నారాయణ ఉవాచ – నారాయణ ముని ఇట్లు పలికెను –
హరిం స్మరన్ మునీశ్రేష్ఠో వాక్యం శ్రుత్వా చ భూభృతః ।
హితం సత్యం నీతిసారం ప్రవక్తుముపచక్రమే ॥
మునిశ్రేష్ఠుడగు జమదగ్ని కార్తవీర్యార్జునుడు పలికిన మాటలువిని శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు, సత్యమైనది, నీతితో కూడుకున్నది హితమైనది అగు మాటను పలుకసాగెను.
మునిరువాచ - మునిశ్రేష్ఠుడగు జమదగ్ని ఇట్లు పలికెను –
గృహం గచ్ఛ మహాభాగ రక్ష ధర్మం సనాతనం ।
సర్వసంపత్స్థిరా శశ్వత్స్థితే ధర్మే సునిశ్చితం ॥
త్వాం చ దృష్ట్యా నిరాహారం సమానీయ గృహం నృప ।
తవ పూజామకరవం యథాశక్తి విధానతః ॥
సాంప్రతం మూర్ఛితం దృష్ట్యా పాదరేణుం శుభాశిషం ।
అదదాం చేతయాoచక్రే వక్తుమేవోచీతం న చ ॥
నృపస్తద్వచనం శ్రుత్వా ప్రణమ్య మునిపుంగవం ।
రథమన్యం త్వరురోహ యుద్ధం దేహీత్యువాచ హ ॥
ఓ మహారాజా! నీవు ఇంటికిపోయి సనాతనధర్మమును రక్షింపుము. ధర్మము స్థిరముగానునన్నచో సమస్త సంపదలు స్థిరముగా ఉండునుకదా! తిండిలేకయున్న నిన్ను చూచి నాఇంటికి తీసికొనివచ్చి నాశక్తికొలది విధివిధానమున నిన్ను గౌరవించితిని. అట్లే ఇప్పుడు రణరంగమున మూర్చపడియున్న నీకు శుభాశీస్సులనొసగి మూర్ఛనుండి తేరుకోనునట్లు చేసితిని. ఇంకను నీతో మాటాడుట నాకు తగనిది అని జమదగ్ని పలుకగా అతని మాటలు విన్న కార్తవీర్యుడు మునికి నమస్కరించి ఇంకొక రథమునెక్కి నాతోయుద్దము చేయుమని మునితో పలికెను.
మునిః కృత్వా చ సన్నాహం తం యోద్దుముపచక్రమే ।
రాజా తం యుయుధే తత్ర కోపేనాహత చేతనః ॥
కపిలాదత్త శస్త్రేణ న్యస్త్రశస్త్రం చకార తం ।
కపిలాదత్తయా శక్త్యా పునర్మూర్ఛామవాప చ ॥
పునశ్చ చేతనాం ప్రాప్య రాజా రాజీవలోచనః ।
మునీనా యుయుధే తత్ర కోపేన పునరేవ చ ॥
ఆగ్నేయం యోజయామాస సమరే నృపపుంగవః ।
మునీరిరాపయామాస వారుణేవ చ లీలయా ॥
నృపేంద్రో వారుణాస్త్రం చ చిక్షేప సమరే మునో ।
వాయవ్యాస్త్రేణ స మునిః శమయామాస లీలయా ॥
వాయవ్యాస్త్రం నృపశ్రేష్ఠశ్చిక్షేప సమరే తదా ।
గాంధర్వేణ మునిశ్రేష్ఠః శమయామాస తత్క్షణం ॥
నాగాస్త్రం చ నృపశ్రేష్ఠశ్చిక్షేప రణమూర్ధనీ ।
గారుడేన మునీశ్రేష్ఠో నీజఘాన క్షణాన్ముదా ॥
మాహేశ్వరం మహాస్త్రం చ శతసూర్య సమప్రభం ।
చిక్షేప నృపతిశ్రేష్ఠో ద్యోతయంతం దిశో దశ ॥
వైష్ణవాస్త్రేణ దివ్యేన త్రిలోక వ్యాపకేన చ ।
మునీర్నిర్వాపయామాస బహుయత్నేన నారద ॥
మునీర్నారాయణాస్త్రం చ చిక్షిపే మంత్రపూర్వకం ।
శస్త్రం దృష్ట్యా మహారాజో ననామ శరణం యయౌ ॥
ఊర్ధ్వం చ భ్రమణం కృత్వా క్షణం దీప్త్వా దిశో దశ ।
ప్రళయాగ్నిసమం తత్ర స్వయమంతరధీయత ॥
జృంభణాస్త్రం చ స మునిశ్చిక్షేప రణమూర్ధనీ ।
నీద్రాం ప్రాపత్తేన రాజా సుష్వాప చ మృతో యథా ॥
దృష్ట్వా నృపం నిద్రితం తం చార్ధచంద్రేణ తత్క్షణం ।
చిచ్ఛేద సారథిం యానం ధనుర్బాణం మునిస్తదా ॥
ముకుటం చ క్షురప్రేణ చ్ఛత్రం సన్నాహమేవ చ ।
ఆస్త్రం తూణం వాజీగణం వివిధేన చ భూభృతః ॥
మునిస్తత్సచివాన్యర్వాన్నాగాస్త్రైణైవ లీలయా ।
నిబధ్య స్థాపయామాస ప్రహస్య సమరస్థలే ॥
జమదగ్ని మహర్షికూడ యుద్ధసన్నాహము చేసికొని మహారాజుతో యుద్దము చేయమొదలిడెను. రాజూకూడ కోపముతో యుద్దముకొనసాగించెను. కపిల ఇచ్చిన శస్త్రముచే ముని మహారాజు చేతిలోని ధనుర్బాణాదికమును హరించి ఆ కపిలగోవు ఇచ్చిన శక్తితో రాజును మూర్చపడగొట్టెను. రాజు మరల తెలివిదెచ్చుకొని కోపము కలవాడై మునితో యుద్దము చేయసాగెను.
