నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను-
కవచం శ్రోతు మిచ్చామీ తాం చ విద్యాం దశాక్షరీం ।
నాథ త్వత్తో హి సర్వజ్ఞ భద్రకాళ్యాం సాంప్రతం ॥
ఓ నారాయణమునీ! నాకు భద్రకాళీయొక్క కవచమును, దశాక్షరమైన భద్రకాళీ మంత్రమును తెలిసికొనవలెనని యున్నది. నీవు సర్వము తెలిసినవాడవు కావున వీటిని నాకు వివరింపుమని కోరెను.
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు చెప్పెను-
శ్రుణు నారద వక్ష్యామి మహావిద్యాం దశాక్షరీం।
గోపనీయం చ కవచం త్రిషు లోకేషు దుర్లభం॥
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహేతి చ దశాక్షరీం ।
దుర్వాసా హి దదౌ రాజ్ఞే పుష్కరే సూర్య పర్వణి॥
దశలక్షజపేనైవ మంత్రసిద్ధి: కృతా పురా ।
పంచ లక్షజపేనైవ పఠన్ కవచ ముత్తమం ॥
బభూవ సిద్ధ కవచోఽప్యయోధ్యా మాజగామ సః ।
కృత్స్నాం హి పృథివీం జిగ్యే కవచస్య ప్రభావతః॥
ఓనారద! దశాక్షరియగు మహావిద్య, గోప్యముగా ఉంచ తగినది. ముల్లోకములయందు లభ్యము కానిదగు ఈ కవచమును నీకు నేను వివరించి చెప్పెదను.
“ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా" అనునది దశాక్షరి యగు భద్రకాళీ మంత్రము. దీనిని సూర్యగ్రహణ సమయమున పుష్కరక్షేత్రమున రాజునకు దూర్వాసమహర్షి ఉపదేశించెను. ఈ మంత్రమును పది లక్షల పర్యాయములు జపించినచో మంత్ర సిద్ది కలుగును. అట్లే ఈ కవచమును ఐదు లక్షల పర్యాయములు పఠించినచో కవచ సిద్ధి కలుగును. ఇట్లు మంత్ర సిద్ధిని కవచ సిద్ధిని పొంది రాజగు సుచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చెను. ఆ కవచముయొక్క ప్రభావమువలన సుచంద్రుడు భూమినంతయు జయించెను అని పలికెను.
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను
శ్రుతా దశాక్షరీ విద్యా త్రిషు లోకేషు దుర్లభా ।
ఆధునా శ్రోతు మిచ్చామి కవచం బ్రూహి మే ప్రభో॥
నీ అనుగ్రహమువలన ముల్లోకములయందు దుర్లభమైవ కాళికా దేవియొక్క దశాక్షరీ మంత్రమును వింటిని. ఇప్పుడు నాకు భద్రకాళీయొక్క కవచమును నాకు తెలుపుమని కోరెను.
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలుకసాగెను-
శ్రుణు వక్ష్యామి విప్రేంద్ర కవచం పరమాద్భుతం ।
నారాయణేన యద్ధత్తం కృపయా శూలినే పురా॥
త్రిపురస్య వధే ఘోరే శివస్య విజయాయ చ।
తదేవ శూలీనా దత్తం పురా దుర్వాససే మునే॥
దుర్వాససా చ యద్దత్తం సుచంద్రాయ మహాత్మనే ।
ఆతి గుహ్యతరం తత్వం సర్వమంత్రౌఘ విగ్రహం ॥
ఓ నారదమునీ నీకు అత్యుద్భుతమైన భద్రకాళీ కవచమును వివరింతును. దీనిని పూర్వకాలమున శ్రీమన్నారాయణుడు త్రిపురాసుర సంగ్రామ సమయమున శివుడు విజయమును పొందవలెనని ఆతనికి ఉపదేశించెను. శంకరుడు దీనిని దుర్వాసమహర్షికి ఉపదేశింపగా ఆతడు సుచంద్ర మహారాజునకు ఉపదేశించెను.
