భిక్షుకులు, స్తోత్రపాఠకులు, విద్యాధరులు, వర్తకులు, అప్సరసలు, అనేకవిధమైన వాద్యములతో కైలాసపర్వతమునకు వచ్చిరి.
కైలాపరాజమార్గం చ చందనేన సుసంస్కృతం।
ఆమ్రపల్లవసూత్రాడ్యం కదలిస్తంభశోభితం ॥
దూర్వాధాన్యసలైః పర్ణలాజ పుష్పైర్విభూషితం।
నిర్మితం పద్మరాగేణ దదృశుస్తే గణా ముదా॥
ఉచ్చైః సింహాసనే ప్వితే పూజితాః శంకరేణ చ ।
కైలాసవాసినః సర్వే పరమానందసంయుతాః ॥
దానాధ్యక్షః నాసీరః కుబేరః కోశరక్షకః ।
ఆదేష్టా చ స్వయం సూర్యః పరివేష్టా జలాధిపః ॥
దధ్నాం సద్యః సహస్రాణి దుర్ఖానాం చ తథైవ చ ।
సహస్రాణి ఘృతానాం చ గడానాం చ శతాని చ ॥
మాద్వీకాసాం సహస్రాణి తైలానాం చ శతానిచ ।
లక్షాణి చైవ తత్రాణాం బభూవుః పార్వతీప్రతే ॥
పీయూషాణాం చ కుంభాని శతలక్షాణి నారద।
మిష్టానానాం శర్కరాణాం బభూపుర్ణక్షరాశయః ॥
యవగోధూమ చూర్ణానాం పతాక్తానాం చ నారద॥
స్వస్తికానాం చ పూర్ణానాం. బభూపుర్లక్షరాశయః ।
గుడసంస్కృతజానారి బభూవుః కోటిరాశయః॥
శాలినాం పృథుకానాం చ రాశీనాం దశకోటయః ।
వరతండుల రాశీనాం మునే సంఖ్యా న విద్యతే ॥
స్వర్ణరాప్యప్రవాళానాం మణీనాం చ మహామునే ।
బభూవుః పర్వతాస్తత్ర కైలాసే పార్వతీ వ్రతే ॥
పాయసం పిష్టకం చైవ శాల్యన్నం సుమనోహరం ।
చకార లక్ష్మీః పాకం చ వ్యంజనం ఘృతసంస్కృతం ॥
బుభుజ్ దేవర్షిగణైః శివోనారాయణేన చ ।
బభూపుర్లక్ష వీప్రాశ్చ పరివేషణకారకాః ॥
తాంబూలం చ దదౌతేభ్యః కర్పూరాది సువాసితం ।
రత్నసింహాసనస్థేభ్యో విప్రలక్షేభ్య ఏవచ ॥
పార్వతీదేవి పుణ్యకవ్రతమును చేయుచున్నప్పుడు కైలాసమునందలి రాజమార్గమును చందనముచే కలయంపిజల్లినారు. ఆ మార్గమునందంతట అరటిచెట్ల స్తంభములను నిలిపి, మామిడి తోరణములను కట్టిరి. ఆ మార్గమునందంతట దర్భలు, ధాన్యములు, ఫలములు కుప్పలు కుప్పలుగానున్నది. ఆ రాజమార్గమంతయు పద్మరాగమణులచే నిర్మించబడిన ఆరుగులున్నవి. ఆట్టి రాజమార్గమును మునిగణము, దేవతాగణము, యక్ష కిన్నరాది గణము సంతోషముతో చూచెను.
శంకరుడు తనభార్యచేయుచున్న వ్రతమునకు వచ్చినవారినందరిని ఎత్తిన సింహాసనములందు కూర్చుండబెట్టి గౌరవించెను. దానిని చూచి కైలాసమునమన్న వారందరు సంతోషించిరి.
