నారాయణ ఉవాచ – నారాయణ ముని ఇట్లు పలికెను –
ఇంద్రశ్చ గురుణా సార్థం సురైః సంహృష్టమానసః ।
జగామ శీఘ్రం పద్మాయై తీరం క్షీరవయెనీదేః ॥
కవచం చ గళేబధ్వా సద్రత్నగుటికాన్వితం ।
మనసా స్తవనం దీవ్యం స్మారం స్మారం పునః పునః ॥
తే సర్వే భక్తియుక్తాశ్చ తుష్టువుః కమలాలయాం ।
సాశ్రునేత్రాశ్చ దీనాశ్చ భక్తి సమ్రాత్మకంధరాః ॥
సా తేషాం స్తవనం శ్రుత్వా సద్యః సాక్షాద్బభూవ హ ।
సహస్రదళపద్మస్థా శతచంద్రసమప్రభా ॥
జగద్వ్యాప్తం సుప్రభయా జగన్మాత్రం యయా ము నే ।
తానువాచ జగద్ధాత్రి హితం సారం యథోఽచితం ॥
దేవేంద్రుడు శ్రీహరి మాటలకు సంతసించి తన గురువుతో, తోటి దేవతలతో కలిసి మహాలక్ష్మీదేవి కొరకు క్షీర సముద్ర తీరమునకు బయలు దేరేను. శ్రీహరి ఇచ్చిన కవచమును రత్నఘుటీకయందుంచుకొని తన కంఠమున కట్టుకొని లక్ష్మీదేవిని మాటిమాటికి స్తుతించెను. అట్లే దేవతలందరు భక్తితో తలలు వంచుకొని కన్నీళ్ళుకారగా దీన వదనములతో లక్ష్మీదేవిని స్తుతించిరి.
ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రమును విన్న లక్ష్మీదేవి నూరు చంద్రుల వంటి కాంతి కలదై వేయి దళములు కల వద్మములోనుండి వారికి ప్రత్యక్షమాయెను. ఆ దేవియొక్క కాంతివలన లోకమంతయు నిండిపోయినది. అట్టి లక్ష్మీదేవి దేవతలతో హితవైన మాటలు ఇట్లు పలికినది.
శ్రీమహాలక్ష్మీ రువాచ - శ్రీమహాలక్ష్మి ఇట్లు పలికినది –
వత్సా నేచ్ఛామి వో గేహాన్గంతుం సైవం క్షమాఽదునా ।
భ్రష్టాన్ దృష్ట్వా బ్రహ్మశాపాద్భిభేమి బ్రహ్మశాపతః ॥
ప్రాణా మే బ్రాహ్మణాః సర్వేశ శ్వత్పుత్రాధికం ప్రియాః ।
విప్రదత్తం చ యత్కించిదుపజీవ్యం సదైవ చ ॥
విప్రా బ్రువంతు మాం తుష్టా యాస్యామీ భవదాజ్ఞయా ।
నమే పూజాం ధ్రువం కర్తుం క్షమాస్తే చ తపస్వినః ॥
గురుభిర్బ్రాహ్మణైర్దేవైర్భిక్షుభిర్వైష్ణవైస్తథా ।
యద్యభాగ్యం భవేద్దైవాత్తే శప్తాః సంతి తైస్సదా ॥
నారాయణశ్చ భగవాన్బిభేతి బ్రహ్మశాపతః ।
సర్వబీజం చ భగవాన్ సర్వేశశ్చ సనాతనః ॥
ఓ దేవతలారా! మీ ఇండ్లకు వచ్చుటకు నాకు ఇప్పుడు ఇష్టములేదు. మీరు బ్రాహ్మణ శాపము వలన భ్రష్టులైనారు. నేను కూడ బ్రాహ్మణ శాపమునకు భయపడుదును. బ్రాహ్మణులు నాకు ప్రాణముల వంటి వారు. వారు నాకు నాపుత్రులకంటే ప్రియమైన వారు. విప్రులొసగినదానిచే జీవించుట మంచిది. అట్టి బ్రాహ్మణుల యనుమతి యున్నప్పుడే సంతోషముగా మీ ఇంటికి వత్తును. భాగ్యము లేని వారు గురువులు, బ్రాహ్మణులు, భిక్షుకులు వైష్ణవులు మొదలగు వారిచే శాపమును పొందుదురు. సమస్తలోకకారకుడై, జగన్నాయకుడై, సనాతనుడైన నారాయణుడు కూడ బ్రాహ్మణుల శాపమన్నచో భయపడును. అందువలన ప్రస్తుతము మీ ఇండ్లకు వచ్చుటకు భయపడుచున్నానని పలికెను.