కార్తవీర్యుడు ఆగ్నేయాస్త్రమును సంధింపగా ముని దానిని తన వారుణాస్త్రముచే అవలీలగా శాంతినొందునట్లు చేసెను. మహారాజు వారుణాస్త్రమును ప్రయోగింపగా ముని దానిని వాయవ్యాస్త్రముచే శాంతింపచేసెను. రాజూ వాయవ్యాస్త్రమును ప్రయోగించినపుడు ముని దానిని గాంధర్వాస్త్రముచే శమింపజేసెను. రాజు నాగాస్త్రమును వేయగా ముని గరుడాస్త్రముచే దానిని నిష్పలమొనర్చెను. మహారాజు శత సూర్యుల కాంతిగల పాశుపతాస్త్రమును ప్రయోగింపగా జమదగ్ని దివ్యమైన వైష్ణవాస్త్రముచే దానిని వమ్ముచేసెను. మహర్షి నారాయణాస్త్రమును ప్రయోగించినప్పుడు రాజు ఆ యస్త్రమునకు నమస్కరించి శరణువేడెను. అప్పుడాయస్త్రము పైకివెళ్ళి క్షణకాలము దశదిశలను ప్రకాశింపజేసి తానుస్వయముగా అంతర్ధానము చెందెను. అపుడు ముని జృంభణాస్త్రమును ప్రయోగింపగా రాజు రణరంగమున చనిపోయినట్లు పడిపోయెను. ఆ సమయమున ముని అర్ధ చంద్రాకారపు శరముచే మహారాజు సారథిని, రథమును, ధనుర్బాణములను పడగొట్టెను. అట్లే తన బాకుచే మహారాజు కిరీటమును, ఛత్రమును పడగొట్టి వివిధ శస్త్రములచే మహారాజుయొక్క తూణీరమును, గజసైన్యమును పడగొట్టి నాగాస్త్రమును ప్రయోగించి మహారాజుయొక్క మంత్రులనందరను కట్టివేసెను.
మునిస్తం బోధయామాస సుమంత్రేణైవ లీలయా ।
నిబద్దసర్వామాత్యానాం దర్శయామాస భూమీపం ॥
దర్శయిత్వా నృపం తాంశ్చ మోచయామాస తత్క్షణం ।
నృపేంద్రమాశిషం కృత్వా గృహం గచ్చేత్యువాచ హ ॥
రాజా కోపాత్సముత్థాయ శూలముద్యన్య యత్నతః ।
చిక్షేప తం మునీశ్రేష్ఠం మునిః శక్త్యా జఘాన తం ॥
జమదగ్ని ఆ మహారాజును మూర్ఛనుండి లేపి అతని మంత్రులందరు అస్త్రబద్ధులై పడియుండుటను అతనికి చూపెమ. తరువాత వారినందరను ముక్తులజేసి రాజునాశీర్వదించి అతనిని ఇంటికిపొమ్మని ముని పలికెను. కానీ రాజు కోపముతో లేచి శూలమును ముని పైకి విసరివేసెను ముని యా శూలమును శక్తియను శస్త్రముచే విరిచెను.
ఏతస్మిన్నంతరే బ్రహ్మా సమాగత్య రణస్థలం ।
స ప్రీతిం జనయామాస సునీత్యా చ పరస్పరం ॥
మునిరనామ బ్రహ్మాణం సంతుష్టశ్చ రణస్థలే ।
రాజ నత్వా విధిం చర్షిం స్వపురం ప్రయయౌ ముదా ॥
మునిర్యయౌ స్వాశ్రమం చ స్వలోకం కమలోద్భవః ।
ఇత్యేవం కథితం కించిదపరం కథయామీ తే ॥
ఆ సమయమున బ్రహ్మదేవు డచ్చటకు వచ్చి ఇద్దరి మధ్య సంధిని కలుగజేసెను. జమదగ్ని అప్పుడు సంతోషముతో బ్రహ్మకు నమస్కరింపగా కార్తవీర్యార్జునుడు బ్రహ్మదేవునకు, మహర్షికి నమస్కరించి తనపట్టణమునకు వెళ్ళిపోయెను. మునియగు జమదగ్ని తన ఆశ్రమమునకు పోగా బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయెను.
నారదా! ఈవిధముగా నీకు జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవృత్తాంతమునంతయు తెలిపితిని. తరువాతి కథను కూడ నీకెరింగింతునని నారాయణముని పలికెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతఖండే నారద నారాయణసంవాదే జమదగ్ని కార్తవీర్య యుద్ధోపశమన వర్ణనం నామ షడ్వింశోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంభాషణలో పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవిరామమము ఇరవై యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 26 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Returning to the hermitage and finding his parents in deep lamentation over the forcible theft of Kāmadhenu, Parashurāma was filled with righteous spiritual wrath. Gripping his divine battle-axe Parashu and mounting his chariot, Parashurāma pursued Kārtavīryārjuna and intercepted the king's vast army near Māhishmatī. A catastrophic war erupted as Parashurāma single-handedly attacked the royal forces, cutting down thousands of chariots, elephants, and warrior generals like dry grass before a raging forest fire, until King Kārtavīryārjuna stepped onto the battlefield with all his thousand arms wielding heavy weapons.