ఆ పుణ్యకవ్రత కార్యక్రమమున దేవేంద్రుడు దానాధ్యక్షుడుగా, కుబేరుడు ధనాగారమునకు రక్షకుడుగా, సూర్యుడు ఆందరకు పనులనాదేశించువాడుగా, వరుణుడు భోజనములు పెట్టుచోట ఉండెను.. అచ్చట పెరుగు, పాలు, నేయి, గుఢము (బెల్లము), తేనె, నూనె, మజ్జిగ నదులై పారెను. పీయూషమను వంటకములు, మిష్టాన్నములు, చక్కరలు రాశులుగానుండినవి. నేతితో కలిపిన యవలు, గోధుమల పిండి, స్వస్తికములనే పిండివంటలు, పూర్ణములమ పిండివంటలు బెల్లము కలిపిన పేలాలు, అటుకులు, మంచి బియ్యము రాశులు రాశులుగా అచ్చట ఉండినవి. అట్లే అచ్చట బంగారము, వెండి, పగడములు, మణులరాశులు పర్వతములవలె ఉండినవి. పాయసము, పిండి, అప్పము, నేతితో చేసిన కూరగాయలను లక్ష్మీదేవి వండి పెట్టినది. లక్ష్మీదేవి చేసిన పంటను శివుడు, నారాయణుడు, దేవతలు, మునులు, బ్రాహ్మణులందరు చక్కగా భుజించిరి. ఆ సమయమున వడ్డించుటకే లక్షమంది బ్రాహ్మణులుండిరన్నచో భోజనముచేసినవారి సంఖ్య ఎంతయో చెప్పలేము. పార్వతీదేవి వారినందరిని రత్నసింహాసనములపై కూర్చుండబెట్టి కర్పూరాది సువాసన ద్రవ్యములు కల తాంబూలమునిచ్చినది.
రత్నసింహాపవష్ఠం చ విష్ణుం క్షీరోదశాయివం ।
సేవ్యమానం పారదైశ్చ సస్మి తైశ్వేతచామరైః ॥
ఋషిభిః స్తూయమానం చ సి ద్దైర్దేవగణ స్తధా।
విద్యారరీణాం నృత్యాని పశ్యంతం సస్మితం ముదా॥
గంధర్వాణాం చ సంగీతం వ్రతవంతం మనోహరం ।
పప్రచ్ఛ శంకరో బ్రహ్మన్ బ్రహ్మేశం ప్రీతిపూర్వకం॥
బ్రహ్మణా ప్రేరితో యుక్తం వ్రతం కర్తవ్యమీప్సితం ।
దేవర్షిగణపూర్ణాయాం సభాయాల సంపుటాంజలి ॥
అప్పుడు పాలకడలిలో పడుకొనియుండు విష్ణుమూర్తి రత్నసింహాసనముపై కూర్చొని దాసజనము జతచామరములు వీచుచుండగా మునులు. ఆ దేవదేవుని స్తుతించుచుండగా, సిద్దులు, దేవగణములు సేవించుచుండగా గంధర్వులు పాడుచున్న సంగీతమును వినుచూ విద్యాధర స్త్రీలు చేయు నాట్యములను తిలకించుచుండెను. అట్టి పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువును దేవతలు, ఋషులు నిండిపోయి యున్న సభలో బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా ఆవ్రతమున చేయతగు కార్యమును. శంకరుడు చేతులు కట్టుకొని ఇట్లడిగాను.
శ్రీ మహాదేవ ఉవాచ -శ్రీమహాదేవు డిట్లనెను-
మదీయం వచనం పొథ శ్రీనివాస శ్రుణుప్రభో।
తపఃస్వరూప తపసాం కర్మణాం చ ఫలప్రద॥
వ్రతానాం జపయజ్ఞానాం పూజానాం సర్వపూజిత।
సర్వేషాం బీజరూపేణ వాంచాకల్పతరో హరే ॥
సుపుణ్యం చ వ్రతం కర్తుం బ్రహ్మన్నచ్ఛతి పార్వతీ ।
పుత్రార్థినీ సా శోకార్తా హృదయేన విదూయతా॥
రతిభంగే కృతే దేవైః వ్యర్థవీర్య శుచార్జితా।
ప్రబోధితా మయా పార్వీ వివిధైర్వచనామృతైః ॥
సత్పుత్రం స్వామి సౌభాగ్యం సువ్రతా యాచతే ప్రతే।
లాభ్యాం వినా న సంతుష్టా స్వప్రాణాంస్క్తుకుమిచ్ఛతి ॥
ఓ శ్రీనివాస! నీవు తపఃస్వరూపుడు. నీవు తపస్సుయొక్క, కర్మయొక్క ఫలితములనిచ్చువాడవు. అట్లే వ్రతములయొక్క జపములయొక్క యజ్ఞములయొక్క ఫలితములను నీవిత్తువు. నిన్ను అందరు పూజింతురు. నీవు అందరి కోరికలను కల్పవృక్షమువలె తీర్చెదవు. అట్టినీవు నామాటను వినుము.