ఈక వచము మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారభూతమైనది అని అనెను.
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా మే పాతు మస్తకం।
క్లీం కపాలం సదాపాతు హ్రీం హ్రీం హ్రీమితిలోచనే ॥
ఓం హ్రీం త్రిలోచనే స్వాహా నాసికాం మే సదాఽవతు ।
క్లీం కాళికే రక్ష రక్ష స్వాహా దంతాస్సదాఽవతు ॥
క్లీం భద్రకాళికే స్వాహా పాతుమ్మేఽధరయుగ్మకం ।
ఓం హ్రీం హ్రీం క్లీం కాళికాయై స్వాహా కంఠం సదాఽవతు ॥
ఓం హ్రీం కాళికాయై స్వాహా కర్ణయుగ్మం సదాఽవతు ।
ఓం క్రీం క్రీం క్లీం క్యాస్వాహా: స్కంధం పాతు సదామము॥
ఓం క్రీం భద్రకాల్యై స్వాహా మమ వక్షః సదాఽవతు ।
ఓం క్లీం కాళికాయై స్వాహా మమ నాభిం సదాఽవతు ॥
ఓం హ్రీం కాళీకాయై స్వాహా మమపృష్ఠం సదాఽవతు ।
రక్త బీజ వినాశిన్యై ప్వాహా హస్తా సదా వతు ॥
ఓం హ్రీం క్లీం ముండమాలిన్యై స్వాహా పాదౌ సదాఽవతు ।
ఓం హ్రీం చాముండాయై స్వాహా సర్వాంగం మే సదాఽవతు ॥
ప్రాచ్యాం పాతు మహాకాళీ చాగ్నేయ్యాం రక్త దంతీకా ।
దక్షిణే పాతు చాముండా నైఋత్యాం పాతు కాళికా ॥
శ్యామా చ వారుణే పాతు వాయవ్యాం పాతు చండికా ।
ఉత్తరే వికటాస్యా చాప్యైశాన్యాం సాట్టహాసినీ॥
పాతూర్థ్యం లోలజిహ్వా సా మాయాద్యా పాత్వధః సదా ।
జలే స్థలే చాంతరిక్షే పాతు విశ్వప్రసూః సదా ॥
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక!
క్లీం అను మంత్రము నా కపాలమును రక్షించుగాక! హ్రీం హ్రీం హ్రీం అను మంత్రము నా కన్నుల రక్షించుగాకl
ఓం హ్రీం త్రిలోచనే స్వాహా అనునది నా నాసికను రక్షించుగాక! క్లీం కాళికీ రక్ష రక్ష స్వాహా అనునది నా దంతముల రక్షించుగాక!
క్లీం భద్రకాళికీ స్వాహా అను మంత్రము నా అధరములను రక్షించుగాక!
ఓం హ్రీం క్రీం క్లీం కాళికాయై స్వాహా అనునది నా కంఠమును రక్షించుగాక!
ఓం హ్రీం - కాళికాయై స్వాహా అను మంత్రము నా కర్ణములను రక్షించుగాక!
ఓం శ్రీం క్రీం క్లీం కాల్యైస్వాహా అను మంత్రము నా స్కంధములను రక్షించు గాక!
ఓం క్లీం భద్రకాల్యై స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక!
ఓం క్లీం కాళీకాయై స్వాహా అను మంత్రము నా నాభిని రక్షించుగాక!
ఓం హ్రీం కాళికాయై స్వాహా అను మంత్రము నా పృష్టభాగమును రక్షించుగాక! రక్తబీజవినాశిన్యై స్వాహా అను మంత్రము నా చేతులను ఎల్లప్పుడు రక్షించుగాక!
ఓం హ్రీం క్లీం ముండమాలిన్యై స్వాహా అను మంత్రము నా పాదములను రక్షించుగాక!
ఓం హ్రీం చాముండాయైస్వాహా అను మంత్రము నా సర్వాంగముల రక్షించుగాక!