ఏతస్మిన్నంతం బ్రహ్మన్ బ్రాహ్మణా హృష్టమానసాః ।
ఆజగ్ముః సస్మితాః సర్వే జ్వలంలో బ్రహ్మతేజసా ॥
అంగీరశ్చ ప్రచేతాశ్చ క్రతుశ్చ భృగురేవ చ ।
పులహశ్చ పులస్త్యశ్చ మరీచిశ్చాత్రిరేవచ ॥
సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః ।
సనత్కుమారోభగవాన్ సాక్షాన్నారాయణాత్మకః ॥
కపిలశ్చాసురిశ్చైవ వోఢుః పంచశిఖస్తథా ।
దుర్వాసాః కశ్యపోఽగస్త్యో గౌతమః కణ ఏవచ ॥
ఔర్వః కాత్యాయనశ్చైవ కణాదః పాణివిస్తథా ।
మార్కండేయో లోమశశ్చ వసిష్ఠో భగవాన్ స్వయం ॥
బ్రాహ్మణా వివిధైర్ట్రవ్యైః పూజయామాసురీశ్వరీం ।
దేవాశ్చారణ్య నైవేద్యైరుపహారేణ భక్తితః ॥
స్తుత్వా మునీంద్రాస్తాం భక్త్యా చక్రురారాధనం ముదా ।
ఆగచ్ఛ దేవభవనం మర్త్యం చ జగదంబికే ॥
ఆ సమయమున బ్రహ్మ తేజో విరాజితులైన బ్రాహ్మణులు సంతోషముతో అచ్చటికి వచ్చిరి. వారిలో అంగీరసుడు ప్రచేతసుడు, క్రతువు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, మరీచి, అత్రి, సనక, సనంద, సనాతన, సనత్కుమారులు, కపిలుడు, ఆసురి, వోఢువు, పంచశిఖుడు, దుర్వాసుడు, కశ్యపుడు, అగస్త్యుడు, గౌతముడు, కణ్వుడు, ఔర్వుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, మార్కండేయుడు, లోమశుడు, వసిష్ఠుడు మొదలైనవారుండిరి. ఆ బ్రాహ్మణులు నానావిధ ద్రవ్యములతో, అడవిలో లభించు వస్తువులను నైవేద్యముగా పెట్టి భక్తిపూర్వకముగా జగజ్జననిని పూజించిరి. అట్లే ఆదేవిని అనేకములైన స్తోత్రములచే ఆరాధించి ఓ జగన్మాతా! నీవు దేవతల ఇండ్లకు, మానవుల ఇండ్లకు స్వేచ్ఛగా పొమ్మని కోరిరి.
తేషాం తద్వచనం శ్రుత్వా తానువాచ జగత్ర్పసూః ।
పరితుష్టా గాముకీ చ నిర్భయా బ్రాహ్మణాజ్ఞయా ॥
బ్రాహ్మణులమాటలను విన్న లక్ష్మీదేవి నిర్భయముగా ఇతరుల ఇండ్లకు వెళ్ళదలచి సంతోషముతో నిట్లనెను.