నాభార్యయగు పార్వతీదేవి శోకముతో బాధపడుచు పుత్రులను కోరి సుపుణ్యకవ్రతమును చేయవలెననుకొన్నది. దేవతలు రతి భంగమును చేసినప్పుడు వీర్యము వ్యర్థముకాగా బాధపడుచున్నప్పుడా సాధ్విని నేను మంచిమాటలతో ఓదార్చితివి. ఇప్పుడా దేవి సత్పుత్రుని, స్వామి సౌభాగ్యము కావలెనని వ్రతము చేయుచున్నది. సత్పుత్రుడు, స్వామి సౌభాగ్యము లభింపనిచో ఆమె నిరాశకు గురియై ప్రాణములను తీసికోనుటకైనా వెనుకాడకున్నది.
పురా త్యక్త్యా స్వదేహం చ పితృయజ్ఞే చ మావినే ।
మన్నిందయా హిమవతీ పునర్జన్మ లలాభ సా ॥
సర్వం జావాపి వృత్తాంతం సర్వజ్ఞం త్వాం వదామి కిం ।
దీనాం తాం వద తత్త్వజ్ఞ పరిణామ శుభప్రదాం ॥
దురివార్యశ్చ సర్వేశ క్రీస్వభావశ్చ చాపలః ।
దుస్త్యజ్యం యోగిభి: సిద్దరప్మాభిశ్చి తపస్విభిః॥
జితేంద్రియైగ్జితక్రోధైః స్త్రీరూపం మోహాకారణం ।
సర్వమాయాకరండం చ కామవర్ధివ కారణం ॥
బ్రహ్మాస్త్రం కామదేవస్య దుర్భేద్యం జయకారణం।
సువిర్మితం చ విధినా సర్వాద్యం వీధిపూర్వకం ॥
మోక్షద్వారకషాటం చ హరిభక్తి విరోధసం।
సంసారబంధవస్తంభరజురూపమకృంతనం ॥
వైరాగ్యనాళబీజం చ శశ్వద్రోగ వివర్ధవం ।
సత్తవం పాహసానాం చ దోషాణామాలయం సదా ॥
ఆప్రత్యయావం క్షేత్రం చ స్వయం కపటమూర్తిమత్ ।
అహంకారాశ్రయం శశ్వద్విషకుంభం సుధాముఖం ॥
సర్వైరసాధ్యమానం చ దురారాధ్యం చ సర్వదా ।
స్వకార్యసాధ్యాచారాగ్యం కలహాంకురకారణం॥
సర్వం నివేదితం బ్రహ్మన్ కర్తవ్యం వక్తుతుమర్హసి ।
కార్యం సర్వం పరామర్శే పరిణామసుఖావహం॥
ఓ పరబ్రహ్మస్వరూపుడా! నాభార్యయైన పార్వతీ పూర్వజన్మలో తండ్రియైన దక్షప్రజాపతిచేయుచున్న యజ్ఞమునందు అతడు నన్ను నిందించుటను సహింపలేక ఆ యజ్ఞాగ్నిలో తన శరీరమును పరిత్యజించి తిరిగి హిమవత్పర్వత కన్యగా పునర్జన్మనుపొందినది.
ఓ విష్ణుమూర్తీ! నీవు సర్వజ్ఞుడవు, నేను చెప్పిన వృత్రాంతమంతయు నీకు తెలియును. ఐననూ నేను నీకు ఈవృత్తాంతమున చెప్పితిని. సమస్త తత్త్వములు తెలిసిన నీవు పార్వతీదేవికి చక్కని హితమును చెప్పుము. ఓసర్వేశ్వరుడా! స్త్రీలయొక్క స్వభావము చంచలమైనది. దానిని నివారింపవీలులేనిది.
యోగులైనను, పిద్దులైనన, మావంటి తపోధమలైనను, జితేంద్రియులు, జితక్రోధులైనను స్త్రీని వదలి మనజాలరు. క్రీయొక్క రూపము అందరకు మోహమును కల్గించునది. ఆది సమస్తమాయలకు విలయమైనది. కామమును పుట్టించునేర్పుకలది. అది మన్మథుని బ్రహ్మాస్త్రము. దానివ్వెరు ఎదుర్కొనలేరు. అన్ని సమయములందు, అంతటను జయమును కల్గించును, ఈవిధముగా బ్రహ్మదేవుడు ప్రీరూపమును సృష్టించేను.