కాళికాదేవి నా తూర్పుదిక్కును, రక్త దంతిక ఆగ్నేయ దిగ్భాగమును, చాముండ దక్షిణ దిగ్భాగమును, కాళిక నా నైఋతి దిగ్భాగమును, శ్యామ నా పశ్చిమ దిశను, చండిక నా వాయవ్య దిగ్భాగమును, వికటాస్య నా ఉత్తర దిగ్భాగమును, అట్టహాసినీ నా ఈశాన్య దిగ్భాగమును, లోలజిహ్వ నా ఊర్ద్వ దిగ్భాగమును, ఆద్యయగు మాయ నా అధో భాగమును, విశ్వప్రసు నన్ను జలమున, స్థలమున, ఆకాశమున ఎల్లప్పుడు రక్షించుగాక.
ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌసు విగ్రహం ।
సర్వేషాం కవచానాం చ పారభూతం పరాత్పరం॥
సప్తద్వీపేశ్వరో రాజా సుచంద్రోఽస్య ప్రభావతః ।
కవచస్య ప్రభావేణ మాంధాతా పృథివీపతిః ॥
ప్రచేతా లోమశశ్చైవ యతః సిద్ధో బభూవ హ ।
యతో హి యోగినాం శ్రేష్ఠ సౌభరి: పిప్పలాయనః॥
యదిస్యాత్సిద్ధకవచః సర్వసిద్ధేశ్వరో భవేత్ ।
మహాదానానీ సర్వాణి తపాంస్యేవం ప్రతానిచ ॥
నిశ్చితం కవచస్యాస్య కలాం నార్హంతి షోడశీం ॥
ఓ నారదా! ఈవిధముగా నీకు సమస్త మంత్రముల యొక్క సారభూతమైనది, సమస్త కవచముల యొక్క సారభూతమైన భద్రకాళీ కవచమును తెల్పితిని.
ఈ కవచము యొక్క ప్రభావము వలన సుచంద్రుడు అఖండమైన భూమండలమునకు అధిపతి కాగలెను. అట్లే మాంధాత చక్రవర్తి కాగలిగేను. ప్రచేతసుడు. లోమశుడు ఈ కవచము యొక్క ప్రభావము వలననే సిద్ధులు కాగల్గిరి. పిప్పలాయనుడగు సౌభరి యోగులలో శ్రేష్ఠుడయ్యెను.
ఈ కవచము సిద్ధించినచో అతడు సమస్త సిద్ద గణమున శ్రేష్ఠుడగును. మహాదానములు, సమస్త తపస్సులు, సమస్త వ్రతములు ఈ కవచమునకు పదునారవ ఆంశమైన కాజాలవు.
ఇదం కవచ మజ్ఞాత్వా భజేత్కాం జగత్ర్పసూం ।
శతలక్షం ప్రజస్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః ॥
ఈకవచమును వదిలి పెట్టి జగన్మాతయగు భద్రకాళీ మంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్దింపదు అని పలికెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే భద్రకాళీ కవచ నిరూపణం నామ సప్తత్రింశత్తమోఽధ్యాయః॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన భద్రకాళీ కవచమను ముప్పయి యేడవ యధ్యాయము సమాప్తము.
Summary of chapter 37 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
As the cosmic atmosphere threatened to dissolve under the heat of Goddess Pārvatī's anger, the Supreme Lord Śrī Kṛshṇa personally descended from Goloka, appearing in the center of Kailāsa as a radiant child holding a flute. The mere sight of Lord Śrī Kṛshṇa cooled the blazing heat of Pārvatī's wrath, bringing supreme peace to the minds of all present. Approaching the Divine Mother with gentle sweetness, Lord Śrī Kṛshṇa picked up the infant Gaṇeśa, wiped his blood, and solaced Pārvatī with profound words of spiritual wisdom, explaining that the breaking of the tusk was an auspicious event ordained to establish Gaṇeśa's transcendent glory as Ekadanta throughout eternity.