శ్రీమహాలక్ష్మీరువాచ - మహాలక్ష్మి ఈవిధముగా పలికెను –
గృహాన్ యాస్యామి దేవానాం యుష్మాకం చాజ్ఞయా ద్విజాః ।
యేషాం గేహం న గచ్ఛామి శృణుర్వం భారతేషు చ ॥
స్థిరా పుణ్యవతాం గేహే సునీతిపథవేదినాం ।
గృహస్థానాం నృపాణాం వా పుత్రవత్పాలయామి తాన్ ॥
యం యం రుష్టో గురుర్దేవో మాతా తాతశ్చ బాంధవాః ।
అతిథిః పితృలోకశ్చ యామి తస్య న మందిరం ॥
మిథ్యావాదీ చ యః శశ్వదనధ్యాయీ చ యః సదా ।
సత్వహిసశ్చ దుశ్శీలో నగేహం తస్య యామ్యహం ॥
సత్యహీనః స్థాప్యహారీ మిథ్యాసాక్ష్యప్రదాయకః ।
విశ్వాసఘ్నః కృతఘ్నో యో యామి తస్య న మందిరం ॥
చింతాగ్రస్తో భయగ్రస్తః శత్రుగ్రస్తోఽతిపాతకీ ।
ఋణగ్రస్తోఽతికృపణో న గేహం యామీ పాపినాం ॥
దీక్షాహీనశ్చ శోకార్తో మందధీః స్త్రీజితః సదా ।
న యామ్యపి కదాగేహం పుంశ్చల్యాః పతిపుత్రయోః ॥
యో దుర్వాక్కలహావిష్టః కలిః శశ్వద్యదాలయే ।
స్త్రీప్రధానా గృహే యస్య యామి తస్య న మందిరం ॥
యత్ర నాస్తి హరేః పూజా తదీయగుణ కీర్తనం ।
నోత్సుకస్తత్ప్రశంసాయాం యామి తస్య న మందిరం ॥
కన్నాన్నమేదవిక్రేతా నరఘాతీ చ హింసకః ।
నరకాగార సదృశం యామి తస్య న మందిరం ॥
మాతరం పితరం భార్యాం గురుపత్నీం గురుం సుతం ।
అనాథాం భగినీం కన్యామనన్యాశ్రయబాంధవాన్ ॥
కార్పణ్యాద్యో న పుష్ణాతి సంచయం కురుతే సదా ।
తద్గేహాన్నరకాగాదాస్యామి తాన్న మునీశ్వరాః ॥
దశనం వసనం యస్య సమలం రూక్షమస్తకం ।
వీకృతౌ గ్రసహాసౌ చ యామి తస్య న మందిరం ॥
మూత్రం పురీషముత్యృజ్య యస్తత్పశ్యతిమందధీః ।
యః శేతే స్నిగ్ధపాదేన యామీ తస్య న మందిరం ॥
ఆధౌతపాదతాయో యో నగ్నః శశఽతీనిద్రతః ।
సంధ్యాశాయీ దీవాశాయీ యామి తస్య న మందిరం ॥
మూర్డ్ని తైలం పురా దత్వా యోఽన్యదంగముపస్పృశేత్ ।
దదాతి పశ్చాద్గాత్రే వా యామి తస్య న మందిరం ॥
దత్వా తైలం మూర్డ్ని గాత్రే విణ్మూత్రం యః సముత్సృజేత్ ।
ప్రణమే దాహరేత్పుష్పం యామీ అన్య న మందీరం ॥
తృణం ఛినత్తి నఖరైర్నఖరైర్విలిఖేన్మహీం ।
గాత్రే పాదే మలం యస్య యామీ తస్య న మందిరం ॥
స్వదత్తాం వరదత్తాం వా బ్రహ్మవృత్తిం సురస్య చ ।
యో హరేత్ జ్ఞానశీలశ్చ యామి తస్య న మందిరం ॥
యత్కర్మ దక్షిణాహీనం కురుతే మూడధీః శఠః ।
స పాపీ పుణ్యహీనశ్చ యామీ తస్య న మందిరం ॥
మంత్రవిద్యోపజీవీ చ మయాజీ చికిత్సకః ।
సూపకృద్దేవలశ్చైవ యామీ తస్య న మందిరం ॥
వివాహం ధర్మకార్యం వా యో నిహంతి చ కోపతః ।
దివా మైథునకారీ యో యామీ తస్య న మందిరం ॥
ఓ బ్రాహ్మణులారా! మీ ఆజ్ఞననుసరించి నేను దేవతల ఇండ్లకు పోయెదను. నీతిమార్గమున పోవు పుణ్యవంతుల ఇండ్లలో నేను స్థిరముగా ఉందును. అట్టి గృహస్థులను, రాజులను నా సంతానమును చూచుకొన్నట్లు రక్షించును.