అది మోక్షమనే వాకిలికి తలుపువంటిది. శ్రీహరిపై భక్తిని కలుగనీయదు. సంసారమనే స్తంభమున శాశ్వతముగా బంధించు త్రాడువంటిది. ఎల్లప్పుడదీ అనురాగమునే కళించుము కాని ఫైరాగ్యమును కలుగనీయదు. పొపాపములకు, దోషములకు విలయమైనది. నమ్ముటకు వీలులేవీది కపటమైనది. ఎల్లప్పుడు అహంకారము కలిగియుండు ఆ రూపము వేయము విషకుంభమువంటిది. స్త్రీలు ఎవ్వరికి వశులుకారు వారివి లాలించవలెననినచో మిక్కిలి కష్టము కలుగును. కలహములను, వారు కలిగింతురు.
ఓపరబ్రహ్మరూపుడా! నా పరిస్థితినంతయు నీకు నివేదించితివి. ఇప్పుడు నేనేమీ చేయవలెనో వాకు కర్తవ్యమును ఉపదేశింపుము. ఆ కర్తవ్యము విమర్శించి చేయతగినది కావలెను. అట్లే పరిణామసమయమున సుఖమును. కలిగించవలెను. అట్టి కర్తవ్యమును నీవు చక్కగా విమర్శించి ఉపదేశింపుమని శంకరుడు అడిగిమ.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణమహర్షి నారదునీతో ఇట్లనెను-
ఇత్యేవముక్త్యా భగవాన్నిరీక్ష్య బ్రహ్మణో ముఖం ।
విరరామ సభామధ్యే సత్వా చ కమలాపతిం॥
శంకరప్య వచః శ్రుత్వా ప్రహస్య జగదీశ్వరః ।
హితం చ నీతివచనం ప్రవక్తుముపచక్రమే ॥
శ్రీమహాదేవుడు లక్ష్మీపతియగు నారాయణునితో ఈవిధముగా తనవృత్తాంతమునంతయు దేవతలున్న ఆ సభలో చెప్పి శ్రీమహావిష్ణువును కీర్తించుచు, బ్రహ్మదేవుని ముఖమును చూచి ఆగిపోయెను.
అనంతజగములకెల్ల ప్రభువగు శ్రీమహావిష్ణువు శంకరుని మాటలవన్నీటిని విని చిరునవ్వుతో హితమును, నీతియుక్తమువగు మాటలను ఇట్లు చెప్పసాగెను,
శ్రీవిష్ణురువాచ-శ్రీమహావిష్ణువిట్లు శంకరునితోననెను-
సుపుణ్యకవ్రతం సారం సతీసంతానహేతవే ।
స్వామిసౌభాగ్యబిజం చ పత్నీ తే కర్తుమిచ్ఛతి ॥
సర్వాసాధ్యం దురారాధ్యం సర్వకామఫలప్రదం।
సుఖదం సుఖసారం చ మోక్షదం పార్వతీశ్వర ॥
ఆత్మా సాక్షిస్వరూపశ్చ జ్యోతీరూపః సనాతనః ।
నిరాశ్రయశ్చ నిర్లిప్తో నిరుపాధిర్నిరామయః ॥
భక్తప్రాణశ్చ భక్తీ భక్తానుగ్రహకారకః ।
దురారాధ్యో హి యోద్వేషాం భక్తానామతిసాధకః ॥
భక్యధనో హి భగవాన్ సర్వసిద్ధే హి నిష్ఫల ।
తే యస్య చ కళాః పుంసో బ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥
మహాన్ విరాడ్యదంతశ్చ విర్లిప్తః ప్రకృతః పరః।
అవ్యయో నిగ్రహశ్చగ్రో భక్తానుగ్రహవిగ్రహః॥
ఉగ్రగ్రహో గ్రహాణాం చ గ్రహనిగ్రహకారకః ।
త్రికోటిజన్మమధ్యే, చ వ సాధ్యో భవతా వినా ॥
ఓశంకరా! విభార్యయగు పార్వతి భర్భసౌభాగ్యము, చక్కని సంతానము కలుగవలెవవి వ్రతములలో పర్వగమైన పుణ్యకవ్రతమును చేయవలెనని అనుకొనుచున్నది. ఆ వ్రతము ఉందరకు అసాధ్యమైపది. ఆది, సమస్తవాంఛితములను, సుఖమును, మోక్షమును కల్గించును.,
ఈవ్రతమునకు సాక్షీభూతుడై ఆధిదేవతాగానుండువాడు సనాతనుడు జ్యోతిస్వరూపుడు ఆగు పరమాత్మయే. అతడు వీరాశ్రయుడు, నిర్లిప్తుడు, నిరుపాధిరూపుడు, నిరామయుడు. ఆ పరమాత్మ భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుచుండును. ఆతనీ ప్రాణములు పరమభాగవతోత్తములే, ఆతడు అన్యజనులకు ఆందనివాడైనను భక్తజనులకు మాత్రము. ఎల్లప్పుడు అనుకూలమై యుండును. ఆ భగవంతుని వదలివేసినచో సమస్తసిద్ధులు విప్పలమగును..
బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు ఆ పరమపురుషుని అంశస్వరూపులు మాత్రమే. అట్లే ప్రకృతికంటిపరుడైన మహావిరాట్వరూపుడు ఆ పరమపురుషుని అంశస్వరూపుడు మాత్రమే. భక్తులనుగ్రహించుటకై ఆకారమును ధరించిన ఆ పరమపురుషుని నీవంటివారు తప్ప ఇతరులు మూడుకోట్ల జన్మలెత్తినను పొందజాలరు.
లబ్ద్వా హి భారతే జన్మ హరిభక్తిం లభేన్నరః ।
పేవవం క్షుద్రదేవానాం కృత్వా పస్తు జన్మసు॥
సూర్యమంత్రమవాప్నోతి కేవలం స తదాశిషా।
సూర్యమంత్రం సమారాధ్య త్రీపు జన్మసు భారతే ॥
ప్రాప్నోతి శైవం మంత్రం చ సర్వదం మానవోముదా॥
ఈ భారతభూమిపై జన్మపొందినవాడు మాత్రమే శ్రీహరీ భక్తిని పొందును.
క్షుద్రదేవతలను ఏడు జన్మలవరకు నియమనిష్ఠలతో ఆరాధించిన వ్యక్తికి సూర్యమంత్రము లభించును. అట్లే ఈ భారత ఖండమున సూర్యమంత్రమును నియమనిష్ఠలతో మూడు జన్మలవరకు ఉపాపించినచో సమస్త కోరికలను తీర్చు. శివమంత్రము లభించును.
సంసేవ్య పరయా భక్త్యా త్వామేవం సప్తజన్మసు ॥
ప్రాప్నోతి మాయామంత్రం చ త్వత్పదాబ్దప్రసాదతః।
శతం జన్మసు చారాధ్య మాయాం నారాయణీం పరారీ ॥
నారాయణకళాం సేవ్యాం సమవాప్నోత మానవః ।
కళాం నిషేవ్య వర్షఽ త్ర పుణ్యక్షేత్ర సుదుర్లభే॥
కృష్ణభక్తిమవాప్నోతి భక్తసంసర్గహైతుకీం ।
సంప్రాప్య భక్తిం నిప్పక్వాం భ్రామం భ్రామం చ భారతే॥
ప్రాప్నోతి పరిపక్వం చ భక్తిం భక్తనిషేవయా।
తదా భక్తప్రసాదేన దేవానామాషా శివ।
శ్రీకృష్ణమంత్రం ప్రాప్నోతి నిర్వాణఫలదం పరం॥
కృష్ణతుల్యో భవేద్భక్తశ్చిరం కృష్ణనిషేవయా॥
అంతులేని భక్తితో పరమశివుడవగు నీన్ను ఆ ఏడుజన్మలవరకు ఆరాధించినచో వీ ఆనుగ్రహమువలన విష్ణుమాయ అను దుర్గాదేవి మంత్రము లభించును. నారాయణియగు ఆదేవిని నూరుబిన్మలవరకు ఆరాధించినచో నారాయణాంశ మంత్రమును పొందగలడు. ఆ నారాయణాంశముమ పుణ్యక్షేత్రమున ఒక సంవత్సరము అత్యంతభక్తితో ఉపాసించినచో శ్రీకృష్ణ భక్తులతో సమాగమనమును కల్పించు శ్రీకృష్ణభక్తి లభించుమ, పూర్తిగా పరిపక్వముకొని శ్రీకృష్ణభక్తితో ఈ భారతవర్షమున పుణ్యక్షేత్రసందర్శనము చేసినచో అచ్చటనున్న శ్రీకృష్ణభక్తులతో కలిసియున్న పుణ్యము వలన ఆయా దేవతల అనుగ్రహమువలన పూర్తిగా పక్వమైనది మోక్షఫలము నొసగునది ఐన శ్రీకృష్ణమంత్రము లభించును.