ఇక నేను ప్రవేశింపని స్థలముల గూర్చి మీకు చెప్పెదను. గురువు, దేవత, తల్లిదండ్రులు, బంధువులు, పితృవర్గము, అతిథి కోపించి పోవు వారి ఇండ్లకు నేను పోను, అట్లే అబద్దములు మాట్లాడువాడు, వేదాధ్యయనము చేయనివాడు, సత్వహీనుడు, చెడు ప్రవర్తన కలవాడు, తనను నమ్మి తన దగ్గరుంచిన ధనమును అపహరించువాడు, కూటసాక్ష్యములను చెప్పువాడు, విశ్వాసములేనివాడు, కృతఘ్నుడు, పిసినారి. దీక్షలేనివాడు, భార్యాదాసుడు, దుశ్శీలయగు స్త్రీ కలవాడు, ఎల్లప్పుడు కలహము పెట్టుకొనువారు, శ్రీహరి పూజ చెయ్యని వాడు, శ్రీహరి కల్యాణ గుణములు కీర్తించనివాడు, అతని కల్యాణ గుణ ప్రశంస నొల్లని వాడు, కన్యను, అన్నమును, వేదమును అమ్ముకొని బ్రదుకువాడు, సాటి మానవుల చంపువాడు, హింసించువాడు, తల్లిని, తండ్రిని, భార్యను, గురుపత్నిని, గురువును, పుత్రుని, అనాథలను, అక్కాచెల్లెండ్లను, కూతురును, ఏగతిలేని బంధువులను పోషించనివాడు, పండ్లు చక్కగా తోముకొననివాడు, మూత్రమును, మలమును విసర్జించిన తరువాత రహాస్యాంగమును చూచుకొనువాడు, కాళ్ళు కడుగు కొనక నిద్రపోవువాడు, నగ్నముగా పరుండువాడు, సంధ్యా సమయమున, పగటి పూట నిద్ర పోవువాడు, నూనెతో తలనంటుకొని తర్వాత మర్మావయవమును ముట్టుకొనువాడు, మర్మావయవమును ముట్టుకొన్న తరువాత శరీరమునకు నూనె పూసికొనువాడు, తలంటుకొనిన పిదప మలమూత్రములు విసర్జించువాడు, గోళ్ళతో భూమిపై రాయువాడు, అట్లే గోళ్ళతో తృణమును గిల్లువాడు, శరీరమున మలము కలవాడు, తాను ఇచ్చిన లేక పరులోసగిన దేవ బ్రాహ్మణ వృత్తులన పహరించువాడు, దక్షిణ లేని పూజా కర్మలు చేయువాడు, మంత్ర ప్రయోగము చేసి బ్రతుకువాడు. వైద్యము చేసి బ్రతుకువాడు, వంటలు వండి బ్రతుకువాడు, దేవాలయమున అర్చనాదులు చేసి బ్రదుకువాడు, వివాహమువంటి ధర్మకార్యముల చెడగొట్టువాడు, పగటిపూట మైథునము చేయువాడు మొదలగు వారి ఇండ్లకు నేనెప్పుడు పోనని లక్ష్మీదేవి పలికెను.
ఇత్యుక్త్వా సా మహాలక్ష్మీరంతర్ధానం జగామ హ ।
దదౌ దృష్టిం చ దేవానాం గృహే మర్త్యే చ నారద ॥
తాం ప్రణమ్య సురాస్పర్శే మునయశ్చ ముదాన్వితాః ।
ప్రజగ్ముః స్వాలయం శీఘ్రం శత్రుత్యక్తం సుహృద్యుతం ॥
నేదుర్దుందుభయస్స్వర్గే బభూవుః పుష్పవృష్టయః ।
ప్రాపుర్దేవాః స్వరాజ్యం చ నిశ్చలాం కమలాం మునే ॥
లక్ష్మీదేవి ఫైవిధముగా పలికి దేవతలు మానవుల ఇండ్లలో ఉండుటకు సమ్మతించి అంతర్ధానము చెందెను. దేవతలు మునులందరు ఆ లక్ష్మీదేవిని నమస్కరించి తమ తమ నెలవులకేగిరి. అప్పుడు దేవతల నిలయమగు స్వర్గమును శత్రువులు పరిత్యజించిరి. దేవతల స్నేహితులచ్చటకు చేరిరి. దుందుభి వాద్యము మ్రోగుచుండగా పుష్పవ ర్షము కురియుచుండగా దేవతలు చాంచల్యములేని లక్ష్మిని పొంది తమ రాజ్యమును (స్వర్గమును) తిరిగి పొందిరి.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణసంవాదే గణపతేర్గజాస్యత్వ కారణ లక్ష్మీబ్రాహ్మణవిరోధాది లక్ష్మీచరిత్ర కథనం నామ త్రయోవింశోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదమున పేర్కొనబడిన గణపతికి గజముఖమేర్పడుటకు కారణమైన లక్ష్మీ చరిత్రకల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
The narrative introduces the formidable monarch Kārtavīryārjuna, the king of the Haihaya dynasty who ruled from his grand capital of Māhishmatī. Endowed with a thousand arms through the grace of his preceptor Maharshi Dattātreya, Kārtavīryārjuna was a ruler of matchless physical strength and martial accomplishment who had conquered the entire earth and even defeated the demon king Rāvaṇa. However, despite his noble qualities and initial adherence to justice, the king gradually became intoxicated with absolute power and martial pride, setting the stage for his downfall through an offense against a holy sage.