శ్రీకృష్ణమంత్రము, శ్రీకృష్ణ వ్రతము సమస్త కోరికలను తీర్చును. శ్రీకృష్ణమంత్రము నెల్లప్పుడు ఉపాసించు భక్తుడు శ్రీకృష్ణునితో సమానుడు కాగలడు.
మహతి ప్రళయే పాతః సర్వేషాం వై సునిశ్చితం ।
న పాతః కృష్ణభక్తానాం సాధూనామవినాశినాం॥
అవినాశినీ గోలోకే మోదంతే కృష్ణకింకరాః ।
హసంతి తే సునిశ్చింతా దేవాన్ బ్రహ్మాదికాన్ శివ ॥
త్వం పంహర్తా చ సర్వేషాం న భక్తానాం మహేశ్వర ।
మాయా మోహయతే సర్వాన్ భక్తాన్న కృపయా మమ॥
మాయా నారాయణే మాతా సర్వేషాం కృష్ణభక్తిదా।
న కృష్ణభక్తిం ప్రాప్నోతి వినా మాయా నిషేవణం ॥
సా చ నారాయణే మాయా మూలప్రకృతిరీశ్వరీ ।
కృష్ణప్రియా కృష్ణభక్తి కృష్ణతుల్యావినాశినీ ॥
సా చ తేజుఃస్వరూపా చ స్వేచ్ఛావిగ్రహధారిణీ ।
ఆవిర్భూతా చ దేవానాం తేజసాసురనిగ్రహే ॥
నిత్య దైత్యసంఘాంశ్చ దక్షపత్యాం చ భారతే ।
లలాభ దక్షిస్తపసా జన్మచానేక జన్మనః ॥
మహాప్రళయకాలమున ఈలోకములందున్న పర్వజీవులు నశించును కాని పరమసాధువులైన శ్రీకృష్ణభక్తులు మాత్రము నశింపరు. శ్రీకృష్ణభక్తులాసమయమున సాశసమనునది లేని గోలోకమున సుఖముగానుందురు. మహాప్రళయకాలమున బ్రహ్మాదిదేవతలందరు నశించుచుండుటను కని వారు నిశ్చింతతోనుందురు.
ఓమహేశ్వర! నీవు చరాచర ప్రపంచమునంతయు లయమొనరింతువు కాని నాభక్తులను మాత్రము నీవు సంహరింపలేవు. సామాయ అందరినీ మోహింపజేయును గాని నాఅమగ్రహమువలన నా భక్తులను మాత్రము మోహపరవశులను చేయజాలదు. పైగా నారాయణియగు విష్ణుమాయ నాఅనుగ్రహము వలన భక్తులందరకు శ్రీకృష్ణభక్తిని కలిగించును. అందువలన విష్ణుమాయయగు దుర్గాదేవిని సేవింపక ఎవ్వరు శ్రీకృష్ణభక్తిని పొందజాలరు.
సారాయణియగు విష్ణుమాయ మూలప్రకృతిస్వరూపిణి. ఆ దేవి శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియమైనది. ఆమె శ్రీకృష్ణునకు భక్తురాలు. ఆతనితో సమానమైనది. తేజోరూపిణి. తాము కోరుకున్న ఆకారమును ధరించగలది, ఆమె సమస్తదేవతల తేజస్సువలన రాక్షసులను సంహరించుటకు అవతరించిన తల్లి, ఆదేవి శుంభాది రాక్షసులను సంహరించి దక్షప్రజాపతీ అనేక జన్మలలో చేసికొన్న తపస్సువలన అతనికి పుత్రికగా జన్మించినది.
త్యక్త్యా దేహం పితుర్యజ్ఞే సా సతీ తన నిందయా।
జగామ దేవీ గోలోకం కృష్ణశక్తిః సనాతన॥
గృహీత్వా విగ్రహం తస్యా గుణరూపాశ్రయం వరం ।
బ్రామం భ్రామం భారతే త్వం విషణ్ణిభూః పురా హర॥
ప్రబోధితో మయా త్వం చ శ్రీశైలేషు సరిత్తటే।
లలాభ జన్మ సా శైలకాంతాయామచరేణ చ ॥
నారాయణియగు ఆ సతీదేవి తన తండ్రియగు దక్షుడు యజ్ఞము చేయుచున్న సమయమున నిన్ను నిందింపగా విని సహింపలేక అచ్చటనే తన శరీరమును వదలి గోలోకమునకు చేరినది. అప్పుడు నీవాదేవియొక్క శరీరమును చేతబట్టుకొని భారతదేశమంతటను తిరుగుచుండగా నీ అవస్థను గమనించి నేను నిన్ను ఓదార్చితిని. అప్పుడే ఆమె హిమాలయ పర్వతమునకు కూతురై పుట్టెమ.
కరోతు పుణ్యకం సాద్వి సువ్రతా సువ్రతం శివా! ।
రాజసూయ సహస్రాణాం పుణ్యం శంకర పుణ్యకే॥
రాజసూయ సహస్రాణాం నతే యత్ర ధనవ్యయః।
న సాధ్యం సర్వసాధ్వీనాం సతమేతత్రిలోచన॥
స్వయంభూతేశనాథస్యం పుణ్యకస్య ప్రభావతః ।
పార్వతీగర్భజాతశ్చ తన పుత్రో భవిష్యతి॥
స్వయం దేవగణానాం స యుష్మాదీశః కృపానిధిః ।
గణేశ ఇతీ విఖ్యాతో భవిష్యతి జగత్రయే ॥
యస్య స్మరణమాత్రేణ విఘ్ననాశో భవేత్ ధ్రువం।
జగతాం హేతునానేన విఘ్నవిఘ్నభిదో విభుః॥
నానావిధావి ద్రవ్యాణి యస్మాద్దేయాని పుణ్యకే ।
భుక్త్యా లంబోదరత్వం చ తేన లంబోదరః స్మృతః ॥
శనిదృష్ట్యా శిరచ్ఛేదాత్ గజవక్రేణ యోజితః।
గజాసవః శిశుః తేన సర్వేషాం సర్వసిద్ధిదః ॥
దంతభంగః పరశువా పశురామస్య వై యతః ।
హేతునా తన విఖ్యాతశ్చైకదంతాభిధః శిశుః ॥
పూజ్యశ్చ సర్వదేవానామస్మాకం జగతాం విభుః ।
సర్వాగ్రే పూజనం తస్య భవితా మద్వరేణ వై ॥
పూజాసు సర్వదేవానామగ్రే సంపూజ్య తం జనః ।
పూజాఫలమవాప్నోతి విర్విఘ్నేన వృధాఽన్యథా ॥
ఓశంకరా! పరమపతివ్రతయగు పార్వతీదేవి మంచివతమైన పుణ్యకవ్రతమును చేయుగాక. ఆవ్రతము వేలకొలది రాజసూయయాగములు చేసినదానికంటే గొప్ప పుణ్యమును కలిగించును. ఈ వ్రతమును పతివ్రతలందరు చేయజాలరు. ఈ పుణ్యకవ్రత మాహాత్మ్యమువలన పార్వతీదేవికి పుత్రుడు కలుగును. ఆతడు దేవతాగణముల కన్నిటికి అధిపతిగావున గణేశుడను పేరుతో ప్రసిద్దినందును. అట్లే ఆతనిని స్మరించినంతమాత్రమున విఘ్నములన్నియు నశించిపోవునుపువ విఘ్నాధిపుడుగను, విఘ్ననాశకుడుగను పేరు సంపాదించుకోమను. అదేవిధముగా ఈపుణ్యకవ్రతమున ఆతవి కొసగు నైవేద్యములవలన ఆతడు లంబోదరుడగును. శనిదేవునియొక్క వక్రదృష్టి ఇతనిపై పడుటవలన ఆతని శిరచ్ఛేదము జరుగును. అటు పిమ్మట అతనికి గజముయొక్క శిరస్సును తగిలించుటవలన గబావను డగును. అట్లే ఆతడు. పరశురామునియొక్క గండ్రగొడ్డలి దెబ్బచే ఒక దంతమును కోల్పోయి ఏకదంతుడగును. ఈతడు సమస్తదేవతలకు చివరకు నాకు కూడ పూజనీయు డగుమ. వారమువలన ఇతడు అందరు. దేవతలకంటే ముందుగానే పూజలనందుకొనును. దినులు సమస్తదేవతలను పూజించు సమయమున తొలుత ఈ గణపతిని పూజించినందువలన, ఆయా దేవతాపూజీ నిర్విఘ్నముగా కొనసాగును. అట్లే పూజచేయుమానవునకు పూజాఫలముకూడ తప్పక లభించును.
గణేశం చ దినేశం చ విష్ణుం శంభుం హుతాశనం ।
దుర్గామేతానన్ని షేవ్య పూజయేద్దేవతాంతరం ॥
గణేశపూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేత్ ।
నీర్వాధిః సూర్యపూజాయాం శుచిః శ్రీవిష్ణుపూజనే ॥
మోక్షశ్చ పాపనాశశ్చ యశశ్విర్యముత్తమం ।
తత్త్వజ్ఞానంపుతృప్తీనాం బీజం శంకరపూజనత్॥
స్వబుద్ధిశుద్ధిజననం కీర్తితం వహ్నిపూజనం ।
విధిసంస్కృత హ్నేస్తు పూజాలో జ్ఞానతో మృతిః ॥
దాతా భోక్తా చ భవతి శంకరాన్ని నిషేవణాత్ ।
హరిభక్తిప్రదం చైవ పరం దుర్గార్చనం శివం ॥
గణపతిని, సూర్యుని, విష్ణుమూర్తిని, శంకరుని, ఆగ్నివి, దుర్గాదేవిని పూజించిన తరువాతనే ఇతర దేవతలను పూజింపవలెను.
గణపతిని పూజించినచో విఘ్నములన్నియు తొలగిపోవును. సూర్యదేవుని పూజించిన చక్కని ఆరోగ్యము కలుగును. శ్రీమహావిష్ణువును పూజించినచో శుచిత్వము కలుగును. శంకరుని పూజివలన మోక్షము, పాపనాశనము, కీర్తి, ఉత్తమైశ్వర్యము. తత్త్వజ్ఞానము కలుగును. ఆగ్నిదేవుని పూజించినచో చక్కని బుద్ధి కలుగును. ప్రతిదినము వీధిప్రకారముగా అగ్ద్యాధానము చేయువాడు అగ్నిని పూజించుచున్నచో మరణసమయమునను అతనికి జ్ఞానముండుమ. అట్లే ప్రతిదినము అగ్నిని శంకరుని పూజించినచో ధనధాన్య గులు కలిగి, ఇతరులకు దానములు చేయుచు అను వాటిననుభవించుచు సుఖముగానుండును. దుర్గాదేవిని అర్చించిన శ్రీహరి భక్తి కలుగును.
విపరీతం త్రిజగతామేతేషాం పూజనం వినా ।
ఏవం క్రమో మహాదేవ కల్పే కల్పేప్తి నిశ్చితం॥
ఏతే శశ్వద్వద్యమానా నిత్యా పృష్టిపరాయణాః ।
ఆవిర్భావతిరోభావా చైతేషామీశ్వరేచ్ఛయా ॥
గణపతి మొదలగు దేవతలను పూజింపక ఇతర దేవతలను పూజించినచో విపరీత గు జరుగును. పైన పేర్కొన్న క్రమపద్ధతిననుసరించియే ప్రతికల్పమున ఇతర దేవతలను పూజింతురు.
ఈదేవతలు సృష్టికర్తలై నిత్యులైయుందురు. వీరి జననమరణములు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛననుసరించియే జరుగును.
ఇత్యుక్త్యా శ్రీహరిస్తత్ర విరరామ సభాతలే।
ప్రహృ ష్టా దేవలో విప్రా పార్వత్యా సహ శంకరః ॥
శ్రీహరి ఆదేవతలున్న సభలో శంకరునితో నిట్లు పలికి ఊరకుండగా దేవతలు పార్వతీపరమేశ్వరులు ఇంకము అచటమన్న బ్రాహ్మణులందరు సంతసించిది.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయే గణేశఖండే నారద నారాయణసంవాదే ప్రతాజ్ఞగ్రహణం నామ షష్టోఽధ్యాయః॥
బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణేశఖండమున నారద నారాయణ మహర్షులసంవాదమున చెప్పబడిన పార్వతీదేవి పుణ్యకవ్రతాజ్ఞను స్వీకరించుకథ గల యారవధ్యాయము సమాప్తము.
Summary of chapter 6 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Among the vast assembly of celestial beings, sages, and planetary deities who gathered on Mount Kailāsa to offer their respects was Shani, the lord of the planet Saturn. While all the Devas and Maharshis approached the child with overflowing joy, Shani stood at a distance with his head bowed low, hesitating to gaze directly upon the newborn infant. Noticing his hesitation, Goddess Pārvatī gently questioned Shani, asking why he refrained from looking at her beautiful child and enjoying the auspicious occasion. Shani humbly explained the severe curse he carried, warning that any living entity he looked upon directly with his eyes would instantly suffer destruction or loss, yet Goddess Pārvatī, confident in her child's divine protection, urged him to look upon her son.